తిరుమల ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కాంస్యవిగ్రహముoది కదా! దానిని అక్కడ ప్రతిష్టించమని ఆదేశించింది ఎవరు ?

...........................................

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి ఇచ్చిన దానాలు - చరిత్ర.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత పురాతనమైన నిరంతరం ఆరాధించబడుతున్న వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. శతాబ్దాల పాటు రాజులు చక్రవర్తులు సామంతులు నాయకులు అమరనాయకులు మంత్రులు జమీందారులు పాళేగాళ్ళు వర్తకులు సామాన్య భక్తులు అందరూ నిత్యసేవలకు సంపదలు భూదానాలు ఆభరణాలు నిధులు సమర్పించారు. ఈ దానాలే నేటి ఆలయ వైభవానికి పునాది. తరతరాల భక్తుల ఔదార్యమే తిరుమలను నేడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటిగా నిలిపింది. 

ఆలయ గోడలపై చెక్కబడిన వేలాది శాసనాలు లభించిన రాగిరేకులు మరియు దేవస్థానం ఎపిగ్రఫీ విభాగం ప్రచురించిన సంకలనాలు దీనికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.

తిరుమలలో ఇప్పటివరకు లభించిన అత్యంత పురాతన దాన శాసనం ACE 966 కు చెందినది. పల్లవ రాజు శక్తివంతన్ మహారాజు భార్య సమవై పెరిందేవిగారు వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. విలువైన ఆభరణాలతో పాటు సుమారు 23 నివర్తనాల భూమిని కూడా దానమిచ్చింది. ఆ భూముల ఆదాయాన్ని నిత్యపూజలు దీపారాధన ఉత్సవాలకు వినియోగించాలని శాసనంలో నిర్దేశించింది. ఇది తిరుమల ఆలయ చరిత్రలో నమోదైన మొట్టమొదటి ముఖ్యమైన రాజదానంగా పరిగణించబడుతోంది.

పల్లవుల తరువాత చోళులు పాండ్యులు తెలుగు చోళులు యాదవరాయలు మొదలైనవారు తిరుమల అభివృద్ధికి గణనీయంగా తోడ్పడ్డారు. నిత్య నైవేద్యం దీపారాధన మొ॥ ఉత్సవాల కోసం భూములు గ్రామాలు పన్ను ఆదాయాలు దానమిచ్చారు.

ACE 1328 ప్రాంతంలో విజయగండ గోపాలదేవుడు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి తోడ్పడినట్లు శాసనాలు తెలుపుతున్నాయి.

విజయనగర సామ్రాజ్యం ఆవిర్భవించడంతో తిరుమల ఆలయ చరిత్రలో స్వర్ణయుగం మొదలైంది. సంగమ సాళువ తుళువ అరవీడు వంశాల పాలకులు తిరుమలను తమ సామ్రాజ్యానికి ఆధ్యాత్మిక కేంద్రంగా భావించి అపారమైన భక్తిశ్రద్ధలు చూపించారు. గ్రామాలు వ్యవసాయ భూములు బంగారం వజ్రాలు ముత్యాలు రత్నఖచిత ఆభరణాలు కిరీటాలు పూజాపాత్రలు సమర్పించారు.15వ శతాబ్దం నాటికి తిరుమల దక్షిణ భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచింది.

సాళువ నరసింహరాయలు ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశాడు. ACE 1470 ప్రాంతంలో సంపంగి ప్రదక్షిణానికి నాలుగు మూలలలో నాలుగు స్తంభాల మండపాలు నిర్మించాడు.ACE 1473 ప్రాంతంలో తిరుమలరాయ మండపం నిర్మాణానికి తోడ్పడ్డాడు. యాత్రికుల సౌలభ్యం కోసం అనేక సేవలు ప్రవేశపెట్టాడు. ఆలయ ఉత్సవాలకు మరింత వైభవం చేకూర్చాడు.

అయితే తిరుమల చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన దాత తుళువ వంశ చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు ACE 1513 నుండి 1521 మధ్యకాలంలో ఆయన తన రాణులతో కలిసి కనీసం ఏడుసార్లు తిరుమలను సందర్శించాడు. ప్రతి సందర్శనలోనూ బంగారం వజ్రాలు రత్నఖచిత ఆభరణాలు బంగారుపాత్రలు గ్రామాలు మరియు భూములు సమర్పించాడు. ఆయన దానం చేసిన బంగారంతోనే ACE 1517 ప్రాంతంలో ఆనందనిలయ విమానానికి బంగారు తొడుగు వేయడం సాధ్యమైంది.

నేటికీ ఆలయంలో వున్న శ్రీ కృష్ణదేవరాయలు తిరుమలదేవి చిన్నదేవిల కంచు విగ్రహాలు ఆయన భక్తికి జీవన్మూర్తులుగా నిలుస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయల అగణన భక్తికి మెచ్చి శ్రీవారు ఆయన స్వప్నంలో దర్శనమిచ్చి, ఆలయంలో కాంస్యవిగ్రహం ఏర్పాటు చేసుకోమని ఆదేశించాడు.ఆ ఆదేశం మేరకే శ్రీకృష్ణరాయలు తనది తన దేవేరుల కాంస్యవిగ్రహాలు ఏర్పాటు చేశాడని ఓ ఐతిహ్యముంది.

కృష్ణరాయని శాసనాలు తెలుగు కన్నడ మరియు తమిళ భాషలలో చెక్కబడివుండటం విశేషం.

కృష్ణదేవరాయల అనంతరం సింహాసనం అధిష్టించిన ఆయన తమ్ముడు అచ్యుతదేవరాయలు కూడా ఆలయానికి గణనీయమైన దానాలు చేశాడు. నిత్య సేవలకు అనేక గ్రామాలను దేవదాయంగా ఇచ్చాడు. తదనంతరం విజయనగరానికి రాజైన తుళవవంశ సదాశివరాయలు Defacto Ruler అళియ రామరాయలు, రామరాయల తమ్ముడు & విజయనగర చక్రవర్తి అయిన తిరుమలరాయలు, తిరుమల రాయల కొడుకు తదుపరి విజయనగర చక్రవర్తి అయిన వేంకటపతిరాయలుఆలయ రక్షణకు విశేషకృషి చేశారు. తిరుమలరాయల కాలంలో ఉంజల సేవ విస్తరించింది. వేంకటపతిరాయల కాలంలో యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.


ACE 1565లో తాళికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం బలహీనపడినా తిరుమల వైభవం తగ్గలేదు. చంద్రగిరిలో రాజధానిగా అరవీడు వంశ పాలకులు ఆలయాన్ని కాపాడారు. 


అనంతరం ఆర్కాటు నవాబులు మరాఠా సేనాధిపతులు స్థానిక జమీందారులు తమ తమ సేవలను కొనసాగించారు.


మరాఠా సేనాపతి రఘుజీ భోంస్లే సుమారు ACE 1740 లో తిరుమలను సందర్శించి అమూల్యమైన ముత్యాల హారాలు రత్నఖచిత ఆభరణాలు సమర్పించాడు. నిత్య సేవలు నిరంతరం కొనసాగేందుకు ధార్మిక నిధులు కూడా ఏర్పాటు చేశాడు. ఆయన దానమిచ్చిన కొన్ని ఆభరణాలు నేటికీ ఆలయ సంప్రదాయంలో రఘుజీవారి పెట్టె  పేరిట చలామణిలోవున్నాయి.


మరాఠా సేనాని సదాశివరావు భావు దక్షిణ భారతంలో మరాఠా ప్రభావాన్ని సుస్థిరం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తిరుమలకు ఆయన చేసిన నిర్దిష్ట దానాలకు స్పష్టమైన శాసనాధారాలు లభించకపోయినా, దక్షిణ భారత హిందూ దేవాలయాల పట్ల ఆయన చూపిన గౌరవం ముఖ్యంగా తిరుమల రక్షణ విధానం విశేషంగా పేర్కొనదగినవి.


ACE 1801 లో తిరుమల ఆలయం ఈస్ట్ ఇండియా కంపెనీ పర్యవేక్షణలోకి వచ్చింది. అప్పటి ఆలయ వార్షిక ఆదాయం లక్ష రూపాయలు దాటిందని రికార్డులు తెలుపుతున్నాయి. కంపెనీ అధికారులు ఆదాయ వ్యయాలను పర్యవేక్షిస్తూ సేవలు కొనసాగేలా చూశారు. తదనంతరం మతపరమైన వ్యవహారాలలో ప్రత్యక్ష జోక్యాన్ని తగ్గించాలని నిర్ణయించిన బ్రిటిష్ ప్రభుత్వం ACE 1843లో ఆలయ పరిపాలనను హాతీరంజీ మఠానికి చెందిన మహంతులకు అప్పగించింది. సేవాదాస్ మహంత్ మొదటగా బాధ్యతలు స్వీకరించాడు. మహంతుల పాలనలో అనేక మరమ్మతులు సేవా కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. అనివార అస్థానం వంటి పరిపాలనా సంప్రదాయాలు మరింత క్రమబద్ధమయ్యాయి.

దాదాపు తొంభై సంవత్సరాల మహంతుల పరిపాలన అనంతరం ACE 1933 లో ప్రత్యేక చట్టం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఏర్పాటైంది. అప్పటి నుండి ఆలయ పరిపాలన ఆధునిక తరహాలో కొనసాగుతోంది. తత్పరిణామంగా భక్తుల సంఖ్య, హుండీ ఆదాయాలు మత కార్యక్రమాలు అపరిమితంగా వృద్ధి చెందాయి. దాంతో తిరుమల ప్రపంచ ప్రసిద్ధ తీర్థక్షేత్రంగా అవతరించింది.


