నిత్య సంధ్యా వందనం

3. ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ - సేకరణ రచయిత " మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

నిత్య సంధ్యా వందనం 
రచన: విశ్వామిత్ర మహర్షి

శరీర శుద్ధి
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ||
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః |

ఆచమనః
ఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య)
ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా)
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా) 
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య) 
ఓం శ్రీధరాయ నమః 
ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య) 
ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య) 
ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య) 
ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య) 
ఓం వాసుదేవాయ నమః 
ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా) 
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః 
ఓం అధోక్షజాయ నమః 
ఓం నారసింహాయ నమః (నేత్రే శ్రోత్రే చ స్పృష్ట్వా) 
ఓం అచ్యుతాయ నమః (నాభిం స్పృష్ట్వా) 
ఓం జనార్ధనాయ నమః (హృదయం స్పృష్ట్వా) 
ఓం ఉపేంద్రాయ నమః (హస్తం శిరసి నిక్షిప్య) 
ఓం హరయే నమః 
ఓం శ్రీకృష్ణాయ నమః (అంసౌ స్పృష్ట్వా) 
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః

(ఏతాన్యుచ్చార్య ఉప్యక్త ప్రకారం కృతే అంగాని శుద్ధాని భవేయుః)

భూతోచ్చాటన
ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యే తే భూమిభారకాః యే తేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం భూర్భువస్సువః |
దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః

(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)

ప్రాణాయామః
ఓం భూః ఓం భువః ఓగ్‍మ్ సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్‍మ్ సత్యమ్ |
ఓం తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | 
ధియో యో నః ప్రచోదయాత్ ||
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ || (తై. అర. 10-27)

సంకల్పః
మమోపాత్తదురిత క్షయద్వారాశ్రీ పరమేశ్వర ముద్దిస్యశ్రీ పరమేశ్వర ప్రీత్యర్థంశుభేశోభనేఅభ్యుదయ ముహూర్తేశ్రీ మహావిష్ణో రాఙ్ఞయాప్రవర్త మానస్యఅద్య బ్రహ్మణఃద్వితీయ పరార్థేశ్వేతవరాహ కల్పేవైవశ్వత మన్వంతరేకలియుగేప్రథమ పాదే, (భారత దేశః  జంబూ ద్వీపేభరత వర్షేభరత ఖండేమేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగేఅమేరికా  క్రౌంచ ద్వీపేరమణక వర్షేఐంద్రిక ఖండేసప్త సముద్రాంతరేకపిలారణ్యే)శోభన గృహేసమస్త దేవతా బ్రాహ్మణహరిహర గురుచరణ సన్నిథౌఅస్మిన్వర్తమానవ్యావహారికచాంద్రమాన సంవత్సరే అయనే ఋతే మాసే పక్షే తిథౌ వాసరే శుభ నక్షత్రశుభ యోగశుభ కరణఏవంగుణవిశేషణవిశిష్ఠాయాంశుభ తిథౌశ్రీమాన్ గోత్రః నామధేయః గోత్రస్య నామధేయోహంః ప్రాతః/మధ్యాహ్నిక/సాయం సంధ్యామ్ ఉపాసిష్యే ||

మార్జనః
ఓం ఆపోహిష్ఠా మయోభువః | తా న ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వః శివతమో రసః | తస్య భాజయతే హ నః ఉశతీరివ మాతరః | తస్మాఅరంగ మామ వః యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా చ నః | (తై. అర. 4-42)

(ఇతి శిరసి మార్జయేత్)

(హస్తేన జలం గృహీత్వా)

ప్రాతః కాల మంత్రాచమనః
సూర్య శ్చమామన్యు శ్చమన్యుపతయ శ్చమన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతామ్ యద్రాత్ర్యా పాప మకార్షమ్ మనసా వాచా హస్తాభ్యామ్ పద్భ్యా ముదరేణ శిశ్ంచా రాత్రి స్తదవలుంపతు యత్కించ దురితం మయి | ఇదమహం మా మమృత యో నౌ సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా || (తై. అర. 10. 24)

మధ్యాహ్న కాల మంత్రాచమనః
ఆపః పునంతు పృథివీం పృథివీ పూతా పునాతుమామ్ పునంతు బ్రహ్మణస్పతి ర్బ్రహ్మా పూతా పునాతు మామ్ యదుచ్ఛిష్ట మభోజ్యం యద్వా దుశ్చరితం మమ | సర్వం పునంతు మా మాపోసతా ంచ ప్రతిగ్రహగ్గ్ స్వాహా || (తై. అర. పరిశిష్టః 10. 30)

సాయంకాల మంత్రాచమనః
అగ్ని శ్చ మా మన్యు శ్చ మన్యుపతయ శ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతామ్ యదహ్నా పాప మకార్షమ్ మనసా వాచా హస్తాభ్యామ్ పద్భ్యా ముదరేణ శిశ్ంచా అహ స్తదవలుంపతు య త్కించ దురితం మయి | ఇద మహం మా మమృత యోనౌ సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా || (తై. అర. 10. 24)

(ఇతి మంత్రేణ జలం పిబేత్)

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా
 శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

ద్వితీయ మార్జనః
దధి క్రావణ్ణో అకారిషమ్ జిష్ణో రశ్వస్య వాజినః |
సురభినో ముఖాకరత్ప్రణ ఆయూగ్‍మ్షి తారిషత్ ||

(సూర్యపక్షే లోకయాత్రా నిర్వాహక ఇత్యర్థః)

ఓం ఆపో హిష్ఠా మ
యోభువః | తా న ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వః శివతమో రసః | తస్య భాజయతే హ నః ఉశతీరివ మాతరః | తస్మాఅరంగ మామ వః యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా చ నః || (తై. అర. 4. 42)

పునః మార్జనః
హిరణ్యవర్ణా శ్శుచయః పావకాః యా సుజాతః కశ్యపో యా స్వింద్రః | అగ్నిం యా గర్భన్-దధిరే విరూపా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భవంతు యా సాగ్ంరాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే అవపశ్యంజనానామ్ మధు శ్చుతశ్శుచయో యాః పావకా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భవంతు యాసాం దేవా దివి కృణ్వంతి భక్షం యా అంతరిక్షే బహుథా భవంతి యాః పృథివీం పయసోందంతి శ్శుక్రాస్తాన ఆపశగ్గ్ స్యోనా భవంతు యాః శివేన మా చక్షుషా పశ్యతాపశ్శివయా తను వోపస్పృశత త్వచ మ్మే సర్వాగ్మ్ అగ్నీగ్‍మ్ రప్సుషదో హువే వో మయివర్చో బల మోజో నిధత్త || (తై. సం. 5. 6. 1)
(మార్జనం కుర్యాత్)

అఘమర్షణ మంత్రః పాపవిమోచనం

(హస్తేన జలమాదాయ నిశ్శ్వస్య వామతో నిక్షితపేత్)
ద్రుపదా దివ ముంచతు ద్రుపదా దివే న్ముముచానః |
స్విన్న స్స్నాత్వీ మలా దివః పూతం పవిత్రేణేవాజ్యమ్ ఆప శ్శుందంతు మైనసః || (తై. బ్రా. 266)

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా
 శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ప్రాణాయామమ్య

లఘుసంకల్పః
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యాంగ యథా కాలోచిత అర్ఘ్యప్రదానం కరిష్యే ||

ప్రాతః కాలార్ఘ్య మంత్రం
ఓం భూర్భువస్సువః || తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ || 3 ||

మధ్యాహ్నార్ఘ్య మంత్రం
ఓం హగ్ం సశ్శుచిష ద్వసురంతరిక్షస ద్దోతా వేదిషదతిథి ర్దురోణసత్ నృష ద్వరస దృతస ద్వ్యోమ సదబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతమ్-బృహత్ || (తై. అర. 10. 4)

