స్టోరీస్
ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
🍁ప్రకృతి సత్యం🍁
ఎవరినీ మీ నోటితో కానీ మనస్సుతో కానీ నాశనం అవ్వమని, పాడవ్వమని కాని తిట్టకండి.
బుద్ది బాగుపడాలి బావుండాలి అని కోరుకోండి.
ఒకడు బాగుపడితే వాడి వలన పదిమందికి ఉపయోగం కలుగుతుంది.
అంతేకాకుండా ఒకరి మేలు కోరుకున్న మీకు మంచే జరుగుతుంది.
ఎందుకంటే
ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగడం ఈ సృష్టి రహస్యం.
ఏది మనం ఇస్తామో దానికి పదింతలు లభిస్తుంది.
చెట్టుకి నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది.
సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు అలాగే ఇది కూడా ..
కనుక ఈరోజు నుండి కయ్యానికి కాలు దువ్వకుండా బుద్ధిమారి మంచివారిగా మారాలని కోరుకోండి.
అందుకే కదా
భార్యని అపహరించిన రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు. అది వినని రావణుడు మృతుడయ్యాడు.
యుధిష్ఠిరుడు కూడా మహామహా పాపాత్ములని క్షమించాడు. చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను అయిదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా
కాలుదువ్వాడు. చివరికి చచ్చాడు.
మేలు కోరుకోవడం మనవంతు.వినకపోతే అనుభవించడంవాళ్ళ
వంతు. 🍃🌸🙏
🍃🌸🏵🌼🍃🌸

ప్రాంజలి ప్రభ - తండ్రి కొడుకులు
సర్వేజనా సుఖినోభవంతు
తండ్రీకొడుకులు
(పమ్పినవారు జాజి శర్మ గారు )
తల్లిదండ్రుల సేవలో తరించిన ఉత్తములైన కుమారులు భారతీయ సాహిత్యంలో చాలామంది కనిపిస్తారు. వృద్ధులైన జననీ జనకులను కావడిలో కూర్చోబెట్టి, స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన శ్రవణ కుమారుడి కథను రామాయణం వివరించింది. తండ్రి ఆనతి మేరకు రాజ్యాధికారాన్ని వదులుకుని, రాముడు అడవుల బాట పట్టిన విషయమూ వర్ణించి చెప్పింది. తల్లి దాస్య విముక్తికోసం బ్రహ్మప్రయత్నం చేసి, దేవతలను ఓడించి, అమృతాన్ని సాధించిన గరుత్మంతుడి కథను భాగవతం ప్రకటించింది. యయాతికి తన యౌవనాన్ని సమర్పించిన కొడుకు పూరుడి కథనూ చెప్పింది. 'తల్లిదండ్రుల సేవ మినహా నాకు తెలిసినదేదీ లేదు' అని వినయంగా పలికిన ధర్మవ్యాధుడి కథను భారతం పరిచయం చేసింది. తండ్రి నిమిత్తమై భీషణమైన ప్రతిజ్ఞ చేసి, అపూర్వ త్యాగానికి పాల్పడిన భీష్ముడి కథా చిత్రించింది. తల్లి దైన్యస్థితికి తల్లడిల్లి సమస్త రాజవంశ నాశనానికి పూనుకున్న పరశురాముడు, తల్లి కోరిందని ఆత్మలింగం సాధించడానికై పడరాని పాట్లు పడిన రావణాసురుడు, క్షణమాత్రం ఏమరుపాటు లేకుండా తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న ప్రవరాఖ్యుడు, సన్యాసదీక్షలో ఉన్నా తల్లికి ఇచ్చిన మాటకోసం స్వయంగా అమ్మ ఆర్యాంబకు అంత్యక్రియలు నిర్వహించిన ఆదిశంకరులు- ఇలా జన్మనిచ్చిన వారికోసం పరితపించిన కుమారుల గాథలు మన సాహిత్యంలో కొల్లలుగా కనిపిస్తాయి. చరిత్రలోనూ ఆ తరహా ఆదర్శమూర్తుల ఉదంతాలకు కొదవలేదు. పున్నామ నరకం నుంచి తమను పుత్రులే రక్షిస్తారని మన పెద్దల విశ్వాసం. కొడుకులు లేకుంటే ఉత్తమ గతులే ఉండబోవని ఒక నమ్మకం. దానాదీనా మగవాడికి పుట్టుకతోనే సమాజం ఒకానొక ప్రాధాన్యం కల్పించింది. ఆ మేరకు బాధ్యతగా ప్రవర్తించినవారిని పనిగట్టుకుని ఆదర్శమూర్తులుగా ప్రచారం చేసింది. సత్పురుషులుగా ప్రశంసించింది.
