#సాష్టాంగ_నమస్కారం...........!!

అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.. సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము...

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః...

అష్టాంగాలు అంటే...

"ఉరసా" అంటే తొడలు,

"శిరసా" అంటే తల,

"దృష్ట్యా" అనగా కళ్ళు,

"మనసా" అనగా హృదయం,

"వచసా" అనగా నోరు,

"పద్భ్యాం" అనగా పాదములు,

"కరాభ్యాం" అనగా చేతులు,

"కర్ణాభ్యాం" అంటే చెవులు.

ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.

మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి..

ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి.

1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.

2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.

3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.

4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.

5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి.

అంటే  "ఓం నమః శివాయ" అని అంటూ నమస్కారం చేయాలి.

6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

8) జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి...

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.

పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.

నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం...⚜️

🕉️🚩 శ్రీరామ జయరామ జయజయరామ 🌹🙏

.....

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే

రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః

రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోఽస్మ్యహం

రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర  


🌹#తాత్పర్యము:

రాజులలో మణి వంటి వాడు, రాక్షసులను సంహరించిన వాడు అయిన రామున్ని భజిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. ఆ రాముని మించిన కొలువు, దైవము లేదు, నేను అతని సేవకుడను. నా మనసు ఆ రాముని యందే లయమై యున్నది. ఓ రామా! నన్ను ఉద్ధరించుము, తరించుము.

🍁🍁🍁🍁🍁


"యజ్ఞాః లోక కల్యాణ హేతవః"

– యజ్ఞాలు లోక కల్యాణానికి కారకాలుగా నిలుస్తాయి.


సీతారాములిద్దరూ సాధారణ స్త్రీపురుషులు కాదు.

వారిద్దరూ యజ్ఞ ఫలితంగా ఆవిర్భవించిన పుణ్యమూర్తులు.

తమ వంశం తరించడానికి పుత్రసంతానం కోసం దశరథ మహారాజు చేసిన యాగఫలితంగా శ్రీరామచంద్రమూర్తి జన్మిస్తే,

యజ్ఞ నిర్వహణలో భాగంగా యాగశాల కోసం భూమిని దున్నుతున్న జనక మహారాజుకు నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞప్రసాదం సీతాదేవి.

అటువంటి యజ్ఞ ఫలితంగా జన్మించిన సీతారాములు ఒకటైన కళ్యాణ మహోత్సవం... #సీతారామకళ్యాణం.. లోక కళ్యాణ యజ్ఞానికి హేతువుగా నిలిచింది.

భార్యాభర్తలు అంటే సీతారాముల్లా ఒకరికొకరుగా ఉండాలనడం,

నవదంపతుల్ని సీతారాముల్లాగా ఉండమని ఆశీర్వదించడం,

ఉత్తమసాధ్విని సీతమ్మ తల్లిగా పిలవడం,

గౌరవ మర్యాదలు తెలిసిన వ్యక్తిని మా మంచి రామయ్య అనడం,

"#శ్రీరామనవమి" రోజున సీతాకల్యాణం జరిగిన తర్వాతనే తమ బిడ్డల వివాహ సుముహూర్తాలు నిశ్చయించుకునే ఆచారం పాటించడం,

సీతారామ కల్యాణ అక్షతలను తమ బిడ్డల వివాహ తలంబ్రాలలో కలిపితే నవదంపతులు చల్లగా ఉంటారనే విశ్వాసం కలిగి ఉండటం..

ఇలా ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలు.. సీతారామ కల్యాణానికి మాత్రమే చెందిన ప్రత్యేకతలు.

ఊరంతా పందిళ్లు.. వాడంతా సందళ్లు..

రామయ్య జట్టుకట్టే వాళ్లు కొందరు..

సీతమ్మ మాయమ్మ అనేవాళ్లు ఇంకొందరు..

