*నా పాదాల మీద పడటం‌ కాదు27నక్షత్రముల గాయత్రీ మంత్రాలు

🌻. నా పాదాల మీద పడటం‌ కాదు, నీ పాదాల మీద నీవు నిలబడు. 🌻

 ఏడు సంవత్సరములు నిండుదనముగా ఉండుటను అభ్యసించినచో తిండికి, గుడ్డకు ఎన్నడూ లోటు రాదు.  నీ ప్రకారము ధర్మము ఉండదు. ధర్మముము అనుసరించి నీవే నడువవలెను.  ఎవ్వరికిని అడ్డురాకుండా నీ పనిని నీవు సక్రమముగా చేసికొనుము.  నీలో సోమరితనమును పోగొట్టుకొనవలెను. ఇతరులు బాగుపడుచున్నారని, పనులు  చేసుకొనుచున్నారని ఏడ్చుట అసూయను సూచించును.

Q 44:--భూమి, దాని ఆరోగ్యం

Ans :--
1) మన దేహం యొక్క ఆరోగ్యం క్షీణించడానికి ఎన్ని కారణాలుంటాయో భూమి యొక్క ఆరోగ్యం క్షీణించడానికి అన్ని కారణాలుంటాయి.

2) యుద్ధాలు కూడా ఒకరకమైన వ్యాధులే, మన దేహానికి వ్యాధి నయమైనట్లే యుద్ధమనే వ్యాధి కూడా కొంతకాలం తర్వాత నయమవుతుంది. యుద్ధం వల్ల జీవితం అంటే ఏమిటో జీవితాన్ని ఎలా గౌరవించాలో ప్రాణం విలువ కూడా తెలుస్తుంది.

3) ప్రకృతి వైపరీత్యాలు వినాశనాన్ని కలుగజేస్తున్నాయని అనుకుంటాం. కానీ అవి మనలో నిద్రాణమై ఉన్న అంతరశక్తిని వినియోగించుకునేందుకు ఉపయోగపడతాయి. వీటిని మనమే సృష్టించినప్పటికి దీనివల్ల కొంతజ్ఞానం వస్తుందని అంతరాత్మకు తెలుసు, అందుకే వీటిని సంభవించేలా చేస్తున్నాం.
***

 . కుండలినీ మనలో ఎప్పుడెప్పుడు మేలుకుంటుంది? మహర్షులు మనకి ప్రసాదించిన మార్గాలు విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే ఫార్ములాలు 🌹

📚. ప్రసాద్ భరద్వాజ 

విపరీతంగా కోపం భయం కలిగి నప్పుడు నీ శక్తి పదిరేట్లు అధికం అవుతుంది ఎక్కడిది నీకు ఆ శక్తి ఆ సమయంలో ఆవేశంతో కుండలినీ మేలుకుంటుంది. అదే కుండలినీ ధ్యానంలో మేలుకుంటే నీలో శక్తి పెరుగుతుంది..  

కోపముతో ఎంత బరువైన ఎత్తగలరు ఎవరినైనా కొట్టగలరు. ఆ నిముషంలో నీలో ఉన్న యాస్ట్రల్ ఎనర్జీ బయటకు వస్తుంది. అలాగే ప్రాణ భయంతో ఎంత దూరమైన పరిగెడతారు, లేదా ఎంత ఎత్తుకైనా ఎక్కి తప్పించుకుంటారు సాధారణ స్థితిలో ఆ వ్యక్తి కి ఆ శక్తి ఉండదు.. అయితే అలా నిన్ను కష్ట పెట్టినప్పుడు ఆవేశంతో మేలుకునే కుండలినీ ఎక్కువ సేపు సహస్త్రరం లో నిలువదు వెంటనే పడిపోతుంది.. 

అదే కుండలినీ ధ్యానం లో నెమ్మదిగా సాధన ద్వారా  సహస్త్రరం చేరుకుంటే అధిక సమయం నిలువ గలుగుతుంది అదే నీలో శక్తిగా మారుతుంది దివ్య దృష్టి, esp, టేలిపతి, అస్ట్రోల్ జర్నీ ఇవన్నీ ఆ స్థాయిలో నే సాధ్యం అవుతుంది..  

యోగాసనాలు ద్వారా , ప్రాణాయామం ద్వారా , సహజ రాజయోగం ఈ మూడు విధానాలలో కూడా. కుండలినీ జాగృతం అవుతుంది. ఏకదాటిక కొన్ని మంత్రాలు పదే పదే జపించడం ద్వారా ఆ ఏకాగ్రతకు కూడా వారిలో చక్రాలు ప్రచోదనం కలుగుతుంది.. 

ముంఖ్యంగా జపం వల్ల నాడీ వ్యవస్థ లోని లోపాలు సరిచేయబడతుంది.. ఎందుకంటే దైవనామ మంత్రం రూపంలో ఉన్నవన్నీ ప్రకృతిలో ని విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే ఫార్ములాలు. 

ఈ బీజాలు మంత్రాలు సృష్టి ఆరంభం అయిన ఓం శబ్దం నుండి ఉద్భవించినవే అందుకే ఆ శబ్దం మనలో శబ్ద రూపంలో ఉన్న పరా నుండి వైఖరి రూపం వరకు నాలుగు దశలలో మనలో నాట్యం చేస్తు వెలువడే వాక్కు రూపంలో ఉన్న అమ్మవారు ఆ శబ్దంలోనే ఉపాసించబడుతూ ఉంటుంది.. 

మనలో కుండలినీ రూపంలో సహస్త్రరం చేరుకుని జీవాత్మ ప్రమాత్మలో కలిసిపోతుంది.
🌹 🌹 🌹 🌹 🌹

మంత్రజపం: ఇది ఎన్ని విధాలు, దీని వల్ల లాభమేమిటి?

మంత్ర జపం యోగజపం కృత్వ పాప నివారణమ్,
పరం మోక్ష మవాప్నోతి మానుషో నాత్ర సంశయః!

మానవుడు జ్ఞానమునకు నిధి, మంత్ర జపము వలన పాప నివారణ జరుగును.అటువంటి మంత్ర సాధన మానవ జన్మ వలనే సాధ్యమగును. దాని వలనే తత్వ జ్ఞానము సిధ్దించును.