అంతమాత్రాన చెడ్డ కొడుకులు లేకుండా పోలేదు. వారి గురించీ సాహిత్యం వివరించింది. కాశీఖండంలో శ్రీనాథుడు చిత్రించిన గుణనిధి కథ లోకప్రసిద్ధమైనది. వాడివల్ల వంశప్రతిష్ఠ నాశనమైంది. తల్లీ తండ్రీ క్షోభపడ్డారు. తెనాలి రామకృష్ణుడు పరిచయం చేసిన నిగమశర్మా సర్వభ్రష్టుడే! 'ఉఫ్ మని అగ్నిహోత్రాన్ని ఊదడం అలవడలేదుగాని, నిగమశర్మ నిరంతరం విరహాగ్ని తాపంతో నిట్టూర్పులు విడుస్తూనే ఉండేవాడు' అని తన సహజశైలిలో రామకృష్ణుడు చమత్కరించాడు. చరిత్రలోకి వెళితే- కన్నవారికి అన్నంపెట్టని కసాయి పుత్రులూ, కారాగారం పాలుచేసి కక్ష సాధించిన ప్రబుద్ధులూ మనకు ఎందరో కనపడతారు. నరాలమీద వ్రణాలుగా తోస్తారు. నవనందులను నవనాడుల్లోని క్రిములుగా పోలుస్తూ ముద్రారాక్షసంలో పేర్కొన్నది ఇలాంటివారి గురించే! దుర్మార్గులుగా పుట్టినవారికన్నా పెంపకంలో చేటువల్ల చెడిపోయినవారే సమాజంలో అధికం. గుణనిధి చెడిపోవడానికి అతని తల్లే కారణం. అతి గారాబం చేసి వాణ్ని చెడగొట్టింది. యజ్ఞదత్తుడికి అనుమానం వచ్చి 'స్నానం సంధ్యా ఏమైనా ఉన్నాయా' అని నిలదీసేవాడు. వెంటనే తల్లి అడ్డంపడి 'స్నానమాడెను... వార్చెను సంధ్య... అగ్నిహోత్ర మొనరించెను' అంటూ కొడుకును వెనకేసుకొస్తూ పచ్చి అబద్ధాలు ఆడేది. తల్లులే కాదు, కొందరు తండ్రులదీ అదే వరస. దారితప్పి గాలితిరుగుళ్ళు మరిగిన కొడుకులను పుత్రప్రేమకొద్దీ దండించి దారిలో పెట్టకుండా వదిలేసేవారు. ఇలాంటివారి స్వభావాన్ని చెబుతూ ధర్మజుడు నారదుడితో '...పుత్రుల్ నేర్చిన నేర్వకున్న జనకుల్ పోషింతురెల్లప్పుడున్' అన్నాడు.
ధర్మరాజు ఏ ఉద్దేశంతో చెప్పినా, ఇవాళ జరుగుతున్నది మాత్రం అచ్చంగా ఇదే! ఎలాంటి తప్పులు చేసినా పుత్రరత్నాలను గుడ్డిగా సమర్థించడం జనానికి అలవాటయింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న పెద్దలు విపరీతంగా సంపాదించి పోగులు పెడితే- సంతానం విచ్చలవిడిగా జీవించడం ఇటీవలి ఒక విషాద పరిణామం. తల్లిదండ్రుల నియంత్రణలోంచి జారిపోయిన సంతానం సంఘవ్యతిరేక శక్తులుగా తయారయ్యే ప్రమాదం చాలా ఉంది. ఇటీవల అమ్మాయిలపై యాసిడ్ దాడికి తెగించిన కొడుకు విషయంలో అతని తల్లి- 'సమాజానికి చీడపురుగులా తయారైన వీణ్ని ఉరితీయించండి' అని కోరింది. పరిస్థితి ఎంతవరకూ వచ్చిందో గ్రహించడానికి ఈ సంఘటన ఒక బలమైన ఉదాహరణ. మండువేసవిలో సూర్యుడి తీక్షణ తాపాన్ని గొడుగు లేకున్నా మనం సహించగలం. మరి అదే సూర్యుడి నుంచి తాపాన్ని గ్రహించి మిటమిటలాడిపోయే ఇసుకమీద చెప్పులు లేకుండా నడవలేం. అలాగే ప్రభువులు, అధికారుల పేరు చెప్పి రెచ్చిపోయే అనుచరగణాన్ని, బంధువర్గాన్ని తట్టుకోవడం చాలా కష్టం. సమాజం మారుతోంది. ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హింసాప్రవృత్తి, అవినీతి మితిమీరుతున్నాయి. సంతానం విషయంలో తల్లిదండ్రులు మరింత జాగరూకత వహించవలసిన సమయమిది. వేసవి సమీపిస్తోంది. వాతావరణం వేడెక్కుతోంది. ఈసారి వేసవి తాపం మరీ తీవ్రంగా ఉంటుందంటున్నారు శాస్త్రజ్ఞులు. దానికితోడు ఎన్నికల రుతువూ మొదలవుతోంది. వేసవికీ, ఎన్నికలకీ ఈసారి ప్రత్యేక అవినాభావ సంబంధం గోచరిస్తోంది. 'సన్‌స్ట్రోక్' ప్రభావం రెండింటా ప్రబలంగా ఉండేట్టుంది. సూర్యుడి కొడుకు శనీశ్వరుడు. శనిపీడ సంగతి అందరికీ తెలిసిందే. ఒకానొక సందర్భంలో సాక్షాత్తు సూర్యుడికే పుత్రపీడ తప్పలేదని పురాణాలు చెబుతున్నాయి. ఆ రకంగానూ 'సన్‌స్ట్రోక్'కు మన రాజకీయాలలో ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రజలూ బహుపరాక్ !