సాయం కాలార్ఘ్య మంత్రం
ఓం భూర్భువస్సువః || తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ || ఓం భూః ఓం భువః ఓగ్‍మ్ సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్‍మ్ సత్యమ్ ఓం తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయో నః ప్రచోదయాత్ || ఓమాపో జ్యోతీరసోమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||

(ఇత్యంజలిత్రయం విసృజేత్)

కాలాతిక్రమణ ప్రాయశ్చిత్తం
ఆచమ్య… 
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కాలాతిక్రమ దోషపరిహారార్థం చతుర్థా అర్ఘ్యప్రదానం కరిష్యే ||

ఓం భూర్భువస్సువః
 || తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ || ఓం భూః ఓం భువః ఓగ్‍మ్ సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్‍మ్ సత్యమ్ ఓం తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయో నః ప్రచోదయాత్ || ఓమాపో జ్యోతీరసోమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||
(ఇతి జలం విసృజేత్)

సజల ప్రదక్షిణం
ఓం ఉద్యంతమస్తం యంత మాదిత్య మభిథ్యాయ న్కుర్వన్-బ్రాహ్మణో విద్వాన్ త్సకలమ్-భద్రమశ్నుతేఅసావాదిత్యో బ్రహ్మేతి || బ్రహ్మైవ సన్-బ్రహ్మాప్యేతి య ఏవం వేద || అసావాదిత్యో బ్రహ్మ || (తై. అర. 2. 2)

(ఏవమ్ అర్ఘ్యత్రయం దద్యాత్ కాలాతిక్రమణే పూర్వవత్)
(పశ్చాత్ హస్తేన జలమాదాయ ప్రదక్షిణం కుర్యాత్)
(ద్విరాచమ్య ప్రాణాయామ త్రయం కృత్వా)

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా
 శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

సంధ్యాంగ తర్పణం
ప్రాతఃకాల తర్పణం
సంధ్యాం తర్పయామిగాయత్రీం తర్పయామిబ్రాహ్మీం తర్పయామినిమృజీం తర్పయామి ||

మధ్యాహ్న తర్పణం
సంధ్యాం తర్పయామిసావిత్రీం తర్పయామిరౌద్రీం తర్పయామినిమృజీం తర్పయామి ||

సాయంకాల తర్పణం
సంధ్యాం తర్పయామిసరస్వతీం తర్పయామివైష్ణవీం తర్పయామినిమృజీం తర్పయామి ||

(పునరాచమనం కుర్యాత్)

గాయత్రీ అవాహన
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షమ్ గాయత్రం ఛందం పరమాత్మం సరూపమ్ సాయుజ్యం వినియోగమ్ || (తై. అర. 10. 33)

ఆయా
తు వరదా దేవీ అక్షరం బ్రహ్మసంమితమ్ గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వ మే యదహ్నాత్-కురుతే పాపం తదహ్నాత్-ప్రతిముచ్యతే యద్రాత్రియాత్-కురుతే పాపం తద్రాత్రియాత్-ప్రతిముచ్యతే సర్వ వర్ణే మహాదేవి సంధ్యావిద్యే సరస్వతి ||

ఓజో
సి సహోసి బలమసి భ్రాజోసి దేవానాంధామనామాసి విశ్వమసి విశ్వాయు-స్సర్వమసి సర్వాయు-రభిభూరోమ్ గాయత్రీ-మావాహయామిసావిత్రీ-మావాహయామి సరస్వతీ-మావాహయామిఛందర్షీ-నావాహయామి శ్రియ-మావాహయామిగాయత్రియా గాయత్రీ చ్ఛందో విశ్వామిత్రఋషి స్సవితా దేవతాగ్నిర్-ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్-హృదయగ్‍మ్ రుద్ర-శ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్‍మ్ శత్యక్షరా త్రిపదా షట్-కుక్షిఃపంచ-శీర్షోపనయనే వినియోగః ఓం భూః ఓం భువః ఓగ్‍మ్ సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్‍మ్ సత్యమ్ ఓం తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ || ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ || (మహానారాయణ ఉపనిషత్)

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా
 శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

జపసంకల్పః
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంధ్యాంగ యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే ||

కరన్యాసః
ఓం తథ్సవితుః బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః |
వరేణ్యం విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః |
భర్గో దేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |
ధియో యో నః ఙ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః |
ప్రచోదయాత్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః |

అంగన్యాసః
ఓం తథ్సవితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః |
వరేణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహా |
భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయై వషట్ |
ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ |
ధియో యో నః ఙ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయఫట్ |
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధః |

ధ్యానమ్
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయైర్-ముఖై స్త్రీక్షణైః |
యుక్తామిందుని బద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రంకపాలంగదామ్ |
శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే ||

చతుర్వింశతి ముద్రా ప్రదర్శనం
సుముఖం సంపుటించైవ వితతం విస్తృతం తథా |
ద్విముఖం త్రిముఖంచైవ చతుః పంచ ముఖం తథా |
షణ్ముఖోథో ముఖం చైవ వ్యాపకాంజలికం తథా |
శకటం యమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖమ్ |
ప్రలంబం ముష్టికం చైవ మత్స్యః కూర్మో వరాహకమ్ |
సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా |

చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః |
ఇతిముద్రా న జానాతి గాయత్రీ నిష్ఫలా భవేత్ ||

యో దేవ స్సవితా
స్మాకం ధియో ధర్మాదిగోచరాః |
ప్రేరయేత్తస్య యద్భర్గస్త ద్వరేణ్య ముపాస్మహే ||

గాయత్రీ మంత్రం
ఓం భూర్భువస్సువః || తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | 
ధియో యో నః ప్రచోదయాత్ || 

అష్టముద్రా ప్రదర్శనం
సురభిర్-ఙ్ఞాన చక్రే చ యోనిః కూర్మోథ పంకజమ్ |
లింగం నిర్యాణ ముద్రా చేత్యష్ట ముద్రాః ప్రకీర్తితాః ||
ఓం తత్సద్-బ్రహ్మార్పణమస్తు |

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా
 శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

ద్విః పరిముజ్య |
సకృదుప స్పృశ్య |
యత్సవ్యం పాణిమ్ |
పాదమ్ |
ప్రోక్షతి శిరః |
చక్షుషీ |
నాసికే |
శ్రోత్రే |
హృదయమాలభ్య |

ప్రాతఃకాల సూర్యోపస్థానం
ఓం మిత్రస్య చర్షణీ ధృత శ్రవో దేవస్య సాన సిమ్ సత్యం చిత్రశ్ర వస్తమమ్ మిత్రో జనాన్ యాతయతి ప్రజానన్-మిత్రో దాధార పృథివీ ముతద్యామ్ మిత్రః కృష్టీ రనిమిషాభి చష్టే సత్యాయ హవ్యం ఘృతవద్విధేమ ప్రసమిత్త్ర మర్త్యో అస్తు ప్రయస్వాన్యస్త ఆదిత్య శిక్షతి వ్రతేన | న హన్యతే న జీయతేత్వోతోనైన మగ్ంహో అశ్నో త్యంతితో న దూరాత్ || (తై. సం. 3.4.11)

మధ్యాహ్న సూర్యోపస్థానం
ఓం ఆ సత్యేన రజసా వర్తమానో నివేశయ న్నమృతంమర్త్యంచ హిరణ్యయేన సవితా రథేనాదేవో యాతి భువనా నిపశ్యన్ ||

ఉద్వయ ంతమ
స స్పరి పశ్యంతో జ్యోతి రుత్తరమ్ దేవన్-దేవత్రా సూర్య మగన్మ జ్యోతి రుత్తమమ్ ||