లోకానికి పెద్దలైన దేవుళ్ల పెండ్లికి పిల్లాజెల్లా అందరూ పెద్దలే!

కల్యాణం సీతారాములది.. కోలాహలం అందరిదీ! 

వందే సీతారామం.. వందే లోకాభిరామం.. 

ముప్పైమూడు కోట్ల మంది దేవతలు ఉన్న హైందవ ధర్మంలో మరే ఇతర దేవతల కల్యాణానికి దక్కని వైభవం, మహత్తు కేవలం సీతారామ కల్యాణానికే మాత్రమే దక్కాయి.

ఈ లోకోత్తర కల్యాణాన్ని మాత్రమే "సీతారామ శాంతి కల్యాణం" అని పిలుస్తారు.

వైదిక క్రతువుల్లో కూడా

‘శ్రీసీతారామ శాంతికల్యాణ మహోత్సవం గత్వా...' -అని సంకల్పం మొదలు మాంగల్యధారణ, ఆర్ద్రాక్షతారోపణ వరకు చెబుతారు.

దీని ద్వారా "సీతారామ కల్యాణం" లోక కల్యాణ హేతువని అర్థమవుతున్నది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

🌹🌹మనస్నేహం పరివారం లోని మీకు మీ కుటుంబ సభ్యులకు

 #శ్రీరామనవమి శుభాకాంక్షలు🌹🌹

రాములవారి పూజ జరిగింది...🙏🙏 

#సీతారాములవారి ప్రసాదం వడపప్పు&పానకం స్వీకరించండి... 🙏🙏

నేటి నుండి తొమ్మిదిరోజులు భజనలు...🙏🙏

తల్లిదండ్రుల మాట మీరకూడదని అందరికీ గౌరవ&మర్యాదలు ఇవ్వాలన్నది #రామతత్వం

భర్త అడుగుజాడలలో నడవడం, కష్టకాలంలో మనోధైర్యం కోల్పోకూడదు అనేది #సీతతత్వం

కష్టమైనా,సుఖమైనా పరిస్థితులు ఏమైనా... తోబుట్టువులకు తోడుగా ఉండాలనేది #లక్ష్మణతత్వం

మనం&మనల్ని నమ్మిన వారికి నమ్మినబంటుగా... ఎట్టి పరిస్థితుల్లో మనము వారిని వీడక శక్తివంచన లేకుండా వారికోసం తపించాలనేది #ఆంజనేయతత్వం

మనకు ఎంత పరిపాలనా దక్షిణ ఉన్నా, మనకు ఎంత భక్తి ఉన్నా... ఎంత చదువులు చదివినా... 

పరస్ర్తీ వ్యామోహం ఉంటే పథనం కాక తప్పదు అని చెప్పడానికి #రావణుడు

#శ్రీరామనవమి... శుభాకాంక్షలు🙏🏻🙏🏻

శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి 

— ” సుధా సారా సారై ,శ్చరణ ,యుగాళాన్తరవి గలిథైహ్ ప్రపంచం ,సిన్చంతే ,పునరపి ,రసామ్నాయ మహాసా –

అవాప్సత్వాం భూమిం ,భుజగ నిభ మధ్యష్ట వలయం -స్వమాత్మానాం కృత్వా స్వపిషి ,కుల కుండే ,కుహరిణి ”

తాత్పర్యం –కుమారీ !నీ రెండు పాదాల మధ్య నుండి స్రవించే అమృత ధారా వర్షం చేత ,72000నాడులను తడు పుతూ ,దాన్ని అమృత కిరాణ కాంతి గల చంద్రుని వది లేసి ,మళ్ళీ మూలాధారానికి చేరి ,అందులో స్వ స్వ రూపం అయిన పాముల చుట్టలు గా చుట్టూ కోని ,పృధ్వీ తత్వం లోని సన్నని రంధ్రం ద్వారా ,కుండలినీ శక్తి వై, నువ్వు నిద్రిస్తావు .

