శ్రీరమణీయం - (582)
"కర్తృత్వభావన లేకుండా పనులు చేసే విధానం ఏమిటి ?"
నేను చేస్తున్నాను అనే జ్ఞాపకం వదిలి చూస్తే మనకి కర్తృత్వమే ఉండదు. ప్రయోజనం లేని జ్ఞాపకాలు ఎన్నో ఉన్నా అవి మనకు గుర్తుకురావు. ప్రయోజనం ఉన్నవి మన ప్రమేయం లేకుండానే గుర్తుకువస్తున్నాయి. మనం మంచివాళ్ళమూ కాదు, చెడ్డవాళ్ళమూ కాదు. దీన్నే శ్రీరమణమహర్షి ఆత్మకు కర్మతో పనేంటి ? అన్నారు. నిద్రలో మనం మంచివాళ్ళమా ? చెడ్డవాళ్ళమా ? ఎవరూ కాదు. మనమే కర్తలమైతే చేసిన పనిలో మనకు స్వతంత్రత ఉండాలి. మనకే ఏ విషయంలోనూ ఈ రెండూ జరగటం లేదు. మన పుట్టుక, చావు, రంగు, రూపం, సామర్థ్యం, జరిగే లాభనష్టాలు దేనిలోనూ మన ప్రమేయం ఉండటం లేదు. మనం చేసిన ఏ పనైనా సందర్భాన్ని బట్టే గుర్తుకు వస్తుంది కానీ ఎప్పటికీ గుర్తుగా ఉండిపోవటంలేదు. సూర్యుడిని వెలిగించే శక్తి, భూమిని తిప్పే శక్తి, గాలి వీచేలా చేసిన శక్తి, సముద్రంలో అలలను పైకిలేపే శక్తి ఏదైతే ఉందో అదే నిన్ను కూడా నడిపిస్తుంది. నేను చేస్తున్నానన్న జ్ఞాపకం వదిలి చూస్తే మనకి కర్తృత్వం ఉండదు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
మనసుకి, జ్ఞాపకానికి మనను బాధించే శక్తి లేదు !'-అధ్యాయం-71)*
"అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
ప్రశ్న: అంతిమగమ్యం చేరుకోవడం సులభమని నేను అనుకోవడం లేదు..
జవాబు: భయము, జయము, అపజయము మొదలగు ఆలోచనలతో నిన్ను ఎందుకు కలవరపరచుకుంటావు. ముందుకు సాగిపో. గాఢధ్యానం చేయుము. మిగిలిన ఆలోచనలన్నీ విసిరివేయుము. సాధన లేకుండా విజయము సిద్ధించదు.
⚡️✨⚡️✨⚡️✨
ప్రశ్న: నేను సాక్షాత్కారము పొందగలనా.. అది చాలా కష్టంగా వున్నది..
జవాబు: నీవు ఇప్పటికే ఆత్మవు. సాక్షాత్కారము ప్రతి ఒక్కరికీ వున్నది. సాక్షాత్కారానికి సాధకులలో తారతమ్యమేమీ ఉండదు. నేను సాక్షాత్కారము పొందగలనా, పొందలేనేమో అనే ఆలోచనలే సాక్షాత్కారమునకు అడ్డు. దీని నుంచి విడివడు. నీకు సాధన కష్టమన్న ఆలోచన వస్తే ఆలోచన మూలమునకు వెళ్ళుము.
⚡️✨⚡️✨⚡️✨
ప్రశ్న: నాకు అనుభవము లేకపోతే ఇలాంటి ఆలోచనల నుండి విడిపడేదెలా..
జవాబు: ఇవన్నీ మనసులోనివే.. నీవు శరీరంతో తాదాత్మ్యమును బాధించుకొనుచున్నావు. కనుక ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఈ తప్పు తాదాత్మ్యము వదిలిపోతే అజ్ఞానం పోయి అసలు సత్యం వెల్లడి అవుతుంది.
🕉🌞🌎🌙🌟🚩[
13
సత్ప్రయత్నం
మీలో ప్రతివారు, నాకంటే నూరురెట్లు గొప్పవారు కావాలి. మీలో ప్రతి ఒక్కరూ ఒక వీరాధి వీరుడు కావాలి. విధేయత సంసిద్ధత పనిమీద శ్రద్ధాభక్తులు- ఈ మూడూ మీలో ఉంటే మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు.
🕉🌞🌎🌙🌟🚩
"నేను శ్యామల" అనేదే మొట్టమొదటి మూఢ విశ్వాసము.
మిగతా విశ్వాసాలన్నీ దాన్ని పట్టుకుని వ్రేళ్లాడేవే.
⚡️✨⚡️✨⚡️✨
*అన్వేషణకు సమాధానం -- అన్వేషించేవాడే.
⚡️✨⚡️✨⚡️✨
శిష్యుడు:- సాక్షాత్కారం అనేది క్రమంగా (Gradual) కలుగుతుందా? హఠాత్తుగా (Sudden) కలుగుతుందా?
