Posts

Showing posts from March, 2020
కర్మలను మూటగట్టే 3 రకములైన తప్పులు, వాటి పరిష్కారానికి భగవద్గీత సూచించిన 3 రకాల తపస్సులు. 🌹 📚. ప్రసాద్ భరద్వాజ మనం చేసిన పాపాలకి శిక్ష ఉంటుందని తెలుసు. కానీ తెలియకుండా కొన్ని, తెలిసి కొన్ని చేసేస్తూ ఉంటాం. ఈ విషయంలో మన సనాతన ధర్మంలో స్పష్టమైన విశ్లేషణ ఉంది. మనం చేసే అన్ని తప్పులు (పాపాలు) మూడిటితోనే చేస్తాం. (1) కాయిక (శరీర గత); (2) వాచిక (మాటతో); మరియు (3) మానసిక (మనసుతో). ఆ తప్పులు ఏమిటో తెల్సుకుని వాటిని ఎలా అరికట్టవచ్చో చూద్దాం. ఒకవేళ ఆ తప్పులు చేసినట్లైతే ప్రాయశ్చిత్తానికి కూడా ఉపయోగ పడుతుంది. ఈ మూడు విధములైన తప్పులకు మూడు విధములైన తపస్సులు చెప్పేరు. ఇవి ఎవరికి వారే వ్యక్తిగతంగాపరీక్షించుకుని మార్పు చెందే సుళువైన మార్గం. 🌻. (1) కాయిక (శరీరగత) పాపములు శ్లోకం: అదత్తాముపాదానం హింసాచైవా విధానతః, పరదారోపసేవా చ శరీరం త్రివిధం స్మృతం. అర్థం: అన్న్యాయముగా డబ్బు సంపాదించడం, హింస చేయడం, శాస్త్ర విరుద్ధమైన పనులు చేయడం, పరస్త్రీ సంగమం.. ఇవి శరీరముతో చేసే పాపములు (తప్పులు). ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా… శ్లోకము: దేవ ద్విజ గురు ప్రాఙ్ఞ్...

నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము)

🌻. అభ్యాసము, ప్రభావము - 1 🌻 ఆ విద్యాధరి ఇట్లు పల్కెను. నేను మీ శిష్యురాలను, అబలను అయినప్పటికి, అభ్యాసముచే, నేను శిలాంతర్గతమగు జగత్తును గాంచుచున్నాను.  తాము సర్వజ్ఞులగు గురువులైనప్పటికి, అభ్యాసలేమిచే, అద్దానిని గ్రహించుటలేదు. కావున అభ్యాసముయొక్క ప్రభావమును తిలకింపుడు. అభ్యాసముచే అజ్ఞానియు, జ్ఞానియగుచున్నాడు. పర్వతమును మెల్లమెల్లగ పిండిచేయబడుచున్నవి. అచేతనమైన బాణము సూక్ష్మమై లక్ష్యమును ఛేదించుచున్నది. అభ్యాసమువలన కొందరికి కారపు వస్తువు ఇష్టముగుచున్నది,కొందరికి చేదు,కొందరికి తీపి రుచించుచున్నది.  సమీపమున నివసించు అభ్యాసముచే, బంధువుకానివాడు బంధువగుచున్నాడు. అభ్యాసముచే స్థూలశరీరము, కారణ అభ్యాసముచే పక్షివలె ఆకాశమున ఎగురుచున్నది. గొప్ప పుణ్యము నిష్పలముగా వచ్చును గాని, అభ్యాసము నిష్పలముకాదు.  దుస్సాధ్యకార్యములు అభ్యాసముచే సాధించబడుచున్నవి. శత్రువులు మిత్రులుగను, విషము, అమృతముగను అగుచున్నది. సంసారము అసారమైనదని వివేకము గల్గినవారు, ఆత్మవిచారమను అభ్యాసముచే మనుజులు మాయానదిని దాటుచున్నారు.  పదునాల్గులోకుములందు ప్రాణసమూహ మధ్యమందే, దానియొక్క అభిమత వస్తువును సహజమగు అభ్...

🌹. అష్టాదశ శక్తి పీఠాలు -

Image
🌻. *. శ‌క్తి పీఠాలు 18 ప్ర‌ధాన‌మైన శ‌క్తి పీఠాల‌ను అష్టాద‌శ శ‌క్తి పీఠాలు అంటారు. వాటి వివ‌రాలు మీ కోసం.. 🌻. 1. శాంకరి - శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది. 🌻. 2. కామాక్షి - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. 🌻. 3. శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింప బడుతున్నది. 🌻. 4. చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి. 🌻. 5. జోగులాంబ - ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుం...
శ్రీఆదిశంకరాచార్య విరచితం శ్రీ వైద్యనాథాష్టకము 🕉🌞🌏🌙🌟🚩 🔥ఓంశ్రీమాత్రే నమః🔥 అద్వైత చైతన్య జాగృతి 🕉🌞🌏🌙🌟🚩 పరమశివుడు వైద్యులకు అధిపతిగా కూడా పేరొందాడు. శ్రీ రుద్రాభిషేచనంలో చాలా భాగం దీన్ని వక్కాణిస్తుంది.  నమకం, చమకంలో పూర్తి ప్రార్థన, ఫలితం కూడా రోగ నివారణ, ఆరోగ్యము, దీర్ఘాయుష్షు గురించి చెపుతాయి. అందుకనే శివుని వైద్యనాథుడిగా కొలుస్తారు. దీనికి జ్యోతిర్లింగ స్వరూపమే మహారాష్ట్ర అంబజోగై సమీపం లోని వైద్యనాథ దేవాలయం. అలాగే, తమిళనాట చిదంబరం దగ్గర వైదీశ్వరన్ కోవిల్ ఈ స్వామి మహాత్మ్యాన్ని తెలిపేదే. జటాయు అంత్యక్రియలు, కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న అంగారకునికి (కుజ గ్రహం) రోగ నివారణ ఇక్కడే జరిగాయని గాథ. సుబ్రహ్మణ్యునికి శూలము కూడా ఇక్కడ శివుని ప్రార్థించిన తర్వాతే లభించిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇక్కడి సిద్ధామృత తీర్థం (పుష్కరిణిలో నీరు), అంగసనాతన తీర్థంలో స్నానం చేసి,  వేప చెట్టు క్రింద మట్టి తీసుకుని పవిత్ర భస్మముతో కలిపి దేవునికి సమర్పించి ఆ సిద్ధామృత తీర్థంతో తీసుకుంటే సర్వ రోగ నివారణ అవుతుందని గట్టి విశ్వాసం. అలాగే ఆ వైద్యనాథుని ఈ క్రింది స్తోత్రము రోజుక...

నిత్య సంధ్యా వందనం

3. ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ: ప్రాంజలి ప్రభ - సేకరణ రచయిత " మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   నిత్య సంధ్యా వందనం   రచన: విశ్వామిత్ర మహర్షి శరీర శుద్ధి అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం ”   గతో  ‌ உ పివా  | యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః  || పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః  | ఆచమనః ఓం ఆచమ్య ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య) ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా) ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా)   ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)   ఓం శ్రీధరాయ నమః   ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య)   ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య)   ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)   ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య)   ఓం వాసుదేవాయ నమః   ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా)   ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః   ఓం అధోక్షజాయ నమః   ...