159 - మంద్రగీత🌷
17. కర్మలు కూడా త్రిగుణ భేదముచే మూడు విధములు. శాస్త్ర నియమము కలిగి తన అభిలాష అంటక, ఆచరించుటలో దేనియందును రాగ ద్వేషములు లేక, ఫలాపేక్ష లేక చేయబడు ఏ పనియైనను సాత్విక కర్మ.
8. ఒక కోరికచే ప్రేరేపించబడినది, లేక అహంకారముచే ప్రేరేపించబడినది అగు కర్మ రాజస ప్రకృతి కలది. ఇందు పట్టుదలకై మిక్కిలి ప్రయాస, వ్యయాదులును ఉండును.
19. బంధనము మున్నగు స్థితులకు, వినాశనమునకు, హింసకు లెక్కచేయక జీవుని శక్తి వ్యర్ధము చెందు కర్మలు మోహద్యావేశములచే సంకల్పితములగును. అవి తామస కర్మలు.
20. ఇట్లే కర్త కూడా మూడు విధములు. సంగము లేనివాడు, నేను చేసితినని తలపనివాడు, కార్యసిద్ధి, కార్య భంగముల యందు మార్పు లేనివాడు, ధైర్యోత్సాహములతో కూడినవాడు, సాత్వికకర్త అగుచున్నాడు.
21. ఒకదానియందు అనుకూల బుద్ధి ప్రత్యేకముగా వహించినవాడు, కర్మల ఫలితములయందు ఆసక్తి కలవాడు, హింసకు, అశుచిత్వమునకు అంగీకరించువాడు, తీవ్ర సంతోష దుఃఖములు పొందుచుండువాడు రాజసకర్త అనబడును.
🕉🌞🌎🌙🌟🚩
శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
ఏతస్య వా అక్షరస్య ప్రశాసన ఇతి శ్రుతిః ౹ అన్తః ప్రవిష్టః శాస్తాయం జనానా మితి చ శ్రుతిః ౹౹181౹౹
181. అక్షరుడగు ఈశ్వరుని శాసనముచే సూర్యుడు గ్రహములు సంచరించునని ఒక శ్రుతి చెప్పును. జనులు శరీరములందు ప్రవేశించి ఈశ్వరుడు వారిని శాసించునని మరొక శ్రుతియనును.
బృహదారణ్యక ఉప:3.8.9
తైత్తిరీయ ఆరణ్యకము 3.11.
జగద్యోనిర్భవేదేష ప్రభవాప్యయకృత్త్వతః ౹ ఆవిర్భావ తిరోభావా వుత్పత్తిప్రలయౌ మతౌ ౹౹182౹౹
182. జగత్తును సృష్టించి లయింపజేయును గనుక ఈశ్వరుడు జగత్కారణుడు అనబడుచున్నాడు.
ఆవిర్భావమే సృష్టి, తిరోభావమే (కనిపించక పోవుట)ప్రళయము.
మాండూక్య ఉప.6;
నృసింహ ఉత్తరతాపనీయ ఉప.1;
నృసింహ పూర్వతాపనీయ
ఉప.4.1;
శ్వేతాశ్వర ఉప.5.5, 5.11.
వ్యాఖ్య:- జగత్ర్పళయ సమయమున,ఇపుడు స్పష్టముగా కనిపించిన ఈ ప్రపంచము ఎక్కడకు పోవును?
గొడ్రాలి కొడుకు ఎక్కడ నుండి వచ్చును,ఎక్కడికి పోవును?
గొడ్రాలి కొడుకునకు ఎప్పుడును అస్తిత్వము లేదు.అదే విధముగా ఈ ప్రపంచమునకు ప్రపంచముగా ఎప్పుడును అస్తిత్వము లేదు.
ప్రపంచపు ఉనికి సత్యమని భావించుట వలననే ఈ సామ్యము కలవర పెట్టును.
దీనిని ఆలో చింపుము,
బంగారు కంకణమునందు కంకణత్వమున్నదా,అది కేవలము బంగారము కాదా?
శూన్యత్వముతో సంబంధము లేకుండా ఆకాశమనబడు విషయమున్నదా?
అదే విధముగా అఖండమయిన బ్రహ్మముతో సంబంధము లేకుండా ప్రపంచమను"వస్తువు"లేదు.
చల్లదనము మంచుగడ్డనుండి విడదీయరానిదిగా ఉన్నట్లే ప్రపంచమనబడునది కూడ బ్రహ్మమునుండి విడదీయరానిదే.
ఎండమావిలోని నీరు పుట్టదు,నశింపదు.అట్లే ఈ ప్రపంచము అఖండతత్త్వము నుండి వెలువడలేదు,ఇది ఎక్కడకు పోవుట లేదు.
పూర్ణము(అనంతము)నుండి పూర్ణము ఆవిర్భవించును,అదియు పూర్ణముగానే ఉండును.కావున విశ్వము గూడ ఆ అనంతము వంటిదే.
మనస్సునుండి ఆలోచనలను ఇంధనమును ఉపసంహరించుట వలన వ్యక్తి భావన నశించినపుడు ఉన్నదే అనంతము.
నిద్ర కానీ జడము కానీ కానిది అనంతము.
పూర్వజగత్ర్పళయము జరిగినపుడు,పూర్వమున్నట్లు అగుపించినదంతయు అదృశ్యమయినది.అపుడు
"అనంతము"మాత్రమే ఉన్నది,
అది శూన్యత్వముగానీ రూపముగానీ కాదు.దృష్టిగానీ దృశ్యముగానీ కాదు,అది ఉన్నదనిగానీ లేదనిగానీ ఎవ్వడును చెప్పజాలకపోయెను.
దానికి చెవులుగానీ,కనులుగానీ, నాలుకగానీ లేవు.అయినను అది వినును,చూచును,తినును.దానికి కారణము లేదు.
ప్రజ్ఞా(ఆలోచనా)రహితదశలో అనంతము వలన జ్ఞానము,జ్ఞాత,జ్ఞేయము ఏకముగా నుండును.
స్రష్ట లేడు,అయినను తరంగములకు జలము కారణమయినట్లే అది ప్రతి విషయమునకును కారణము.
ఈ అనంతమయిన
"శాశ్వత జ్యోతి" అందరి హృదయములో నున్నది.
**
*||శ్రీమన్నారాయణీయము|| అష్టమ స్కంధము
28వ దశకము - లక్ష్మీస్వయంవరము వర్ణనము
28-5-శ్లోకము*
🕉🌞🌎🌙🌟🚩
అభిషేక జలానుపాతి ముగ్ధత్వదపాంగైరవ భూషితాంగవల్లీమ్।
మణికుండలపీతచేలహారప్రఖైస్తామమరదయో౾న్వ భూషన్॥
భావము:-
నారాయణమూర్తీ! ఋషులట్లు లక్ష్మీదేవిని అభిషేకించుచుండగా, నీవు నీ ముగ్ధమనోహర వీక్షణములను ఆమెపై ప్రసరింపజేసితివి. దేవాంగనలు - పూలతీగనుబోలిన శరీరము కలిగిన ఆ లక్ష్మీదేవిని - మణికుండలములతోను, కంఠహారములతోను మరియు పీతాంబరముతోను అలంకరించిరి.
వ్యాఖ్య:-
లక్ష్మీదేవి అంటే శ్రీ, శోభ, కాంతి, శుభం, సకల విద్యలు, అమృతం, సంపద. విశ్వమంతా లక్ష్మిమయమే. విద్య, సర్వభూతహిత ప్రద, శ్రద్ధ, లోకాశోక వినాశిని, ధర్మనిలయ, కరుణ, శుభప్రద, ధనధాన్యకరి, విద్య, సర్వోపద్రవవారిణి వంటి నామాలతో ఆ తల్లి స్తుతించబడింది.
శాంతం, సహనం, దయ మొదలైన సద్గుణాల స్వరూపమే శ్రీలక్ష్మీదేవి. బాహ్యాభ్యంతర శుచి ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. అంటే శుచిత్వాన్ని పాటిస్తూ నిర్మలమైన హృదయంతో ఆరాధించాలి.
‘లక్ష్యతే లక్ష్మీః’’- అని లక్ష్యాన్ని కలిగివుంటే లక్ష్మికూడా వుంటుంది. నిర్లక్ష్యం కూడదు. లక్ష్మీదేవి సిరిసంపదలకు, అదృష్టానికి హేతువు. పద్మోద్భవ,. పద్మముఖి అయిన లక్ష్మీదేవి రెండు చేతులలోను పద్మాలను ధరించి వుంటుంది.
పద్మాలు స్వచ్ఛతకు, పరిపూర్ణతకు, సంతానోత్పత్తికి ప్రతీకలు, మనస్సును, శరీరంలోని షడ్చక్రాలను కూడా సూచిస్తాయి. లక్ష్మీదేవికి రెండువైపులా వుండే ఏనుగులు విజ్ఞానానికీ, రాజరికానికీ చిహ్నాలు, అటువంటి మంగళ స్వరూపిణి అయిన వరలక్ష్మీదేవిని పూజించడం ద్వారా సకల సంపత్తులతోపాటు సద్గుణ సంపత్తికూడా సమకూరుతుంది.
‘హరికిం బట్టపుదేవి,పున్నెముల ప్రోవర్థలపు బెన్నిక్క, చం
దురు తోబుట్టువు భారతీ గిరిసుతల్ తోనాడు పూబోడి తా
మరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా
సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్యకళ్యాణముల్-’’అని శ్రీ మద్భాగవతంలో పోతన లక్ష్మీదేవిని కీర్తించాడు.
శ్రీమహావిష్ణువునకు పట్టపుదేవి, పుణ్యముల రాశి, ధన సంపదకు స్థానము, చంద్రుని తోబుట్టువు, పార్వతీ సరస్వతులతో కలిసి ఆడెడు సుందరి, పద్మము లందుండెడి ఆమె, లోకములు పూజించు తల్లి, దరిద్రతను పోగొట్టుదేవి, లక్ష్మీదేవి ఎల్లవేళలా శుభముల నిచ్చుగాక! -అనే పోతన ప్రార్థనతో భక్తులందరిచేత ప్రార్థింపబడుతోంది శ్రీ వరలక్ష్మీదేవి.
🕉🌞🌎🌙🌟🚩
[10-వేదములు📚((((((((((🕉)))))))))) ఆచార్య వాణి🧘♂️
7. చతుర్వేదములు
((((((((((🕉))))))))))
''అనన్తావై వేదాః'' (వేదాలు అనంతం) - కాని ఆ అనంతమైన వేదాల నుండి కొన్ని మంత్రాలనే ఋషులు గ్రహించ గలిగారు. ఇహపర సౌఖ్యానికీ, ముక్తికీ,లోకకళ్యాణానికీ ఇవి చాలు. వేదాలు నాలుగంటూ మనమనుకొన్నా ఈ నాలుగింటికే భిన్నమైన పాఠాలూ,భిన్నరీతులలో పఠించే పద్ధతులూ ఉన్నాయి. వీటిని పాఠాంతరాలంటారు. ఒక్కొక్క పఠనాపద్ధతినీ, పరిష్కృతపాఠాన్ని ''శాఖ'' అంటారు. వేదమనే వృక్షానికి శాఖలన్నమాట యివి. వేదం శాఖక్షపశాఖలు గల మహా వట వృక్షం వంటిది. అసంఖ్యాకమైన శాఖలున్నా వాటిలో కొన్నింటిని మాత్రం కలిపి నాలుగు శాఖలుగా వర్గీకరించారు.
ఇవి ఋక్, యజుః, సామ, అధర్వ - వీటినే ఋగ్వేదము, యజుర్వేదమూ ఇత్యాది అంటారు. ఇవి ఆయా సమూహాల ప్రాముఖ్యతను సూచిస్తాయి. ఆధునిక పరిశోధకుల ఉద్దేశంలో, ఋగ్వేదం, యజుర్వేదం కంటె ప్రాచీనం. కాని మన శాస్త్రాల ప్రకారం, మన విశ్వాసానుసారం, వేటికీ కాలమానంలో ఆది అంటూ ఏమీ లేదు. సృష్ట్యాదికే వేదాలు లభ్యాలు కావటం వల్ల! ''ఈ వేదం ముందు, ఆ వేదం తరువాత'' అంటూ చెప్పే పరిశోధకుల మాటలు విశ్వసనీయాలు కావు - అట్లాగే, వేదభాగాలైన సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యకాలు ఏ క్రమంలో వచ్చాయో చెప్పే ''పరిశోధకులూ'' పొరబడ్డారు.
ఋషులు కాలాతీతులై, త్రికాలజ్ఞులైన తరువాతనే వేదాలని గ్రహించి మనకివ్వ గలిగారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టు కొంటే, కాలమానంలో వేదాల గురించీ, వాటి క్రమం గురించీ వేసే అంచనాలు అనుచితమని తెలుస్తుంది. ఆయా ఋషులు అలౌకిక చేతనా స్థితిని బట్టి వారికి కలిగిన వేదమంత్రాల గ్రహింపు మారియుండవచ్చు అంతే. అసలు, ఋగ్వేదంలోనే యజుర్వేదానికీ, సామవేదానికీ సంబంధించిన ప్రస్తావనలున్నాయి. ఇతర వేదాల ప్రస్తావన గల పురుషసూక్తం, ఋగ్వేదం తొంభైయవ ఋక్ సమూహం పదవమండలులో ఉంది. దీనిబట్టే తెలుస్తుంది, కొన్ని వేదాలు ముందూ, మరి కొన్ని వెనుకా కావని. ప్రతి శాఖలోనూ మూడు భాగాలుంటాయి. ఇవి సంహిత,బ్రాహ్మణము, ఆరణ్యకము. ఇది కూడ ఒక విధమైన వర్గీకరణమే. ''వేద అధ్యయనం'' అని మనమన్నప్పుడు సాధారణంగా సూచింపబడేది ''సంహిత'' భాగ పఠనమే. ''సంహిత'' వేదశాఖకి మూలమూ, జీవమూ అవటమే దీనికి కారణం. 'సంహిత' అంటే సంకలింప బడి, ఒక క్రమంలో ఏర్పచబడినది అని అర్థం. ఏ సంహితైనా, ఆ వేదంయొక్క అంతరార్థాన్ని మంత్రాల ద్వారా తెల్పుతుంది.
ఋగ్వేదము: ఋగ్వేద సంహిత అంతా పద్యరూపం. వీటిని ప్రథమంలో ఋక్కులనే వారు. తరువాతి కాలంలో శ్లోకమనటం ప్రారంభించారు. వివిధ దేవతలను స్తుతిస్తాయివి. ఒక్కొక్క ఋక్కూ ఒక్కొక్క మంత్రం.కొన్ని ఋక్కుల సమూహాన్ని సూక్తమంటారు. ఋక్ సంహితలో 10, 170 ఋక్కులున్నాయి. నాలుగు వేదాల సంహితలలోనూ 20,500 మంత్రాలున్నాయి. ఋగ్వేదంలో 1028 సూక్తాలున్నాయి (ఋక్కుల సమూహాలు) వీటిని పది మండలాలూ, ఎనిమిది అష్టకాలుగా వర్గీకరించారు. అగ్నిపై సూక్తంతో ప్రారంభించి దానితోనే ఆఖరవుతుంది. వేదాలన్నిటిలోనూ ఋగ్వేదంలోనే దేవతాస్తోత్రాలధికంగా ఉంటాయి. ఆరంభంలోనూ (ఉపక్రమంలోను) అంతంలోను (ఉపసంహారంలోను) అగ్ని దేవుని స్తుతి ఉండటం వల్ల ఆ వేదం యొక్క ఉద్దేశం అగ్నిని పూజించటమే అనుకొంటారు కొందరు. కాని 'అగ్ని' అంటే ఆత్మ చైతన్యం, ఆత్మ మేల్కొనేప్పుడు కలిగే తేజస్సు అని భావించటం మంచిది.
ఋగ్వేదంలోని ఆఖరి సూక్తం అగ్నికి సంబంధించినదే అయినా, అందరి శ్రేయస్సునూ కోరే శ్లోకాలున్నాయి అందులో. ''అందరూ కలిసి ఏకమానసులై ఆలోచింతురు గాక. అందరి హృదయాలూ ప్రేమతో బంధింపబడుగాక. అందరికీ ఒకే లక్ష్యముండుగాక. అందరూ ఏకొన్ముఖులై సంతుష్టులగుదురు గాక'' - ఈ వాక్యాలతో ఋగ్వేదము సమాప్తమవుతుంది. సకల దేవతాస్తోత్రాలు కలిగి యుండటమే ఋగ్వేదపు విశిష్టత. సామాజిక వర్తనమెట్లా ఉండాలో మిగిలిన వాటన్నిటి కంటె ఉత్తమంగా చెప్తుంది : అందువల్లనే విజ్ఞులు దానిని ఆరాధిస్తారు.
ఉదాహరణకి : పెళ్ళికి సంబంధించిన కర్మలు సూర్యుని కుమార్తె యొక్క వివాహము ననుసరించి నిర్దేశింపబడ్డాయి.
ఊర్వశీపురూరవుల సంభాషణల వంటి విశేష సన్నివేశాలు కూడ ఋగ్వేదంలో ఉన్నాయి. తరువాతి కాలంలో కాళిదాసు వంటి మహాకవులు వీటినే విస్తరించారు. ఋగ్వేదంలో, ఉషస్సునుద్దేశించిన భాగాలను రసజ్ఞులు మహోన్నతమైన పద్యకావ్యాలుగా శ్లాఘిస్తారు. వేదాలన్నిటిలోనూ అగ్రస్థానం ఋగ్వేదానికి కలగటానికి ఏదో కారణముండి ఉండాలి. ఋగ్వేదంలో ఋక్కులు నాద భరితమయిన సామవేద మంత్రములకు మాతృకలవంటివి. ''ఋచ్యధ్యూఢం సామ''.