సద్గురు:- కాయ పండడం క్రమంగా జరుగుతుంది. పండు రాలడం హఠాత్తుగా జరుగుతుంది.
కాయ పండడం - సాధన.
పండు రాలడం - సిద్ధి.
⚡️✨⚡️✨⚡️✨
సామాన్యులు - సామాన్య విషయాల్లో పడే గందరగోళం కంటే;
ఆధ్యాత్మికులు - ఆధ్యాత్మిక విషయాల్లో పడే గందరగోళమే ఎక్కువ.
అన్నమయ్య సంకీర్తన
ప్రాంజలి ప్రభ
రేకు: 70-5
సంపుటము: 1-368.
భోగీంద్రులును మీరుఁ బోయి రండు
వేగన మీఁదటి విభవాలకు !!
॥పల్లవి॥
హరుఁడ పోయిరా అజుఁడ నీవును బోయి
తిరిగిరా మీఁదటి తిరుణాళ్ళకు
సురలు మునులును భూసురులుఁబోయి రండు
అరవిరి నిన్నాళ్ళు నలసితిరి !!
॥భోగీం॥
జముఁడ పోయిరా శశియు నీవును బోయి
సుముఖుఁడవై రా సురలఁ గూడి
గుములై దిక్పతులు దిక్కులకుఁ బోయి రండు
ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి !!
॥భోగీం॥
నారద సనకసనందనాదులు
భూరి విభవములఁ బోయిరండు
దూరముగాఁ బోకిట్టే తొరలి వేంకటగిరిఁ
జేరి నన్నిట్లనే సేవించుఁడీ !!
॥భోగీం॥
--(())--
కీర్తనలో అర్ధాలు:
---------------------------
విభవాలకు = బ్రహ్మోత్సవాలు
అజుడ = బ్రహ్మ
అరవి(ము)రి = సగమువిరిసిన మొగ్గ
సుముఖుఁడవై = సంతోషకరమైన ముఖముగలవాడు
గుములై = పయనించువారై
ప్రమదాన = సంతోషముతో
తొరలి = మళ్ళీ
భావామృతం
-----------------------
భోగములనుభవించుటకు అలవడిన ఓ మహామహులారా మీరంతా పోయి వచ్చే ఏడాది జరుగబోయే బ్రహ్మోత్సవాలకు మీకోసం ఎదురు చూస్తుంటాను. ఓ శంకరా కైలాసం నుండి శ్రమ తీసికొని వచ్చావు. ఓ బ్రహ్మ నీవు బ్రహ్మోత్సవాలు జరిపి ఎంతో శ్రమపడ్డావు. మీరు వచ్చే తిరునాళ్ళకు తప్పక రావాలి. దేవతలారా మునులారా బ్రాహ్మణోత్మములారా ఇన్నాళ్ళూ అలసి సగమువిరిసిన మొగ్గ ఉన్నారు కనుక ఇప్పటికి పోయిరండి. ఓ యమధర్మరాజా తమది క్షణం తీరికలేని బాధ్యత ఓ చంద్రుడా నీవి అంతులేని బాధ్యత మళ్ళీ దేవతలతో కలిసి రండి. పయనించే దిక్పాలకులారా మీ మీ దిక్కులకు మీరు పోయి రండి. ఇన్నాళ్ళు సంతోషముతో వున్నారు. అయినా ఎంతో అలసిపోయారు. మీరంతా పోయి మరలారండి. ఓ నారద సనక సనందనాది మునివరులారా గొప్ప ఉత్సవాలకు మళ్ళీ వచ్చే యేడాది తప్పక తిరిగిరండి. ఎంతో దూరం పోతే మీకు తిరిగి రావటానికి శ్రమ అవుతుంది. కనుక యెక్కువ దూరం పోకండి. మళ్ళీ వేంకటగిరి చేరి నన్ను ఇట్లాగే సేవించండి. జన్మసార్ధకం చేసికోండి అంటు అన్నమయ్య కీర్తించాడు.
🕉🌞🌏🌙🌟🚩

అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
106
రేకు: 206-6
సంపుటము: 3-36
పట్టరో వీదులఁ బరువులు వెట్టి
పుట్టుగులతో హరి పొలసీ వీఁడే!!
॥పల్లవి॥
వేవేలు నేరాలు వెదకేటి దేవుఁడు
ఆవులఁ గాచీ నలవాఁడే
పోవుగ బ్రాహ్మలఁ బుట్టించు దేవుఁడు
సోవల యశోదసుతుఁడట వీఁడే !!
॥పట్ట॥
ఘనయజ్ఞములకుఁ గర్తగు దేవుఁడు
కినిసి వెన్న దొంగిలె వీఁడే
మునుల చి త్తముల మూలపుదేవుఁడు
యెనసీ గొల్లెతల యింటింట వీఁడే!!
॥పట్ట॥
నుడిగి నారదుఁడు నుతించు దేవుఁడు
బడి రోలఁ గట్టువడె వీఁడే
వుడినోని వరము లొసఁగెడు దేవుఁడు
కడఁగిన శ్రీవేంకటగిరి వీఁడే !!
