పట్టుకోండి బంధించండి రాకుమారిని ఎత్తుకుపోతున్నాడు !

..............................................

తమిళనాడులోని కృష్ణాపురంలోని వెంకటాచలపతి ఆలయం 16వ శతాబ్దపు నాయక శిల్పసంప్రదాయానికి అత్యున్నత ఉదాహరణగా చెప్పవచ్చు.మదురై నాయక రాజవంశానికి చెందిన కృష్ణప్పనాయకుడి ఏలుబడిలో నిర్మించబడిన ఈ ఆలయం కళా నైపుణ్యం శిల్పవైభవం వాస్తు సౌందర్యం మొదలైనవి కలగలిపిన అద్భుత కట్టడం.మధురైనాయక వంశ స్థాపకుడైన విశ్వనాథ నాయకుడి కుమారుడైన కృష్ణప్ప నాయకుడు ACE 1564–1572 మధ్యకాలంలో మదురైని కేంద్రంగా పాలించినప్పటికీ తన స్వల్ప పాలనాకాలంలోనే అనేక ఆలయ నిర్మాణాలకు కళా పరిరక్షణకు విశేష కృషి చేశాడు.


ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది వీరప్ప నాయకర మండపం. నాయకయుగ శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే ఈ మండపంలోని శిల్పాలు ప్రపంచవ్యాప్తంగా కళాభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఒకే గ్రానైట్ శిలపై చెక్కబడిన వేటగాడైన కురవడు రాజకుమారి శిల్పం అసాధారణమైన కళాఖండంగా గుర్తింపు పొందింది.ఇందులో ఒక వేటగాడైన కురవడు తన భుజాలపై రాజకుమారిని వేసుకొని పరుగెత్తుతున్నట్లు సహజంగా వుండగా రాజకుమారి ముఖంలో భయం కాకుండా ప్రశాంతమైన చిరునవ్వు కనిపిస్తోంది.అంటే తను ప్రేమించిన అమ్మాయిని అపహారించడమన్నమాట.ఈ శిల్పాన్ని కొందరు శ్రీకృష్ణుడు రుక్మిణిని స్వయంవరం నుండి తీసుకువెళ్తున్న ఘట్టానికి ప్రతీకగా భావించగా అది అలా కాదని మరికొందరు దీనిని స్థానిక జానపద గాథ ఆధారంగా రూపొందించిన దృశ్యమని అభిప్రాయపడుతున్నారు. కురవడు తాము పరస్పరం ప్రేమలో వుండగా రాకుకుమారి తండ్రి వారి ప్రేమను కాదన్నందుకు కురవడు ధైర్యంతో సాహసంతో అంత:పురాన్ని ప్రవేశించి ప్రియురాలిని అపహరించి వెళ్ళిపోతున్నాడు.


ఈ శిల్పంలోని శరీర నిర్మాణ చిత్రణ నాయక శిల్పుల అసాధారణ ప్రతిభను ప్రతిబింబిస్తుంది. పరుగులో కురవని కండరాలు బిగుసుకుపోవడం, పక్కటెముకల ఆకృతి నరాల ఉబ్బు ముఖంలోని ముడతలు చేతివేళ్ల గోర్ల వరకు సూక్ష్మంగా చెక్కబడిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. రాతి శల్పం అనడంకంటే సజీవ మానవ రూపమే మన ముందున్నట్లు అనిపించే ఈ నిజరూప శైలి నాయకయుగ శిల్ప కళాకారులకు మానవశరీర నిర్మాణంపై . అవగాహనను తెలియజేస్తుంది.


ఈ స్తంభం ప్రత్యేకత కేవలం ఈ ప్రధాన శిల్పంతో ముగియదు. స్తంభం నాలుగు వైపులా కురవడి కథ క్రమంగా కొనసాగుతుంది. రాజకుమారిని రక్షించేందుకు పరుగులు తీస్తున్న రాజభటులు గుర్రాలపై వెంటాడుతున్న యోధులు ఆందోళనతో చూస్తున్న పరిచారకులు,ప్రతి వైపు ఒక కొత్తదృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది.ఒకే స్తంభంపై శిల్పరూపంలో కథనాన్ని నిర్మించిన ఈ పద్ధతి దక్షిణ భారత శిల్పకళలో అరుదైన కళాత్మక ప్రయోగంగా చెప్పవచ్చు.


వీరప్ప నాయక మండపంలోని మరో విశేషం సంగీత స్తంభాలు. ఈ స్తంభాలను మృదువుగా తట్టినప్పుడు భిన్న స్వరాలు వినిపిస్తాయని చెబుతారు. నిర్దిష్ట రాతిని ఎంపిక చేయడం దాని అంతర్గత నిర్మాణాన్ని శాస్త్రీయంగా చెక్కడం ద్వారా ఈ ధ్వని లక్షణాలను సాధించారని భావిస్తారు. తమిళనాడులోని మరికొన్ని ఆలయాల్లో కూడా సంగీత స్తంభాలు కనిపించినప్పటికీ, కృష్ణాపురం మండపంలోని శిల్పకళా నైపుణ్యంతో అవి మరింత విశిష్టతను సంతరించుకున్నాయి.


నాయకుల పాలన తమిళనాడు కళా, సాంస్కృతిక చరిత్రలో ఒక సువర్ణయుగంగా పరిగణించబడుతుంది. చోళులు, పాండ్యులు నెలకొల్పిన ద్రావిడ వాస్తు-శిల్ప సంప్రదాయాన్ని నాయకులు మరింత విస్తరించి, మహామండపాలు, శిల్పాలతో అలంకరించిన స్తంభాలు, గోపురాలు, ఉత్సవ మండపాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. మదుర మీనాక్షి వంటి మహాక్షేత్రాల విస్తరణలోనూ వారి పాత్ర ఎంతో ముఖ్యమైనది.


కృష్ణాపురం వెంకటాచలపతి ఆలయం కేవలం ఒక ఆరాధనా కేంద్రం మాత్రమే కాదది నాయకయుగ కళాత్మక దృష్టి శిల్ప నైపుణ్యం సాంస్కృతిక వైభవానికి సజీవ సాక్ష్యం. ప్రతి స్తంభం ప్రతిశిల్పం ప్రతి మండపం రాతిలో చెక్కబడిన ఒక చరిత్రగ్రంథంలా నిలిచి శతాబ్దాల తర్వాత కూడా సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంది.


॥సేకరణ॥

...................జిబి విశ్వనాథ 9441245857 అనంతపు రం.

చెం.

బడలికలెంతనున్నను ప్రభావ సుధావిధి వాక్కుగాయగున్

సడలక యోగకల్పమందు సాధన శోధన భావమేయగున్

వడలక నిత్య తేజదన వారధి తీరున సర్వమాయగన్

హడలక వేర్చ వచ్చు గతి నాత్మవిశుద్ధి తపంబు తీరుగన్॥

భావం:

జీవితంలో ఎంత అలసట వచ్చినా,

మంచి వాక్కు మరియు సద్భావ ప్రభావం మనిషిని నిలబెడతాయి.

యోగసాధనలో సడలకుండా ఉంటే ఆత్మశోధన సాధ్యమవుతుంది.

తేజస్సు, ధైర్యం విడిచిపెట్టకుండా ముందుకు సాగితే మాయలన్నీ తొలగిపోతాయి.

భయపడకుండా తపస్సుతో నడిచినవారికి ఆత్మవిశుద్ధి మార్గం లభిస్తుంది.

***†

చెం. విరహము యేలనామనసు వింతగ నుండుట నేమి సుందరీ 

సరిగమలేమనామృతముసారస రంజిత శోభ మంజరీ 

పరుగుల ప్రేమయేలను సు పాశపు తీవ్రత నాలొ యేలనో 

తరుణము నిన్ను గాంచు ఫలతత్త్వపు శోభను తీర్చు రాధవై

సరళ భావం :

ఓ సుందరీ!

ఈ విరహం వల్ల నా మనసు ఎందుకింత వింతగా మారిపోయిందో!

సరిగమల మాధుర్యంలా, అమృతసారంతో నిండిన కమలసౌందర్య మంజరివి నీవు.

ఈ పరుగుల ప్రేమ ఎందుకింత పాశబద్ధంగా, నా అంతరంలో తీవ్రమైన ఆవేదన కలిగిస్తుందో!

ఈ యౌవన క్షణంలో నిన్ను దర్శించి, ప్రేమతత్త్వపు పరిపూర్ణ శోభను అనుభవింపజేయి — రాధవై!

*****

ఉ. మెత్తని కళ్ళ మిక్కిలియె మోహము పెంచియు జీవ 

ధారిగాన్ 

కొత్త శుభంబుకాదిది సకోర్కెల తీరుగ మాన వాత్మగాన్ 

విత్తసమాగుణంబగు సువిద్యల లక్ష్యము నిత్య సత్యమున్ 

చిత్తము చెత్తమాటల విచిత్రము గాంచక సఖ్యతాభవమ్

సరళ భావం :

మెత్తని కన్నులు మోహాన్ని పెంచినా, అవి నిజమైన జీవనాధారం కావు.

కొత్త కొత్త కోర్కెలు తీరడమే శుభం కాదు; మానవాత్మకు అంతకన్నా ఉన్నతమైన లక్ష్యం ఉంది.

ధనం, గుణం, సువిద్య — ఇవన్నీ నిత్యసత్యాన్ని గ్రహించడానికి ఉపకరణాలు కావాలి.

మనసు చెత్తమాటల విచిత్రాలకు లోనుకాకుండా, సఖ్యతాభావంతో నడవాలి.

******.

మ. కో.రాధ నన్నుగ నమ్మకంబుగ రా వరాల సుధామణీ 

ఈ ధరాతల వైభవంబుగ యీప్సితంబుగ నేసుధీ 

సాధనంబగు నీదుయే కరుణాల గమ్యము సుందరీ 

వ్యాధిగా మది ప్రేమకాంక్షలు వాక్య పిల్పుగ రాధ రా


సరళ భావం :


ఓ రాధా!

నన్ను నమ్మకంతో ఆదరించు. వరప్రదమైన అమృతమణివంటిదానివి నీవు.

ఈ భూమిపై జీవన వైభవానికి, మనసు కోరిన శ్రేయస్సుకు నీవే ఆధారం.

నీ కరుణే సాధనకు మార్గం, నీ దయే సౌందర్యసారం.

ప్రేమకాంక్షలతో బాధపడుతున్న నా మనసుకు, నీ మాటలే ఔషధమై పిలుస్తున్నాయి — రాధా, రా!

*****

మ. కో. పప్పు జీసెది కాయ వృద్ధికి పాలు పంచు ససక్తిగన్

నుప్పు కారము నేస్తమావగ సూక్తి మాదిరి తీరుగన్

నిప్పు నీళ్ళగు తోడు వాడిక నీడతీరుగ జీవితమ్

గుప్పు గుప్పున వెళ్ళు వాయెను గుప్త విద్యల తీరుగన్

భావం :

పప్పు వంటి సాధారణ ఆహారం శరీర వృద్ధికి ఎంతగానో సహకరిస్తుంది. ఉప్పు, కారం భోజనానికి రుచిని ఇచ్చినట్లే, మంచి సూక్తులు జీవనానికి సారాన్ని ఇస్తాయి. నిప్పు–నీరు పరస్పర విరుద్ధమైనా అవసరమైనట్లే, జీవితంలో తోడు నిలిచే మనుషులు నీడవలె అవసరమవుతారు. గుప్పెడు గుప్పెడు గా వ్యాపించే గాలి వలె, గుప్త విద్యలు నిశ్శబ్దంగా లోకంలో వ్యాపిస్తాయని పద్యం సూచిస్తోంది.