ఇలా పల్లవుల నుండి విజయనగర చక్రవర్తుల వరకు నాయకుల నుండి అమరనాయకుల వరకు మరాఠా ప్రభువుల నుండి జమీందారులు పాళేగాళ్ళు రాచమంత్రులు వర్తకులు మరియు సామాన్య భక్తుల వరకు అసంఖ్యాక జనులు శ్రీ వేంకటేశ్వరస్వామికి బంగారం వజ్రాలు ఆభరణాలు గ్రామాలు భూములు మండపాలు మరియు నిత్యసేవా నిధులు సమర్పించారు. తిరుమల శాసనాలు వారి భక్తికి, ఔదార్యానికి మరియు ధర్మనిష్ఠకు శాశ్వత సాక్షులుగా నిలుస్తున్నాయి. భారతీయ దాన సంప్రదాయానికి అద్భుతమైన చారిత్రక దర్పణంగా తిరుమల వెలుగొందుతోంది.


॥సేకరణ॥

................

దోసెకు ఓ చరిత్ర ఉంది.

.........................................

దోసె కేవలం ఒక అల్పాహార వంటకం మాత్రమే కాదు భారతీయ నాగరికత ప్రపంచానికి అందించిన అపూర్వమైన ఆహార వారసత్వం. దక్షిణ భారతదేశపు వంటగదుల్లో పుట్టిన ఈ వంటకం నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకుంది. దోసె చేసిన ఈ ప్రపంచ ప్రయాణం నిజంగా అద్భుతమైనది

ACE 1వ శతాబ్దానికి చెందిన తమిళ సంగం సాహిత్యంలోనే ‘దోసై’ పేరుతో ఈ వంటకం గురించి ప్రస్తావన కనిపిస్తుంది. ఆహార చరిత్రకారుడు కె.టి. అచ్చయ పరిశోధనల ప్రకారం, బియ్యం మినప్పప్పు పిండిని పులియబెట్టి తయారుచేసే రొట్టె అప్పటికే వాడుకలో ఉండేది. అయితే ఆ కాలంలోని దోసె నేటి దోసెలా కరకరలాడేది కాదు. మందంగా మృదువుగా ఉండేది. ఆధునిక దోసె రూపం సంతరించుకోవడానికి ఇంకా అనేక శతాబ్దాలు పట్టింది. ‘దోసె’ అనే పదం సంస్కృతంలోని ‘దోష’ అనే పదం నుంచి వచ్చిందనే అభిప్రాయానికి చారిత్రక ఆధారాలు లేవు. ప్రాచీన తమిళ నిఘంటువు చెంతం దివాకరం దీనిని అప్పం రకాల్లో ఒకటిగా పేర్కొనగా ACE 10వ శతాబ్దానికి చెందిన పింగల నిఘంటువు ‘కంజం’ అనే పదాన్ని దోసెకు మరో పేరుగా నమోదు చేసింది

కర్ణాటకలోని ఉడిపి ప్రాంతమే ఆధునిక దోసెకు జన్మస్థలమని చెప్పవచ్చు. ACE 12వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య చక్రవర్తి మూడవ సోమేశ్వరుడు రచించిన సంస్కృత గ్రంథం మానసోల్లాసంలో దోసె తయారీ విధానం గురించి వివరంగా పేర్కొన్నారు. ఉడిపి శ్రీకృష్ణమఠంలో దైవనివేదనలో భాగంగా దోసెను తయారుచేయడం ఒక సంప్రదాయంగా మారింది. మఠంలోని వంటవారు శుభ్రత రుచిnపోషక విలువలకు ప్రాధాన్యం ఇస్తూ దోసెను మరింత సన్నగా కరకరలాడేలా తయారుచేసే నైపుణ్యాన్ని అభివృద్ధి చేశారు. నేడు ప్రసిద్ధిగాంచిన ‘బెన్నెదోసె’ వంటి ప్రత్యేక రకాలు కూడా ఈ ప్రాంతంలోనే ఆవిర్భవించాయి.

దోసె పిండిలో సాధారణంగా మెంతులు కలుపుతారు. ఇవి పిండిని బాగా పులియబెట్టడానికి దోసెకు మంచి ఆకృతి రావడానికి జీర్ణక్రియకు తోడ్పడటానికి ఉపయోగపడతాయి. పులియబెట్టే ప్రక్రియ దోసెకు ప్రత్యేకమైన రుచి, సువాసనను అందిస్తుంది.

ACE 20వ శతాబ్దంలో ఉడిపి ప్రాంతానికి చెందిన వంటవారు ముంబై, పుణే డిల్లి కలకత్తా భాగ్యనగరం వంటి మహానగరాల్లో హోటళ్లు స్థాపించారు. 1930ల నాటికే ఈ హోటళ్లు విశేష ప్రజాదరణ పొందాయి. అందరికి ఇష్టమైన  శాకాహారం తక్కువ ధర నాణ్యమైన పదార్థాలు అద్భుతమైన రుచి, ఈ లక్షణాలు ఉడిపి పూట కూళ్ళను (హోటళ్లను) ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ క్రమంలో దోసె ఉత్తర భారతదేశానికి అనంతరం విదేశాలకు కూడా పరిచయమైంది. తరువాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ కేరళ ప్రాంతాలకు విస్తరించిన దోసె తర్వాతి దశాబ్దాల్లో జాతీయ గుర్తింపు పొందిన భారతీయ వంటకంగా మారింది.

కాలక్రమేణా దోసె అనేక రూపాలు సంతరించుకుంది. నేడు మనకు మసాలా దోసె, సాదా దోసె, రవ్వ దోసె, సెట్ దోసె, ఎంఎల్‌ఏ దోసె, పేపర్ దోసె, నీరు దోసె, ఆకుకూర దోసె, గుడ్డు దోసె, గుంటూరు కారం దోసె, పేపర్ రోస్ట్ దోసె, జిన్నీ దోసె, పెసరదోసె, రాగి దోసె, సజ్జదోసె, గోధుమదోసె, చీజ్ దోసె, పన్నీర్ దోసె, చాక్లెట్ దోసె, పిజ్జా దోసె, నేయి దోసె వంటి అనేక రకాల దోసెలు లభిస్తున్నాయి. ఇవి కేవలం కొన్ని మాత్రమే.

దోసె అనేది తమిళ సంగం యుగపు నాగరికతను విజయనగర సామ్రాజ్యపు వంట సంప్రదాయాలను ఉడిపి మఠంలోని భక్తి సంస్కృతిని ఆధునిక హోటల్ సంస్కృతిని ఒకే వంటకంలో కలిపిన ఓ చారిత్రక సృష్టి. దాదాపు రెండు వేల సంవత్సరాలుగా నిరంతరం పరిణామం చెందుతూ నేటి తరానికి చేరిన ఈ ఘుమఘుమలాడే ఆహార సంప్రదాయం రాబోయే తరాలకూ ఇదే ఆదరణతో కొనసాగుతుందనడంలో సందేహం లేదు. పులియబెట్టిన దోసెపిండి సహజ ప్రోబయోటిక్‌గా పనిచేసి మన ప్రేగుల్లోని మేలు చేసే బ్యాక్టీరియా వృద్ధికి దోహదపడుతుంది.

॥సేకరణ॥

*******

.మంగలం - ముఖ్యాగ్రహారం - అష్టాదశ ప్రజలు - కరండం - ఉగ్రాణం.

..........................................

(అ) ముఖ్యాగ్రహారమనేది అత్యున్నత స్థాయిలోవున్న అగ్రహారం.రాజులు సామంతులు మొ॥వారు హిందూశాస్త్రా

లలో విశేష పాండిత్యం కలిగిన బ్రాహ్మణులకు గ్రామాలను దానంగా ఇచ్చేవారు. అలాంటి దానగ్రామాలను అగ్రహారాలు అంటారు. వాటిలో అన్ని హక్కులు ప్రత్యేకాధికారాలు కలిగిన అగ్రహారాన్ని ముఖ్యాగ్రహారమని పిలిచేవారు. వారికి

భోగాష్టకములు అంటేఎనిమిది భోగాధికారాలుండేవి. (1)పౌరోవాత్యం – పురోహిత వృత్తి నిర్వహించే హక్కు (2) యాజకత్వం – యజ్ఞయాగాదులు నిర్వహించే అధికారం (3) ప్రభుత్వం – గ్రామ పరిపాలన లేదా స్థానిక అధికార హక్కు (4) జ్యోతిస్సారం – జ్యోతిష్య సేవలు అందించే హక్కు (5) హేమముద్రా పరీక్షా – బంగారు నాణేలు లేదా ధన ప్రమాణాల పరిశీలన హక్కు (6) సాముద్రికం – శరీర లక్షణాల ఆధారంగా ఫలితాలు చెప్పే విద్య అంటే సాముద్రిక శాస్త్రం. (7) లేఖకనం – పత్రాలు, శాసనాలు, లెక్కలు వ్రాసే అధికారం (8) యాజమానము – నిర్వహణ పర్యవేక్షణ నాయకత్వహక్కు. ఈ భోగాష్టకములతో పాటుగా

అష్టతేజస్వామ్యములు అగ్రహారానికి సంబంధించిన సంపదలు. ఈ అష్టతేజస్వామ్యముల వనరులపై వారికి హక్కులు ఉండేవి.(1) నిధి – భూమిలో దొరికే నిధులు (treasure trove) (2) నిక్షేప – భద్రపరచిన ధనం లేదా దాచిన వస్తువులు (3) జల – నీటి వనరులపై హక్కు (4) పాషాణ/ఆళ్మసార – రాళ్లు, ఖనిజాలు లేదా భూసంపదలపై హక్కు (5) అక్షీణ – ప్రస్తుతం ఉన్న స్థిర ఆదాయాలపై హక్కు (6) ఆగామి – భవిష్యత్తులో వచ్చే ఆదాయాలపై హక్కు (7) సిద్ధ – ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఆస్తులు, ఫలసాయం (8) సాధ్య – భవిష్యత్తులో అభివృద్ధి చేయగల సంపదలపై హక్కు.ముఖ్యాగ్రహారం అనేది కేవలం భూమి దానం కాదు. గ్రామంలోని ఆదాయాలు నీటి వనరులు, నిధులు పరిపాలనా అధికారాలు పురోహిత హక్కులు విద్యా సంబంధిత అధికారాలు మొదలైన సమగ్ర హక్కులతో కూడిన గ్రామదానం. ఇలాంటి అగ్రహారాలను రాజులు వేదవేదాంగాలలో, శాస్త్రాలలో ప్రావీణ్యం కలిగిన సద్బ్రాహ్మణులకు బహుమతిగా ఇచ్చేవారు.