గౌతమీ పుత్ర శాతకర్ణి - శేషాద్రి రమణ కవుల "ఆంద్ర వీరులు" నుండి యథాతథం.
ఆంధ్రదేశము నందలి పురాతననగరములలో ధాన్యకటకము తొలుత యెన్నదగినది. బెజవాడకు మూడామడల దూరమున బశ్చిమదిశను గృష్ణాతీరమున అమరావతి చెంత నీజీర్ణనగరము గలదు. దీనినే మనమిపుడు ధరణికోట యని వ్యవహరించుచున్నారము. మిగుల నున్నతములగు మంటిదిబ్బలతో మనోహరములగు బౌద్ధస్థూపములతో నొప్పి పూర్వశోభల గోలుపోయిన యీప్రదేశము నొకమారు సందర్శించి మన పూర్వచరిత్రము స్మరింతుమేని ఆంధ్రరాజుల రాజధాని నగరమునకా యీదుర్దశ యని పరితాపము కలుగకమానదు.
ధరణికోట రాజధానిగ జేసికొని పాలించిన శాతవాహన వంశజులగు నాంధ్రరాజులలో గౌతమీపుత్ర శాతకర్ణి ప్రథమగణ్యుడు. విజ్ఞానమునందును బరాక్రమమందును బరిపాలనాచాకచక్యమునందును నీత డసమానుడు. ఇతడు పలుమాఱు విజయయాత్రల కేగి యవనులను, శకులను, పహ్లవులను లోబఱచికొని ధాన్యకటక సింహాసనాశీనుడైన వెంటనే తన పెద్దకుమారుడగు వులమాయిని యువరాజపట్టాభిషిక్తుని గావించి ప్రతిష్ఠానపురమునం దాతని నుంచి తనపూర్వులు కోలుపోయిన రాజ్యములన్నింటిని గడించెను. ఈనృపాలుని వంశమును శాతవాహనవంశ మని యందురు. శాతవాహన నామము ఎటుల వచ్చినదో తెలుపు చిత్రకథయొకటి వాడుక లోనున్నది. ఆకథయందలి సత్యాసత్యముల జర్చింపక హృదయరంజకమగు నాకథ నిట వ్రాసెదము.
పరాక్రమశాలియు ధర్మమూర్తియు నగు దీపకర్ణిమహారాజు దక్షిణాపథమును బాలించుచుండెను. ఆతనికి రూపవతియు విద్యావతియునగు శక్తిమతియను భార్య కలదు. ఇరువురును మిగుల సౌఖ్యముగ గలసిమెలసియుండ వారి దాంపత్యము గాంచి దైవము కన్ను కుట్టెనేమోయన శక్తిమతి సర్పదష్టురాలై మరణించెను. దీపకర్ణి అనుకూలపత్నీ వియోగమునకు మిగుల దు:ఖించి యుత్తరక్రియు లన్నియు నిర్వహించి తనజీవితమునంతయు బ్రహ్మచర్యావస్థలోనే గడపుచుండెను. నాయనంతర మీమహారాజ్య మెవరిపాలుగానున్నదో, సంతానము లేదుగదా యను చింత దీపకర్ణిహృదయమును దహించు చుండెను. ఒకనాటి వేకువజామున సుఖనిద్రలోనుండ దీపకర్ణి కొక స్వప్నమువచ్చెను. కలలో నీశ్వరుడు కనిపించి నీవరణ్యములకు ఱేపు వేటకుబొమ్ము. నీకు సింహరాజముపై స్వారిచేయు నొకబాలుడు గనిపించును. వానిని గొనితెచ్చి పెంచి యీరాజ్యమును వానికి నిమ్మని చెప్పి యదృశ్యమయ్యెను.