॥పట్ట॥
🕉🌞🌎🌙🌟🚩
భావామృతం
-----------------------
పుట్టిన వాడు హరి అని తెలుసుకొని దూరంగా తొలగిపొండి.నేరాలు చేసే వారిని ఎవరినైనా శిక్షించే దేవుడు. నేడు ఆవుల కాస్తున్నాడు. అలవోకగా జ్ఞానులను సృష్టించే దేవుడు. నేడు ఒక సాధారణమైన గోపవనిత యశోదకు బిడ్డడయ్యాడు. ఘనయజ్ఞములకు కర్త అయి ఆహుతులు అందుకునే దేవుడు నేడు వెన్నదొంగ అయ్యాడు. మునుల చిత్తములకు మూలవిభూతి అయిన ఆ స్వామి గొల్లెతలను తానే వెంటబడుతున్నాడు. నారదునిచే స్తుతించబడే దేవుడు రోలుకు కట్టబడి రోదిస్తున్నాడు. ఆ దేవుడు నేడు వేంకటగిరిపై వెలసి మన అందరకు వరములొసగుతు వెలసివున్నాడు అంటు అన్నమయ్య కీర్తించాడు.
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
గానం. డా|| వందన గారు
రాగం. దేశ్
రేకు : 322
సంఖ్య : 128-4
రేకు రాగం : శ్రీ రాగం
గోవింద నీవన్నిటిలో కూడితే చాలుగాని
ఈవల సంసారమైన యిది ధృవపట్టమే!!
తలపులోపల నీవు దగ్గరైతేనే చాలు
కలలోని కాపురము కైవల్యమే
బెళకు నాలుకకు నీపేరు వచ్చితే చాలు
పలికినవన్నియు పరమ వేదములే!!
తొడరి నీపూజ చేత దొరికితేనే చాలు
పడచుల బొమ్మరిండ్లు బ్రహ్మలోకమే
కడలేని నీభక్తి కలిగితేనే చాలు
కడజన్మమయినా నిక్కపు విప్రకులమే!!
కాయముపై నీముద్ర కానవచ్చితేనే చాలు
పాయపు రతిసుఖము పరతత్వమే
యేయెడ శ్రీవేంకటేశ యిటు నీకే శరణంటి
పోయిన నా పాపమెల్లా పుణ్యకర్మమే!!
🕉🌞🌎🌙🌟🚩
భావము :-
సంసారము మాయామయము. సుఖదుఃఖాలూ, పాపాపుణ్యాలు వంటి ద్వంద్వముల మూలంగా ఈ సంసారము ఎప్పుడూ నిలకడ లేనిదానివలెనే అనేక భ్రాంతులను కలిగిస్తుంటుంది. కానీ గోవిందుని ఆశ్రయించి కూడితే చాలును ఈ సంసారమే ధృవమండల ప్రాప్తి దక్కినట్లు శాశ్వత కీర్తి కలవానిగా చేస్తుంది. ఓ వేంకటేశ్వరా! నీకు శరణార్ధులైన వారికి చేసిన పాపమెల్లా పుణ్యకర్మగానే పరిణమిస్తుంది అంటున్నారు అన్నమాచార్యులవారు.
ఓ గోవిందుడా! నీవు అన్నింటిలోనూ కూడియున్నావు అనే భావన కలిగితే చాలును. ఎంతో అస్థిరమైన ఈ సంసారము ( జగత్తు ), ధృవపటమే అవుతుంది. అత్యంత స్థిరమైన ధృవమండలమువలె ఉంటుంది.
1. ఓ నారాయణుడా! నీవు ఒకసారి తలపులలోనైనా మాకు దగ్గరయితేనే చాలు. కైవల్య ప్రాప్తి కూడా కలలో జరిగినట్లు జరుగుతుంది. బెళకు నాలుకకు ( తళతళమను ప్రకాశించు నాలుకకు ) నీపేరును పలుకుట వచ్చిన చాలును. అది పలికిన పనికిరాని మాటలు కూడా పరమవేదములవలె మానవునికి అంతులేని పుణ్యాన్నిస్తుంది.
2. ఓ దేవదేవా! నీ పూజ తొడరి ( యత్నించి ) చేతదొరికితేనే ( చేజిక్కించుకుంటే ) చాలును. జవ్వనుల భృకుటీ విలాసములు బ్రహ్మలోక ప్రాప్తికి అడ్డురావు. కడలేని ( అంతులేని ) నీ భక్తి కలిగినంత మాత్రమున కడజాతివాడైనా విప్రునికంటే విశేషమైన పుట్టుక కలవానివలెనే ఉన్నతుడవుతాడు.
3. ఓ శ్రీహరీ! ఎవడన్నా భక్తితో నీ శంఖచక్ర ముద్రలు ధరించితే చాలును. వాని శరీరము పరతంత్రమైనట్లు ( పరాధీనమైనట్లు ) పాయపు రతిసుఖము ( వయస్సుకు సహజమైన రతి ) కూడా కాంక్షించదు. ఓ శ్రీవేంకటేశ్వరా! యెచ్చోటనైనా నీ శరణార్ధులైన మాకు అంతా పుణ్యమే. పాపమనేది లేనేలేదయ్యా!
