*ఓం నమో భగవతే శ్రీ రమణాయ*


భక్తుడు :

భగవాన్! నేను ఎదిగేది ఎట్లా ?


మహర్షి :

ఇంద్రియాలకంటే, మనస్సుకంటే బలమైన శక్తిని మేల్కొల్పటం వల్ల ఎదగటం జరుగుతుంది. నీలో ఉన్న ఆ శక్తిని మేల్కొల్పి, పెంపొందించుకోగలిగితేనే అన్నిటినీ జయించవచ్చు. ధ్యాన ధారను అంతరాయం లేకుండా నిలుపుకోవాలి. మితమైన ఆహారం తీసుకోవటంవల్లా, అట్లాగే ఇతర నియమాలని పాటించటంవల్లా లోపల సమభావాన్ని నిలుపుకోవచ్చు.


"నీవు శరీరంతో తాదాత్మ్యం చెందినంత కాలం లైంగిక భావాలను, ఇతర ఆకర్షణలనూ తప్పించుకోలేవు".


********


ఓం నమో భగవతే శ్రీ రమణాయ


మౌనవ్రతం కొంతవరకు ధ్యానానికి సహాయపడవచ్చు. కాని ఆలోచనలు అన్నివైపులా చిందులు త్రొక్కుతూ ఉంటే నోరు మాత్రం మూసుకుంటే ప్రయోజనం ఏమిటి? మౌనవ్రతం పాటిస్తూ ఆలోచనలు మాననప్పుడు ఆ మౌనవ్రతం ప్రయోజనం ఏమిటి? మనసు ధ్యానంలో స్థిరమైనప్పుడు వాక్కుతో పని ఏమిటి? ధ్యానం అంత మంచిది మరి ఏదీ లేదు.


  *******


ఓం నమో భగవతే శ్రీ రమణాయ


ప్రశ్న :

భగవన్! పళని వెళ్ళి కుమారస్వామి మొక్కు తీర్చుకుంటాను. ఏమంటారు?


మహర్షి :

అక్కడి దేవుడు ఇక్కడ లేడా ఏమి?


(భగవాన్ శ్రీ రమణ మహర్షి, కుమారస్వామి అవతారం అని కావ్యకంఠ గణపతిముని గారు చెబుతూ ఉంటారు)


  *******


   ఓం నమో భగవతే శ్రీ రమణాయ


ఒక భక్తుడు తన గురించి ఇలా చెప్పాడు...


అప్పుడు నాకు 6 సంవత్సరాలు. ఒకనాడు ఆశ్రమంలో కోతి కోసం ఒక పళ్లెంలో కొన్ని పళ్లూ, స్వీట్లు పెట్టి ఉంచారు. ఎవరూలేని సమయంలో నేను వెళ్లి ఒక స్వీటుని తీసుకొని నోట్లో వేసుకున్నాను. చటుక్కున ఒక కోతి వచ్చి నన్ను ఒక చెంపదెబ్బ కొట్టింది.


అదే సమయానికి అక్కడికి వచ్చిన మహర్షి ఇలా సెలవిచ్చారు .....


"చూడు! నీకు ఇది ఒక గుణపాఠం. ఎవరి కోసమో ఉన్న వాటిని మనకి కావాలని అనుకోకూడదు; తెలిసిందా!"


   *******


   ఓం నమో భగవతే శ్రీ రమణాయ


భక్తుడు :

భగవాన్ ! జ్ఞాన మార్గము అంటే ఏమి?


మహర్షి :

జ్ఞానం అంటే సత్య సిద్ధి. అది ధ్యానం వలన సాధ్యం అవుతుంది. ధ్యానం వలన సత్యంలో నీకు పట్టు చిక్కుతుంది. ఆవిధంగా ఇతర ఆలోచనల అన్నింటినీ ప్రక్కకు త్రోసివేయవచ్చు. నేను ఎంత కాలంగానో చెబుతున్న విషయం ఇదే.


*యోగీశ్వరుడైన "శ్రీకృష్ణుడు….”*

     పత్రం పుష్పం ఫలం తోయం*
         *యోమే భక్త్యా ప్రయచ్ఛతి*
         *తదహం భక్త్యుపహృతం*
         *అశ్నామి ప్రియతాత్మనః*
ఎవరైతే నాకు  పత్రమైనను., పుష్పమైనను., ఫలమైనను., చివరకు ఉదకమైనను భక్తితో సమర్పిస్తారో..., వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తాను”*       
అది పై శ్లోకం తాత్పర్యం!

*భగవంతుడికి మనం చేసే చిన్న పాటి సేవ కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.*

ధూప, దీప, పుష్ప, గంధాలతో మనం పరమాత్మకు ప్రతిరోజూ చేసే పూజ కూడా ఎంతో గొప్ప    భగవద్ అనుగ్రహాన్ని వర్షిస్తుంది.