తెల్లవారుగనే దీపకర్ణి పరిజనమును వెంటగొని వేటలాడుట కొక యరణ్యమునకుబోయి విహరించుచుండ మార్గమున బరుగెత్తుచున్న యొకసింహరాజము కనబడెను. దానిపై నమితతేజోరాశియు, సుందరాకారుడు నగు నొకబాలుడుబౌద్ధస్తూపముపై కూర్చుండియుండెను. దీపకర్ణి స్వప్నమున గాంచినదెల్ల ప్రత్యక్షమగుటచే మిగుల సంతసించి పదునైన బాణమును వెంట సంధించి పరుగెత్తు సింగముపై బ్రయోగించెను. సింగము వెంటనే మరణించెను. సింహ దేహము నుండి యక్షుడొకడు బయలు వెడలి నమస్కరించి దీపకర్ణి నృపాలా! నేను సాతుడను వాడను. యక్షుడను. కుబేరుని సఖుడను. నే నొకముని కన్యను వలచి మునియనుజ్ఞ గొనకమున్ను గాంధర్వవిధి బెండ్లాడితిని. నాసాహసమునకు గోపించి మమ్మిరువుర సింగముల గండని ముని శపించెను. నాభార్య గర్భవతియై యీ బాలుని గని యకాలమరణ మొందెను. తల్లిలేని బిడ్డనెటులో పెంచుచుంటిని. నాశాపము తొలంగినది. నే నేగుచున్నాడను. ఈబాలుని పోషించు భారమంతయు నీదెయని సాతు డదృశ్యమయ్యెను. సాతుడే వాహనముగనున్న యా బాలకునకు సాతవాహనుడను నామమొసంగి దీపకర్ణి యాబాలుని మక్కువతో బెంచి పెద్దవాని గావించి శుభదినమున దన రాజ్యము నాబాలకున కొసంగి పట్టాభిషేకము గావించెను. సాతవాహనునే ప్రాకృత గ్రంథములందు శాలివాహనుడని వ్యవహరించిరి. ఈతని వంశమె శాతవాహనవంశమని వ్యవహరించుచుండిరి.
శాతకర్ణుడు బౌద్ధుడు. అతనికాలమున జైనబౌద్ధ శైవమతములు పరస్పర భిన్నాభిప్రాయములతో ద్వేషము పెంచుకొనుచున్నను దానందు బాల్గొనక సర్వమత సామరస్యమునకె పాటుపడెను. బౌద్ధభిక్షువులకేకాక యితరమతముల వారికి గూడ నీరాజు మిగుల సహాయము చేసెను. ఆ కాలమున బేరుగల రాజ్యము లన్నియు శాతకర్ణునకు బన్నుగట్టుచుండెను. శాతకర్ణుడు బౌద్ధమతావలంబియైనను విరోధిసంహారమున దయాదాక్షిణ్యములు వదిలి యెన్నియో కుటుంబములను రూపుమాపెను. తనకు దిరుగబడి సామంతులుగా నుండనీయ కొననందులకు గోపించి విరోధుల వంశములను నిర్మూలము గావించెను. యవన శక పహ్లావవంశములు పెక్కు రూపుమాపెను. సౌరాష్ట్రదేశముమీదికి దండెత్తి యాభాగమును బాలించు రాజవంశమును కూకటివ్రేళ్లతో బెరికి కూలార్చెను. పలువురు రాజులు శాతికర్ణికి లోబడి తమపూర్వమతములు వదలి బౌద్ధులుగా మాఱిపోయిరి. ఇతని పుత్రుడగు పులమాయి (పౌలోమి) గూడ విజయ యాత్రల యందు దండ్రికిదోడ్పడి విజయములు సమకూర్చి సామ్రాజ్యమును మిగుల విస్తరము గావించెను.
శాతకర్ణుని రాజ్యమును హరింపదలంచి యవనులు, శకనులు, పహ్లవులు పలుమారు దండెత్తివచ్చి పరాభవము నొంది పోవుటయేకాని జయము నొకమాఱేని గాంచి యెఱుంగరు. ఆకాలమున సుప్రసిద్ధులుగానున్న చేరదేశపాలకుడగు చెంకుడువాను భూపతియు సింహళమును బాలించు గజబాహునృపుడును మాళవదేశమును బరిపాలించు చస్తనుడును శాతకర్ణి కనుసన్నల మెలగుచు స్నేహము వాంఛించుచుండిరి. పశ్చిమాంధ్రదేశము పులమాయి యధికారము క్రిందను పూర్వాంధ్రదేశము ధరణికోట రాజధానిగా శాతకర్ణి పరిపాలనము క్రిందను నుండెను. శాసనములవలన గౌతమీపుత్రశాతకర్ణి ఆస్మిక, ఆసిక, మూలక, సురాష్ట్ర, కుకుర, అపరాంతక, అనూప, విదర్భ, అకరావంతి లోనగు దేశముల కధిపతియనియు వింధ్యావతము, పారియాత్రము, సహ్యము, కృష్ణగిరి, మలయము, మహేంద్రము, శ్రేష్ఠగిరి, చకోరము, మొదలగు పర్వతముల కధినాధుడుగా నుండెననియు దెలియుచున్నది. మగధదేశమునకు గూడ ధరణికోట యాకాలమున రాజధానిగానుండెను. ఉత్తరదిశను గంగానదిమొదలుకొని దక్షిణమున గాంచీపురివఱకు గల దేశమంతయు నాంధ్ర రాజుల పరిపాలనమున నున్నటుల నిశ్చయింప నవకాశములు గలవు.
