Posts

Showing posts from October, 2024
Image
  నేటి కవిత్వం - పద్మ మాల  రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  చెప్పవే సాహసం వేటా   తెల్పవే తాపసీ మాటా తప్పులే చేయకే వాటా    ఒప్పుకో మంచిదే బాటా    పొందు సంతోష సౌందర్యం   విందు  విశ్వాస  వైరాగ్యం  సందు దొర్కాక ధీరత్వం  అందుకే నా సహాయమే       కాలమే వేద మాధుర్యం  గోలయే జీవ సౌభాగ్యం  పల్లమె నీటి మార్గత్వం  ఎల్లలే దేశ  రక్షిత్వం  సంతసించే సతీ ఉంటే మంచి మార్గం పతీ ఉంటే స్వాతి ముత్యం కళా ఉంటే సంత సమ్మే ను సంసారం  ఇత్తు నేఁ బద్మమాలల్ నీ    కిత్తు సద్రత్నమాలల్ నీ కిత్తు సౌవర్ణమాలల్ నీ    కిత్తు నీ పద్యమాలల్ శ్రీ రమ్ము నా కిమ్ము సౌఖ్యమ్మున్ జిమ్మ పీయూషముల్ సొంపై సొమ్ము లీ జీవితమ్ముల్ బ్రే- మమ్ముతో నుండఁగా ధాత్రిన్ నీల మేఘమ్ము లీరాత్రిన్ నేల యాకాశమున్ జేరెన్ చాలు నీయాట మాయావీ బాల గోపాల రావేలా ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: సర్వేజనా సుఖినోభవంతు తల్లీ తనయుని సంభాషణ  (చందస్సు )  త్రిష్టుప్పు 1 (చందస్సు ) భారతీ లేక మాలతీ - మ/మ/మ/గగ  * రారేమీ...