ఉదుత్యం జాతవే
దసం దేవం వహంతి కేతవః | దృశే విశ్వా య సూర్యమ్ || చిత్రం దేవానా ముదగాదనీకం చక్షుర్-మిత్రస్య వరుణ స్యాగ్నేః అప్రాద్యావా పృథివీ అంతరిక్షగ్‍మ్ సూర్య ఆత్మా జగత స్తస్థుషశ్చ ||

తచ్చక్షు
ర్-దేవహితం పురస్తాచ్చుక్ర ముచ్చరత్ పశ్యేమ శరదశ్శతం జీవేమ శరదశ్శతం నందామ శరదశ్శతం మోదామ శరదశ్శతం భవామ శరదశ్శతగ్‍మ్ శృణవామ శరదశ్శతం పబ్రవామ శరదశ్శతమజీతాస్యామ శరదశ్శతం జోక్చ సూర్యం దృషే || య ఉదగాన్మహతోర్ణవా ద్విభ్రాజమాన స్సరిరస్య మధ్యాథ్సమా వృషభో లోహితాక్షసూర్యో విపశ్చిన్మనసా పునాతు ||

సాయంకాల సూర్యోపస్థానం
ఓం ఇమమ్మే వరుణ శృధీ హవ మద్యా చ మృడయ త్వా మవస్యు రాచకే || తత్వా యామి బ్రహ్మణావందమాన స్త దాశాస్తే యజమానో హవిర్భిః | అహేడమానో వరుణేహ బోధ్యురుశగ్ం సమానఆయుః ప్రమోషీః ||

యచ్చిద్ధితే విశోయథా ప్రదేవ వరుణవ్రతమ్ మినీమసిద్య విద్యవి యత్కించేదం వరుణదైవ్యే జనే
భిద్రోహ మ్మనుష్యాశ్చరామసి అచిత్తే యత్తవ ధర్మాయుయోపి మమాన స్తస్మా దేనసో దేవరీరిషః కితవాసో యద్రిరిపుర్నదీవి యద్వాఘా సత్యముతయన్న విద్మ సర్వాతావిష్య శిధిరేవదేవా థాతేస్యామ వరుణ ప్రియాసః || (తై. సం. 1.1.1)

దిగ్దేవతా నమస్కారః
(ఏతైర్నమస్కారం కుర్యాత్)
ఓం నమః ప్రాచ్యై దిశే యాశ్చ దేవతా ఏతస్యాంప్రతివసంత్యే తాభ్యశ్చ నమః |
ఓం నమః దక్షిణాయై దిశే యాశ్చ దేవతా ఏతస్యాంప్రతివసంత్యే తాభ్యశ్చ నమః |
ఓం నమః ప్రతీచ్యై దిశే యాశ్చ దేవతా ఏతస్యాంప్రతివసంత్యే తాభ్యశ్చ నమః |
ఓం నమః ఉదీచ్యై దిశే యాశ్చ దేవతా ఏతస్యాంప్రతివసంత్యే తాభ్యశ్చ నమః |
ఓం నమః ఊర్ధ్వాయై దిశే యాశ్చ దేవతా ఏతస్యాంప్రతివసంత్యే తాభ్యశ్చ నమః |
ఓం నమోరాయై దిశే యాశ్చ దేవతా ఏతస్యాంప్రతివసంత్యే తాభ్యశ్చ నమః |
ఓం నమోవాంతరాయై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంత్యే తాభ్యశ్చ నమః |

ముని నమస్కారః
నమో గంగా యమునయోర్-మధ్యే యే వసంతి తే మే ప్రసన్నాత్మాన శ్చిరంజీవితం వర్ధయంతి నమో గంగా యమునయోర్-మునిభ్యశ్చ నమో నమో గంగా యమునయోర్-మునిభ్యశ్చ నమః ||

సంధ్యాదేవతా నమస్కారః
సంధ్యాయై నమః | సావిత్ర్యై నమః | గాయత్ర్యైనమః | సరస్వత్యై నమః | సర్వాభ్యో దేవతాభ్యోనమః | దేవేభ్యో నమః | ఋషిభ్యో నమః | మునిభ్యోనమః | గురుభ్యో నమః | పితృభ్యో నమః | కామోకార్షీ ర్నమో నమః మన్యు రకార్షీ ర్నమోనమః పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ నమః || (తై. అర. 2.18.52)

ఓం నమో భగవతే వాసు
దేవాయ యాగ్‍మ్ సదా సర్వభూతాని చరాణి స్థావరాణి చ సాయం ప్రాత ర్నమస్యంతి సా మా సంధ్యాభిరక్షతు ||

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః ||
యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః |
యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ||
నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||

గాయత్రీ ఉద్వాసన (ప్రస్థానం)
ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్థని బ్రాహ్మణేభ్యోభ్యను ఙ్ఞాతా గచ్చదేవి యథాసుఖమ్ స్తుతో మయా వరదా వేదమాతాప్రచోదయంతీ పవనే ద్విజాతా ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్రహ్మలోకమ్ || (మహానారాయణ ఉపనిషత్)

భగవన్నమస్కారః
నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే |
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగ ధారిణే నమః ||

భూమ్యాకాశాభి వందనం
ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు పితర్-మాతర్యదిహోప బృవేవామ్ |
భూతం దేవానా మవమే అవోభిః విద్యా మేషం వృజినం జీరదానుమ్ ||

ఆకాశాత్-పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్ |
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి || 
శ్రీ కేశవం ప్రతిగచ్ఛత్యోన్నమ ఇతి |

సర్వవేదేషు యత్పుణ్యమ్ సర్వతీర్థేషు యత్ఫలమ్ |
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్ధనమ్ ||
స్తుత్వాదేవం జనార్ధన ఓం నమ ఇతి ||
వాసనాద్-వాసుదేవస్య వాసితం తే జయత్రయమ్ |
సర్వభూత నివాసోసి శ్రీవాసుదేవ నమోస్తుతే ||
శ్రీ వాసుదేవ నమోస్తుతే ఓం నమ ఇతి |

అభివాదః (ప్రవర)
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు  ప్రవరాన్విత  గోత్రః  సూత్రః  శాఖాధ్యాయీ  అహం భో అభివాదయే ||

ఈశ్వరార్పణం
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ |
కరోమి యద్యత్-సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ||
హరిః ఓం తత్సత్ తత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు |

--((**))--

--((***)--
2**నలదమయంతుల కధ..మీ అందరికోసం..!!**

 కలిదోషం పోవాలంటే.. ఒకసారి ఈ కథ చదవండి.,ఓం శని ఈశ్వరాయనమః.

ఒకరోజు బృహదశ్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఆ మునికి అతిధిసత్కారాలు కావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలు అన్నీ వివరించి "మహాత్మా! రాజ్యాన్నినివాసాన్ని పోగొట్టుకుని మాలాగ అడవిలో  కష్టాలు పడుతున్న వారు ఎవరైనా ఉన్నారాఉంటే చెప్పండి" అని అడిగాడు.

అందుకు బృహదశ్వుడు "ధర్మరాజా! నీవు కష్టాలు పడుతూ అడవులలో ఉన్నా,
నీ వెంట నీ అన్నదమ్ములునీ భార్యానీ హితం కోరే విప్రులు నీ వెంట ఉన్నారు.
పూర్వం నలుడనే మహారాజు నీవలె జూదంలో సర్వం కోల్పోయి,

పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యా సమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు"అని చెప్పాడు.అది విని ధర్మరాజు "మహత్మా! నాకు నలుని కథ వివరించండి" అని అడిగాడు. బృహదశుడు ధర్మరాజుకు ఇలా వివరించ సాగాడు. "నిషిధదేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు.

తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు.
అతనికి జూదం అంటే ఎక్కువ ప్రీతి. ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడనే రాజు పరిపాలిస్తున్నాడు. చాలా కాలం అతనికి సంతానం లేదు. అతనికి దమనుడు అనే ముని ఇచ్చిన వరము వలన దమయంతి అనే కూతురుదముడుదమనుడుదాంతుడు అనే కుమారులు కలిగారు. దమయంతి సౌందర్యరాశిగుణవంతురాలు.దమయంతి నలుని గుణగణాలను గురించి విన్నది. నలుడు దమయంతి గురించిఆమె సౌందర్యం గురించి విన్నాడు.

ఇరువురి నడుమ ప్రేమ అంకురించింది.నలదమయంతుల మధ్య హంస రాయబారం..
ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసలగుంపు వచ్చి అక్కడ వాలింది.
ఆ హంసలను చూసి ముచ్చట పడి నలుడు వాటిలో ఒకదానిని పట్టుకున్నాడు.
మిగిలిన హంసలు తోటి హంసను విడిచి వెళ్ళలేక ఆకాశంలో తిరుగుతున్నాయి.
నలునితో అతని చేతిలోని హంస మానవభాషలో ఇలా అన్నది. "ఓ మహారాజా! నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు.

నేను దమయంతి వద్దకు వెళ్ళి నీ గురించినీ అందచందాల గురించి. గుణగణాల గురించి చెప్పి..నీమీద అనురాగం కలిగేలా చేస్తాను" అని పలికింది. ఆ హంస పలుకులు విని నలుడు ఆనంద పడి,దానిని విడిచిపెట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భదేశానికి ఎగిరిపోయింది.అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి దమయంతి ముచ్చట పడింది.చెలికత్తెల సాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంది.

ఆ హంస దమయంతితో "దమయంతీ! నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను.నలుడు సౌందర్యవంతుడుసంపన్నుడు సద్గుణ వంతుడు. నీవు సౌందర్యంలో,  గుణంలో అతనికి తగినదానివి. అతనికి భార్యవైతేనే నీకు రాణింపు" అని పలికింది. దమయంతి "ఓ హంసా! నలుని గురించి నాకు ఎలా చెప్పావో అలాగే నలునికి నా గురించి చెప్పు" అన్నది. ఆ హంస అలాగే చేసింది. ఇలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం అధికమైంది.

దమయంతి స్వయంవరం..

నల దమయంతుల వివాహం.

నల దమయంతుల ప్రణయ విషయం దమయంతి చెలికత్తెల ద్వారా తెలుసుకున్న భీమమహారాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆహ్వానాన్నందుకున్న రాజులంతా స్వయంవరానికి విచ్చేశారు.నలుడు కూడా స్వయంవరానికి పోతున్నాడు. ఇంద్రునికి దమయంతి స్వయంవర విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయం వరానికి బయలుదేరాడు. మార్ద్గమధ్యంలో నలుని చూసిన ఇంద్రుడు నలునితో "నిషధ రాజా !నీవు నాకు దూతగా పని చేయాలి" అన్నాడు. నలుడు "అలాగే చేస్తాను.ఇంతకీ మీరెవరు?
నేను నీకేమి చేయాలి?" అని అడిగాడు. ఇంద్రుడు నలునితో "నేను ఇంద్రుడను. వీరు దిక్పాలకులు. నీవు పోయి దమయంతికి మా గురించి చెప్పి..ఆమె మమ్ములను వరించేలా చేయాలి" అన్నాడు.

నలుడు ఇంద్రునితో "అయ్యా! నీకిది ధర్మమా?

నేను కూడా అదే పనిమీద పోతున్నాను కదా" అన్నాడు. ఇంద్రుడు నలునితో "నీవు మాకు మాటిచ్చావు కనుకఈ కార్యం చేయవలసిందే ఇది దేవతాకార్యంనీవు చేయగలవు. మాట తప్పడం ధర్మం కాదు. మా మహిమచేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకు ఎవరూ అడ్డు చెప్పరు" అన్నాడు. గత్యంతరం లేకనలుడు దమయంతి అంతఃపురంలో ప్రవేశించాడు. నలుడు దమయంతిని మొదటి సారిగా చూసి, 'హంస చెప్పినదాని కంటే దమయంతి సౌందర్యవతిఅనుకున్నాడు దమయంతిఆమె చెలికత్తెలు నలుడుని చూసి ఆశ్చర్యపోయారు.దమయంతి నలుని చూసి "మహాత్మా మీ రెవరు?

ఎక్కడి నుండి వచ్చారు?

ఈ అంతఃపురంలో ఎవరికీ కనపడకుండా ఎలా ప్రవేశించారు?" అని అడిగింది.
నలుడు దమయంతితో "నా పేరు నలుడు. నేను దేవదూతగా వచ్చాను.
దిక్పాలకులువారిలో ఒకరిని వరించమని నీకు చెప్పమని నన్ను పంపారు" అన్నాడు.
నలుని మాటలకు ఆమె మనసు కష్టపడింది. "అయ్యా! నేను మానవకాంతను.
నమస్కరించ వలసిన దేవతలను వరించడం ధర్మమానాడు హంస చెప్పినది మొదలునిన్నే నా భర్తగా తలచుకుంటున్నాను.

నా తండ్రి భీమరాజు మిమ్ము ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించాడు.
మీరే నాభర్తకనుక నన్ను స్వీకరించండి లేకుంటే నా ప్రాణాలను తీసుకుంటాను కాని,
ఇతరులను వరించను" అని దమయంతి ప్రార్థించింది నలుడు దమయంతితో "దమయంతీ!

దేవతలు ఐశ్వర్యవంతులుజరా మరణాలు లేని వారువారిని కాదని జరామరణాలకు ఆలవాలమైన నన్ను కోరడం న్యాయమా?" అని అన్నాడు. ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. ఆమె నలునితో "నేను ఒక ఉపాయం చెప్తాను. అందరి ముందు నేను దేవతలను ప్రార్ధించి నిన్ను వివాహమాడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్న దోషం ఉండదు" అన్నది.ఆ మాటలు నలుడు ఇంద్రునికి చెప్పాడు.
అది విని దిక్పాలకులు "దమయంతి మమ్మల్ని ఎలా వరించదో చూస్తాము" అని అందరూ నలుని రూపంలో స్వయంవరానికి వచ్చారు. స్వయంవరమండపంలో ఒకేసారి ఐదుగురు నలులు కనిపించారు.

దమయంతి వరమాల పట్టుకుని వచ్చింది.

మనస్సులో ధ్యానించి "దేవలారా! నలుని గుర్తు పట్టడంలో నాకు సహకరించండి.
మీ నిజరూపాలతో ప్రత్యక్షం అవండి" అని ప్రార్థించింది. వారు దమయంతిని కరుణించి తమ నిజరూపాలతో ప్రత్యక్షం అయ్యారు. నలదమయంతులకు వైభవోపేతంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి అనుగ్రహించారు.

నలదమయంతులపై కలిప్రభావం..

రాజ్యాన్ని కోల్పోయి అడవులకు వెళుతున్న నలుడు.

దమయంతి స్వయంవరం చూసి దేవలోకం వెళుతుండగాదేవతలకు కలి పురుషుడు కనిపించాడు.

ఇంద్రుడు కలి పురుషుని చూసి "ఎక్కడికి పోతున్నావు?" అని అడిగాడు.

"భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరానికి పోతున్నాను" అన్నాడు.

అ మాటలకు వారు నవ్వి "దమయంతి స్వయంవరం జరిగింది.

ఆమె నలుని వివాహమాడింది" అన్నారు.

కలికి కోపం వచ్చింది.