విశేషం –శిరస్సు లో చంద్ర మండలం ఉంటుంది .ఇది పదహారు కళల తో ఉంటుంది .పైన కానీ పించే చంద్ర మండలం కూడా శ్రీ చక్రమే .పద్మాసనం పై కూర్చుని ,సాధకుడు శ్వాసను ఊర్ధ్వ ముఖం గా నాడు పుతూ ,కుంభకం లో మనసు ను నిలపాలి .లోపల వాయువును నిలపదాన్నే కుంభకం అంటారు .దీని వాళ్ళ స్వాధీ శతానం లోని అగ్ని జ్వలిస్తుంది .దాని వేడికి ”ఆహిరాట్ ”అనే కుండలినీ శక్తి మేల్కొంటుంది .ఆ శక్తి స్వాధిష్ఠాన ,మణి పూరకళ మధ్య గల రుద్రా గ్రంధిని చేదించి ,మణి పూరక ,అనాహతాల మధ్య ఉన్న విష్ణు గ్రంధిని భేదించి ,అనాహత ,విశుదదాల మధ్య గల బ్రహ్మ గ్రంధిని , ఆరు మలాలను అనాగా ఆజ్ఞా చక్రాన్తాన్ని చేదిస్తుంది .ఆ తర్వాతా కుండలిని ,సహస్రారం చేరి శివుని తో కలిసి ,సంతోషాన్ని పొందు త్హుంది .ఈ స్తితి లో నిశక్తే పరాశక్తి .ఆమె నిత్య సుఖ ప్రదాయిని .

శివ ,బ్రహ్మ శక్తులే అమ్మ వారి చరణాలు .ప్రకాశ విమర్శలు  .ప్రకాశ శక్తి బ్రహ్మం ,శుక్ల వర్ణం గా ఉంటుంది .విమర్శ- మూల శక్తి .రక్త వర్ణం లో ఉంటుంది .శక్తి తో కూడిన శివుడే ”పరా పాదుక ”గా భావింప బడుతాడు .

పాదుకాంత దీక్ష -విమర్శ రూప శక్తి ,ప్రకాశ శివ సంగతి కలిసి సహస్రారం లో చేసేదే ఆనందామ్రుతాభి షేకం .పాదుకా మహా మంత్రాన్ని ఉప దేశం గా స్వీక రించటం ,సర్వ ఔషధాలున్న కాషాయ స్నానం చేయటం ,మాత్రమె పాదుకాంత దీక్ష కాదు .ఈ విధం గా సుధా సారాభి షెకాన్ని పొందిన వాడే పాదు కాంత దీక్షా ను భవం గల నిర్వాణ యోగ్యుడు అవుతాడు .అని దీని పై లోతులు తరచిన వారు తెలియ జేస్తున్నారు .కుండలిని 3,1/2మూడున్నర చుట్టలు గా ఉంటుంది .

11—”చతుర్భిహ్ ,శ్రీ కన్థైహ్ శివ యువథిభిహ్ ,పంచభి రాపి –ప్రభిన్నాభిహ్ ,శంభోర్నవ భి రపి ,,మూల ప్రక్రుతిభిహ్

త్రయశ్చత్వా రిమ్ష ,ద్వసు దళ ,కళా శ్రీ ,త్రివలయ –త్రిరెకాభిహ్ ,సార్ధం ,తవ ,శరణు కోణః పరి ణతః ”

తాత్పర్యం –చాముండీ !నీ నిలయం అయిన శ్రీ చక్రం లో నాలుగు శివ కోణాలు ,అయిదు శక్తి కోణాలు కలిసి తొమ్మిది మూల ప్రకృతుల చేత ,అష్ట దళ ,షోడశ కళ ,త్రివలయ ,భూ, పురత్రయాదు ల చేత 44 అంచులు గా మారింది .అయిదు శక్తి చక్రాలు -త్రికోణ ,అష్ట దళ ,దశ కోణ ద్వయ ,చతుర్దశ కోణాలు అన్న మాట .నాలుగు శివ చక్రాలు –బిందు ,అష్ట దళ ,షోడశ దళ ,చతురస్రాలు .