ఇతర జీవులలో జ్ఞాన గుణము లేదు. కేవలం పుణ్యము చేయుట వలనే మనుష్య జన్మ లభించుచున్నది. అటువంటి మనుష్యుడు సాధన చేతనే దేవతా సమానమగుచున్నాడు. దేహము లేనిదే పురుషార్ధము సిధ్ధించదు. కనుక ఈ శరీరమును రక్షించుకొనుచూ జ్ఞాన ప్రాప్తికి సాధన చేయవలెను...

మననం చేయడం వలన కాపాడేది మంత్రం మనస్సుకు చాంచల్య స్వభావం (ఒకచోట ఉండకుండా అనేకరకాలుగా ఏదో ఒకటి చేయాలి చేయాలి అంటూనే వుంటుంది)

ఈ చంచల స్వభావం మానసిక వృత్తులను చిందరవందర చేస్తుంది. ఈ మానసిక వృత్తులు అన్నీ ఒకచోట చేరినప్పుడే అపారమైన శక్తి ఒకచోట చేరుతుంది. అప్పుడు ఆ శక్తి దైవశక్తి వలె పనిచేయడం ప్రారంభిస్తుంది. మంత్రానికి అంతఃకరణానికి సంబంధం వుంది.

మంత్రజపం వలన మనస్సుని వశపరచుకోవచ్చు. నాడీ శుద్ధి జరుగుతుంది.

కుండలిని శక్తి జాగృతమౌతుంది. వ్యాధులు దూరమౌతాయి. మంత్ర సాధన వల్ల దేవతలు తమకు తామై దిగివస్తారు. నానావిధ సిద్ధులు సిద్ధిస్తాయి. మంత్రజప సాధన వలన సిద్ధులు కలుగుతాయని యోగా దర్శనం చెబుతుంది

ఎందరో మునులు, ఋషులు ఈమంత్రజపం వలనే సిద్ధులు సాధించారు.

సాధన వలన అధర్మపరుడిని ధర్మపరుడిగా, దానవుణ్ణి మానవునిగా, పాషండుని సదాచార పరాయనునిగా, దుఃఖ వంతుడిని, సుఖవంతుడిగా, కోపిని శాంతునిగా, ధరిద్రుడిని ధనవంతుడిగా, లోభిని త్యాగిగా, కాముని, జితేంద్రియునిగా, నాస్తికుడిని ఆస్తికుడిగా, తెజోవిహీనుడిని తేజోవంతునిగా, రోగిని ఆరోగ్యవంతునిగా, చేస్తుంది.

అంధకారం నుండి ప్రకాశం వైపు మృత్యువు నుండి అమృతం వైపు, నరకం నుండి స్వర్గం వైపు, హింస నుండి అహింస వైపు, దిర్భుద్ధి నుండి సద్బుద్ధి వైపు,తీసుకొనిపోతుంది. మంత్రమే దేవతా రూపాన్ని పొంది అత్మసక్షాత్కారాన్ని కలిగిస్తుంది.

జపం అనేది మూడు విధాలు

1.బాహ్య జపం 2.ఉపాంశు జపం 3.మానసికజపం

1.బాహ్య జపం

ఒక జపమాల తీసుకుని దానిని ఒక నామాన్నో లేక మంత్రాన్నో ఉచ్ఛరిస్తూ కనుక విధిగా అభ్యాసం చేసినట్లైతే అది బాహ్య జపం !!

2.ఉపాంశు జపం

ఈ దశలో జపం జరిగే సమయంలో మాల తిరుగుతుంది, పెదవులు కదులుతుంటాయి కాని శబ్దం బయటకు వినపడకుండా సాగుతుంది !!

3.అంతరంగ జపం

ఇక్కడ ఈ స్థితిలో జపం నిరంతరాయమానముగా కొనసాగుతూనే ఉంటుంది ...

జపమాల తిరుగుతూనే ఉంటుంది కాని పెదవులు నాలుక కదలవు కేవలం మనసులో మాత్రమే నామస్మరణ (మంత్ర జపం) సాగుతూ ఉంటుంది

జపంతో నిరంతరం భగవన్నామ స్మరణ చేయడం వల్ల, పరిపరి విధాలా పరుగులుదీసే ఇంద్రియాలు స్థిమితపడతాయి. మనం ఏ మంత్రాన్నైతే జపిస్తున్నామో అది మన మనసులోకి అంతకంతకూ గాఢంగా చొచ్చుకుపోతుంది. తొలుత బలవంతంగా కనిపించే ఈ ప్రక్రియ ఒక సాధనగా మారిపోతుంది.

ఇలా కొన్నాళ్లు సాధన చేసిన పిమ్మట సాధకుడు 'అజపజపం' అనే స్థితిని చేరుకుంటాడు. అంటే జపం చేయకున్నా కూడా మనసులోని ఒక భాగంలో నామస్మరణ నిర్విరామంగా సాగిపోతూనే ఉంటుంది.

మిగతా జీవుల సంగతేమో కానీ మనిషికి శబ్దానికీ మధ్య గాఢమైన సంబంధం ఉంది. మనిషి శబ్దం ద్వారానే తన భావాలను వ్యక్తపరుస్తాడు. శబ్దాన్ని వినడం ద్వారానే ఎదుట ఏం జరుగుతోందో అవగతం చేసుకుంటాడు. మనిషి వినే మాటకి అనుగుణంగా అతనిలోని మనసు ప్రతిస్పందిస్తుంది.

ఈ సృష్టి యావత్తూ ఓంకారం అనే శబ్దం నుంచి ఉత్పన్నం అయిందన్న వాదనలు హిందూ ధర్మంలో వినిపిస్తుంటాయి. అలాంటి శబ్దాన్ని ఉపాసించడం ద్వారా మనసుని లయం చేసుకోవడమే జపంలోని అంతరార్ధం.

అది నిర్విరామంగా సాగినా, జపమాల సాయంతో సాగినా.... మన జీవితాన్ని దైవ చైతన్యంతో అనుసంధానం కావడానికి, తనను తాను తరింప చేసుకోవడానికి ఒక నామాన్ని తలచుకోమని చెప్పడమే జప/మంత్ర సాధనలోని పరమార్థం.