నలుడిని రాజ్యభ్రష్టుని చేసి వారిరువురికి వియోగం కల్పించాలని అనుకున్నాడు.

నలుడు ధర్మాత్ముడు,

కలి ప్రవేశానికి చాలా కాలానికి గాని అవకాశం రాలేదు.

ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసి పాదప్రక్షాళన చేయకుండా సంధ్యా వందనం చేశాడు.

ఆ అశౌచాన్ని ఆధారం చేసుకుని కలి అతనిలో ప్రవేశించాడు.

నలుని దాయాది అయిన పుష్కరుని వద్దకు వెళ్ళి నలునికి జూదవ్యసనం ఉందని అతనితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలువవచ్చని నమ్మబలికాడు.

బ్రాహ్మణ వేషంలో పుష్కరునితో నలుని వద్దకు వెళ్ళి జూదానికి ఆహ్వానించాడు.

జూదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని,

నలుడు జూదమాడటానికి అంగీకరించాడు. జూదం మొదలైంది.

నలుడు తనరాజ్యాన్నిసంపదలను వరుసగా పోగొట్టుకుంటున్నాడు..
అయినా ఆడటం మానకసమస్తం పోయే వరకు ఆడాడు. దమయంతి దుఃఖించి "ఓడేకొద్ది గెలవాలని పంతం పెరుగుతుంది. ఏమీ చెయ్యలేము" అని సరిపెట్టుకుంది.

పుష్కరుడు గెలవటం,నలుడు ఓడటం తథ్యమని గ్రహించిన దమయంతి తన కుమార్తె ఇంద్రనుకుమారుడు ఇంద్రసేనను సారథిని తోడిచ్చి విదర్భలో ఉన్న తండ్రి వద్దకు పంపింది. నలుడు తన రాజ్యాన్ని కోల్పోయినగరం వెలుపల మూడు రోజులు ఉన్నాడు.
జూదంలో సర్వం పోగొట్టుకున్న నలుని చూడటానికి ఎవరూ రాలేదు. ఆకలికి తట్టుకోలేక పోయాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టడానికి తన పైవస్త్రాన్ని వాటి మీద విసిరాడు. ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయాయి. నలుడు ఖేదపడి తన భార్య కొంగును పైవస్త్రంగా కప్పుకున్నాడు. ఆ దుస్థితికి తట్టుకోలేని నలుడు "దమయంతీ! ఇక్కడ నాలుగు మార్గాలు ఉన్నాయి. ఇదినీపుట్టిల్లు విదర్భ దేశానికి పోయే దారి ఇదిదక్షిణ దేశానికి పోయే మార్గంఇది కోసల దేశానికి పోయే మార్గంఇది ఉజ్జయినికి పోయే మార్గం.. వీటిలో మనకు అనుకూలమైన మార్గమేదో చెప్పు.

నీవు అడవులలో కష్టాలు పడలేవు,
నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు" అని చెప్పాడు. "అవును నాథామనం విదర్భకు వెళ్ళి సుఖంగా ఉంటాము" అని చెప్పింది.
నులుడు "దమయంతీ! మహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని,
రాజ్యభ్రష్టునిగా ఎలా రాగలను చెప్పు.
అన్ని రోగాలకన్నా పెద్ద రోగం దుఃఖం..
అందుకు భార్య పక్కన ఉండటం పరమౌషధం.
అందుకని నీవు పక్కన ఉంటేఎన్ని కష్టాలైనా సుఖాలుగానే ఉంటాయి" అన్నాడు నలుడు. దమయంతి "నిజమే అందుకనే నన్ను ఎప్పుడూ మీ వెంట ఉండటానికి అనుమతించండి" అన్నది.

అందుకు నలుడు అంగీకరించాడు.
నలదమయంతుల వియోగం..
ఒకరోజు అడవిలో నలుని తొడమీద తల పెట్టుకునిదమయంతి నిద్రపోతూ ఉంది.
అమెను చూసి నలుడు "ఈ సుకుమారి నాతో అడవులలో కష్టాలు పడుతోంది.
నా వెంట ఉండటమే ఈమె కష్టాలకు కారణం.
నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్ళి సుఖ పడుతుంది" అని మనసులో అనుకుని,
తాను ధరించిన చీరభాగాన్ని చింపిపైన వేసుకుని ఆమెను వదలలేక వదలలేక విడిచి వెళ్ళాడు. నిద్రలేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది.
భర్తను తలచుకుంటూ అడవిలో తిరుగు తున్న దమయంతిని ఒక కొండచిలువ పట్టుకుంది.
భయంతో దమయంతి కేకలు వేసింది.
ఆ కేకలు విని ఒక కిరాతుడు తన కత్తితో ఆ కొండచిలువను చంపిదమయంతిని రక్షించాడు.
ఆ కిరాతుడు దమయంతి గురించి తెలుసుకున్నాడు. ఆమె నిస్సహాయతను తెలుసుకుని,
ఆమెను తాకబోవగాదమయంతి అతనిని భస్మం చేసింది.

భర్తను తలుచుకుంటూ అడవిలో దారీతెన్నూ లేకుండా ప్రయాణిస్తూ ఉండగా,
ఆమెకు ఒక మునిపల్లె కనపడింది.
అక్కడ ఆమె మునిశ్రేష్టులను చూసింది.
మునులు దమయంతిని చూసి "అమ్మా! నీవు ఎవరుఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు?" అని అడిగారు. సమాధానంగా దమయంతి "మునిపుంగవులారా!

నేను నలచక్రవర్తి భార్యను నా పేరు దమయంతి విధివశంతో నా భర్త నన్ను విడిచి వెళ్ళాడు.
నాకు వారి జాడ చెప్పగలరా?

నేను భర్త లేనిదే జీవించ లేను" అని అడిగింది.
మునులు "అమ్మా! నీకు త్వరలోనే భర్త సమాగమంజరుగుతుంది.
చింత పడకుము" అని చెప్పివెళ్ళారు.దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ
ఆ అడవిలో తిరుగుతూ ఉంది. ఇంతలో అటుగా పోతున్న బాటసారులు ఆమెను చూసారు.కొందరు ఆమెను పిచ్చిది అని ఎగతాళి చేసారు.కొందరు ఆమెకు మొక్కారు.
వారిలో ఉన్న వ్యాపారి ఆమెను గురించి తెలుసుకుని "అమ్మా! నేను నలుని చూడలేదు,
కానీ మేము ఛేది దేశానికి వెళుతున్నాము" అన్నాడు. దమయంతి వారితో "నేను కూడా మీ వెంట వస్తాను" అన్నది. ఆవ్యాపారి ఆమెను తమ వెంట తీసుకు వెళ్ళాడు.
వారు అడవి మార్గంలో రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలా మందిని తొక్కివేసింది. వారిలో చాలామంది మరణించడం చూసిదమయంతి తన దురదృష్టానికి దుఃఖించింది. తనను చంపలేదని రోదిస్తున్న ఆమెను
కొందరు బ్రాహ్మణులు ఓదార్చి ఆమెను తమ వెంట సుబాహు నగరానికి తీసుకు వెళ్ళారు.
ఛేదిదేశ రాజధాని సుబాహుపురం చేరింది. ఒళ్ళంతా దుమ్ముతో వీధిలో వెళుతున్న దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపి దమయంతిని అంతఃపురానికి పిలిపించింది. 

