Posts

Showing posts from April, 2023

కంద పద్యాలు

 మేటి వెలుగు కాత్యాయిని  కోటి కొలువు కామాక్షివి  నేటిశ్రీమతి సివంగి నిర్మల వాణీ  నాటి శ్రీ వాణీ గను  మటు మాయల తో ను మనిషి  మాటలతోను మహలక్ష్మి మా జగ దంబా  పువ్వు కళ గుభాలింపగు  నవ్వు కళలు నాట్యమగుట  నవ్వించియేడుపుగాను నటనా లక్ష్మీ రివ్వున సాగెడి మెరుపగు  గువ్వల కోరిక బ్రతుకగు  మువ్వల శబ్దము మనసుకు ముఖ్యము లక్ష్మీ   రోగము తెలియక వచ్చును  భోగము మనసుకు నచ్చును  ప్రగతి ప్రతిభయే యుపాయ ప్రాభవ లక్ష్మీ  త్యాగము శాంతికి వచ్చును  యోగము చెప్పక వచ్చును  మగని నడవడిక మగువకు మానస లక్ష్మీ  ష. కం.వరము వరదలా వయసై  తరము మెరుపులా మనసై  మరులు గొలుపు మహిమ లక్ష్మి మలుపులు తిప్పే  తరుణ కళలులా తనమై  తరువు జపములా శుభమై  కరువే తీర్చ మహలక్ష్మి కనులతొ చూపే పుస్తక పఠనము నిత్యము  వస్తను కలగించుటయే  మస్తక శుద్ధియగుటౌను మానిత వేళల్  దుస్తర మార్గము భత్యము  పస్తుల బ్రతుకగు భుక్తియు  కుస్తియు జీవితము లక్ష్మి కూడు కొరకునే లోపాలు మనిషి యగుటే  పాపాలు పరము యగుటే  కోపాలు సహజమ...
  #సాష్టాంగ_నమస్కారం...........!! అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.. సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము... ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః... అష్టాంగాలు అంటే... "ఉరసా" అంటే తొడలు, "శిరసా" అంటే తల, "దృష్ట్యా" అనగా కళ్ళు, "మనసా" అనగా హృదయం, "వచసా" అనగా నోరు, "పద్భ్యాం" అనగా పాదములు, "కరాభ్యాం" అనగా చేతులు, "కర్ణాభ్యాం" అంటే చెవులు. ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి. మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి.. ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి. 1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి. 2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి. 3) దృష్టితో నమస్కారం చేసేట...

ప్రాంజలి ప్రభ..20/04

Image
  *"మనసు, జ్ఞాపకాలకు మనను బాధించే శక్తి ఏవిధంగా లేదు ?" ◆◆◆◆◆◆◆◆◆                      👇 మనకిప్పుడు స్ఫురణకు వచ్చే జ్ఞాపకాలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి ? 💫 మన మనసులో నుండి వస్తున్నాయి. ⚜️ అవి స్ఫురణకు వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటున్నాయి ? 💫 మన మనసుతోనే ఉంటున్నాయి. ⚜️ స్ఫురణకు వచ్చిన జ్ఞాపకం వలన ఏమి జరుగుతుంది ? 💫 మనసుకు సంతోషమో, దుఃఖమో కలుగుతుంది. ⚜️ అప్పుడు సంతోషం, దుఃఖం ఎక్కడ ఉంటున్నాయి ? 💫 అవి మన మనసుతోనే ఉంటున్నాయి. ⚜️ అంటే మనసు ఏమి అనుభవిస్తుంది ? 💫 సంతోష, దుఃఖాలను అనుభవిస్తుంది. ⚜️ మనసు ఎందుకు సంతోష, దుఃఖాలను అనుభవిస్తుంది ? 💫 జ్ఞాపకాలు గుర్తుకు రావడం వలన. ⚜️ మనలోనేవున్న జ్ఞాపకాలు గుర్తుకు రాకముందు ఎందుకు బాధించటంలేదు ? 💫 మనసుకు గానీ, జ్ఞాపకానికి గానీ మనను బాధించే శక్తి లేదు కనుక ! ప్రశ్న: పూర్ణబ్రహ్మమును ఎలా పొందాలి.. గృహస్థులకు ఏది సరియైన పద్ధతి.. జవాబు: నీవు ఇప్పటికే పూర్ణుడివి. నీవు దానికంటే వేరుగా వున్నావా. అలా అయితే అది పూర్ణమెట్లా అవుతుంది. కాకపోతే ఆ ప్రశ్న ఎలా వచ్చింది. పూర్ణబ్రహ్మము, నీవు ఒక్కటే. ఒకరికొకరు వే...