విశేషం –శ్రీ చక్రానికి మూల కారణాలైన తొమ్మిది చక్రాలు ప్రపంచ నిర్మాణ కారణాలైన తొమ్మిది దాతువులే .చర్మ ,రక్త ,మాంస ,మేధ ,ఆస్తులు ఈ అయిదు శక్తి సంభూతాలు .మజ్జ ,శుక్ల ప్రాణ ,జీవాలు నాలుగు శివ సంజాతాలు .అలాగే పంచ భూత ,పంచ తన్మాత్ర ,పంచ జ్ఞానేంద్రియాలు ,పంచ కర్మేంద్రియాలు మనశ్శక్తి సంబంధాలు .మాయ శుద్ధ ,విద్య ,మహేశ్వర సదాశివ లు శివ శక్తికి సంబంధించినవి .ఇలా25 తత్వాలు కలిసిన 9 కొణాలే బ్రహ్మాండ ,పిండాండ నిర్మాణానికి ఆధారం అని విజ్ఞులు చెబుతున్నారు .

అహంకారం మనసులో ,ఖ్యాతి విద్య లో ,గుణాలు ప్రకృతి లో ,ప్రకృతి శక్తి లో అంతర్భావాలు .పురుషుడు మహేశ్వరుని లో ,”కళకు శుద్ధ లో ”అంతర్భావం .కాలానికి మహేశ్వరుని లో ,సదాశివుని లో శక్తికి శుద్ధ విద్య లో అంతర్భావం .శివ తత్త్వం సదా శివ తత్త్వం లో అంతర్భావం .

అయిదు భూతాలు ,అయిదు తన్మాత్రలు ,అయుదు జ్ఞానేంద్రియాలు ,అయిదు కర్మేంద్రియాలు  ,మనసు ,మాయ ,శుద్ధ విద్య ,మహేశ్వర ,సదాశివ లతో కూడిన25 తత్వా లవల్ల ఆత్మ ఏర్పడు తుందని వేదోపనిషత్తులు తెలియ జేస్తున్నాయి .”పంచ వింశ ఆత్మా భవతి ”అని చాందోగ్య ఉపనిషత్ అంటోంది .వీటన్నిటికీ అతీత మైంది శివ శక్తి సంపుటం అయిన శ్రీ చక్రం ,దీని వల్ల నే జగత్తు ఉత్పత్తి అవుతోంది .పరమేశ్వరుడు శక్తి తో కలిసి నపుడే కార్య కారణ సమర్ధుడు అవుతాడు .ఇన్ని విషయాలను ఒక్క శ్లోకం లో నిక్షిప్తం చేసి, విశ్వ సృష్టి రహస్యాన్ని, అమ్మ వారి శక్తి సామర్ధ్యాన్ని తెలియ జేశారు శ్రీ శంకర భగ వత్పాదులు ...


పరబ్రహ్మ స్వరూపులైన

ఆత్మ బంధువులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రము 

కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో 

త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. 

శ్రీరామ నవమి రోజున ఏం చేయాలి?

చైత్రమాసమున శుక్లపక్షమినాడు సచ్చిదానంద స్వరూపియైన శ్రీరామచంద్రుడు అవతరించెను. కావున ఆరోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశోపచారములచే ఆరాధించాలి. పురాణమును పఠించి (చదివి) జాగరణము చేసి (నిద్ర మేల్కొని) మరునాడు ఉదయముననే కాలకృత్యములు నెరవేర్చుకున్న తరువాత తన శక్తికి తగిన భక్తియుక్తులతో శ్రీరామచంద్రుని పూజించాలి. పాయసముతో అన్నము చేసి పెద్దవారిని, బంధువులను తృప్తిపరిచి, గోవు, భూమి, నువ్వులు, బంగారము, వస్త్రములు, ఆభరణములు ఇచ్చి కౌసల్యాపుత్రుడైన (కొడుకైన) శ్రీరామచంద్రుని ఆనందింప చేయవలెను.

