శ్రీమాత్రేనమః శ్రీలలితా సహస్రనామ భాష్యము 781వ నామ మంత్రము 11.01.2021 ఓం ప్రత్యగ్రూపాయై నమః బహిర్ముఖములగు ఇంద్రియములకు ప్రతికూలముగా నడచునట్టి స్వరూపముగలిగిన జగన్మాతకు నమస్కారము. శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రత్యగ్రూపా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ప్రత్యగ్రూపాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తితత్పరతతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునికి సుఖసంతోషములు, ఇష్టకామ్యసిద్ధియు లభించును. జ్ఞానేంద్రియములు (చెవి, 2. చర్మము, 3. కన్ను, 4. నాలుక, 5. ముక్కు), కర్మేంద్రియములు (1. వాక్కు, 2. హస్తములు, 3. పాదములు, 4. పాయువు, 5. ఉపస్థ) ఇవి అన్నియు దేహమునకు సంబంధించినవి. బహిర్ముఖములు. బాహ్యజగత్తును మాత్రమే చూస్తాయి. బాహ్యజగత్తులోని అంశములనే పరిగణనలోనికి తీసుకుని తత్సంబంధమైన కార్యనిర్వహణనే చేస్తాయి. ఐహిక సుఖవ్యామోహములవైపు మాత్రమే మనసు లగ్నమై ఉంటుంది. వీటికి ఆత్మను దర్శించే శక్తి ఉండదు. దీనినే విషయోన్ముఖము అంటారు. దీనినే బహిర్ముఖత్వము, పరాఙ్ముకత్వము అనికూడా అంటారు. ఇంద్రియములు విషయములను విడిచిపెట్టి అంతరాత్మవైపు త్రిప్పినట్లైతే, అది అంతర్ముఖత్వ...
Posts
Showing posts from August, 2024