…
. శ్రీ శివ మహా పురాణము - 353 🌹
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
91. అధ్యాయము - 03
🌻. దేవీస్తుతి - 1 🌻
నారదడిట్లు పలికెను-
ఓ బ్రహ్మా ! నీవు ప్రాజ్ఞుడువు, మహాధీమంతుడవు. వక్తలలో శ్రేష్ఠుడవు. విష్ణువు సద్గురువుగా గలవాడవు. తరువాత జరిగిన వృత్తాంతమును నాకు చెప్పుము(1) శుభకరము, అద్భుతము అగు ఈ మేనకా పూర్వచరిత్రను చెప్పి యుంటిని ఆమె వివామమును గురించి కూడ వింటిని. తరువాత చరితమును చెప్పుము(2) ఆ హిమవంతుడు మేనను వివాహమాడిన పిదప ఏమి చేసెను? ఆమె యందు జగన్మాత యగు పార్వతి జన్మించి వృత్తాంతమెట్టిది?(3) తరువాత ఆమె దుష్కరమగు తపస్సును చేసి శివుని పొందిన తీరు ఎట్టిది? శివుని యశస్సును వర్ణించే ఈ వృత్తాంము నంతనూ విస్తరముగా చెప్పుము(4)
బ్రహ్మ ఇట్లు పలికెను
ఓ మహర్షీ! శంకరుని శుభకరమగు పుణ్యకీర్తిని మిక్కిలి ప్…
భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 237 🌹
🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 1 🌻
1. ఒకచోట పురాణం మనకు ఏమి చెప్పిందంటే, మనమంతా బ్రహ్మదేవుడి సంతానం కాదు, బ్రహ్మలమే అని చెపుతున్నది. బ్రహ్మ అపరిమితమైన కర్మ అనేక పూర్వకల్పములలో చేసివున్నాడు. అన్ని జీవులూ అతడే కబట్టి, కర్మలోకాలను సృష్టించినవాడు అతడే కబట్టి, ఇన్ని కోట్ల జీవరాశులలో అతడే పుడుతున్నాడని అర్థం.
2. యాజ్ఞవల్క్యుడుని తన తండ్రి వైశంపాయనుడి దగ్గరికి తీసుకెళ్ళి అప్పగించాడు. వైశంపాయనుడు ఆ పిల్లవాణ్ణి, అతడి లక్షణాలను చూచి తన శిష్యుల్లో అత్యుత్తముడు అతడే కాబోతున్నాడు అని గ్రహించి అతడి శిష్యరికాన్ని అంగీకరించాడు.
3. అప్పటి నుంచీ వైశంపాయనుడు దగ్గర యజుర్వేదమును సహాధ్యాయులైన మునిపుత్రులల్తో కలిసి నేర్చుకున్నాడు. యాజ్ఞవల్క్యుడు సత్వగుణ సంపన్నుడయ్యాడు. అతడిలో సాత్వికాహంకారము ఒకటి వచ్చిది.
4. సాత్వికగర్వము తను పరమ సాత్వికుడనని, ప్రథమజ్ఞానినని, తనకు ఆగ్రహమేలేదని ఇలాంటివి అనుకునేవాడు. అదో గర్వం. తరువాత వైశంపాయనుడి ఆగ్రహనికిగురై నేర్చుకున్నవిద్యలన్నీ విసర్జించి వెళ్ళిపోమన్నాడు. యాజ్ఞవల్క్యుడు నేర్చుకున్న విద్యనంతా శరీరంలోని రక్తం రూపంలో విసర్జించాడు.
5. ఆయన వమనం చేసిన రక్తం రూపంలో ఉన్న వేద విద్యనంతా తిత్తిరి పక్షులు తిన్నాయి. అది మళ్ళీ వాటిచేత చెప్పబడటం చేత దానిని ‘తైత్తిరీయం’ అని అన్నారు. ఆ పక్షులు వాటిని మళ్ళీ విసర్జించాయి పక్షి పలుకుల రూపంలో! అదే ‘తైత్తిరీయ ఉపనిషత్తుగా’గా ప్రసిద్ధిచెందింది.
6. అలా తైత్తిరీయోపనిషత్తు ఏర్పడింది, తైత్తిరీయశాఖ ఏర్పడింది. తాత్తిరీయ బ్రాహ్మణకూడా అలాగే వచ్చింది. తరువాత యాజ్ఞవల్క్యుడు తపస్సుచేసి సూర్యుణ్ణి ఆరాధించాడు. ఆయన అనుగ్రంతో శుక్లయజుర్వేదాన్ని పొందాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 176 🌹
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 14 🌻
అవతార పురుషుడు లేని కాలము
670. అవతారయుగము కానికాలమందు ఈ పంచ సద్గురువులు లోక వ్యవహారములు (విశ్వపరిస్థితులను) సమిష్టిగా చూచుచుందురు. వారిలో ఒకరు మాత్రము సమస్త పరిస్థితులను అదుపునందుంచుట యందును, పాలించుట యందును బాధ్యుడై యుండును. వీనిని కుతుబ్-ఏ - ఇర్షాద్ అందురు.
671. దివ్యశాసనము ప్రకారము ఎల్లకాలమందును ఆ యుగాంత్యమందు భగవంతుడు మానవరూపములో పురుషునిగా ఈ భూమిపై అవతరించుటకు ఐదుగురు సద్గురువులు కారణ భూతులగుదురు.
అవతారము :-
672. పరమాత్మా (B) స్థితిలోనున్న అనంతచైతన్యమే, సరాసరి మాయాసృస్టిలో, మానవరూపములో అభివ్యక్తమగును. ఇతడే సర్వోన్నతుడైన పురాణ పురుషుడు, అవతారపురుషుడు (సర్వాతశాయి), స్వాతంత్య్రసత్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ దుర్గాసప్తశతి🕉️🕉️
ప్రథమాధ్యాయము 19.2.2021
ఓం నమశ్చండికాయై
తస్థౌ కంచిత్స కాలం చ మునినా తేన సత్కృతః|
ఇతశ్చేతశ్చ విచరంస్తస్మిన్మునివరాశ్రమే|011|
సురథుడా మునిచే సత్కరింపబడి, ఆ యాశ్రయమమున ఇటునటు విహరించుచు కొంతకాలముండెను.
సోఽచింతయత్తదా తత్ర మమత్వాకృష్టచేతనః|
మమత్పూర్వైః పాలితం పూర్వం మయా హీనం పురం హి తత్|012॥
అతడచ్చట మమకారమునకు లోనై ఇట్లు తలంచెను.
మద్భృత్యైస్తైరసద్వృత్తైర్ధర్మతః పాల్యతే న వా|
న జానే స ప్రధానో మే శూరహస్తీ సదామదః|013॥
నా పూర్వులేలిన నా పట్టణమునకు నేను వెలి అయితిని. దుస్వభావులు నా భృత్యులు. దానిని న్యాయముగా పాలింతురో లేదో.
మమ వైరివశం యాతః కాన్ భోగానుపలస్స్యతే|
యే మమానుగతా నిత్యం ప్రసాదధనభోజనైః|014|
నా పట్టపుటేనుగు ఎప్పుడు మదించి యుండునది. వైరుల వశమై ఏమి సుఖములనుభవించునో?
అనువృత్తిం ధ్రువం తేఽద్యకుర్వంత్యన్యమహీభృతామ్|
అసమృగ్వ్యయశీలైస్తైః కుర్వద్భిః సతతం వ్యయమ్|015|
నా దయకు పాత్రులై నిత్యము ధనభోజనములతో నన్ననునరించువారు పరులసేవలకు పాటుపడిరి.
సంచితః సోఽతిదుఃఖేన క్షయం కోశో గమిష్యతి|
ఏతచ్చాన్యచ్చ సతతం చింతయామాస పార్థివః|016॥
పెక్కు శ్రమలకు గుఱియై కూర్చిన నా భండారము దుర్వ్యయశీలుర వలన తరిగి నశించిపోవును.
తత్ర విప్రాశ్రమాభ్యాసే వైశ్యమేకం దదర్శ సః|
స పృష్టస్తేన కస్త్వం భో హేతుశ్చాగమనేఽత్రకః|017॥
మరియు అనేక విధములుగా చింతించుచున్న ఆ రాజునకు ఆ యాశ్రమ ప్రాంతమున ఒక వైశ్యుడగుపడెను.
సశోక ఇవ కస్మాత్త్వం దుర్మనా ఇవ లక్ష్యసే|
ఇత్యాకర్ణ్య వచస్తస్య భూపతేః ప్రణయోదితమ్|018|
రాజు అతనిని 'నీవెవరు? ఇచటకేల వచ్చితివి? మనసు కలతపడి దుఃఖించుచున్నట్లున్నావు కారణమేమి?' యని అడిగెను.
(తరువాయి వచ్చేవారం)
💐💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సు058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
247వ నామ మంత్రము 20.02.2021
ఓం పద్మనయనాయై నమః
పద్మములవంటి, సుకుమారములైన , విశాలములైన నేత్రములతో విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి పద్మనయనా యను అయిదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం పద్మనయనాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ కరుణా తరంగితాక్షియైన జగన్మాత వారిని అత్యంతవినయసౌశీల్యులు గాను, భగవద్భక్తిప్రపూరిత హృదయులుగాను ప్రవర్తింపజేయును బ్రహ్మానందమయ జీవనమును ప్రసాదించును.
వ్యాసులవారు, కాళిదాసాది మహాకవులు జగన్మాత యొక్క సౌందర్య సంపదను విశేషంగా వర్ణించి తరించారు.
అమ్మవారి నేత్రాలను శంకరభగవత్పాదులవారు సౌందర్యలహరిలోని శ్లోకాలలో ఇలా వర్ణించారు.
దేవి కుడికన్ను సూర్యునివలె పగటిని, ఎడమకన్ను చంద్రునివలె రాత్రిని చేయుచున్నవి. మూడవ నేత్రము సంధ్యా…
: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
248వ నామ మంత్రము 21.02.2021
ఓం పద్మరాగ సమప్రభాయై నమః
పద్మరాగ మాణిక్యముతో సమానమైన శరీర కాంతిగల లలితాంబకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి పద్మరాగసమప్రభా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం పద్మరాగ సమప్రభాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు సాధకులకు ఈ పరమేశ్వరి నామ మంత్ర జపముతో జన్మజన్మాంతర కర్మఫలములు తొలగి, కైవల్యపదమునకు మార్గము గోచరించును.
పరమేశ్వరి పద్మరాగ మణులనుబోలిన ఎర్రని కాంతి గల దేహముతో ప్రభాసిల్లుతున్నది. ఇంతకు ముందు పదునాలుగవ (14వ) నామ మంత్రములో అమ్మవారు కురువిందమణి శ్రేణీ కనత్కోటీర మండితా (పద్మరాగమణులు పొదగబడిన కిరీటశోభతో ప్రభాసిల్లుచున్నది) యని స్తోత్రము చేయబడినది. అలాగే " పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః (పద్మరాగ శిలలను, అద్దాన్ని సైతం తిరస్కరించే నున్ననైన, నిర్మలమైన చెక్కిలి గలది జగన్మాత" యని ఇరువదియవ (20వ) నామ మంత్రములో స్తుతింపబడినది.
ఈ పద్మరాగమణులు సింహళదేశంలో దొరకునని అంటారు.
****
[06:12, 19/02/2021] +91 95058 13235:
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
246వ నామ మంత్రము 19.02.2021
ఓం పార్వత్యై నమః
పర్వతరాజు (హిమవంతుని) పుత్రిక యగుటచే పార్వతీ యను నామముతో విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి పార్వతీ యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం పార్వత్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని మనసులో భక్తిప్రపత్తులతో ధ్యానించుచూ ఎట్టి సత్కార్యములనాచరించ సంకల్పించుకొనినను తప్పక శుభప్రదమైనవిగాను నెరవేరును.
దక్షుని కుమార్తె అయిన సతీదేవి (దాక్షాయణి) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి తల్లడిల్లి ఆమె అగ్నిలో ఆహుతి అయినది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది.
పర్వతరాజు అయిన హిమవంతుని కూతురు గనుక జగన్మాతకు పార్వతి యని నామము గలిగినది.
హిమవంతుని కుమార్తె గనుక హైమావతి అను పేరుకూడా గలదు. ఈ బాలిక పెద్దదికాగానే, తాను పరమశివుణ్ణి తప్ప అన్యులను వివాహమాడనని సంకల్పించుకుని తపస్సు చేయడానికి అరణ్యములకు వెళ్ళింది. వివిధ రీతులలో, కఠోరమైన తపస్సు కొనసాగించినది. మహాతాపాన్ని కలిగిస్తున్న ఎండవేళ చుట్టూ నాలుగు అగ్నులు, ఆకాశంలో మండుతున్న సూర్యగోళం, ఆ వేడికి ఎర్రబడి మండుతున్న బండరాయి - ఇవన్నీ నిలువ సాధ్యం కాని పరితాపాన్ని కలిగించే పరిస్థితులు. మనకి ఊహించుకుంటేనే భయం వేసే ఈ సన్నివేశంలో ఆ హైమవతి తపస్సుచేసినది.
హేమంతశిశిరాల్లో (శీతాకాలంలో) ఆ ఉమ నిరాహారిణి అయి, నిత్యమూ మెడలోతు నీటిలో నిలబడి తపస్సు కొనసాగించింది.
హోరున వర్షం, కొన్నిసార్లు తల పగిలే వడగళ్ళు పడుతున్నప్పుడు కూడా పరమేశ్వరుని తనవాడిగా చేసుకోవడానికి దృఢదీక్షతో తపస్సు కొనసాగించినది.
కొంతకాలం ఒకపూట మాత్రం భోజనం చేస్తూ తపస్సు చేసినది.
మరికొంతకాలం భూమిపై (కటికనేలపై) పరుండినది.
కొంతకాలం ఆహారంగా కాయలు, పళ్ళు తింటూ తపస్సు చేసినది.
కొంతకాలం కేవలం ఆకులు మత్రమే తిని తపస్సుచేసినది.
పరమశివునికి కనికరం కలగక పోవడంతో ఏదైనా ఆహారం మాట అటుంచి ఇంతకు ముందు ఆకులు (పర్ణములు) తినేది కాస్తా ఆ ఆకులు కూడా తినకుండా తపస్సు మరింత కఠోరం చేయడంతో ఆమె అపర్ణ అను సార్థకనామధేయముతో విరాజిల్లినది.
చివరకు పరమశివుని చేపట్టి ఆయనదేహంలో సగం తన సొంతంజేసుకుని అర్థనారీశ్వరతత్త్వానికి ప్రతీకగా నిలచినది.
తలపై గంగ ఉన్నా, ఆ గంగను తలదన్నే ప్రేమతో పరమశివుని దేహంలో సగం దేహమై విరాజిల్లినది.
ఎవరో (భగీరథుడు) పిలిచారు. ఎవరికోసమో (సగరచక్రవర్తి కుమారుల శాపవిమోచనార్థమై) పోతూ మధ్యలో మజిలీ వేసిందిగాని సవతిగా కాదని వాదించిన మహా గడసరి పార్వతి.
పర్వత రాజ కుమార్తె గనుక పార్వతి అని ఆమె పిలువబడింది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం పార్వత్యై నమః అని యనవలెను
: శ్రీ ఆదిత్య కవచం
🕉🌞🌏🌙🌟🚩
ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది నాలుగవ అధ్యాయము
బలరామకృష్ణులు చాణూరముష్టికాది మల్లులను, కంసుని సంహరించుట దేవకీవసుదేవులకు బంధవిముక్తి కలిగించుట
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
శ్రీశుకుడు పలికెను పరీక్షిన్మహారాజా! ఈ విధముగా కృష్ణపరమాత్మ చాణూరాది మల్లయోధులను వధించుటకు సంకల్పించుకొనెను. అంతట ఆ ప్రభువు చాణూరినితోను, బలరాముడు ముష్టికునితోడను ద్వంద్వయుద్ధము చేయుటకు సర్వసన్నద్ధులై వారిని సమీపించిరి.
అనంతరము వారు చేతులతో చేతులను పట్టుకొని, పాదములకు పాదములను అడ్డముగా నిలిపి, పరస్పర జయేచ్ఛతో ఒకరినొకరు తమవైపునకు లాగికొనసాగిరి.
ఇంకను వారు పరస్పరము పెనవైచుకొనుచు, మోచేతులపై మోచేతులతోను, మోకాళ్ళపై మోకాళ్ళతోను, శిరస్సులను శిరస్సులతోను, వక్షస్థలములను వక్షస్థలములతోను మోదుకొనుచు ఒకరిపైనొకరు దెబ్బతీయదొడంగిరి.
పరిభ్రమణము (ప్రత్యర్థిని చేతులతో పట్టుకొని చుట్టును గిరగిర త్రిప్పుట), విక్షేపము (దూరమునకు నెట్టివేయుట), పరిరంభణము (బాహువులతో అదిమిపట్టి పీడించుట), అవపాతము (క్రిందబడవేయుట), ఉత్సర్పణము (విడిచిపెట్టి ముందునకు పరుగెత్తుట), అపసర్పణము (వెనుకకు నడచుట) మొదలగు ప్రక్రియలతో కృష్ణచాణురులు, ముష్టిక బలరాములు ద్వంద్వయుద్ధమును జరిపిరి.
ఇంకను ఉత్థాపనము (పాదములను, మోకాళ్ళను పిండి పిండిగావించి పడద్రోసిలేపుట), ఉన్నయనము (ప్రత్యర్థిని చేతులతో పైకెత్తి తీసికొనిపోవుట), చాలనము (నడుము దగ్గఱ పట్టుకొని త్రోసివేయుట), స్థాపనము (చేతులను, పాదములను ఒకటిగాజేసి పీడించుట) మొదలగు రీతులలో పరస్పర జయేచ్ఛతో వారు పోరాడిరి.
పరీక్షిన్మహారాజా! రంగస్థలము జరుగుచున్న ఆ ద్వంద్వయుద్ధమును గాంచుటకై స్త్రీలు గుంపులు గుంపులుగా అచటికి చేరియుండిరి. బలవంతులైన మల్లయోధులకును, సుకుమారులైన బాలురకును మధ్య 'ఇట్లు బలహీనులకు బలవంతులతో యుద్ధము జరుగుట అన్యాయము' అని నొచ్చుకొనుచు వారు జాలితో తమలో తాము ఇట్లనుకొనిరి.
"రాజసభలోనున్న వీరు అందఱును బలవంతులకును దుర్బలులకును మధ్య నడచుచున్న ఈ ద్వంద్వయుద్ధమును కనులప్పగించి చూచుచుండిరేగాని, ఇట్లు జరుగుట అధర్మము అని పలుకుచు దీనిని నివారింపరైరి. దీనిని ప్రత్యక్షముగా చూచుచున్న రాజుతో పాటు వీరును దీనిని ఆమోదించుచుండిరి.
వజ్రములవలె దృఢమైన అంగములు గలిగి, పర్వతములవలె ఒప్పుచున్న ఈ మల్లుయోధులెక్కడ? ఇంకను యౌవనదశకు చేరక కిశోరావస్థలో సుకుమారులైయున్న ఈ బలరామకృష్ణులెక్కడ? ఈ సమాజము అంతయును (ఇచటివారు అందఱునూ) ఈ విషమయుద్ధమును చూచుచు మిన్నకుండుట ఎంతేని అధర్మము. ఇది ముమ్మాటికిని నిజము. ఇట్లు ఉపేక్ష వహించుట తగదు. దీని వలన పాపములు చుట్టుకొనును. అధర్మము జరుగుచున్న చోట ఒక్క క్షణము గూడ నిలువరాదు. కనుక మనము ఎంతమాత్రమూ ఉండుట తగదు".