🕉🌞🌎🌙🌟🚩
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
రేకు: 146-3
సంపుటము: 2-208
రేకు రాగము: సాళంగనాట.
ఈతఁడు తారక బ్రహ్మమితఁడు మాదేవుఁడు
కౌతుకానఁ జెప్పే వినఁగదరే వో జనులు !!
రాముఁడు యిందీవరశ్యాముఁడు నానాసార్వ-
భౌముఁడు షోడశకళాసోముఁడు
దోమటిరాక్షసులను తుత్తుమురు సేసినాఁడు
కామితఫలములిచ్చి కాచినాఁడు సురల !!
పూర్ణుఁడు నీలమేఘవర్ణుఁడు దానమున వి-
స్తీర్ణుఁడు వాహనసుపర్ణుఁడు
అర్ణవము దాఁటి రావణాదుల గెలిచినాఁడు
నిర్ణయించి చెప్పరాదు నేఁడీతని మహిమ !!
వరుఁడు సీతకు పరాత్పరుఁడు కోదండదీక్షా-
గురుఁడు దివ్యామోఘశరుఁడు
నిరతి శ్రీవేంకటాద్రి నెలవై ఉండేటివాఁడు
సరి భరతలక్షణశత్రుఘ్న సహితుఁడు!!
🕉🌞🌎🌙🌟🚩
భావము:-
ఈ శ్రీరామచంద్రుడే మోక్షప్రదాత అయిన పరబ్రహ్మ స్వరూపుడు. ఓ ప్రజలారా! రాముని గుణగణాలు కుతూహలం కలుగునట్లు చెబుతాను. మీరంతా వినండి.
1.ఈ శ్రీరాముడు నల్లకలువ వంటి శరీరఛాయ కలవాడు. అనేక దేశములకు చక్రవర్తి. పదహారు కళలతో విరాజిల్లే చంద్రుని పోలినవాడు. దుర్మార్గులైన దానవులను చిన్నచిన్న ముక్కలుగా ఖండించిన మహావీరుడు. దేవతలు కాంక్షించినవన్నియునొసగి రక్షించినవాడు.
2. ఈ దాశరథి పరిపూర్ణకాముడు. నీలమేఘవర్ణుడైన అందగాడు. విస్తారముగా దానములు చేసినవాడు. ( పినతల్లికి రాజ్యదానం నుంచి కాకాసురునికి ప్రాణదానం వరకు ఆయన చేయని దానం ఏముంటుంది? ) గరుత్మంతుని వాహనముగా పొందిన నారాయణుడు. శతయోజన విస్తీర్ణమైన అర్ణవమును ( సముద్రమును ) దాటి రావణాసురుని గెలిచినవాడు. ఈరోజున మనం ఈయన ఘనత ఇంతా అని చెప్పటం అసంభవం.
3. ఈ రాఘవుడు సీతకు పతిదేవుడు. మనకు మోక్షప్రదాత. దుష్ట శిక్షణకు ఎప్పుడూ సిద్ధముగానుంటానని దీక్షితుడై కోదండపాణియై నిలబడినవాడు. అమోఘమైన దివ్యశస్త్రాస్తములు కలిగినవాడు. ఆసక్తితో శ్రీవేంకటాద్రిని తన నెలవుగా చేసికొనిన వేంకటేశ్వరుడే మనకు సీతా భరత లక్ష్మణ శత్రుఘ్ను సహితుడై కనిపించుచున్న శ్రీరామచంద్రుడు.
🕉🌞🌎🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩
102
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 90-3
సంపుటము: 1-443
కంటి నిదే యర్థము ఘనశాస్త్రములు దవ్వి
నంటున నిందుకంటెను నాణె మెందూ లేదు!!
॥పల్లవి॥
మేఁటివైరాగ్యముకంటే మిక్కిలి లాభము లేదు
గాఁటపువిజ్ఞానముకంటే సుఖము లేదు
మీఁటైనగురువుకంటే మీఁద రక్షకుఁడు లేఁడు
బాటసంసారముకంటే పగ లేదు !!
॥కంటి॥
పరపీడ సేయుకంటే పాపము మరెందు లేదు
పరోపకారముకంటే బహుపుణ్యము లేదు
నిరతశాంతముకంటే నిజధర్మ మెందు లేదు
హరిదాసుడౌకంటే నట గతి లేదు !!
॥కంటి॥
కర్మసంగము మానుకంటే దేజము లేదు
అర్మిలిఁ గోరికమానేయంతకంటే బుద్ధి లేదు
ధర్మపుశ్రీవేంకటేశుఁ దగిలి శరణుచొచ్చి
నిర్మలాన నుండుకంటే నిశ్చయము లేదు !!