శాతకర్ణి యాంధ్రుడైనను అతని కాలమున వ్యాప్తిలో నున్న ఆంధ్రభాషాస్వరూప మెట్టిదో నిశ్చయింప నాధారములు లభించుటలేదు. రాజకీయవ్యవహారములయందును శాసనములయందును సంస్కృతభాష మిగుల స్వల్పముగను విశేషముగ బ్రాకృతయు నుపయోగింపబడెను. శాతకర్ణి ప్రాకృతవాజ్మయమును మిగుల నభివృద్ధిలోనికి దెచ్చెను. ప్రాకృతభాషలో బెక్కు లుత్తమగ్రంథము లీనృపాలునికాలమునందే బయలు వెడలెను. విదేశవ్యాపారమునుగూడ నీతడు మిగుల నభివృద్ధిలోనికి దెచ్చి ద్వీపాంతరముల కిచటివస్తువులు పోవునట్లును ఇతరద్వీపవస్తువు లచటికి వచ్చునట్లును జేసెను. స్వయముగా బండితు డగుటచే శాతకర్ణి వర్ణాశ్రమధర్మముల గుర్తించి వర్ణములను సంకరముగాకుండ గట్టుదిట్టములను మిక్కిలి దిట్టముగాజేసెను. దండయాత్రలలో నీ దేశమునకు వచ్చి యిచటనే ప్రాతకాపులుగానున్న విదేశీయుల నాదరించి వారి కెట్టిపన్ను లవసరము లేకుండజేసి శాతకర్ణి వారి కెన్నియో సౌకర్యములు కలుగజేసెను. పూర్వరాజులు తమపేరుముందు మాతృనామ ముంచుకొని వ్యవహరించినటుల గానరాదు. శాతకర్ణి తన మాతృదేవియగు గౌతమీనామమును తన పేరుతో గలిపికొని గౌతమీపుత్ర శాతకర్ణియనియె వ్యవహరించెను. దీనిచే నీతనికి గల యపారమగు మాతృభక్తి వెల్లడి యగుచున్నది.
గౌతమీపుత్రుడు క్రీ.శ. 133 మొదలు 154 వఱకు రాజ్యమును బాలించియుండునని యింతవఱకు లభించిన శాసనా ద్యాధారములవలన దెలియుచున్నది. ఇతని ధర్మపత్ని వాసిష్ఠి. ఈరాజన్యుని జీవితమునందలి యపూర్వాంశము లెన్నియో కాలగర్భమున మరుగుపడియున్నవి. శాతకర్ణి యపూర్వ చరిత్ర మంతయు గీర్యంకములుగ బరిగణింపబడు శిలాశాసనములం దింకను అజ్ఞాతావస్థయందె యున్నదని యొప్పుకొనక తప్పదు. మహావిస్తృతమైన ఆంధ్రసాంరాజ్యమునకు నెలవైన ధాన్యకటకము నేడు పూర్వవైభవములన్నియు గోలుపోయి చిఱుపల్లెగా మాఱిపోయినది. ఆంధ్ర రాజుల వేడిరక్తముచే బూతమైన పుణ్యప్రదేశములలో రక్కెసకంపలు నిండిపోయినవి. ఆంధ్రరాజుల మహోన్నత దశనుగాంచి యానందించి విజయగీతములు పాడిన కృష్ణాస్రవంతి యిపుడు విపరీతకాల పరిణామమునకు బలవించుచు విషాదగీతికల బాడుచున్నది. ఆంధ్రుల దురదృష్టమువలె బెచ్చు పెరుగు పాటిదిబ్బలలో జారిత్రకరత్నము లెన్ని మరుగు పడియున్నవో సమగ్రమగు పూర్వచరిత్ర మాతృలోకమున కెన్నటికి జ్ఞాపకమునకు వచ్చునో యెవరు చెప్పగలరు?

-(())-
మనిషి ప్రయాణం బయటకు కాదు, లోపలికి జరగాలి. యాత్ర అనేది బయట కాదు. అంతరంగిక యాత్రను మనిషి చెయ్యాలి. ప్రపంచమంతా మనిషి తిరిగినా.. చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు.
అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న చోట నుంచే కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు. పాత కాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు.
ఒకచోట స్థిరంగా కూర్చుని తపస్సు చేశారు. జ్ఞానసిద్ధిని పొందారు.
బ్రహ్మాండం లో ఉన్న బ్రహ్మం ఒక్కటే పిండాడం లో ఉన్న బ్రహ్మం ఒక్కటే అందుకే అన్నారు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే.
--(())--
శుభోదయం
గమ్యం ఒక్కటే. మార్గాలు మాత్రం వేరు. మనిషి దృష్టి సరిగ్గా ఉన్నట్లయితే, ఏ మార్గంలో వెళ్లినా గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. మీరు ఎడ్లబండి ఎక్కి వెళ్లారనుకోండి, కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. అదే రైలు ఎక్కి వెళ్లారంటే కొంచెం తొందరగా చేరుకోగలుగుతారు. కొన్ని లాభాలు రైలు ప్రయాణంలో ఉంటే, కొన్ని లాభాలు ఎడ్లబండి లో ఉంటాయి. అలాగే కొంత హాని రెండింటిలోనూ ఉంటుంది. ఎడ్లబండిలో వెడితే వేగము ఉండదు, కానీ చాలా అనుభవాలు పొందుతాము. వేగము తక్కువగా ఉంటుంది కానీ కొండలు, పర్వతాలు, నదీనదాలు అన్నీ మీరు చూస్తారు. జీవిస్తూ వస్తారు. రైలులో అయితే తొందరగా చేరుకుంటారు. కానీ ఆ రైలు వేగంలో, కొండలు, నదులూ అన్నీ ఇలా వచ్చి, అలా వెళ్లిపోతాయి. అదే ఇంకా విమానం లో అయితే రైలులో వెడుతుంటే కనబడినంతగా కూడా ఆ కొండలు, నదులు కనబడవు. మార్గంలో కూడా ఆనందం ఉంటుంది, గమ్యం చేరుకున్నాక మాత్రమే కాదు.
ఓ అర్జునా! పురుష శ్రేష్ఠ! వాటి (సన్న్యాసం, త్యాగం) లో మొదట త్యాగం గురించి నా అభిప్రాయం విను. త్యాగం కూడా మూడు విధాలుగా చెప్పబడింది.
యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలు వదలి పెట్టకూడదు. అవి చేయదగ్గవి. అవి మనుషుల్లో చిత్తశుద్ధిని కలిగిస్తాయి.
ఓ అర్జు
నా! ఆ యజ్ఞ, దాన, తపోకర్మలని కూడా ఫలాసక్తి విడిచిపెట్టి చేయడం అనేది శ్రేష్టం అని నా నిశ్చితాభిప్రాయము.
--(())--
నవ గోప్యాలు
ఆయువు, విత్తము, ఇంటిగుట్టు, మంత్రం, ఔషధం, సంగమం, దానం, మానము, అవమానం అనే ఈ తొమ్మిదింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి.
👉భగవంతుడు అన్ని జంతువులకు ఇచ్చినట్లు శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. ఈమూడు కారణాలవల్ల మనిషి పిచ్చెక్కకుండా సుఖంగా ఉండగలుగుతున్నాడు. మరుక్షణంలో మనిషి ఛస్తాడని తెలిస్తే ముందు క్షణమే ఆలోచనతో చావడం ఖాయం. నిజంగా నీ ఆయుఃప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై వాడిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్తక్రారుడు.
👉ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం. అయినా మన దగ్గర ఉన్నవిషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగుతుంది.
👉ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దానే్న ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమ పూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని. సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.
👉‘‘మననం చేసేది మంత్రం’’- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.
👉పరపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలు ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరచి ఎవ్వరంటేవారు తయారుచేయకూడదు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.
👉సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.
👉దనం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు.
👉దనం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.
👉మనం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది.
👉అలాగే తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవమానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగుతుంది. దాంతో పగ.. అలా అంతే ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మన చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం.
ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధ....
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
--(())--
[🌹. అహంకరించ వద్దు. ఎన్ని ఉన్నా ఎప్పుడు ఎవరికీ ఏది అవసరం అవుతుందో తెలియదు ఈ లోకంలో. 🌹
ఒక రోజు జ్ఞాని దగ్గరకు కోటీశ్వరుడు వెళ్లి స్వామి నా దగ్గర కోటానుకోట్ల డబ్బు ఉన్నది. పూర్తి ఆరోగ్యవంతుడిని ఇక నేను ఎవరిపైన ఆధారపడవల్సిన అవసరం లేదు. ఎవరినీ సహాయం చేయమని అర్థించాల్సిన అవసరము లేదు అని చాల గొప్పగా చెప్పుకున్నాడు.