ఇలా శ్రీరామనవమి వ్రతము భక్తిగా ఆచరించు వాని జన్మాంతరముల పాపములు అన్ని నశించును. ఇంకా సర్వోత్తమమైన విష్ణు పదము లభించును. ఈ ధర్మం అందరికీ ఇహపరలోకములందు భోగమును మోక్షమును కలిగించునది. కావున మహాపాపి అయిననూ శుచియై ఈ వ్రతమును ఆచరించుటచే జన్మజన్మల పాపములన్నీ జ్ఞానాగ్నిచే నాశనము అగుటచే లోకాభిరాముడగు శ్రీరాముని వలె అన్ని లోకములలోను ఉత్తముడై వెలుగును.

శ్రీరామనవమి వ్రతము రోజున తినెడి నరాధమునకు నరకము కలుగును. అన్నిటికంటే ఉత్తమమైన ఈ వ్రతము చేయక ఇంకే వ్రతము చేసిన సఫలము కాదు. కావున ఈ వ్రతము ఒకసారి చేసి, భక్తితో ఆచరించినచో వారి మహా పాపములు అన్నియూ తొలగి కృతార్థులు అగుదురు. అందువలన నవమి రోజున శ్రీరామ ప్రతిమ (బొమ్మ)కు పూజావిధానముచేత ఆచరించువాడు ముక్తుడు అగును...

బీజాక్షర_సంకేతములు!!