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి నలుబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
శ్రీమద్భగవద్గీత - 645 / Bhagavad-Gita - 645 🌹
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 62 🌴
62. తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత |
తత్ప్రాసాదాత్పరాం శాన్తిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ||
🌷. తాత్పర్యం :
ఓ భరతవంశీయుడా! అతనికే సంపూర్ణముగా శరణము నొందుము. అతని కరుణచే పరమశాంతిని, దివ్య శాశ్వతస్థానమును నీవు పొందగలవు.
🌷. భాష్యము :
అనగా ప్రతిజీవుడు ఎల్లరి హృదయములందు స్థితుడై యున్న పరమపురుషుని శరణము నొందవలసియున్నది. అట్టి శరణాగతియే భౌతికస్థితి యందలి సర్వవిధక్లేశముల నుండి అతనిని విముక్తిని చేయగలదు.
ముఖ్య విషయమేమన అట్టి శరణాగతిచే జీవుడు ఈ జన్మపు భౌతికక్లేశముల నుండి విడివడుటయే గాక అంత్యమున శ్రీకృష్ణభగవానుని సైతము చేరగలడు. ఋగ్వేదము (1.22.20) నందు ఆ దివ్యదామము “తద్విష్ణో: పరమం పదమ్” అని వర్ణింపబడినది.
సృష్టియంతయు భగవద్రాజ్యమే గావున భౌతికమైనదంతయు వాస్తవమునకు ఆధ్యాత్మికమే. కాని ఈ వేదమంత్రమందలి “పరమం పదమ్” అనునది మాత్రము ఆధ్యాత్మికజగత్తుగా (వైకుంఠము) పిలువబడు సనాతనధామమును ప్రత్యేకముగా సూచించుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌻 301. యుగావర్తః, युगावर्तः, Yugāvartaḥ 🌻
ఓం యుగావర్తాయ నమః | ॐ युगावर्ताय नमः | OM Yugāvartāya namaḥ
కాలాత్మనా వర్తయతి కృతాదీని యుగాని యః ।
సయుగావర్త ఇత్యుక్తః విద్వద్భిః పురుషోత్తమః ॥
కాలరూపుడుగా కృతయుగాది యుగములను మరల మరల తిరిగివచ్చునట్టు ప్రవర్తిల్లజేయును గావున ఆ పురుషోత్తముడు యుగావర్తః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Source Sloka
युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥
యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ || ౩౩ ||
🍀. మాయ 🍀
108. అవిధ్య లేక మాయ అనునది పరమాత్మ యొక్క వ్యక్తీకరణమే. సత్వ, రజో, తమో గుణాల సమత్వ స్థితి బ్రహ్మము. సమత్వ స్థితి లోపించినప్పుడు మాయ వ్యక్తమవుతుంది. విశ్వ సృష్టికి కారణమైన ఈ మాయ త్రిగుణాతీత స్థితిలో లేదు. త్రిగుణములు సమత్వ స్థితిని కోల్పోయినప్పుడే సృష్టి ఏర్పడినది. అదే ప్రకృతి.
109. మాయ అనేది వ్యక్తము కాదు. అవ్యక్తము కాదు. లేక రెండు లక్షణాలు ఉన్నదికాదు, లేనిదికాదు. లేక కొన్ని లక్షణాలు విడివిడిగా లేక కలసి ఉన్నట్లు భావించ రాదు. ఇది చాలా ఆశ్చర్యకరమైనది. దానిని మాటలతో వర్ణించలేము.
110. మాయను జయించాలంటే కేవలము బ్రహ్మాన్ని తెలుసుకొని ఉండాలి. బ్రహ్మము లాంటిది వేరొకటి లేదు. ఎలా అంటే త్రాడును చూసి పాము అని భ్రమించి అది పాము కాదు తాడని గ్రహించినట్లు; దాని లక్షణాలైన సత్వ, రజో, తమో గుణాలు వానివాని స్వభావాన్ని బట్టి నిర్ణయించబడతాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[05:26, 20/02/2021] +91 98494 71690: 🌹. దేవాపి మహర్షి బోధనలు - 38 🌹
🌻 27. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 2 🌻
నన్ను నేనుద్దరించుకొను ప్రతి కసరత్తు నాకు విసుగు కలిగించెడిది కానీ, పరిష్కారము అందించలేదు. అది ఆదివారము, ఉదయం సమయము. నాకు చర్చికి పోబుద్దికాలేదు. ఇంట్లోని వారందరూ ప్రార్థనలకై చర్చికి వెళ్ళిరి. నేను ముందుగదిలో కూర్చుని నాకు తోచిన గ్రంథమును చదువుకొను చున్నాను.
సింహద్వారము దానికదిగా తెరువబడినది. నాకు ఒళ్ళు గగుర్పొడినచినది. ఎదుటి దృశ్యము చూచి శరీరము దాదాపు కొయ్యబారిపోయినది. సింహద్వారము నుండి ఒక ఆజానుబాహువైన పురుషుడు తలపాగాను, ఐరోపా దుస్తులను ధరించి లోపలికి ప్రవేశించుచున్నాడు.
అతని శరీర సౌష్ఠవము, ముఖము నందలి
వర్చస్సు, అందము నన్ను ముగ్ధను చేసినవి. అతడు నెమ్మదిగా నడచివచ్చి నాప్రక్కనే మృదువుగా కూర్చుండెను. నాకు నోట మాట రాలేదు. తెల్లబోయి చూచుచుంటిని. అతడు మెల్లగా యిట్లనెను.
"ప్రపంచమున నీవలన జరుగవలసిన పనియొకటి యున్నది. అది కారణముగ నీ స్వభావమునందు అత్యద్భుతమైన పరివర్తన మేర్పడగలదు. ప్రస్తుతము నీవు 'నన్నంటబోకు - నా మాలకాకి' అను సామెత చందమున అందరినీ అసహ్యించుకొంటూ, అందరిచే అసహ్యింప బడుచూ దుఃఖితవై యున్నావు.
నీవు చేయు కార్యక్రమమున నీకు ఆత్మనియతి కలుగగలదు. నిన్ను నీవు చక్కగా నియంత్రించుకొన గలిగినచో, ప్రపంచమున కుపయోగపడు దివ్యకారమును నీచే నేను నిర్వర్తింప చేయగలను.
నీ మనోనియంత్రణము పైననే ఈ కార్యము జరుగుట కవకాశముగలదు. అప్పుడే నిన్ను మేము విశ్వసింప గలము."
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[05:26, 20/02/2021] +91 98494 71690: 🌹. మనిషికేనా కుటుంబం? 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
అందుకే వైద్యుడు ఆ పసికందును తలక్రిందులుగా పట్టుకుని పిర్రలపై గట్టిగా కొడతాడు. వెంటనే వాడు ఏడుస్తూ ఊపిరి పీల్చడం ప్రారంభిస్తాడు. భలే ప్రారంభం. భలే స్వాగతం.
మీరు భయపడిన వెంటనే మీ శ్వాస లయ చాలా మారుతుంది. మీ గుండె దడ మీకు వినిపిస్తుంది. కానీ, మీలో ఎలాంటి భయం లేనపుడు మీ శ్వాస చాలా హాయిగా, నిశ్శబ్దంగా సాగుతుంది. దీనిని మీరెప్పుడైనా గమనించారా? ఇంతవరకు గమనించకపోతే ఇపుడు గమనించండి. గాఢమైన ధ్యానంలో ఒక్కొక్కప్పుడు మీ శ్వాస దాదాపు ఆగిపోయినట్లు మీకనిపిస్తుంది. కానీ అది ఆగదు.
పసికందు పుట్టుకే భయంతో ప్రారంభమవుతుంది. తొమ్మిది నెలలపాటు చీకటిలో వున్న ఆ పసికందు కళ్ళు ఎలాంటి వెలుగును, కనీసం కొవ్వొత్తి కాంతిని కూడా చూడలేదు. అందుకే అధునాతన ఆసుపత్రి దీపాల వెలుగులు చూడగానే ఆ కళ్ళు భయపడతాయి. వెంటనే వైద్యుడు ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా మీ తల్లితో మీకున్న అనుసంధానాన్ని కత్తిరించేస్తాడు. దానితో అంతవరకు మీకున్న ఏకైక భద్రత కాస్త పోతుంది. అందుకే మానవ శిశువంత నిస్సహాయ శిశువు ఈ మొత్తం అస్తిత్వంలో ఎక్కడా లేదని కచ్చితంగా చెప్పొచ్చు. అది మీకూ తెలుసు.
అందుకే గుర్రాలు కాల్పనిక దేవుణ్ణి కనుక్కోలేదు. ఏనుగులు దేవుడి గురించి ఎప్పుడూ ఆలోచించవు. ఎందుకంటే, వాటికి ఆ అవసరం లేదు.
అప్పుడే పుట్టిన ఏనుగు పిల్ల వెంటనే లేచి నడుస్తూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చక్కగా పరిశీలిస్తుంది. దానికి మానవ శిశువుకున్నంత నిస్సహాయత లేదు. నిజానికి, మానవ శిశువు నిస్సహాయతపై ఆధారపడిన కుటుంబం, సమాజం, సంస్కృతి, సంప్రదాయాలు, మతాలు, వేదాంతాలను చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది.
ఇలా ప్రతిదీ మానవ శిశువు నిస్సహాయతపైనే ఆధారపడ్డాయి.
జంతువులలో కుటుంబాలుండవు. అందుకు ముఖ్య కారణం వాటి పిల్లలకు తల్లిదండ్రుల అవసరం లేదు. కానీ, మనిషి ఒక నిర్దిష్ట వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. పుట్టిన పిల్లల బాధ్యతను ఆ వ్యవస్థలో తల్లిదండ్రులే స్వీకరించాలి.
ఎందుకంటే, వారి ప్రేమ కలాపాల ఫలితమే పిల్లలు. జంతువుల మాదిరి పిల్లలను గాలికి వదిలేస్తే, వారు జీవిస్తారని మీరనుకోలేరు. అది అసంభవం. ఎందుకంటే, వారికి ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఎవరు పెడతారు? ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? బహుశా, ఆ పసివాడు ‘‘తొందరపడి ముందుగానే ఇక్కడికి వచ్చాడేమో, తల్లిగర్భంలో ఉన్న ఆ తొమ్మిది నెలల కాలం వాడికి సరిపోలేదేమో’’ అనేది కొంతమంది జీవశాస్తజ్ఞ్రుల అభిప్రాయం.
ఎందుకంటే, వాడు చాలా నిస్సహాయుడుగా జన్మించాడు. కానీ, తల్లి శరీరం వాడిని తొమ్మిది నెలలు మించి మొయ్యలేదు. అదే జరిగితే ఆమె మరణిస్తుంది. ఆమెతోపాటు ఆ పసివాడు కూడా మరణిస్తాడు.
ఒకవేళ ఆ పసివాడు తల్లి గర్భంలో కనీసం మూడేళ్లు గడిపి బయటపడితే బహుశా వాడికి తల్లిదండ్రులు, సమాజం, సంస్కృతి, సంప్రదాయాలు, మతాలు, మతాచార్యులు, దేవుళ్ళ అవసరం ఉండకపోవచ్చు. కానీ, వాడు తల్లి గర్భంలో మూడేళ్ళు ఉండలేడు. ఈ వింత జీవశాస్త్ర పరిమితే మొత్తం మానవాళి ప్రవర్తనను, ఆలోచనను, కుటుంబ, సామాజిక నిర్మాణాలను ప్రభావితం చేసింది. మనిషి భయానికి ఇదే ముఖ్య కారణం.
భయపడడం శిశువు తొలి అనుభవం. మనిషి చివరి అనుభవం కూడా అదే. జననం కూడా ఒక రకమైన మరణమే అని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే,
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ‖ 54 ‖
🌻 215. 'మహామాయా'🌻
కానరాని మాయా స్వరూపము కలది శ్రీమాత అని అర్థము.
బ్రహ్మలు సైతము శ్రీమాత మాయ వలన మోహము చెందుదురు. దేవి యొక్క మాయ జ్ఞానులను సైతము బలాత్కారముగ ఆకర్షించి మోహమున ముంచగలదు. ఎట్టివారినైనను తన మాయచేత మోహము కలిగించి కలత పెట్టగలదు. పురాణములందు ఇట్టి కథ లెన్నియో కలవు. నారదాది దేవర్షులుసైతము దేవి మాయకు లోనైరి.
మాయ లేనిదే సృష్టియే లేదు. నిరాకార నిరంజన తత్త్వము వెలుగుగ మారుటయే మొదటి మాయ. అటుపై నేర్పడు లోకము లన్నియూ మాయవలననే. ప్రతి మానవుడు తానున్నానని భావించుట మాయ వలననే. నిజమునకు తానొకడు వ్యక్తిగ లేడు. వున్నానను కొనియే సమస్త కార్యములు చేయుచుండును. లోకపాలకులు కూడ అట్లే చేయుచున్నారు.
ఇది యొక అద్భుతమగు విషయము. ఒకే తత్త్వము రూపాంతరములు చెందుచూ, గుణములను సంతరించు కొనుచూ అనేకానేకములుగ ఏర్పడుచున్నది. లేనిది వున్నట్లుగ, వున్నది లేనట్లుగ గోచరించుటకు మూల కారణము మాయయే.
మాయను దాటు ప్రయత్నము మానుకొని శ్రీమాతను ఆశ్రయించుట మేలు. ఈ మాయనే లీల అని కూడ పిలుతురు. సమస్తము దైవలీలగ గుర్తించువారు ధన్యులు. ఋషులు సహితము అకస్మాత్తుగ జరుగు అనూహ్యమగు సంఘటనలను దైవీ లీలగ భావింతురు. ఈ భావన కలవారికి పరాభవము, అవమానము అను భావన లుండవు.
దైవీ లీలలను జ్ఞప్తి యందుంచుకొని అణగి మణగి జీవించుచు ఆనందింతురు. ఎట్టి వారికైనను ఈ స్థితి తప్పదు. అదియే మహామాయా మాహాత్మ్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[14:31, 20/02/2021] +91 92915 82862: శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీజగన్నాథాష్టకమ్
భగవత్ తత్త్వమంటే అది అంతర్యామి తత్త్వము. బ్రహ్మమే శుద్ధచైతన్యముగా వ్యక్తమై, అటుపైన త్రిగుణాత్మకముగా వెలువడి, అటుపైన పంచభూతాత్మకమైన సృష్టి చేస్తాడు. అందులోకి జీవులు ప్రవేశించడము జరుగుతుంది.
అలా ప్రవేశించిన జీవులు అంతటా ఉన్న 'సత్' 'చిత్' ను దర్శించాలి. సత్ అంటే ఉనికి. చిత్ అంటే ఎరుక. ఆ ఉనికినే బ్రహ్మము, సత్యము, లేక శివము అంటారు. జీవకోటి అంతటికీ ఉనికి శాశ్వతముగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒకొక్క రకముగా ఎరుక ఉంటుంది. ఎరుకలో వ్యత్యాసము ఉంటుంది గాని, ఉనికిలో ఉండదు.
🕉🌞🌎🌙🌟🚩
ఆత్మ యందు ధ్యానము
భాగవతము 4-618 / పృథుచక్రవర్తికి సనత్కుమారుని బోధలు
ఆత్మ సర్వాంతర్యామి యైనపుడు ఆత్మ కాని వస్తువు లెట్లుండును? కుండ యందు మొత్తము మట్టియే యున్నది. ఇంకే పదార్థమును లేదు. అయినను మన దృష్టిలో కుండ కూడ నున్నది. అంతేకాక దాని వినియోగము కూడ నున్నది.
ఇచ్చట నిజమైన పదార్థము మట్టి మాత్రమే. దానియందు మనము కల్పించుకొనినది కుండ. ఈ కల్పనము వలన నీళ్ళు తెచ్చుకొనుట మున్నగు పనులు సాధ్యపడుచున్నవి.
మట్టి యన్నది సత్య వస్తువు. కుండ కల్పిత వస్తువు. కుండను మాత్రమే గుర్తించినచో అది బ్రద్దలగుట కూడ సత్యమనిపించును. మట్టి మాత్రము సత్యమని మనకు తెలియును గనుక కుండ బ్రద్దలైనచో ఇంకొక కుండను కల్పించు కొనుచున్నాము.
అట్లే అంతర్యామి అన్నిటియందును ఆత్మ, దానితో కల్పింపబడిన సత్యము, అదియే 'తాను' లేక దేహములు, పేర్లు, చుట్టరికములును అనాత్మలు. వానియందు సంగము మాని ఆత్మయందు ధ్యానము నిలుపవలెను.
మాస్టర్ ఇ.కె.
🕉🌞🌎🌙🌟🚩
[14:47, 20/02/2021] +91 92915 82862: 🕉🌞🌎🌙🌟🚩
_మనిషికి *మరణంవిచిత్రమైనది. ఇంటి నిండా ఆస్తులున్న కోటేశ్వరుడుఅసలు మరణం ఎందుకు వస్తుందోఅని ఏడుస్తున్నాడు._*
_అదే ఇంటి నిండ *కష్టాలుఉన్న పేదోడుచావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు._*
_మనిషి ఎక్కడ *గెలిచిపోతాడోఎక్కడ అలిసిపోతాడోఎవరికి తెలియదు. మట్టిలోకిమాత్రం మనశాంతిలేకుండా వెళుతున్నాడు._*
_మనం *ఎదుటివారి నుండి ఏమైన ఆశించటంఆపితే ఆనందంమొదలవుతుంది, అదే వారిని శాశించటంఆపితే మనకు సంతోషంమొదలవుతుంది._*
_ఎదుటి వారిని కలుపుకుపోయే మనస్తత్వంమనలో ఉంటే అందరూ *మనతోనేఉంటారు. అంతా నాకే తెలుసు నాకెవరి అవసరం లేదనే అహంమనకుంటే సమాజమేమనని దూరం పెడుతుంది._*
_మనకు ఎంత *ఆస్తిఉందనేది కాదు, మనము ఎంత మంది మనసుల్లో ఉన్నాము అనేదే ముఖ్యం ! వారి మనస్సులో మనం ఉండాలన్నదే ముఖ్యం._*
_నిజం ఉన్నతమైనది కానీ ! నిజాయితీతో జీవించడం అన్నది అంతకంటే ఉత్తమమైనది. మనం కంటితో చూడనివి చెవులతో విననివి ఎప్పుడూ నమ్మకూడదు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటలవల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి. కుటుంబ బంధాలు తెగిపోతాయి !_
🕉🌞🌎🌙🌟🚩
[15:14, 20/02/2021] +91 92915 82862: శ్రీరమణీయం -(808)
🕉🌞🌎🌙🌟🚩
ఆత్మానుభవం పొందటం ద్వారా జరిగేదేమిటి !?"