*తెలిసి చేసినా, తెలియక చేసినా సరే మనం చేసే చిన్నపాటి సేవకి పరమాత్మ విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు.*

*జగద్గురు శ్రీ ప్రభుపాదాచార్యుల వారిని ఒకసారి ఒక శిష్యుడు ఒక ప్రశ్న అడిగాడు....*

*“మీరు ప్రతిరోజూ కృష్ణుడి పాదాలమీద పువ్వుల తో     పూజ చేస్తున్నారు కదా, ఒకరోజు తర్వాత వాడిపోతుంది. మరి ఆ పువ్వు పొందే ప్రయోజనం ఏమిటి?”*

*దానికి జగద్గురువులు ఇలా సమాధానం ఇచ్చారు...*

*“ఈ పువ్వు ఏ మొక్క నుంచి వచ్చిందో, ఆ మొక్కలోనున్న జీవుడు వచ్చే జన్మలో ఉత్కృష్టమైన మానవ జన్మని పొందుతుంది".*

*దీనికి పురాణంలో ఒక కథ కూడా ఉంది.*

*ఒక వూరిలో పాడుబడ్డ దేవాలయం మీద   ఒక పక్షి ఎగురుతూ వెళ్ళింది.  అది అలా ఎగిరి వెళ్లడంలో దాని రెక్కల నుంచి వచ్చిన గాలికి గోపురం మీద ఉన్న  ధూళి తొలిగి శుభ్రపడింది.*

*తెలియక చేసినా కూడా అదొక గొప్ప భగవద్ సేవ. తర్వాతి జన్మలో ఆ పక్షి లోని జీవుడు ఒక రాజకుమారుడిగా జన్మించాడు.*

*ఎప్పుడో ఒక్కసారి చేస్తేనే పరమాత్మ అంత అనుగ్రహిస్తే, అదే మనం నిరంతరం శ్రీమన్నారాయణుడి పాద పద్మములను సేవిస్తే మనల్ని రక్షించడా స్వామి?*

*తప్పక అనుగ్రహిస్తాడు. జీవరాసులలో మానవజన్మ పరమోత్కృష్టమైన జన్మ. మోక్ష సాధనకి మానవ జన్మే చిట్టచివరి జన్మ అవుతుంది.*✍️
.                            🙏🙏
ఈ ప్రపంచంలో లెక్కలు (Mathamatics) రానిది ఎవరికో తెలుసా?

'మన అమ్మ'లకి
ఎలాగంటే!..

ఆకలి అవుతోంది... 2 చపాతీలు పెట్టమంటే..నాలుగు పెడుతుంది.

పొద్దున్నే 7 గంటలకు లేపి..పది అయ్యిందిరా అంటూంది.

స్కూల్ పరీక్షల్లో నూటికి 30 మార్కులొస్తే..

పక్కింటి పిన్ని అడిగితే మావాడికి యాభై పైనే వచ్చాయని చెప్తుంది

బయటకు వెళ్ళాలి ఖర్చులకు ..ఓ యాభైరూపాయలు ఇవ్వమంటే..

పోపులడబ్బా నుండి వందరూపాయలు తీసి ఇస్తుంది.

దొంగచాటుగా  సెంకడ్ షోకి వెళ్ళి రాత్రి ఒంటిగంటకొచ్చి పడుకుంటే...

పొద్దున్నే నాన్నకి తెలిసి కేకలేస్తే రాత్రి పదింటికే పడుకున్నాడని కవర్ చేస్తుంది.

అమ్మకి నిజంగా లెక్కలు తెలియవు.. ఒక్క ప్రేమ తప్ప!

ఎందుకంటే!..

వాళ్ళు చదివింది..
డిగ్రీలో Mathematics కాదు..
వాళ్ళు చదివింది.. Life లో Ethics. Happy Mathematics Day😊
*****
*చార్లీ చాప్లిన్ 88 సంవత్సరాలు జీవించారు.*
*అతను మాకు 4 ప్రకటనలను ఇచ్చాడు:*

  (1) ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మన సమస్యలు కూడా కాదు.

  (2) నేను వర్షంలో నడవడానికి ఇష్టపడతాను ఎందుకంటే నా కన్నీళ్లు ఎవరూ చూడలేరు.

  (3) జీవితంలో అత్యంత కోల్పోయిన రోజు మీరు నవ్వని రోజు.

  (4) ప్రపంచంలోని ఆరుగురు అత్యుత్తమ వైద్యులు...:

  1. సూర్యుడు
  2. విశ్రాంతి
  3. వ్యాయామం
  4. ఆహారం
  5. ఆత్మగౌరవం
  6. స్నేహితులు

  మీ జీవితంలోని అన్ని దశలలో వాటికి కట్టుబడి ఉండండి మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి...
  చంద్రుడిని చూస్తే భగవంతుని అందం కనిపిస్తుంది...
  సూర్యుడిని చూస్తే భగవంతుని శక్తి కనిపిస్తుంది...
  మీరు అద్దంలోకి చూస్తే, మీరు దేవుని ఉత్తమ సృష్టిని చూస్తారు. కాబట్టి విశ్వాసం కలిగి ఉండండి.
  మనమందరం పర్యాటకులం, దేవుడు మా ట్రావెల్ ఏజెంట్, అతను మా రూట్‌లు, బుకింగ్‌లు మరియు గమ్యస్థానాలను ముందే తెలుసుకున్నాడు... అతనిని విశ్వసించి జీవితాన్ని ఆనందించండి.

