Posts

Showing posts from December, 2024

భగవద్గీత.. 1

 ప్రాంజలి ప్రభ....శుభోదయం  గౌరవనీయులైన సభ్యులందరికి తెలియపరుచునది యేమనగా 2018, 2o22, 2024 లో భగవద్గీత ను పద్యాల రూపములో ఆ భగవంతుని సంకల్పము తో వ్రాయటం కొంత జరిగింది. నేడు మరల టైపు చేసి రోజుకు 9 పధ్యాలు తెల్లవారుజామున ప్రతిఒక్కరూ చదువుకొనగలరని వాడ్సప్ గ్రూపుల్లోను, గూగుల్ ఫేస్బుక్ లోను ప్రాంజలిప్రభగా పొందు పరచదలిచాను. భగవద్గీత ను ఎందరో మహానుభావులు వ్రాసినారు. అయినా నాకు నేర్పిన గురువు, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నేను ఆరాధించే సీతా రామాంజనేయ స్వాములను ఆరాధిస్తూ లోగడ వ్రాసినవి ఇప్పుడు టైపు చేసి పెడుతున్నాను (చందస్సులో తప్పులు దొర్లినా తెలపగలరు సరిచేసి ముద్రణచేయించ అని పండితులను ఆర్ధిస్తున్నాను) మీ  విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ,. విశ్రాంతి ఘనాంకాధికారి,  ప్రాంజలి ప్రభ, రచయిత, నిర్మాత  హైదరాబాద్ ***** అసలు భగవద్గీత ఏం చెబుతుంది?* -ధర్మాధర్మాల గురించి చెబుతుంది. -కర్తవ్యం గురించి చెబుతుంది. -నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. - ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. -సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది. -ఏది శాశ్వతమో ఏది అశాశ...
  *ఓం నమో భగవతే శ్రీ రమణాయ* భక్తుడు : భగవాన్! నేను ఎదిగేది ఎట్లా ? మహర్షి : ఇంద్రియాలకంటే, మనస్సుకంటే బలమైన శక్తిని మేల్కొల్పటం వల్ల ఎదగటం జరుగుతుంది. నీలో ఉన్న ఆ శక్తిని మేల్కొల్పి, పెంపొందించుకోగలిగితేనే అన్నిటినీ జయించవచ్చు. ధ్యాన ధారను అంతరాయం లేకుండా నిలుపుకోవాలి. మితమైన ఆహారం తీసుకోవటంవల్లా, అట్లాగే ఇతర నియమాలని పాటించటంవల్లా లోపల సమభావాన్ని నిలుపుకోవచ్చు. "నీవు శరీరంతో తాదాత్మ్యం చెందినంత కాలం లైంగిక భావాలను, ఇతర ఆకర్షణలనూ తప్పించుకోలేవు". ******** ఓం నమో భగవతే శ్రీ రమణాయ మౌనవ్రతం కొంతవరకు ధ్యానానికి సహాయపడవచ్చు. కాని ఆలోచనలు అన్నివైపులా చిందులు త్రొక్కుతూ ఉంటే నోరు మాత్రం మూసుకుంటే ప్రయోజనం ఏమిటి? మౌనవ్రతం పాటిస్తూ ఆలోచనలు మాననప్పుడు ఆ మౌనవ్రతం ప్రయోజనం ఏమిటి? మనసు ధ్యానంలో స్థిరమైనప్పుడు వాక్కుతో పని ఏమిటి? ధ్యానం అంత మంచిది మరి ఏదీ లేదు.   ******* ఓం నమో భగవతే శ్రీ రమణాయ ప్రశ్న : భగవన్! పళని వెళ్ళి కుమారస్వామి మొక్కు తీర్చుకుంటాను. ఏమంటారు? మహర్షి : అక్కడి దేవుడు ఇక్కడ లేడా ఏమి? (భగవాన్ శ్రీ రమణ మహర్షి, కుమారస్వామి అవతారం అని కావ్యకంఠ గణపతిముని గారు చెబుతూ ఉంటారు) ...