ఓం - ప్రణవము సృష్టికి మూలం

హ్రీం - శక్తి లేక మాయా బీజం

ఈం - మహామాయ

ఐం - వాగ్బీజం

క్లీం - మన్మధ బీజం

సౌః - సౌభాగ్య బీజం

ఆం - పాశబీజం

క్రోం - అంకుశము

హ్రాం - సూర్య బీజం

సోం, సః - చంద్ర బీజం

లం - ఇంద్ర బీజం, పృథివీ బీజం

వం - వరుణ బీజం,జల బీజం

రం - అగ్ని బీజం

హం - ఆకాశ బీజం, యమ బీజం

యం - వాయు బీజం

శం -ఈశాన్య బీజం, శాంతి బీజం

షం , క్షం - నిరృతి బీజము

సం - సోమ (కుబేర) బీజము

జూం - మృత్యుంజయ, కాలభైరవ బీజం

భం - భైరవబీజం

శ్రీం - లక్ష్మీబీజం

హ్సౌ - ప్రాసాద , హయగ్రీవబీజం

క్ష ఔ - నృసింహ బీజం

ఖేం - మారణబీజం

ఖట్ - సంహారబీజం

ఫట్ - అస్త్రబీజం

హుం - కవచబీజం

వషట్ వశీకరణముబీజం

వౌషట్ - ఆవేశబీజం

ష్ట్రీo - యమబీజం

ధూం - ధూమావతిబీజం

క్రీం - కాళీబీజం

గం - గణపతిబీజం

గ్లౌం - వారాహి,గణపతిబీజం

ఘే - గణపతిబీజం

త్రీం -తారా బీజం

స్త్రీo - తారాబీజం

హూం - కూర్చము,క్రోధము,ధేనువు

బ్లూం - సమ్మోహనము

ద్రాం -ద్రావణ, దత్తాత్రేయబీజం

ద్రీo - ఉద్దీపనం

దం - దత్తాత్రేయబీజం

అం - బ్రహ్మ బీజం

కం -బ్రహ్మబీజం

ఇం - నేత్రబీజం

ఉం - శ్రోత్రబీజం

హ్లీం - బగళాబీజం

గ్రీం - గణపతిబీజం

ఠ - స్థంభనము

హిలి - వశీకరణ,దేవతాభాషణం

కిలి కిలి - దేవతాభాషణం

చులు - బాధా నివారణ

హులు - బాధా నివారణ

మానవుడు ఈ లోకంలోని కర్మ వలన శరీరాన్ని పొందుతున్నాడు. ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తూ మరల పాపపుణ్యాలు చేసి తిరిగి జన్మ పరంపరను పొందుతున్నాడు. ఇట్టి జన్మ పరంపరను విచ్చేదమొనర్చడానికి ఉపయోగపడు సాధనే ‘జపం’ అని శాస్తమ్రులు చెబుతున్నాయి.

‘జప’మనగా ‘జ’-జన్మ విచ్ఛేదనం చేయునది. ‘ప’ -పాపమును నశింపచేయునది అని అర్ధం. ఈ విధంగా జన్మను పాపమును రెండింటిని నశింపచేయడం చేతనే దీనికి జపమని పేరు వచ్చింది. జపంలో చందోబద్ధమైన ఒకే భగవన్నామం కానీ, ప్రత్యేకమైన కొన్ని మంత్రాలను కానీ ఉచ్చరించడం జరుగుతుంది. మనసు చంచలమై అల్లకల్లోలంగా వున్నప్పుడు ఆ మనసును ఏకాగ్రపరచడానికి జపం ఉపయోగపడుతుంది. నిశ్చల మనస్సుతో నిర్మలంగా దైవంపై మనసును కేంద్రీకరించి తత్ మంత్ర దేవతామూర్తి గుణరూపాలను మనసులో ముద్రించుకుని జపించాలి.

జపాన్ని మూడు విధాలుగా చేయవచ్చు. 

ఒకటి వాచకము: మంత్ర బీజ వర్ణములను తన దగ్గర ఉన్నవారికి వినబడునట్టు ఉచ్చరించుతూ జపించడం. 

రెండవది ఉపాంశువు: తన దగ్గరున్న వారికి మంత్రోచ్ఛారణ శబ్దాలు వినపడకుండా ఉచ్చరిస్తూ కేవలం పెదవులను మాత్రమే కదలిస్తూ జపం చేయడం. 

మూడు మానసికము: పెదవులను నాలుకను కదల్చకుండా మనస్సులోనే మంత్రం జపించుట.

వాచిక జపయజ్ఞముకన్నా ఉపాంశు జప యజ్ఞము వందరెట్లు అధిక ఫలాన్ని కలిగిస్తుంది. ఉపాంశు జప యజ్ఞం కంటె మానసిక జపయజ్ఞం వెయ్యిరెట్లు అధిక ఫలాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మంత్ర మహిమార్ధములను క్షుణ్ణంగా తెలుసుకుని జపించడం, సగర్భ జపం అనీ, మిక్కిలి శ్రేష్ఠమైనదనీ చెబుతున్నారు.

జపాన్ని చేసి సిద్ధి పొంది ఉచ్ఛస్థితికి వచ్చిన మహాపురుషుల యొక్క ప్రతిరోమము మంత్రాన్ని ఉచ్చరించడాన్ని మనం గమనించవచ్చును. జపం వలన కలుగు స్పందనచే సాధకుని శరీరం అంతా ఒక విధమైన దివ్య తేజస్సుతో దీప్తి నొందుతుంది. ఇట్టి స్థితిలో సాధకుని శరీరం దైవభావంతో అంతర్లీనమై ఒకవిధమైన గగుర్పాటు కలిగి అనిర్వచనీయమైన అద్భుతానందాన్ని పొందును. అతనిలో దైవ ప్రేమ పూర్తిగా నిండి ఆధ్యాత్మిక శక్తిని పొందుతుంది. మరియు అనేక ఇతర సిద్ధులను కూడా పొందుతుంది.

