Posts

సంస్కృతం

Image
  శ్రీ మాతంగసుతాప్రియం, శ్రీచెంద్రశేఖరాశ్రితామ్ సోమాంశుమౌళిరాజితమ్ బోధత్వ దివ్యమంగళమ్ భీమాభిరూపవిశ్వేశం,భీతిమార్పు విశ్వనాదమ్ నిలకంఠ సమాశ్రయే నిత్య హృదయ నిర్మలమ్ భావసారం: శ్రీమాతంగసుత (పార్వతీదేవి)కు ప్రియుడైన పరమేశ్వరుడు, చంద్రశేఖరుని ఆశ్రయించిన దివ్యస్వరూపుడు, చంద్రమండల కాంతితో మౌళి ప్రకాశించే మహాదేవుడు — ఆయనదివ్యమంగళ స్వరూపం మనకు జ్ఞానాన్ని ప్రసాదించుగాక. భయాలను తొలగించే విశ్వనాథుడు, భీమరూపుడై జగత్తును రక్షించే నీలకంఠుడు — ఆయనఆశ్రయం హృదయాన్ని నిత్యం నిర్మలంగా ఉంచుతుంది. **** అ. అనుబంధాః ఆత్మీయానురాగబంధాః జీవామృతాః । సుగంధపరిమళాః సఖ్యతా సహవాసామృతాః । అక్షరసత్యభావభిన్నేష్వపి ఏకం ఆప్యాయామృతాః । జీవనగౌరవమర్యాదా సద్భావ ఉత్తేజామృతాః ॥ భావము..ఆత్మీయ అనురాగ బంధాలు జీవామృతములు.స్నేహ సహవాసాలు సుగంధ పరిమళామృతములు.అక్షర సత్యభావ భిన్నతలలోనూ ఏకత్వం ఆప్యాయామృతము.జీవన గౌరవ మర్యాదలు, సద్భావ ప్రోత్సాహాలు అమృతస్వరూపములు. ********  మూఢమతేః భావాతీత- విన్యాసప్రావిణ్యత్వమ్ । ఇహలోకే సహభావ్యం సమర్థత్వం సద్భావమ్ ॥ సరళ భావం..మూఢమనస్సు దాటి భావాతీత స్థితిని గ్రహించగల విన్యాస ప్రావీణ్యం అవసరం. ఈ ...

24*05

Image
  టిప్పు  తన కుమారులిద్దరిని బ్రిటిష్ వారికి బందీలుగా అప్పగించాడు. ......................................... టిప్పు తన కుమారులిద్దరిని బ్రిటీష్ సామ్రాజ్యానికి బందీలుగా అప్పగించిన సంఘటన భారతదేశ చరిత్రలో అత్యంత  రాజకీయంగా ప్రాధాన్యతగల అంశంగా నిలిచిపోయింది. ఈ ఘటన మూడో ఆంగ్ల మైసూరు యుద్ధానంతరం చోటుచేసుకుని,  నాటి పరిస్థితులలో బ్రిటిష్ ఈస్టిండియా వారి శక్తిసామర్థ్యాలు  వారి మిత్రపక్షాల దౌత్య విధానాలు మరియు బ్రిటిషు వలసపాలన లక్ష్యాలను స్పష్టంగా ప్రతిబింబింప చేసింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరాఠాలు హైదరాబాద్ నిజాం సంయుక్త సేనల చేతిలో పరాజయం పొందిన టిప్పు  1792 లో శ్రీరంగపట్టణం సంధి షరుతులపై సంతకం చేయవలసి వచ్చింది.  ఈ ఒప్పందం ప్రకారం అతను తన రాజ్యంలోని  సగభాగాన్ని మిత్రపక్షాలకు కోల్పోవడంతోపాటు సుమారు 33 కోట్లరూపాయల పరిహారం వారికి చెల్లించాల్సి వచ్చింది. ఈ మొత్తాన్ని సకాలంలో చెల్లిస్తానడానికి భరోసాగా టిప్పు తన ఇద్దరు చిన్న కుమారులను బ్రిటిష్  వారికి బందీలుగా అప్పగించాల్సి రావడమనేది ఒప్పందంలోని అత్యంత కఠినమైన నిబంధనగా నిలిచింది. అబ్దుల్ ఖలీఖ్ సుమా...
తిరుమల ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కాంస్యవిగ్రహముoది కదా! దానిని అక్కడ ప్రతిష్టించమని ఆదేశించింది ఎవరు ? ........................................... తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి ఇచ్చిన దానాలు - చరిత్ర. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత పురాతనమైన నిరంతరం ఆరాధించబడుతున్న వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. శతాబ్దాల పాటు రాజులు చక్రవర్తులు సామంతులు నాయకులు అమరనాయకులు మంత్రులు జమీందారులు పాళేగాళ్ళు వర్తకులు సామాన్య భక్తులు అందరూ నిత్యసేవలకు సంపదలు భూదానాలు ఆభరణాలు నిధులు సమర్పించారు. ఈ దానాలే నేటి ఆలయ వైభవానికి పునాది. తరతరాల భక్తుల ఔదార్యమే తిరుమలను నేడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటిగా నిలిపింది.  ఆలయ గోడలపై చెక్కబడిన వేలాది శాసనాలు లభించిన రాగిరేకులు మరియు దేవస్థానం ఎపిగ్రఫీ విభాగం ప్రచురించిన సంకలనాలు దీనికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. తిరుమలలో ఇప్పటివరకు లభించిన అత్యంత పురాతన దాన శాసనం ACE 966 కు చెందినది. పల్లవ రాజు శక్తివంతన్ మహారాజు భార్య సమవై పెరిందేవిగారు వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. విలువైన ఆభరణాల...
  పట్టుకోండి బంధించండి రాకుమారిని ఎత్తుకుపోతున్నాడు ! .............................................. తమిళనాడులోని కృష్ణాపురంలోని వెంకటాచలపతి ఆలయం 16వ శతాబ్దపు నాయక శిల్పసంప్రదాయానికి అత్యున్నత ఉదాహరణగా చెప్పవచ్చు.మదురై నాయక రాజవంశానికి చెందిన కృష్ణప్పనాయకుడి ఏలుబడిలో నిర్మించబడిన ఈ ఆలయం కళా నైపుణ్యం శిల్పవైభవం వాస్తు సౌందర్యం మొదలైనవి కలగలిపిన అద్భుత కట్టడం.మధురైనాయక వంశ స్థాపకుడైన విశ్వనాథ నాయకుడి కుమారుడైన కృష్ణప్ప నాయకుడు ACE 1564–1572 మధ్యకాలంలో మదురైని కేంద్రంగా పాలించినప్పటికీ తన స్వల్ప పాలనాకాలంలోనే అనేక ఆలయ నిర్మాణాలకు కళా పరిరక్షణకు విశేష కృషి చేశాడు. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది వీరప్ప నాయకర మండపం. నాయకయుగ శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే ఈ మండపంలోని శిల్పాలు ప్రపంచవ్యాప్తంగా కళాభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఒకే గ్రానైట్ శిలపై చెక్కబడిన వేటగాడైన కురవడు రాజకుమారి శిల్పం అసాధారణమైన కళాఖండంగా గుర్తింపు పొందింది.ఇందులో ఒక వేటగాడైన కురవడు తన భుజాలపై రాజకుమారిని వేసుకొని పరుగెత్తుతున్నట్లు సహజంగా వుండగా రాజకుమారి ముఖంలో భయం కాకుండా ప్రశాంతమైన చిరునవ్వు కనిప...