రాజమాత దమయంతితో "అమ్మా! నిన్ను చూస్తుంటే రాచకళ ఉట్టి పడుతుంది.
నీవు ఎవరు?" అని అడిగింది.
దమయంతి "అమ్మా! నా భర్త జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాడు. నన్ను అడవిలో ఒంటరిగా విడిచి వెళ్ళాడు. అతనిని వెతుకుతూ తిరుగుతున్నాను" అని చెప్పింది. రాజమాత "అమ్మా! ఇకనుండి నువ్వు నా దగ్గర సైరంధ్రిగా ఉండు.
నీకు ఏ లోటూ రాకుండా నేను చూస్తాను.
నీ భర్తను వెతికిస్తాను" అని చెప్పింది.
దమయంతి అందుకు అంగీకరించి "అలాగే ఉంటానుకానీ నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలీ తినను,
పరులకు కాళ్ళుపట్టనుపరపురుషులతో మాట్లాడను.కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్ళే బ్రాహ్మణులతో మాత్రం మాట్లాడు తాను" అని చెప్పింది.రాజమాత అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపింది.

దమయంతి అక్కడే ఉండిపోయింది.నలుడు వికృతరూపుడగుట..

దమయంతిని వదిలివెళ్ళిన నలుడు అడవిలో ప్రయాణిస్తుండగాఅడవి అంతటా దావానలం వ్యాపించింది.

ఆ మంటల మధ్యనుండి "రక్షించండి రక్షించండి" అన్న ఆర్తనాదం వినిపించింది.

ఆ ఆర్తనాదం విని నలుడు అగ్నికీలల నడుమ ఉన్న నాగ కుమారుని రక్షించాడు.

ఆ పాము నలుని కాటు వేసింది.

పాము కాటుకు నలుడు వికృత రూపుడయ్యాడు. అప్పుడు ఆ పాము తన నిజరూపంతో ప్రత్యక్షం అయి నలునితో "నలమహారాజా! నా పేరు కర్కోటకుడు.

నేను నిన్ను కాటువేసానని భయపడకు ఇక నిన్ను ఎవరూ గుర్తించరు. పాముకాటు నిన్ను ఏమీ చేయదు.నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది,నీ భార్య నీకు దక్కుతుందినీకు ఎప్పుడు నిజరూపం కావాలన్నా,నన్ను తలచుకుంటే నీ వద్దకు ఒక వస్త్రం ఎగురుతూ వస్తుంది.
దానిని కప్పుకుంటే నీ పూర్వాకృతి వస్తుంది నీకు మరొక విషయం చెప్తాను..
ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశస్థుడైన రుతుపర్ణుని రాజ్యం ఉంది.నీవు అక్కడికి వెళ్ళు.

బాహుకుడు అనే పేరుతో అతని వద్ద రధసారధిగా చేరు. నీవు అతనికి అశ్వహృదయం అనే విధ్యను ఇచ్చి అతనినుండి అక్షహృదయం అనేవిద్యను గ్రహించు"అని చెప్పి కర్కోటకుడు వెళ్ళాడు. నలుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు.
అలాగే వంటశాలలో చేరి రుచికరమైన వంటలు వండి పెట్టసాగాడు. నలునికి జీవలుడు సహాయకుడుగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నానలుడు ఎప్పుడూ దమయంతిని తలచి దుఃఖిస్తూ ఉండేవాడు.ఒకరోజు నలుడు దమయంతిని తలచుకుని దుఃఖిస్తూండగా జీవలుడు విని ఈ వికృతరూపి ప్రియురాలు ఎంత వికృతరూపంతో ఉంటుందో అనుకుంటూ నలుని దగ్గరకు వచ్చివిషయం ఏమిటని అడిగాడు.
అందుకు నలుడు జీవలునితో "అయ్యా నాకు ఒక ప్రేయసి కూడానా.
నాకు తెలిసిన ఒక సైనికుడు తన ప్రేయసిని గురించి దుఃఖిస్తుండగా చూసాను.
అతనిని అనుకరిస్తూ ఏడుస్తున్నాను" అన్నాడు దమయంతి విదర్భ దేశానికి చేరుట..
విదర్భదేశంలో ఉన్న భీమునికి నలుని విషయాలు తెలిసాయి.తన కూతురుఅల్లుడు ఏమయ్యారో అని పరితపించాడు.వారిని వెదకడానికి నలువైపులా బ్రాహ్మణులను పంపించాడు.ఎన్నో బహుమానాలు ప్రకటించాడు.

ఛేదిదేశం చేరిన బ్రాహ్మణుడుదమయంతి నుదుటన ఉన్న పుట్టుమచ్చని చూసి ఆమెను గుర్తించాడు.

అతడు దమయంతితో "అమ్మా! నేను నీ తండ్రి వద్దనుండి వస్తున్నాను.

అక్కడి వారంతా క్షేమం.

నేను నీ సోదరుని మిత్రుడను" అనగానే దమయంతి వారిని తలచుకుని పెద్దగా రోదించింది.

అది చూసిన రాజమాత ఆ బ్రాహ్మణుని చూసి "బ్రాహ్మణోత్తమా! ఈమె ఎవరి భార్య?

ఎవరి కూతురు?

ఇలా ఉండటానికి కారణం ఏమిటి?" అని అడిగింది. అందుకు అతడు "అమ్మా! ఈమె విదర్భరాజు కుమార్తె. నలచక్రవర్తి భార్య.

ఈమె పేరు దమయంతి.

అతడు విధివశాత్తు రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు.

భీముని ఆజ్ఞపై ఈమెను వెతుకుతూ ఇక్కడికివచ్చి ఈమెను గుర్తించాను" అన్నాడు.

అది విని దయంతిని కౌగలించుకున్న రాజమాత "దమయంతీ! నీవు నాకు పుత్రికా సమానురాలివి.

నేనునీ తల్లి దశార్ణరాజు కుమార్తెలము. నీ తల్లి విదర్భరాజును వివాహమాడింది.
నేను వీరబాహును వివాహమాడాను" అన్నది. అందుకు అందరూ ఆనందపడ్డారు.
దమయంతి బ్రాహ్మణునితో పుట్టింటికి ప్రయాణం అయింది.
దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించుట..
రాజ సౌధంలో ఉన్నా దమయంతి భర్తృవియోగంతో బాధపడుతూనే ఉంది.
ఆమె తనతండ్రితో "నా భర్తను తక్షణం వెతికించండి. ఆయన లేకుండా నేను బ్రతక లేను" అన్నది.

భీముడు వెంటనే బ్రాహ్మణులను పిలిచి నలుని వెతకమని చెప్పాడు.
వారితో దమయంతి ఇలా చెప్పింది. "నా భర్త ఇప్పుడు రాజ్యభ్రష్టుడు కనుక,
మారు వేషంలో ఉంటాడు.
మీరు వెళ్ళిన రాజ్య సభలలో ఈ విధంగా ప్రకటించండి. "నీవు సత్యసంధుడవు కాని,
నీ సతిని వంచించావు.

ఆమె సగం వస్త్రం ధరించి వెళ్ళావు.అలా చెయ్యడం ధర్మమా?
నాపై కరుణ చూపు" అని చెప్పండి.

ఈ మాటకు ఎవరైనా రోషపడి బదులిస్తే,నా వద్దకు వచ్చి చెప్పండి" అన్నది.
అలా నలుని వెదకడానికి వెళ్ళినవారంతా నలుని జాడ తెలుపక పోయినా,

వారిలో పర్ణాదుడు అనే విప్రుడు దమయంతితో "అమ్మా! నేను ఋతుపర్ణుని రాజ్యంలో నీవు చెప్పినట్లే చెప్పాను. అక్కడ ఒక కురూపి వంటవాడు,

సారధి అయిన బాహుకుడు అనేవాడు నన్ను రహస్యంగా కలుసుకుని, 'అయ్యా! భర్త కష్టాలలో ఉన్నా సహించిఆదరించే భార్య ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖపడుతుందిఅన్నాడు" అని దమయంతితో చెప్పాడు.