మౌన యోగి

🌻 7. సా నకామయమానా, నిరోధ రూపత్వాత్‌  - 2 🌻

ఎప్పుడైతే శుభవాసన వృత్తిగా మారుతుందో, అప్పుడు ఆత్మకున్న ఆవరణ కొద్దికొద్దిగా తొలగడం ప్రారంభమై పరమాత్మతో ఒక్కటయ్యేదాకా భక్తిని పెంపొందించు కుంటుంది. అన్ని విధాలైన అడ్డంకులను తొలగించుకుంటూ పోతుంది.

            మొదట అది కారణంతో కూడిన భక్తిగా ఉదయించి, గౌణభక్తి అని పిలువబడుతుంది. క్రమంగా భగవదైక్యం జరిగే సరికి అది ముఖ్య భక్తిగా పరిణ మిస్తుంది. 

ఐక్యతాసిద్ధితో పరాభక్తి అని పిలువబడుతుంది. ఇక్కడ ఆత్మ అంటే వ్యవహారంలో ''నేను''గా తోచిన పురుషుడు. ఆ నేనే సాధకుడు, లేక భక్తుడు.   

            ఆధ్యాత్మయోగేన వివిక్త సేవయా ప్రాణేంద్రియాత్మాభిజయేన సధ్య్రక్‌
            సచ్ఛ్రద్ధయా బ్రహ్మచర్యేణ శశ్వ దసంప్రమాదేన యమేన వాచాం
            కర్మాశయం హృదయగ్రంథి బంధ మవిద్యయాసాదితమప్రమత్తః
            అనేన యోగేన యథోపదేశమ్‌ సమ్యగ్వ్య పోహ్యోపరమేతం యోగాత్‌
-ఋషభుని ఉపదేశం

తా|| వివిక్త సేవ, ఆధ్యాత్మ యోగం, ఇంద్రియ ప్రాణ, మనో నిగ్రహం, శ్రద్ధ, బ్రహ్మచర్యం, యమం, నియమం, వీటిచే అవిద్యా గ్రంథి విడిపోగా, సమాధి స్థితిలో లింగదేహ భంగమును ఏ భక్తుడు సాధించి నిష్క్రమిస్తాడో వాడే సాయుజ్యం చెందినవాడు. వాడే పరాభక్తుడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

🌻. శాశ్వతసత్యము ఎవరి ధ్యానమును‌ బట్టి వారికి గోచరించును. 🌻

 ఉన్నదే సత్యముగాని గోచరించునది సత్యము కాదు. భావము నిశ్చలమైనపుడు ఎవరి భావనను బట్టి వారికి సత్యము గోచరించును.  

కర్తవ్యము ‌మనస్సును పవిత్రము చేసి‌ సంఘమునకు సుఖమును కలిగించును. సంఘము సుఖవంతము కావలెననియు దానికై తాను పాప విముక్తమైన మనస్సును పొందవలెననియు పాత్రత కలవాడు యోగించును. 

తాను సుఖవంతుడు కావలెననియు, ప్రజలు పవిత్రులు కావలెననియు కోరునట్టి మనస్సు కలుషితమైనది. 

అది మహాపదలను పుట్టించును. అట్టి సంఘమున నివసించువారికి మహాపదలు తప్పవు. ఈ స్థితి నుండి నిరంతరము రక్షింపబడుటకే యోగాభ్యాసము. 

~~ యజ్ఞార్థ కర్మ, యజ్ఞార్థ బుద్ధి యొక్క సద్వినియోగమునందు దృష్టి చెదురుట కలిధర్మములలో మొదటిది.
✍. మాస్టర్ ఇ.కె.🌻

🌹. సాధనా చతుష్టయ సంపత్తి కలిగిన వాడు సాధకుడు.  సర్వ సమత్వము కలగనిదే ఆత్మ సాక్షాత్కార జ్ఞానమును పొందుట అసాధ్యము. 🌹 
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ గారు
చలాచల బోధ... 

నిత్యానిత్య వస్తు వివేకము అంటే ఏది నిత్యమో , ఏది అనిత్యమో పరిశీలించి ఆచరణలో నిత్యమైన దానిని ఆశ్రయించుట, అనిత్యమైన దానిని నిరసించుట.

నిత్యము అంటే మార్పు చెందనిది, శాశ్వతమైనది , సర్వ కాల సర్వ అవస్థల యందు ఉండునది.
అనిత్యము అంటే  మార్పు చెందేది, రాకడ పోకడ కలిగినది, చలించేది.

నిత్యానిత్య వస్తు వివేకము ద్వారా నీకు స్ఫురించే వాటిని పరిశీలించి అనిత్యమైన వాటిని దానికి వ్యతిరేఖమైన భావన చేయుట ద్వారా  నీ భావనలో వాటిని నిరసించ గలగాలి. 

ఏ వాక్యములను  స్వీకరిస్తే అవి నిరసించ బడతాయో ఆ వాక్యములను, ఆ భావనలను  స్వీకరించాలి.

సృష్టి ఎప్పుడు  సమతుల్యముగానే ఉంటుంది. ఎవరైనా సమతుల్యతను కోల్పోయి జీవిస్తూ ఉంటే వారికి దానికి వ్యతిరేఖమైన పరిస్థితులను కల్పించి గుణ పాఠము నేర్పుట ద్వారా సరియైన త్రోవలో పెడుతుంది. అదే పరిణామ పాఠము అంటే. 

కనుక నీవే దానిని  తెలిసికొని సాధన ద్వారా సమత్వమును పొందుటకు ప్రయత్నిస్తే త్వరగా నీకు సమత్వము కలుగుతుంది. సర్వ సమత్వము కలగనిదే ఆత్మ సాక్షాత్కార జ్ఞానమును పొందుట అసాధ్యము. 

నీలో ఉన్న ఆత్మ, నీవై ఉన్న ఆత్మ నీకు తెలియక పోవడానికి కారణము బేధభావనయే. ఈ  బేధభావనను అధిగమించి నీ నిత్య జీవితములో నీవు సర్వ సమత్వమును పొందవలెను.  