అలాగే జపవిధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మరీ మెల్లగా అక్షరం విడిచి అక్షరంగా జపం చేయరాదు. అలాగని వర్ణోచ్ఛారణ మిక్కిలి వేగంగాను చేయరాదు. సమాన వేగంతో ఆటంకాలు లేకుండా స్పష్టంగా ఉచ్చరించాలి. జపం చేసేటప్పుడు మనసును ఇతర భావాలనుండి మరిల్చి దైవం మీద మంత్రార్ధం మీదే ధ్యాసవుంచి ప్రశాంతంగా, ఏకాంతంగా జపించాలి.

సాధ్యమైనంతవరకు వౌనంగా ఉండాలి. శాంత స్వభావంతో ఉంటు పెద్దలను, విజ్ఞులను గౌరవించాలి. పాప కర్మలను, పాప చింతనలను పూర్తిగా విడిచి ధర్మచింతనతో, ఆధ్యాత్మిక చింతనతో గడపవలెను. సాత్విక మితాహారాన్ని భుజించాలి. సదా ఇష్ట దేవతా స్తోత్రాల పఠనం, వినడం కీర్తనం చేయాలి. దైవంనందు జపం పట్ల పరిపూర్ణ విశ్వాసం వుండడం అత్యంత ఆవశ్యకం. మానసిక జపానికి కాలనియమం లేదు. సాధకుని యొక్క అనుకూలత బట్టి ఎపుడైనా ప్రశాంతంగా చేసుకోవచ్చు.

 మంత్రార్ధాన్ని, మంత్ర చైతన్యమును, యోని ముద్రను తెలసుకోకుండా ఎన్నిసార్లు జపించినా నిష్ఫలం అవుతుంది. జపోచ్ఛారణలో మంత్రం బీజాక్షరాలు లోపించకూడదు. అలాలోపిస్తే జప ఫలం ఉండదు.

బీజ లోపం లేకుండా చైతన్యం కలిగి ఉండు మంత్రాలను జపించడం వల్లనే ఫలితం. సంధ్యా సమయాల్లో అష్టోత్తరాలు, సహస్రనామాలు జపించడం ఉత్తమం. ఒక దైవనామాన్నికానీ ఒకే మంత్రాన్ని గానీ జపిచడం వల్ల ఏకాగ్రత కుదిరి జపసాధన నిర్విఘ్నంగా సాగుతుంది.....