  *జీవితం ఒక ప్రయాణం మాత్రమే!   కాబట్టి, ఈ రోజు జీవించండి ! రేపు కాకపోవచ్చు !*******

విగ్రహారాధన*
సనాతన హిందూ ధర్మంలో విగ్రహారాధనకి ఓ విశిష్టత ఉంది. పరబ్రహ్మము సర్వవ్యాపియై ఉండినను అది అవ్యక్తమై యుండిన కారణంగా భగవత్ స్వరూప నిర్ణయం కొరకు ఒక రూపం అత్యావశ్యకం.

జన్మతః మానవ ఇంద్రియాలు స్థూల విషయాలనే గ్రహించగలవు తప్ప సూక్ష్మ విషయాలను గ్రహించలేవన్నది యదార్ధం. ఇంద్రియాలన్నీ బయటకు తెరుచుకొని వుంటాయి. వాటి ద్వారా పనిచేసే మనస్సు బహిర్ముఖంగానే వుంటుంది. అతి సూక్ష్మముగా హృదయాంతరమున వుండే ఆత్మతత్వం అర్ధం కావాలంటే మనస్సు అంతర్ముఖం కావాలి. మనస్సు అంతర్ముఖం కావాలంటే అందుకు చాలా సాధనా మార్గాలను మహర్షులు సూచించారు. అందులో సామాన్యులను కూడా భక్తిత్వం అలవర్చే ముఖ్యమైన సరళమైన మార్గం విగ్రహారాధన.

భగవంతుడ్ని మనిషి గుర్తించే మొదటి స్థితి ఇదే.
"పాషాణలోహ మణి మృణ్మయ విగ్రహేషు పూజా పునర్భోగకరీ ముముక్షో:" ముముక్షులకు కూడా విగ్రహారాధన ప్రయోజనకరమే అన్నది శాస్త్రవాక్యం.
ప్రధమంగా కన్నుల ద్వారా ఓ రూపాన్ని గ్రహించి చిత్తమందు ఆ చిత్రాన్ని ప్రతిష్టించుకొని సాధన చేయడం సాధకునికి సులభం. ఈ కారణం చేతనే ఋషిపుంగవులు జనోపకారార్ధమై విగ్రహారాధనను తెలిపిరి. (ఉపాసకానాం కార్యార్ధం బ్రాహ్మణో రూపకల్పనా; సాధకానాం హితార్ధాయ బ్రాహ్మణో రూపకల్పనా).
మన ఋషులు నిర్వికల్ప సమాధిలో ఏ బ్రహ్మ రూపాన్ని దర్శించారో దానిని లోకహితార్ధమై అందరూ ఆ రూపాన్ని దర్శించాలన్న తలపుతో రూపకల్పన చేశారు. ఈ విధంగా రూపకల్పన చేయబడిన విగ్రహారాధనలో వివిధ నామార్చన, మంత్ర, యంత్ర పూజాదులచే విశేషమైన దైవశక్తి ఉన్నట్లు మన శాస్త్రాలు తెలుపుతున్నాయి.
మనోధ్యాన శక్తి గల ఋషీశ్వరులు తమ హృదయములందు మానస పూజ చేయు శక్తిమంతులైనప్పటికిని మనకై పరమ ప్రేమతో ఈ విగ్రహారాధన తెలియజేశారు.
చంచలమైన మనస్సుని నియంత్రించి ఒకే వస్తువుపై కేంద్రీకరించడం ఆధ్యాత్మిక సాధకుని మొదట లక్షణం. మనో నిగ్రహంకై సహాయపడేది దైవవిగ్రహారాధన. దైవప్రతిరూపంగా విగ్రహంను భావనాపూర్వకంగా ఆరాదిస్తాడు భక్తుడు. దీనివలన పరమాత్మయందు గురి ఏర్పడి క్రమేపి పరమాత్మజ్ఞానం అలవడుతుంది.

"సురూపాం ప్రతిమాం విష్ణో: ప్రసన్నవదనేక్షణాం /
తామర్చయేత్ తాం యజే త్తాం విచింతయేత్ //

ప్రశస్తమైన రూప, ముఖ, ప్రసన్న నేత్రములుగల విష్ణు రూపంగల ప్రతిమను ఆరాధించి, ధ్యానించాలి.

సగుణరూపారాధన లేనిదే నిర్గుణరూపారాధన సాద్యంకాదు. మనస్సు శుద్ధమై, స్థిరమై, ఏకాగ్రమై అంతర్ముఖమై ఆత్మయందు నిలబడే నిర్గుణోపాసన సగుణోపాసన వలనే సిద్ధిస్తుంది.

అర్చాదౌ అర్చయేత్ తావత్ ఈశ్వరం మాం స్వకర్మకృత్ /
యావత్ న వేద స్వహృది సర్వ భూతేష్వవస్థితమ్ //                                                - శ్రీమద్భాగవతం

ప్రతీ ఒక్కరి  హృదయంలో ప్రకాశిస్తున్న నన్ను సాక్షాత్కారించుకునే వరకూ అంతా తమ తమ విధులను నిర్వర్తిస్తూ, సర్వభూతాలలో లయుడై ఉన్న నన్ను విగ్రహరూపంలో పూజింతురు గాక!

