Posts

Showing posts from May, 2020

సర్వ రోగ నివారిణి.

Image
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:  ప్రకృతి ప్రసాదించిన అపురూప దివ్యౌషధం ఈ తేనె:  👉తేనెలో  కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు ఉన్నాయి. 👉 థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్... లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనోఆమ్లాలూ ఎంజైములూ ఉంటాయి. 👉 ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలూ ఎక్కువగా ఉంటాయి 👉కాలిన గాయాలకీ చర్మ క్యాన్సర్లకీ పుండ్లకీ హనీ పూస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి. 👉 ఇది 'యాంటీ మైక్రోబియల్' ఏజెంట్‌గా చక్కగా పనిచేస్తుంది. 👉చెడువాసనల్నీ వాపునీ మచ్చల్నీ కూడా మటుమాయం చేస్తుంది.   👉 స్థానికంగా దొరికే తేనెనే మీరు తీసుకుంటే ఆయా కాలాల్లో వచ్చే ఎలర్జీలన్నింటినీ తట్టుకునే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 👉 ఎందుకంటే ఎలర్జీలు సాధారణంగా పరాగరేణువులవల్లే వస్తాయి.  👉తేనెటీగలు మీ చుట్టుపక్కలున్న వెుక్కల నుంచే కదా తేనెను సేకరిస్తాయి కాబట్టి ఆ పరాగరేణువులు మీ శరీరంలో చేరి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయన్నమాట. 👉ఊబకాయులు పరగడుపున ర...
Image
 శ్రీరమణీయం - (582) "కర్తృత్వభావన లేకుండా పనులు చేసే విధానం ఏమిటి ?" నేను చేస్తున్నాను అనే జ్ఞాపకం వదిలి చూస్తే మనకి కర్తృత్వమే ఉండదు. ప్రయోజనం లేని జ్ఞాపకాలు ఎన్నో ఉన్నా అవి మనకు గుర్తుకురావు. ప్రయోజనం ఉన్నవి మన ప్రమేయం లేకుండానే గుర్తుకువస్తున్నాయి. మనం మంచివాళ్ళమూ కాదు, చెడ్డవాళ్ళమూ కాదు. దీన్నే శ్రీరమణమహర్షి ఆత్మకు కర్మతో పనేంటి ? అన్నారు. నిద్రలో మనం మంచివాళ్ళమా ? చెడ్డవాళ్ళమా ? ఎవరూ కాదు. మనమే కర్తలమైతే చేసిన పనిలో మనకు స్వతంత్రత ఉండాలి. మనకే ఏ విషయంలోనూ ఈ రెండూ జరగటం లేదు. మన పుట్టుక, చావు, రంగు, రూపం, సామర్థ్యం, జరిగే లాభనష్టాలు దేనిలోనూ మన ప్రమేయం ఉండటం లేదు. మనం చేసిన ఏ పనైనా సందర్భాన్ని బట్టే గుర్తుకు వస్తుంది కానీ ఎప్పటికీ గుర్తుగా ఉండిపోవటంలేదు. సూర్యుడిని వెలిగించే శక్తి, భూమిని తిప్పే శక్తి, గాలి వీచేలా చేసిన శక్తి, సముద్రంలో అలలను పైకిలేపే శక్తి ఏదైతే ఉందో అదే నిన్ను కూడా నడిపిస్తుంది. నేను చేస్తున్నానన్న జ్ఞాపకం వదిలి చూస్తే మనకి కర్తృత్వం ఉండదు ! {ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"} మనసుకి, జ్ఞాపకానికి మనను బాధించే శక్తి లేదు !'-అధ్యాయం-71)*  ...