(ఆ) మంగలమంటే బ్రాహ్మణ అగ్రహారాలకు  సంబంధించిన పేరు.

మంగలమనేది గ్రామ నామాల చివర వచ్చే ఒక ప్రత్యేక అంత్యపదం 

ఉదాహరణకు

చతుర్వేది మంగలం

బ్రహ్మదేయ మంగలం

ఉత్తరమేరూరు మంగలం బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన గ్రామం. బ్రాహ్మణులు అధిక సంఖ్యలో నివసించే గ్రామాన్ని సూచిస్తుంది.శాసనాలలోని నిర్వచనం ప్రకారం

ఏబదియెనిమిది (58) బ్రాహ్మణ కుటుంబాలు కలిసి నివసించే గ్రామాన్ని మంగలము అంటారు.

అంటే ఒక గ్రామంలో కనీసం 58 బ్రాహ్మణ కుటుంబాలు స్థిరనివాసం ఏర్పరచుకొని వేదాధ్యయనం యజ్ఞయాగాలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ గ్రామం మంగలముగా పరిగణించబడేది.

చతుర్వేది మంగలమంటే నాలుగు వేదాలను అధ్యయనం చేసిన బోధించే బ్రాహ్మణులున్న చోటు.దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా చోళ పాండ్య విజయనగర కాలపు శాసనాల్లో చతుర్వేదిమంగలమనే పేరు చాలా సాధారణంగా కనిపిస్తుంది.

మంగలం అగ్రహారం బ్రహ్మదేయం మధ్య సంబంధమేమిటో చూద్దాం.బ్రహ్మదేయమంటే బ్రాహ్మణులకు దానం చేసిన భూమి లేదా గ్రామం.అగ్రహారమంటే బ్రాహ్మణ నివాస కేంద్రంగా ఏర్పడిన గ్రామం.మంగలమంటే నిర్దిష్ట సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలు నివసించే బ్రాహ్మణ గ్రామం.చోళుల కాలం ACE 9–13వ శతాబ్దాలలో దక్షిణ భారతదేశంలో అనేక గ్రామాల పేర్లకు మంగలమనే ప్రత్యయం జతచేయబడింది. ఇది ఆ గ్రామం బ్రాహ్మణ దానగ్రామం లేదా విద్యా కేంద్రం అని సూచిస్తుంది.

కనుక మంగలము కనీసం 58 బ్రాహ్మణ కుటుంబాలు నివసించే బ్రాహ్మణ గ్రామమే మంగలం.

(ఇ) కరండబేదకుడు  అంటే కరండమనే వాయిద్యాన్ని వాయించువాడు.కరండమంటే 18 వాయిద్యాలలో ఒకటి.

అష్టాదశ (పదునెనిమిది) వాద్యాలేమిటో గమనిద్దాం.

(1) భేరి (2) మృదంగం (3) పటహం (4) దుందుభి (5) మద్దెల (6) తిమిల (7) ఇడక్క (8) ఉడుక్కు (9) కాహళం (10) శంఖం (11) కొమ్ము (12) వేణువు (13) సన్నాయి (14) తాళం (15) ఘంట (16) చెంగిలగాంగ్వాయిద్యం (17) కరడిక / కరండం (18) డమరు.ఈ

కరండం అష్టాదశ వాద్యాలలో ఒకటిగా కొన్ని శాసనాలలో ప్రస్తావించబడింది. అయితే నేటికి కరండం వాడుకలో లేకపోవడం వల్ల దాని నిర్మాణ విశేషాలు పూర్తిగా తెలియదు. 

మధ్యయుగ దేవాలయాల్లో ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు రథయాత్రలు నిత్యసేవల సమయంలో అనేక వాద్యకారులు నియమించబడేవారు. అలా దేవాలయ సంప్రదాయంలో కరండవాదకుడు దేవాలయంలో, ఉత్సవంలో సంగీత బృందంలో కరండం అనే ప్రాచీన వాద్యాన్ని వాయించే కళాకారుడు అని అర్థం.

(ఈ) ఉగ్రాణము అనగా ధాన్యము ఇతర ఆహార నిల్వలు  సరుకులను భద్రపరచే గిడ్డంగి.ఆంగ్లంలో దీనిని Granary  అంటారు.గ్రామాలలో రైతులు పండించిన వరి, జొన్న, సజ్జ, గోధుమ, కొర్ర,సాములు, అరికెలు, అపరాలు వంటి ధాన్యాలను సంవత్సరమంతా నిల్వ ఉంచడానికి ప్రత్యేకంగా నిర్మించిన గృహాన్నే ఉగ్రాణము అని పిలిచేవారు.గరిసె అనేది ఉగ్రాణానికి తెలుగు పర్యాయపదం.గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ గరిసెలో ధాన్యం పోశారు. గరిసె నిండిపోయింది వంటి వాడుకలు కనిపిస్తాయి.ఉగ్రాణము అనే పదం సంస్కృతంలోని ఉగ్రాణ (Ugrāṇa) నుండి వచ్చింది.ధాన్యాగారం భాండాగారమనే అర్థాలు ఉన్నాయి.రాజ్యపాలనలో దేవాలయాలలో అగ్రహారాలలో ఉగ్రాణాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండేది.దేవాలయాలకు వచ్చిన ధాన్య దానాలు ఉగ్రాణాలలో నిల్వ చేసేవారు.రాజులు భూమిశిస్తుగా వసూలు చేసిన ధాన్యాన్ని రాజఉగ్రాణాలలో భద్రపరచేవారు.

కరువు కాలాల్లో ప్రజలకు పంపిణీ చేయడానికి ఉగ్రాణాలు ఉపయోగపడేవి.అందుకే కొన్ని శాసనాలలో ఉగ్రాణాధికారి (Granary officer) ఉగ్రాణపాలకుడు,ధాన్యాగారాధికారి వంటి పదాలు కనబడుతాయి.

(ఉ) అష్టాదశప్రజలు = గ్రామములోని 18 ప్రధాన సామాజిక (వృత్తి) వర్గాలకు చెందిన జనులను అష్టాదశ ప్రజలు అని పిలిచేవారు.

(1) బ్రహ్మ = బ్రాహ్మణులు (2) క్షత్రియ = పాలకులు యోధులు (3) వైశ్య = వ్యాపారులు (4) శూద్ర = వ్యవసాయ, సేవావర్గాలు (5) వ్యావహారిక = వర్తకులు, లావాదేవీలు నిర్వహించేవారు (6) గోరక్షక = పశుపోషకులు

(7) శిల్పక = శిల్పులు చేతివృత్తి నిపుణులు

(8) పంచాణ = విశ్వకర్మ వర్గానికి చెందిన ఐదు శిల్పకుల సముదాయం

(9) కుంభకార = కుమ్మరులు

(10) తంతువాయి = నేతలు (సాలెలు)

(11) క్షౌరక = మంగళ్లు (క్షురకులు)

(12) రజక = చాకళ్లు

(13) వస్త్రచ్ఛేదక – బట్టలు కుట్టేవారు (దర్జీలు)

(14) చర్మకార – చెప్పుల తయారీ, తోలు పనివారు

(15) తిలఘాతుక – గానుగలతో నువ్వులు ఇతర గింజలు ఆడించి నూనె తీసేవారు.(16) లబ్ధక – వేటగాళ్లు లేదా అటవీ ఉత్పత్తులు సేకరించేవారు (17) చండాల = గ్రామానికి చెందిన సమాచారాన్ని వార్తలను కొమ్ము లేదా తప్పెట ద్వారా చాటింపు వేయువారు.(18) మాతంగ – మాతంగ సమాజానికి చెందినవారు. వీరంతా కలసికట్టుగా స్థాయి భేదము లేకుండా గ్రామాభివృద్ధికి దేవాలయాల అభివృద్ధికి పాటుపడేవారు.

॥సేకరణII

................... జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.