****

మ. కో. కాచు మాతృభాష మనస్సు కాంతి నింపుచు జ్ఞానమున్

దాచు సద్గుణ భావ సంపద ధర్మ మార్గపు దీపమున్

దోచు లోభమె మోహ భావమె మాయ జాలమె దుర్గుణమ్

తూచు తత్త్వము జీవనంబగు తూలికైనది బుద్ధితో ॥

భావం :

మాతృమనస్సు, మాతృభాష మన జీవితంలో జ్ఞానకాంతిని ప్రసరింపజేస్తాయి; వాటిని కాపాడుకోవాలి. సద్గుణసంపదను హృదయంలో దాచుకొని, ధర్మమార్గాన్ని జీవనదీపంలా నిలుపుకోవాలి. లోభం, మోహం వంటి దుర్గుణాలు మన ఉన్నత లక్ష్యాలను దోచుకుపోతాయని గ్రహించాలి. అందువల్ల జీవన తత్త్వాలను బుద్ధితో తూచా తప్పకుండా పరిశీలిస్తూ నడవాలని ఈ పద్యం బోధిస్తోంది.

*******

మ.కో.

అడ్డు వచ్చెడి కష్టమన్నది ఆటబొమ్మగ తీరుగన్

తెడ్డు మాదిరి జీవనంబగు తిష్ట వేసెడి బంధమున్

వడ్డు చేరుట కాలసత్యము వాక్కు మాయలు విశ్వమున్

రడ్డు సేయక రవ్వ కాంతుల రమ్య జీవన తత్త్వమున్॥


భావం:

జీవితంలో ఎదురయ్యే కష్టాలను చిన్న ఆటబొమ్మల వలె భావించాలి.

జీవితం నావను నడిపే తెడ్డులా బంధాలు మనల్ని నిలబెడతాయి.

కాలసత్యం ముందు సంపదలు, మాటల మాయలు నిలవవు.

అడ్డంకులు సృష్టించకుండా చిన్న రవ్వకాంతిలా వెలుగునిచ్చే జీవనతత్త్వమే శ్రేష్ఠం.

*****

మ.కో.

కప్పి యున్నది సిగ్గుయంతయు కాయమందున వస్త్రమై

విప్పి విప్పక కప్పి కప్పక వెల్లువాయె సుసందడే

నొప్పి లేకయు ముప్పు రాకయు చొప్పినా విధి ముందరే

రొప్పియున్న సయోధ్యతాభవ రోషమవ్వక జీవితమ్॥

భావం:

శరీరాన్ని కప్పే వస్త్రములా సిగ్గు మనిషిని అలంకరిస్తుంది.

అతి ప్రదర్శనగానీ, అతి దాచుకోవడంగానీ కాకుండా సమతుల్య జీవనం అవసరం.

జీవితంలో ప్రమాదాలు రాకముందే విధి మనకు హెచ్చరికలు ఇస్తుంది.

కాబట్టి సయోధ్యతో జీవించాలి; కోపాన్ని జీవితస్వరూపంగా మార్చకూడదు.

*****

శా. సౌర్యావిద్యలగన్ సహాయ మునిగిన్ సౌభాగ్య సంసారిగాన్ 

క్రౌర్యం మ్మొప్పగ సర్వ వేళలసహాగాంచే విధానంబుగన్ 

భార్యాపుత్రమదీభవంబుగమనమ్ వర్ణించ కాలంబుగన్ 

భార్యాపుత్రధనేషణత్రయముతో బైరాగి భాసిల్లెడిన్.

 

భావం:

సూర్యుని వంటి ప్రకాశవంతమైన విద్యలను సంపాదించి,

సహాయకుల మధ్య సౌభాగ్యవంతమైన సంసారిగా జీవిస్తూ,

కొన్నిసార్లు క్రౌర్య స్వభావాన్ని ప్రదర్శిస్తూ,

అన్ని వేళలా కుటుంబ బంధాల నడుమనే కాలం గడుపుతున్నాడు.

అయితే అదే మనిషి —

భార్య, పుత్రులు, ధనం అనే ఈషణ త్రయం (మూడువిధాల మమకారం) కలిగియుండగానే,

తాను వైరాగ్యవంతుడినని చూపించుకుంటూ

బైరాగిలా భాసిల్లుతున్నాడని కవి వ్యంగ్యంగా పేర్కొంటున్నారు.

*****

గీ.

వాణి పలుకులన్ని మనసు వాక్యభావ

తనువు తృప్తి గాంచు ఫలము తన్మయంబు

మనము నిత్య మాయల చెంత మార్గమవ్వ

కాని వారి చెంత ముదము కలుగునంట॥

భావం:

మనిషి పలికే ప్రతి మాట అతని మనసులోని భావానికే ప్రతిబింబం.

ఆ భావంతో ఏకమైతే జీవితంలో తృప్తి కలుగుతుంది.

మనుషులు చాలాసార్లు మాయల మార్గంలో నడిచినా,

నిజమైన ఆనందం మాత్రం మంచివారి సన్నిధిలోనే లభిస్తుందని అంటారు.

*****

గీ.

కావ్యమన్న సంతసమున్న కాలమనసు

దండమగు తీరు ధరణిలో తనివితీర

బలములన్ని విద్యలగుటే పద్మనాభ

రిపుహరా! మది తత్త్వమురే పరెపలు.

భావం:

కవిత్వం మనసుకు ఆనందాన్నిచ్చే కాలస్వరూపం.

భూమిపై జీవనపోరాటాలు ఎన్నో ఉన్నా, జ్ఞానమే నిజమైన బలం.

ఓ పద్మనాభా! ఓ రిపుహరా!

మనసులో తత్త్వజ్ఞానం విస్తరించుగాక అని కవి ప్రార్థిస్తున్నాడు.

*****

గీ.

బంధనాలను తెంచుకో పాఠ్యమైన

ఇంధనాలను వాడుకో యిచ్చలేక

గంధ మధురిత పొందుకో కాలమందు

బాధలన్నీ మరచిపో శుభంబుగాను॥

భావం:

జీవితంలో బంధించే ఆలోచనల నుండి విముక్తి పొందాలి.

మనకు లభించిన శక్తి, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

కాలగమనంలో చందనగంధంలా మాధుర్యాన్ని సంపాదించాలి.

అప్పుడు బాధలను దాటి శుభమైన జీవితం పొందగలుగుతాం.

*****

గీ.

ప్రతిది యీ క్షణం కరువైన పాకమవ్వ

ప్రతిది రక్షణం గావిధి ప్రాణమవ్వ

ప్రతిది లక్షణంబట్టియే పాలు పంచ

ప్రతిది వీ క్షణం తప్పదు ఫాలనేత్ర॥


భావం:

ప్రతి క్షణం జీవితాన్ని పరిపక్వతవైపు నడిపించాలి.

ప్రతి రక్షణలోనే ప్రాణస్వరూపమైన విధి దాగి ఉంది.

ప్రతి వ్యక్తి తనలక్షణానికి అనుగుణంగా ఫలితాలను పొందుతాడు.

ఓ ఫాలనేత్రా! ఈ క్షణసత్యం ఎవరూ తప్పించుకోలేరు.

****

గీ. మగువ మాధుర్యతాభవ మాయ మనసు

ధుర్మ మవక చక్క బరచు దివ్య తనము

రమ్య బరిచేటు సఖ్యత రాత్రి పగలు

తత్త్వ తరతముల మలుపు తత్వ జ్యోతి

భావం :

మహిళ యొక్క మాధుర్యభావం మనసును ఆకర్షిస్తుంది. ధర్మమార్గాన్ని విడువక సౌమ్యత్వంతో నడిచే దివ్య స్వభావం జీవనాన్ని చక్కదిద్దుతుంది. రాత్రింబగళ్లు సఖ్యతను పంచే రమ్యత జీవనానికొక ఆనందరూపం. తత్త్వాల వివిధ స్థాయిల మలుపులను గ్రహించినప్పుడు జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది.

******

సీ. పద్య సెధ్యముయిది పాఠ్యపఠన మిది 

విద్య వినయమిది విలువ పెంచ 

పద్యభావపరము పాశ పలుకు పద్య 

గధ్య పద్య భవము గమ్య విద్య 

సాధ్య మనువిధము సామరస్య భవము 

భాద్యత కళగాను బంధ పద్య 

సోద్యమవని కాల సోకుపలుకు పద్య 

భోద్య పలుకు విద్య భుక్తి పద్య 


గీ. చెప్పు వానితీరున వ్రాయు చిత్త ముంచి 

ఒప్పు కోని విలువ చెప్ప నొప్పులేని 

అప్పుకాని ఫలము జూడ ఆశ పద్య 

ఇదియు మల్లాప్రగడ పద్య యిచ్ఛ తీరు

*****

కం. ప్రాణానికి పానముగా

జ్ఞానoవృద్ధిగను చెంద జ్ఞప్తికి మూలం

మానానికీ శాంతిగ టీ

నీమది రుచిగ మరిపించు నిత్యముగా టీ॥

భావం:

టీ ప్రాణానికి ఉల్లాసాన్నిచ్చే పానీయం.

జ్ఞాపకశక్తిని మేల్కొలిపి ఆలోచనలను చురుకుగా చేస్తుంది.

మనసుకు శాంతిని అందిస్తుంది.

దాని ప్రత్యేక రుచి నిత్యం మనల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది

****

గీ. కాచు తీక్షణ తక్షణంబగు కామ్య మాధురి కాంక్షగా

దాచు దర్పము శుద్ధ తన్మయ దారి జూపెడ కర్తగా

దోచు కోమని చూపులన్నియు దొడ్డ బుద్ధిగ కీర్తిగా

తూచు కొల్తలు దేనికోమరి స్ఫూర్తిగామది కాలమున్

భావం :

తక్షణమే ఆకర్షించే మాధుర్యకాంక్ష కలిగిన స్త్రీ, తనలోని దర్పాన్ని దాచుకొని శుద్ధమైన తన్మయతతో మార్గదర్శకురాలిగా నిలవాలి. ఆమె చూపులు మనసులను హరించినా, అది కేవలం రూపమాధుర్యంగా కాక గొప్ప బుద్ధి, కీర్తి వైపు నడిపించేదిగా ఉండాలి. కాలానుగుణంగా స్త్రీని కొలిచే ప్రమాణాలు మారినా, ఆమె స్ఫూర్తిదాయక స్వభావమే అసలు మహత్తు అని పద్యం సూచిస్తోంది.

****

శా. చాలీచాలనిజీతభత్యము

లగున్ వాక్కల్లె మాయల్ గనే 

కూలీలేకయు కష్ట జీవనముగన్ కూర్చుండు ఖాళీగనున్ 

వేలున్కోరనుతిండినిత్య మది విద్వేషంబు లన్ లేవు నీ 

లీలల్ మాస్థితిగాను శాంతి సుఖముల్ లేవమ్మ యేతీరుగన్ 

సరళ భావం :

చాలీచాలని జీతభత్యాలతో జీవితం నెట్టుకొస్తోంది; మాటల్లో మాత్రం ఎన్నో మాయలు, ఆశలు కనిపిస్తున్నాయి.

కూలి పనులు కూడా దొరకక, కొందరు ఖాళీగా కూర్చొని కష్టజీవితం గడుపుతున్నారు.

రోజూ తినడానికి సరిపడా సంపాదన కోసం వేల మార్గాలు వెదుకుతూనే ఉన్నా, మనుషుల మధ్య విద్వేషాలు మాత్రం తగ్గడం లేదు.

ఈ విధమైన కాలస్థితిలో నిజమైన శాంతి, సుఖం ఎక్కడ దొరుకుతాయి అమ్మా! — అని కవి బాధతో ప్రశ్నిస్తున్నాడు.

****

చెం.*అనఁడు* సయోధ్య తాభవ సమంజసవిద్య పదాలు లేవులే 

  *వినఁడు* కులక్షయo వినతి విశ్వము  భాషగ వేడుకేయగున్ 

  *తినఁడు*సుఖంబుగా మిషముతీవ్ర భవంబుగ తాప రోగమున్ 

  *కనఁడు*కదల్లెకాలమున కామ్యము తీరుధర్మము సత్యమే యగున్

సరళ భావం :

సయోధ్య, మంచితనం, సమంజసమైన మాటలు ఇప్పుడు తగ్గిపోతున్నాయి.

వినమ్రత లేకపోతే కుటుంబాలు, సమాజం క్షీణిస్తాయి.

