శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
*3) శబ్దస్పర్శాదయో వేద్యా వైచిత్ర్యాత్ జాగరే పృథక్!* *తతోవిభక్తా తత్సంవిదైకరూప్యాన్న భిద్యతే!!* శబ్దస్పర్శాదులైన ఇంద్రియ విషయాలు జాగ్రదవస్థలో వేరు వేరుగా తెలియబడుతున్నాయి. వాటికి ఆయా ప్రత్యేకతల వల్లభేదం వుంది.కానీ వీటిని గూర్చిన జ్ఞానములన్ని జ్ఞానమే అవడం చేత జ్ఞానంలో భేదం లేదు.కాబట్టి జ్ఞానం ఏకరూపమే. 4) తథా స్వప్నేత్ర వేద్యం తు న స్థిరమ్ జాగరే స్థిరమ్! *తద్భేదో తస్తయోః సంవిదేకరూపా న భిద్యతే!!4!! స్వప్నావస్థలో కూడా అట్లే.స్వప్న విషయాలు అస్థిరమైనవి. జాగ్రత్ విషయాలు స్థిరమైనవి. జాగ్రత్ స్వప్నాలకు భేదం ఇంత మాత్రమే. జాగ్రత్ జ్ఞానం,స్వప్నజ్ఞానం రెండింటిలో జ్ఞానం ఏకస్వరూపమే. దానిలో భేదం లేదు. *5) సుప్తోత్థితస్య సౌషుప్తతమోబోధో భవేత్ స్మృతిః!* సాచావబుద్ధ విషయా వబుద్ధం తత్తదా తమః!! సుషుప్తి నుండి మేల్కొన్న వ్యక్తి తానేమీ గ్రహించలేదని ,తనకేమీ తెలియలేదని జ్ఞాపకం తెచ్చు కుంటాడు. జ్ఞాపకం(సృతి)అనగా మునుపు అనుభవించిన విషయాన్ని ఆవిషయం లేని తరువాత కాలంలో అనుభవించటం. కనుక సుషుప్తిలో "గ్రహింపమి"ని గూర్చిన(అనుభవించిన)జ్ఞానం ఉండనే ఉన్నది. ఎక్కడయితే నేను యేమీ ఎరుగను,హ...