8/01..ఉ ఎప్పుడు యేదియెవ్వరు సహాయము యెంచక యేలు బుద్దిగన్ అప్పుడు కాల నిర్ణయము బద్ధుడు యవ్వుట లోక నీతిగన్ ఎప్పుడు లీనమోమనసు యేదియు దీపము చెప్పలేరుగన్ అప్పుడు యాత్మలో కమువిరాజితశాంతిగ జ్ఞానరూపమున్ భావార్థం: ఎప్పుడు మనసు ఎటువంటి ఆధారం, సహాయం, ఆలోచన లేకుండాస్వతంత్ర బుద్ధిగా నిలుస్తుందో,అప్పుడు కాలమూ, విధీ నిర్ణయమూ, లోకనీతీ అన్నీతనపై ప్రభావం చూపలేవు.ఎప్పుడు ఆ మనస్సు లీనమైపోతుందో,అప్పుడు దానిని వెలిగించే దీపమూ అవసరం ఉండదు —ఎందుకంటే అది స్వయంగా చైతన్యప్రకాశ మయమవు తుంది.అప్పుడు ఆత్మలోకమే విరాజిల్లుతుంది, ఆత్మలోకమనే శాంతి, జ్ఞానరూప స్థితి ఏర్పడుతుంది. **** 8/02. మ్. కో ఉంది లేదని వాదనమ్ముయు వు న్నతమ్మగు మాయగన్ పొంది తృప్తియు లెకయుండెడి పువ్వుమాదిరి సత్యమున్ చింద విశ్వము యాత్మ బ్రాంతియు చెంత ముక్తియు నిత్యమున్ ఉంది భావ యభావతీతము వు జ్వలామయ యాత్మగన్ భావార్థం: “ఉంది”, “లేదు” అనే వాదనలన్నీమాయా మనస్సు సృష్టించిన ద్వైత భ్రమలే.సత్యం మాత్రం వాటికి అతీతమైనది —అది పువ్వు లాంటి నిశ్శబ్ద తృప్తితోఏదీ కోరదు, ఏదీ తిరస్కరించదు.విశ్వమన్నది ఆత్మలో ప్రతిబింబమైన భ్రమ మాత్రమే;ఆ బ్రాంతి పక్కనే నిత్యముగానే ముక్తి ఉంటు...