పాఠము 

అనాది భాస్కరార్య అకాల నిత్య ధర్మ 

పునాది పృధ్వినీవె పురాణ పూర్ష దీప్తి 

సనాతనంబునీవె సమర్ధతాభవంబు 

వినూత్న మేని నీవె విశ్వవిజేత గానె 


ఋణంబుదీర్చలేని శుభంబు కూర్చుచచుండె 

గుణంబు నీదెదిట్ట సుఖంబు నీదెపట్టు 

గణిoచలేనిపట్టు గళంబు తెల్ప గుట్టు 

గణంబు లీదుచుట్టు గతంబు కాని మెట్టు 


మనంబు నీడ నిల్చు మనోమయంబు దాల్చు 

జనంబు నిన్ను దల్చు జపంబు తీరు దాల్చు 

మనంబుగాను గొల్చ మనోమయంబు దాల్చ

ననంత దీప్తి బంచు ననాది కల్ప దీప్తి 


గతంబునైన నాడు  గణాధి వైన మాయ 

ప్రతిక్షణంబు నేడు ప్రతిజ్ఞ పాలనాయె 

సతంబు నిన్నెవేడు సమంబు కోరు చుండు 

ప్రతిష్టు డీవె రేడు ప్రభావ నేస్త యీడు

చందస్సు..(జ ర ల.. జ ర ల )

******

 అవును !యాభై గొర్రెలను దానంగా ఇచ్చాడు.

......................................

ఒకటో వీరపాండ్యు ని కాలం నాటి కాట్టుకరుప్పన్‌పట్టి శాసనం  ఓ సమగ్ర విశ్లేషణ.

తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లా ఉసిలంపట్టి తాలూకాలోని ఆనైయూర్ గ్రామానికి చెందిన కాట్టుకరుప్పన్‌పట్టి అనే ప్రాంతంలో ఓ చారిత్రక శాసనం లభ్యమైంది. అక్కడి ఐరప్ప్రకతేశ్వర ఆలయం పక్కన ఉన్న ఒక శిలాపలకంపై దీనిని స్పష్టంగా చెక్కారు. ఇది ప్రాచీన తమిళ భాషలో నాటి కాలానికి చెందిన వట్టెలుత్తు లిపిలో వ్రాయబడింది.ఈ శాసనంలో ఉపయోగించిన అక్షరాల శైలిని బట్టి పరిశోధకులు దీనిని పాండ్యరాజైన మొదటి వీరపాండ్యుని 7వ పరిపాలనా కాలానికి అంటే ACE 954 సంవత్సరానికి చెందినదిగా గుర్తించారు.

ఈ శాసనంలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే ఇందులో  విశేషమైన దాన వృత్తాంతం కనిపిస్తుంది.దక్షిణ భాగమైన తెన్కళ్లకనాడు ప్రాంతానికి చెందిన తెన్నవన్ పల్లవరైయన్ అనే గ్రామప్రముఖుడు ఆనాటి గ్రామదేవుడైన చురట్టవర్ స్వామి ఆలయంలో నందాదీపం అనగా. అఖండదీపం వెలిగించడం కొరకు 50 గొర్రెలను దానంగా ఇచ్చాడు. ఆ దీపారాధనకు కావలసిన నెయ్యి లేదా నూనెఖర్చుల కోసం ఈ గొర్రెల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉపయోగించేవారు. నాటికాలంలో దేవాలయాలకు ఇలా జీవజాలాన్ని దానంచేయడం అత్యంత పవిత్రమైన ధార్మిక కార్యక్రమంగా భావించేవారు. ఒకేసారి 50 గొర్రెలను దానం చేశారంటే సమాజంలో ఆ దాతకున్న ఉన్నత ఆర్థికస్థితిని భక్తిని అర్థం చేసుకోవచ్చు.

ఈ శాసనం ద్వారా 10వ శతాబ్దపు పాండ్యుల కాల నాటి వ్రాత పద్ధతులు భాష ఇంకా ఆలయాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. చారిత్రకంగా చూస్తే మొదటి వీరపాండ్యుడు పాండ్య రాజవంశంలో అత్యంత పరాక్రమవంతుడైన రాజు. నాటి చోళ రాజైన మొదటి పరాంతకుడి చేతిలో పాండ్యులు ఓడిపోయినప్పటికీ వీరపాండ్యుడు తిరిగి తన సైన్యాన్ని సమీకరించి మదురైని స్వాధీనం చేసుకుని చోళాంతక అనే బిరుదు పొందాడు. అయితే ACE  959 లో జరిగిన తక్కోలం యుద్ధంలో చోళులతో పోరాడుతూ ఆయన వీరమరణం పొందాడని చరిత్ర చెబుతోంది.ఆలయాల రికార్డులను రాజుల విజయాలను దాతల వివరాలను భవిష్యత్తు తరాల కోసం శిలలపై చెక్కించే ఆనాటి సాంప్రదాయానికి ఈ కాట్టుకరుప్పన్‌పట్టి శాసనం ఒక అద్భుతమైన ఉదాహరణ. సంక్షిప్తంగా చెప్పాలంటే, ACE 954 నాటి ఈ శాసనం తెన్నవన్ పల్లవరైయన్ చేసిన 50 గొర్రెల దానాన్ని వివరిస్తూ నాటి సామాజిక ధార్మిక జీవన విధానాన్ని మన కళ్లముందు ఉంచుతుంది.

............

బలాత్కారానికి కడుపులో కొయ్యమేకును దింపడమే శిక్ష.

.........................................

విజయనగర సామ్రాజ్య కాలంలో దొంగతనాలు దోపిడీలు బందిపోటు దాడులు చాలా తక్కువగా ఉండేవని విదేశీ యాత్రికుల వర్ణనలు సమకాలీన గ్రంథాలు తెలియజేస్తాయి. దీనికి ప్రధాన కారణం కఠినమైన శిక్షాస్మృతి సమర్థంగా పనిచేసిన తలారి వ్యవస్థ అలాగే రాజ్య పాలనలో అమలైన కట్టుదిట్టమైన భద్రతా పద్ధతులే. రాజ్యమంతటా గ్రామాలు దుర్గాలు పట్టణాలు అన్నింటిలోను శాంతిభద్రతలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండేది.నేరం జరిగిన వెంటనే దాని విచారణ నేరస్థుల పట్టివేత విచారణ శిక్ష అమలు వేగంగా జరిగేవి.

చిన్నపాటి దొంగతనాలు చేసిన వారికైనా కఠిన శిక్షలు ఉండేవి. తలారులు నేరస్థులను పట్టుకొని న్యాయస్థానం ముందు హాజరు పరచేవారు. చేతులు నరికివేయడం కాళ్లు తొలగించడం వంటి అంగవిచ్ఛేద శిక్షలు అమలులో ఉండేవి. పెద్ద దోపిడీలు రాజమార్గాల్లో బందిపోటు దొంగతనాలు దాడులు చేసినవారికి మరింత ఘోరమైన శిక్షలు విధించేవారు. గొంతుకింద నుంచి ఇనుప శూలాన్ని దింపి దూలానికి వేలాడదీసే శిక్షను శూలారోహణ అని పిలిచేవారు. విదేశీ యాత్రికుడు అబ్దుర్ రజాక్ 1443 ప్రాంతంలో విజయనగరాన్ని సందర్శించినప్పుడు ఈ విధమైన శిక్షలను ప్రస్తావించాడు. అలాంటి శిక్ష పడినవాడు బ్రతకడం అసంభవమని అతడు పేర్కొన్నాడు.

స్త్రీలపై అత్యాచారం, కన్యలను చెరబట్టడం వివాహిత స్త్రీలపై బలవంతం వంటి నేరాలకు మరణశిక్ష విధించబడేది. మనుస్మృతి 8.364 ప్రకారం స్త్రీలపై దౌర్జన్యానికి వధశిక్ష ఉండాలని చెప్పబడగా విజయనగర పాలకులు దానిని కఠినంగా అమలు చేసినట్లు చరిత్రకారులు పేర్కొంటారు. ముఖ్యంగా రాజ్యంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే నేరాలు అంతఃపుర ద్రోహం రాజద్రోహం గూఢచర్యం వంటి నేరాలకు బహిరంగ శిరశ్ఛేదం సాధారణ శిక్షగా ఉండేది.

ఉన్నతాధికారులు లేదా ప్రభువుల వర్గానికి చెందినవారు తీవ్రమైన నేరాలకు పాల్పడితే “కంటకశూల” అనే శిక్ష విధించబడేది. పొడవైన కొసిగల శూలాన్ని కడుపులో దింపి మరణశిక్ష అమలు చేసేవారు. హత్య చేసినవారికి సాధారణంగా శిరశ్ఛేదమే శిక్ష. కొన్ని సందర్భాల్లో నేరస్థులను ఏనుగులతో తొక్కించి చంపడం, భారీ రాళ్లను తలపై పెట్టి ఎండలో నిలబెట్టడం వంటి శిక్షలు కూడా అమలులో ఉండేవి. అయితే ఇవి సాధారణ నేరాలకు కాకుండా భయంకరమైన నేరాలకు రాజ్యద్రోహానికి మాత్రమే వర్తించేవి.

పోర్చుగీసు యాత్రికుడు డొమింగో పేస్ 1520 ప్రాంతంలో విజయనగరంలో ప్రతిరోజూ ఉరితీయబడిన శవాలు కనిపించేవని రాశాడు. అయితే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వారిలో చాలామంది యుద్ధ ఖైదీలు గూఢచారులు తిరుగుబాటుదారులే. 

రాజ్యం అంతటా కఠిన చట్టవ్యవస్థ ఉన్నప్పటికీ నిర్దాక్షిణ్యంగా ప్రజలను హింసించేవారని చెప్పడానికి ఆధారాలు తక్కువగా ఉన్నాయి.

