Posts

Showing posts from June, 2020

. చేయవలసినది- చేయదలచినది

Image
. చేయవలసినది- చేయదలచినది - 1 🌻 ఆరాధన కాకుండా మనం చేసే పని జీవితంలో ఉండరాదు. మనం ఇతర జాతులను చూసినట్లయితే అక్కడ ఆరాధనే విశేషమే కనిపిస్తూ ఉంటుంది.  సామాన్యంగా తెల్లజాతులలో 24 గంటలు వాళ్ళచేసే వ్యాపారం గానీ, వృత్తి గానీ సంఘానికి అంకితంగా, సంకేతంగా, ఆరాధనా విశేషంగా చేయటం ప్రారంభం చేశారు. అందుకని ఆరాధన విశేషాన్ని పునరుద్ధరించుట కొరకు భారతదేశంలో 19వ శతాబ్ధి నుండి మళ్ళీ చాలా చక్కని ప్రయత్నం చేస్తున్న మహాభావులనే పరమగురువులు అని అంటారు.  వారిలో ముఖ్యంగా ఇద్దరు ఇప్పటికి 5 వేల సంవత్సరాల నుండి ఇప్పటివరకు అఖండమైన కృషి ధర్మసంస్థాపనకై చేస్తూ ఉన్నారు. వారే మరువు మహర్షి, దేవాపి మహర్షి.  19వ శతాబ్ధి చివరలో 20వ శతాబ్ది ప్రారంభంలో (తమకు ఉన్న) భౌతిక శరీరంతో Master MORYA, Master KOOT HOOMI అనే పేర్లతో ఉండిరి‌.  హిమాలయములలోని ఒక చిన్న గ్రామము నందుండి వారి శిష్యుడైన జ్వాలాకూలుడను మహనీయుని ద్వారా వాళ్ళు బ్రహ్మ విద్యా సర్వస్వమును వ్యాప్తి చేసి మళ్ళా క్రమశిక్షణను ప్రపంచంలో స్థాపించటానికి ఇచ్చారు.  ఆ ఇచ్చిన మార్గం వేద, ఉపనిషత్ గీతాసమ్మతమైనది. దీనిని సకల జగత్తుకి‌ ఇచ్చిన ఫలితంగ...

*నా పాదాల మీద పడటం‌ కాదు27నక్షత్రముల గాయత్రీ మంత్రాలు

🌻. నా పాదాల మీద పడటం‌ కాదు, నీ పాదాల మీద నీవు నిలబడు. 🌻  ఏడు సంవత్సరములు నిండుదనముగా ఉండుటను అభ్యసించినచో తిండికి, గుడ్డకు ఎన్నడూ లోటు రాదు.   నీ ప్రకారము ధర్మము ఉండదు. ధర్మముము అనుసరించి నీవే నడువవలెను.   ఎవ్వరికిని అడ్డురాకుండా నీ పనిని నీవు సక్రమముగా చేసికొనుము.   నీలో సోమరితనమును పోగొట్టుకొనవలెను. ఇతరులు బాగుపడుచున్నారని, పనులు  చేసుకొనుచున్నారని ఏడ్చుట అసూయను సూచించును. Q 44:--భూమి, దాని ఆరోగ్యం Ans :-- 1) మన దేహం యొక్క ఆరోగ్యం క్షీణించడానికి ఎన్ని కారణాలుంటాయో భూమి యొక్క ఆరోగ్యం క్షీణించడానికి అన్ని కారణాలుంటాయి. 2) యుద్ధాలు కూడా ఒకరకమైన వ్యాధులే, మన దేహానికి వ్యాధి నయమైనట్లే యుద్ధమనే వ్యాధి కూడా కొంతకాలం తర్వాత నయమవుతుంది. యుద్ధం వల్ల జీవితం అంటే ఏమిటో జీవితాన్ని ఎలా గౌరవించాలో ప్రాణం విలువ కూడా తెలుస్తుంది. 3) ప్రకృతి వైపరీత్యాలు వినాశనాన్ని కలుగజేస్తున్నాయని అనుకుంటాం. కానీ అవి మనలో నిద్రాణమై ఉన్న అంతరశక్తిని వినియోగించుకునేందుకు ఉపయోగపడతాయి. వీటిని మనమే సృష్టించినప్పటికి దీనివల్ల కొంతజ్ఞానం వస్తుందని అంతరాత్మకు త...