దైవదర్శనమైనా, ఆత్మానుభవం పొందినా జరిగేది మనలోని వెలితితనం పోవటమే. వెలితిపోయిన మరుక్షణం మనని దుఃఖపెట్టే వస్తువే ఉండదు. దుఃఖ పెట్టేదేదీ లేనప్పుడు మిగిలి ఉండేది సంతోషమే. అలాంటి శాశ్వతమైన ఆనందం మనందరికీ అందుబాటులోనే ఉంది. ఇప్పటికీ అది అందే ఉంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
''పరిపూర్ణ తే సాధకుడి లక్ష్యం ! వెలితిపోతే దుఃఖమే లేదు."- [అధ్యాయం -100]
🕉🌞🌎🌙🌟🚩
"ఋభుగీత " (275)
"నామరూపాలు"
19వ అధ్యాయము
అంతా బ్రహ్మమయ మైతే... ఇక జగత్తులో ఏదీ జడంగా ఉండదు !!
ఏది తనను అఖండ సత్యం నుండి వేరుచేయదో అదే బ్రహ్మీస్థితి. అట్టి స్థితిలో అన్నీ బ్రహ్మంగానే గోచరిస్తాయి. సర్వమూ బ్రహ్మమే అన్న సత్యం అర్థమైతే దృశ్యమానమైన జగత్తు మిథ్య అని తెలుస్తుంది. మిథ్య అంటే లేనిదనికాదు. శాశ్వతత్వం లేనిదని. దానంతట అదిగా ఉండలేనిదని భావం. మన అహంకారమే ఆధారంగా నిలిచి ఉండే జగత్తు అహంకారంలేని రోజు అసలు లేకుండా పోదు. మనకు విడిగా లేకుండా పోతుంది. బ్రహ్మలో భాగంగా, ఒక భ్రమగా ఉండిపోతుంది. ఆ స్థితిలో ఏ చింత ఉండదు. అంతా బ్రహ్మమయమైతే అప్పుడీ జగత్తులో ఏదీ జడంగా ఉండదు !
🕉🌞🌎🌙🌟🚩
160 - మంద్రగీత🌷
22. నిద్ర, భయ, శోకములు, విషాదము, మదము, దుర్బుద్ధి విడువని ధారణ తామసము.
23.ఇన్ని గంటలకు నిద్రపోయి తీరవలెనని విశ్వసించుట, ఇతరుల వలన గాని, దైవము వలనగాని భయపడి తీరవలెనని నమ్ముట, జీవితమున శోక విషాదములు తప్పవని భావించుట, కొందరి యందు మర్యాద చూపరాదని తలచుట, కొందరికి కీడు చేయక తప్పదని నమ్ముట దీని లక్షణములు.)
24. సుఖ భావన కూడా గుణ భేదములచే త్రివిధము. ఏది సుఖమో తెలియుటలోను, పొందుటలోను సత్యాసత్యములు దీనిననుసరించి యుండును. మరల మరల ప్రయత్నించి సన్మార్గమవలంబించుట వలన దుఃఖమును తరింపగలుగుట సాత్త్విక సుఖము. అది తొలుత దుఃఖ కారణములను తొలగించుకొనుటలో అసౌకర్యముతో ప్రారంభించి రానురాను తరుగని సుఖము కలుగజేయును. ఈ సుఖము వలన ఆత్మయందు బుద్ధి తేట బడును.
25.ఫలముల ఆపేక్షలను విడుచుటకు, శరీర వ్యాయామాదులు ఆచరించుటకు, ఔషధ సేవ, పథ్య పానాదులకు వలయు ప్రయత్నము అసౌకర్యంగా నుండును. కాని సుఖముగా పరిణమించి ఆరోగ్య తత్త్వ జ్ఞానముల వలన బుద్ధి ఆత్మమోణ్ముఖ న్ముఖమగును.
***
175) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
ఆవిర్భావయతి స్వస్మిన్విలీనం సకలం జగత్ ౹ ప్రాణికర్మవశాదేష పటో యద్వత్ర్పసారితః ౹౹183౹౹
183. సకలజగత్తు ఈశ్వరుని యందు వాసనారూపమున లీనమై ఉండును.దానినే ఈశ్వరుడు ఆయా ప్రాణుల పూర్వకర్మను అనుసరించి సృష్టించును,అనగా వ్యక్తమగునట్లు చేయును.సృష్టి అనగా చుట్టియుంచిన పటమున విప్పి చూపినట్లే.
*పునస్తిరోభావయతి స్వాత్మన్యేవాఖిలం జగత్ ౹ ప్రాణికర్మక్షయవశా త్సంకోచిత
పటో యథా ౹౹184౹౹*
184. ప్రాణుల కర్మ అంతా తీరిన పిదప మరల ఈ అఖిల విశ్వమును తనయందే లీనము చేసికొనును.ప్రళయమనగా విప్పియుంచిన పటమును మరల చుట్ట చుట్టినట్లే.
రాత్రిఘస్రౌ సుప్తిబోధావున్నీలన నిమీలనే ౹ తూష్ణీంభావమనోరాజ్యే ఇవ సృష్టిలయావిమౌ ౹౹185౹౹
185. జగత్తు యొక్క సృష్టి ప్రళయములను
పగలు,రాత్రులతోను జాగృతి,సుషుప్తులతోను
కన్నులు తెరచుట, మూసికొనుటల తోను
మనస్సు ఊహా ప్రపంచములను కల్పించుట,
నిశ్చలముగ ఉండుట లతోను పోల్చవచ్చును.
వ్యాఖ్య:- ఆ ప్రజాపతి ఈ సమస్త జగత్తును సృజించి రక్షించెను.
ఎట్లనగా,నా చేత సృజింపబడిన ఈ జగత్తు నాకు వేరుకానిదగుట వలన నేనే అగుచున్నాను.ఈ ప్రకారము ప్రజాపతి జగత్తు తానెనని చెప్పెను.అందు వలననే సృష్టి జరుగుచున్నది.
ఈ శరీర భేదజాతమంతయు శరీరోత్పత్తికంటె పూర్వము ఆత్మ స్వరూపముగానే ఉండెను.
సకల జగత్తు ఆ ప్రజాపతి యందు వాసనారూపమున లీనమై ఉండి ఆయా ప్రాణుల పూర్వకర్మను అనుసరించి సృష్టించును,అనగా వ్యక్తమగునట్లు చేయును.
అగ్నీష్టోమాత్మకమయిన జగత్తును ఆత్మస్వరూపముగా జూచువాడు ఏదోషమును అంటక ప్రజాపతి స్వరూపుడగుచున్నాడు.
ఈ సృష్టి అతిశయమైనది.అట్టి అతిశయమగు ప్రజాపతి యొక్క సృష్టిని ఆత్మ స్వరూపమైన దానినిగా తెలిసికొనువాడు ఆ ప్రజాపతి సంబంధమైన సమస్త సృష్టి యందు ప్రజాపతి వలెనే సృష్టికర్త యగుచున్నాడు.
సాలెపురుగు దేహమునుండి తంతువులు బయటకు వచ్చి మరలా లోపలికి తీసుకొను విధముగానే, ప్రాణుల కర్మ అంతా తీరిన పిదప మరల ఈ అఖిల విశ్వమును ఆ పరమాత్మలోనే లీనము చేసికొనును.
సృష్టి అనగా చూట్టియుంచిన పటమును విప్పి చూపినట్లే, ప్రళయమనగా విప్పియుంచిన పటమును మరల చుట్ట చుట్టినట్లే.
బ్రహ్మవేత్తకాని పురుషుడు, ఉపాసన చేయబడెడి యీ దైవము
ఉపాసించెడి నాకంటె వేరుగా నున్నానని భావించును.అట్టి వాడు పరబ్రహ్మ తత్త్వమును తెలిసికొనలేడు.
జ్ఞానియైన పురుషుడు ఈ వర్తమాన కాలము నందు
సర్వస్వ రూపముగా ఆపరమాత్మ స్వరూపమునే చూచుచు నేను మనువు నయితిని, సూర్యుడనయితిని అని భావించి సర్వస్వరూపమును పొందెను.
అతడు సమస్తమును అగుచున్నాడు.ఆ పరబ్రహ్మవేత్త దేవతలకును ఆత్మస్వరూపముగా అగుచున్నాడు.
ఈ సృష్టి,ప్రళయములను జ్ఞాని,అజ్ఞానులతో పోల్చవచ్చును.
ఇంకను పగలు రాత్రులతోను,
జాగృతి సుషుప్తులతోను,
కన్నులు తెరుచుట మూసికొనుటలతోను,
మనస్సు ఊహా ప్రపంచములను కల్పించుట నిల్చలముగ ఉండుట లతో పోల్చవచ్చును.
ఆ పరమాత్మ సర్వదా జ్ఞానఖర్మల విధి ప్రకారము సృజించుట వలన సమస్తమున ఆ పురుషుడే దేవాత్మ భావము పొంది సర్వ దేవతా స్వరూపుడగు చున్నాడు. మోక్షమును పొందుచున్నాడు.
అట్టి పురుషుడు
సర్వదాముక్తుడై పరమాత్మగానే ప్రకాశించుచున్నాడు.
***
అన్నమయ్య సంకీర్తన
జయమంగళము నీకు సర్వేశ్వర
జయమంగళము నీకుజలజవాసినిక !!
శరణాగతపారిజాతమా
పొరి నసురలపాలిభూతమా
అరుదయిన సౄష్టికి నాదిమూలమా వో-
హరి నమో పరమపుటాలవాలమా !!
సకలదెవతాచక్రవర్తి
వెకలిపై నిండినవిశ్వమూర్తి
అకలంకమైనదయానిధి
వికచముఖ నమో విధికివిధి !!
కొలిచినవారలకొంగుపైడి
ములిగినవారికి మొనవాడి
కలిగినశ్రీవెంకటరాయా
మలసి దాసులమైనమాకు విధేయా!!
***
: *||శ్రీమన్నారాయణీయము|| అష్టమ స్కంధము
27వ దశకము - లక్ష్మీస్వయంవరము వర్ణనము
28-6-శ్లోకము*
🕉🌞🌎🌙🌟🚩
వరణస్రజమాత్తభృంగనాదాం దధతీ సా కుచకుంభమందయానా।
పజశింజితమంజునూపురా త్వాం కలితవ్రీడవిలాసమాససాద॥
భావము:-
పిమ్మట ఆ లక్ష్మీదేవి వరమాలను చేతబట్టి నడిచి వచ్చుచుండెను. అప్పుడు తుమ్మెదలు ఆ వరమాలను చుట్టుముట్టి ఝంకారము చేయసాగెను. కాలి అందియలు శ్రావ్యమయిన సున్నిత శబ్దము చేయుచుండగా - కుచభారముతో మందగమనయై ఆ లక్ష్మీదేవి - వయ్యారముగా నడచుకొని వచ్చి, ప్రభూ! నారాయణమూర్తీ ! నిన్ను సమీపించెను.
వ్యాఖ్య:-
ఈరోజు శ్లోకంలో భట్టతిరివారు లక్ష్మీదేవి సౌందర్యాన్ని శ్లాఘించారు. మరికొన్ని విషయాలు చూద్దాం.
లక్ష్మీ దేవి గురించి వివిధ కథలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉందని, ఆమె 'నిత్యానపాయిని'. లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెప్పారు.
సృష్ట్యాదిలో దేవి (మహాశక్తి) సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవీ భాగవతం లో చెప్పారు. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి, భృగువు, ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెండ్లి చేశాడు. కనుక లక్ష్మీదేవిని 'భార్గవి' అని కూడా అంటారు.
తరువాత ఒకసారి దూర్వాసుని శాపకారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదలి పాలసముద్రంలో నివసించింది. అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేసే చిలకడం ప్రారంభించారు.
ఆ సమయంలో పాలసముద్రం నుండి కామదేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాలసముద్రంలో నుండి పుట్టింది కనుక ఆమె 'సముద్రరాజ కుమార్తె అయ్యింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మీకి సోదరుడయ్యాడు.
ధనాధి దేవత అయిన ఈ దేవిని శ్రీమహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు.విష్ణువు శక్తికి, మాయకు కారణం లక్ష్మీదేవి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మీకి మరో అంశ అని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మీగా చెప్పబడింది.ఆమెను అష్ట భుజ మహాలక్ష్మీగా వర్ణించారు.
విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పారు. రామావతారం లో సీతగా..కృష్ణావతారంలో రుక్మిణిగా..కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలవేలు మంగగా, విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుంది.
చాలా మంది దేవతలులాగే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అష్టోత్తర శతనామ స్తోత్రం , సహస్ర నామ స్తోత్రం వంటివి ఉన్నాయి.
ఎక్కుగా లక్ష్మీదేవిని పలికే పేర్లలో కొన్ని - లక్ష్మీ, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి, నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర.
అలాగే ఎక్కువగా లక్ష్మీదేవి చతుర్భుజాల తోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి,
సకలాభరణ భూషితయైనట్లుగా చిత్రించబడుతుంది.
***
: 11-వేదములు📚((((((((((🕉)))))))))) ఆచార్య వాణి🧘♂️
7. చతుర్వేదములు
((((((((((🕉))))))))))
''యజుస్'' అన్న పదం ''యజ్'' అన్నధాతువు నుంచి వచ్చింది. ''యజ్'' అంటే పూజించుట లేక ఆరాధించుట. 'యజ్ఞ' మనే పదం కూడ ఈ ధాతువు నుంచే వచ్చింది. ''ఋక్'' అంటే స్తోత్ర మయినట్లుగానే, ''యజుస్'' అన్న పదం యజ్ఞానికి కావలసిన కర్మకాండని సూచిస్తుంది.ఋగ్వేదంలో స్తోత్ర రూపంలో ఉన్న మంత్రాలకి, యజ్ఞం చేయటానికి వీలయిన రూపాన్ని యజుర్వేదం కల్పిస్తుంది. అంతేకాక, రకరకాల యజ్ఞాలని కొనసాగించే పద్ధతులని కూడ వచన రూపంలో యజుర్వేదం సూచిస్తుంది. స్తోత్రంతో ఆరాధించటం నేర్పుతుంది ఋగ్వేదం. ఈ మంత్రాలనే, ఈ స్తోత్రాలనే యజ్ఞం చేయటానికి ఎట్లా ఉపయోగించుకోవాలో యజుర్వేదం నేర్పుతుంది. మిగిలిన వేదాలకు వలెనే, యజుర్వేదానికి కూడా ఎన్నో శాఖలున్నాయి కాని వీటిలో ముఖ్యమైనవి రెండే. వీటికి ఎన్నో పాఠాంతరాలున్నాయి.
ఈ రెండు శాఖలను - శుక్లయజుర్వేదము, కృష్ణయజుర్వేదము అంటారు. 'శుక్ల' అంటే తెల్లని, 'కృష్ణ' అంటే నల్లని, శుక్ల యజుర్వేద సంహితని ''వాజసనేయ సంహిత'' అంటారు. 'వాజసని' అంటే సూర్యుడు. సూర్య భగవానుని వద్ద నేర్చుకొని యాజ్ఞవల్క్యముని లోకానికి ఈ సంహితను ఎరుక పరచాడంటారు. అందువల్లనే దీనిని 'వాజసనేయ సంహిత' అంటారు. సూర్యుని వద్ద యాజ్ఞవల్క్యుడు వాజసనేయ సంహితను నేర్చుకోవటం గురించి ఒక కథ ఉంది. వ్యాసుడు వేదాలనన్నిటినీ నాలుగుగా విభజించినప్పుడు యజుర్వేదానికి ఒక శాఖేఉండేది. దీనిని వ్యాసమహర్షి వైశంపాయనునకు భద్రపరచమనీ, తన శిష్యుల ద్వారా ప్రచారం చేయమనీ యిచ్చాడట.
యాజ్ఞవల్క్యుడు వైశంపాయనుని వద్ద దీనిని అధ్యయనం చేశాడు. గురుశిష్యుల నడుమ ఒక భేదాభిప్రాయం రావటంతో, వైశంపాయనుడు యాజ్ఞవల్క్యుని తాను నేర్పిన సంహితను తిరిగి యిచ్చేయమని కోరాడు. ఇది న్యాయమేనని గ్రహించి యాజ్ఞవల్క్యుడు ఆ విధంగా చేశాడు. ఆ తరువాత సూర్య భగవానుడిని తనను శిష్యునిగా స్వీకరింపుమని కోరాడు. సూర్య భగవానుడు అంగీకరించి, యజుర్వేదమనీ పేరు వచ్చింది. దీనికీ పేరు రావటం వల్ల, అంతకు పూర్వం వైశంపాయనుడు నేర్పిన దానిని కృష్ణయజుర్వేద మన్నారు. కృష్ణ యజుర్వేదములో సంహిత బ్రాహ్మణ భాగాలు స్పష్టముగా విభజింప బడిలేవు. యజుర్వేదం యొక్క ఘనత అంతా వైదిక కర్మలను, కర్మకాండను విశదీకరించటంలోనే ఉన్నది.
దర్శపూర్ణమాసం, సోమయాగం, వాజపేయం, రాజసూయం, అశ్వమేధం - వంటి యాగాల నిర్వహణాక్రమాన్ని వివరంగా కృష్ణయజుర్వేదంలోని తైత్తిరీయ సంహిత తెల్పుతుంది. అంతేకాక, ఋగ్వేదంలో కానరాని కొన్ని స్తోత్రాలు కూడ యజుర్వేదంలో ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న శ్రీ రుద్రం యజుర్వేదం లోనిది. ఋగ్వేదంలో అయిదు సూక్తాలు ''పంచరుద్రం''గా ఉన్నాయి, నిజమే. కాని యజుర్వేదంలో ఉన్న దానినే శ్రీ రుద్రమంటారు. అందువల్లనే అప్పయ్య దీక్షితులవారు అనబడే శివభక్తుడు, తాను యజుర్వేదంలో జన్మించి యుంటే పరమ శివుడ్ని యజుర్వేదం ద్వారానే ఆరాధించగలిగే వాణ్ణి కదా అని వాపోయారు. ఆయన సామవేదాన్ని అనుసరించే కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం అత్యధికులు యజుర్వేదాన్నే అనుసరిస్తున్నారు. ఉత్తర భారతంలో శుక్ల యజుర్వేదాన్ని ఎక్కువగా ఉన్నది. దక్షిణ భారతంలో కృష్ణ యజుర్వేదాన్ని, ఋగ్వేదంలోని పురుషసూక్తం కొద్ది మార్పులతో యజుర్వేదంలో కూడ ఉంటుంది. కాని ''పురుషసూక్త'' మన్నప్పుడు యజుర్వేదంలోని పురుషసూక్తమనే అర్థం చేసుకోవాలి.