విజయనగర కాలంలో బ్రాహ్మణులను “భూసురులు”గా భావించేవారు. అనగా భూమిపై నడిచే దేవతలుగా గౌరవించేవారు. వారిలో నియోగులు, ప్రెగ్గడలు రాచగురువులు పురోహితులు జ్యోతిష్కులు వేదపండితులు కవులు ముఖ్య స్థానంలో ఉండేవారు. నియోగులంటే కరణాలు దుర్గాధ్యక్షులు మంత్రులు సామంతులు అమరనాయకులు మండలేశ్వరులు మొదలైన రాజసేవకులు. ప్రెగ్గడలు సాధారణంగా మంత్రివర్గానికి చెందినవారు. వీరు నేరాలకు పాల్పడినా సాధారణంగా మరణశిక్ష విధించబడేది కాదు. పదవీచ్యుతి, ఆస్తుల స్వాధీనం దేశ బహిష్కరణ వంటి శిక్షలు అమలులో ఉండేవి. అయితే అత్యంత తీవ్రమైన నేరాలకు అంగచ్ఛేదం వంటి శిక్షలు ఉండేవి. బ్రాహ్మణులలో రాజద్రోహం వంటి నేరప్రవృత్తులు చాలా అరుదుగా చాలా తక్కువ ఉండేవని శ్రీకృష్ణదేవరాయలు అముక్తమాల్యదలో పేర్కొన్నట్లు చరిత్ర పరిశోధకులు చెబుతారు.

విజయనగర పాలనా వ్యవస్థలో “తలారి వ్యవస్థ”కు అత్యంత ప్రాధాన్యం ఉండేది. కేంద్రస్థాయిలో మహాతలవరులు నగర భద్రతను పర్యవేక్షించేవారు. వారి కింద తలవరులు పనిచేసేవారు. దుర్గాలలో దుర్గాధ్యక్షులు శాంతిభద్రతలను నిర్వహించేవారు. ఎక్కడైనా దొంగతనం జరిగితే దాని బాధ్యత ఆ ప్రాంత తలారిదే. అతడు దొంగను పట్టుకొని న్యాయస్థానం ముందు హాజరు పరచలేకపోతే అతని ఆస్తులను రాజు స్వాధీనం చేసుకొని బాధితులకు పరిహారంగా ఇచ్చేవాడు. ఈ పద్ధతి చోళుల కాలం నుంచే ఉన్నప్పటికీ విజయనగరంలో మరింత కట్టుదిట్టంగా అమలైంది.

రాజుకు లేదా ఉన్నతాధికారులకు తమ గోడును చెప్పదలచినవారు వారి సమక్షంలో సాష్టాంగ నమస్కారం చేసి నిలబడకుండా ఉండేవారు. “నీకు జరిగిన అన్యాయం ఏమిటి ?” అని వారు అడిగిన తరువాతే లేచి తమ విన్నపాన్ని వినయంగా వినిపించేవారు. రాజు లేదా మంత్రి విషయాన్ని పూర్తిగా విని వెంటనే తీర్పు చెప్పేవారు. సమస్య దూరప్రాంతానికి సంబంధించినదైతే ఆజ్ఞను వెంటనే చారుల ద్వారా అక్కడికి పంపించి అమలు చేయించేవారు. ఈ వేగవంతమైన వ్యవస్థ వల్ల న్యాయం ఆలస్యం కాకుండా ఉండేది.

ఆ కాలంలో ద్వంద్వ యుద్ధాలు కూడా సహజమైన అంశమే. మల్లయోధుల మధ్య జరిగే పోరాటాలను “ముష్టి యుద్ధం” లేదా “భుజబలం” అని పిలిచేవారు. పోరాటంలో ప్రత్యర్థికి తీవ్రమైన గాయాలు జరిగినా, మరణించినా విజేతకు శిక్ష ఉండేది కాదు. అయితే ఇలాంటి యుద్ధాలకు మంత్రి అనుమతి తప్పనిసరిగా ఉండేది. విదేశీ యాత్రికుడు ఫెర్నావ్ నునిజ్ విజయనగర మల్లయుద్ధాల గురించి విశదంగా రాశాడు.

హంపి వంటి మహానగరాల్లో రాత్రి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ ఉండేది. సాయంత్రం దీపాలు వెలిగించిన తరువాత కోట తలుపులు మూసివేసేవారు. తలారులు నగరంలోని పాడుబడిన దేవాలయాలు, సత్రాలు పూటకూళ్ల ఇళ్లు వసతిగృహాలు బజార్లు అన్నింటిని తనిఖీ చేసేవారు. కొత్తవారిని ప్రశ్నించి వారి వివరాలు నమోదు చేసేవారు. అనుమానాస్పద వ్యక్తులను రాత్రంతా నిర్బంధించి ఉదయం విచారించేవారు. ఈ కట్టుదిట్టమైన పర్యవేక్షణ కారణంగానే విదేశీ యాత్రికులు “రాత్రిపూట బంగారం రోడ్డుపై పడేసినా ఎవరూ ముట్టుకోరు” అని ఆశ్చర్యపడి రాశారు.

మొత్తానికి విజయనగర సామ్రాజ్యంలో ప్రజలు భద్రతతో, నిర్భయంగా జీవించగలిగారని సమకాలీన గ్రంథాలు, యాత్రికుల వర్ణనలు తెలియజేస్తున్నాయి. శిక్షలు కఠినంగా ఉన్నప్పటికీ అవి ప్రధానంగా తీవ్రమైన నేరాలకు మాత్రమే అమలయ్యేవి. “అముక్తమాల్యద”, “మధుర విజయం”, “రాయవాచకం” వంటి గ్రంథాలు విజయనగర న్యాయవ్యవస్థను ప్రశంసించాయి. శ్రీకృష్ణదేవరాయల శాసనాలు కూడా నేరస్తులకు శిక్ష విధించేటప్పుడు కులమత భేదాలు చూడకుండా న్యాయం చేయాలని రాజధర్మాన్ని ప్రతిపాదించాయి.

//సేకరణ//

------- జి.బి. విశ్వనాథ, 9441245857 అనంతపురం.

******

[ మనసా సతతం స్మరణీయం సుఖదుఃఖాలయం ।

వచసా సతతం వదనీయం వరవిద్యాలయం ॥

లోకహితం మమ కరణీయం పూజ్యతావలయం ।

కాలవైపరీత్యజీవనం కర్మకామ్యార్థవిశ్వాసమ్ ॥


సరళ భావం:

మనసులో ఎల్లప్పుడూ ఈ జీవితం సుఖదుఃఖాల సమాహారమని గుర్తుంచుకోవాలి.

మన మాటల్లో ఎప్పుడూ శ్రేష్ఠమైన విద్య, సద్బోధ, మంచితనం ప్రతిధ్వనించాలి.

లోకహితం చేయడం మన కర్తవ్యంగా భావించి, పూజ్యమైన జీవనవలయాన్ని నిర్మించాలి.

కాలవైపరీత్యాలతో నిండిన ఈ జీవితం, మన కర్మలపై మరియు లక్ష్యసాధనపై విశ్వాసంతో ముందుకు సాగాలి.

*****

[17/05, 10:30] Mallapragada Ramakrishna: संभोगभवने रमणीयं संसारकर्तव्यम् ।

न च सुखशयनीयं दाम्पत्यसंयोगमयम् ॥

अहर्निशं जागरणीयं देशरक्षाविद्यादामम् ।

कालवैपरीत्यजीवनं कर्मकाम्यार्थविश्वासम् ॥


తెలుగు లిపిలో:


సంభోగభవనే రమణీయం సంసారకర్తవ్యం ।

నచసుఖశయనీయం దాంపత్య సంయోగమయం ॥

అహర్నిశం జాగరణీయం దేశరక్షావిద్యాదామమ్ ।

కాలవైపరీత్య జీవనం కర్మకామ్యార్థ విశ్వాసమ్ ॥


సరళ భావం:


దాంపత్య జీవితం కేవలం సుఖభోగాలకు మాత్రమే కాదు; అది సంసార బాధ్యతలతో కూడిన పవిత్ర బంధం.

కేవలం సుఖశయనమే జీవితలక్ష్యం కాదు; పరస్పర అనుబంధం, కర్తవ్యమే ముఖ్యమైనవి.

దేశరక్షణ, విద్య, జాగరూకత — ఇవి రాత్రింబవళ్లు కాపాడవలసిన విలువలు.

కాలమార్పులతో కూడిన జీవితం, కర్మపట్ల విశ్వాసంతోనే సార్థకమవుతుంది.

[17/05, 10:43] Mallapragada Ramakrishna: न जातु दुःखं गणनीयं नान्यता गुणमयम् ।

न च निजसौख्यं मननीयम् ममतानुरागम् ॥

कार्यक्षेत्रे त्वरणीयं कान्ताकाञ्चनसंभ्रमः ।

कालवैपरीतजीवनं कर्मकाम्यार्थविश्वासम् ॥

తెలుగు లిపిలో:

న జాతు దుఃఖం గణనీయం నాన్యతా గుణమయమ్ ।

న చ నిజసౌఖ్యం మననీయం మమతానురాగమ్ ॥

కార్యక్షేత్రే త్వరణీయం కాంతాకాంచనసంభ్రమః ।

కాలవైపరీతజీవనం కర్మకామ్యార్థవిశ్వాసమ్ ॥

సరళ భావం:

జీవితంలో వచ్చిన దుఃఖాలను ఎప్పుడూ ఎక్కువగా లెక్కపెట్టకూడదు; ఇతరులలోని మంచి గుణాలను గుర్తించాలి.

తన స్వంత సుఖానికే పరిమితమవకుండా, మమతా అనురాగాలను సమతతో చూడాలి.

