శైవ – వైష్ణవ వేషధారణలు ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ....................................... ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో భారతీయ ఆచారాలు, సంప్రదాయాలు, మతపరమైన విషయాలు చిత్రరూపంలో ప్రతిబింబించబడ్డాయి. భారతీయ మతపరమైన వర్గాలు, కులాలు, వృత్తులు, వేషధారణలు, ఆచారాలను నమోదు చేసి భారతదేశంలో ఉన్న బ్రిటిష్ అధికారులకు “ భారతీయులు” ఎలా ఉంటారో వారి సంపన్నమైన నాగరికత ఏమిటో చూపించడానికి, అలాగే ఐరోపా దేశాలకు మన సంప్రదాయాలను తెలియజేయడానికి ఇలాంటి చిత్రాలు రూపొందించబడ్డాయి. ఫోటోగ్రఫీ అప్పట్లో లేనందున, భారతీయ నాగరికతను చిత్రరూపంలో నమోదు చేసి తమ ప్రజలకు అందించారు. ఈ చిత్రం దక్షిణ భారత భక్తి సంప్రదాయాలను ప్రతిబింబించే ఒక ఉదాహరణ. ఈ కళాఖండం 1830–1850 మధ్యకాలంలో రూపొందిన కంపెనీ పెయింటింగ్ శైలికి చెందినది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ మత సంప్రదాయాలను నమోదు చేస్తూ ఉన్న సమయంలో ఇది రూపొందించబడింది. ఈ చిత్రంలో ప్రధానంగా మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతానికి చెందిన భక్తులను చూపించారు. చిత్రంలో ఎడమ నుండి కుడి వరకు మూడు వేర్వేరు భక్తి జంటలు కన...