భగవద్గీత .. 4వ అధ్యాయము .. కర్మయోగము (తేటగీతి మాల)
భగవద్గీత .. 4వ అధ్యాయము .. కర్మయోగము (తేటగీతి మాల) భగవానుని ప్రభావము నిష్కామకర్మయోగ ప్రస్తావన ( 1వ శ్లోకం నుండి 18 వ శ్లోకంవరకు) తే:: నాశ రహితమైనది గీత నరముచేరి శాశ్వత ఫలమొసంగియు సానుకూల మొదటయు భగవాన్ సూర్యునకుతెలి పేను రవి మనువునకు, మనువుయే రంగరించి క్రమముగా లోకమున విస్తర రించె బోధ ... .... ... 1 తే:: రాజు ఆధ్యాత్మ విద్య రాజర్షి యగుట గీత యెఋషిత్వ రాజత్వ తీర్పు యగుట ఇంద్రియ జయము మనసుస్వా దీన మగుట కామ నిర్జన ఆత్మాను భావ మందు కావగ కనుమరుగునయ్యె కాల మగుట ..... .... ... .2 తే:: తెలిపె పరమోత్తమ యొగము తేట తెలుగు నెవ్వరి కెఱిగించకమఱుగునబడినదియె నేడు యొగరహస్యంబు వచింతు నీకు, భక్త మిత్ర, వివరము శ్రేష్టమై నదియు ఇదియు .... .... ..3 పార్ధుని ప్రార్ధన తే: దేహదృష్టి మనోదృష్టి దివ్యతేజ ఆత్మ దృష్టి ఈనాటిది అణువు ఏది ఏది సూర్యజన్మయునీదు ఏ...