అద్వైత సిద్ధాంతావలంబులకు యజుర్వేదం అత్యంత ప్రధానం. ఏ సిద్ధాంతానికైనా ఒక సూత్ర ముండాలి - దానికొక భాష్యముండాలి - దానికొక వార్తికముండాలి (అంటే విపులమైన వ్యాఖ్యానం) సిద్ధాంతాన్ని క్లుప్తంగా చెప్పేది సూత్రం. ఆ సూత్రానికి వివరణ ఇచ్చేది భాష్యం. భాష్యానికి ఇంకా వివరమైన వ్యాఖ్యానమిచ్చేది వార్తికం. అద్వైత సిద్ధాంతంలో వార్తిక కర్త (అంటే, వార్తికం వ్రాసినవాడు) ఆది శంకరుల శిష్యుడు సురేశ్వరులే - ఈ పదం ఇంకెవ్వరికీ వర్తించదు. ఆయన ఏ భాష్యానికి వార్తికం వ్రాశాడు?ఉపనిషత్తులని సూత్రాలన్నామంటే ఆదిశంకరులు వాటికి భాష్యం వ్రాశారు. ఆయన వేదవ్యాసులు (బాదరాయణుడు) రచించిన బ్రహ్మ సూత్రాలకి కూడ భాష్యం వ్రాశారు. ఆచార్యుల వారి ప్రత్యక్ష శిష్యులు సురేశ్వరులు.
ఉపనిషత్ భాష్యంపై వార్తికం రచించారు. ఆయన తన వ్యాఖ్యానాన్ని ప్రధానమైన పది ఉపనిషత్తులమీదా కాక రెండింటి మీదే వ్రాశారు. అవి తైత్తిరీయ, బృహదారణ్యక ఉపనిషత్తులు. ఈ రెండూ క్రమంగా కృష్ణయజుర్వేదానికీ శుక్లయజుర్వేదానికీ సంబంధించినవి. రెండూ యజుర్వేదానికీ సంబంధించినవి కావున అద్వైత సిద్ధాంతావలంబులకు యజుర్వేదమెంతో ముఖ్యము.
***
083: సిద్ధులు - అష్ట సిద్ధులు
నిరంతర (సతత) యోగ, తంత్ర సాధనల వలన, సాధకునికి "మార్మిక శక్తులు"(mysterious powers) వస్తాయి. అయితే, ఈ సిద్ధులు వైశ్విక నియమాలననుసరించి యే ఉంటాయి. "పిండే పిండే మతిర్భిన్నః".....అన్నట్లు ఒక్కో సాధకుడికి ఒక్కోరకంగా కూడా ఈ సిద్ధులు సంప్రాప్తిస్తూ ఉంటాయి.
ఈ సిద్ధులు కూడా రెండు వైపులా పదునున్న కత్తుల లాంటివి. ఈ సిద్ధులు పొందాలంటే, ఒక జీవించియున్న సద్గురువును ఆశ్రయించాలి. లేదా జన్మతః కూడా రావచ్చును. సతత అభ్యాసాల ద్వారా కూడా సిద్ధులు సంప్రాప్తిస్తాయి.
మానవ మనస్సు ప్రదర్శించే శక్తులు, అనంత శక్తులకు - అనంత క్రియలకు మూల నిధి అయిన విశ్వ మనస్సు (cosmic mind). విశ్వ మానసమే, మానవ మనస్సుకు మూలాధారం. వైశ్విక చైతన్యం, అనంతత్వం వైపుకు నిరంతరం పయనిస్తుంది. ఇది జీవాత్మలనే అలలను సృజిస్తుంది. అది పలు పరిమాణాలలో "సిద్ధులు" అనే తరంగాలను సృష్టిస్తుంది.
ఒక సిద్ధి గానీ, ఒక అసాధారణ శక్తి గానీ ప్రదర్శించబడినపుడు, ప్రశంశా పూర్వకంగా, భయ భక్తులతో చూస్తాం.
అటువంటి శక్తి ప్రదర్శకులు అలౌకికులు, శక్తిమంతులు. వారు సామాన్యులైతే మాత్రం కారు. అయితే అలాంటివారు నిత్య జీవితంలో తరచుగా కనిపించరు.
ప్రాచీన యోగ శాస్త్రం, తంత్ర శాస్త్రం లోని ఆలోచనలు, భౌతిక శాస్త్రంలోని ఆధునిక భావనలు , ఒకే సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. అయితే మన ఉనికి కేవలం, ఒకే సత్యంగా లేదు. భిన్న స్థాయిలలో,భిన్న తలాలుగా ఉంది. జడత్వం నుండి చైతన్యం యొక్క గాఢత్వం వరకు....పరస్పరం ఓత ప్రోతాలుగా ....అను ప్రవేశం చెందిన, భౌతిక మరియూ అనేక మనో కోశాలతో లేదా పొరలతో కూడి ఉన్నది. ఆత్మ వైపు చేసే ప్రయాణంలో, ఈ మనో కోశాలు లేదా పొరలు, మృధువుగా, మరింత సూక్ష్మంగా మారుతూ ఉంటాయి. ఈ మనో కోశాలు అపరిమితమైన శక్తి, జ్ఞాన భాండాగారాలు. ఇవి తమ దిగువ కోశాలపై చాలా సూక్ష్మ ప్రభావశీలతను ప్రదర్శిస్తాయి. ఆయా మనో తలాల నుండే సిద్ధులు ప్రకటనమవుతూ ఉంటాయి. మనోతలం మరల 1. వ్యక్తము 2. అవ్యక్తము. వ్యక్త భాగంలో మనం, మన ఇంద్రియాలు...కొంతవరకే అనుభవిస్తాయి. మనోతలం కూడా హెచ్చు భాగం అవ్యక్తం. ఆ అవ్యక్తం యొక్క తలాలను అందుకున్నవాడే పరమ సిద్ధుడు.
ఒక్కో తలంలో కొన్ని సిద్ధులు వస్తూంటాయి. తరువాత తలానికి వెళ్ళేకొద్దీ, సిద్ధుల ప్రకటన శక్తివంతంగా ఉంటుంది. సిద్ధుల వెంట పడండి, అని నేను అనడం లేదు.
సాంఖ్య దర్శనకారుడైన "కపిలుడు" సిద్ధులను కాదనలేదు. స్వామి వివేకానంద ఏమంటారంటే, సిద్ధులనేవి ....మీరు ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్తున్నారనే సూచన అని, అంటారు.
మనస్సుకు ఉండే సంకల్ప శక్తి, శక్తివంతమైనది :
మనస్సుకుండే, మార్మిక శక్తులను ప్రదర్శించమంటూ, ఒక యోగిని కొందరు కోరారు. సరే అని చెప్పి, ఆ యోగి చిన్న పని చేసాడు. ఆయన , వెంటనే ఎదురు గుండా, బజారులో గల ఒక దుఖాణ దారుపై ఏకాగ్రతతో చూసాడు. తత్ఫలితంగా, ఆ దుఖాణదారు...తేనె కుండలో తన చేతి వ్రేళ్ళను ముంచి, ఎదురుగా ఉన్న గోడను తుడిచాడు. అకస్మాత్తుగా డజన్ల కొద్ది ఈగలు ఆ తేనె చుట్టూ ముసురుకొని, గోడకు అంటిన తేనెను జుఱ్ఱడం మొదలు పెట్టాయి. ఆ సమయానికే, ఒక బల్లి ఆ ప్రదేశానికి వచ్చి, ఒక్కొక్క ఈగను తినడం ప్రారంభించింది. ఇది ఇలా జరుగుతుండగా, ఒక పిల్లి అక్కడికి వచ్చి ఆ బల్లిని తినేసింది. అదే సమయంలో ఒక కుక్క ఆ పిల్లిని చూసి...దాని వెంట పడింది. దుఖాణం వద్ద ఈ రెంటికీ పోరాటం జరిగింది....చివరికి కుక్క పిల్లిని చంపేసింది. ఆ మరణించినది, దుఖాణదారు పెంపుడు పిల్లి. దుఖాణదారు, కోపంతో, ఆ కుక్కను చంపేయ్...అని ఆగ్రహం వ్యక్తం చేయగా, అతని సేవకుడు, దండ ప్రయోగం చేసి ఆ కుక్కను చంపేసాడు. అయితే ఆ కుక్క , వేరొక యజమానిది. పరిణామాల ఫలితంగా, వీరిద్దరూ మరల పిడిగుద్దులు గుద్దుకున్నారు.
అపుడా యోగి తనను ప్రశ్నించిన వారి వైపు తిరిగి, ఈ మానసిక శక్తుల(సిద్ధుల) ప్రదర్శన వలన ఏమి జరిగింది? మీకు సంతృప్తిగా ఉందా? మనస్సు చేసే అద్భుతాలు చూడాలి...అన్నారు కదా! మీరు ఇప్పుడు చూసింది, మనస్సు యొక్క సంకల్ప స్థితి. ఈ సంకల్పం వలననే సిద్ధులు, మానసిక శక్తులు ప్రయోగించబడతాయి.
కొన్ని సార్లు మన జీవితాలలో కూడా, అలౌకిక ఘటనలు జరుగుతూ ఉంటాయి. వీటికి కూడా మనస్సు యొక్క "కలాపమే" కారణం.
"పతంజలి యోగ సూత్రాలు"...ఎవరైనా చదివి యుంటే, అందులో విభూతి పాదం, శ్రద్ధతో చదవండి. అందులో "సంయమం" గూర్చి చదవండి. ఆ సంయమాన్ని దేనిపై పెడితే ఏఏ సిద్ధులు వస్తాయో, ఆ యోగ శాస్త్రంలో సవివరంగా ఉంటుంది. (అయితే ఈ సంయమము చేయడం...ఎవరికి వారే స్వంత ప్రయోగాలు చేయకండి. గురువు తప్పని సరి. గురువు లేకుండా మీరు ప్రయోగాలు చేస్తే, బాధ్యులు మేము కాదు.)
యోగులు అటువంటి "సిద్ధులు" పొందుతారు. కొందరు జన్మతః సిద్దులు కలిగి యుంటారు. అవి పరిపక్వంగా ఉంటాయి. చాలా మందిలో అవి గోప్యంగా ఉంటాయి. ఈ సిద్ధులు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయని, "రాజ యోగం" చెబుతుంది.
చాలా మంది సామాన్యులలో ఆ సిద్ధులు, వ్యక్తం కావు. కారణం, వారిలో ఆయా మార్గాలు మూత పడి ఉండడమే. అయితే సిద్ధులు పొందగోరే వారు, కొన్ని ప్రత్యేక సాధనలు చేయాలి. లేదా తాను చేసే సాధనలు పక్వం చేరుతున్న దశలలో కూడా "సిద్ధులు", "మానసిక శక్తులు" వ్యక్తం అవుతాయి. అయితే సిద్ధుల మోజులో పడితే, అసలు లక్ష్యం దెబ్బ తింటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.
ఈ సిద్ధ క్షేత్రం అనే తలుపులు తెరచే తాళపు చెవి "మనో ఏకాగ్రతే". మనో ఏకాగ్రత అద్భుతాలు సృష్టిస్తుంది. మనో ఏకాగ్రత, పూర్తిగా పరి పక్వమైన వారు, సిద్ధ క్షేత్రానికి అధికారి. సిద్ధులు వాడి చేతిలో కరతలామలకం.
ఇక "పంచ భూత సిద్ది" అనే సిద్ధి, అనేది ఒకటి ఉంది. పంచ మహాభూతాలు ఇవి. 1. పృథివి 2. జలము 3. అగ్ని 4. వాయువు 5. ఆకాశము.
ఇందులో, ప్రతి ఒక్క element మీద కొంత కాలం సాధన చేయాలి. ఉదాహరణకు " పృథ్వి" భూతము మీద 6 మాసాలు సాధన చేస్తే, ఆయా తత్వాలు, ఆయా అధిష్ఠాన దేవతల మొత్తం మీద మాష్టరీ రావచ్చు. అలా పృథ్వి యొక్క తత్వం , మొత్తానికి సంయమము చేయడం వల్ల, ఆయా తత్వాలన్నింటిమీద, స్వామిత్వం వస్తుంది.
అలాగే జల తత్వం మీద, అగ్ని తత్వం మీద, వాయు తత్వం మీద, ఆకాశ తత్వం మీద....క్రమంగా సంయమము చేయుట వలన, మీకు ఆయా తత్వాలపై...స్వామిత్వము వస్తుంది. తద్వారా ఎన్నో సిద్ధులు కరతలామలకము అవుతాయి. ఎలా సంయమము చేయాలనేదాని విషయంలో...మీరు సద్గురువు సహకారం తీసుకోవాలి.
సిద్ధులన్నియూ...చాలా వరకు, మనో శక్తులు. మనస్సును ఏకత్రితం చేసినపుడు, ఈ అనేకానేక సిద్ధులు ప్రకటితమౌతాయి. అతి పురాతన కాలం నుండి, భారతీయులకు ఈ సిద్ధుల గూర్చి తెలుసు. ఇలాంటి సిద్ధులను, బాగా అధ్యయనం చేసి.....శాస్త్రాలుగా రూపొందించారు. మనో సిద్ధులు వ్యక్తం కావడానికి ఈ శరీరాలు ఒక మార్గం. సామాన్యులలో ఈ సిద్ధులు వ్యక్తం కావు. పూర్వ జన్మలలో సాధన బట్టి వచ్చిన సిద్ధులు, తీవ్ర తపో సాధనల వలన వచ్చిన సిద్ధులు...వ్యక్తం కాగలవు.
సిద్ధ క్షేత్రం తలుపు తెరచే తాళపు చెవి, మనో ఏకాగ్రతే. సామాన్య మనుజులకు, ఈ మనో ఏకాగ్రతా అభ్యసనం ఉండదు. ఎక్కువ మంది మనుజులు ధనేషణ,దారేషణ, పుత్రేషణల్లోనే...కాలం గడుపుతూ ఉంటారు. ఈ అతీంద్రీయ విషయాల వైపు దృష్టి సారించరు.
పూర్తి మనో ఏకాగ్రత కలిగిన వారు, సిద్ధ క్షేత్రానికి అధికారి అవుతాడు. ప్రకృతి శక్తులను నియంత్రిస్తాడు. ఉదాహరణకు...ఎందరో ఋషులు , పంచ భూతాలను నియంత్రించారని చెప్పుకుంటాం కదా!
నాద బ్రహ్మము - ఒక సిద్ధి :
ఒక సామాన్య వ్యక్తి, సెకెనుకు 20 నుండి 20000 వరకు, ప్రకంపనాలు కలిగిన శబ్దాలను మాత్రమే వినగలడు. యోగ సాధనలో, ఉన్నత స్థితులలో ఉన్న ఒక యోగి 20 కంటే తక్కువ, 20000 కంటే ఎక్కువ పౌనఃపున్యము గల , ప్రకంపనాలను కూడా వినగలడు.
అందుచేతనే, ఆ యోగ భగవానుడు , భూమిపై రాలే పూల రేకుల శబ్దాన్ని, పుప్పొడి రేణువుల సంగీతాన్ని, సూర్య-చంద్ర-గ్రహ-నక్షత్ర... నాదాలను కూడా వినగలడు. ఆ యోగ భగవానునికి, విశ్వము నందలి, ప్రతి అస్థిత్వము నందు...నాదము వినబడుతుంది. ప్రతి పరమాణువు, తనదైన నాదాన్ని కలిగి ఉంటుంది. అట్టి నాదాన్ని కూడా యోగి వినగలడు. యోగి "నాద బ్రహ్మము" ను వినగలడు, ఆ నాదంలో లయించగలడు కూడా.....
బల-అతి బల విద్యలు - ఖేచరి ముద్ర - ఒక సిద్ధి :
ఖేచరి ముద్ర, సతత అభ్యాసం వలన యోగి ఆకలి, దప్పికలను జయించే, సిద్ధి వస్తుంది. అంటే ఖేచరి ముద్ర , నిరంతర అభ్యాసం వలన, ఆ యోగ భగవానుని అంగిటి నుండి అమృతం వర్షిస్తుంది. ఆ అమృత వర్షం వల్ల , యోగికి, ఆకలి-దప్పికలు తగ్గిపోతాయి...అరుదుగా ఆకాశ గమనం కూడా కలుగుతుంది. ఆహారం లేకుండా జీవించ గలిగే సిద్ధిని "బల" అనియూ, నీరు లేకుండా జీవించగలిగే సిద్ధిని "అతి బల" అనియూ అంటారు. ఈ విద్యల యందు పారంగతుడైన వాడు, గాలి-వెలుతుర్ల నుండి ఆహారాన్ని గ్రహించగలడు. అయితే అలాంటి సిద్ధులు పొందాలంటే, "కుండలినీ శక్తి జాగరణ" అత్యవసరం.
అష్ట మహా సిద్ధులు - అణిమా సిద్ధి :
అణిమా సిద్ధి అన్నది, అష్ట మహా సిద్ధులలో ఒకటి. ఈ సిద్ధి ఒక యోగిలో సుదీర్ఘమైన యోగాభ్యాసం ద్వారా, సుదీర్ఘమైన ధ్యానాభ్యాసాల ద్వారా ప్రకటించబడుతుంది. అణిమా సిద్ధి సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితికి రావడం. అంటే, సామాన్య స్థితిలో ఉన్న మనం, అసామాన్యంగా అతి చిన్న-సూక్ష్మ స్థితిలోకి మారడం.
ఈ సిద్ధి ద్వారా ఒక యోగి, తన శరీర సాంద్రతను మార్చుకుంటాడు. ఈ స్థితికి రావాలంటే, ఒక సాధకుడు...అనేక సంవత్సరాల సాధన చేయాల్సి ఉంటుంది.
మహర్షి పతంజలి ప్రకారం, ఈ సిద్ధులు కేవలం నిరంతర యోగాభ్యాసం ద్వారానే కాకుండా, ఒక్కోసారి జన్మతః వస్తూంటాయి.
సశేషం
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం పద్మరాగసమప్రభాయై నమః అని అనవలెను.