.సీసము

----------
ఎవరెక్కుపెట్టునో శివధనస్సును వాని
కిచ్చెద సీతను నిమ్ముగనని
ప్రకటించె జనకుడు ,వచ్చె గాధేయుడు
రామలక్ష్మణులతో రాజ సభకు,
గాధిసుతుడు కోరగా శివధనసును
చూపించె రాముకు, శూరవరుడు
శ్రీరాముడు ధనువు చేగొనె గురు నను
మతితొ నారినిలాగె మధ్యకు విరి
తేటగీతి
-------------
గె ధను వితర నృపతులు సిగ్గిలిరి సిగ్గు
పడుచు వరమాలతో వచ్చి తడబడుచును
రాము గళమున వైచెను రమణి సీత
జరిగె వీరి వివాహము సకల లోక
శుభకరమగుచును మిగుల శోభితముగ.
వీరయ శర్మ
భద్రాచలం లో రాముడి కల్యాణం అభిజిత్ లగ్నం లో నిర్వహిస్తారు. అభిజిర్లగ్నం అంటే సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చే సమయం...ఇది దోషరహిత ముహూర్త సమయం....దీనినే గ్రామాల్లో గడ్డ పార ముహూర్తం అంటారు.
అంతటి గొప్ప వైశిష్ట్యం కలిగింది భద్రాచలం శ్రీరామనవమి వేడుక
అంతటి గొప్ప వైశిష్ట్యం కలిగిన భద్రాచలం శ్రీరామనవమి విశిష్టతను, భక్తరామదాసు నెలకొల్పిన ఆచార సాంప్రదాయ వ్యవహారాలను త్రోసిరాజని, సీతారాములకళ్యాణం లో శ్రీరామచంద్రుని పేరును తొలగించి శ్రీరామనారాయణగా మార్చిపలకడం, అసలు భద్రాచల క్షేత్రం లో కొలువైవున్నది త్రేతాయుగం నాటి దశరధనందనుడైన శ్రీరామచంద్రుడు కాదు అని సాక్షాత్హు మిథిలా స్టేడియం నుండే భద్రాద్రి వైదికసిబ్బంది నొక్కి వక్కాణించడం చూస్తుంటే శ్రీరామభక్తులకు ఆవేదన కలుగుతోంది. వినాశకాలే విపరీత బుద్ధి అనిపిస్తోంది
శ్రీరామనవమి అంటే రాముడి పెండ్లి రోజే కాదు...అది ఆయన పుట్టినరోజు కూడా.చైత్ర శుద్ధ నవమి నాడు రాముడి జననం.
మరి పుట్టినరోజు పెండ్లి రోజుగా ఎలా మారిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం. శ్రీరాముడి పుట్టిన రోజును పెండ్లి రోజుగా నిర్ణయించిన ఆ గొప్ప ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించారు ? నేడు ప్రపంచ వ్యాప్తంగా రాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి రోజున రాముడి కళ్యాణం జరగటానికి మూలకారకుడు, ఆద్యుడు ఆ దివ్య ముహూర్త రూపకర్త, సృష్టికర్త మన భక్తరామదాసు.
ఇంతటి గొప్ప ముహూర్త నిర్ణయం జరిగింది 400 సంవత్సరాల క్రితం భద్రాచలం లో అన్నది అందరూ తెలుసుకోవలసిన విషయం. రాముడి కళ్యాణం నిర్వహించాలని భక్తరామదాసు 400 సంవత్సరాల క్రితం భావించారు. అందుకోసం మంచి ముహూర్తాన్ని చూడాలని పండితులను కోరారు. భద్రాచలం లోని పూజాది కార్యక్రమాలు అన్ని పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతాయి.(శ్రీరంగంలో మాదిరిగా ).
పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని పరమ పురుష సంహిత లో ఉన్న ఒక శ్లోకం ప్రామాణికంగా రాముడి కల్యాణ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు. అదే చైత్ర శుద్ధ నవమి. అవతార పురుషులు, దివ్యమూర్తుల కల్యాణ ముహూర్తాలు నిర్ణయించే సందర్భంలో ప్రామాణికం అయిన ఒక శ్లోకం అయిన...."ఎస్య అవతార దివసే ..తస్య కల్యాణ ఆచరేత్" (పరమ పురుష సంహిత) అంటే ఏ రోజు జన్మిస్తే ఆ రోజు కళ్యాణం చేయడం.
రాముడు జన్మించింది చైత్ర శుద్ధ నవమి. అందుకే రాముడి కల్యాణo ఆయన పుట్టినరోజునే చేస్తున్నారు.
ఇంతటి విశిష్ట కల్యాణ ముహూర్త నిర్ణయం జరిగిన పుణ్యక్షేత్రం భద్రాచలం. అందుకు ఆద్యుడు, రూపకర్త, ఈ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు.
వాల్మీకి రామాయణం లో కానీ, పద్మ పురాణంలో కానీ రాముడి కళ్యాణం చైత్ర శుద్ధ నవమి రోజున జరిగినట్లు ఎక్కడా చెప్పబడలేదు. కానీ,నాడు భద్రాచలం లో నిర్ణయించబడిన ఈ విశేష ముహూర్తం విశ్వవ్యాప్తమై , చైత్ర శుద్ధ నవమి రోజున ప్రపంచ వ్యాప్తంగా
శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి....
ఆ ముహూర్తనిర్ణయ స్థల కేంద్ర బిందువు భద్రాచలం కాగా, ఆ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు

***


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