ఆ మాటలు విన్నాక జ్ఞాని నవ్వుతూ బాబు నాతో కాస్త దూరం నడవగలవా అని అడిగాడు. అయన ఆలా అడగడంతో నిరాకరించడం బాగుండదని తలచిన ఆ వ్యక్తి జ్ఞానితో కలిసి అడుగులు వేసాడు.
అలా నడుస్తూ నడుస్తూ అలసిపోయిన వ్యక్తి ఏదైనా చెట్టు కనిపిస్తుందా ఆ నీడలో కాసేపు సేద తీరాలని చుట్టూ చూసాడు. ఎక్కడాఏ చెట్టు కనిపించలేదు. ఇది గమనించిన జ్ఞాని ఏంటి బాబు వెతుకుతున్నావు అని అడిగాడు. అయ్యా చాల దూరం వచ్చాము కాసేపు చెట్టు నీడలోకి వెళదాం అని చెప్పాడు.
చెట్టు నీడ నీకెందుకు బాబు నీ నీడ లో నువ్వు సేద తీర్చుకో అన్నాడు. నా నీడలో నేను ఎలా అయ్యా అని ఆశ్చర్యంగా అడిగాడు.
నువ్వే కదా బాబు నాదగ్గర అన్ని ఉన్నాయి ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు అన్నావు, చూసావా ఇప్పుడు నీ నీడ సైతం నీకు ఉపయోగపడలేదు అని చెప్పారు.
ఇప్పుడు ఆయనకు నిజంగా జ్ఞానోదయం అయింది ఏ చెట్టు కిందకు వెళ్లకుండానే.
మనపైన మనకు నమ్మకం ఉండాలి అహం ఉండకూడదు. మనపైన మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి ఇతరులపైనా చులకన భావం రాకూడదు.
🌹 🌹 🌹 🌹 🌹#భక్తి లోకం #తెలుసుకుందాం .
--(())--
ఆస్తికత్వం అంటే దేవుడున్నాడని విశ్వసిం
చటం మాత్రమే కాదు. దైవీ భావాలను అనుసరించటం. ఎలా వుంటే భగవంతుడు ఇష్టపడతాడో అలాంటి జీవన విధానాన్ని పెంపొందించుకోవడం.
భగవత్ సాయుజ్యాన్ని పొందే ప్రయత్నం చేయడం. భగవత్ సాయుజ్యాన్ని పొందటం అంటే-
కష్టం వచ్చినా.. సుఖం వచ్చినా.. ఈ రెంటికీ దేవుణ్ణి బాధ్యుణ్ణి చేయకపోవడం.,
కర్మానుసారంగా జరగే సంతోషంగా అనుభవించడం.,
పాపభీతి'తో కాకుండా పాపాలపై విరక్తి కలిగివుండటం., చేస్తున్న దైవకార్యాలన్నీ కామ్య౦ కోసం గాక దైవప్రీతి కోసం చేయడం.
==))((--
🚩🕉🚩. ఏ మతం గొప్ప.🚩🕉🚩
పైన భగవద్గీత, బైబిల్ , ఖురాన్ మూడు మత గ్రంధాలలోని మూడు మంచి విషయాలు చెప్పబడి ఉన్నాయి. పై మూడు విషయాలు భగవద్గీత చెబుతుంది బైబిలు చెబుతుంది ఖురాను చెబుతుంది.
ఏ మత గ్రంథమైన మనిషి జీవన విధానం ఉన్నతంగా సాగటానికి చెబుతుంది పై మూడు విషయాలు భగవద్గీతలో చెప్పబడే వున్నాయి. బైబిలు లోనూ ఖురాన్ లోను ఆ మూడు విషయాలు చెప్పబడి ఉంటాయి.
భగవద్గీత చెప్పింది- న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ధనార్జన చేసి పదవ వంతు దానధర్మాలకు వినియోగించ మని. అక్షరాలా అదే మాట బైబిలు చెప్పింది. ఖురాన్ కూడా చెప్పింది. ఆ మాటలు బైబిలు చెప్పింది కాబట్టి అది తప్పు అనగలమా. అది తప్పు అంటే భగవద్గీత చెప్పింది కూడా తప్పే అవుతుంది కదా. అన్ని మత గ్రంధాలు మహోన్నతమైన వే.
భగవద్గీత చెప్పిన శ్రీ కృష్ణుడు అయినా, బైబులు చెప్పిన ఏసు అయినా, కురాన్ చెప్పిన మహమ్మద్ అయినా వారంతా ఆ ఆదిదేవుని, ఆ సృష్టికర్త ప్రతినిధులే. దేవుని ప్రతినిధులు తప్పుగా చెప్పారు. వారు చెప్పిన వన్నీ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడానికి అత్యుత్తమమైన, మహోన్నతమైన మార్గదర్శి కాలే.