సర్వ సమత్వమును పొందిన వాడే జ్ఞాన ఉపదేశమును పొందుటకు అర్హుడు మరియు తెలిసికొనిన జ్ఞానము నందు నిలిచి జీవించ గలుగుతాడు.

శ్రీ రామకృష్ణ పరమహంస వద్దకు ఒకరు ఉపదేశము పొందుటకు వస్తారు. శ్రీ రామకృష్ణ పరమహంస వీధి చివర ఉన్న వాని వద్దకు పోయి ఉపదేశము పొందు అని చెబుతారు. 

వీధి చివర ఒకరు చెత్త కుప్ప వద్ద  కుక్కతో కలసి ఒకే విస్తరలో ఆహారము స్వీకరిస్తూ ఉంటారు. ఉపదేశమును పొందుటకు వచ్చిన వాడు ఆ సన్నివేశము చూచి ఇతని వద్దనా నేను ఉపదేశమును పొందవలసినది అని ఆశ్చర్య పోతాడు. 

కాని పరమహంస అంతటి వారు ఈయన వద్దకు పంపారు అంటే తప్పక రహస్యము ఏదో ఉండి ఉంటుంది అని భావించి ఆ  విస్తరలో ఆహారము స్వీకరిస్తున్న వానిని సమీపించి అయ్యా నన్ను పరమహంస   మీ వద్దకు ఉపదేశము పొందుటకు పంపారు అని తెలియ చేశాడు.

ఆయన  ఉపదేశము పొందుటకు  వచ్చిన వానిని చూచి నీ వద్ద కమండలములో ఏమి ఉన్నది అని ప్రశ్నించారు?
పవిత్ర గంగా జలము అని సమాధానము చెప్పాడు.

ఈ పక్క  కాలువలో ప్రవహిస్తున్నది ఏమిటి అని ప్రశ్నించారు?
ఛీ! మురికి నీరు అని సమాధానము చెప్పాడు.

పవిత్ర గంగా జలము, ఈ మురికి నీరుకు ఎప్పుడు నీకు బేధము స్పురించుట పోయి ఒక్కటిగా తోస్తాయో  అప్పుడు నీవు ఉపదేశము పొందుటకు రా అని చెప్పి పంపుతారు,

కనుక సర్వసమత్వ భావనయే ఉపదేశము పొందుటకు  అర్హత. అప్పుడే నీకు ఉపదేశము పొందిన వెంటనే ఆత్మ సాక్షాత్కార జ్ఞానము కలుగుతుంది.

విత్తనములు వేయకమునుపు రైతు భూమిని దున్ని సిద్ధము చేసికొనిన విధముగా సాధకుడు ఆత్మ జ్ఞాన ఉపదేశమును పొందే మునుపు సర్వసమత్వ భావనను పొంది సంసిద్ధమై ఉండవలెను,

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. కొంత మంది వికలాంగులుగా ఎందుకు పుడుతున్నారు?  ఇంద్రియములను నియమము తప్పి వినియోగించిన అవి బలహీన మవుతాయి, అది సృష్టి నియమము. 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ గారు
చలాచల బోధ... 

ఎవరైనా సృష్టి నియమమునకు వ్యతిరేఖముగా, ఇంద్రియములను ప్రకృతికి విరుద్ధముగా ఉపయోగించ కూడని విధముగా ఉపయోగించిన , సృష్టి సంక్షోభమునకు వినియోగించిన, ఆయా  ఇంద్రియ లోపములు ఏర్పడతాయి. ఇంద్రియములను నియమము తప్పి వినియోగించిన అవి బలహీనమవుతాయి, అది సృష్టి నియమము. 

అందువలనే పెద్దలు సాధ్యమైనంత వరకు భగవంతుడు అనుగ్రహించిన ఇంద్రియములను మంచి పనులు (సత్కర్మలు)  చేయుటకే వినియోగించండి, ఎవివరికి కీడు లేక హాని తలపెట్టవద్దు  అని చెబుతారు.

ప్రతి ఒక్కరు ఆత్మ స్వరుపులే, కాని ఆ జ్ఞానము పంచకోశములచే కప్పబడినది. నేను ఆత్మ స్వరూపుడను , సాక్షిని అని మరచి అజ్ఞానముతో ప్రవర్తిస్తున్నాము. దారిలేని సందులోనికి వెడితే కాని నీకు ఈశ్వర స్పురణ కలుగదు.  

అంటే నీకు బయటపడే అవకాశమే లేదు , అన్యధా శరణం నాస్తి అన్నప్పుడే నీకు ఈశ్వర స్పురణ లేక ఆత్మ స్పురణ కలిగే అవకాశము ఉన్నది.

పంచ కోశములు బాహ్యములో లేవు నీ భావనలో ఉన్నవి. కనుక నీ భావనలో వాటిని త్రోసివెయ్యి. సాక్షిగా నిలబడు.
అప్పుడు విషయముల ప్రభావము, ఇంద్రియముల  ప్రభావము, పంచ కోశముల ప్రభావము, మూడు అవస్థల ప్రభావము నీపై ఉండదు
ఇంద్రియములన్నియు నీకు పనిముట్లుగా ఉపయోగపడతాయి. 

నీవు ఉపయోగించేవాడవు అవుతావు.
స్థూల వ్యవస్థలో ఎట్లాగైతే ప్రభుత్వము, అధికారులు, పరిపాలనా యంత్రాంగము ఉన్నదో అలాగే సూక్ష్మములో ఇంద్రియములను నడిపించే వ్యవస్థను ఇంద్రియ  అధిష్టాన దేవతలుగా చెబుతారు.మనస్సుకు చంద్రుడు, కన్నుకు సూర్యుడు ఇలా ప్రతి ఇంద్రియముకు ఒక అధిష్టాన దేవతను చెబుతారు. వారి యొక్క అనుగ్రహముచే ఆయా ఇంద్రియములు పనిచేస్తున్నాయి.