విగ్రహాదిపూజలు అష్టవిధములుగా భాగవత ఏకాదశ స్కంధమందు ఉద్ధవులవారికి శ్రీకృష్ణ పరమాత్ములవారు ఇలా వివరించారు -
'శైలీ దారుమయీ లౌహీ లేప్యా లేఖ్యా చ సైకతీ /
మనోమయీ మణిమయీ ప్రతిమాష్టవిధా స్మృతా //'

శిలావిగ్రహం, దారువు, లోహం, చిత్రం, దర్పణ లిఖితం, మృత్తిక, మనః కల్పితం, రత్న నిర్మితం లని ప్రతిమలు ఎనిమిది విధములుగా ఉన్నవి.

అలానే శ్రీ మధ్భగవద్గీత లో 'యో యో యాంయాం తనుం భక్త్యా శ్రద్ధయార్భితు మిచ్ఛతి' (యే రూపమున భక్తిశ్రద్ధలతో అర్చింపచూస్తారో అట్టి రూపములయందు తానుండి వారిభక్తిని స్థిరం చేస్తాను) అని ఉద్దవునుతో కృష్ణపరమాత్మ అంటారు.

లోకశ్రేయస్సు కాంక్షించిన శ్రీమహావిష్ణువు బ్రహ్మదేవునితో ఇలా అన్నట్లు బ్రహ్మాండపురాణం నందు ఉన్నది -
"బ్రహ్మా! నేను లోకంలో విహరింపగోరుచున్నాను. నీవు చేసిన సృష్టిలో సామాన్య జనులు పరవ్యూహవిభవావతార తత్వాన్ని గ్రహించలేని జడులు కావున ధర్మ సంరక్షణార్ధం, లోక సంరక్షణార్ధం నేను అర్చావతార స్వరూపుడనై విగ్రహరూపం దాల్చి విహరింపగోరుచున్నాను".

విగ్రహారాధన విశిష్టమైనది కాకపొతే శ్రీరాముడు రామలింగేశ్వర ప్రతిష్ట, సీతమ్మవారు సైకత లింగ ప్రతిష్ట ఎందుకు చేసి పూజిస్తారు?

వ్యాసులవారు కాశీ యందు సహస్ర లింగములను ప్రతిష్టించి ఎందుకు పూజించారు?

కపిల, నారద, వసిష్ట, భరద్వాజ, అగస్త్య, భ్రుగు పరుశురాములు మొదలగు మహర్షులు శివకేశవుల ఆలయములను స్థాపించి ఎందుకు పూజించినట్లు?

ఆధ్యాత్మికం అన్నది భక్తి, నమ్మకాల మీదే ఆధారపడి వుంటుంది.

మార్కండేయుడు శివలింగం నందు పరమేశ్వరుడు ఉన్నాడని నిశ్చల భక్తితో పూజించి మృత్యుంజయుడు కాలేదా?

ప్రహ్లాదుడు ఎందెందు చూసిన భగవంతుడు వుంటాడని తన అచంచల నమ్మకంతో నిరూపించలేదా?

భద్రాచలమందు విగ్రహారాధనతో రామదాసు తరించలేదా?

తిరుపతియందు శ్రీవేంకటేశ్వరుని విగ్రహాన్నికాంచి అన్నమయ్య ముక్తిని పొందలేదా?

అలానే శ్రీవేంకటేశ్వరుని పాదారవిందసన్నిధి యందు శ్రీ తరికొండ వెంగమాంబ, హత్తిరాంభావాజీ వారు స్వామిని సేవించగా, స్వామి ప్రత్యక్షమై అభయమొసగలేదా?

విగ్రహారాధన కూడా
చాలా ముఖ్యం. కాబట్టి, ఆ భగవంతుని విగ్రహారాధన మరువకండి.
*******
*🎻🌹🙏పంచబదరీ క్షేత్రములు...*

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌷విశాల బద్రి (బదరీనాథ్),
🌷యోగధ్యాన్ బద్రి,
🌷భవిష్య బద్రి,
🌷వృద్ధ బద్రి మరియు
🌷 ఆది బద్రి (యోగి బద్రి)

🌿శ్రీమహావిష్ణు స్థానములైన 'పంచబదరీ క్షేత్రముల' గురించి తెలుసుకుందాం...

🌸'విష్ణు భగవానుడు' అయిదు విభిన్న పవిత్ర క్షేత్రములలో 'విశాల బద్రి (బదరీనాథ్), యోగధ్యాన్ బద్రి, భవిష్య బద్రి, వృద్ధ బద్రి మరియు ఆది బద్రి' పేరులతో 'పంచబద్రి క్షేత్రములుగా' భారతదేశము నలుమూలల నుండి యాత్రికులను ఆకర్షించుచూ..

🌿హిమాలయములలో  'బదరీనాథ్' మరియు జోషీమత్' పరిసర ప్రాంతములలో వెలుగొందుచున్నాడు.

🌸ఈ అయిదు క్షేత్రములు 'బదరీనాధ్ పుణ్య క్షేత్రముతో' ప్రారంభమై బదరీనాధ్ నకు ఉత్తరముగా 24 కి.మీ. దూరములో కల 'సతోపంత్ హిమానీనదము' దక్షిణమునందు కల 'నందప్రయాగ' 'బదరీ నారాయణుడు' ఈ అయిదు పుణ్య క్షేత్రములలో అయిదు విభిన్న రూపములతో కొలువబడుచున్నాడు.