కార్యక్షేత్రంలో చురుకుదనం అవసరం; కాంతా–కాంచనాల (మోహాల) పట్ల అతిసంభ్రమం మంచిది కాదు.

కాలవైపరీత్యాలతో నిండిన ఈ జీవితం, కర్మపై విశ్వాసంతోనే సార్థకమవుతుంది.

[17/05, 11:21] Mallapragada Ramakrishna: దుఃఖసాగరే తరణీయం తన్మాయార్థవిస్మయం ।

కష్టపర్వతే చరణీయం కాలనిర్ణయవైభవమ్ ॥

విపత్తివిపినే భ్రమణీయం సర్వనిగ్రహవరమ్ ।

కాలవైపరీత్యజీవనం కర్మకామ్యార్థవిశ్వాసమ్ ॥

సరళ భావం:

దుఃఖసముద్రాన్ని దాటాల్సిందే; జీవితం మాయామయమైన ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది.

కష్టాల పర్వతాన్ని అధిరోహించాల్సిందే; కాలమే దానికి తగిన నిర్ణయాన్ని ఇస్తుంది.

విపత్తుల అడవిలో కూడా మనిషి ప్రయాణించాల్సి వస్తుంది; అక్కడ ఆత్మనిగ్రహమే గొప్ప వరం.

కాలవైపరీత్యాలతో నిండిన జీవితం, కర్మపట్ల విశ్వాసంతోనే ముందుకు సాగుతుంది.

[17/05, 11:25] Mallapragada Ramakrishna: తెలుగు లిపిలో:

గహనారణ్యే ఘనాంధకారే లోకరక్షాజీవనమ్ ।

బంధుజనానాం స్థితిగహ్వరే సర్వశ్రేయస్కరమ్ ॥

తత్ర మయా సంచరణీయం తంత్రమంత్రసూత్రార్థమ్ ।

కాలవైపరీత్యజీవనం కర్మకామ్యార్థవిశ్వాసమ్ ॥

సరళ భావం:

గాఢాంధకారంతో నిండిన గహన అరణ్యంలాంటి ఈ ప్రపంచంలో, లోకరక్షణే నిజమైన జీవన ధర్మం.

బంధుజనుల స్థితి, సమాజ సంక్షేమం — ఇవన్నీ శ్రేయస్సుకు దారితీసేవి.

అందుకోసం తంత్ర, మంత్ర, సూత్రాల అసలు అర్థాన్ని గ్రహిస్తూ నేను జీవన మార్గంలో సంచరించాలి.

కాలవైపరీత్యాలతో కూడిన ఈ జీవితం, కర్మపట్ల మరియు లక్ష్యసాధనపట్ల విశ్వాసంతో ముందుకు సాగుతుంది.

భోజనే తత్ర వార్తా కా, వార్తకా స్తత్ర భోజనే ।
న సంతి యది వార్తకా, వార్తా కా తత్ర భోజనే ॥
భోజనే పంచభక్ష పదార్థంబు సంతృప్తి స్థితః ।
భోజనే హవా జల లవణాంభసి ప్రదర్శితః ॥
సమగ్ర భావం:
భోజన సమయములో మాటలు, నవ్వులు, ఆప్యాయత ఉంటేనే భోజనం ఆనందమవుతుంది.
అలాగే వంకాయ కూర వంటి సాధారణ పదార్థమూ భోజనానికి ప్రత్యేక రుచిని ఇస్తుంది.
పంచభక్ష పరమాన్నాలు ఉన్నా,
గాలి, నీరు, ఉప్పు వంటి మౌలిక పదార్థాలు లేకపోతే భోజనం సంపూర్ణం కాదు.
అంటే —
జీవనంలో ఆర్భాటం కన్నా సహజత్వమే ముఖ్యం.
భోజనంలో వంటకాల కన్నా సఖ్యత మిన్న.
సాధారణంగా కనిపించే వాటికే అసలు విలువ ఎక్కువ.

ఇందులో “వార్తా” (మాటలు) మరియు “వార్తకా” (వంకాయ) అనే శ్లేషం ద్వారా మీరు చక్కని చమత్కారాన్ని నిర్మించారు.
దీనిని తెలుగు పద్యభావo
ఆ. వె.
మాటలున్న తిండి మాధుర్యమవదులే
వంకయైన రుచుల వెలుగు తీరు
మౌలికపు పదార్థ మర్మమెల్ల నిలుపు
సఖ్యత జలము గాలి సౌఖ్యమగును ॥
భావం:
ఆప్యాయమైన మాటలతో కూడిన భోజనం నిజమైన మాధుర్యాన్ని ఇస్తుంది.
సాధారణమైన వంకాయ కూర కూడా రుచిలో ప్రత్యేకతను కలిగిస్తుంది.
అలాగే భోజనంలో నీరు, గాలి, ఉప్పు వంటి మౌలిక పదార్థాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో,
జీవితంలో సఖ్యత, ప్రేమ, పరస్పర అనురాగాలకు అంతకంటే ఎక్కువ విలువ ఉంటుంది.
****
చెం. శివ శివాయణా మనసు జీర్ణ సుమంత్ర ప్రభంధమేయగున్
శివమె భవా యుగాలమది ఛిద్రి సుమాయ మహత్యమేయగున్
శివ శివా సనాతనము చీకటితర్మి సుదీప్తి దివ్యమున్
శివ హరా మనస్సగుట చిత్ర విచిత్ర సకాల జీవనమ్
భావం
“శివుని స్మరణ మనసుకు పవిత్రమైన మంత్ర స్వరూపంగా నిలుస్తుంది. యుగ యుగాలుగా కొనసాగుతున్న సంసారమనే మాయాబంధాన్ని తొలగించే శక్తి శివతత్త్వానిదే. అజ్ఞాన చీకట్లను తొలగించి దివ్యజ్ఞాన వెలుగును ప్రసరింపజేసేది శివస్వరూపం. మనసు శివభావంతో నిండినప్పుడు జీవితం అనేక అనుభవాలతో కూడిన పరమార్థయాత్రగా మారుతుంది.”
*****
చెo. సకల విధానవిద్యల సుసన్నుతి హృద్యత సంభవంబుగా
నికదయచేయుమార్గమగు నీడలతత్త్వపుతీరు గాయగన్
వికసిత భావమేపలుకు విస్మయలక్ష్య సమర్ధతే యగున్
చకలితమానవైనమగుసాధ్య సుసాధ్య శుభంబు సక్యమున్
విద్యకు దయ, హృద్యత, వికసిత భావం, సఖ్యత కలిసినప్పుడు మాత్రమే మానవ సమాజం శ్రేయోమార్గంలో నడుస్తుంది. అసాధ్యాలనూ సాధ్యాలుగా మార్చే శక్తి మానవ ఐక్యతలోనే ఉందని పద్యం
*****
మకో. వమ్ము సేయకు నమ్మకంబుయు వాంఛ తీరున మాయమున్
సొమ్ములన్నియు కాలతీరు సు శోధ్యమైనను కానకన్
ముమ్మరంభగు బుద్ధి తత్త్వము ముఖ్యమేయగు వైనమున్
యమ్మ తీయుట తప్ప గుండగ యాసవైనము జీవనమ్ ॥
సరళ భావం:
మోసం చేయకూడదు; ఎందుకంటే కోరికలు తీరే విధానం చాలాసార్లు మాయలాంటిది.
ధనం అన్నీ అనిపించినా, కాలగమనంలో అది శాశ్వతం కాదని తెలుస్తుంది.
జీవితంలో నిజంగా ముఖ్యమైనది బుద్ధి, వివేకం, తత్త్వజ్ఞానం.
ఆశలను పూర్తిగా వదలలేకపోవడమే మానవ జీవన స్వభావం.
***
చెం. అలసటన్నది లేని జీవన యానమేయగు యెక్కడున్
పలుకులర్ధము తారు మారగు పాన తీరగు యేలనున్
మొలక లెత్తిన గుర్తు లేకయు మోప బుద్ధియు నేరుగాన్
విలువలన్నియు చెప్పలేనివి విద్యలన్నియు బోధగన్ ॥
సరళ భావం:
జీవిత ప్రయాణంలో అలసట లేని మనిషి ఎక్కడా ఉండడు.
మాటల అర్థాలు కూడా కాలానుగుణంగా మారిపోతుంటాయి; మనసు తీరులు సులభంగా అర్థం కావు.
మొలక వచ్చినప్పుడు విత్తనం గుర్తుకురానట్లే, ఎదిగిన తర్వాత మూలాలను చాలామంది మరిచిపోతారు.
అలాగే జీవితంలోని అన్ని విలువలను పూర్తిగా చెప్పడం కష్టం; విద్య కూడా వాటిని కేవలం బోధించగలదు గానీ సంపూర్ణంగా కొలవలేడు.
*****
సంస్కృత రూపం (తెలుగు లిపి):
పద్మనాభ విశ్వనాథ దౌహిత్రసఖ్యార్థభావః ।
విశ్వంభర విజ్ఞానవిజ్ఞతా విశ్వాసరాహిత్యః ॥
నిత్యనిర్వాహ సమ్మోహనం భూశక్తి నేస్తభూతమ్ ।
ప్రోత్సాహ ప్రావీణ్య నిర్మాణ సంసారప్రేమభూతమ్ ॥
భావము :
పద్మనాభుడు, విశ్వనాథుడు వంటి దైవస్వరూపాలతో బంధుత్వ–సఖ్యత భావం కలిగిన ఆధ్యాత్మిక చైతన్యం ఇది.
ప్రపంచాన్ని పోషించే విజ్ఞానవైభవం ఉన్నప్పటికీ, విశ్వాసరాహిత్యం మానవునిలో కల్లోలం సృష్టిస్తుంది.
భూశక్తి నిత్యజీవన నిర్వహణలో మోహకశక్తిగా, స్నేహస్వరూపంగా నిలుస్తుంది.
ప్రోత్సాహం, ప్రావీణ్యం, నిర్మాణశక్తి, సంసారప్రేమ — ఇవన్నీ జీవన స్థిరత్వానికి ఆధారాలు.
*****
పలుకు తీరు కుటుంబము పాఠ్యమవగ
ద్మమతి నిత్య సత్య భవము మార్గదీక్ష
నాయనేదిలేదగు శ్రీనివాస మాయ
భక్త సులభుడు వేడగా బంధు వగును