[10:15, 21/02/2021] +91 7013 527 083: ఉచ్ఛిష్ట గణపతి
📚✍️ భట్టాచార్య
|| ప్రాతః స్మరామి గణనాథ మనాధ బంధుం
సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం ||
|| ఉద్దండ విఘ్న పరిఖండన చండ దండం
ఆఖండలాది సురనాయక బృంద వంద్యం ||
గణేశుని యొక్క తాంత్రికాచారమే "ఉచ్ఛిష్ఠ గణపతి" విద్య. భారత దేశంలో ఉన్న షణ్మతములలో "గాణాపత్యులు" ఒక శాఖ. గాణాపత్యులలో....గణపతిని మరల అనేక విధాలుగా ఆరాధిస్తారు. ఈ ఉచ్ఛిష్ఠ గణపతిని తాంత్రిక గణపతి అనికూడా అనవచ్చును.
32 గణపతులలో "ఉచ్ఛిష్ట గణపతి ఆరాధన" విశేష ఫలదాయకం. మంత్ర శాస్త్రమందు ఇలా చెప్పబడినది.
"హరిద్రోచ్ఛిష్ట లక్ష్మీచ ప్రసన్న శక్తి రేవచ"
అనగా.....ప్రస్తుత కలియుగమందు హరిద్ర,ఉచ్ఛిష్ట, లక్ష్మీ, ప్రసన్న, శక్తి గణపతులు....ఎంతో ప్రభావం కలిగి శీఘ్ర సిద్ధిని ఇస్తారు.
ఉచ్ఛిష్ట గణపతి పేరు ఇలా వచ్చింది. ఉచ్ఛిష్టము అనగా ఎంగిలి. ఈ "ఎంగిలి" అన్న పదము యొక్క సంస్కృత అర్థము "ఉచ్ఛిష్టము". ఉచ్ఛిష్టము అన్న పదము నుండే "ఉచ్ఛిష్ట గణపతి" అన్న నామము....క్రమంగా, ఆరాధన వచ్చాయి. ఈ గణపతి నామాన్ని ఎంగిలి నోటితో ఉచ్ఛరిస్తారు కావున "ఉచ్ఛిష్ట గణపతి" అంటారు. ఉచ్ఛిష్టము అనగా....నోటిలోని లాలాజలముతో, సమ్మిశ్రితమైన ఆహారము, ఇది కర్మ పరంగా చూసినా స్వచ్ఛమైనది కాదు. సనాతన సాంప్రదాయాల ప్రకారం ఇది నిషిద్ధమైనది కూడా.....అయితే తంత్ర సాధనలో ఉచ్ఛిష్టం నిషిద్ధం కాదు, ప్రత్యేకించి సాధనలో......
"మంత్ర మహార్ణవంలో" , గణపతి ఎరుపు రంగులో వర్ణించబడ్డాడు. ఉత్తర-కామికాగమ తంత్రంలో గణపతి గాఢమైన రంగు కలిగిన వాడిగా వర్ణించ బడ్డాడు.
ఉత్తర-కామికాగమ తంత్రం ప్రకారం గణపతి, పద్మాసనస్తుడై- ఆరు చేతులతో - రత్న, మణిమయ కిరీటంతో - నుదుటిపై నేత్రంతో....వర్ణించబడ్డాడు.
మరో తాంత్రిక గ్రంథం ప్రకారం గణపతి , తన ఆరు చేతులలోనూ స్వర్ణంతోనూ- నీలి తామర తోనూ- దానిమ్మ పండుతోనూ- వీణ తోనూ- అక్ష మాలతోనూ - ధాన్యపు కంకితోనూ.....వర్ణించబడ్డాడు.
మంత్ర మహార్ణవం ప్రకారం గణపతి... విల్లు బాణముతోనూ- పాశము తోనూ - అంకుశం తోనూ....వర్ణించబడ్డాడు.
ఉత్తర- కామికాగమం ప్రకారం, మరో సందర్భంలో ...గణపతి నాలుగు చేతులు కలవాడని, ప్రతి చేతిలోనూ.....పాశము, అంకుశము, చెఱకు గడతోనూ, మిగిలిన హస్తము అభయ ముద్రతో ఉంటుందని చెబుతోంది.
ఉచ్ఛిష్ట గణపతి, తన ఎడమ తొడపై ఉన్న ఒక దేవేరితో కూడి యుంటాడని తంత్రశాస్త్రం చెబుతోంది. గాణాపత్యంలో గణపతిని"అత్యున్నత దేవతా మూర్తిగా" కొలుస్తారు.
ఎవరి జాతకము లోనైతే కేతు గ్రహ అనుగ్రహముంటుందో, వాడికే "ఉచ్ఛిష్ట గణపతి" ఫలిస్తుందని జైమిని సూత్రం. ఉచ్ఛిష్ట గణపతి ఉపాసనలో , న్యాస-హోమాదుల అవసరం లేకపోవచ్చును. మంత్రజపం, సహస్రనామ పఠనం వలన సిద్ధి కలుగును. అయితే ఏ ఉపాసనకైనా విశ్వాసము,భక్తి, శ్రద్ధాదులు మిక్కిలీ అవసరం.
ఉచ్ఛిష్ట గణపతి చిత్రాన్ని చూస్తే మనకు ఒక విచిత్ర భావం కలుగుతుంది. ఉచ్ఛిష్ట గణపతి తన దేవేరి యైన "నీలా సరస్వతి" పట్ల అభిమానంగా ఉంటాడు. ఇక్కడ నీలా-సరస్వతి అంటే మాతంగి గా అర్ధం చేసుకోరాదు. ఉచ్ఛిష్ట గణపతి పూజలో, గణపతి దేనినీ త్యజించడు. అతడు దేనినీ త్యజించడు. ఒకానొక స్థాయిలో శ్రీవిద్య, ఉచ్ఛిష్ట గణపతి విద్య సమాంతరంగా వెళతాయి. ఉచ్ఛిష్ట గణపతి విద్య, వామాచార విద్య కూడా. ఉచ్ఛిష్ట గణపతిని బౌద్ధంలో "రక్త గణపతి" అని కూడా అంటారు. బౌద్ధంలో రక్త గణపతి అత్యంత శక్తివంతుడిగా పేర్కొంటారు.
ఉచ్ఛిష్ట గణపతి తంత్ర సాధన, చాలా శక్తి వంతమైనది. కానీ కత్తి మీద సాము.
[20:30, 18/02/2021] +91 92915 82862: Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Feb 18.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - ఫిబ్రవరి 18.
Whatever you think, that you will be. If you think yourselves weak, weak you will be; if you think yourselves strong, strong you will be.
మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు.
🕉️🌞🌍🌙🌟🚩
[20:30, 18/02/2021] +91 92915 82862: భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉️🌞🌍🌙🌟🚩
మహర్షులందరూ మనము చేసే పనిని త్రికరణ శుద్ధిగా నిర్వర్తించమంటారు. చిన్న పని నుంచి, పెద్దపని వరకు నిర్లక్ష్యము ఉండకూడదు. శ్రద్ధ కలిగి ఉండాలి. శరీరము, వాక్కు, మనస్సు (తికరణములు) శుద్ధి కానంత సేపు ఏమీ ప్రయోజనము ఉండదు.
కర్మలో నిర్మలత్వము ఉంటేనే దివ్యదర్శనాలు సాధ్యమవుతాయి. కోరినవన్నీ సిద్ధిస్తాయి. ఒక దైవము యొక్క, ఒక సద్గురువు యొక్క అనుగ్రహము పొందాలంటే కావలసిన ఏకైక అర్హత త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధి ఉన్నదా, లేదా అనడానికి ఎవరి మనస్సే వారికి సాక్షి. దైవము నిర్మలమైన వాహికలను ఎన్నుకొని వారిద్వారా దివ్యమైన కార్యములను నిర్వర్తింపచేస్తాడు.
🕉️🌞🌍🌙🌟🚩
[21:37, 18/02/2021] +91 92915 82862: శ్రీరమణీయం -(806)
🕉🌞🌎🌙🌟🚩
"ప్రశ్న : దైవప్రార్థనచేసి నీ ఇచ్ఛయే జరుగుగాక అని ముగిస్తారు, అదే సరియైనదైతే ఈ ప్రార్థన ఎందుకు !?"
భగవాన్ శ్రీరమణమహర్షి : నిజమే ! అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లోనూ దైవేచ్ఛయే ప్రవర్తిల్లుతుంది. వ్యక్తులు తామై చేయగలిగింది లేదు. దైవశక్తిని గుర్తించి ఊరికే ఉండు. ప్రతి ఒక్కరినీ దేవుడే చూసుకుంటాడు. సర్వం సృష్టించింది ఆయనే, ఇన్ని కోట్ల జనుల్లో నీవొకడివి. అందర్నీ చూసుకునేవాడు నిన్నొక్కడినే మానివేస్తాడా ? ఆయన ఇచ్ఛపై అన్నీ వదిలేయడం మంచిదని ఏపాటి తెలివి ఉన్నా గ్రహించవచ్చు. అదీగాక నీకేం అవసరమో ఆయనకు నీవు తెలుపవలెనా ? ఆయనకు తెలియదా ? ఆయనే వాటిని సరిపెడతాడు. అంతేకాదు నీవు ప్రార్థించేది దేనికని ? నీవు నిస్సహాయుడవనీ, ఏదో ఉత్తమశక్తి నీకు సహాయ పడవలెనని, బాగానే ఉంది. కానీ నిన్ను సృజించి రక్షించేవాడు ఆయనకు నీ దౌర్భల్యం తెలియదా ? నీవాయన ఎదుట దాన్ని ప్రకటిస్తే గానీ ఆయనకు అర్థం కాదన్నమాట. నిన్ను నీవు రక్షించుకున్నా అది దైవేచ్ఛయే. ఇతరుల కొరకు ప్రార్థించడం పైకది నిస్వార్థంగా ఉంటుంది. ఆ భావాన్ని తరచి చూడు. దానిలో స్వార్థం తొంగిచూస్తుంది. ఇతరుల సౌఖ్యం నీవు కోరడం, నీ సుఖం కొరకే. కాకపోతే ఒనరులపై దైవాన్ని అనుకూలింపచేశానన్న కీర్తికై కూడా కావచ్చు. దైవానికి ఎవరుగానీ మధ్యవర్తి ఎందుకు ? నీపని నువ్వు చూసుకో. అంతా చక్కబడుతుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
'ప్రార్థన ఆరాధనగా పరిణమించాలి'- (అధ్యాయం -99)
🕉🌞🌎🌙🌟🚩
[21:37, 18/02/2021] +91 92915 82862: "ఋభుగీత "(273)
🕉🌞🌎🌙🌟🚩
"నామరూపాలు"
19వ అధ్యాయము
ఆధ్యాత్మికత సత్యానుభవంగా మొదలై... అవగాహనగా పరిణమించి నిలిచిపోవాలి !
జ్ఞానం, శాంతి, ఆనందం ఎప్పుడో పొందే భవిష్యఫలాలు కావు. వర్తమానంలో ఏక్షణంలోనైనా తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్న పరమసత్యాలు. భావన చేత విడిపోకపోతే మనం భగవంతుడిగానే ఉన్నాము. వైవిధ్యం చేత ఈ సృష్టి భగవంతుడికి భిన్నంగా కనిపిస్తే... మనసులోని భావంచేత మనం కూడా దైవానికి భిన్నంగా ఉన్నామనే అనుకుంటున్నాము. జగత్జీవేశ్వర భావాల త్రిపుటి పోవాలంటే మనసులో భావశుద్ధి జరగాలి. అప్పుడే సృష్టిలోని వైవిధ్యాన్ని దైవంగా చూడగలుగుతాము. ఆధ్యాత్మికానుభవం కూడా భౌతికానుభవాల్లాగా గుర్తుండే జ్ఞాపకం కాదు. అదికూడా కేవలం ఒక అనుభవంగానే మిగిలిపోతే గతంగా మారిపోతుంది. కానీ ఆధ్యాత్మికత అలాంటిది కాదు. సత్యానుభవంగా మొదలై అవగాహనగా పరిణమించి నిలిచిపోతుంది !
🕉🌞🌎🌙🌟🚩
[21:53, 18/02/2021] +91 92915 82862: 🌷158 - మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
16. ఇట్లుండగా చేయుటకు గాని, మానుటకు గాని తాను కర్త అని భావించినవాడు బుద్ధి సాధన లేనివాడు. అతని దృష్టి సరి అయినది కాదు.
(ఐదు కారణములలో జీవుడు కర్త అని చెప్పబడినది. ఇచ్చట జీవుని కర్తృత్వ దృష్టి సరియైనది కాదని చెప్పబడినది. జీవుని కర్తృత్వము నిమిత్తమే గాని కేవలము కాదు. సృష్టిలో జీవుడొక భాగము కనుక, వానికి ప్రారంభ కర్తృత్వమే కర్మయందును కలుగదు. అతనికి బుద్ధి పుట్టిన తరువాత నుండి కర్తృత్త్వము ఆరంభించును. బుద్ధి పుట్టుటకు కారణము ప్రకృతి. దానికి కారణము 'నే'నను సర్వాంతర్యామి. కనుక జీవుని కర్త్వుత్త్వము వాస్తవమునకు ప్రకృతి కర్తృత్త్వమే. బుద్ధి పుట్టిన వెనుక కలిగిన జీవుని కర్తృత్త్వము సేవకుని కర్త్వుత్త్వము వంటిది.న్యాయాధికారిగా నియుక్తుడైనవాడు స్వతంత్రించి నిర్ణయం చేసినను అది న్యాయశాస్త్రబద్ధము, తన నియోగమునకు విధేయము అవుతున్నది కనుక అతని నిర్ణయమునకు అతడు కేవల కర్త కాజాలడు. ఇట్లు విడమరచుకొనలేక కర్తృత్త్వమాపాదించుకొనుట, సాధన లేని దుర్బుద్ధిని సూచించును.)
17. తాను కర్తయను భావమే అహంకారము. అది లేనప్పుడు బుద్ధి కర్మనంటనప్పుడు,అట్టివాడు ఈ లోకములన్నింటిని చంపినను, చంపినవాడు కాడు, బాధింపబడడు.
🕉🌞🌎🌙🌟🚩
[21:53, 18/02/2021] +91 92915 82862: 173) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
నార్థ పురుషకారేణేత్యేత్వ మాశంక్యతాం యతః ౹ ఈశః పురుషకారస్య రూపేణాపి వివర్తతే ౹౹177౹౹
177. ఈశ్వరుడే అంతా చేయుచున్నచో ఇక పురుషకారమేల? అని శంకింప పనిలేదు.ఈశ్వరుడు పురుషప్రయత్న రూపమున కూడా భాసించును.
*ఈదృగ్బోనేశ్వరస్య ప్రవృత్తిర్మైవ
వార్యతామ్ ౹ తథాపీశస్య బోధేన స్వాత్మాసఙ్గత్వ ధీజని ౹౹178౹౹*
178. ఇట్టి సిద్ధాంతము ఈశ్వరుడు సర్వమును చోదించుననుటతో విరోధింపదు.ఈశ్వరుడు అంతర్యామి అని తెలిసికొనిన పురుషుడు తన ఆత్మ అసంగమని కూడా తెలిసికొనును.
*తావతా ముక్తి రిత్యాహుః శ్రుతయః
స్మృతయస్తథా ౹ శ్రుతి స్మృతీ మమైవాజ్ఞే ఇత్యపీశ్వర భాషితమ్ ౹౹179౹౹*
179. ఆత్మ అసంగమనెడి బోధయే ముక్తికి కారణమని శ్రుతి వాక్యములు స్మృతి వాక్యములును చెప్పుచున్నవి.వరాహపురాణమున శ్రుతి స్మృతులు కూడా తన ఆజ్ఞ వలననే అని ఈశ్వరుడనును.
*ఆజ్ఞాయా భీతిహేతుత్వం భీషాఽ
స్మాదితి హి శ్రుతమ్ ౹ సర్వేశ్వరత్వమేతత్సా దన్తర్యామిత్వతః పృథక్ ౹౹180౹౹*
180. ఈశ్వరుని వలన భీతిచే ప్రకృతి శక్తులు ప్రవర్తించునని శ్రుతిలో వింటాము.అనగా ఈశ్వరాజ్ఞ భయము కలిగించును.కనుక ఈశ్వరుని అంతర్యామిత్వము కంటె భిన్నమై ఈశ్వరుని సర్వేశ్వరత్వము కూడా ఉన్నది.
తైత్తిరీయ ఉప.2.8.1;
కఠ ఉప.2.3.3;
నృసింహ తాపనీయ ఉప.2.4.
వ్యాఖ్య:- తాను దేనిని ఎంతమాత్రము చేయకున్నను విశ్వములోని భూతములన్నియు పని చేయునట్లు చేయునది ఏది?
కంకణమువంటి ఆభరణములు బంగారముతో చేయబడువిధముగా ద్రష్ట ,దర్శనము, దృశ్యము దేనితో చేయబడును?
త్రివిధములయిన అభాసరూపములను
(ద్రష్ట -దర్శనము-దృశ్యములను) అచ్ఛాదించి,అభివ్యక్తము చేయునదేది?
బీజములో వృక్షమున్నట్లుగా భూత,భవిష్యత్,వర్తమానములను త్రివిధకాల విభాగము దేనియందాభాసముగా నున్నది?బీజమునుండి వృక్షము, వృక్షమునుండి బీజము పర్యాయముగా వచ్చునట్లు ఏది పర్యాయముగా అభివ్యక్తమయి అదృశ్యమగును?
ఈ విశ్వముయొక్క సృష్టికర్తయెవరు?ఎవరి శక్తిచేత జీవించుచున్నాము?
చైతన్యవంతమయినను
శిలగానున్నది,శూన్యాకాశములో అద్భుతమయిన చమత్కారములను(మాయలను)చేయునది ఏది?
ఈ ప్రశ్నలన్నియు ఆ పరమాత్మకు సంబంధించినవే.
ఆ పరమాత్మ అంతర్యామిగా సర్వమును చోదించుననుటతో ఎట్టి విరోధములేదు.ఇది తెలుసుకున్నవాడు ఆత్మ అసంగమని కూడా తెలుసుకొనును.ఎట్లనగా,
అగ్నిదేవుడు సర్వపదార్థములను భక్షించి వాటి గుణములను అంటుకోనటుల అనగా వేపచెట్టును కాల్చి చేదును,
శ్రీ గంధపు చెట్టును కాల్చి సుగంధమును అంటుకోనటుల
ఆ పరమాత్మ సర్వమును చేయుచూ కూడా చేయనివాడే, అసంగుడే.
జ్ఞానికి వ్యవహార నియమముగానీ దాని వలన ప్రమాదముగానీ లేదు.కర్తృత్వము లేక పోవుట వలన పుణ్యపాపములయందు
అసంగుడు.
