101."పాపపుణ్యాలు సుఖదుఃఖాలుగా ఎలా పరిణమిస్తున్నాయి !?" మనం చేసిన మంచిచెడులే మనకు సుఖదుఃఖాలుగా వస్తాయి. ఈ సత్యాన్ని గుర్తిస్తే మంచి చేయటం, చెడును మానటం అనేవి ఎవరూ చెప్పకుండానే ఆచరిస్తాం. బాణాసురుడు అనే రాక్షసుడు తపస్సుచేసి పుణ్యం సంపాదించాడు. ఆ పుణ్యఫలంతో శివుడినే తన ఇంటికి కాపలాగా ఉంచుకున్నాడు. కానీ బాణాసురుడు చేసిన పాపం కృష్ణుడి రూపంలో అతన్ని వధించడానికి వచ్చింది. ఒకే పరమాత్మ పుణ్యఫలంగా రక్షణకోసం కాపలా ఉంటే, పాపఫలంగా శిక్షించడానికి కూడా వచ్చాడు. పుణ్యఫలం తరిగిపోగానే శివుడు అదృశ్యమయ్యాడు. పాపఫలం అతన్ని సంహరించేలా చేసింది. ధర్మజీవనంలో మనిషికి పాపస్పర్శ ఉండదు. కనుక ఎప్పుడూ దైవానుకూలతే ఉంటుంది. దాన్నే 'ధర్మోరక్షతిరక్షితః' అనే సూత్రంగా చెప్పారు ! *** కోరికలు నశింపజేసుకునే ఉపాయం, సాధన ఏమిటి !?" ప్రపంచంలో అందుబాటులో ఉన్నది అనుభవిస్తూ, దానిపై ఆధారపడని స్థితిని సంపాదిస్తే కోరికలు నశిస్తాయి. కోరికలు లేని మనసు భావాతీత స్థితిలో సుఖదుఃఖాలను సమంగా స్వీకరిస్తూ ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. అదే మనం చేయాల్సిన సాధన, సాధించాల్సిన స్థితి. ప్రపంచంపై ఆధారపడటానికి కారణం మనకు దాని స్వరూపం...
Posts
Showing posts from January, 2024