🌿వేసవి వర్షాకాలములు అనగా జూన్ నెల నుండి అక్టోబరు నెల మాసములు ఈ ఆలయములు సందర్శించుటకు వీలుగా ఉండును.

*🌷(1) విశాల్ బద్రి (బద్రీనాథ్)...🌹*

🌸బద్రీనాథ్ హిమాలయ పర్వతశ్రేణిలో ఉత్తరాఖండ్ రాష్ట్రమునందు 'చామోలి' జిల్లానందు 'చార్ ధామ్' పేరుతో ప్రసిద్ధమైన 'కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి మరియు బధ్రీనాథ్' లలో ఒకటిగా నున్న నగర పంచాయితీ.

🌿'బద్రి' నీలకంఠ తదితర పర్వతా రోహణమూలకు ముఖద్వారము వంటిది. 'బద్రి' అనునది ఈ ప్రాంతమునందు పెరుగు ఒక చిన్న, తినుటకు ఉపయోగపడు రుచికరమైన పండు మరియు 'నాథ్' అనగా భగవంతుడు. పూర్వపు రోజులలో బదరీనాథ్ నడచి వెళ్లవలసి వచ్చేది.

🌸అద్వైత తత్వ ప్రతిపాదకులగు వేదాంతాచార్యులు 'జగద్గురు ఆదిశంకరా భగవత్పాదాచార్యులవారు', 7వ శతాబ్దమునందు బదరీనాథ్ ఆలయమును పునః నిర్మించినారు.

🌿అటుపిమ్మట అనేకమార్లు విదేశీ దండయాత్రలవలననూ ఈప్రాంతములో తరచూ సంభవించు భూకంపముల వలన ఈ ఆలయము దెబ్బతినుట పిమ్మట అనేకమార్లు తిరిగి నిర్మించుట జరిగియున్నది.

🌸విశిష్టాద్వైత తత్వవేత్త భగవద్రామానుజాచార్యుల వారు సైతం ఈ క్షేత్రసందర్శనం గావించిరి. శ్రీవైష్ణవ దివ్యధామములలో 'బద్రినారాయణ' ముఖ్యమైనది.

🌿బదరీనాధ్ పుణ్యక్షేత్రము సముద్రమట్టమునకు సుమారు 12 వేల అడుగుల ఎత్తున ఉన్నది. ఇచటగల తప్తకుండం మరియు సూర్యకుండం అను రెండు ఉష్ణకుండములవలన ఇచ్చట సమఉష్ణోగ్రత సంవత్సర మంతయు ఉండును.

🌸'స్థలపురాణం' ప్రకారం విష్ణుభగవానుడు నరనారాయణఅవతారము నందు బదరీనాథ్ నందు బహిరంగ ప్రదేశమునందు తపస్సు చేసినాడు.

🌿లక్ష్మీ దేవి ఆయనకు వ్యతిరేక వాతావరణ పరిస్థితులు తట్టుకొనుటకుగాను బదరివృక్షము రూపములో  ఆశ్రయము కల్పించినది.

🌸నారద మహర్షి “ఓం నమో నారాయణాయ” అనబడు 'అష్టాక్షరీ మంత్రము'  జపించి తపస్సు చేసినాడు. 'మహా విష్ణువు' జీవరాశులన్నిటి క్షేమమును కోరి ఇక్కడ తపస్సు చేయ నారంభించినాడని ప్రతీతి.

*🌷(2) యోగధ్యాన్ బద్రి 🌹*

🌿'యోగధ్యాన్ బద్రి, కర్ణ ప్రయాగకు 22 కి.మీ. దూరంలోనూ హనుమాన్ చత్తి మరియు గోవింధ్ ఘాట్ నకు దగ్గరలో 'పండుకేశ్వర్' గ్రామమునందు కలదు.

🌸విష్ణు భగవానుడు ధ్యానము నిమిత్తము ఇచట నుండి దీనికి 'యోగధ్యాన్ పండుకేశ్వర్' అని పేరు పెట్టినాడు. ఈ ఆలయము 'గుప్తుల కాలము' నాటిది మరియు సముద్ర మట్టమునకు 6000 అడుగుల ఎత్తున ఉన్నది.

🌿స్థల పురాణము ప్రకారము వేదవ్యాస మహర్షి 'శ్రీమధ్ భాగవతమును' ఇచ్చటనే రచించినాడు. 'జగద్గురు ఆది శంకరాచార్య' ఈ ఆలయములను ప్రపంచవ్యాప్తముగా హిందూమత అభివృద్ధికి అనువైనవిగా ఆమోదించి యున్నారు.

🌸శీతాకాలములో ఆలయము మూసివేయు సందర్భమునందు 'బదరీనాధ్ ఉత్సవమూర్తిని' ఈ ఆలయము నందు ఉంచేదరు. ఈ ప్రదేశమునందు ప్రార్ధనలు చేయనిదే యాత్ర సంపూర్ణము అవదని ప్రజలు నమ్ముతారు.

🌿స్థల పురాణము ప్రకారము పాండురాజు తాను రెండు సంగమములో నున్న లేళ్ళను చంపినందువలన కలిగిన పాపమునుండి విముక్తి పొందుటకు విష్ణుమూర్తిని ప్రార్ధించుటకు తపస్సు చేసినాడు.

