శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
*3) శబ్దస్పర్శాదయో వేద్యా వైచిత్ర్యాత్ జాగరే పృథక్!*
*తతోవిభక్తా తత్సంవిదైకరూప్యాన్న భిద్యతే!!*
శబ్దస్పర్శాదులైన ఇంద్రియ విషయాలు జాగ్రదవస్థలో వేరు వేరుగా తెలియబడుతున్నాయి. వాటికి ఆయా ప్రత్యేకతల వల్లభేదం వుంది.కానీ వీటిని గూర్చిన జ్ఞానములన్ని జ్ఞానమే అవడం చేత జ్ఞానంలో భేదం లేదు.కాబట్టి జ్ఞానం ఏకరూపమే.
4) తథా స్వప్నేత్ర వేద్యం తు న స్థిరమ్ జాగరే స్థిరమ్!
*తద్భేదో తస్తయోః సంవిదేకరూపా న భిద్యతే!!4!!
స్వప్నావస్థలో కూడా అట్లే.స్వప్న విషయాలు అస్థిరమైనవి.
జాగ్రత్ విషయాలు స్థిరమైనవి. జాగ్రత్ స్వప్నాలకు భేదం ఇంత మాత్రమే.
జాగ్రత్ జ్ఞానం,స్వప్నజ్ఞానం రెండింటిలో జ్ఞానం ఏకస్వరూపమే. దానిలో భేదం లేదు.
*5) సుప్తోత్థితస్య సౌషుప్తతమోబోధో భవేత్ స్మృతిః!*
సాచావబుద్ధ విషయా వబుద్ధం తత్తదా తమః!!
సుషుప్తి నుండి మేల్కొన్న వ్యక్తి తానేమీ గ్రహించలేదని ,తనకేమీ తెలియలేదని జ్ఞాపకం తెచ్చు కుంటాడు.
జ్ఞాపకం(సృతి)అనగా మునుపు అనుభవించిన విషయాన్ని ఆవిషయం లేని తరువాత కాలంలో అనుభవించటం.
కనుక సుషుప్తిలో "గ్రహింపమి"ని గూర్చిన(అనుభవించిన)జ్ఞానం ఉండనే ఉన్నది.
ఎక్కడయితే నేను యేమీ ఎరుగను,హాయి గా నిద్రపోయాను అనే అనుభవం వస్తుందో అదియే సుషుప్త్యవస్థ.
ఈఅవస్తలో కారణ శరీరాన్ని అభిమానించుకొన్న ఆత్మను "ప్రాజ్ఞ" డంటారు.
నిద్రలోని సుఖమును,అజ్ఞానమును స్మరిస్తాడు.
నిద్రలో కలిగిన అనుభవం కాబట్టి మెలుకువలో సృతిలోకి వచ్చింది.
సృతికి రాకపూర్వం ఏఅవస్థలో సుఖమును, అజ్ఞానము కలవో ఆ అవస్థను సుషుప్త్యవస్థ అందురు.
ఏమీ అనుభవించక పోవటం,గ్రహించక పోవటం కూడా తెలుసు కుంటున్నాడు.
గాఢనిద్రలో ఏమీ తెలియడం లేదని జ్ఞాపకం తెచ్చు కుంటున్నాడు.
స్వప్నం గురించి జ్ఞాపకం తెచ్చు కుంటున్నాడు
రెండువచ్చేసాయి
"మనస్సు గ్రహణం,"
"మనస్సు అగ్రహణం".
"తెలిసిన మనస్సు",
"తెలియని మనస్సు" నేను కాదు
నేను దానిని చూచే వాడిని.
సుషుప్తి యందు ఆత్మ శుద్ధమై వుండును.
జాగ్రత్ స్వప్నములకు మూలమైన
సంస్కారములతో సహా జీవుడు
సుషుప్తి యందు తన స్వంత
రూపమగు బ్రహ్మము తో ఒక్కటై
వుండుట చేతను,
బ్రహ్మమునకంటే వేరుగా ప్రకాశింప నందున ఏకైక ద్రష్టగానూ,అద్వైత స్వరూపుని గాను చెప్పబడును.