అలాగే  సృష్టిలేని స్థితినుండి సృష్టి రావడానికి బ్రహ్మ,    వచ్చిన సృష్టిని నడుపుటకు విష్ణువు,  వచ్చిన సృష్టి అంతకు ముందు ఉన్న స్థితికి పోవుటకు రుద్రుడును కారణముగా చెబుతారు.

బ్రహ్మ సృష్టించుటకు ఇచ్చాశక్తిని, విష్ణువు పోషించుటకు క్రియా శక్తిని, రుద్రుడు సృష్టికి ముందున్న స్థితికి తీసికొని వెల్లవలెననిన  సృష్టికి పూర్వమున్న స్థితికి సంబంధించిన జ్ఞానము కలిగి ఉండవలెను. కనుక రుద్రుడు జ్ఞాన శక్తిని వినియోగించి సృష్టి స్థితి లయములను నడుపుచున్నారు అని చెబుతారు.
🌹 🌹 🌹 🌹 🌹

--***---

పొంది ఊరక ఉన్నవాడు - జ్ఞాని.

పొంది బోధించేవాడు - విజ్ఞాని.

పొంది మరచిన వాడు - అజ్ఞాని.

✨⚡️✨⚡️✨⚡️

పుట్టకముందు - మల మూత్రాల మధ్య పెరుగుతాడు.

మరణించాక - చితి మంటల మధ్య కాలుతాడు.

మధ్యలో - నేను, నాది ల మధ్యలో నలుగుతాడు.

✨⚡️✨⚡️✨⚡️

శిష్యుడు:- స్థిమితంగా ఉండలేకపోవడానికి కారణం ఏమి?

గురువు:- నీకు ఉన్నది 'వద్దు' అనుకోవడం, నీకు లేనిది 'కావాలి' అనుకోవడం.

🕉🌞🌎🌙🌟🚩
: 🌹. మనోశక్తి  - Mind Power  - 44 🌹
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 

Q 44:--భూమి, దాని ఆరోగ్యం

Ans :--
1) మన దేహం యొక్క ఆరోగ్యం క్షీణించడానికి ఎన్ని కారణాలుంటాయో భూమి యొక్క ఆరోగ్యం క్షీణించడానికి అన్ని కారణాలుంటాయి.

2) యుద్ధాలు కూడా ఒకరకమైన వ్యాధులే, మన దేహానికి వ్యాధి నయమైనట్లే యుద్ధమనే వ్యాధి కూడా కొంతకాలం తర్వాత నయమవుతుంది. యుద్ధం వల్ల జీవితం అంటే ఏమిటో జీవితాన్ని ఎలా గౌరవించాలో ప్రాణం విలువ కూడా తెలుస్తుంది.

3) ప్రకృతి వైపరీత్యాలు వినాశనాన్ని కలుగజేస్తున్నాయని అనుకుంటాం. కానీ అవి మనలో నిద్రాణమై ఉన్న అంతరశక్తిని వినియోగించుకునేందుకు ఉపయోగపడతాయి. వీటిని మనమే సృష్టించినప్పటికి దీనివల్ల కొంతజ్ఞానం వస్తుందని అంతరాత్మకు తెలుసు, అందుకే వీటిని సంభవించేలా చేస్తున్నాం.
🌹 🌹 🌹 🌹 🌹
 . కుండలినీ మనలో ఎప్పుడెప్పుడు మేలుకుంటుంది? మహర్షులు మనకి ప్రసాదించిన మార్గాలు విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే ఫార్ములాలు 🌹

విపరీతంగా కోపం భయం కలిగి నప్పుడు నీ శక్తి పదిరేట్లు అధికం అవుతుంది ఎక్కడిది నీకు ఆ శక్తి ఆ సమయంలో ఆవేశంతో కుండలినీ మేలుకుంటుంది. అదే కుండలినీ ధ్యానంలో మేలుకుంటే నీలో శక్తి పెరుగుతుంది..  

కోపముతో ఎంత బరువైన ఎత్తగలరు ఎవరినైనా కొట్టగలరు. ఆ నిముషంలో నీలో ఉన్న యాస్ట్రల్ ఎనర్జీ బయటకు వస్తుంది. అలాగే ప్రాణ భయంతో ఎంత దూరమైన పరిగెడతారు, లేదా ఎంత ఎత్తుకైనా ఎక్కి తప్పించుకుంటారు సాధారణ స్థితిలో ఆ వ్యక్తి కి ఆ శక్తి ఉండదు.. అయితే అలా నిన్ను కష్ట పెట్టినప్పుడు ఆవేశంతో మేలుకునే కుండలినీ ఎక్కువ సేపు సహస్త్రరం లో నిలువదు వెంటనే పడిపోతుంది.. 

అదే కుండలినీ ధ్యానం లో నెమ్మదిగా సాధన ద్వారా  సహస్త్రరం చేరుకుంటే అధిక సమయం నిలువ గలుగుతుంది అదే నీలో శక్తిగా మారుతుంది దివ్య దృష్టి, esp, టేలిపతి, అస్ట్రోల్ జర్నీ ఇవన్నీ ఆ స్థాయిలో నే సాధ్యం అవుతుంది..  

యోగాసనాలు ద్వారా , ప్రాణాయామం ద్వారా , సహజ రాజయోగం ఈ మూడు విధానాలలో కూడా. కుండలినీ జాగృతం అవుతుంది. ఏకదాటిక కొన్ని మంత్రాలు పదే పదే జపించడం ద్వారా ఆ ఏకాగ్రతకు కూడా వారిలో చక్రాలు ప్రచోదనం కలుగుతుంది.. 

ముంఖ్యంగా జపం వల్ల నాడీ వ్యవస్థ లోని లోపాలు సరిచేయబడతుంది.. ఎందుకంటే దైవనామ మంత్రం రూపంలో ఉన్నవన్నీ ప్రకృతిలో ని విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే ఫార్ములాలు. 

ఈ బీజాలు మంత్రాలు సృష్టి ఆరంభం అయిన ఓం శబ్దం నుండి ఉద్భవించినవే అందుకే ఆ శబ్దం మనలో శబ్ద రూపంలో ఉన్న పరా నుండి వైఖరి రూపం వరకు నాలుగు దశలలో మనలో నాట్యం చేస్తు వెలువడే వాక్కు రూపంలో ఉన్న అమ్మవారు ఆ శబ్దంలోనే ఉపాసించబడుతూ ఉంటుంది.. 