॥కంటి॥
🕉🌞🌎🌙🌟🚩
శ్రీఅన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
॥పల్లవి॥ నరహరి నీ దయమీదట నా చేతలు గొన్నా
శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా!!
॥చ1॥ మొఱయుచు నరకపు వాకిలి మూసిరిహరినీదాసులు
తెఱచిరి వైకుంఠపురము తెరువుల వాకిళ్ళు
నుఱిపిరి పాపములన్నియు నుగ్గుగ నిటు తూర్పెత్తిరి
వెఱవము వెఱవము కర్మపువిధులిక మాకేలా!!
॥చ2॥ పాపిరి నా యజ్ఞానము పరమాత్ముడ నీదాసులు
చూపిరి నిను నామతిలో సులభముగా నాకు
రేఁపిరి నీపై భక్తిని రేయినిఁ బగలును నాలో
వోపము వోపము తపములు వూరకె ఇఁక నేలా!!
॥చ3॥ దిద్దిరి నీ ధర్మమునకు దేవా శ్రీవేంకటేశ్వర
అద్దిరి నీదాసులు నీయానందములోన
ఇద్దరి నీనా పొందులు యేర్పరచిటువలెఁ గూర్చిరి
వొద్దిక నొద్దిక నాకిఁక నుద్యోగములేలా!!
-------(తాళ్లపాక అన్నమాచార్య-ఆధ్యాత్మ సంకీర్తన)
(రాగము: బౌళి,రేకు: 0264-02,సంపుటము: 3-368)
రాగం: హంసధ్వని (hamsadhwani)
llపల్లవి ll
భక్తికొలది వాడే పరమాత్ముడు
భుక్తిముక్తి తానెయిచ్చు భువి పరమాత్ముడు!!
ll చరణం ll
పట్టినవారిచే బిడ్డ పరమాత్ముడు
బట్టబయటి ధనము పరమాత్ముడు
పట్టపగటి వెలుగు పరమాత్ముడు
యెట్టనెదుటనే వున్నాడిదె పరమాత్ముడు!!
ll చరణం ll
పచ్చిపాలలోనివెన్న పరమాత్ముడు
బచ్చనవాసినరూపు పరమాత్ముడు
బచ్చుచేతివొరగల్లు పరమాత్ముడు
యిచ్చుకొలదివాడువో యీ పరమాత్ముడు!!
ll చరణం ll
పలుకులలోనితేట పరమాత్ముడు
ఫలియించునిందరికి పరమాత్ముడు
బలిమిశ్రీ వేంకటాద్రి పరమాత్ముడు
యెలమి జీవులప్రాణమీ పరమాత్ముడు!!
🕉🌞🌎🌙🌟🚩
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
గానం. శ్రీమతి ద్వారం లక్ష్మి గారు
రాగం. ఖరహరప్రియ
రేకు: 345-5
సంపుటము: 4-266
రేకు రాగము: పాడి.
కలదొక్కటే గురి కమలాక్ష నీ కరుణ
యిల నేనెట్టుండినాను యెంచకుమీ నేరమి!!
మనసులోనికి గురి మాధవ నీ పాదాలు
తనువుపై గురి నీ సుదర్శనము
కనుచూపులకు గురి కమలాక్ష నీ రూపు
పనులెన్ని గలిగినఁ పట్టకు నా నేరమి !!
చేతులు రెంటికి గురి సేసేటి నీ పూజలు
నీతి నా నాలికగురి నీ నామము
కాతరపునుదుటికిఁ గల తిరుమణి గురి
పాతకపు నావలనఁ పట్టకుమీ నేరము!!
యిహపరాలకు గురి యీ నీ శరణాగతి
సహజము ఆత్మకు గురి సంతతభక్తి
మహిలో శ్రీవేంకటేశ మన్నించి నన్నేలితివి
బహువిధముల నింకఁ పట్టకుమీ నేరమి!!
🕉🌞🌎🌙🌟🚩
భావము:--
'గురి' అంటే లక్ష్యం అని అర్థము. యావత్ సృష్టికి ఒక్కటే గురి. అది కమలాక్షుడైన శ్రీహరి కరుణను సంపాదించుట. నేను దాన్ని సంపాదించటానికి కృషి చేస్తున్నాను. నేనెట్లాఉన్నా నా నేరములెంచకు పభూ! అంటున్నారు అన్నమాచార్యులవారు. మానవుని జీవితంలో ఇహపరాలు రెండూ ముఖ్యమైనవే. ఇవి రెండూ సాధించవలెనంటే అంత సులువైన విషయం కాదు. శ్రీవేంకటేశ్వరుని శరణాగతి ఒక్కటే ఆ రెంటికి గురి. సహజానందం పొందాలనుకున్న ఆత్మకు గురి ఏది? స్వామిపై సతతము భక్తి ఉండటమే.
ఓ కమలాక్షా! ( పద్మనయనా! ) మాకు ఒక్కటే గురి ( లక్ష్యము ) కలదు. అదే నీ కరుణ సంపాదించుట. ఓ ప్రభూ! ఈ ప్రపంచంలో నేనెట్లా ఉన్నా నాపై నేరములెంచకుమా!