🌸'పాండవులు' జన్మించిన పిమ్మట 'పాండురాజు మరణానంతరము' విష్ణుమూర్తి ఇత్తడి విగ్రహము ఇచట ప్రతిష్టించినారు. మరియు కురుక్షేత్ర సంగ్రామమునందు కౌరవులను ఓడించిన పిమ్మట ప్రత్యాత్తాపాన్ని ప్రకటించుటకు ఈచటికి వచ్చినారు.

🌷(3) భవిష్య బద్రి 🌹

🌿జోషీమఠ్ నకు 17 కి.మీ. దూరములో తపోవన్ నకు దగ్గరగాకల 'సుభైన్' గ్రామమున దట్టమైన ఆటవీప్రాంతములో ఈభవిష్యబద్రి ఉన్నది.

🌸భవిష్యత్తులో చెడు ప్రబలి నరనారాయణ పర్వతములు మూసుకు పోయి 'బదరీనాధ్ మార్గము' నిరోధించబడినప్పుడు ఈ 'భవిష్యబద్రి' బద్రినాధ్ గా పరిగణింప బడునని తెలుపబడినది.

🌿భవిష్య బద్రి అందమైన మరియు ఆహ్లాదకరమైన దృశ్యములు వీక్షించకలిగిన లోయ మరియు ఆటవీప్రాంతముతో ముఖ్యమైన పర్యాటకప్రదేశము.

🌸సల్హధార్ వరకు రోడ్డు ప్రయాణము చేసి ఆచటినుండి 6 కి.మీ. పర్వతారోహణముతో 'నరసింహుని విగ్రహము' కుడిగా యున్న బదరీ నారాయణుడు కల ఈ ఆలయము చేరవచ్చును.

*🌷(4) వృద్ధబద్రి 🌹*

🌿'వృద్ధబద్రి (లేదా) బృధబద్రి' జోషీమఠ్ నకు 7 కి.మీ దూరములో సముద్ర మట్టమునకు 13500 అడుగుల ఎత్తులో అనీమత్ వద్దనున్న  పురాతన దేవాలయము.

🌸స్థలపురాణము ప్రకారము విష్ణు భగవానుడు రూపము వృద్ధ మానవుని రూపములో వెలసినాడు.  అందువలన వృద్ధమానవరూపములో నున్న భగవానుని భక్తులు సంవత్సరామంతయూ కొలిచేదరు.

🌿'బద్రీనాథ్' చార్ ధామ్ నందు ఒక పుణ్య క్షేత్రముగా పరిగణింపబదేవరకు విశ్వకర్మచే సృస్థించబడిన ఈ విగ్రహము అర్చించ బడినది. సంవత్సర కాలమంతయు తెరువబడి యుండేడి ఈ ఆలయము తీర్ధ యాత్ర చేయుటకు వీలుగా యుండును. 

*🌷(5) ఆదిబద్రి🌹*

🌸కర్ణప్రయాగకు 17కి.మీ దూరములో పంచబద్రి ఆలయములలో మొదటిదయిన ఈ ఆదిబద్రి ఆలయము ఉన్నది.

🌿శీతాకాలమునందు బద్రినాధ్ ఆలయము మూసివేసినప్పుడు విష్ణుభక్తులు ఇచ్చటనే ప్రార్ధన చేసేదరు. 'ఆదిశంకరాచార్య' ఏడు ఆలయములతో కూడిన ఆలయ సముదాయము ఇచట ప్రారంభించినాడని గుప్తరాజుల కాలములో ఈ ఆలయములు నిర్మించబడినట్లు నమ్మకము.

🌸ఈ ఆలయ సముదాయములో పిరమిడ్ ఆకారములోని వేదికపై  విష్ణు భగవానునికి అంకితం చేయబడిన ప్రధాన ఆలయము నిర్మించిన బడినది.
🌿నల్లరాతితో చెక్క బడిన విష్ణు భగవానుని విగ్రహము చేతులలో కమలము, చక్రము మరియు గద ధరించియుంటుంది.

🌸భవిష్యత్తులో బదరీనాధ్ నకు సమాజములో కల ఉన్నత స్థాయి భవిష్య బద్రినకు కలిగినప్పుడు ఈ ఆలయమును 'యోగిబద్రి' అని పిలిచెదరు...స్వస్తి...🚩
********
🙏🙏🙏🙏🙏🙏🙏
         *శరణాగతి*
🌷🌷🌷🌷🌷🌷🌷

పరమాత్ముడిని పొందాలంటే ప్రాపంచిక ఉనికికి అతీతంగా వెళ్ళగలగాలి. 'ఉన్నది ఒక్క పరమాత్మే' అన్న గ్రహింపుతో ఈశ్వరార్పితం కావాలి. అంటే శరణాగతి కావాలి. శరణాగతి కలిగివుండడం అంత సులువైనది కాదు. అలాగని అసాధ్యం కాదు. శరణాగతితత్వం భక్తితో, కృతజ్ఞతతో, ప్రార్ధనతో ముడిపడి వుంది.