ప్రాంజలి ప్రభ..18/04

Image
    ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక  రచయత" శ్రీదేవి  రామకృష్ణ మల్లాప్రగడ నేటి కవిత ..... వేరు జీవమ్ ఒక్కటే - జీవితమ్  వేరు రూపమ్ ఒక్కటే - గుణం వేరు కాలం ఒక్కటే - గమ్యం   వేరు వనం ఒక్కటే - ఔషదాలు వేరు ఆశ ఒక్కటే - ఆశయం వేరు ఆకలి ఒక్కటే - రుచులు వేరు ఆరాటం ఒక్కటే - ఆదరణ వేరు కలం ఒక్కటే - కావ్యాలు వేరు కత్తి  ఒక్కటే - ఉపయోగం వేరు ఖంఠం ఒక్కటే - గాత్రాలు వేరు భాష ఒక్కటే - భావాలు వేరు బంధం ఒక్కటే  - బాధ్యతలు వేరు తపస్సు ఒక్కటే - కోరిక వేరు తేజస్సు ఒక్కటే - విస్తరణ వేరు బలం ఒక్కటే - ఉపయోగం వేరు మనస్సు ఒక్కటే - ఆలోచన వేరు తరుణం ఒక్కటే -  తమకం వేరు చరణం ఒక్కటే - చరిత్ర వేరు ప్రయాణం ఒక్కటే - దూరాలు వేరు ప్రాణం ఒక్కటే - మరణం వేరు    --((*))-- "వేణునాదః ( ర న జ భ న స ..18/10 ).. శ్రీధరం కమలధవంసుశీలవిబుధజననుతం , శ్రీధవం విమలదయాబ్ధిశీతలఫలదహృదయమ్.. మాధవం విపులధరాత్మమానితభరణ పురుషం , గోధరం శ్రవణసునామగుహ్యవరదమను భజే !!!  ****  సేకరణ.👏 శీర్షిక : మల్లె వెలుగు పట్టుదలే ఉన్న ప్రగతి సాదనమ్ము  ప్రకృతి సహాయమే మెట్టు విజయ శక్తి,  మౌ...

పంజలి ప్రభ 17/04

Image
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం .. సప్తమ స్కంధము - మొదటి అధ్యాయము తెలుగు  అనువాదము   నారద-యుధిష్థిర సంవాదము-జయవిజయుల గాథ... 1  నుండి 10 యదార్ధ శ్లోకభావాలు     ఓం నమో భగవతే వాసుదేవాయ 🕉🕉🕉   19..06...2020  శ్రీశుక ఉవాచ 1.21 (ఇరువది ఒకటవ శ్లోకము) నుండి ౩౪ శ్లోకాల తాత్పర్యము  శ్రీశుకుడు నుడివెను - సర్వసమర్థుడైన నారదమహర్షి యుధిష్ఠిరుని ఈ ప్రశ్నను విని మిక్కిలి సంతసించెను. పిమ్మట ఆ మహాసభయందు అందరు వినుచుండగా ధర్మరాజునకు ఈ కథను వినిఫించెను. నారదుడు వచించెను- ధర్మరాజా! నింద, స్తుతి, సత్కారము, తిరస్కారము అనునవి ఈ శరీరమునకు సంబంధించినవి. ప్రకృతి, పురుషులను గూర్చిన వివేకము లేకుండుటచే అజ్ఞానకారణముగా ఆత్మయందు కల్పితమైనది. దేహాభిమానము కారణముగా జీవుడు ఈ శరీరమును నేను అని భావించి, దండనము, పరుష వచనములు ఎదురైనప్పుడు, అవి తనవి గానే భావించును. కాని, భగవంతునకు జీవులవలె ఇట్టి అభిమానము ఉండదు. ఆ ప్రభువు సర్వాత్మ స్వరూపుడు, అద్వితీయుడు. ఇతరులను దండించు నప్పుడు గూడ క్రోధము, ద్వేషముల వలనగాక, వారి శ్రేయస్సు కొరకే అట్లు చేయును. భగవంతుని విషయములో హింసకు చోటు...