1. ఓ మాధవా! నా మనసు నిలుపడానికి గురి, నీ పాదకమలములు. నా తనువు క్షేమంగా ఉండటానికి కారణం నేను ధరించిన నీ సుదర్శన చక్రముద్రలు. ఓ కమలాక్షా నేను అంధుడను కానందుకు సంతోషిస్తున్నాను ఎందుకంటే కనుచూపులకు గురియైన నీ మనోహరరూపం నాకళ్లెదుటే ఉన్నది. స్వామీ! ఈ లోకపాలనవల్ల నీకు క్షణం తీరదు. దొరికిన కాస్త సమయం నా నేరాలెంచుటతో గడిపేయకు.
2. నాకు రెండు చేతులనిచ్చావు. ఎందుకు? వాటి గురి నీ పూజసేయుట. నీతిగల నా నాలుక లక్ష్యము నీ నామోఛ్ఛారణము. కాతరపు ( దృష్టికి లోనయ్యే ) నా నుదుటికి గురి దానిపైగల నీ తిరుమణి ( నీ నామము ). నేను పాపినే ఒప్పుకుంటాను. కానీ ఊరకనే నా నేరములెంచి నన్ను వేరుచేయకు ప్రభూ!
3. దేవా! మానవుడు ఇహపరాలు రెండూ సాధించవలెనంటే గురి నీ శరణాగతి. సహజ స్థితిలో ఉన్న నా ఆత్మకు గురి నీ సంతత భక్తి ( నిరంతరమైన భక్తి ). ఓ వేంకటేశ్వరా! ఈ లోకంలో నన్ను మన్నించి పరిపాలించితివి. ఇంకా బహువిధములైన నా నేరాలు ఎంచి ఏమి ప్రయోజనం? వద్దు తండ్రీ!
🕉🌞🌎🌙🌟🚩
అన్నమయ్య సంకీర్తన
రేకు: 5-3
సంపుటము: 1-32.
🕉🌞🌎🌙🌟🚩
ll పల్లవి ll
ఎంతటివారలు నెవ్వరును హరిఁ
జింతించక నిశ్చింతులు గారు !!
అతిజితేంద్రియులు ననశనవ్రతులు-
నతుల తపోధనులగువారు
చతురానన గురుస్మరణము దొరకక
తతి నూరక పుణ్యతములుగారు !!
అనఘులు శాంతులు నధ్యాత్మతతులు-
ననుపమ పుణ్యులు యాజకులు
వనజోదరు ననవరతముఁ దలఁచక
వినుతి స్మృతికిని విభుదులుగారు !!
దురిత విదూరులు దుర్మతిహీనులు
నిరతానందులు నిత్యులును
తిరువేంకటగిరిదేవుని గొలువక
పరమార్గమునకు బ్రహ్మలు గారు !!
🕉🌞🌎🌙🌟🚩
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌏🌙🌟🚩
గానం:శ్రీసత్తిరాజు. వేణుమాధవ్ గారు
రేకు: 91-3
సంపుటము: 1-449.
చదువులోనే హరిని జట్టిగొనవలెఁ గాక
మదము గప్పిన మీఁద మగుడ నది గలదా !!
జడమతికి సహజమే సంసాయాతన యిది
కడు నిందులోఁ బరము గడియించవలెఁగాక
తొడరి గాలప్పుడు తూర్పెత్తక తాను
విడిచి మఱచిన వెనక వెదకితేఁ గలదా !!
భవబంధునకు విధిపాపపుణ్యపులంకె
తివిరి యిందునే తెలివి తెలుసుకోవలెఁగాక
అవల వెన్నెలోనె అల్లు నేరేళ్లింతే
నివిరి నిన్నటివునికి నేఁటికిఁ గలదా !!
దేహధారికిఁ గలదే తెగనియింద్రియబాధ
సాహసంబున భక్తి సాధించవలెఁగాక
యీహలను శ్రీవేంకటేశుదాసులవలన
వూహించి గతిగానక వొదిఁగితేఁ గలదా !!
🕉🌞🌏🌙🌟🚩
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
1479. 02/06/20
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 21-4
సంపుటము: 1-128.
తానే తెలియవలె తలఁచి దేహి తన్ను
మానుపువారలు మరి వేరీ !!
॥పల్లవి॥
కడలేని భవసాగరము చొచ్చినతన్ను
వెడలించువారలు వేరీ
కడుబందములచేతఁ గట్టుపడినతన్ను
విడిపించువారలు వేరీ !!
॥తానే॥
కాఁగినినుము వంటికర్మపు తలమోపు -
వేఁగు దించేటివారు వేరీ
మూఁగిన మోహపుమూఁకలు తొడిఁబడ
వీఁగఁ దోలేటివారలు వేరీ !!
॥తానే॥
తిరువేంకటాచలాధిపునిఁ గొలుపుమని
వెరపు చెప్పెడువారు వేరీ
పరివోని దురితకూపములఁ బడకుమని
వెరపు చెప్పెడివారు వేరీ !!