*భక్తి :* భగవంతుని పట్ల ప్రేమే భక్తి. స్వస్వరూప అనుసంధానమే భక్తి. అనన్య దైవచింతనయే భక్తి. సమస్త ఆచార వ్యవహారాలను భగవంతుడికి అర్పించడం భక్తి. ఆత్మానుభవం పొందడానికి ఏ విషయాలైతే ఆటంకాలుగా ఉన్నాయో వాటిని వదిలించుకోవడమే భక్తి. ఇటువంటి భక్తిని దాటి పొందాల్సినది శరణాగతి. భక్తిలో మనస్సు కరిగిపోయి తీవ్రస్థాయికి రావడమే శరణాగతి. అంటే భక్తి యొక్క పరాకాష్ఠస్థితియే శరణాగతి.

*కృతజ్ఞత :* ఉత్కృష్టమైన మానవజన్మనిచ్చి మనమీద అపార దయతో  అన్నీ సమకూర్చుతున్న సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు యందు ప్రేమతో వుండి, తనచే సృజింపబడిన సమస్త సృష్టి యందు ఆ భగవంతుడినే దర్శిస్తూ అన్నివేళల్లో అన్నింటా దయతో ప్రేమతో వుండడమే కృతజ్ఞత.

*ప్రార్ధన :* అంతరంగపు నైర్మల్యాలను తొలగించేదే ప్రార్ధన. ప్రార్ధన అంటే అంతర్యామి ముందు అంతరంగ ఆవిష్కరణ, అంతరశుద్ధికై పవిత్ర ప్రయత్నం, అనంతునికై అంతరంగనివేదన. విషయజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్లగలిగేదే ప్రార్ధన. జీవాత్మను విశ్వాత్మలో విలీనం చేసేదే ప్రార్ధన. అంతేగాని ప్రార్ధన యాచనల వుండకూడదు. భగవంతుడు దగ్గర భక్తుడిగా వుండాలి, భిక్షగాడుగా కాదు.
క్రమేపి భక్తి, కృతజ్ఞత, ప్రార్ధన తదితర అభ్యాసాలని దాటి భక్తుడు, భగవంతుడు అన్న ద్వైతభావమును అధిగమించి ఉన్నది పరమాత్మ యొక్కటే అన్న ఆత్మభావన స్థితికి రావడమే శరణాగతి పొందడం. అయితే నోటితో చెప్పడమంత తేలిక కాదు శరణాగతి.

అసలు శరణాగతి అంటే -
వ్యక్తి భావనను విడిచిపెట్టి పరిపూర్ణంగా ఈశ్వర ఇచ్ఛకు కట్టుబడి వుండుట. అంటే ఈశ్వర సంకల్పమే నా సంకల్పం, ఆయన ఇష్టమే నా ఇష్టం అనే దృఢవిశ్వాసం కలిగియుండుట. ఏ పరిస్థితులలోనైనను, ఏ సంఘటనలయందైనను చలించక చరించక స్థితప్రజ్ఞతో వుండగలగడం. దేహాత్మ బుద్ధిని వదుల్చుకొని ఇతర చింతనలు లేకుండా నిరంతరం ఆత్మచింతనలో ఉండుటయే శరణాగతి. అహంకారాన్ని(నేను అన్న భావాన్ని) దాని పుట్టుక స్థానమైన హృదయంలో నశింపజేయుటయే నిజమైన శరణాగతి. ఈశ్వరుడు లేక ఆత్మ తప్ప వేరేమీ లేదన్న జ్ఞానం, ఆత్మ తప్ప నేను, నాది అంటూ ఏమిలేదన్న అనుభవజ్ఞానం కల్గినప్పుడే శరణాగతి అలవడుతుంది. తన ఉనికికి మూలకారణమైన దానికి తనని తాను అర్పించుకోవడమే శరణాగతి. శరణాగతి చెందిన సాధకునికి సంకల్పాలు, ఇష్టాయిష్టాలు అంటూ వుండవు. ఏది ఎలా వున్నా అంతా పరమాత్మ అనుగ్రహమే, పరమాత్మ మయమే అనే ఆత్మభావనలోనే వుంటాడు. సర్వమూ నీవే, నీ ఇచ్ఛ ప్రకారమే కానివ్వు అనే స్థితిలో ఉంటూ  భగవంతుడు ఏది అనుగ్రహిస్తే దానితోనే పరిపూర్ణ సంతుష్టుడై వుంటాడు. సర్వత్రా సర్వేశ్వరుడునే చూస్తాడు. త్రికరణలతో చేసే ప్రతీ పనికి భగవంతుడే ధ్యేయమై వుంటాడు.

"శరణాగతి, ఆత్మవిచారణ (నేనెవర్ని) రెండూ వేరు వేరు పేర్లున్న అభ్యాసలే అయినా రెండు ఒకటేననీ, ఆత్మ సాక్షాత్కారంకు ఈ రెండే ఉత్తమమైన పద్ధతు"లని  శ్రీ రమణులు అనగా,
రామానుజాచార్యులవారు శరీరం విడిచిపెట్టటానికి సిద్ధంగా వున్న తరుణంలో వారి శిష్యులు అందరూ వారిచుట్టూ చేరి చివరిమాట ఏదైనా చెప్పండి అని అడుగగా -
"నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత శరణాగతి ద్వారా తప్పించి ఇతరత్రా మార్గాలు ద్వారా కూడా మోక్షం వస్తుందని ఎవరైనా చెబితే మీరు వారి మాటలు నమ్మవద్దు" అని రామానుజాచార్యులవారు అన్నారు.