అతిగా సుఖాల కోసం పరిగెత్తి చెడు అలవాట్లలో పడితే శరీరానికి, మనసుకు బాధలు వస్తాయి.

కాలగమనాన్ని అర్థం చేసుకొని ధర్మమార్గంలో నడిచినవారికే నిజమైన కోరికల తీరుదల, సత్యజీవనం లభిస్తాయి. 🌹

****

చెం. అరుగున చేరి యమ్మ మది అక్షరబోధలు పంచగా

పరుగున జీవితంబున బాధల తీరుగ దారిగాంచగన్ 

మరుగున లేని ప్రేమ గుణ మానవ ధర్మసుదీక్ష దీపమై

మురుగున బోవు చిత్తముయు మాతృశుభంబు సహాయతామృతమ్ 

భావసారం:

అమ్మ అరుగు వద్దనే అక్షరబోధ మొదలవుతుంది.

జీవిత పరుగు లో వచ్చే బాధలకు అదే మార్గదర్శకత్వమవుతుంది.

మరుగులేని ప్రేమ, గుణం, ధర్మసుదీక్షలు మానవత్వ దీపాలవలె వెలుగుతాయి.

మురుగులో పడబోయే చిత్తాన్నికూడా మాతృశుభం అమృతంలా రక్షిస్తుంది.

*****

చెం. చెడు యనటేల యెవ్వరి చిత్తము మాటిగ నొప్పి చేయుటే 

చెడు వినుటేల మాట లన్నియు సీఘ్రముతప్పులగు తృప్తి లేకయే 

చెడు కనుటేల గొప్పగనె చేరువగున్న ను యాస లేలనున్ 

చెడు విషయాలచర్చలను వింతగనుండ విషమ్ము తీరుగన్ 

భావం:

ఎవరి మనసునైనా నొప్పించే మాట మాట్లాడటమే చెడు.

చెడుమాటలు వినడమూ మంచిది కాదు; అవి తృప్తి ఇవ్వకుండా తప్పులనే పెంచుతాయి.

ఎంత దగ్గరగా ఉన్న వారైనా, ఆశలు–అహంకారాలు పెరిగితే సంబంధాలు చెడిపోతాయి.

చెడువిషయాల చర్చలు బయటకు వింతగా అనిపించినా, లోపల విషంలా మనసును కలుషితం చేస్తాయి.

*****

ఉ. శోముని లీలలే మనసు శోధ్యపు తీరుగ సాగ గల్గగన్ 

పాముల ధారణాగతియు పాశ విషంబును మార్చ గల్గగన్ 

ఏముని హోమమై నను స యిచ్ఛల వైనము ఆట తీరుగన్ 

పాములు పాట పాడినవి పాములవాడు శిరమ్ము నూచగన్.

సరళ భావం

శివుని లీలలను మనసులో ధ్యానిస్తే, మనసులోని సందేహాలు, కలుషిత భావాలు తొలగిపోతాయి.

ఆయన మెడలో ధరించిన పాములు కూడా విషాన్ని శాంతముగా మార్చినట్లే, మన జీవితంలోని పాశాలు, విషసమానమైన దుర్గుణాలు కూడా మారిపోతాయి.

మన కోరికలు యజ్ఞాగ్నిలో ఆహుతులైనట్లుగా క్రమంగా లీనమవుతాయి; జీవితం ఒక దివ్యలీలగా మారుతుంది.

శివుని శిరస్సుపై అలంకారమైన పాములు కూడా ఆయన మహిమను గానమాడుతున్నట్లుగా, ప్రకృతి అంతా ఆయన వైభవాన్ని స్తుతిస్తుంది.

****

ఉ. నిబ్బర మవ్వ దుర్భర వినిర్భల ధర్భల దీర్ఘ తత్వ త 

బిబ్బియు నవ్వ ఉబ్బరము భీకర మబ్బుల నిబ్బరంబు కై 

యుబ్బి భ్రమల్ సుధాబ్దిగతి యుంటరి ప్రబ్బిత కష్ట సాధ్యమున్ 

డబ్బులు తీవ్రతాభవము డా బులు నోపు రసజ్ఞ జీవణమ్ 

భావాన్వయం (సరళరీతి):

జీవితంలో నిబ్బరంగా ఉండాలి; దుర్భర పరిస్థితులు వచ్చినా అంతరబలం కోల్పోకూడదు.

ఉబ్బరాలు, అహంకారాలు, భీకర మబ్బులవలె మనసును కమ్మేస్తాయి.

భ్రమలతో ఉబ్బిపోతూ జీవితం సాగితే, సుధాసముద్ర గమనం దూరమవుతుంది; కష్టసాధ్యమైన మార్గమే మిగులుతుంది.

డబ్బు ఆధారిత తీవ్ర భావజీవనం చివరికి రసజ్ఞతను, మానవ సారాన్ని బాధింపజేస్తుంది.

*****

త. ఎరుగ నైతిని హృదయాన 

యిoత మదము 

పరుగు లేల బుద్ధి మలుపు పంత గుణము 

కరగ లేని విధము గాంచ కాల మయము

తరక లాంటి బ్రతుకు నందు తాప తపము 

సరళ భావం:

మన హృదయంలో ఎంత అహంకారం దాగి ఉందో మనం చాలాసార్లు గుర్తించలేము.

బుద్ధి ఎన్నో దారులు తిరుగుతూ, మొండితనం మరియు స్వభావగుణాల ప్రభావంలో పరుగులు తీస్తుంది.

కాలం తన స్వభావానుసారం సాగుతూనే ఉంటుంది; అది మన కోరికల వల్ల మారదు.

త్వరగా గడిచిపోయే ఈ జీవితంలో మనిషి అనేక తాపత్రయాలు, ఆందోళనలతో కాలం గడుపుతాడు.

***

ఉ. ప్రస్తుత గాల గౌరవము ప్రాభవ నైజము మస్తకంబుగన్ 

మస్తక మానసంబుకల మానవ మన్నన మార్గ గ్రంథమున్ 

పుస్తక మన్నదే మనసు పూర్ణ సపూజ్యత వైభవంబుగన్ 

స్వస్తి శుభంబుగమ్యమగు వాక్కుల మస్తక పుస్తకంబుగన్  

సరళ భావం:

ప్రస్తుత కాలంలో గౌరవం, ప్రభావం, వ్యక్తిత్వ నైజం అన్నవి మనిషి మస్తకంలో (ఆలోచనలో) నుండే పుట్టుకొస్తాయి.

ఆ మస్తకములోని మానసిక వికాసమే మానవుని మన్ననకు మార్గదర్శక గ్రంథమవుతుంది.

పుస్తకం అనేది కేవలం అక్షర సమాహారం కాదు; అది మనసుకు పూర్ణ పూజ్యతను, వైభవాన్ని అందించే సాధనం.

అంతిమంగా శుభమార్గానికి నడిపించే వాక్యాలు, జ్ఞానం, ఆలోచనలు — ఇవన్నీ “మస్తక పుస్తకం” వలె మన జీవనాన్ని దారి చూపుతాయి.

*****

మ. కో. ఎంత వారగు కాంత కానుక యెంచ గల్గుట గొప్పయే 

పంత మావక బేధ ముండక పాశ మాలగ నొచ్చుటే 

సంతసంబున సఖ్యతాభవ శాంతి జూపుట ఖర్చుయే 

వింతలెన్న కటుంబభారము విద్య తీరుగ నిత్యమే 

సరళ భావం:

భార్యాభర్తల మధ్య ప్రేమను ఒక అమూల్యమైన కానుకగా భావించడం ఎంతో గొప్ప విషయం.

మొండితనం, భేదాభిప్రాయాలు లేకుండా ప్రేమబంధంతో కలిసి ఉండాలి.

ఆనందంగా, స్నేహభావంతో ఒకరికి ఒకరు శాంతిని అందించడం నిజమైన సంపద.

కుటుంబ బాధ్యతలు ఎన్నో వింతలతో నిండి ఉంటాయి; వాటిని జ్ఞానం, అవగాహనతో ప్రతిరోజూ నిర్వహించాలి

****

మ. కో.దవ్వునే మనమధ్య కాలము దాపుకొచ్చియు కాంతిగాన్ 

నవ్వు కాచియు రక్షజేసియు కాన వైతివి శాంతిగాన్ 

జవ్వనానన యెంత వారగు జాగృతీభవ వైనమున్ 

మువ్వమాదిరి జీవితంబగు ముద్దు ముచ్చట ముఖ్యమే 

సరళ భావం:

మన ఇద్దరి మధ్య కాలం నెమ్మదిగా గడిచినా, మన అనుబంధం మరింత వెలుగొందింది.

నీ చిరునవ్వు నన్ను కాపాడుతూ, నా జీవితానికి శాంతిని ఇచ్చింది.

యౌవనం ఎంతకాలం ఉన్నా, జాగ్రత్తగా, పరస్పర అవగాహనతో జీవించడం ముఖ్యము.

మువ్వల మాదిరిగా మధురమైన చిన్న చిన్న ముచ్చట్లు జీవితంలో ఎంతో ముఖ్యమైనవి.

****

మకో. వచ్చు దూతల నెంచి వేళలు వాంఛ తీర్చుట ధర్మమే 

మచ్చు కైనను భేదభావము మానసంబున లేకయే 

మెచ్చు రీతిన సేవ లక్ష్యము మేలు జేయుట కాలమే 

ముచ్చుతాభవ మైన మౌనము ముఖ్యమేగతి సత్యమే 

సరళ భావం:

మన వద్దకు వచ్చే అతిథులను (లేదా అవసరంతో వచ్చే వారిని) ఆదరించి, వారి అవసరాలను తీర్చడం ధర్మం.

మనసులో ఎలాంటి భేదభావం లేకుండా అందరినీ సమానంగా చూడాలి.

ప్రశంసించదగిన విధంగా సేవ చేయడం, ఇతరులకు మేలు చేయడం కాలాన్ని సార్థకం చేస్తుంది.

అనురాగంతో నిండిన మౌనం కూడా ఎంతో గొప్పది; అదే జీవితానికి సత్యమైన మార్గం.

*****

గీ.ఆలుమగలు కళలు తీర్చ ఆశ గాను

త్మీయ సంపద వైభవం మీగడగను

యతి విధి పరము సకలము కాంక్ష తీ ర్చ

తాను తన్మయ భావము తత్వ రీతి

భావం:

ఆలుమగలు పరస్పర ఆశయాలను, కళలను తీర్చుకుంటూ జీవనాన్ని నిర్మించుకుంటారు.

ఆత్మీయత అనే సంపదే నిజమైన వైభవంగా నిలుస్తుంది.

విధి, యతి, కాంక్ష—all కలిసి జీవన గమనాన్ని నడిపినా, చివరకు తన్మయ భావమే తత్త్వరీతిని తెలియజేస్తుంది.

****

గీ. శివమహత్త్యమే మనుగడ సేవ మార్గ 

వల బ్రతుకు నందు చిక్కుటా వాక్కు తపము 

కామ్య కల్మషములు మధ్య కాల రీతి 

శివ మయము నిత్య సంపద సీఘ్ర మగును 

సరళ భావం:

శివుని మహిమను గ్రహించడం మనిషి జీవనానికి సేవామార్గాన్ని చూపిస్తుంది.

జీవితంలో మాటను నియంత్రించడం ఒక తపస్సులాంటిది.

కోరికలు, స్వార్థం, మనసులోని కలుషిత భావాల మధ్య కాలం గడుస్తూ ఉంటుంది.

అయితే శివస్మరణతో జీవిస్తే జీవితం పవిత్రమై, నిత్యమైన ఆధ్యాత్మిక సంపద త్వరగా లభిస్తుంది.

****

గీ. ఆశ అల్పాధికము వల్ల నధిక మాయ 

ఆశ తొలచు పురుగు సర్వ మాశ నిప్పు 

ఆశ లేని మనసు చూడ అడవి మృగము

ఆశ యున్న కుటుంబమ భాస పాలు 

భావం:

అల్పమైన ఆశైనా, అధికమైన ఆశైనా — చివరికి మాయలోనే పడవేస్తుంది.