మనలో కుండలినీ రూపంలో సహస్త్రరం చేరుకుని జీవాత్మ ప్రమాత్మలో కలిసిపోతుంది.
🌹 🌹 🌹 🌹 🌹
Only admins can send messages

🌹. మనోశక్తి  - Mind Power  - 43 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 

Q 43:--కరువుకాటకాలు, ప్రాణాంతక వ్యాధులు, విప్లవాలు ఎందుకు సంభవిస్తాయి?

Ans :-- కరువు కాటకాలు
Spiritual cause:--
ప్రాణం అంటే విలువ లేనిదిగా భావించే ప్రాంతంలో, పగ ప్రతీకారం లాంటి భావనలు వుండే ప్రాంతాల్లో కరువుకాటకాలు సంభవిస్తాయి.

🌻. ప్రాణాంతక వ్యాధులు:--
Spiritual cause:--

1) ఒక ప్రాంతంలో నివసిస్తున్న మానవజాతికి ప్రత్యేకంగా ఆడవారికి ఓర్పు,సహనం నేర్పేందుకు ప్రాణాంతక వ్యాధులు ప్రబలి అవి లక్షల మందికి సంక్రమించడం జరుగుతుంది. వారికి ఆత్మహత్య ధోరణి గనక ఉంటే వారు మరణించడం కూడా జరుగుతుంది.

🌻. విప్లవాలు :--
Spiritual cause:--

1) మానవ జాతిలో అణిచిపెట్టబడిన emotions, feelings బాహ్యంగా ప్రకటితం అయ్యేందుకు విప్లవాలు సంభవిస్తాయి. 

2) మన భావనలలో కసి,ప్రతీకారం చోటు చేసుకున్నప్పుడు ఆ విప్లవాలు హింసాత్మకంగా మారుతాయి.

3) car engine ఎక్కువ వెడైతే చల్లార్చడానికి నీళ్లు ఎంత అవసరమో మానవ జాతిలో భావోద్వేగాలు చెలరేగినప్పుడు వాటిని బాలన్స్ చేయడం కూడా అవసరం.ప్రకృతి వైపరీత్యాలు, epedimic diseases ప్రకృతిని సమతుల్యం చేయడానికి వస్తుంటాయి.

4) వీటినే energy baths అంటారు. స్నానంతో మనం దేహాన్ని ఎలా శుద్ధి చేసుకుంటామో, భూమి ప్రకృతి సమతుల్యం చేసుకోవడానికి ప్రళయాలు సృష్టించుకుంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. 75 🌹

 ఏదైనా ఒక‌ మంచిపని మీ‌ వల్ల ఇంకొకరికి జరుగుతుందంటే దానిని చేయండి! జరగలేదంటే మనకు సంబంధించినది కాదు. 

 సుఖపడ దలచుకున్నవానికి నాగరికత బానిసగా పనిచేస్తుంది. అంతేగాని, నాగరికత మాత్రమే సుఖమునివ్వజాలదు. 

 నీకు సంబంధించినవి ఏమైనా పోయినచో వాటి కోసం వెను తిరిగి చూడకుండా ఉండగలగాలి! అప్పుడే బ్రహ్మవిద్యకు అర్హుడవు. 

 దేని యందు ముడిపెట్టుకున్నా అది ప్రేమ కాదు. దానిని మమకారమంటారు. 

 ఎదుటి వారిలోని సద్గుణాలతో మాత్రమే మనకు సంబంధము. దుర్గుణాలతో సంబంధం పెట్టుకుంటే మన సుఖమునకు మనము అభ్యంతరాన్ని ఏర్పరచుకుంటున్నట్లు.  

ఆలోచనలను తగ్గించుకొని, సత్కర్మలను ఆచరించడం వల్ల మానసికమైన దుఃఖాలు తొలగిపోతాయి. తత్కారణంగా సత్వశుద్ధి కలుగుతుంది. 
.....✍ 
: 🌹. కొంత మంది వికలాంగులుగా ఎందుకు పుడుతున్నారు?  ఇంద్రియములను నియమము తప్పి వినియోగించిన అవి బలహీన మవుతాయి, అది సృష్టి నియమము. 🌹

ఎవరైనా సృష్టి నియమమునకు వ్యతిరేఖముగా, ఇంద్రియములను ప్రకృతికి విరుద్ధముగా ఉపయోగించ కూడని విధముగా ఉపయోగించిన , సృష్టి సంక్షోభమునకు వినియోగించిన, ఆయా  ఇంద్రియ లోపములు ఏర్పడతాయి. ఇంద్రియములను నియమము తప్పి వినియోగించిన అవి బలహీనమవుతాయి, అది సృష్టి నియమము. 

అందువలనే పెద్దలు సాధ్యమైనంత వరకు భగవంతుడు అనుగ్రహించిన ఇంద్రియములను మంచి పనులు (సత్కర్మలు)  చేయుటకే వినియోగించండి, ఎవివరికి కీడు లేక హాని తలపెట్టవద్దు  అని చెబుతారు.

ప్రతి ఒక్కరు ఆత్మ స్వరుపులే, కాని ఆ జ్ఞానము పంచకోశములచే కప్పబడినది. నేను ఆత్మ స్వరూపుడను , సాక్షిని అని మరచి అజ్ఞానముతో ప్రవర్తిస్తున్నాము. దారిలేని సందులోనికి వెడితే కాని నీకు ఈశ్వర స్పురణ కలుగదు.  

అంటే నీకు బయటపడే అవకాశమే లేదు , అన్యధా శరణం నాస్తి అన్నప్పుడే నీకు ఈశ్వర స్పురణ లేక ఆత్మ స్పురణ కలిగే అవకాశము ఉన్నది.

పంచ కోశములు బాహ్యములో లేవు నీ భావనలో ఉన్నవి. కనుక నీ భావనలో వాటిని త్రోసివెయ్యి. సాక్షిగా నిలబడు.
అప్పుడు విషయముల ప్రభావము, ఇంద్రియముల  ప్రభావము, పంచ కోశముల ప్రభావము, మూడు అవస్థల ప్రభావము నీపై ఉండదు
ఇంద్రియములన్నియు నీకు పనిముట్లుగా ఉపయోగపడతాయి. 