దమయంతి ఆలోచించగా అతడు నలుడు కాకపోతే అలా ఎందుకు బదులిస్తాడు అనుకుంది.

తన అనుమానం దృఢపరచుకోవడానికి తల్లి అనుమతితో సుదేవడనే బ్రాహ్మణుని పిలిపించింది.

"సుదేవా నీవు ఋతుపర్ణుని రాజుతో, "రాజా! భీముడు తన అల్లుని కొరకు వెతికించినా ఫలితం లేదు కనుక ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు.

భూమండలం లోని రాజులంతా వస్తున్నారు.

మరునాడే స్వయంవరం కనుక వెంటనే బయలుదేరు" అని చెప్పుఅని చెప్పి పంపింది.

సుదేవుడు ఋతుపర్ణునితో దమయంతి చెప్పమన్నట్లే చెప్పాడు.

నలుడు స్వయంవరానికి బయలుదేరుట..

దమయంతి బ్రాహ్మణుని ద్వారా పంపిన సందేశం విని ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్ళాలని అనుకున్నాడు. ఒకరోజులో విదర్భను చేరటం ఎలా?

అనుకుని సారధి అయిన బాహుకుని పిలిచి "బాహుకా! దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు.

నాకు చూడాలని ఉంది. ఒక్కరోజులో మనం విదర్భకు వెళ్ళాలి. నీ అశ్వసామర్ధ్యం ప్రకటించు" అన్నాడు.సరే అని చెప్పినా బాహుకుడు మనస్సు కలతకు గురైంది. "నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టి కదాదమయంతి రెండవ స్వయంవరం ప్రకటించింది. అవివేకులైన పురుషులు తాము ఏమి చేసినా భార్య ప్రేమిస్తుందని అనుకుంటారు,

కాని అది నిజంకాదు.నా మీద కలిగిన కోపంతో దమయంతి ఇలా చేసింది.
అని దుఃఖించాడు.

"అయినా దమయంతి పతివ్రత.ఇద్దరుపిల్లల తల్లి.ఈ విధంగా రెండవ పెళ్ళి చేసుకుంటుందాఏమో?
ఆ వింత చూస్తాను" అని మనసులో అనుకున్నాడు.

వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుని తీసుకుని ప్రయాణం అయ్యాడు.

ఋతుపర్ణునికి రథం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుని రథంలాహుకుడు అనూరుడిలాఅనిపించింది.

పక్కనే ఉన్న వార్ష్ణేయుడికి అదే సందేహం కలిగింది. "భూలోకంలో నలునికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉందికాని ఈ కురూపి నలుడెలా ఔతాడు" అని మనసులో అనుకున్నాడు.

ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారిక్రింద పడింది "బాహుకా రథం ఆపువార్ష్ణేయుడు దిగి ఉత్తరీయం తీసుకు వస్తాడు" అన్నాడు.

బాహుకుడు "మహారాజా! మనం ఆమడ దూరం వచ్చేసాం.

అంతదూరం నడుచుకుంటూ ఎలా తీసుకు రాగలడు?" అన్నాడు.

అతని రథ సారథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు.

తన పరిజ్ఞానాన్ని బాహుకునికి చూపించాలన్న ఆసక్తి కలిగింది.

అంతలో రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది.

ఋతుపర్ణుడు బాహుకునితో "బాహుకా ఆ వృక్షంలో ఎన్ని కాయలుఎన్ని పూలుఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను " అని అన్నాడు.

బాహుకుడు "చెప్పండి మహారాజా" అని అడిగాడు. ఋతుపర్ణుడు చెప్పాడు లెక్కించి చూస్తే కాని నమ్మను అని రథం ఆపి ఆ చెట్టుని పడగొత్తించి లెక్కించాడు. ఋతుపర్ణుడు చిప్పిన లెక్కకు కచ్చితంగా సరిపోయింది. బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు.

ఋతుపర్ణుడు "బాహుకా ఇది అక్షవిద్య అనే సంఖ్యాశాస్త్రం" అన్నాడు.

అప్పుడు బాహుకుడు "మహారాజా! ఇందుకు ప్రతిగా నేను నీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పుతాను" అన్నాడు.

ఋతుపర్ణుడు "ఇప్పుడు కాదుతరువాత అడిగి నేర్చుకుంటాను" అన్నాడు.

అక్షహృదయ విద్య మహిమవలన నలునిలో నుండి కలి వెలుపలికి వచ్చాడు.

తనను క్షమించమని నలుని వేడుకున్నాడు.

నలుడు ఆగ్రహించి శపించబోయాడు.

కలి నలునితో "నలమహారాజా! నిన్ను ఆవహించి నీలో ఉన్న సమయంలో నిన్ను కర్కోటకడు కాటువేయడం వలన అనుక్షణం కాలి పోయాను.

ఇంతకంటే శాపం ఏముంది,

నన్ను క్షమించి విడిచిపెట్టు" అని వేడుకున్నాడు.
నలుని రథం విపరీతమైన ఘోషతో విదర్భలో ప్రవేశించింది.
ఆ ఘోష వినిదమయంతి అది నలుని రథం అని గుర్తుపట్టింది.
కాని రథంలో ఋతుపర్ణుని చూసి నిరాశ చెందింది. భీముడు ఎంతో ఆనందంతో ఋతుపర్ణుని ఆహ్వానించి విడిది చూపాడు.
ఋతుపర్ణునికి విదర్భలో స్వయంవరం జరుగుతున్న సందడి కనిపించ లేదు.
బాహుకుడు రథాన్ని అశ్వశాలలో నిలిపిసేదతీరాడు.
తిరిగి కలుసుకున్న నల దమయంతులు.
దమయంతి తన దాసితో "వచ్చింది ఋతుపర్ణ మహారాజు అతని సారధి వార్ష్ణేయుడు.

వారు నాకు తెలుసు,కాని వారి వెంట ఉన్న కురూపి ఎవరు?

అతనిని చూసి నా మనసు పరవశించి పోతుంది.

అతని వివరాలు తెలుసుకుని రా" అని పంపింది.

దాసి నలుని వద్దకు వచ్చి "అయ్యా! రాకుమారి మీ యోగ క్షేమాలు కనుక్కుని రమ్మంది" అని చెప్పింది.

నలుడు "మీ రాకుమారి స్వయంవరం ప్రకటించింది కదాదానికి నేను మా మహారాజును ఒక్కరోజులో నూరు ఆమడల దూరం ప్రయాణించి తీసుకు వచ్చాను అని చెప్పు "అన్నాడు.

"మీతో వచ్చిన మూడవ వ్యక్తి ఎవరు?" అని దాసి అడిగింది.

నలుడు "అతడు వార్ష్ణేయుడు.

ఇంతకు ముందు నలుని సారధి" అన్నాడు.

దాసి "అతనికి నలుని జాడ తెలుసు కదా?" అని అడిగింది.

నలుడు దాసితో "తనరాజ్యాన్ని పోగొట్టుకునేముందు నలుడు తన పిల్లలనిచ్చి వృష్ణేయిని విదర్భకు పంపాడు. ఆ తరువాత వార్ష్ణేయుడు ఋతుపర్ణుని వద్ద సారధిగా చేరాడు.

నలుని గురించి నలునికి తెలియాలిలేదా అతని భార్యకి తెలియాలి,

వేరొకరికి తెలిసే అవకాశం లేదు" అన్నాడు బాహుకుడు. దాసి "అయ్యా! నలుడు తనను ప్రాణపదంగా చూసుకునే భార్యను నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచి వెళ్ళాడు. దమయంతి నలుడు విడిచి వెళ్ళిన సగంచీర ధరించి కాలం గడుపుతోంది.