ఆశ అనేది లోపల నుంచి కొరుకుతూ నశింపజేసే పురుగువంటిది; అగ్నిలా దహింపజేస్తుంది.

అసలు ఆశలేని మనసు అయితే అడవి మృగంలా నిర్జీవంగా, నిర్లక్ష్యంగా మారుతుంది.

కానీ నియంత్రిత ఆశతో ఉన్న కుటుంబమే ప్రకాశవంతమైన జీవనానికి ఆధారం అవుతుంది.

****

గీ. నన్ను బ్రోవంగ పరమాత్మ నడచి వచ్చు 

మన్ను నందు సేవల తోను మనసు నిచ్చు 

మిన్ను నీదయా వర్షము మెచ్చ వచ్చు 

కన్ను లైమామదియు నిన్ను గాంచ మెచ్చు 

భావం:

భక్తుని రక్షించేందుకు పరమాత్మ స్వయంగా నడిచి వచ్చును.

భూమిమీద సేవారూపంగా మనసును సమర్పించినవారిని ఆయన అనుగ్రహిస్తాడు.

ఆ దయ మేఘవర్షంలా కురిసినప్పుడు జీవితం ప్రకాశిస్తుంది.

చివరకు కన్నులే ఆ దివ్యరూపాన్ని దర్శించి ఆనందిస్తాయి.

****

కం..కాగలకార్యము తీర్చెడి

యోగబలంబున కాలము 

దాగెరసమయా ధామ విధాన మనస్సున్ 

జాగిల మేయగు చక్రము 

మూగ భవామృత లక్ష్యము 

ఆగని సంపద కలలగు ఆశల తీరున్ 

భావసారం:

చేయవలసిన కార్యాలు యోగబలంతోనే సకాలంలో నెరవేరుతాయి.

కాలం తనలోనే అనేక రహస్య రసాలను దాచుకొని, మనస్సును విధానమార్గంలో నడిపిస్తుంది.

జీవితం చక్రంలా తిరుగుతూనే ఉంటుంది; దానికి కాపలాదారిలా జాగ్రత్త అవసరం.

మౌనమయమైన భవామృత లక్ష్యం వైపు సాగినా, ఆగని సంపదలవలె ఆశలు మాత్రం ఎప్పటికీ ముగియవు.

*****

ఆ. వె. యర్ధ మవ్వ విధియు యసలు కిటుకు గాంచ

స్వార్ధ మేమి లేని సాధు జపము

వ్యర్థ మన్నదేది వాక్కు వయసు జెప్ప

స్పర్ధ లేనితనము సమయ మేను

సరళ భావం:

విధి యొక్క అసలు అర్థం, జీవితం యొక్క అంతరార్థం తెలుసుకోవాలి.

స్వార్థం లేని సాధువుల జపం ఎప్పుడూ ఫలప్రదమే.

వాక్కు, వయస్సు, అనుభవం — ఇవన్నీ ఏదీ వ్యర్థం కాదని మనకు తెలియజేస్తాయి.

పోటీ భావం లేకుండా ఉండటం మనిషికి గొప్ప సమయజ్ఞానాన్ని, ప్రశాంతతను ఇస్తుంది.

*****

ఆ.భోగ తత్వ జీవి పూజ్యతా భవముగా 

యోగ మందు నుండ యోగ్యత భవ 

వేగ మన్న కాంతి వేగుల మాయగా 

రాగ రహిత జగతి రమ్య మయ్యె 

భావం:

భోగతత్వంలో జీవించే మనిషి కూడా పూజ్యతను పొందగలడు, కాని అది యోగమార్గంలో యోగ్యతను సంపాదించినప్పుడు మాత్రమే సార్థకమవుతుంది.

వేగంగా పరిగెత్తే ప్రపంచ కాంతులు, వెలుగులు అన్నీ క్షణిక మాయలే.

రాగరహితమైన జగత్తే నిజమైన రమ్యతను అందిస్తుంది.

****

సం. చరితం సమర్ధనీయం శతకోటి ప్రవిస్తరం 

ఏకైక మక్షరం ప్రోక్తం మహా పాతకనాశనం 

సర్వార్ధ సాధక విస్మయం విశ్వాస పరమార్ధః 

ప్రారబ్ద కర్మేంద్రియానాం విస్పాటనాభావం విశ్వం 


చరితం సమర్ధనీయం శతకోటి ప్రవిస్తరం 

ఏకైక మక్షరం ప్రోక్తం మహా పాతకనాశనం 

సర్వార్ధ సాధక విస్మయం విశ్వాస పరమార్ధః 

ప్రార్బద కర్మేంద్రియానాం విస్పoదనాభావం విశ్వం 

*****

మకో.సమ్మతంబగుట సర్వవేళలగు సాక్షి ధామమగు సఖ్యతా 

నమ్మకంబగుట ఆశ పాశ మగు నాన్యతంబగుట నిత్యమై 

వమ్ముకానిదగు ప్రేమతత్వమగు వాక్య సంపదయె కాలమున్ 

అమ్మమాటలగు శాంతి వేగమగు ఆశ్రితాభవము ప్రేమగా 

సరళ భావం

సర్వకాలాల్లో నిలిచే నిజమైన సఖ్యత అనేది పరస్పర సమ్మతితో, నమ్మకంతో నిలుస్తుంది.

ఆ నమ్మకం ఆశల బంధనంగా కాక, పరస్పర అన్యోన్యతగా మారాలి.

ఎప్పటికీ వమ్ముకాని ప్రేమతత్వమే జీవితానికి అసలైన వాక్యసంపద.

అమ్మ మాటల వంటి శాంతి, ఆదరణ, ఆశ్రయభావం కలిగిన ప్రేమే నిజమైన బంధం.

*****

ఈ జడ వైభవంబు పలికించితి విజ్ఞత పంకజంబుగన్ 

రాజస మెత్తి జూపగల రమ్యత నీయద నిండె రూపమౌ 

ద్రాజిత స్వర్గకాంతులమృతమ్ముల జర్రు లతాంత వాసనల్ 

భోజన సఖ్యతాభవము భోగము తీరుగ నిత్య జీవనమ్ 

సరళ భావం:

ఈ జడ (అలంకార సౌందర్యం) తన వైభవాన్ని విజ్ఞత అనే కమలంలా వ్యక్తపరుస్తోంది.

రాజసమైన మృదుత్వంతో కనిపించే ఆ రమ్యత సంపూర్ణ రూపంగా నిండిపోయింది.

స్వర్గకాంతుల అమృతసుగంధంలా లతాంతాల వాసనలు వ్యాపిస్తున్నాయి.

అటువంటి సఖ్యత, ఆప్యాయత, ఆనందభరిత జీవనమే నిత్య భోగస్వరూపం.

***

ఉ. ధ్యానము ధ్యానమై పరమధర్మసు తత్వము బ్రహ్మ తేజమై 

మౌనము మౌనమై కళలు మంజుల తీవ్రత కాంతి గోలమై 

గానము గానమై సమయ గమ్యము సత్యదయా పయోనిధిన్ 

ప్రాణము ప్రాణమైన గురు పాదులునే శరణంబు వేడితిన్

 సరళ భావం

ధ్యానం పరమధర్మస్వరూపమై బ్రహ్మతేజంగా వెలుగుతుంది.

మౌనం అంతర్ముఖ కళల మంజుల కాంతివలయంగా వికసిస్తుంది.

గానం సత్యం, దయ అనే అమృతసాగరానికి దారి చూపే సాధనమవుతుంది.

ఈ సమస్తానికి మూలమైన ప్రాణస్వరూప గురుపాదాలనే నేను శరణుగా కోరుతున్నాను.

****

చెం.సదనము మోక్ష దాయిని విశాలపు విశ్వ విమోచ సేవ శా

రద భవ దీక్ష తత్త్వమగు రంజిలు నట్లును మాకు ప్రేమతో

స్వదనము మాలికంబుగలసాక్షియె ధర్మ ము సత్య సంపదా

తి దయతొ సర్వవేళలగుదీక్షసువిద్య సరస్వతీ దయా

సరళ భావం

సరస్వతీదేవి నిలయమే మోక్షాన్ని ప్రసాదించే విశాల విశ్వవిమోచన సేవాస్వరూపం.

ఆమె శారదారూపిణిగా భవదీక్ష తత్త్వాన్ని ప్రేమతో మనలో రంజింపజేస్తుంది.

ఆమె ప్రసాదించే జ్ఞానమాలిక ధర్మానికి, సత్యసంపదకు సాక్షిగా నిలుస్తుంది.

అపార దయతో సర్వకాలాల్లో సద్ధి , సువిద్యలను ప్రసాదించే సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నాను.

*****

మ. భళిరావిద్యల విశ్వమందన సభా పర్వంబు మీరన్న ఆ 

యెల ప్రాయంబులు జిక్క సానుభవమే యేతెంచ సాన్నిధ్య వా 

రలసేవాభవ వాంఛలే మనసుగా త్రైవిష్ట మూలంబు గా 

దల విశ్వాసపు విద్య తీరగుటయేధ్యానంబు యోగాగ్నిగన్ 

సరళ భావం:

“భళి!” అనిపించే విద్యలు విశ్వసభలో మహత్తర పర్వాలవంటివి.

యౌవన దశలు గడిచినకొద్దీ నిజమైన అనుభవమే సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుంది.

సేవాభావంతో కూడిన వాంఛలే మనసుకు త్రివిష్టప (దివ్య) మూలాలవంటివి.

విశ్వాసంతో కూడిన విద్య చివరకు ధ్యానరూప యోగాగ్నిగా పరిణమిస్తుంది.

******

మ. కలవంగామతి తారుమార గుట యోగంబాయె ప్రేమంబుగన్ 

పిలవంగాస్థితి నొప్పలేకమనసేపీయూష రాగంబుగన్ 

గెలవంగాకళ వైభవంబు సమయమ్ గీంకార భావంబుగన్ 

నెలవంగావిధి సర్వమాయలగటన్ నేచేయ కార్యంబుగన్

సరళ భావం

కలిసే సమయంలో మనసు తారుమారవడం కూడా ప్రేమయొక్క యోగమే.

పిలిచినా మనస్థితి ఒప్పుకోలేక, హృదయం అమృతరాగంలా తీయని వేదనలో మునుగుతుంది.

గెలవాలంటే కళావైభవం సమయానుసారంగా అంతరనాదంగా మారాలి.

చివరకు ఇవన్నీ విధిమాయలేనని గ్రహించి, చేయవలసిన కర్తవ్యాన్ని చేయడమే మిగులుతుంది

****

శా.. ప్రాబళ్యంబగు జీవసత్యవిధిగన్ ప్రాణంబు సేవార్దిగాన్ 

సౌభాగ్యంబగువిశ్వ ధర్మ మదిగన్ సౌసీల్య విశ్వాసమున్ 

నాభాగ్యంబున నిత్య త్యాగ భవమున్ న్యాయంబు తీర్పేయగున్ 

ఈభావంబు కుటుంబ మార్గమగుటన్ నిత్యాగ్ని సంసారమున్ 

సరళ భావం

జీవితసత్యానికి ప్రాణమే ఆధారం; ఆ ప్రాణం సేవకు అంకితమై ఉండాలి.

విశ్వధర్మమే నిజమైన సౌభాగ్యం; అది సౌశీల్యం, విశ్వాసంతో నిలుస్తుంది.

నిత్యత్యాగభావమే మన భాగ్యాన్ని నిర్మిస్తుంది; న్యాయం చివరకు తగిన తీర్పును ఇస్తుంది.

ఈ భావాలే కుటుంబమార్గానికి ఆధారం; సంసారం నిత్యాగ్నిలా ఉన్నప్పటికీ వాటితో పవిత్రమవుతుంది.

*****

శా. సంతోషంబుగనున్ రచింపగల స్వస్తా లేదు నా లేఖినిన్ 

గీతాకాలమనన్ గురూత్తముని సంగైకొన్న సేవించి యా 

నేతాణ ప్రతిభావికాసమున తా నీడల్లె లోలోపలన్ 

దాతా త్యాగముచేసిజూపగల సత్తా లేదు నాదృష్టిగాన్ 

సరళ భావం

నా లేఖనికి నిజమైన సంతోషంతో రచించగల శక్తి ఇంకా సంపూర్ణంగా లేదనిపిస్తోంది.