"ఏకరూపిడిని"
గా వుండటం "జ్ఞానం"
అది
"బ్రహ్మనిష్ఠ"
*6) స బోధో విషయాద్భిన్నో న బోధాత్
స్వప్న బోధవత్ !*
*ఏవం స్థానత్రయే ప్యేకా
సంవిత్తద్వద్దినాంతరే !!*
సుషుప్తిలో ఉన్న ఆ జ్ఞానం సుషుప్తిలోని విషయమైన "గ్రహింపమి" నుండి భిన్నమైనది.
కానీ జ్ఞానంలో భేదమేమీ లేదు,
స్వప్న జ్ఞానం వలెనే.
కనుక జాగ్రత్ ,స్వప్న, సుషుప్తి అవస్థలు మూడింటిలో ఉన్న జ్ఞానం ఒక్కటే.
అట్లే వేరు వేరు దినములలో జ్ఞానం కూడ ఒక్కటే.
వ్యాఖ్య :-
మూడు అవస్థలలోనూ ప్రతిదినమూ ఆయా విషయాలను గ్రహించే జ్ఞానం ఎల్లప్పుడూ ఒక్కటే.
స్వప్న మందు జాగ్రత్తులేదు.
జాగ్రత్తు నందు స్వప్నము లేదు.
ఈరెండును సుషుప్తి యందు లేవు.
సుషుప్తియు ఆ రెండింటి యందు లేదు.
జాగ్రత్ ,స్వప్నము లు సుషుప్తి యందు లేనప్పుడు వాటి అభావమును తెలియు సాక్షిని నేనేనని దృఢత్వమును పొందవలెను.
సుషుప్తి యందు ప్రకాశింప జేయుటకు ఏమియు లేనప్పటికినీ నేను ప్రకాశిస్తున్నాను అని తెలియవలెను.
ఇప్పుడు సుషుప్తి యందు
"తాను సాక్షి రూపుడై తెలియుచున్నందున" ఇక
"స్వరూపం తెలియలేదు "
అనే అజ్ఞానం లేదు.
ఇక అవస్థాత్రయములు తెలియబడుట లేదు. కేవల సాక్షిగా వుండుట తెలియుచున్నది.
అవస్తలు పరస్పర భిన్నముగా పుట్టుట, లయించుట కలిగి మిధ్యయై వుండగా,
నాస్వరూపము పుట్టుట, లయంలు లేక ఎప్పుడూ ప్రజ్ఞాన స్వరూపంలో
ఏకరూపుడిగా "సర్వ దృక్"గా వుండుట చే నేనే "బ్రహ్మం"అని తెలియ వలెను.
ఇట్టి "జ్ఞానం "
ప్రతి రోజూ,వేరు వేరు రోజులయందు కూడా ఏకంగా ప్రకాశించుచున్నది.
(((())))
354) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
దేహవాగ్బుద్ధయస్త్యక్తా జ్ఞానినానృతబుద్ధితః ౹
కర్మీ ప్రవర్తతా మాభిర్జ్ఞానినో హీయతేఽ త్ర కిమ్
౹౹275౹౹
ప్రవృత్తిర్నోపయుక్తా చే న్నివృత్తిః క్వోపయుజ్యతే ౹
బోధహేతు ర్నివృత్తిశ్తేద్ బుభుత్సాయాం తథేతరా
౹౹276౹౹
అసత్యముల యందు కర్మి ప్రవర్తించినచో జ్ఞానికి పోవునదేమి ?
వ్యాఖ్య :-
దేహము,వాక్కు,మనస్సు,బుద్ధి
వీటినన్నింటిని అసత్యములు,మిథ్య అనే భావముతో జ్ఞాని వాటిని త్యజించెను.
కర్మిష్ఠియైనవాడు వాటిని
(ఆ దేహవాగ్భుద్ధ్యాదుల్ని))
గ్రహించి కర్మానుష్ఠానంలో ప్రవృత్తుడైతే అందువల్ల జ్ఞానికి కలిగే హాని ఏముంది ? అతనికి అభ్యంతరం ఉండదని భావం.
(సంశయము)"జ్ఞానియైనవానికి ప్రవృత్తివల్ల ఏమీ ఉపయోగం లేనప్పుడు,
(సమాధానము)నివృత్తివల్ల మాత్రం ఏమి ఉపయోగం ఉంటుంది ?".