॥తానే॥
🕉🌞🌎🌙🌟🚩
కీర్తనలో అర్ధాలు
------------------------------
మానుపువారలు = అజ్ఞానాన్ని తొలగించువారు
కడలేని = అంతుపొంతూలేని
వెడలించు = బయటకు తీసే
వేఁగు = తపించు
తొడిబడ = చలించు
వెరపు = ఉపాయం
దురితకూపముల = అపరిమితమైన పాపపురొంపి
భావామృతం
______
ఈ ప్రపంచంలో దేహము దాల్చిన ప్రాణి తానెవరో గమ్యమేమిటో ఆలోచించి తానే తెలుసుకోవాలి. వాడిఫ అజ్ఞానాన్ని తొలగించువారు యెక్కడవున్నారు. అంతుపొంతూలేని భవసాగరమున చొచ్చియున్న వాడిని బయటకుతీసే వారు యెక్కడున్నారు. అనేక భవబంధముల చేత కట్టుపడిన వానిని విడిపించేవారు యెక్కడవున్నారు. దేహియొక్క కర్మఫలమెట్టిదంటే ఎర్రగా కాల్చిన ఇనుపగుండులాంటిది. దాన్ని వాడే తలకెత్తుకొని యోయాలి దాని తప్పించుకోలేరు. వీడిని మోహపుమూకలు చలించు వాటిని పారద్రోలేవారేరి. ఇకనైనా శ్రీవేంకటేశ్వరుని శరణమని వేడుకోరా అని ఉపాయము చెప్పేవారు యేరి. అపరిమితమైన పాపపురొంపిలో పడకుండా వెరపు ఇది అని చెప్పేవారేరి అంటు అన్నమయ్య కీర్తించాడు.
🕉🌞🌎🌙🌟🚩
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
1478. 01/06/20
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 10-5
సంపుటము: 1-65.
తనకర్మవశం బించుక, దైవకృతంబొక యించుక,
మనసు వికారం బించుక, మానదు ప్రాణులకు !!
॥పల్లవి॥
ఈదైన్యము లీహైన్యము లీచిత్తవికారంబులు
యీదురవస్థలు గతులును యీలంపటములును
యీదాహము లీదేహము లీయను బంధంబులు మరి
యీదేహముగలకాలము యెడయవు ప్రాణులకు !!
॥తన॥
యీచూపులు యీతీపులు నీనగవులు నీతగవులు-
నీచొక్కులు నీపొక్కులు నీ వెడయలుకలును
యీచెలుములు నీబలువులు నీచనవులు నీఘనతలు-
నీచిత్తముగలకాలము యెడయవు ప్రాణులకు !!
॥తన॥
యీవెరవులు నీయెరుకవులు యీతలఁపులు నీతెలువులు
దైవశిఖామణి తిరుమల దేవునిమన్ననలు
దైవికమున కిటువగనక తనతలఁ పగ్గలమైనను
దైవము తానౌ తానే దైవంబవుఁగాన !!
॥తన॥
🕉🌞🌎🌙🌟🚩
భావామృతం
______
కొంచెం తను చేసిన కర్మఫలం కొంచెము దైవకృతమైన కర్మఫలం కొంచెము మనోవికారముల చేత ఆచరించిన కర్మఫలము. అట్లాగే ఈ ప్రాణులకు విడవనివి కొన్ని వుంటాయి. ఆ జీవి పొందే దైన్యములు హీనదశలు చిత్తవికారములు దురవస్థల తీరుతెన్నులు లంపటములు యెన్నడూ తీరని దాహము జీవిదేహములు ఈ జీవి బంధములు మరియు ఈ దేహముండే కాలపరిమాణములు. ఈ ప్రాణులకు వలపం రేపెడి చూపులు వలపులు కలిగించే తీపులు వీరి నవ్వులు తగవులు పారవశ్యములు వుప్పొంగుటలు అలుకలు పంతములు వుద్ధతులు అనురాగములు వారి మనస్సులు లగ్నమైనంత కాలముననే ఉండును. ఈ జీవుల భయాందోళనలు యెరుకలు ఆలోచనలు తెలివితేటలు దైవశిఖామణియైన తిరువేంకటేశ్వరుని మన్నన వలననే కలుగుతాయి. మరి ఇక ఇట్టి దైవ సంకల్పములే తీరున ఉండునోయని చింతించుట వృథా ప్రయాస. అదే తెలిస్తే తానె దైవమౌతాడు ఆ దైవమూ తనౌతాడు అంటు అన్నమయ్య కీర్తించాడు.
🕉🌞🌎🌙🌟🚩
02-06-2020
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌏🌙🌟🚩
తలచినవి అన్నియు తనకొరకే... !
వెలి దెలియుట దనలో దెలియుట కొరకే!!
ఉదయమందుట భవముడుగుట కొరకే !