గీతాకాలంలా గురువర్యుని సన్నిధిని పొందుతూ సేవ చేసినప్పటికీ,

ఆ మహనీయుని ప్రతిభా వికాసంలోని లోతైన నీడలను పూర్తిగా గ్రహించే స్థితి నాకు కలగలేదు.

అలాంటి దాతృత్వం, త్యాగం చూపగల సత్తా నా దృష్టిలో నాకు ఇంకా లేదనే వినయభావాన్ని వ్యక్తం చేస్తున్నాను.

******

గీ. వలువ లూడ యుక్తిగ దొంగ వరుస గలిపి 

ఒకరి కొకరి మధ్య మెరుపు మౌదు శక్తి 

తెలివిగా దోచ ధనమును తిట్టు లేక 

మాయ తెలియని మానవ మార్గ కుస్తి

సరళ భావం:

దొంగలు యుక్తులతో వరుసలు కలిపి,

మనుషుల మధ్య మెరుపులా చొరబడే ప్రభావాన్ని సృష్టిస్తారు.

తెలివిగా ధనాన్ని దోచుకున్నా, ఎవరూ వారిని తిట్టలేని పరిస్థితి వస్తుంది.

మాయ ఏమిటో తెలియని అమాయక మానవజీవితం ఒక కుస్తీలా మారిపోతుంది.

*****

గీ. దల్లి దండ్రుల ప్రేమయే ధరణి నందు 

పండు టాకుల సేవయే పరమ భవము 

నిండు తనము సేవలగుటే నీడ నివ్వ 

జీవితం ధారి జూపెడి దీప్తి జన్మ 

సరళ భావం

ఈ భూమిపై తల్లిదండ్రుల ప్రేమకన్నా గొప్పది లేదు.

వృద్ధాప్యంలో ఉన్న వారిని సేవించడం పరమపుణ్యం.

మనసు నిండుగా సేవాభావంతో నిలిస్తే అది ఇతరులకు నీడనిచ్చే వృక్షంలా మారుతుంది.

అటువంటి సేవామయ జీవితం మనకు దారి చూపే దీప్తిమంతమైన జన్మ అవుతుంది.

****

ఆ. వె. కడలి పొంగు లవియు నిడవాలు గన్నులు 

నుండ బట్ట లేక నూడ గొడవ 

ముట్ట చన్ను దోయి ముచ్చట తీర్చగా 

కడకు కండ పుష్టి కలహ కారి 

సరళ భావం:

సముద్ర అలలవలె పొంగిపొర్లే ఆకలి, పొడవైన కష్టాలు, నిత్య గొడవలు మధ్య జీవనం సాగుతుంది. తినడానికి సరిపడా అన్నం దొరకక ఇబ్బందులు పడినా, చివరకు కడుపు నింపుకొని శరీరబలం వచ్చినప్పుడు అదే బలం కొన్నిసార్లు కలహాలకు కారణమవుతుంది

****

[20/05, 06:25] Mallapragada Ramakrishna: ప్రతిరోజు 

 మాతృభాష, మాతృభూమి, మాతృశ్రీ మరువద్దు


🌹🌹🌹🌹🌹🌹తెలుగుపై ఆసక్తి యున్న ప్రతి ఒక్కరూ వ్రాయగలరని కోరు చున్నాను.

*మాతృశ్రీ *..ఇచ్ఛా.. చందస్సు, లో పద్యం,

20/05

 * * 

*కలవ, పిలవ, గెలవ, నెలవ*

🙏🙏🙏🙏🙏🙏🙏

[20/05, 06:27] Mallapragada Ramakrishna: గీ. కలవ మనసు గతి గమన గమ్య మగును

పిలువ మధురత సమయము పెన వలపగు

గెలువ సహన విలువ నిధి గెలుపు కలుపు

నెలవ నిజ విధి పరమగు నిలయ మహిమ

భావం:

కలిసే మనసే జీవన గతి, గమనం, గమ్యమవుతుంది.

పిలుపులోని మధురత సమయానుకూల ప్రేమను పెంచుతుంది.

సహనమే నిజమైన విలువనిధి; అదే గెలుపులను కలుపుతుంది.

నిజమైన విధి నిలిచే స్థలమే పరమమైన మహిమగల నిలయం.

*****

సం. పద్యం సుగంధి పరమాత్మ 

గద్యం సుగంధి పరమేశం 

వదనం సుగంధి విధి నిత్యం 

మనశ్చ తత్భావనయా సుగంధి

భావం:

పద్యము పరమాత్మవలె పవిత్ర పరిమళాన్ని వెదజల్లుతుంది.

గద్యము పరమేశ్వర స్వరూపమై గంభీరతను ప్రసరిస్తుంది.

వదనం (ముఖం/మాట) నిత్యం విధి–ధర్మ సౌరభాన్ని కలిగియుంటుంది.

అలాగే మనస్సు కూడా ఆ తత్త్వభావనతో నిండినప్పుడు సుగంధమయమవుతుంది.

****

మ. భళిరావిద్యల విశ్వమందన సభా పర్వంబు మీరన్న ఆ 

యెల ప్రాయంబులు జిక్క సానుభవమే యేతెంచ సాన్నిధ్య వా 

రలసేవాభవ వాంఛలే మనసుగా త్రైవిష్ట మూలంబు గా 

దల విశ్వాసపు విద్య తీరగుటయేధ్యానంబు యోగాగ్నిగన్ 

సరళ భావం:

“భళి!” అనిపించే విద్యలు విశ్వసభలో మహత్తర పర్వాలవంటివి.

యౌవన దశలు గడిచినకొద్దీ నిజమైన అనుభవమే సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుంది.

సేవాభావంతో కూడిన వాంఛలే మనసుకు త్రివిష్టప (దివ్య) మూలాలవంటివి.

విశ్వాసంతో కూడిన విద్య చివరకు ధ్యానరూప యోగాగ్నిగా పరిణమిస్తుంది.

******

త. బయలు యొoటిగ యుండలేకయు బాటసారి సువాక్కులున్ 

ఒయలు యెన్నన నేమి తగ్గక నోర్పు చూపుచు మొక్కులున్ 

సొయలు మాటున సొమ్ము లన్నియు సోకులేయగు చుక్కలున్ 

నొయలు నాణుడి నమ్మ

బల్కులు నొచ్చి యుండుట నొక్కులున్ 


సరళ భావం:

మనిషి ఒంటరిగా జీవించలేడు; అందుకే బాటసారిలా పరస్పర సువాక్యాలతో ముందుకు సాగుతాడు.

ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సహనంతో మొక్కుబడులను నిలబెడతాడు.

బయటి సోయగాల వెనుక ధనం, ఆశలు, ఆకర్షణలు నక్షత్రాల్లా మెరవడం సహజం.

అయితే నాణ్యమైన మాటలపై నమ్మకం కోల్పోతే, హృదయం నొచ్చుకొని బాధలతో నిండిపోతుంది.

*****

ఉ. ఏడువకమ్మయేడువకు యెత్తుకొనంగయనాచు దల్లి వెం 

టాడుచు పాట పాడుచునె యశ్రులు తుడ్చుచు స్థణ్య మిచ్చుచూ 

చాటుగ కొంగుకప్పియు విచారము లేనిది సౌఖ్య మొoదుచున్ 

వీడని సిగ్గుగార్చెగను బిడ్డడు నోరును విప్ప గుండగన్ 

సరళ భావం:

“ఏడవకు బిడ్డా!” అని తల్లి ఒడిలోకి ఎత్తుకుంటుంది.

వెంటాడుతూ పాటలు పాడుతూ, కన్నీళ్లు తుడుస్తూ, పాలు ఇస్తూ ఆదరిస్తుంది.

కొంగుతో కప్పి, ఏ విచారమూ లేకుండా సుఖంగా ఉంచుతుంది.

ఇంకా సిగ్గు విడవని చిన్నబిడ్డ నోరు విప్పకుండానే తన అవసరాన్ని తెలియజేస్తుంటాడు.

****

ఉ. ఈ జడ వైభవంబు పలికించితి విజ్ఞత పంకజంబుగన్ 

రాజస మెత్తి జూపగల రమ్యత నీయద నిండె రూపమౌ 

ద్రాజిత స్వర్గకాంతులమృతమ్ముల జర్రు లతాంత వాసనల్ 

భోజన సఖ్యతాభవము భోగము తీరుగ నిత్య జీవనమ్         

సరళ భావం:

ఈ జడ (అలంకార సౌందర్యం) తన వైభవాన్ని విజ్ఞత అనే కమలంలా వ్యక్తపరుస్తోంది.

రాజసమైన మృదుత్వంతో కనిపించే ఆ రమ్యత సంపూర్ణ రూపంగా నిండిపోయింది.

స్వర్గకాంతుల అమృతసుగంధంలా లతాంతాల వాసనలు వ్యాపిస్తున్నాయి.

అటువంటి సఖ్యత, ఆప్యాయత, ఆనందభరిత జీవనమే నిత్య భోగస్వరూపం.

***

ఆ. వె. కడలి పొంగు లవియు నిడవాలు గన్నులు 

నుండ బట్ట లేక నూడ గొడవ 

ముట్ట చన్ను దోయి ముచ్చట తీర్చగా 

కడకు కండ పుష్టి కలహ కారి 

సరళ భావం:

సముద్ర అలలవలె పొంగిపొర్లే ఆకలి, పొడవైన కష్టాలు, నిత్య గొడవలు మధ్య జీవనం సాగుతుంది. తినడానికి సరిపడా అన్నం దొరకక ఇబ్బందులు పడినా, చివరకు కడుపు నింపుకొని శరీరబలం వచ్చినప్పుడు అదే బలం కొన్నిసార్లు కలహాలకు కారణమవుతుంది

****

ఆ. వె. వయసు పొంగు నాప వరద నాప ఫలము

లుప్తమౌ దురాశ లోక మాయ

వలదు నన్న వినవు వికసింప వకులించు

లుప్త మవ్వ మనసు లోక హితము

భావం:

వయస్సు పెరిగే కొద్దీ జీవితం వరదలాంటిదై అనుభవఫలితాలను ఇస్తుంది.

లోకమాయలో దురాశలు చివరకు లుప్తమవుతాయి.

“వలదు” అని చెప్పిన మాట వినాలి; మనసు వికసించాలి, వక్రీభవించకూడదు.

అప్పుడు మనసు స్వార్థాన్ని విడిచి లోకహితానికి మార్గమవుతుంది.

*****

గీ. కలవ మనసు గతి గమన గమ్య మగును

పిలువ మధురత సమయము పెన వలపగు

గెలువ సహన విలువ నిధి గెలుపు కలుపు

నెలవ నిజ విధి పరమగు నిలయ మహిమ

భావం:

కలిసే మనసే జీవన గతి, గమనం, గమ్యమవుతుంది.

పిలుపులోని మధురత సమయానుకూల ప్రేమను పెంచుతుంది.

సహనమే నిజమైన విలువనిధి; అదే గెలుపులను కలుపుతుంది.

నిజమైన విధి నిలిచే స్థలమే పరమమైన మహిమగల నిలయం.

*****

కం.ఆకలె యమ్మా యాకలె 

నాకన్నము పెట్ట రావె నాన్నా రా యం 

తా కావాలన బిడ్డా 

పంతం దేనికి వలదులె ప్రాణం నిలువా 

సరళ భావం:

“అమ్మా! ఆకలేస్తోంది…

నాకు అన్నం పెట్టు” అని బిడ్డ వేడుకుంటోంది.

“ఏమి కావాలో చెప్పు బిడ్డా!” అని తల్లిదండ్రుల ప్రేమ స్పందిస్తోంది.

చివరకు — ప్రాణం నిలవాల్సినప్పుడు పంతాలు ఎందుకు? అని కవి ప్రశ్నిస్తున్నాడు.

