కల్పన బతుకు బండి (రోజువారీ చిన్న కథ) (1)
🧘♂️క్రమ-విచారణ🧘♀️ 1. కర్మ బంధము సంగత్వము ఉన్నవారికే, 2. సంగత్వము ఆశ, ఆసక్తి ఉన్నవారికే, 3. ఆశ , ఆసక్తి వలన సుఖ దుఃఖ రూప కర్మ ఫలము అనుభూతమగును. 4. మూడుగుణాల విషమత్వము వలననే ద్వంద్వానుభవము కలుగును. 5. మూడుగుణాలు సమత్వముననున్న కలిగేది ఆత్మ జ్ఞానము. 6. మూడుగుణాల విషమత్వముచే పంచ విషయములు సుఖస్వరూపమని భ్రాంతి జ్ఞానము కలుగుతుంది. 7. మూడుగుణాలు - పంచభూతాలు - పంచ ఇంద్రియాలు - పంచవిషయాలు - అజ్ఞానము - అవిద్య - కామము - మోహము - కర్మము - అహంకారము కలిపి 24 కర్మచక్రము అనుభవమునకు వచ్చినట్లగుపడి మాయయనబడును. 8. నేను బ్రహ్మముననెడు దివ్యాహమే మాయగా వ్యక్తీకరణై నామరూపాత్మకముగా అనుభూతమగుచున్న ఆభాస. 9. నిష్కామకర్మ - తీవ్ర వైరాగ్యము - తత్వజిజ్ఞాస - తీవ్రముముక్షత్వము కలవారికి మాత్రమే స్వరూపజ్ఞానము సాధన సాధ్యము. 10. సాధన చతుష్టయము - చతుర్విధ శుశ్రూషలు - మహావాక్య చతుష్టయము - ఆత్మ చతుష్టయ నిరూపణ - అత్యాశ్రమిగా జీవనము కలవారికి స్వరూప జ్ఞానము సిద్ధ వస్తువు. 11. సర్వత్ర ఉన్నది బ్రహ్మమనెడి నిర్ణయమే పైవాటికి పరిష్కారము. 12. పరము - బాహ్యము - పరాత్పరము - పరబాహ్యము ఉన్నదున్నట్లున్నది - పైన చేయబడిన ఏకాదశ నిర్ణయములనట్టిన...