పరిస్థితులు అనుకూలంగా వున్నా, ప్రతికూలంగా వున్నా దీర్ఘశరణాగతిలో నిలబడి వుండాలి. ఆచరణ పూర్వకమైన శరణాగతి చెందినప్పుడే ఈశ్వరానుగ్రహం కల్గుతుంది. శరణాగతి పరిపూర్ణంగా వుంటే పరమాత్ముని పరంపదం పొందడం తధ్యం.   
భక్తి మార్గంలో ముక్తి పొందాలంటే శరణాగతే అందరికి నిజమైన గతి. సాధకుని సాధన భక్తీ కృతజ్ఞతాప్రార్ధనలతో ప్రారంభమై శరణాగతితో ముక్తినిస్తూ ముగుస్తుంది.
******


మాతృమూర్తి ఋణం


ఆదిశంకరాచార్యులవారు సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వేళ్ళే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధ పడింది. 

"శంకరా, నువ్వు నాకు ఏకైక పుత్రుడువి కదా! నన్ను వదలి వెళ్ళి పోతున్నావు,
ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు? 
నాకు దిక్కెవరు "  అని దీనంగా ప్రశ్నించింది.

" అమ్మా! ఏ సమయమైనా సరే,  నీవు తల్చుకుంటే చాలు నీ ముందు వుంటాను."  
అన్నాడు శంకరుడు.

భగవత్పాదులు శంకరాచార్యులవారి తల్లికి మరణకాలం సమీపించింది.  మూసిన కళ్ళు తెరవలేదు. 

"నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు"
అని మనసులోనే  తలుచుకుంటూ వున్నది ఆర్యాంబ.
తల్లి తలచుకుంటున్నదన్న విషయం  ఆదిశంకరులు గ్రహించారు. 
వెంటనే శ్రీకృష్ణుని ధ్యానించారు. 

శ్రీకృష్ణుడు ఏం కావాలని అడిగాడు.
కురుపితామహుడు భీష్మాచార్యునికి  మోక్షమిచ్చినట్లుగా  
నా  మాతృమూర్తికి  మోక్షం ప్రసాదించమని  వేడుకున్నారు శంకరాచార్యులవారు.

అర్యాంబ , తలుచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తపిస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తున్న అలికిడయింది. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో వున్న  ఆర్యాంబ చటుక్కున లేచి శంకరా!  అంటూ , అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని, గట్టిగా హృదయానికి హత్తుకుంది. బాలుని ఒంటి నిండా ఆభరణాలను గమనించిన ఆర్యాంబ‌, శంకరుడు సన్యాసి కదా ! 

యీ ఆభరణాలు ఎలావచ్చాయని  అనుకున్నది. 
బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది ఆర్యాంబ. 
అక్కడ  తను అను నిత్యం పూజించే గురువాయూరు శ్రీకృష్ణుడు  సాక్షాత్కరించి నిలచివుండడం గమనించింది.
గురువాయూరప్పని చూసిన ఆర్యాంబ  మహదానందంతో  
" అప్పా! నోరు తెరిచి, నీ నామజపం చేసే శక్తి కూడా లేని యీ దీనురాలి  ఆఖరిక్షణాలలో  నను చూసేందుకు వచ్చావా? కృష్ణా "   అని మెల్లిగా గధ్గదకంఠంతో  పలికింది. శ్రీకృష్ణుడు  వెంటనే   
"  నీ పుత్రుని ఆదేశం. రాకుండా వుండగలనా ? 
అమ్మను చూడకుండా వుండగలనా "  అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు.
అదే  సమయానికి శంకరాచార్యులవారు కూడా  అక్కడికి వచ్చారు. 
ఉప్పొంగిన  ఆనందంతో  ఆ మాతృమూర్తి శంకరునితో " నాయనా ! 
నా  భాగ్యమేమని చెప్పను ? 
నిన్ను పుత్రుని గా పొంది నేను తరించాను. 
సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావుకదా, శంకరా!" అని కన్నీళ్ళుకార్చింది .

గోపాలుని నేను నిలబెట్టడమేమిటి?
నేను జన్మించినది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు , కష్టాలకు బదులుగా 
నేనేమీ చేయలేకపోయాను. 
సాక్షాత్తు భగవంతుడే మానవరూపంలో పుట్టినా మాతృ ప్రేమకు సాటిగా , ఎంతటి సేవచేసినా  కన్నతల్లి ఋణం అణువంతైనా తీరదు. 

నేనైనా అంతే.  నేను చేయగలిగినదంతా  నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రమాణం ఒక్కటే "అని మాతృదేవత పాదాలముందు మోకరిల్లారు ఆదిశంకరాచార్యులవారు.

మన తల్లి తండ్రుల కు  మనం చేసే సేవల వల్లనే వారి మనసు సంతృప్తిచెంది  
వారి దివ్యాశీస్సులు సదా తమ బిడ్డలకు ప్రసాదిస్తారని జగద్గురు ఆది శంకరాచార్యులవారు ఈ లోకానికి సందేశమిచ్చారు.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