****

కం. చేకీ భావము గూర్చెను 

గోకచెరo గీడ్చుచమ్మ కున్నాయనకున్ 

సాకీ సాకగ ధరమున్ 

ఈకీలకమౌను నిత్య నియమా విద్యల్ 

సరళ భావం:

లోకవ్యవహారంలో అనేక లాగుడు–గీడ్లు, స్వార్థ భావనలు కనిపించినా,

మనిషి సాకులు వెదకకుండా ధర్మాన్ని ఆధారంగా చేసుకోవాలి.

నిత్య నియమాలు, విద్య, సంస్కారం — ఇవే జీవితానికి కీలకాధారాలు.

****

కం.ఖరీదైన గళముగా 

సరిగమ పదనిస సరాగ సంపద గాత్రమ్ 

సిరులు కురియు వాంఛలుగా 

పరిణత విద్యల ప్రభావ పాఠము కోరున్ 

సరళ భావం:

అత్యంత విలువైన గాత్రమై, సరిగమపదనిసల రాగసంపదతో నిండిన స్వరం వెలుగొందుతుంది. అలాంటి గానమునకు సిరిసంపదలవంటి కోరికలు తోడవుతాయి. అయితే నిజమైన పరిపక్వత అనేది విద్యల ప్రభావంతో వచ్చిన సాధన–పాఠాన్ని కోరుతుంది.

*****

కం. తెలుగు నడవడిక కాలము 

వెళయించిన తురుగాంచ విద్యల కలలే 

తళుకులు మెరుపులు కవితలు 

కళహంసలు తీరుగాను కొలమున ఖాతాన్ 

సరళ భావం:

తెలుగు నడవడిక, సంస్కారాలు కాలక్రమంలో విస్తరించి వెలుగొందాయి. విద్యలు అనేక కలలుగా వికసించాయి. ఆలోచనల మెరుపుల్లాంటి కవితలు కళహంసల వలె సౌందర్యంతో సాహిత్య లోకంలో తమ స్థానాన్ని పొందాయి.

 *****కం. అవహేళన యేమనినా 

వివరంబులుగాను గాంచ వి ధితీరుగనే 

సవరణయే మానసమై 

దవులకు మిత్రత్వమౌను దాపరి కముగాన్ 

సరళ భావం:

ఎవరైనా అవహేళన చేసినా, విషయాలను పూర్తిగా తెలుసుకొని, విధి–వివేకాలతో పరిశీలిస్తే సవరణ భావన మనసులో కలుగుతుంది. అప్పుడు దూరంగా ఉన్నవారికీ స్నేహభావం ఏర్పడుతుంది; దాపరికాలు తొలగిపోతాయి.

***†

శా. శిష్యోత్సాహము విద్యనేర్చిన మదీ శీఘ్రంబు పూజ్యంబుగన్

శిష్యాప్రాణము దైవమేగురువుగన్ చేకూర్చ విద్యార్థిగన్

శిష్యాశీలము సద్గుణప్రదముగన్ శోభిల్లి లోకంబునన్

శిష్యాభ్యున్నతి దేశధర్మమగుచున్ జ్ఞానాంబుధౌ నిల్చునన్ ॥

సరళ భావం :

విద్య నేర్చుకోవాలనే శిష్యుని ఉత్సాహం ఎంతో పూజనీయమైనది.

శిష్యునికి గురువు దైవస్వరూపుడు; గురువు ద్వారా విద్యార్థి సంపూర్ణతను పొందుతాడు.

శిష్యుని శీలం, సద్గుణాలు అతనిని లోకంలో శోభింపజేస్తాయి.

శిష్యుని అభ్యున్నతి దేశ ధర్మానికి, సమాజ శ్రేయస్సుకు దోహదం చేస్తూ జ్ఞాన సముద్రంలో నిలకడనిస్తుంది

*****

ఉ. లేనిదనేది చెప్పగల లీలలు జూపిడి ప్రేమ అమ్మదే 

 కానిది అన్న బిడ్డ కల కాలము బట్టి సుఖాలు అమ్మవే 

 ఏ నిధి కోరి కోర్కెలను ఏ మనకే విధియాట అమ్మదే 

 ఏ నిజమే అబద్దమన ఏదగు బాధ్యత యమ్మ ధర్మమున్ 


అద్భుతమైన తాత్విక–మాతృభావ పద్యం.

“అమ్మ” అనే పదాన్ని ప్రతి పాదాంతంలో భావకేంద్రంగా నిలబెట్టి, జీవనసత్యాలను ఎంతో సహజంగా చెప్పారు.

సరళ భావం :

లేనిదాన్ని కూడా ఉన్నట్లుగా చూపించి ప్రేమతో పిల్లలను ఆనందింపజేసేది తల్లే.

“లేదు” అని చెప్పినా, పిల్లల వయస్సు–కాలానికి తగిన సుఖాలను అందించాలనే తపన తల్లిదే.

పిల్లలు ఎన్నో కోరికలు కోరినా, వాటిని తీర్చే విధి ఆటలో తల్లి ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తుంది.

ఏది నిజం, ఏది అబద్ధం, ఏది బాధ్యత — ఇవన్నీ ధర్మబద్ధంగా నేర్పించేది కూడా తల్లే.

****

భాగ్యమనస్సుగా బాటి యో నేని

భాగ్యమ్ము పొందగా బంధమౌ నేని 

యోగ్యంబు వైనంబు యున్నతా మౌని 

ప్రాగ్యంబు విశ్వాస ప్రాణంబు శ్రేణి 

సరళ భావం :

మనసు భాగ్యమార్గంలో నడిస్తే జీవితం శుభబంధాలతో నిండుతుంది.

సత్భాగ్యాన్ని పొందినప్పుడు మనుషుల మధ్య అనుబంధాలు మరింత బలపడతాయి.

యోగ్యత కలిగిన జీవన విధానం మనిషిని ఉన్నత స్థితికి చేర్చుతుంది.

ప్రాజ్ఞతతో కూడిన విశ్వాసమే ప్రాణశక్తిలా మన జీవన శ్రేణిని నిలబెడుతుంది.

******

జయపాల నయన జయగమ్య సద్భావ శీలి 

శ్రితలోల నయన శివతత్వ చిన్మాయ శీలి 

సితశైల శయన సీఘ్రoబుగా సేవార్ధ శీలి 

శత శర్వ నయన జ్ఞానంబుగా కాలంబు శీలి 

సరళ భావం :

జయాన్ని ప్రసాదించే దివ్యదృష్టి కలవాడు సద్భావశీలి.

శరణు వచ్చిన వారిని కరుణతో చూచే వాడు శివతత్వమయ చిన్మయ స్వరూపుడు.

హిమశైలంలా నిర్మలమైన స్థితిలో నుండీ, వేగంగా సేవ చేయాలనే తపన కలవాడు సేవార్ధశీలి.

అనేక దృష్టికోణాలతో జగత్తును గ్రహించే జ్ఞానస్వరూపుడు కాలతత్వాన్నే శీలంగా ఆచరిస్తాడు

*****

జయ కాల కాల నిర్ణయ సద్భావ ధర్మ శీలి 

జయ మృత్యు మృత్యు కాలంబు గమ్యంబు సత్య శీలి 

జయ దేవ దేవ సర్వస్య రక్ష్యార్ధ మృత్యు శీలి 

జయ సాంబ సాంబ హృద్యంబు లక్ష్యంబు మోక్ష శీలి 

సరళ భావం :

కాలానికే అధిపతియైన పరమేశ్వరుడు ధర్మసద్భావాన్ని నిలబెట్టే శీలవంతుడు.

మృత్యువుకే మృత్యువైన ఆయన సత్యమార్గానికే గమ్యస్వరూపుడు.

దేవతలకూ దేవుడైన ఆయన సమస్త జగత్తు రక్షణకోసమే కాలతత్వాన్ని నియంత్రిస్తాడు.

సాంబశివుడు హృదయానికి ఆనందకరుడై, జీవుల పరమలక్ష్యమైన మోక్షాన్ని ప్రసాదించే స్వరూపుడు.

*****

జయ యోగ మార్గ మంగళత్మాక విజ్ఞాన శీలి 

జితి రాగ దుర్గ జ్యోతిర్మయ దివ్య దీప్తి శీలి 

ముని యోగ భాగ ముఖ్యంబు త్రినేత్ర శీలి 

స్వత శిద్ది భర్గ శఖ్యార్ధ సాధక విశ్వ శీలి 

సరళ భావం :

యోగమార్గాన్ని మంగళకరంగా మార్చి విజ్ఞానాన్ని ప్రసాదించేవాడు దివ్యశీలి.

రాగద్వేషాలను జయించి జ్యోతిర్మయమైన దివ్యప్రకాశస్వరూపుడై వెలుగుతాడు.

మునుల యోగసాధనలో ప్రధానమైన త్రినేత్ర స్వరూపుడు పరమతత్వానికి మార్గదర్శి.

స్వయంసిద్ధుడైన భర్గస్వరూపుడు సాధకుల మైత్రి, శ్రేయస్సు కోసం విశ్వవ్యాప్తంగా కరుణను ప్రసరింపజేస్తాడు.

****

కం. ఏ కాల మనే విధిగా 

 శ్లోకా పద్యాలు కవిత లాలన తెలుగే 

 నేక ముగావించ హితము 

 కాకాలు కాక కమనీయ కావ్యపు వెలుగే 


సరళ భావం :

ఏ కాలమైనా సరే, శ్లోకాలు, పద్యాలు, కవితల ద్వారా తెలుగు భాషను ప్రేమతో పోషించాలి.

అనేక విధాలుగా తెలుగు సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం సమాజ హితానికి దోహదం చేస్తుంది.

కాకుల కేకల వంటి నిరర్థక వాక్యాలకంటే, మనసును హత్తుకునే కావ్యరూపమైన వెలుగు ఎంతో మేలైనది.

*****



శా. చాలీచాలనిజీతభత్యము

లగున్ వాక్కల్లె మాయల్ గనే 

కూలీలేకయు కష్ట జీవనముగన్ కూర్చుండు ఖాళీగనున్ 

వేలున్కోరనుతిండినిత్య మది విద్వేషంబు లన్ లేవు నీ 

లీలల్ మాస్థితిగాను శాంతి సుఖముల్ లేవమ్మ యేతీరుగన్ 

సరళ భావం :

చాలీచాలని జీతభత్యాలతో జీవితం నెట్టుకొస్తోంది; మాటల్లో మాత్రం ఎన్నో మాయలు, ఆశలు కనిపిస్తున్నాయి.

కూలి పనులు కూడా దొరకక, కొందరు ఖాళీగా కూర్చొని కష్టజీవితం గడుపుతున్నారు.

రోజూ తినడానికి సరిపడా సంపాదన కోసం వేల మార్గాలు వెదుకుతూనే ఉన్నా, మనుషుల మధ్య విద్వేషాలు మాత్రం తగ్గడం లేదు.

ఈ విధమైన కాలస్థితిలో నిజమైన శాంతి, సుఖం ఎక్కడ దొరుకుతాయి అమ్మా! — అని కవి బాధతో ప్రశ్నిస్తున్నాడు.

*****

గీ. ఆణువణువు నీదు భక్తియు ననువు కరువు 

భిన్న మది విధి సరిజేయు బిక్కు బిక్కు 

లాలస లలిత లావణ్య లాభ సరయు 

షడ్గుణముల పలుకు లన్ని సర్వ మయము 

సరళ భావం :

ప్రతి ఆణువులోనూ నీ భక్తి నిండియుండగా, లోపమనే భావమే ఉండదు.

భిన్నమైన మనసులు, విధివైచిత్ర్యాలు కలిగిన జీవులను కూడా దైవకృప సమతలో నడిపిస్తుంది.

లాలస, లలితత్వం, లావణ్యం, లాభం వంటి జీవన గుణాలన్నీ ఒక ప్రవాహంలా సాగుతాయి.

అంతిమంగా షడ్గుణాల ద్వారా పలికే ప్రతి భావమూ పరమాత్మస్వరూపమైన సర్వమయత్వానికే సంకేతం.