poims

 నేటి పద్యాలు రచన మల్లాప్రగడ  01.చం.ఋణమనుశేషమున్ మనల శేష ముగాను వసుంధరన్ గతిన్  ధనముయు వైరమేయగుట దాస్యముగాను సుఖమ్ము ప్రశ్నగన్  మనమను ముప్పు తప్పదయు మార్గముగానులె దుఃఖ భావమున్  క్షణమొకయోగ్యతేయగుట క్షామము మార్చెడి శక్తి జీవమున్ 02.ఉ.ఏమని చెప్పదా మనసు యెల్లరు కాలము తీర్పులేయగున్   ఆమని చుట్టు తిర్గగల య భ్యసనమ్మగు యెoత మార్పుగన్  రాముని చంపి రావణుడు రమ్యముగా నివసించె లంకలోన్   కాముని లీలలే యగుట కామ్యత భావము మాయ కమ్మగన్ 03.మ.భగవద్గీతయె ధైర్య మిచ్చెడిదిగాభాగ్యమ్ము జీవమ్ముకున్  భగవద్గీతయె ప్రేమ పాశములనేపాఠ్యమ్ము క్షేత్రమ్ముగన్  భగవద్గీతయె శాంతి సౌఖ్యములకే బంధమ్ము నిత్యమ్ముగన్  భగవద్గీతయె సామ దానమగుటేబాంధవ్య తీర్పే యగున్ 04.మ.కరుణాసింధువు దైవ శాస్త్రముననే కాలమ్ము జీవేచ్ఛగన్  శరణంవ్యక్తము సర్వమున్ సగుణమైసామర్ధ్య మేతెల్పగన్  తరుణధ్యేయము వేద నాదమగుటే తత్త్వమ్ము నిశ్శబ్దమున్  మరణంపుట్టుక దైవ నిర్ణయముగా మార్గమ్ము గుర్వేయగున్ 05.సుఖమేలప్పుడు చొచ్చుచూ కదలగాసూత్రమ్ము ప్రేమమ్ముగన్  ఒకటైరెండుగు వచ్చుబంధువులుగా నొప్పించ ...
 శ్రీమద్భగవద్గీత... మోక్ష సన్యాస యోగము... 18 వ అధ్యాయము అంతర్యామివి వాసుదేవుడవునీవాద్యంత రాహిత్యమున్,    అంతర్యామిగ త్యాగ తత్త్వమును సాధ్యా భావ ధర్మమ్మునే  అంతా నేర్చిన సన్యసమ్ములగుణార్ద్రంతమ్ము సత్యమ్మునన్  అంతర్యామివి వాసుదేవుడవునీ హార్దిక్య కాంక్షమ్ము గన్(1) వేత్తలు కొందరున్ దెలుపు విద్యల కర్మలు త్యాగమేయగున్  మొత్తము వీడగా దెలుప ముఖ్యము త్యాగము నేననన్ విధిన్  వేత్తలు కర్త భావమున వీలును బట్టియె  సన్య సమ్ముగన్  మొత్తము సర్వ కర్మ ఫలముం పరివర్జన త్యాగ మేయగున్(2) ప్రతి కర్మానిల దోషమేయగుటకే  ప్రాధాన్య మేమివ్వగన్  మతి యందున్ గల మానవుండు కలగన్ మార్గమ్ము వెచ్చించగన్  మతి యందున్ ఫల యజ్ఞదానములుగన్ మాధుర్య మేనెంచగన్  ప్రతి కర్మాంతర వ్యా జ్యముల్ గనెడి ప్రాబల్యమ్ము కర్మమ్మగున్(3) త్యాగము, న్యాసముల్ మొదలు తామస సాత్త్విక రాజసమ్ముగన్  త్యాగము శ్రేష్టమే యను విధానము నీవన నేవచించెదన్  త్యాగము మూడుమార్గమువిధానము గావిధి సౌమ్యమేయగున్  బాగుగఁ దెల్పెదన్  వినుము బాధ్యత పర్వము వాని యందునన్(4) హోమ తపస్సుగా మనసు హోరును దానము నిశ...
  తెలుగు భాష నేర్చుకుందాం 15 /3 600 ..అలిగిన అలలే స్వ సంద్రమే తలవని తరమే స్వ మాయలే పిలవని పరమే స్వ బుద్ధులే కలవని కధలే స్వ కర్మలే 601..పలుకుల మనసే స్వభావమే థళుకుల మెరుపే స్వధర్మమే కులుకుల వరమే స్వలక్ష్యమే మలుపుల కరునే స్వ కర్మయే 602.. ఒకటని ఒకటేను పొందుటే శకటము సెగ దెబ్బ ఉండుటే తకధిమి తక తోం త నాట్యమే తికమక తిక ఉండు రోగమే 603.. వికసిక కధలన్ని రాగమే మకతిక తరుణమ్ము శాంతమే తకధిమి కలలన్ని భావమే ఒకటికి ఒకటేను ఓర్పుయే 604..సరిగమ సతి పాటలే మనో మురిపము మను వాడి నోడికే సిరి కలసియు వేడుకే కధా చరితము మది సంతసం కదా 605.. పదనిస పతి మాటలే కళా యద వినయపు సేవలే కధా కధ కళ కిల అవ్వుటే సదా రొద మది రమ కోరుటే కదా న న ర ల గ ;; III III UIU IU మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ --(())--