చదువుట మేలు విచారించు కొరకే ! బ్రతుకుట పురుషార్ధ పరుడౌట కొరకే ! యెదిరిన గనుట తన్నెఱుగుట కొరకే !!
తలచినవి అన్నియు తనకొరకే
తగులుట విడి వడ దలచుట కొరకే ! నొగులుట కర్మమును అనుభవించు కొరకే !
చిగురంట కొమ్మయు చెలగుట కొరకే ! బెగడుట దురితము లేడబాయు కొరకే!!
తలచినవి అన్నియు తనకొరకే
ఈ వల జేయుట ఆవలి కొరకే !
ఆవలనుండుట ఇవలి కొరకే !
ఈ వల నావల జనయ తీరుగుటెల్ల
శ్రీవేంకటేశ్వరు జేరుట కొరకే !!
తలచినవి అన్నియు తనకొరకే వెలి దెలియుట దనలో దెలియుట కొరకే...
🕉🌞🌏🌙🌟🚩
సంకీర్తన భావామృతం
తలచినవి అన్నియు తన స్వప్రయోజనం కొరకే సుమా. బాహ్యప్రపంచంలో జరిగేవి తెలుసుకోవటం కూడా తనలోని అంతర్యామిని తెలియుట కొరకే. పుట్టుట పుట్టుక లేకుండుట కొరకే. ఎంత చదివినా దాని ప్రయోజనం మంచిచెడ్డలు తెలియుట కొరకే. జీవించుట ధర్మర్ధకామమోక్ష సాధన కొరకే. ఎదుట వారిని పరిశీలించుట తాను యెట్టివాడో తెలియుట కొరకే. దేనినైనా తగులుకొంటే అది వియోగం కొరకే సుమా. బాధపడుట పూర్వకర్మ అనుభవించుట కొరకే. చిగురించినది కొమ్మగా మారుట కొరకే. భయపడుట పాపము నుండి దూరంగా వుండుట కొరకే. ఇహలోకంలో చేసేదంతా పరలోకంలో అనుభవించటానికే ఆ పరలోకంలో వుండటం కూడా మళ్ళీ ఇక్కడ పుట్టడానికే ఇహపరలోకాలలో ఈ చక్రభ్రమణం అంతా చిట్టచివరకు శ్రీవేంకటేశ్వరుని చేరుట కొరకే అంటు అన్నమయ్య కీర్తించాడు.
🕉🌞🌏🌙🌟🚩
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
01-06-2020
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 11-4
సంపుటము: 1-70.
తలఁచినవిన్నియుఁ దనకొరకేఁ వెలిఁ
దెలియుట దనలోఁ దెలియుట కొరకే !!
॥పల్లవి॥
ఉదయమందుట భవముడుగుట కొరకే
చదువుట మేలువిచారించు కొరకే
బ్రదుకుట పురుషార్ధపరుఁడౌట కొరకే
యెదిరిఁ గనుట తన్నెఱుఁగుట కొరకే !!
॥తలఁచి॥
తగులుట విడివడఁదలఁచుట కొరకే
నొగులుట కర్మమునుభవించు కొరకే
చిగురౌట కొమ్మయి చెలఁగుట కొరకే
బెగడుట దురితము పెడఁబాయు కొరకే !!
॥తలఁచి॥
యీవలఁ జేయుట ఆవలి కొరకే
ఆవలనుండుట యీవలఁ కొరకే
యీవలనావల నెనయఁ దిరుగుటెల్ల
శ్రీవేంకటేశ్వరుఁ జేరుట కొరకే !!
॥తలఁచి॥
🕉🌞🌎🌙🌟🚩
కీర్తనలో అర్ధాలు:
------------------------
ఉదయమందుట = పుట్టుట
భవముడుగుట = పుట్టుక లేకుండుట
యెదిరి = ఎదుట వారిని
నొగులుట = బాధపడుట
బెగడుట = భయపడుట
చిగురౌట = చిగురించినది
భావామృతం
____

🕉🌞🌎🌙🌟
31-05-2020
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
ll పల్లవి ll
జో జో యని మీరు జోల పాడరో సాజపు జయంతి నేడె సఫల మిందరికి !!
ll చరణం ll
అదె చంద్రోదయమాయ హరి యవతారమoదె
మొదలు జాతకర్మములు సేయరో
అదన పుత్రోత్సవమట పుణ్యాహము చేసి
కదిసి యిట్టె నామకరణము జేయరో !!
ll చరణం ll
కాయము దేవకి కిచ్చి గక్కన వాసుదేవుని-
కీయరో గంధాక్షత లిటు విడేలు
కాయకపుగాడిదెకు కవణము వెట్టి మరి
వీయపుచుట్టాలెల్ల వీడువెట్టరో !!
ll చరణం ll
షోడశోపచారములఁ జొక్కించి శ్రీవేంకటేశుఁ
బాడరో ధర్మము నిల్పె భారమణచె
వోడించె కౌరవదానముల కంసాదుల జంపె
ఆడనే పాండవులఁ గాచెననియర్ఘ్యమియ్యరో !!

Comments
Post a Comment