****

ఉ. రాజులు రాగద్వేషకళ  రాజ్యహితంబున నిత్య యేలగన్

గాజులు గౌరవం గృహిణి గమ్యపు శోభల తీరు యేయగున్

మోజులు మానవత్వమగు మాయల మూలము సర్వ వేలగన్

సైజులు సత్యరూపమగు సీఘ్రసు సంపద జీవ నంబుగన్


సరళ భావం :

రాజులు రాగద్వేషాలకు అతీతంగా ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకొని పాలించాలి. అప్పుడు రాజ్యం శ్రేయస్సుతో నడుస్తుంది.

గాజులు గృహిణికి కేవలం అలంకారం మాత్రమే కాదు; ఆమె గౌరవం, సౌభాగ్యం, కుటుంబ శోభకు సూచికలు.

మోజులు అధికమైతే అవి మానవత్వాన్ని కమ్మివేసే మాయలకు మూలమవుతాయి. ఆశలు, ఆకర్షణలు మనసును దారి తప్పిస్తాయి.

సైజులు అంటే బాహ్య ఆకారాలు, ఆడంబరాలు కాదు; నిజమైన సంపద సత్యస్వరూపమైన మంచి జీవన విధానంలోనే ఉంటుంది అని కవి సూచిస్తున్నారు.

****

నేడు వివాహదీక్ష తమ నిర్ణయ సఖ్యత జంట గూర్చగన్ 

వేడుక విందు తీరగుట విజ్ఞత జూపుచు ఖర్చు లేకయున్ 

తోడుగ వచ్చువారికి సుపూజ్యత పువ్వుల మెప్పు జూపగన్ 

జోడును దీవెనేమధుర సూత్ర సు భోజన మెప్పు కాలమున్ 

సరళ భావం:

నేటి కాలంలో వివాహం చేసుకునే జంట తమ పరస్పర నిర్ణయం, సఖ్యతతో ముందుకు సాగుతున్నారు.

అధిక ఖర్చులు లేకుండా, విజ్ఞతతో వేడుకను నిర్వహిస్తూ, వచ్చిన అతిథులకు గౌరవప్రదమైన ఆతిథ్యం, పూలతో ఆహ్వానం అందిస్తున్నారు.

అలా ఆశీర్వాదాలతో కూడిన మధురమైన మంగళసూత్ర బంధం, సాదాసీదా భోజనంతోనూ అందరినీ సంతోషపరుస్తున్న కాలమిది.

******

పడ్డచోటన పక్వమైనను పాప పుణ్యము తప్పదున్

అడ్డదారులు చేరకుండగ ఆశ చాటున ఒప్పదున్

నడ్డి విర్గిన బుద్ది రావణ నాట్య మాడుట మోహమున్

చెడ్డ కోర్కెలె పృథ్వియెల్లెడ శ్రేయమున్ సమకూర్చెడున్!!*

సరళ భావం

మనిషి ఎక్కడ పడినా, ఎంత పక్వత వచ్చినా, పాపపుణ్య ఫలితాల నుండి తప్పించుకోలేడు.

ఆశ అనే ముసుగులో అడ్డదారులు ఎంచుకోవడం సరైనది కాదు.

మోహంలో మునిగిన మనసు, బుద్ధి నశించిన రావణుడిలా అహంకార నాట్యం చేస్తుంది.

అలా చెడ్డ కోర్కెలే ఈ భూమంతటా తిరుగుతూ, శ్రేయస్సు పేరుతోనే అనర్థాలకు కారణమవుతుంటాయి.

*****

గీ. సామ జవర గమన సుమ భావ హర్ష 

సాధు హృత్సార సాబ్ద సుసాధ్య పాల 

కాల తీత విఖ్యాత సరాగ యోగ 

మోహన మురళీనాదము మోక్ష్య మగును 

త్యాగరాజు సుధామయ తత్వ నీతి 


సరళ భావం

సామగానంలా సుగమమైన గమనం, సుగంధభావంతో కూడిన ఆనందాన్ని ప్రసాదిస్తుంది.

సాధువుల హృదయసారంగా వెలువడే శబ్దమే నిజమైన సుసాధ్యమైన పరిపాలన.

కాలాతీతమైన ఖ్యాతిని అందించే రాగయోగం,

మోహనమైన మురళీనాదంలా మోక్షానికి దారి తీస్తుంది.

అదే త్యాగరాజస్వామి బోధించిన అమృతస్వరూప తత్వనీతి.

****

గీ. గోరువంకగాన మధుర గోపలీల 

దాసి దాపరికము కళ దాత దారి 

వయసు తనము తోడు మలుపు వాక్కు తేరు 

రిపజన కళలు గా సమర్పింప విద్య 

సరళ భావం :

గోరువంక గానంలా మధురమైన గోపలీలలు మనసుకు ఆనందాన్ని ఇస్తాయి.

దాస్యభావం, దాపరికం లేని సేవాభావం దాతృత్వ మార్గాన్ని చూపిస్తుంది.

వయస్సు పెరుగుతున్న కొద్దీ జీవనంలో మాటతీరు, ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావాలి.

విభిన్న జనుల కళలను గౌరవంగా స్వీకరించి, వాటిని విద్యగా సమర్పించడం ఉత్తమ గుణమని కవి సూచిస్తున్నారు.

*****

గీ. సామ జవర గమన సుమ భావ హర్ష 

సాధు హృత్సార సాబ్ద సుసాధ్య పాల 

కాల తీత విఖ్యాత సరాగ యోగ 

మోహన మురళీనాదము మోక్ష్య మగును 

త్యాగరాజు సుధామయ తత్వ నీతి 


సరళ భావం

సామగానంలా సుగమమైన గమనం, సుగంధభావంతో కూడిన ఆనందాన్ని ప్రసాదిస్తుంది.

సాధువుల హృదయసారంగా వెలువడే శబ్దమే నిజమైన సుసాధ్యమైన పరిపాలన.

కాలాతీతమైన ఖ్యాతిని అందించే రాగయోగం,

మోహనమైన మురళీనాదంలా మోక్షానికి దారి తీస్తుంది.

అదే త్యాగరాజస్వామి బోధించిన అమృతస్వరూప తత్వనీతి.

****

[17/05, 18:37] Mallapragada Ramakrishna: దొంగ బుద్ధి దోచు దొరగాంచ వచ్చును 

కొంగ లాగ వేష గోర వచ్చు 

చెంగు తిప్ప మగువ చిత్త విద్యల తీరు 

దొంగి లించ లేడు దొంగ యైన 

సరళ భావం

దొంగబుద్ధి కలవాడు దోచుకుని ధనవంతుడిలా కనిపించవచ్చు.

కొంగలా అమాయక వేషం కూడా వేయగలడు.

ఒక స్త్రీ తన చీర చెంగు తిప్పినట్లే, మనసులోని చాతుర్యాన్ని సులభంగా మార్చగలదు.

కానీ నిజమైన చిత్తవిద్య, అంతరంగ జ్ఞానం — వాటిని దొంగ కూడా దొంగిలించలేడు.

****

[17/05, 18:38] Mallapragada Ramakrishna: కం.మగువ జడ మలుపులు కళ 

మగువ మెడమెరపులకలలు మనసా లతలే 

మగువ తెగువ పొగరు వగరు 

మగువ అలకల వలపులతొ మనసే మరపే

సరళ భావం

స్త్రీ జడలోని మలుపులలో ఒక కళ ఉంది.

ఆమె మెడలోని మెరుపులు మనసులో కలల తీగల్లా విరిసిపోతాయి.

ఆమె తెగువలో కొద్దిపాటి పొగరు, వగరు కనిపించినా,

ఆమె అలకలు, వలపులు చివరకు మనసును మరచిపోయేంతగా ఆకర్షిస్తాయి.

*****

[17/05, 18:44] Mallapragada Ramakrishna: కం!!

బలము నిలకడ యనకునే 

కలిమి కలలుగా కడకును కథలై కదులున్ 

విలువలు కళలై కదిలే 

కలియుగమున సహనమేను కాలపు తీరున్ 

సరళ భావం

బలం, స్థిరత్వం శాశ్వతమని అనుకున్నా,

సంపదలు చివరకు కలల్లా మారి కథలై పోతాయి.

విలువలు కూడా కళారూపాల్లా కదులుతూ మారిపోతుంటాయి.

ఈ కలియుగంలో కాలప్రవాహం చూస్తే, సహనం ఎంతో అరుదైపోయింది.

*****

[17/05, 18:52] Mallapragada Ramakrishna: పిల్లల మైసుఖాలయము పెంపక భయ్యమునందు నుండగన్ 

అల్లరి బాల్యమంతకళ అమ్మ సుదీర్ఘపు ప్రేమ లోననే

చల్లని వేళలో చెమట సాగుచరాచర నిత్య ప్రేమమై

మెల్లని ముద్దు మాటలవి  మెర్వగ దీవ్వెన తీరు దేహమై 

సరళ భావం

పిల్లల చిన్న చిన్న సుఖాలన్నీ, వారి పెంపకం, భయాలు — ఇవన్నీ అమ్మ ప్రేమలోనే పెరుగుతాయి.

అల్లరి నిండిన బాల్యమంతా తల్లి సుదీర్ఘమైన అనురాగ ఛాయలో సాగుతుంది.

చల్లని వేళల్లో కూడా పిల్లల కోసం చెమటోడ్చే తల్లి ప్రేమ సర్వజీవులపట్ల ఉన్న సహజ ప్రేమలాంటిది.

ఆమె మెల్లని ముద్దు మాటలు, దీవెనల వలె పిల్లల శరీరమంతా హాయిగా అలుముకుంటాయి.

***

[17/05, 19:01] Mallapragada Ramakrishna: కం.ప్రసవంబగు వేదనయే 

రసరాజకళలను జూడ పండిత చంద్రా 

దిశలన్ని నొకటిగానగు 

ప్రసరణభవమే జగంబు వాసర మయ్యేన్ 

సరళ భావం

ప్రసవవేదనే అసలు సృష్టి మూలం.

ఆ వేదన ద్వారానే రసరాజమైన కళలు, జీవరూపాలు, సౌందర్యాలు ఉద్భవిస్తాయి, ఓ పండితచంద్రా!

అప్పుడు అన్ని దిశలూ ఒక్కటిగా అనిపిస్తాయి.

అలా వ్యాపించే సృష్టి భావమే ఈ జగత్తును ప్రతిరోజూ నడిపిస్తున్న జీవశక్తిగా మారుతుంది.

****

[17/05, 19:06] Mallapragada Ramakrishna: రాగ రంజిత కళలన్ని రక్త యోగ 

రాగమంగళ మాయలు రమ్య చరిత

రాగ తాళ పల్లవి రస రాజ హృదయ 

రాగ మలుపుల విలువలు రవ్వ వెలుగు 

సరళ భావం

రాగాలతో అలంకరించబడిన కళలన్నీ జీవరక్తంతో ముడిపడినవే.

రాగమంగళాల మాయలు మనోహరమైన జీవనచరిత్రలుగా నిలుస్తాయి.

రాగం, తాళం, పల్లవి — ఇవన్నీ రసరాజమైన హృదయానుభూతికి ప్రతిరూపాలు.

రాగాల మలుపుల్లో దాగిన విలువలు చిన్న రవ్వల వెలుగులా జీవితాన్ని ప్రకాశింపజేస్తాయి.

****

[17/05, 19:13] Mallapragada Ramakrishna: వ్యవహారము జూడ మలుపు 

వ్యవసాయముతీరుగాను వ్యాపారముగన్ 

యువశక్తి ఫలమగుటయున్ 

నవవిద్యల మార్గమౌను నమ్మక జీవమ్ 

సరళ భావం

జీవితవ్యవహారాలను గమనిస్తే అవి ఎన్నో మలుపులతో నిండివుంటాయి.

వ్యవసాయం కూడా కాలానుగుణంగా వ్యాపారరూపం దాల్చుతోంది.

యువశక్తి ఫలప్రదంగా మారినప్పుడే సమాజానికి అభివృద్ధి కలుగుతుంది.