అని ప్రతిపక్షులు అడగవచ్చు.
(సంశయము)అట్లాగే నివృత్తి అనేది జ్ఞానానికి
కారణము - సహాయకారి.
(సమాధానము)శుభకర్మలందు కలిగే ప్రవృత్తి కూడా
చిత్తశుద్ధి,వైరాగ్యాలద్వారా సహాయకారిగా జిజ్ఞాసకు కారణమైనందున - అవి జ్ఞానికి ఉపయోగిస్తాయిగదా ! అనవచ్చు.
జ్ఞానికి ప్రవృత్తి వలనగాని నివృత్తి వలనగాని ప్రయోజనము లేదు.
అవి మిథ్యయగు శరీరత్రయమునకే గాని సత్యమగు సాక్షికి కాకపోవుట చేత.
అజ్ఞానికి ప్రవృత్తి వలన క్రమముగా చిత్తశుద్ధి కలిగి నివృత్తికి అర్హత కలుగును.
నివృత్తి ద్వారా జిజ్ఞాస తీవ్రతరమై జ్ఞానప్రాప్తి కలుగును.
ప్రవృత్తి అనగా సత్కర్మాచరణమని అర్థము,
దుష్కర్మను శాస్త్రము నిషేధించుట చేత తీవ్రమగు జిజ్ఞాస కలుగు వరకు సత్కర్మ చేయవలసినదేనని ఆచార్యులందరూ అంగీకరించిరి.
((())))
356) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
బుద్ధశ్చేన్న బుభుత్సేత నాప్యసౌ బుధ్యతే పునః ౹
అబాధాదనువర్తేత బోధో న త్వన్యసాధనాత్
౹౹277౹౹
నావాద్యా నాపి తత్కార్యం బోధం బాధితుమర్హతి ౹
పురైవ తత్త్వబోధేన బాధితే తే ఉభే యతః
౹౹278౹౹
బాధితం దృశ్యతామక్షెస్తేన బాధో న దృశ్యతే ౹
జీవన్నాఖుర్న మార్జారం హన్తి హన్యాత్కథం మృతః
౹౹279౹౹
అపి పాశుపతాస్త్రేణ విద్ధః చేన్న మమారయః ౹
నిష్ఫలేషు వితున్నాంగో నఙక్ష్యతీత్యత్ర కా ప్రమా
౹౹280౹౹
(సంశయము)బోధ కలిగినచో బోధ కలుగవలెనని కోరడు గదా.(సమాధానము)ఒకసారి బోధ కలిగిన పిమ్మట మరల కలుగు బోధ ఏమీ లేదు.
వ్యాఖ్య :-
తత్త్వజ్ఞానాన్ని పొందిన ప్రబుద్ధునికి ఇక జిజ్ఞాస అనేది ఉండదు. అందుచేత ప్రవృత్తి యందు అతనికి ఆపేక్ష ఉండదు,ప్రవృత్తి అనవసరము.
ఇక పొందాల్సిన జ్ఞానమూ ఉండదు.
కాబట్టి అతనికి బోధ స్థిరముగ ఉండుటకు బాధకములు లేకుండవలెను గాని నివృత్తికి అవసరమయ్యే ఇతర సాధనాల అగత్యం ఉండదు.
మహావాక్యజనితమైన జ్ఞానముచే బాధకములు తొలగుట వలన బోధ స్థిరముగా ఉండును.ఇక అతని జ్ఞానానికి కలిగే హాని ఏమీ ఉండదు.కాబట్టి అతని జ్ఞానం స్థిరంగా ఉండటానికై నివృత్తి రూపమైన ఏ ఇతర సాధనమూ అవసరం లేదు అని భావం.
అవిద్యవల్ల కర్తృత్వాది అధ్యాసాలవల్ల జ్ఞానానికి హాని కలగవచ్చుగదా ! అంటే -
అవిద్యవల్లగాని, దాని కార్యరూపమైన ద్వైతజ్ఞానం వల్లగాని అతని తత్త్వజ్ఞానాన్ని బాధింపలేవు.అతని జ్ఞానానికి హాని ఉండదు.