తేట గీతి నేటి పద్యాలు

Image
అన్నిటికంటే ఉతమైన పుష్పం ... పట్టి పుష్పం   అన్నిటి కంటే తీపిది ఏది  .... గొంతు  సర్వ  శ్రేష్ఠుడైన రాజు ఎవరు ....  ఇంద్రుడు  సూర్యుడు మరియు చెంద్రుడు దృష్టినుండి దాగినది ఏది ..... అంధకారం    "ఓంకార రూప నమకాది సుసూక్త శంభో, శ్రీ గౌరి దేవి హృదయాబ్జ విహార భృంగ ! శ్రీరుద్ర దేవ గురు దక్ష విదర్ప హారిన్ , శ్రీ చంద్రశేఖర విభో శరణం ప్రపద్యే !!! ప్రాంజలి ప్రభ పద్య పుష్పాలు .. తేటగీతి (౨)  రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  పుష్ప పరిమళ ము మనసు తాక గానె హృదయ కలయక కళ వింత శోభ చెంది   పుష్ప మాయకు ఇంద్రియ నిగ్రహమ్ము హింస వదలి యు క్షమ దయ ఆశ్ర యించు మనసు లేని వాడు పూజచేయుటకన్న మాని వేయు చుండు ఉత్త మమ్ము   హృదయ మున్న వాడు పూజచేయుట వల్ల  శాంతి  ధర్మ బుద్ధియు కల్గి యుండు  ఆటవెలది  అయ్యె దేదొ అయ్యె అనకురా మానవా ఉనికి మర్చి ఉండవద్దు నీవు సందియమ్ము తెల్పు బుధ్ధియు మానరా  ఆశలొద్దు అడ్డు మాత్రమోద్దు కుయ్యో మోర్రొ అంటే అడగరెవరనకు  చేయు తప్పు దాచి లేవు నీవు పట్టు...

నారద భక్తి సూత్రాలు 01 to 47

Image
: సశేషం..... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹  🌹. నారద భక్తి సూత్రాలు - 6 🌹  ప్రథమాధ్యాయం - సూత్రము - 4 🌻 4.  యల్లబ్ధ్వా పుమాన్‌ సిద్ధోభవతి, అమృతో భవతి, తృప్తో భవతి 🌻             పరమప్రేమ స్వరూపం, అమృత స్వరూపం అయినట్టి ఈ భక్తిని సాధించిన పురుషుడు సిద్ధ పురుషుడగును, అమరుడగును, తృప్తుడగును.             పురుషుడనగా దేహం అనే పురంలో నివసించే దేహి. దేహానికే స్త్రీ, పురుష లింగ భేదం గాని, దేహి ఎప్పుడూ పురుషుడే. అనగా ప్రకృతి కంటే విలక్షణుడు, ఆ ప్రకృతికి ఆధారం. భక్తుని యందున్న పురుషుడే ఆత్మ. భగవంతునియందున్న పురుషుడు కూడా అదే అఖండాత్మ.  ఈ ఆత్మ దేహమందున్నప్పుడు ''నేను''గా తోస్తుంది. నేను అనే భక్తుడు పరవశించి, మైమరచి, భగవంతునితో కలసి ఏకాత్మగా ఉన్నప్పుడు ఆత్మాను భవం పొందుచున్నాడు.             భక్తుడు భగవత్ప్రేమ అనే సాగరంలో మునిగి తేలుతూ తదేక భావంతో ఉండిపోతాడు. ఇక ఏ ఇతర భావాలూ అతనిలో కలుగవు. అందువలన ఆ భక్తుడు ఆత్మానందుడవుతాడు. జీవ భావాన్ని విడచి...