భావము :
మనిషి పలుకుబడి, ప్రవర్తన కుటుంబానికే పాఠ్యంగా మారుతుంది.
పద్మమతి వంటి నిర్మలబుద్ధి నిత్యసత్యమైన జీవన మార్గానికి దీక్షనిస్తుంది.
“నాది–నీది” అనే భేదమే లేని శ్రీనివాసుని మాయ అద్భుతమైనది.
భక్తితో వేడుకుంటే ఆయన సులభంగా చేరువై బంధువులా కాపాడుతాడు.
*****
సంస్కృత రూపం
ప్రీణాతి పితరం కుటుంబసంపదా ।
ప్రీణాతి మాతరం పుత్రపుత్రసేవయా ।
ప్రీణాత్యుపాధ్యాయం విద్యాభివృద్ధితః ।
ప్రీణాతి బ్రహ్మ పూజ్యః సర్వార్థసిద్ధిదః ॥
భావము :
కుటుంబ సంపద తండ్రిని సంతోషపరుస్తుంది.
పుత్రుల సేవ తల్లిని ఆనందింపజేస్తుంది.
విద్యాభివృద్ధి గురువును సంతోషపరుస్తుంది.
బ్రహ్మస్వరూపుడైన పూజ్యుడు సర్వార్థసిద్ధిని ప్రసాదిస్తాడు.
*****
ఉ. అంధుని యర్థరాత్రియణ ఆపగలేలత యేల జీవనమ్
బంధుని గాను నిత్యమగు భారము లేకయు నుండటే లనున్
సంధుని నమ్మకంబుగతి సమ్మతి యాదయు తప్ప గుండగన్
గంధము తీరు నుండగల కాలము గమ్యము తెల్వ లేకయున్ ॥
సరళ భావం:
అంధుడికి అర్థరాత్రి ఎలా అనుభూతి అవుతుందో, అలాగే జీవితంలో కొన్ని పరిస్థితులు స్పష్టంగా అర్థం కావు.
బంధువులున్నా, మనసుకు నిజమైన ఆధారం లేకపోతే ఒంటరితనం తొలగదు.
ఒప్పందాలు, నమ్మకాలు, అనుమతులు అన్నీ మారిపోతూ ఉండే లోకంలో స్థిరత్వం కష్టమే.
సువాసన ఎంతకాలం నిలుస్తుందో తెలియనట్లే, కాలగమన గమ్యం కూడా మనిషికి పూర్తిగా తెలియదు.
*****
గీ. నేల పడ్డ వానల తీరు నింగి చూపు
పలకరింపు మొగ్గయు పువ్వు పాశ మవ్వ
గ్రుడ్డు నుండు పక్షులు వచ్చి గుర్తు చేయు
కలము నుండి కవిత్వము కాల మనసు ॥
సరళ భావం:
భూమిపై పడే వాన చినుకులు ఆకాశ మహిమను తెలియజేస్తాయి.
మొగ్గ పలకరింపుతో పువ్వుగా వికసించి ప్రేమ బంధాన్ని కలిగిస్తుంది.
గూళ్లలో ఉన్న పక్షులు వచ్చి ప్రకృతి సౌందర్యాన్ని గుర్తు చేస్తాయి.
అలాగే కలం నుండి పుట్టే కవిత్వం కాలానుగుణమైన మనసు భావాలను వ్యక్తపరుస్తుంది.
***+:
ఉ. ఈ యతి భావ తత్త్వములు యిచ్ఛల నెన్నియు తెల్ప నెంచియున్
ధ్యేయము నిర్విరామమగు దీక్షల తన్మయ మేను పద్యమున్
శ్రేయము యేదియన్నది యణ శీఘ్రము తెల్పగ లేను నేనుగాన్
వేయి యుగంబు లైన ప్రభవింతును తెల్గు మనో సరస్వతీ ॥
సరళ భావం:
ఈ యతి, భావ, తత్త్వాలతో కూడిన పద్యాల ద్వారా అనేక ఆశయాలను తెలియజేయాలని నేను ప్రయత్నిస్తున్నాను.
నిరంతరమైన దీక్షతో, ధ్యేయభావంతో ఈ పద్యరచనలో తలమునకలై ఉన్నాను.
ఏది నిజమైన శ్రేయస్సో వెంటనే చెప్పగల శక్తి నాకులేదు.
అయితే తెలుగు సరస్వతి కృపతో ఈ సాహిత్య ప్రవాహం వేల యుగాల పాటు వెలుగొందాలని కోరుకుంటున్నాను.
*****
ఆనతి తీరు పద్యములు ఆశయ సాధన తెల్గు కాంతిగాన్
న్మానము కష్ట పెట్ట బహుమానము కోరిక లేక సాగగన్
వేనిని కొరకుండగను విద్య శుభంబగు తల్లి తండ్రిగన్
జ్ఞానమనేమదీభవము నాస్థితి నీవలనే సరస్వతీ ॥
సరళ భావం:
వినయభావంతో రాసిన పద్యాలు ఆశయసాధనకు తెలుగు వెలుగులా నిలుస్తాయి.
గౌరవం కోసం కష్టపడినా, ప్రతిఫలం లేదా బహుమానం ఆశించకుండా ముందుకు సాగాలి.
ఎవరినీ నొప్పించకుండా విద్యను తల్లిదండ్రుల ఆశీర్వాదంలా పవిత్రంగా భావించాలి.
ఈ జ్ఞానం, ఈ భావప్రపంచం అన్నీ నీ కృపవల్లే కలిగాయని సరస్వతీ దేవిని కవి స్మరిస్తున్నారు.
******
దాగుణితం ఆటవెలది

దరువు తప్పదౌను దమన నీతి గమన
దారి వేరుగాను దాపరికము
దినము తీరు మార్పు దీక్ష తత్త్వముగాను
దీప కాంతులన్ని దివ్య వెలుగు

దురిత బుద్ధి గాను దూర మొన కథలు
దూర్త లక్ష్య మయిన దూర ముండు
దృష్టి సామ దాన దృత్వ ధర్మ మయము
దెవల మలుపు లన్ని దేవతగను

దేని నన్న మనసు దివ్య మాయలగను
దైవ బంధ మున్న ధర్మ బుద్ధి
దొడ్డ తనము యన్న దోహద మేయగు
దోచుకొనిన వేళ దొర కళలగు

దౌష్ట్య విలువలన్ని దారి మార్చగలుగు
దండ్రి మాటలన్ని ధరణి తీరు
దః గురువు శుభమగు దగ్ధ విద్యలుగను
మనసు దగుణితముయె మాటలన్ని
భావము :
దమననీతి, జీవనగమనం తప్పనిసరిగా మనిషిని అనుభవాల దారిలో నడిపిస్తాయి.
కాలానుగుణంగా దారులు మారినా, దీక్షతో నడిచే జీవితం దివ్యజ్యోతి వలె వెలుగుతుంది.

దుర్బుద్ధి, దురాశ, దుర్మార్గ లక్ష్యాలు మనిషిని దూరం తీసుకెళ్తాయి.
అయితే సామ, దాన, ధర్మ దృష్టితో చూసినప్పుడు జీవితం దేవత్వమై మారుతుంది.

మనసు అనేక దివ్యమాయలతో నిండివుంటుంది; దైవబంధం కలిగిన ధర్మబుద్ధి దానికి దిశానిర్దేశం చేస్తుంది.
గొప్పతనం అనేది సహకారంలోనే ఉంది; దోచుకున్న సంపద తాత్కాలిక అధికారమే ఇస్తుంది.