ఎందుచేతనంటే -
తత్త్వజ్ఞానంవల్ల ముందుగానే అవిద్య,ద్వైతజ్ఞానం ఆ రెండూ
నష్టమైపోయినాయం కాబట్టి!
జ్ఞానికి జ్ఞానోదయమైనంతనే అవిద్యా తమస్సు శాశ్వతముగ నిర్మూలింపబడును.
అవిద్య నశించినా,దానికి కార్యరూపాలైన అధ్యాసాదుల ప్రతీతి పోవటం అనేది అసంభవం ! అంటే -
బాధితమైపోయిన(నష్టమైపోయిన)ఇంద్రియాలద్వారా ద్వైతజగత్తును ఎంతగా చూస్తేమాత్రం ఏమినష్టం ?.
జ్ఞానముచే మిథ్య అని తెలియబడిన ద్వైతప్రపంచమును ఇంద్రియములు చూచుగాక,
అనుభవించునుగాక అట్టి దర్శనము - అనుభవము -
తత్త్వజ్ఞానమును స్పర్శింపజాలవు.అందువల్ల జ్ఞానం ఏమాత్రమూ నష్టం కాదు.ఎట్లాగంటే -
ఎలుక బ్రతికి ఉండగాన పిల్లిని చంపలేదుకదా !
ఇక చచ్చిన ఎలుక పిల్లిని ఎట్లా చంపుతుంది ?
బాధితమై పోయిన ఇంద్రియాలు మృతమూషికం లాంటివి.
పాశుపతాస్త్రం ప్రయోగించినను గాయపడని బలిష్టుడు,మలుకులేని బాణముతో మరణించుననే మాట నమ్ముట ఎట్లు? లోహనిర్మితమైన బాణంచేత లేక కేవలం బాణంలేని ధనుష్టంకారం చేత ఎట్లా దెబ్బతగిలి చస్తాడు ?
అట్లా చస్తాడనేందుకు ప్రమాణం ఉందా ?
అవిద్య,అవిద్యాకారమైన ప్రపంచం అమోఘమైన పాశుపతాస్త్రంతో పోల్చబడినది.జ్ఞానిని అంటజాలని ఇంద్రియగోచరములైన సుఖదుఃఖములు,
ములుకు, మొన లేని బాణముతో పోల్చబడినవి.
ఈ దృష్టాంతాన్ని దార్ట్షాంతికంతో అన్వయిస్తున్నారు.
)))((((
వ్యాఖ్య:ఇంద్రియాల ద్వారా విషయ గ్రహణం జాగ్రదవస్థకు గల లక్షణం.
విషయాలను గ్రహించే జ్ఞానం విషయాల నుండి భిన్నం. కాని శబ్ద జ్ఞానం,స్పర్శ జ్ఞానం,అశ్వజ్ఞానం, గజ జ్ఞానం మొదలైన అన్ని విషయ జ్ఞానాలలోనూ ఉన్నది జ్ఞానం ఒకటే కనుక జ్ఞానంలో భేేదం లేదు.అది ఏకస్వరూపమే.
"సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ" అని శ్రుతి.సత్ చిత్ ఆనంద స్వరూపముగా బ్రహ్మం చెప్పబడు తొంది.
జీవస్వరూపం కూడా అదే అని చూపడానికి ప్రథమముగ జీవుని జ్ఞాన స్వరూపం చూపబడుతోంది.
సంవిత్,చిత్ (చైతన్యం),జ్ఞాన శబ్దాలు సమానార్థకాలు.
జ్ఞానమనిన ప్రమాణముచే వస్తువును వున్నది ఉన్నట్ల తెలుసు కొనుట.
తెలుసుకొనే తెలివి జ్ఞానమై వున్నది.బ్రహ్మది దేవతల యందును మనుష్యుల యందును ప్రజ్ఞా రూపమగు జ్ఞానము, గుర్రములు,ఏనుగులు,గోవులు సమస్త ప్రాణి కోట్లయందును చూచుట,వినుట, తనడం,నిదురించటం అను సమస్త కర్మలు ఇంద్రియజ్ఞానం వలన తెలియుచున్నవి.