నీవు ఉపయోగించేవాడవు అవుతావు.
స్థూల వ్యవస్థలో ఎట్లాగైతే ప్రభుత్వము, అధికారులు, పరిపాలనా యంత్రాంగము ఉన్నదో అలాగే సూక్ష్మములో ఇంద్రియములను నడిపించే వ్యవస్థను ఇంద్రియ  అధిష్టాన దేవతలుగా చెబుతారు.మనస్సుకు చంద్రుడు, కన్నుకు సూర్యుడు ఇలా ప్రతి ఇంద్రియముకు ఒక అధిష్టాన దేవతను చెబుతారు. వారి యొక్క అనుగ్రహముచే ఆయా ఇంద్రియములు పనిచేస్తున్నాయి.

అలాగే  సృష్టిలేని స్థితినుండి సృష్టి రావడానికి బ్రహ్మ,    వచ్చిన సృష్టిని నడుపుటకు విష్ణువు,  వచ్చిన సృష్టి అంతకు ముందు ఉన్న స్థితికి పోవుటకు రుద్రుడును కారణముగా చెబుతారు.

బ్రహ్మ సృష్టించుటకు ఇచ్చాశక్తిని, విష్ణువు పోషించుటకు క్రియా శక్తిని, రుద్రుడు సృష్టికి ముందున్న స్థితికి తీసికొని వెల్లవలెననిన  సృష్టికి పూర్వమున్న స్థితికి సంబంధించిన జ్ఞానము కలిగి ఉండవలెను. కనుక రుద్రుడు జ్ఞాన శక్తిని వినియోగించి సృష్టి స్థితి లయములను నడుపుచున్నారు అని చెబుతారు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 74 🌹
🌻. అవకూడని పనులను తలపెట్టడం  అవివేకం. 🌻

🌞. కోరికలు తీరుట అనగా అవి లేకుండా పోవడమే! కోరిక కన్నా పైన ఉండాలి. వాటిని కోసివేయుట కాదు. కోరని వానికి అన్ని కోరికలు తీరును. కోరే స్వభావం పోవాలి.   

🌻. కుటుంబ పరమైన బాధ్యతలను, విధులను మాత్రమే నిర్వర్తించవలెను. సంతతి  విషయంలో  మేడలు కట్టరాదు. 

🌷. యోగాభ్యాసం  మొట్ట మొదటి నుండియూ మధురంగానే ఉంటుంది. కొన్ని మెట్లు క్లిష్టంగా ఉన్నట్లు  అనిపిస్తాయి. కాని అభ్యాసపాటవం  చేత సులభమవుతుంది. ఎంతటి పాపాత్ముడైనా యోగాభ్యాసాన్ని ఆచరిస్తే తరించగలడు. 

🌹. నీ చుట్టు ప్రక్కల వారి యందు ఎన్నడూ హద్దులు మీరకుండా యుండవలెను. 

🥀. వైకుంఠమంటే ఒక స్థితియే గాని, అది‌ ఒక చోటు కాదు. దానిని ఎక్కడ కల్పించుకుంటే అక్కడే ఉంటుంది. ఇంకొక వానికొరకు జీవించుట వైకుంఠము.
...✍ మాస్టర్ ఇ.కె.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. నేను ఆత్మ స్వరూపుడను అని గుర్తించుటకు,  ఆత్మకు పరమాత్మకు బేధము లేదు అని తెలిసి కొనుటకు ఉపయోగ పడు ఏకైక ఉపాధి, ఈ మానవ ఉపాధి.  దానిని సవ్యంగా ఉపయోగించడం మన విధి. 🌹

భగవంతుడు మనకు చేసిన అతి పెద్ద సహాయము, అతి పెద్ద వరము  ఈ మానవ శరీరమును ఇవ్వటమే. ఎనుబది నాలుగు లక్షల జీవరాసులలో అత్యుత్తమ ఉపాధి  ఈ  మానవ ఉపాధి . నేను ఆత్మ స్వరూపుడను అని గుర్తించుటకు,  ఆత్మకు పరమాత్మకు బేధము లేదు అని తెలిసి కొనుటకు ఉపయోగ పడు ఏకైక ఉపాధి, ఈ మానవ ఉపాధి.

భగవంతుడు మనందరికి బుద్ధిని , విచారణ చేయగలిగే శక్తిని అనుగ్రహించారు. ఈ విచారణా శక్తిని చక్కగా వినియోగించుకొని ఆత్మ జ్ఞానమును పొందే అర్హత మానవ శరీరము ధరించిన ప్రతి ఒక్కరికి ఉన్నది.

శాస్త్రము మనకు గురువు అంటే ఎవరు? గురువుకు ఉండవలసిన లక్షణములు ఏమిటి? గురువును ఆశ్రయించి దేనిని గురించి తెలిసికొనవలెను? గురువును దేనిని గురించి ప్రశ్నించ వలెను అను ప్రాధమిక విషయముల గురించిన  అవగాహనను కలుగ చేస్తుంది.  

శాస్త్రము మనకు సిద్ధాంతమును తెలియ చేస్తుంది. ఆ శాస్త్రములోని వాక్యములను  అనుభవములోనికి తెచ్చుకోనవలెననిన ఆత్మజ్ఞానమును అనుసరించి జీవించి అనుభవమును పొందిన  గురువు సహాయము తప్పనిసరి.

🌻. గురువు నీకు చేసే సహాయము ఏమిటి? 🌻 

నీకు నిన్ను నీవు చూసుకోవటము, సరిచేసుకోవటము చేతకాదు కనుక , నిన్ను నీవు పరిశీలించుకొనేటప్పుడు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తావు కనుక  గురువును ఆశ్రయిస్తున్నాము. 

గురువు నీలోని లోపములను చూపించి, నీ సంస్కార బలమును అనుసరించి ఏవిధమైన సాధన చేస్తే వాటిని అధిగమిస్తావో,  ఆ  విధానమును తెలియచేస్తారు. నీకు నీ లక్ష్యమును తెలియజేసి ఆ లక్ష్యము దిశగా ప్రయాణించుట ఎలాగో తెలియచేస్తారు.