కొత్త విద్యామార్గాలే నమ్మకంతో కూడిన జీవనానికి దారితీస్తాయి.

కాలానుసారం పెళ్లిళ్లు కుదరడానికి పిల్లలు యొక్క మనోభావాలు .


*1960-70:*


తల్లి/తండ్రి : 


మంచి సంప్రదాయం ఉన్న కుటుంబం అది. అలాంటి కుటుంబం లోకి వెళ్లడమే అదృష్టం. కుదిర్చేసుకుందాం.


*అమ్మాయి* : 

మీ ఇష్టం నాన్నా. 


తల్లి/తండ్రి : 

మంచి సంప్రదాయం ఉన్న కుటుంబం అది. అలాంటి కుటుంబం లోంచే అమ్మాయిని తెచ్చుకోవాలి. కుదిర్చేసుకుందాం .


*అబ్బాయి* : 

సరే నాన్నా. అలాగే చెయ్యండి. 


1970-80:


తల్లి/తండ్రి : 


అబ్బాయి అందంగా లేకపోతేనేం. మంచి స్థితిమంతుడు. ఒప్పుకో. 


అమ్మాయి : 

మీ ఇష్టం నాన్నా .


తల్లి/తండ్రి :


అమ్మాయి అంత అందంగా లేకపోతేనేం. మంచి పనిమంతురాలు. పైగా కట్నం ఇచ్చే స్థోమత ఉంది. ఖాయం చేసేద్దాం.

 

అబ్బాయి : 

సరే నాన్నా. అలాగే చెయ్యండి. 


1980-90 :


తల్లి/తండ్రి :


అబ్బాయికి బ్యాంక్ లో ఉద్యోగం. మంచి జీతం. ఇంతకంటే మంచి సంబంధం మేము తేలేము . 


అమ్మాయి : 

మీ ఇష్టం నాన్నా .  


తల్లి/తండ్రి  : అమ్మాయి తండ్రి మంచి పొజిషన్ లో వున్నాడు. పిల్ల కూడా గ్రాడ్యూయేట్. చేసుకో. 


అబ్బాయి : 

సరే నాన్నా. అలాగే చెయ్యండి. 


1990-2000 :


తల్లి/ తండ్రి:


అబ్బాయి పెద్ద కంపెనీలో చేస్తున్నాడు. నిన్ను కూడా ఉద్యోగం చేయనిస్తాడట. చేసుకుంటే బాగుంటుంది . 


అమ్మాయి : 

నన్ను ఉద్యోగం చేయనిస్తేనే చేసుకుంటానని చెప్పండి. ఒప్పుకుంటేనే పెళ్లి.

 

తల్లి/తండ్రి  :

 

అమ్మాయి బ్యాంక్ లో పనిచేస్తోంది. ఇద్దరి జీతాలతో హాయిగా బ్రతకొచ్చు. చేసుకోరా. 


అబ్బాయి : 

సరే గాని. తాను నేను పనిచేసేచోటకి బ్యాంక్ వాళ్ళు ట్రాన్స్ఫర్ ఇస్తారో లేదో కనుక్కోండి. 



2000-2010  :


తల్లి/తండ్రి : 


అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ట. బాగా సంపాదిస్తున్నాడు. ఫారెన్ కూడా వెడతాట్ట. నీదే అదృష్టం. 


అమ్మాయి : 

నేను నా ఉద్యోగం వదులుకోవాలంటే కష్టం. వెంటనే అమెరికా వెడితే అక్కడ నన్ను కూడా ఉద్యోగం చేయనివాలని కండిషన్ పెట్టండి . 


తల్లి/తండ్రి  : అమ్మాయి  కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ట. నువ్వెక్కడుంటే అక్కడికి ట్రాన్స్ఫర్ కూడా చేసుకుంటుందిట . 


అబ్బాయి : 

సరే. కానీ ఉద్యోగం ఉంది కదా అని ఇంటి పని చేయనంటే కుదరదు. చెప్పండి. దానికి ఒప్పుకుంటేనే ఓకే చెప్పేది . 



2010-2020 :


తల్లి/తండ్రి : అబ్బాయి పెద్ద మల్టీ నేషనల్ కంపెనీ లో  పనిచేస్తున్నాడు. ఇల్లులు కూడా కొన్నాడుట . ఒకటి హైద్రాబాద్ లోను ఇంకోటి  మన  విశాఖపట్నం లోను . మంచి సంబంధం. చేసుకో. 


అమ్మాయి : 

వాళ్ళ అమ్మా నాన్న అక్కడ వుండడానికి వీల్లేదు. నేను వంట చెయ్యను. ఇంటిపని లో తను కూడా బాధ్యత తీసుకోవాలి. ఐదేళ్ల దాకా పిల్లలు కావాలి అనకూడదు. నేను కొన్న ఇంటి  EMI లు ఆ అబ్బాయే కట్టాలి. ఒప్పుకుంటే చూద్దాం . 


తల్లి/తండ్రి :

అమ్మాయి పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తోంది. ఇల్లు కూడా వుందట హైదరాబాద్ లో. మంచి సంబంధం. చేసుకో . 


అబ్బాయి : 

తను  బెంగుళూరు జాబ్ తెచ్చుకుంటే నాకు ఒకే. అమ్మాయి పేరున లోన్లు ఏవీ ఉండకూడదు. నా డబ్బులతో ఆమె EMI లు నేను కట్టను. 


2020-2026  :


తల్లి/తండ్రి : అబ్బాయి అమెరికాలో పెద్ద ఉద్యోగం. పదేళ్ళ నించీ అక్కడే ఉన్నాడట. రెండు నెలల నించీ నీ ఓకే గురించి వెయిట్ చేస్తున్నాడు. నీ ఉద్దేశ్యం చెప్పమ్మా . 


అమ్మాయి : 

నా పెళ్లి కి అంత తొందరెందుకు మీకు.నన్ను త్వరగా వదిలించుకోవాలని చూస్తున్నారా?  నాకు నచ్చిన వాణ్ణి నేనే చూసుకుంటా. వాడు రెండు నెలల నించీ వెయిట్ చేస్తున్నాడంటే వాడికి సంబంధాలు రావట్లేదన్నమాట. సరే. ఎంత కాలం వెయిట్ చేస్తాడో చెయ్యనీ . 


తల్లి/తండ్రి  : అమ్మాయి మంచి పాకేజ్ తో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లో పనిచేస్తోంది. అందంగా కూడా వుంది. ఒక సారి చూడరా. 


అబ్బాయి : 

నేను డేటింగ్ చేసి నాకు నచ్చిన అమ్మాయిని చూసుకుంటా. అయినా నాకు 33 ఏళ్ళేగా. తొందరెందుకు?.


ఇకముందు రాబోయే కాలం నాటికీ పరిస్థితి ఇలా : 


2027-47 ( ఒక పెద్దాయన విజన్ మాదిరిగా  ) :


అమ్మాయి : 

నాన్నా! నేను పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాను. మంచి సాంప్రదాయక మైన కుటుంబంలో అబ్బాయిని చూడండి. పల్లెటూళ్ళో వున్నా పరవా లేదు. నాకు వుద్యోగం లేదు. ఇంటి పని నేర్చుకుంటున్నాను అని చెప్పండి. చెడు అలవాట్లు లేకపోతే చాలు.  



తల్లి/తండ్రి : 

చూడమ్మా  , అంత పెద్ద  పెద్ద కోరికలు కోరితే మేం సంబంధాలు చూడలేము. నువ్వే చూసుకో. 


అబ్బాయి : 

నాన్నా! నేను పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాను. మంచి సాంప్రదాయక మైన కుటుంబంలో అమ్మాయి ఎవరైనా వుంటే చూడండి. పెద్ద చదువులు చదివిన అమ్మాయి వద్దు. ఇల్లు మానేజ్ చేసుకోగలిగితే చాలు. చెడు అలవాట్లు మాత్రం ఉండకూడదు .

   

తల్లి/తండ్రి : 

ఒరే సన్యాసి , అంత పెద్ద  పెద్ద కోరికలు కోరితే మేం సంబంధాలు చూడలేము. నువ్వే చూసుకో.

బుద్ధిచెప్పువాడు గుద్దితేనేమయా !

........................................


చాకి కోకలుదికి చీకాకు పడజేసిమైలదీసి లెస్స మడచినట్లుబుద్ధి జెప్పువాడు గుద్దితేనేమయావిశ్వదాభిరామ వినురవేమ!


పాఠశాలల్లో విద్యార్థులపై శారీరక శిక్ష ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పద అంశంగా కొనసాగుతోంది. చాలా దేశాలు దీన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించి నిషేధించినా, సామాజిక, చట్టపరమైన కారణాల వల్ల కొన్ని దేశాల్లో ఇది ఇప్పటికీ ఉంది. సింగపూర్లో కొంతవరకు బెత్తంతో మర్యాద చేసే (కేనింగ్) విధానం చట్టబద్ధంగానే కొనసాగుతోంది. తీవ్రమైన క్రమశిక్షణా ఉల్లంఘనలపై ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో మగ విద్యార్థులకు మాత్రమే ఈ శిక్షను అక్కడ విధిస్తారు.


అమెరికాలో సుమారు 19 రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్యాడ్లింగ్ అంటే చెక్క పలకతో కొట్టడమనే దండింపు అక్కడ చట్టబద్ధమే. 1977 నాటి ఒక సుప్రీంకోర్టు తీర్పు దీనికి రాజ్యాంగ రక్షణ లభించింది.


భారతదేశంలో ఆర్టీఈ చట్టం (RTE Act 2009) మరియు జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం పాఠశాలల్లో శారీరక, మానసిక హింస పూర్తిగా నిషేధించబడ్డాయి, అయినా క్షేత్రస్థాయిలో ఇప్పటికీ ఉపాధ్యాయులు పిల్లలకు శిక్షలు విధించే ఘటనలు అక్కడక్కడా జరుగుతున్నాయి. నైజీరియా, జింబాబ్వే వంటి ఆఫ్రికా దేశాల్లో ‘మితంగా దండించడం పేరుతో ఉపాధ్యాయులకు కొన్ని అధికారాలు ఉండగా, మధ్యప్రాచ్య దేశాల్లో స్పష్టమైన చట్టాలు లేకపోవడంతో పాత పద్ధతులే కొనసాగుతున్నాయి.


స్వీడన్ 1979లో పాఠశాలలతోపాటు ఇంట్లో కూడా పిల్లలను కొట్టడాన్ని నిషేధించి అలా చట్టం చేసిన మొదటి దేశంగా నిలిచింది. దీన్ని అనుసరించి జర్మనీ, ఫ్రాన్స్, నార్వే, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తున్నాయి.


ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ పరిశోధనల ప్రకారం శారీరక శిక్ష వల్ల విద్యార్థుల్లో ఆందోళన, డిప్రెషన్, ఆత్మవిశ్వాస లోపం, ద్రోహప్రవర్తన, పాఠశాలకు గైర్హాజరు వంటి తీవ్ర ప్రభావాలు పడతాయి. ప్రత్యేకించి వికలాంగులు, వెనుకబడిన వర్గాల పిల్లలు ఎక్కువగా ప్రభావితులైతున్నారు. 


ప్రస్తుతం ప్రపంచం విద్యార్థులను శిక్షించే విధానం నుండి సంస్కరణల వైపు కదులుతోంది. కౌన్సెలింగ్, ప్రవర్తనా మార్గదర్శకత్వం, రివార్డ్ సిస్టమ్ వంటి సానుకూల క్రమశిక్షణ పద్ధతులను ప్రోత్సహిస్తోంది. విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దే ప్రక్రియలో భయం కంటే ప్రేరణ అభయం  గొప్ప ఆయుధాలని ఆధునిక విద్యావేత్తలు భావిస్తున్నారు.


మరైతే బుద్ధిచెప్పువాడు గుద్దితేనేమయా అని చెప్పిన యోగివేమన పలుకులు ఏంకాను, మీరే చెప్పండి ?


IIసేకరణII

.................జిబి.విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ

05-02-2026