కరెంటు శక్తితో టీ.వి,ప్యాన్,మోటారు,లైట్సు ఎన్నో ఉపకరణాలు పని చేస్తాయి, కానీ కరెంటు ఒకటే.
విషయాలయందు భేదమున్నది కానీ జ్ఞానం యందు భేదం లేదు.
ప్రజ్ఞారూపమైన చైతన్య ఆధారంగా జ్ఞానం తెలియబడు చున్నది.ఆప్రజ్ఞానమే
“పరబ్రహ్మము”
“ఆత్మజ్ఞానం”, “తత్త్వజ్ఞానం”,
” బ్రహ్మజ్ఞానం”
” స్వస్వరూపజ్ఞాన”మన్నా ఒక్కటే.
జ్ఞానం ఏకస్వరూపము.
వస్తువును భావించకుండా,విచారించిన చక్కని జ్ఞానం కలుగుతుంది.

వాఖ్య:-
ఇంద్రియాలు ఉపసంహరించినప్పుడు జాగ్రదవస్థలో సంస్కారాల నుండి జనించిన ప్రత్యాయాలే విషయంగా గలది స్వప్నం.స్వప్న విషయాలు భిన్నమైనవి అయినా జ్ఞానం ఒకటే.
అయినచో స్వప్న జాగ్రత్తులు ఒకటి ఏల కాగూడదు?
కాలాంతరంలో కూడా కనిపించడం చేత జాగ్రద్విషయాలు స్థిరమైనవి.
ఎన్ని పర్యాయాలు మేల్కొన్నప్పటికీ జాగ్రదవస్థలోని విషయాలు మారటంలేదు.
ఒక స్వప్నం లోని విషయాలు రెండవ స్వప్నంలో ఉండడం లేదు.
స్వప్నంలోనైనా,జాగ్రత్తులోనైనా విషయాలను గ్రహిస్తున్న జ్ఞానంఒకటే.దానిలో భేదం లేదు.
మనం ఒక విషయాన్ని జ్ఞాపకరూపంలో దాచి దానిని గుర్తు చేసుకోవటం కారణశరీర సంస్కారాలు.
ఈ స్వప్నావస్థ లో స్వరూపజ్ఞానం లేని వాడై నేను నాది అనే అభిమానంతో స్వప్నమున సుక్ష్మ ఇంద్రియాలతో ఆనందం అనుభవించుచున్నాడు. స్వప్న జగత్తు ప్రాతి భాసికమై (తాత్కాలిక) యున్నది.
జగ్రదావస్థలో స్థూల ఇంద్రియజ్ఞానం పనిచేస్తుంది. స్వప్నావస్థలో సూక్ష్మ ఇంద్రియజ్ఞానం పని చేస్తుంది.
జాగ్రత్ ఇంద్రియజ్ఞానం అనే కంగావుంది.స్వప్నావస్థ లో ఒక రోజు అను భవం మరిఒకరోజు వుండుట లేదు.కానీ రెండిటియందున ఇంద్రియజ్ఞానం పని చేయుట వలన ఈ రెండు అవస్థ ల జ్ఞానంవేరు కాదు.
ప్రజ్ఞా ఇంద్రియాలలోకి వేళ్ళి పని చేయుట వలన స్థూల,సూక్ష్మ ఇంద్రియజ్ఞానం పని చేస్తుంది.
కానీ ప్రజ్ఞాకు ఆ అనుభవాలు లేవు. జ్ఞానం ఏకంగావుంది.
జాగ్రదావస్థ సంస్కారాలతో స్వప్నమును కాంచుచున్నాను అని ప్రస్తుత విచారణయందు,
నాకు స్వప్నావస్థ దృశ్యమని ,నేను ద్రష్టయైన ఆత్మనని తెలియుటచే జాగ్రత్, స్వప్నములు తన స్వరూపమైన ఆత్మ యందు లయించి పోవును.
అప్పుడు రెండవది లేకపోవుటచే నిరావరణ భాస్కరుని వలే తన సహజ అద్వయ బ్రహ్మ స్వరూపంలో ప్రకాశించును.
“ఈ ప్రజ్ఞా ఏకరూపం”.
--(())--

Comments
Post a Comment