మనము ఈ శరీరము ధరించడానికి కారణమైన బలీయమైన సంస్కారములు మూడో , నాలుగో ఉంటాయి.  అవే నీ ప్రారబ్ధము. 

మిగిలిన సంస్కారములను కేవలము విచారణచే అదిగమించవచ్చు. కాని జన్మకు కారణమైన సంస్కారములను మాత్రము కేవలము ఆత్మజ్ఞానము చేతనే అధిగమించుటకు వీలగుతుంది.

సంస్కారములు, వాసనలు ప్రాణ,మనో,బుద్ధులు అనే సుక్ష్మాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఈ శరీరము ప్రాణ,మనో,బుద్ధులను ఆశ్రయించే పనిచేస్తుంది. కనుక మనము సరిచేయవలసినది అంతరంగమును, సూక్ష్మమును. 

అది కేవలము విచారణ ద్వారానే సాధ్యము.  బుద్ధిని బుద్ధి చేతనే అధిగమించాలి. మన జీవన  విధానము ఈ సంస్కార బలము మరింత బలపడే విధముగా ఉంటున్నది. 

విచారణ ద్వారా ఏవిధమైన జీవితమును జీవించిన ఈ సంస్కార బలము నుండి బయట పడతామో ఆ విధమైన జీవన  విధానమును ఆశ్రయించాలి.

ప్రా(ముందు) + ఆరబ్దము(వచ్చినది) - ప్రారబ్ధము అంటే  పూర్వము నుండి వచ్చినది అని అర్ధము.
🌹 🌹 🌹 🌹 🌹

27నక్షత్రముల గాయత్రీ మంత్రాలు

☀1.అశ్విని ఓం శ్వేతవర్ణై విద్మహే సుధాకరాయై ధిమహి తన్నో అశ్వినేన ప్రచోదయాత్

☀2.భరణి ఓం కృష్ణవర్ణై విద్మహే దండధరాయై ధిమహి  తన్నో భరణి:ప్రచోదయాత్

☀3.కృత్తికా ఓం వణ్ణిదేహాయై విద్మహే మహాతపాయై ధీమహి  తన్నో కృత్తికా ప్రచోదయాత్

☀4.రోహిణి ప్రజావిరుధ్ధై చ విద్మహే విశ్వరూపాయై ధీమహి తన్నో రోహిణి ప్రచోదయాత్

☀5.మృగశిరా ఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధిమహి  తన్నో  మృగశిర: ప్రచోదయాత్

☀6.ఆర్ద్రా  ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే  పశుం తనాయ ధిమహి  తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్
 
☀7.పునర్వసు ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే  అదితి పుత్రాయ ధిమహి  తన్నో పునర్వసు ప్రచోదయాత్ 

☀8.పుష్య ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే మహాదిశాయాయ ధిమహి తన్నో పుష్య: ప్రచోదయాత్

☀9.ఆశ్లేష ఓం సర్పరాజాయ విద్మహే మహారోచకాయ ధిమహి  తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్

☀10.మఖ ఓం మహా అనగాయ విద్మహే పిత్రియాదేవాయ ధిమహి తన్నో మఖ: ప్రచోదయాత్

☀11.పుబ్బ  ఓం అరియంనాయ విద్మహే పశుదేహాయ ధిమహి తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్

☀12.ఉత్తరా మహాబకాయై విద్మహే మహాశ్రేష్ఠాయై ధీమహి తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్

☀ 13.హస్త ఓం ప్రయచ్చతాయై విద్మహే ప్రకృప్రణీతాయై ధీమహి  తన్నో హస్తా ప్రచోదయాత్

☀14.చిత్తా ఓం మహాదృష్టాయై విద్మహే ప్రజారపాయై ధీమహి  తన్నో చైత్రా:ప్రచోదయాత్

☀15.స్వాతి ఓం కామసారాయై విద్మహే మహాని ష్ఠాయై ధీమహి  తన్నో స్వాతి ప్రచోదయాత్

☀16.విశాఖ ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే  మహాశ్రేష్ఠాయై చ ధీమహీ  తన్నో విశాఖ ప్రచోదయాత్

☀17 అనూరాధ ఓం మిత్రదేయాయై విద్మహే మహామిత్రాయ ధీమహి  తన్నో అనూరాధా ప్రచోదయాత్

☀18.జ్యేష్ఠా ఓం జ్యేష్ఠాయై విద్మహే మహాజ్యేష్ఠాయై ధీమహి  తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్

☀19.మూల ఓం ప్రజాధిపాయై విద్మహే మహాప్రజాధిపాయై ధీమహి  తన్నో మూలా ప్రచోదయాత్

☀20.పూర్వాషాఢ ఓం సముద్ర కామాయై విద్మహే మహాబీజితాయై ధిమహి  తన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్

☀21.ఉత్తరాషాఢ ఓం విశ్వేదేవాయ విద్మహే మహాషాఢాయ ధిమహి  తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్

☀22. శ్రవణ ఓం మహాశ్రేష్ఠాయై విద్మహే  పుణ్యశ్లోకాయ ధీమహి  తన్నో శ్రవణ ప్రచోదయాత్

☀23.ధనిష్ఠా ఓం అగ్రనాథాయ విద్మహే వసూప్రితాయ ధీమహి  తన్నో శర్విష్ఠా ప్రచోదయాత్

☀24.శతభిషం ఓం భేషజాయ విద్మహే వరుణదేహాయ ధీమహి  తన్నో శతభిషా ప్రచోదయాత్

☀25.పూర్వాభాద్ర ఓం తేజస్కరాయ విద్మహే అజరక పాదాయ ధీమహి  తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్

☀26.ఉత్తరాభాద్ర ఓం అహిరబుధ్నాయ విద్మహే ప్రతిష్ఠాపనాయ ధీమహి  తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్

☀27.రేవతి ఓం విశ్వరూపాయ విద్మహే  పూష్ణ దేహాయ ధీమహి  తన్నో రేవతి ప్రచోదయాత్

****
 👍

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