అన్య మతస్తులను మన మతం లోకి చేర్చు అని బైబిలు చెప్పలేదు. అన్ని మతముల కంటే మన మతమే గొప్పది వేరే మతం అనేది ఉండకూడదు అని ఇస్లాం మతం చెప్పలేదు. దుష్ప్రచారం చేసిన, మతమార్పిడులు చేసిన.... మత రాజ్యం పెంచేందుకు మరణ హోమం తో దాడులు చేసినా, కరడు కట్టిన మత ఛాందసులు చేసినవే కానీ... ఆ దేవదేవుని ప్రతినిధులు చేసినవి కావు... ఆ మత గ్రంథాలు చేయించిన వీ కావు.
దుష్ప్రచారం చేసేవారిని మతమార్పిడులు చేసేవారిని, తమ మత సామ్రాజ్యం పెంచేందుకు ఉగ్ర దాడులు చేసే వారిని ద్వేష భావం తో చూడాలే కానీ మత గ్రంథాలని కాదు, అవి చెప్పడానికి వచ్చేనా దేవాది దేవుని ప్రతినిధులను కాదు.... అనంతమైన ఈ భౌగోళిక వ్యవస్థలో వేరు వేరు ఖండాలలో, వేరు వేరు ఆచార, వ్యవహార, మనస్థత్వాలతో వున్న జీవులకు వేరువేరుగా తన ప్రతినిధులను పంపించాడు ఆ దేవాది దేవుడు. ఏదో ఒక ఖండం కో, ఒక ప్రాంతానికో ఒక్క ప్రతినిధి ని ఎలా పంపిస్తాడు ఆ దేవాది దేవుడు? ఈ విశ్వంలో ఉన్న అన్ని జీవుల యందు దయతో ఉంటాడు కదా.
పైన చెప్పినట్లుగా "ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ధనార్జన చేసి పదవ వంతు (లేదా అయిదవవంతు) దాన ధర్మములకు వినియోగించ వలెను" ఈ మాట అన్ని మత గ్రంథాలలో ఎందుకు ఉంది? దేవాది దేవుడు తన ప్రతినిధులకు చెప్పి పంపడం వల్లనే కదా! అన్ని మత గ్రంధాలు అంతే కదా! ఒక మతం ఎక్కువ, తక్కువ, ఒక గ్రంథం ఎక్కువ, తక్కువ అనేది ఎక్కడ ఉంది.
భిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు విభిన్న ఆచార వ్యవహారాలు ఉన్నా అన్నీ తనలో కలుపుకుని భిన్నత్వంలో ఏకత్వంతో అవన్నీ తనలో కలుపుకుని మహోన్నతంగా నిలిచి ఉన్నదే మన భారతదేశం !!!
🚩🕉🚩 అని అనుకుంటున్నాను-Rk🚩🕉🚩
--(())--
7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన "గురువు."
1వ ప్రశ్న: ప్రపంచంలో ఏది పదునైనది?
జ: చాలా మంది కత్తి అని చెప్పారు.
గురువు: కాదు,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.
2వ ప్రశ్న: మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ?
జ: చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ
గురువు: మనకు అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం.
ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము,
ఆ కాలంలోకి వెళ్లలేము.అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము.
3వ ప్రశ్న: ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది?
జ: చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి ఇలా ఎన్నో అంటారు.
గురువు: ప్రపంచంలో పెద్దది మన పాపమే.
4వ ప్రశ్న: ప్రపంచంలో కఠినంగా,బరువుగా ఉండేది ఏది ?
జ: చాలామంది,వజ్రము ఇనుము,ఏనుగు అని చెప్పారు.
గురువు: కఠినమైనది అనేది "మాట ఇవ్వడం"
మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం.
5వ ప్రశ్న: ప్రపంచంలో తేలికైనది ఏది?
జ: దూది,గాలి,ఆకులు అని చెప్పారు
గురువు: ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం.
6వ ప్రశ్న: మనకు దగ్గరగా వున్నది ఏది?
జ: తల్లి తండ్రులు, స్నేహితులు,బంధువులు అని చెప్పారు.
గురువు: మనకు దగ్గరగా ఉండేది మన చావు.
అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం.
అది పుట్టుకతోనే మనవెంట వచ్చింది.
7వ ప్రశ్న: ప్రపంచంలో సులువైనది ఏది ?
జ:తినడం ,పడుకోవడం, తాగడం,తిరగడం
గురువు: ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం, ఇంతకంటే సులువు ఏదీ లేదు.
👏👏👌🙏🙏🙏🌷
Comments
Post a Comment