దౌష్ట్య విలువలు మార్గభ్రష్టతకు దారి తీస్తాయి.
తండ్రి మాటలు భూమిలాంటి స్థిరమైన జీవనసత్యాలను నేర్పుతాయి.
గురువు శుభబోధ, తపస్సుతో దహించబడిన విద్య, చివరకు మనసును “దాగుణితం” చేసిన జ్ఞానరూపంగా మలుస్తాయి.
****
మనభాష మానవత్వ మెరుపు మలుపు
మన లక్ష్య మంగళకరముగా మలుపు
మన తల్లి దీవెనల కళలు మలుపు
మన తండ్రి గురు ఆశీర్వాదము మలుపు ॥
సరళ భావం:
మన మాతృభాష మానవత్వానికి వెలుగును చూపించే మార్గమలాంటిది.
మన లక్ష్యం శుభకరమైన దారిలో నడవాలని సూచిస్తుంది.
తల్లి దీవెనలు జీవితానికి అందాన్ని, సౌమ్యతను ఇస్తాయి.
తండ్రి మరియు గురువుల ఆశీర్వాదం మన జీవనయాత్రకు సరైన మలుపును ఇస్తుంది.
***
ప్రతిరోజు
మాతృభాష, మాతృభూమి, మాతృశ్రీ మరువద్దు

🌹🌹🌹🌹🌹🌹తెలుగుపై ఆసక్తి యున్న ప్రతి ఒక్కరూ వ్రాయగలరని కోరు చున్నాను.
*మాతృశ్రీ *..ఇచ్ఛా.. చందస్సు, లో పద్యం,
16/05

వరుస * సరళ * లలన *నటన *
🙏🙏🙏🙏🙏🙏🙏
వరుస లెన్ని యున్న వాక్కు తీరుగ మారు
సరళ సత్యమేను సమయ సాగు
లలన జాలి జూపు లాలిత్వము కొరకు
నటన సంగమ కళ నాట్య భావము ॥
సరళ భావం:
మనుషుల వరుసలు, స్థాయులు ఎన్నున్నా మాట తీరు కాలానుగుణంగా మారుతూ ఉంటుంది.
కానీ సరళమైన సత్యమే జీవిత ప్రయాణానికి నిజమైన దారి.
లాలిత్యం, మృదుత్వం కోసం జాలి మరియు మమత అవసరం.
ఈ ప్రపంచ జీవితం అంతా ఒక నాట్యరూప సంగమంలా నానా భావాలతో నడుస్తుంది.
“నటన సంగమ కళ నాట్య భావము” అనే చివరి పాదం లోకజీవనాన్ని రంగస్థలంతో పోల్చిన అందమైన భావాన్ని ఇస్తోంది.
****
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీ గురుభ్యోనమః 🙏తెలుగుపై ఆసక్తి యున్న ప్రతి ఒక్కరూ వ్రాయగలరని కోరు చున్నాను.
*ప్రాంజలి ప్రభ*..ఇచ్ఛా.. చందస్సు
- 16/05
పాదాది.. న్యస్తాక్షరి.....మ,నో, ర, ధం
🙏🙏🙏🙏🙏🙏🙏

> మమత మనసు చుట్ట కదల మగువ మాయ

నోరు మంచిదైన పలుకు నొచ్చు కొనుట
రంగు లెన్నియున్న మగువ రంగు వేరు
ధం మ్ము చూపిన ఫలముయే ధరణి కళలు ॥

సరళ భావం:

మమతతో మనసును ఆకర్షించడం స్త్రీ స్వభావంలోని ఒక మాయలాంటిది.
మంచి మాటలు మాట్లాడినా, కొందరు వాటినీ తప్పుగా అర్థం చేసుకుంటారు.

లోకంలో ఎన్నో రంగులు ఉన్నా, ప్రతి వ్యక్తి స్వభావం ప్రత్యేకమైనది.
ధర్మం చూపిన మార్గంలోనే ఈ భూమి అందాలు, జీవన ఫలితాలు నిలుస్తాయి.
****
శోముని కళలివియె శ్రోత బుద్ధిగనుట
ఏమని యణ విధియు యేల చెప్ప
హృదయ వాంఛ తీర్చ హాయిగాను మనోభి
రాముని వలచె నట రంభ బళిర ॥
సరళ భావం:
చంద్రుని వంటి శాంతమయమైన కళలు, వినేవారి మనసుకు ఆనందం మరియు ప్రశాంతమైన బుద్ధిని ఇస్తాయి.
ఆ అందాన్ని, ఆ మాధుర్యాన్ని ఎలా వర్ణించాలో బ్రహ్మకే తెలియదు.
మనసులోని కోరికలను తీరుస్తూ, హృదయానికి హాయిని ఇచ్చే ఆ మనోహర స్వరూపాన్ని చూసి రంభ వంటి సుందరులు కూడా ఆకర్షితులయ్యారు.
****

తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది...

................................................. 


జీవంలేని మానవశరీరం భూమిలోపల ఎలా కృంగి  కృశించి నశించి మట్టిలో కలిసిపోతుందో తెలుసుకొందాం !


మనిషి మరణించిన తర్వాత శరీరం క్రమంగా విచ్ఛిన్నమై ప్రకృతిలో కలిసిపోతుంది. ఈ సహజప్రక్రియను శవవిచ్ఛేదనం లేదా కుళ్ళిపోవడం అంటారు. ఇందులో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, క్రిమికీటకాలు, తేమ, ఉష్ణోగ్రత, వాయువులు మరియు మట్టి స్వభావం మొ॥ ముఖ్యపాత్ర వహిస్తాయి. ఈ ప్రక్రియ ద్వారా శరీరంలోని వివిధ అంశాలు తిరిగి భూమికి చేరి జీవచక్రాన్ని కొనసాగిస్తాయి.


మరణించిన 3 రోజుల తరువాత శరీరంలోని జీవక్రియలు ఆగిపోతాయి. కణాలు స్వయంగా విచ్ఛిన్నమవడం ప్రారంభమైతాయి. దీనిని ఆటోలిసిస్ అంటారు. బయటకు చూస్తే శరీరం సహజంగానే కనిపించినా, లోపల కుళ్ళిపోవడం మొదలై ఉంటుంది. చర్మం తెల్లబడటం, శరీరం గట్టిపడటం వంటి మార్పులు కనిపిస్తాయి.

7 రోజులు

ఈ దశలో శరీరంలో బ్యాక్టీరియా వేగంగా పెరిగి మృదు కణజాలాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. మిథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులు ఏర్పడి శరీరం ఉబ్బుతుంది. చర్మం ఆకుపచ్చ లేదా నల్లటి రంగులోకి మారుతుంది. శవం నుండి వచ్చే తీవ్రమైన వాసనకు ఈ వాయువులే కారణం.


30 రోజులకు

దాదాపు అన్ని మృదు కణజాలాలు క్షీణించి అస్థిపంజరం స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. వానపాములు, శిలీంధ్రాలు మరియు కీటకాల లార్వాలు మిగిలిన పదార్థాన్ని మట్టిలో కలిపేస్తాయి. శరీరం నుండి విడుదలయ్యే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు భూమిని సారవంతం చేస్తాయి.


90 రోజులకు అంటే

ఈ దశలో అస్థిపంజరం పూర్తిగా బయటపడినా ఎముకలు ఇంకా తమ స్థానాల్లోనే ఉంటాయి. అయితే ఎముకలను కలిపే స్నాయువులు, తంతువులు క్రమంగా కుళ్ళిపోవడం వల్ల అవి విడిపోవడం ప్రారంభమవుతుంది.


ఒక సంవత్సరానికి

కాలక్రమేణా మట్టి కదలిక, నీటి ప్రవాహం, చిన్న జంతువుల కదలికల వల్ల ఎముకలు చెల్లాచెదరవుతాయి. అయినప్పటికీ అవి ఇంకా గట్టిగానే ఉంటాయి. మట్టి యొక్క PH స్థాయి,

తేమ మరియు వాతావరణ పరిస్థితులు ఈ ప్రక్రియ వేగాన్ని ప్రభావితం చేస్తాయి.


(PH అంటే Potential of Hydrogen) ఇది నేల ఎంత ఆమ్ల గుణాన్ని (Acidity) లేదా క్షారగుణాన్ని (Alkalinity) కలిగి ఉందో సూచించే ఒక కొలమానం.)


3 సంవత్సరాలకు

చిన్నఎముకలు పూర్తిగా క్షీణించిపోతాయి. తొడఎముక, పుర్రె వంటి పెద్ద ఎముకలు మాత్రమే మిగులుతాయి. అవి కూడా పగుళ్లు పడి ముక్కలవుతాయి. భూమిలోని ఆమ్లాలు ఎముకలలోని కాల్షియం ఫాస్ఫేట్‌ను క్రమంగా కరిగిస్తాయి.


7 సంవత్సరాలకు లేదా అంతకంటే ఎక్కువ

చివరి దశలో చిన్న ఎముక ముక్కలు మాత్రమే మిగులుతాయి. అవి కూడా మెల్లగా మినరలైజేషన్ ద్వారా మట్టిలో భాగమైపోతాయి. చివరికి శరీరం పూర్తిగా ప్రకృతిలో కలిసిపోయి జీవచక్రాన్ని పూర్తి చేస్తుంది.


ఈ మొత్తం ప్రక్రియ ప్రతి ప్రాంతంలో ఒకేలా ఉండదు. ఉష్ణోగ్రత, తేమ, మట్టి రకం, దఫన్ లోతు, ఆక్సిజన్ లభ్యత వంటి అంశాల ఆధారంగా ఇది వేగంగా లేదా నెమ్మదిగా జరుగుతుంది. ఇలాంటి విషయాల అధ్యయనం వైద్య న్యాయశాస్త్రం, పురావస్తు శాస్త్రం మరియు పర్యావరణ శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది.


ఇప్పుడో తత్వగీతం.


"తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సుమనుట ఖాయం

ఓ జీవా తెలుసుకో అపాయం తోలు 

ఉబ్బుతబ్బులై ఉరుకులుతీయకు గబ్బు మేను జీవా

ఔను గబ్బిలాయి జీవా

ఎంత పెట్టినా ఏమి కట్టినా కట్టెలపాలౌ పాడు కట్టెరా తోలు 

అత్తరు పన్నీరు అలదినగానీ మురికి వాసనరా జీవా ''


చిత్రం - పాండురంగ మహాత్మ్యం (1957)

గాయకులు -పిఠాపురం & మాదవపెద్ది.

సంగీతం - TV రాజు.

తత్వగీత రచయిత - సముద్రాల రాఘవాచార్య.


॥సేకరణ॥

................... జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ

05-02-2026