Posts

Showing posts from January, 2026

05-02-2026

Image
[ [13/02, 09:58] Mallapragada Ramakrishna: 1.సూర్యనారాయణా: మ: ఉదయాద్రిన్ గనిపింపనీవు కరమౌయూర్జస్సుతో మింటి పై     కదులున్ పక్షులు స్వాగతమ్మనుచు నో కంజాప్త! చీకట్లు వే     వదలున్ నీకిరణమ్ములన్ కనిన గుప్తమ్మై గుహామధ్యమున్     సదయుండా!తిమిరారి! కావుమము  నిచ్చన్ సూర్యనారాయణా! --1 మ:కమలమ్ముల్ వికసించు నిన్నుకనినన్, కాసారమందిచ్చతో     భ్రమరమ్ముల్ తిరుగాడు పువ్వులపయిన్ త్రాగంగ పూతేనియల్     కమతమ్ముల్ వడి సాగు క్షేత్రముల బంగారమ్ము పండింపగా      కుముదమ్ముల్ తమి వీడిపోవగను క్రుంగున్ సూర్యనారాయణా! --2- మ: నినుదర్శింప నుషోదయమ్మునలి నో నెత్తమ్మి ప్రాణేశ్వరా       మనుజశ్రేణికి రోగముల్ సమసి భూమారోగ్యమున్ బొందరే        ఘనమౌ నీకిరణమ్ములందునను వ్యక్తమ్మైన సత్వమ్ముతో          దిననాథా! కమలాప్త! నామనుపు నీదే, సూర్యనారాయణా! --3  మ: విరియున్ క్షేత్రములన్నియున్ కురియు నీ వేండ్రమ్ముతో చెచ్చెరన్       ధరపై గ్రోలిన నీరమున్ విడువగా ధాత్రేయిపై వృష్టిగా ...

02-02-2026

Image
  వేడుక వెర్రివేషముల వీనుల విందుల కుప్పి గంతులే   పాడమనేటి యాటలగు పాశము వింతగ హాస్య భావమున్ చీడగ డబ్బు పిచ్చిగను చేష్టలు మీరుచు వాక్కు దూషణల్  పీడగ బుద్ధి తత్వములు పేకగ జూదము మత్తు భూషణన్ వరుస భావార్థం: జీవితం వేడుకల పేరుతో వెర్రి వేషాలు, చెవులకు మధురంగా అనిపించే వినోదాలే—లోతుగా చూస్తే అవి ఖాళీ కుప్పిగంతులు మాత్రమే. ఆటలూ, పాటలూ అన్న ముసుగులో మనిషిని బంధించే పాశం పనిచేస్తుంది— నవ్వు రూపంలోనే బంధనం. డబ్బు మోజు పెరిగి, చేష్టలు హద్దులు దాటుతాయి, మాటలలో విషం, దూషణ విలువల క్షయం ఇక్కడ స్పష్టం. బుద్ధిని పీడించే తత్వాలు, జూదంలా జీవితాన్ని ఆడించడం, మత్తునే అలంకారంగా భావించడం— ఇదే ఆధునిక పతనం. సారాంశంగా: వినోదం పేరుతో వెర్రితనం, స్వేచ్ఛ పేరుతో బంధనం,సంపద పేరుతో పిచ్చి, ఆనందం పేరుతో మత్తు—ఇవన్నీ కలిసిన జీవితం హాస్యంగా కనిపించే విషాదం. ***** ఉ. కోవెల దర్శనం మనసు కోరిక తీరక వాంఛ చెప్పగన్ భావన కర్మగాభవము ప్రార్ధన తీరుగ కోవెలందునన్ రావణ విద్య లీల శివ రామజపంబుగ జేయు చుండగన్ రావణుడేగుదెంచి రఘురామునకున్ బ్రణమిల్లె భక్తుడై భావార్థం / తత్త్వ వివరణ ఆలయ దర్శనానికి వెళ్తాం— కానీ కోరికలు తీర...