ఆమెను ఇలా విడిచి వెళ్ళడం ధర్మమా?" అని అడిగింది. నలుని కంట నీరు పెల్లుబికింది.

అది దాసికి తెలియ కూడదని మొహం తిప్పుకున్నాడు. దమయంతికి దాసి జరిగినదంతా వివరించింది.

దమయంతి దాసితో "సందేహం లేదు,

అతడు నలుడే.

అయినా ఈ వికృత రూపం ఏమిటి?

అతను వంటవాడు అని చెప్పారు కనుక,

వంట ఎలా చేస్తాడో పరీక్షించు" అని పంపింది.

దాసి వెళ్ళి నలుని నిశితంగా పరిశీలించి "అమ్మా! అతను సామాన్యుడు కాదు.

అతడు ఏ పని అయినా సునాయాసంగా చేస్తున్నాడు. అతడు గడ్డిని విదిలిస్తే మంటలు వస్తున్నాయి.

వంట పూర్తయే వరకు అలా మండు తున్నాయి.

వంటలు అద్భుతంగా ఉన్నాయి" అని దమయంతికి చెప్పింది.

దమయంతి నలుడు వండిన వంటలు తెప్పించి రుచి చూసి "సందేహం లేదు,

ఇవి నలుని వంటలే" అని గ్రహించి,

దాసితో తన పిల్లలను నలుని వద్దకు పంపింది.

నలుడు వారిని చూసి చలించి ఎత్తుకుని ముద్దాడాడు. దాసితో "అమ్మా! ఏమీ అనుకోవద్దు,

వీరిని చూస్తే నా బిడ్డలు గుర్తుకు వచ్చారు అందుకే అలాచేసాను.

ఇక నువ్వు నా వద్దకు రావద్దు.ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు అయినా మేము విదేశాలనుండి వచ్చిన అతిధులంమాతో నీకేం పని?" అన్నాడు.

ఇది విని దమయంతి సంతోషపడి తన తల్లి వద్దకు వెళ్ళి "ఋతుపర్ణుని సారధిగా వచ్చిన కురూపి బాహుకుడే నలుడు.అమ్మా అతను ఇక్కడకు వస్తాడా,

నేను అక్కడకు వెళ్ళాలా నువ్వే నిర్ణయించు" అని అడిగింది.

భీమరాజు అనుమతితో ఆమె బాహుకుడిని దమయంతి వద్దకు రప్పించింది.

దమయంతి నలుని చూసి, "అయ్యా నిస్సహాయంగా ఉన్న నన్ను నా భర్త నలమహారాజు నట్టడవిలో నిర్డాక్షిణ్యంగా వదిలి వెళ్ళాడు.

అలా సంతానవతినైన నన్ను విడిచి పెట్టడం ధర్మమాఅలా చేయడానికి నేనేమి అపకారం చేసాను?

అగ్ని సాక్షిగా విడువను అని నాకు ప్రమాణం చేసిన భర్త అలా చేయవచ్చా?" అని దుఃఖించింది.

నలుడు "సాధ్వీ! ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు.

అందువలన నేను అలా చేసాను.

జూదంలో సర్వం పోగోట్టుకుని బాధలు పడుతున్న నేనునాతోపాటు బాధలు పడుతున్న నీ బాధను సహించ లేకనిన్ను విడిచి వెళ్ళాను.

అలా చేస్తే నువ్వైనా నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటావని అలా చేసాను.

నీపై అనురాగంతో మిమ్మల్ని చూడటానికే నేను ఇక్కడకు వచ్చాను.

మరొక భర్తకోసం స్వయంవరం ప్రకటించడం కులస్త్రీలకు తగునా?

అలా ఎందుకు చేసావు?

అందుకే కదా ఋతుపర్ణుడు వచ్చాడు.

ఇది ధర్మమా?" అని దమయంతిని అడిగాడు. దమయంతి "నాధా నేను మీకోసం గాలిస్తూ పంపిన విప్రులలో అయోధ్యకు వెళ్ళిన విప్రుడు మిమ్ములను గుర్తించాడు.

మిమ్మలిని రప్పించుటకే ఇలా చేసాను.

మీరుకాకఇంకెవరు నూరు యోజమలు దూరం ఒక్క రోజులో ప్రయాణించగలరు?

నాలో ఎటువంటి పాపపు తలపు లేదు అని
మీ పాదములు అంటి నమస్కరించి ప్రమాణం చేస్తున్నాను" అని దమయంతి నలుని పాదాలకు నమస్కరించింది.

వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు "నలచక్రవర్తీ! ఈమె పవిత్రురాలుపతివ్రత.

నేనుసూర్యుడుచంద్రుడు ఈమె సౌశీల్యం కాపాడుతున్నాము" అని పలికాడు.

నలుడు కర్కోటకుని స్మరించాడు

వెంటనే ఒక వస్త్రం వచ్చింది.

అది ధరించగానే నలునికి ఇంద్రతేజస్సుతో సమానమైన మనోహరమైన పూర్వరూపం వచ్చింది.

దమయంతిని పరిగ్రహించాడు.

నలదమయంతులు రాజ్యాన్ని పొందుట..

సభలో నల దమయంతులు.

నలుడు విదర్భలో ఒక మాసం ఉండి,

తన రాజధానికి వెళ్ళి పుష్కరుని కలిసాడు.

నలుడు పుష్కరునితో "పుష్కరా!జూదమాడటం నీకు ప్రియం కదా.

నేను నా భార్య దమయంతిని ఫణంగా పెడతాను,

నీవు నీ సర్వస్వం పెట్టి నాతో ఆడతావా?

లేదా నాతో యుద్ధం చెయ్యిఎవరు గెలిస్తే వారిదే రాజ్యం నీకేది ఇష్టమో నిర్ణయించుకో" అన్నాడు.పుష్కరుడు జూదప్రియుడు పైగా ఒకసారి జూదమాడి గెలిచాడు కనుక అతడు నలునితో "నేను జూదమే ఆడతాను" అన్నాడు.

నలుడు పుష్కరునితో జూదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడు.

పుష్కరునితో "పుష్కరానేను ఇదివరకు నీతో జూదమాడినపుడు నన్ను కలి ఆవహించి ఉన్నాడు.

కనుక ఓడి పోయాను,

నీబలం వలన కాదు.

నీవు నా పిన తండ్రి కుమారుడివి కనుక,

నిన్ను ఏమి చేయను వెళ్ళు" అని చెప్పి పంపాడు.

ఫలశ్రుతి:.

ఈ నలుడి గాధ శ్రద్ధతో వినేవారు,

సమావేశాలలో చదివి వినిపించేవారు,

కలి వలన సంభవించే దోషాల నుండి విముక్తి చెందగలరు. సర్వపుణ్యకార్యాలు చేసినప్పుడు లభించే పుణ్యఫలితాలు నలోపాఖ్యానం విన్నవారికి,

వినిపించిన వారికి కూడా లభిస్తాయి.

అటువంటి వారికి బహుపుత్రలాభం,

పౌత్రవృద్ధి,

ఆయురారోగ్యధనసంపత్తులు కలుగుతాయి. విషప్రయోగం నుండి బాధలు,

చెడు విషయాలలోని లంపటత్వం వారిని అంటవు!

వారు ధర్మాత్ములు కాగలరు.

కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ |

ఋతుపర్ణశ్చ రాజర్షే కీర్తనం కలినాశనం ||

కర్కోటకుడనే నాగుడిని,

దమయంతిని,

పుణ్యశ్లోకుడైన నలుడిని,

ఋజుచరిత్రుడైన ఋతుపర్ణుడిని

ధ్యానించి కీర్తించినకలిభయాలు తొలగగలవు..

స్వస్తి..!

--(())--

--((***))--
స్వస్తి..!

--(())--

--((***))--

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