అసంగమనెడి బోధయే ముక్తికి కారణమని శ్రుతి ,స్మృతి వాక్యములును చెప్పుచున్నవి.
ఈ శృతి,స్మృతితులు కూడా ఆ పరమాత్మ నిర్ణయమని వరాహపురాణము చెప్పుచున్నది.
సమస్త ప్రకృతి శక్తులయందును ఆ పరమాత్మ అంతర్యామిగాయుండి నడిపించుచున్నాడు.
ఆ ఆత్మ నామరహితమయి వర్ణింపరానిది,సూక్ష్మము గనుక మనస్సు ఇంద్రియములుగానీ గ్రహింపజాలవు.
జీవన్ముక్తుడగు తత్త్వజ్ఞాని ఆత్మ రూపుడై సర్వత్రా వ్యాపించి యున్నప్పటికీ,ఈ శరీరమను నగరమున నున్నవాడై ప్రపంచ కల్పితములగు(ప్రారబ్ధానుసార)
భోగములననుభవించి,పూర్వమే సాక్షాత్కరింపబడియున్న స్వాత్మరూప పరమపురుషార్థమను మోక్షమును సేవించును.అనగా,
"పరమాత్మగానే యుండును"
🕉🌞🌏🌙🌟🚩
[22:06, 18/02/2021] +91 92915 82862: అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
గానం:శ్రీ గరిమెళ్ళబాల కృష్ణ ప్రసాద్ గారు
రాగము: గోరక్ కళ్యాణ్
రేకు: 0017-02
సంపుటము: 1-102.
॥పల్లవి॥
ఏది తుద దీనికేది మొదలు
పాదుకొను హరి మాయఁ బరగు జీవునికి
ఎన్ని బాధలు దనకు నెన్ని లంపటములు
యెన్ని వేదనలు మరియెన్ని దుఃఖములు
యెన్ని పరితాపంబు లెన్నిదలపోఁతలు
యెన్ని చూచిన మరియు నెన్నైనఁ గలవు
యెన్నిటికిఁ జింతించు నెన్నిటికి హర్షించు
నెన్నిటికి నాసించు నెన్నిటికిఁ దిరుగు
యిన్నియును దిరు వేంకటేశులీలలు గాఁగ_
నెన్ని చూచినను దా నెవ్వఁడునుగాఁడు!!
🕉🌞🌎🌙🌟🚩
[22:07, 18/02/2021] +91 92915 82862: *||శ్రీమన్నారాయణీయము|| అష్టమ స్కంధము
27వ దశకము - లక్ష్మీస్వయంవరము వర్ణనము
28-4-శ్లోకము*
🕉🌞🌎🌙🌟🚩
శ్రీమన్నారాయణీయం
28-4-శ్లో.
త్వయి దత్తహృదే తదైవ దేవ్యై త్రిదశేంద్రో మణిపీఠికాం వ్యతారీత్।
సకలోపహృతాభిషేచనీయైః ఋషయస్తాం శ్రుతిగీర్భిరభ్యషించన్॥
భావము:-
ప్రభూ! ఆ దేవదానవులట్లు లక్ష్మీదేవిని కోరుకొనుచుండిరి. కాని ఆమె తనహృదయమును నీకుమాత్రమే అర్పించెను. దేవేంద్రుడు ఆ దేవిని, మణి పీఠమున ఆసీనురాలినిచేయగా - దేవదానవులు సమర్పించిన ఉత్తమ అభిషేక ద్రవ్యములతోను, వేదవాక్కులతోను - ఋషులు ఆ లక్ష్మిదేవిని అభిషేకించిరి.
వ్యాఖ్య.
లక్ష్మి అనేపదం 'లక్ట్ అనే ధాతువు నుంచి ఏర్పడుతుంది. లక్షణ యుక్తులను గుర్తించి లక్షణంగా చేసే దేవతగనుక 'లక్ష్మి అయింది. 2. నిత్యసర్వాంతర్యామి
శ్రీ లక్షీలేనిదంటూ ఎక్కడలేదు.
హరిప్రియయైన శ్రీలక్ష్మీవిష్ణువులాగే సర్వాంతర్యామి
విష్ణువు అర్థం అయితే లక్ష్మి శబ్దం
విష్ణువు జ్ఞానం లక్ష్మి ಬುದ್ಧಿ
విష్ణువు ధర్మం అయితే లక్ష్మి సత్క్రియ
విష్ణువు న్యాయం అయితే లక్ష్మి నీతి
విష్ణువు ప్రష్ట అయితే లక్ష్మి సృష్టి
విష్ణువు సకామమైతే, శ్రీదేవి ఇచ్చ దేవతల్లోను మానవుల్లోను, పశు పక్ష్యాదుల్లోను, పురుషనామం ఏదైతే ఉందో అది పురుషోత్తముడైన విష్ణు రూపం, స్త్రీ నామం లక్ష్మి. వీరికంటే పరమపదమైన దేదీలేదు అంటారు పరాశర మహర్షి
ఉత్తర ఫల్లటి నక్షత$భృగుమహర్షి భార్య ఖ్యాతి. ఆమె పత్రికాసంతానం కోసం తపస్సుచేస్తే ఆదిపరాశక్తి అంశతో ఆమె భార్గవిగ జన్మించింది(అదిస్వాయంభువమన్వంతరం)
స్వారోచిషమన్వంతరంలో - అగ్ని నుంచి
ఔత్తమమన్వంతరంలో "స్వచ్ఛమైన
తామసమన్వంతరంలో - భూమి నుంచి
రైవత మన్వంతరంలో - బిల్వం నుంచి
చాక్షుష మన్వంతరంలో - సహస్రదళపద్మం నుంచి ఈ వైవస్వత మన్వంతరంలో ఫాలుణమాసం ఉత్తరానక్షత్రంలో శుక్రవారంనాడు క్షీరసాగరం నుంచి ఉద్భవించిందంటారు.
🕉🌞🌎🌙🌟🚩
[22:10, 18/02/2021] +91 92915 82862: ఓం నమః శివాయ:
9-వేదములు📚((((((((((🕉)))))))))) ఆచార్య వాణి🧘♂️
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
6- యజ్ఞం
((((((((((🕉))))))))))
ఒక ఉదాహరణ చూడండి : పాశ్చాత్యుల ఆచారం ప్రకారం విందుకి కూర్చున్నప్పుడు ఆరోగ్యాన్ని శ్రేయస్సునీ కోరుతూ శుభాకాంక్షలు పలుకుతారు. (టోస్ట్) తినేది ఒకరైతే సత్ఫలితాలు వేరొకరికని వారి విశ్వాసం. ఇదెట్లా సాధ్యం? ఇవన్నీ సుహృద్భావానికి చిహ్నాలు. చిత్తశుద్ధితో, విశ్వాసంతో చేస్తే ఆ సద్భావనే సత్ఫలితాల నిస్తుందన్నమాట. పరమాత్ముని భావాలే తరంగాలుగా మనకి మంత్ర రూపంలో వచ్చాయి - అవి శ్రేయోదాయకాలే అయి ఉంటాయి కదా. మంత్రానుసారం సమర్పింప బడిన ఉపహారాలు దేవతల శక్తిని వృద్ధి చేస్తాయి. మనకంటె ఎక్కువే అయినా దేవతల శక్తి కూడా పరిమితమే. వాళ్లకీ కోరికలూ, అవసరాలూ ఉంటాయి.
దేవతలని యజ్ఞాలే సంతృప్తి పరచగలవు. వాళ్లు ఈ లోకంలో మన జీవితాలని మెరుగు చెయ్యాలంటే యజ్ఞాల ద్వారా వారిని సంతృప్తి పరచాలి. వారి పటిష్ఠతను వృద్ధి చెయ్యాలి. వారి శ్రేయస్సుని మనసులో ఉంచుకొని యజ్ఞం చేస్తే వారు కూడ మనపై ప్రసన్నులౌతారు. దేవతలు మనపై ఆధారపడినా, వారు మనకంటె ఉన్నతులని మనం మరువరాదు. వారికి తగిన గౌరవం చూపాలి. అన్యమతస్థులు ఒకే ఒక దేవునికి నివాళులర్పిస్తారు, ఆరాధిస్తారు. అనేక దివ్యశక్తులను క్రతువుల వల్ల సంతృప్తి పరచటం వారెరుగరు. మన మతంలో సర్వసంగ పరిత్యాగులైన సన్న్యాసులు మాత్రం దేవతల నాశ్రయింపక భగవంతుడ్నే నేరుగా ప్రార్థించ వచ్చు. ఇతరులు దేవతలని సంతృప్తిపరచి వారి అనుగ్రహానికి పాత్రులవాలి. ఆ సంతృప్తిని కలిగించటానికే యజ్ఞయాగాదులు, ఉపహారాలు ఇత్యాది నిర్వహించాలి.
దీనికే ఒక సామాన్యమైన ఉపమాన మివ్వవచ్చు. దేశం యొక్క రాజుని అందరూ నేరుగా కలిసికోలేరు. తమ తమ సమస్యల పరిష్కారానికి ప్రజలు ప్రభుత్వోద్యోగులను ఆశ్రయిస్తారు. ఆ అధికారులు వ్యక్తిగతంగా కాక ప్రభుత్వమో, రాజో నిర్దేశించినట్టు వ్యవహరిస్తారు. తమ అవసరాలను తీర్చేది పరోక్షంగా ప్రభుత్వాధినేతే, కాని ఆయనని నేరుగా ప్రజలు కలుసుకోలేరు. అదే విధంగా మన మతంలో కొన్ని ఆచారాలు నిర్దేశింప బడ్డాయి. పరమేశ్వరుడే సార్వభౌముడు. మానవాళి అంతా ప్రజానీకం. వరుణుడు, వాయువు వంటి వారంతా అధికారులు. మన అవసరాలను వారి ద్వారా తీర్చుకోవాలి మనం. దేవతలను పటిష్ఠం చేయటానికి యజ్ఞాలను చేస్తాం. మనమిచ్చే నైవేద్యాలు వారికి ఆహారం. మనం స్వార్థం లేకుండా త్యజించినవే వారికి చేరుతాయి. అగ్నికి ఆహుతి చేసే వాటిని మనసారా దేవతలకు సమర్పించాలి. అందువల్లనే, ద్రవ్యాన్ని సమర్పించేప్పుడు ''నాది కాదు'' (''న మమ'') అంటాం. దేవతలకు ఆహారం అగ్ని ద్వారా అందుతుంది.
ఇట్లాగే అగ్ని ద్వారా, మంత్రాల ద్వారా మన పితృ దేవతలకు కూడ ఉపహారాలర్పిస్తాం. యజ్ఞాల ప్రాధాన్యమూ, ప్రయోజనమూ : మన మతంలోనే ఈ క్రతువులు ఉండటానికి కారణం విశ్లేషించే ముందు, అసలు మానవ జీవితం ఎట్లా సాగుతుందో గమనిద్దాం. ఒక ప్రాంతంలో ఏ పదార్థమైనా ఎక్కువగా లభిస్తే దానిని ఆ పదార్థం సమృద్ధిగా లేని ప్రాంతానికి పంపి, ఆ రెండో ప్రాంతం నుంచి మనకి లేని దానిని తెచ్చుకుంటాం. వడ్రంగులు, మేస్త్రీలు వంటి శిల్పులు మనకి పనిచేసి పెట్టితే వారి జీవనాధారానికి డబ్బునిస్తాం. ఆవుని మేపుతాం, పాలు ఇస్తుంది. ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తాం. మన భద్రతనీ, ఇతర అవసరాలనీ ప్రభుత్వం చూస్తుంది. ఆ విధంగానే పరలోకాలలో కూడా ఇచ్చి పుచ్చు కోవటాలున్నాయి. ఇంజనీర్లు వర్షపునీటిని కాలువ ద్వారా పారనీయగలరు, జలాశ్రయాలలో నిలువ చేయగలరు. అంతేకాని, వర్షాన్నే కల్పించలేరు. మనకి వర్షాలు కావాలంటే దేవలోకానికి కొన్ని పదార్థాలని పంపాలి. ఈ పరస్పర సంబంధాలనే గీత ఇట్లా సూచిస్తుంది.
''సహయజ్ఞాః ప్రజాసృష్టా పురోవాచ ప్రజాపతిః
అనేన ప్రసవిష్యద్వ మేషమో`ò స్త్విష్టకామధుక్|
దేవాన్ భావయతానేన తేదేవా భావయన్తునః |
పరస్పరం భావయంతః శ్రేయఃపర మవాప్స్యథ |
(యజ్ఞాల వల్ల దేవతలను సంతుష్టిపరచు, దేవతలు వర్షాలు మొదలైన వాటితో నిన్ను సంతుష్టుని చేయనీ, ఈ విధంగా ఒండొరులకు సహాయపడుతూ అందరూ వర్థిల్లుగాక). మార్గాలు వేరు, గమ్య మొక్కటే : క్లుప్తంగా చెప్పాలంటే, ప్రతి దేవతకీ మంత్రసమేతంగా ఉపహారం సమర్పించటమే యజ్ఞం. ఒక విధంగా చెప్పాలంటే, సామవేద మంత్రాలే దేవతా స్వరూపాలు. యజ్ఞంలో సమర్పించిన ఆహారదినుసులవలె ఈ మంత్రాలలోని పదాలే ఆయా దేవతలకు పోషకాలై వారిని బలవత్తరం చేస్తాయి. కాబట్టి మంత్రాలకి అనేక ప్రయోజనాలున్నాయి.
ప్రభుత్వాదాయాన్ని పెంపొందించేందుకు మనం వివిధ రకాల పన్నులను కట్టుతూంటాం. అయినా ఒకో పన్ను ఒకో చోట కట్టాలి - అంటే, ఆదాయపు పన్ను, భూమిశిస్తు, అమ్మకం పన్ను, వాహనాలపై పన్ను వంటివి. ఒకో అధికారి ఒకో రకమైన రసీదునిస్తాడు. అలాగే ప్రతిక్రతువుకీ ప్రత్యేకమైన మంత్రమూ, దేవతా, ఉపహారమూ, సమయమూ - ఉన్నాయి. ఒకో యజ్ఞాన్ని నిర్వహించటానికి ఒకో నియమావళి ఉన్నా అన్నిటి ధ్యేయమూ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవటమే.
మనం ఎక్కడ చెల్లించినా, పన్ను ప్రభుత్వాదాయంలోనే జమ అవుతుందని మనమెరుగుదుము. అట్లాగే వేరు వేరు దేవతలకై మనం చేసే వివిధమైన యజ్ఞాలు ఆ దేవతల ద్వారా పరమేశ్వరుని చేరుతాయనే అనుకోవాలి.
🕉🌞🌏🌙🌟🚩
[05:22, 19/02/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 644 / Bhagavad-Gita - 644 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 61 🌴
61. ఈశ్వర: సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి |
భ్రామయన్ సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా ||
🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై యుండి, భౌతికశక్తి యంత్రముపై ఆసీనులైనట్లుగా నున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచున్నాడు.
🌷. భాష్యము :
అర్జునుడు దివ్యజ్ఞాత కాడు. యుద్ధము చేయుట లేదా యుద్ధము చేయకుండుట యనెడి అతని నిర్ణయము కేవలము అతని పరిమితజ్ఞానము పైననే ఆధారపడియున్నది.
కనుకనే శ్రీకృష్ణభగవానుడు జీవులు సర్వజ్ఞులు కారని ఉపదేశించుచున్నాడు. ఆ దేవదేవుడే (స్వయముగా శ్రీకృష్ణుడు) పరమాత్మరూపమున జీవుల హృదయములందు నిలిచి వారిని నిర్దేశించుచుండును. దేహమును మార్చిన పిమ్మట జీవుడు తన పూర్వకర్మలను మరచినను భూత, భవిష్యత్, వర్తమానముల జ్ఞాతగా పరమాత్ముడు జీవుని కర్మలకు సాక్షిగా నిలిచియుండును.
అనగా జీవుల కర్మలన్నియు ఈ పరమాత్మునిచే నిర్దేశింపబడుచున్నవి. కనుకనే జీవుడు తనకు అర్హమైన వానిని పొందుచు భౌతికదేహమున కొనసాగుచుండును. అట్టి భౌతికదేహము పరమాత్మ నిర్దేశమున భౌతికశక్తిచే సృజించబడుచుండును. జీవుడు ఆ విధముగా ఒక దేహమునందు ప్రవేశపెట్టబడినంతనే ఆ దేహమునకు అనుగణమైన రీతిలో వర్తించ వలసివచ్చును.
అధికవేగముగా ప్రయాణించగలిగిన కారులో కూర్చుని యున్నటువంటి వ్యక్తి అల్పవేగముతో ప్రయాణించగలిగిన కారులో నున్న వ్యక్తికన్నను అధిక వేగముగా ప్రయాణించును. ఆ రెండు వాహనముల యందలి మనుష్యులు (జీవులు) ఏకమేయైనను వారి ప్రయాణవేగములు వేరుగా నుండును.
అదేవిధముగా పరమాత్ముని ఆజ్ఞానుసారము భౌతికప్రకృతియే జీవుడు పూర్వ ఇచ్చానుసారము వర్తించుటకు అనుగుణమైన దేహమును తయారుచేయుచుండును. ఈ విషయమున జీవుడు అస్వతంత్రుడు. కనుక ఎవ్వడును తాను భగవానునిపై ఆధారపడలేదని భావించరాదు. అతడు సదా భగవానుని అదుపులోనే యుండును. కనుకనే శరణాగతి యనునది ప్రతియోక్కరి ధర్మము. తదుపరి శ్లోకము యొక్క భోద అదియే.
🌹 🌹 🌹 🌹 🌹
[05:22, 19/02/2021] +91 98494 71690: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 298, 299 / Vishnu Sahasranama Contemplation - 298, 299 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 298. కామప్రదః, कामप्रदः, Kāmapradaḥ 🌻
ఓం కామప్రదాయ నమః | ॐ कामप्रदाय नमः | OM Kāmapradāya namaḥ
కామప్రదః, कामप्रदः, Kāmapradaḥ
విష్ణుః కామాన్ స్వభక్తేభ్యః ప్రకర్షేణ దదాతి యః ।
స ఏవ కామప్రద ఇత్యుచ్యతే విబుధోత్తమైః ॥
తన భక్తుల కొరకు కామిత ఫలములను మిక్కిలిగా ఇచ్చునుగావున విష్ణువు కామప్రదుడు.
:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వభాగము ::
ఆ. చరణసేవకులకు సంసారభయమును, బాపి శ్రీకరంబు పట్టు గలిగి
కామప్రదాయి యైన కరసరోజంబు మా, మస్తకముల నునిచి మనుపు మీశ! (1041)
నీ పాదాలను కొలిచేవారికి సంసారంవల్ల కలిగే భయాన్ని తొలగించేదీ, లక్ష్మీదేవి హస్తాన్ని గ్రహించేదీ, అభీష్టములు అందించేది అయిన నీ కరకమలాన్ని మా శిరములపై ఉంచి మమ్ము బ్రదికించు స్వామీ!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ॥ ౩౨ ॥
🌻 299. ప్రభుః, प्रभुः, Prabhuḥ 🌻
ఓం ప్రభవే నమః | ॐ प्रभवे नमः | OM Prabhave namaḥ
ప్రభుః, प्रभुः, Prabhuḥ
జనార్ధనః ప్రకర్షేణ భవనాత్ప్రభురుచ్యతే మిగులు గొప్పగా ఉండువాడు కావున జనార్ధనుడు ప్రభువు.
:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
యేఽప్యన్యదేవతాభక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః ।
తేఽపి మామేవ కౌన్తేయ యజన్త్యవిధి పూర్వకమ్ ॥ 23 ॥
అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ ।
న తు మామమ్భిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే ॥ 24 ॥
ఓ అర్జునా! ఎవరు ఇతర దేవతలయెడల భక్తిగలవారై శ్రద్ధతోగూడి వారి నారాధించుచున్నారో, వారున్ను నన్నే అవిధిపూర్వకముగ ఆరాధించుచున్న వారగుదురు. ఏలయనగా, సమస్తయజ్ఞములకు భోక్తను, ప్రభువు (యజమానుడు)ను నేనే అయియున్నాను. అట్టి నన్ను - వారు యథార్థముగ తెలిసికొనుటలేదు. ఇందువలన జారిపోవుచున్నారు.
35. ప్రభుః, प्रभुः, Prabhuḥ
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
వివేక చూడామణి - 27 / Viveka Chudamani - 27 🌹
🍀. అంతఃకరణాలు - 4 🍀
104. అహం అనునది శరీరమే తాను అను భావముతో, తానే అన్ని చేస్తూ అనుభవిస్తున్నానని, సత్వ, రజో, తమో గుణాలకు అనుగుణంగా వ్యవహారము నడుపుచున్నది.
105. జ్ఞానేంద్రియాలకు అనుకూలముగా పనులు జరిగినప్పుడు సంతోషమును, వ్యతిరేకముగా ఉన్న దుఃఖాలను అహం అనుభవిస్తూ ఉంటుంది. ఈ దూషణ, భూషణాలు అనునవి అహం యొక్క లక్షణాలు. సదా ఆనందములో ఉండే ఆత్మకు సంబంధము లేదు.
106. జ్ఞానేంద్రియాలు కేవలము ఆనందానుభూతులను ఆత్మ యొక్క ప్రభావముచే అనుభవించుచున్నవి. అవి స్వతంత్రముగా వ్యవహరించలేవు. ఎందువలనంటే ఆత్మ స్వభావము అన్నింటిని ప్రేమించుటయే. అందుకే ఆత్మ ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటుంది. దుఃఖాలకు లోనుకాదు.
107. గాఢ నిద్రలో మనము ఆత్మానందాన్ని జ్ఞానేంద్రియాలకు సంబంధము లేకుండానే అనుభవించుచున్నాము. ఈ విషయము సృతులలో వివరముగా చెప్పబడినది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌻 27. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 1 🌻
అది 1895 వ సంవత్సరం జూన్ 30 తేదీ, నా జీవితమున అది మరపురాని రోజు. జన్మజన్మలకూ గుర్తుండేడి రోజు. నా కపుడు 15 సంవత్సరాలు. యవ్వనము తికమక పెట్టు సమయమది. ఎందరో పిల్లలు జీవితమున ఉత్సాహముతో పరుగులెత్తు చుండగా, పగలూ రాత్రి తేడా తెలియని చిలిపితనముతో, పిల్లచేష్టలతో జీవించు వయస్సు. కానీ, నా కప్పటికీ జీవితముపై విరక్తి పూర్తిగా ఉండెడిది.
నా జీవితము వృధా యను భావన అనునిత్యమూ వేధిస్తూ వుండేది. ఆ వయస్సునకే నాకు తలమునకలు వేయు సమస్యలు, ఎటు చూచిననూ దుఃఖము ఆవరించి యుండేది. నేనీ ప్రపంచములోనికి రావాలని ఎప్పుడూ కోరుకొనలేదని, అయిననూ కొనిరాబడితినని భావించేదానను. నన్నెవరూ ప్రేమించేవారు కారు. నేను కూడా అంతే.
అందరి యందూ తెలియని కోపము, ద్వేషము, చిరాకు వుండేవి. నాకుగా నేను చిక్కులు వేసుకొనుటలో ఉత్తమశ్రేణి నిపుణత కలిగినదానను నేను. భావి జీవితమును భావించినపుడల్లా భయమావరించెడిది. పెళ్ళి, పిల్లలూ, సంఘమున పరపతి, గౌరవము, వాని కొరకై జీవించుట నాకు యాంత్రికముగా తోచెడివి.
క్రైస్తవమతము కూడా సంకుచితమైన బోధలు కలిగి నా హృదయావేదనకు పరిష్కారము చూపలేక పోయినది. నరకమును తెలిపి బెదిరించుటయే ప్రధానముగా వారి బోధన సాగుచుండెడిది. క్రతువులు- మతబోధనలు చెవులలో గింగిరు లెత్తుచుండెడివి.
నాకు జీవితమంతయూ అయోమయముగ నుండెడిది. నా చుట్టునూ దట్టమైన పొగమంచు ఏర్పడి, ఏమీ కనపడని, ఏమీ వినపడని ఒంటరినై జీవించుచుండెడి దానను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. కోరికే భయానికి హేతువు 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
దానివల్ల మీరు కోల్పోయేదేముండదు. మహా అయితే మీ సంకెళ్ళు. మీ చిరాకు, మీ విసుగు, ఎప్పుడూ మీలో ఉండే ఏదో కోల్పోయిన భావనలు పోతాయి. కోల్పోయేందుకు మీ దగ్గర అంతకన్నా ఏముంది? ఆ చెత్త నుంచి బయటపడి బుద్ధుడు, కృష్ణుడు, జీసస్, మహావీరులను వ్యతిరేకిస్తూ, మిమ్మల్ని మీరు అంగీకరించడం ప్రారంభించండి. మీరు మీ పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి కానీ, బుద్ధుడు, కృష్ణుడు, నానక్, జీసస్, మహావీరుల పట్ల బాధ్యతాయుతంగా ఉండ వలసిన పనిలేదు.
ఇంతవరకు మిమ్మల్ని మీరు ఏ మాత్రం పట్టించుకోకుండా కర్తవ్యం పేరు చెప్పి ఇతరులకు కావలసినవన్నీ చేసిపెడుతూ మీ పట్ల మీరు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ జీవించారు. అందుకే మీతో విసిగిపోయిన మీరు నిస్సారమని తెలుసుకున్నారు. అలా తెలుసుకోవడం మంచిదే.
జైలు నుంచి బయటపడేందుకు అంతకన్నా ఏమి కావాలి? అందులోంచి బయటకు దూకి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్ళండి. ‘‘బాగా ఆలోచించి దూకు’’ అని అందరూ అంటుంటారు. అదే నేనైతే ‘‘ముందు దూకి, తరువాత బాగా ఆలోచించండి’’ అంటాను.
మనల్ని పైనుంచి గమనిస్తున్న వ్యక్తిగత దేవుడు కేవలం కల్పనే అయినప్పటికీ, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయినప్పటికీ, వాడిని వదలాలంటే నాకు చాలా భయంగానే ఉంది.
దేవుణ్ణి వదిలేందుకు నువ్వెందుకంత భయపడుతున్నావు?
ఎందుకంటే, కచ్చితంగా నీలో ఎక్కడో ఆ దేవుడు నిన్ను కాపాడుతున్నాడనే భావన దాగి వుంది. అందుకే వాడిని వదిలేందుకు నువ్వు అంతగా భయపడుతున్నావు. కాబట్టి, ‘దేవుడు’ అనే భావన నీ మనసుకు ఒకరకమైన రక్షణ కవచం లాంటిది.
తల్లి గర్భంలో వున్నపుడు ఏ మాత్రం భయపడని పసివాడు పుట్టిన వెంటనే భయపడతాడు. తల్లి గర్భంలో వున్న శిశువు ఏ చర్చికో, మసీదుకో, దేవాలయానికో వెళ్లి బైబిల్, ఖురాన్, భగవద్గీతలు చదవాలనుకున్నట్లు, ‘‘దేవుడున్నాడా, లేడా? దయ్యాలున్నాయా, లేవా? నరకమంటే ఏమిటి? స్వర్గమంటే ఏమిటి?’’ అని ఆలోచించినట్లు నేనెప్పుడూ వినలేదు. వాడు అలా దేని కోసం ఆలోచించాలి?
వాడు ఇప్పుడే తల్లిగర్భమనే స్వర్గంలో ఉన్నాడు. ‘‘నాకిది కావాలి, అది కావాలి’’ అని అడగవలసిన అవసరం వాడికి అక్కడ ఏ మాత్రముండదు. ఎందుకంటే, అక్కడ వాడికి కావలసినవన్నీ నిరంతరం సమకూరుతూనే ఉంటాయి. అంతకన్నా గొప్ప స్వర్గమేముంటుంది.
నిజానికి పసివాడు తల్లి గర్భంలో వున్న తొమ్మిది నెలల కాలంలో ఎదిగినంతగా తొంభై ఏళ్ళొచ్చినా ఎదగడు. ఆ తొమ్మిది నెలల కాలంలో వాడు అణువు నుంచి అనంతందాకా కొన్ని లక్షల సంవత్సరాలలో చోటుచేసుకున్న పరిణామక్రమంలోని అన్ని దశల గుండా ప్రయాణిస్తాడు.
అక్కడ వాడి జీవితానికి పూర్తి రక్షణ ఉంటుంది. ఉద్యోగానే్వషణలు, ఆకలిదప్పుల బాధల్లాంటివి అక్కడ ఉండవు. వాడికి కావలసినవన్నీ తల్లి శరీరమే సమకూరుస్తుంది. మీరు తల్లి గర్భంలో జీవించిన ఆ తొమ్మిది నెలలలో మీకు లభించిన రక్షణే ప్రస్తుతం చెలామణిలో వున్న అన్ని మతాలకు పురుడు పోసింది. అందుకే తల్లి గర్భం నుంచి బయటపడిన శిశువు వెంటనే భయపడతాడు. అది కచ్చితం.
ఎందుకంటే, పూర్తి రక్షణ, అన్ని సౌకర్యాలతో వున్న గృహం నుంచి ఏమీ తెలియని ఈ వింత ప్రపంచంలోకి ఆ శిశువు గెంటివేయబడ్డాడు. ఇక్కడ వాడు స్వయంగా ఊపిరి పీల్చడం ప్రారంభించాలి కానీ, వాడి తల్లి ఊపిరి పీల్చితే సరిపోదు. ఈ సత్యం తెలిసేందుకు ఆ పసికందుకు కొన్ని క్షణాలు పడుతుంది.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
For Old Messages...
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ‖ 54 ‖
🌻 214. 'మహాపాతకనాశినీ'🌻
మహా పాతకములను కూడ నాశనము చేయునది శ్రీమాత అని అర్థము.
పాపములు తెలియక చేయుట యుండును. తెలిసి చేయుట కూడ నుండును. తెలియక చేయుట అజ్ఞానము వలన. తెలిసి చేయుట బలహీనత వలన. అట్టి భక్తులను రక్షించుటయే తన పనిగ పెట్టు కొన్నది శ్రీదేవి.
సమస్త పాపములకు ప్రాయశ్చిత్తము పరాశక్తి పాద ధ్యానమే యని బ్రహ్మాండ పురాణము బోధించుచున్నది. భక్తితో ఆరాధించు బలహీనులను, అజ్ఞానులను శ్రీమాతయే ఉద్ధరించు కొనును. సామ దాన భేద దండోపాయములతో అసురులను సైతము
ఉద్ధరించునది శ్రీమాత. ఆమె స్మరణము సర్వపాప హరణము.
లలితా స్వరూపుడైన శ్రీకృష్ణ దేవుడు కూడ భగవద్గీతయందిట్లు పలికినాడు. “ఎంత దురాచరుడైనప్పటికి నా భక్తుడు నశింపడు.” కలియుగ వాసులకు ఈ వాక్యమే పట్టుకొమ్మ. కొండంత పాపమును నశింపజేయు దైవమే జీవులకు ఆధారము. దైవము యొక్క కరుణయే
దీనికి కారణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
💐💐💐💐
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతి కరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్||
అస్య శ్రీ ఆదిత్య కవచ స్తోత్ర మహామన్త్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః ఆదిత్యో దేవతా శ్రీం బీజం ణీం శక్తిః సూం కీలకం మమ ఆదిత్య ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః |
ధ్యానం :–
జపా కుసుమ సంకాశం ద్విభుజం పద్మహస్తకమ్|
సిన్దూరాంబర మాల్యం చ రక్తగంధానులేపనమ్ |
మాణిక్యరత్నఖచిత-సర్వాభరణభూషితమ్|
సప్తాశ్వరథవాహం తు మేరుం చైవ ప్రదక్షిణమ్ ||
దేవాసురవరైర్వన్ద్యం ఘృణిభిః పరిసేవితమ్ |
ధ్యాయేత్పఠేత్సువర్ణాభం సూర్యస్య కవచం ముదా ||
కవచం :–
ఘృణిః పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకమ్ |
ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతు దివాకరః ||
ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదారవిః |
జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః ||
స్కంధౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః |
కరావబ్జకరః పాతు హృదయం పాతు నభోమణిః ||
ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్థినీ |
ఊరూ పాతు సురశ్రేష్టో జానునీ పాతు భాస్కరః ||
జంఘే మే పాతు మార్తాణ్డో గుల్ఫౌ పాతు త్విషాంపతిః |
పాదౌ దినమణిః పాతు పాతు మిత్రోఽఖిలం వపుః ||
ఆదిత్యకవచం పుణ్యమభేద్యం వజ్రసన్నిభమ్ |
సర్వరోగభయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః ||
సంవత్సరముపాసిత్వా సామ్రాజ్యపదవీం లభేత్ |
అశేషరోగశాంత్యర్థం ధ్యాయేదాదిత్యమండలమ్ ||
ఆదిత్య మండల స్తుతిః :–
అనేకరత్నసంయుక్తం స్వర్ణమాణిక్యభూషణమ్ |
కల్పవృక్షసమాకీర్ణం కదంబకుసుమప్రియమ్ ||
సిందూరవర్ణాయ సుమండలాయ సువర్ణ రత్నాభరణాయ తుభ్యమ్ |
పద్మాదినేత్రే చ సుపంకజాయ బ్రహ్మేన్ద్ర-నారాయణ-శంకరాయ ||
సంరక్త చూర్ణం ససువర్ణతోయం సకుంకుమాభం సకుశం సపుష్పమ్ |
ప్రదత్తమాదాయ చ హేమపాత్రే ప్రశస్తనాదం భగవన్ ప్రసీద ||
ఇతి ఆదిత్యకవచమ్ ||
ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతి కరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్||
🕉🌞🌏🌙🌟🚩
[21:31, 16/02/2021] +91 92915 82862: Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Feb 16.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - ఫిబ్రవరి 16.
It is good and very grand to conquer external nature, but grander still to conquer our internal nature.
బాహ్యప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే. కానీ అంతఃప్రపంచాన్ని వశం చేసుకోవడం అంతకంటే వీరోచితం.
🕉🌞🌎🌙🌟🚩
వేదాంత దృక్పధంలో పాపమనేదే లేదు. పొరపాట్లు మాత్రమే ఉన్నాయి. మీరు పాపాత్ములనీ ఎందుకూ పనికిరానివారనీ అనడమే వేదాంతం దృష్టిలో పెద్ద పొరపాటు.
🕉🌞🌎🌙🌟🚩
[21:31, 16/02/2021] +91 92915 82862: భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩
దేహముపై అభిమానము కన్నా, దేహము నందు కర్తవ్యము ముఖ్యము. ఈ దేహము ద్వారా నేను లోకహితము నిర్వర్తించుకుంటాను అనేది ఆర్యమార్గము. కర్తవ్యము కోసము దేహమును వినియోగించుకోవడం చేయాలి.
దేహభావన దాటినటువంటి వాడి జీవితము నిష్కారణముగా ఉంటుంది. ఎదుటివారికి ఉపకారము చేయడములో కారణము ఉండదు. కార్యకారణ లోకాలను దాటిపోయిన వారు మహాత్ములు. అవతలవాడికి అవసరము కాబట్టి ఉపకారము చేస్తారు. వాళ్లనుంచి ఏమీ ఆశించరు. ఎందుకు చేస్తున్నారు అంటే అది వారి జీవలక్షణం. కార్యకారణ సంబంధమైన కర్మ, క్రమముగా వారిని వదిలివేస్తుంది. వారిని ముక్త సంగులు అంటారు.
🕉🌞🌎🌙🌟🚩
ఆచార్య సద్భోదన
మనస్సు అలజడిగా ఉన్నప్పుడు సరియైన దృష్టిని కలిగి ఉండటం అసంభవం. మది తలుపులు మూసివేసి చీకటిలో ఉంచరాదు.
కష్టాలు ఎదురైనపుడు, బాధలు కలిగినప్పుడు వాటికి స్వాగత సత్కారాలు చేస్తూ వాటియందే నిలవక జాగృతిని పొందిన ఆత్మే విజయకేతనాన్ని ఎగురువేస్తుంది.
మహాత్ముల చరిత్రలలో వారు ప్రవర్తించిన విధానాలు అన్నీ ఈ రకంగానే ఉంటాయి. కష్టాలను ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు వాటిని ఆశీస్సులుగానే వారు భావిస్తారు. అందువలన జీవన ఒత్తిడి తగ్గిపోతుంది.
ఆధ్యాత్మిక సత్యాలపట్ల మనకు గల అవగాహన మనకు ఎదురయ్యే పరిస్థితుల ప్రాబల్యం ఎటువంటిదైనా మనలను స్థిరంగా నిలుపుతూ మనలోని సమత్వపు స్థితికి తూనికగా నిలుస్తుంది.
పరమాత్ముని ఉనికి పట్ల తైలధార వంటి విశ్వాసం మనలో నిండి ఉన్నంత వరకూ సురక్షితంగా, సుస్థిరంగా నిలిచే ఉంటాం.
శుభంభూయాత్
🕉🌞🌎🌙🌟🚩
[21:36, 16/02/2021] +91 92915 82862: శ్రీరమణీయం -(804)
🕉🌞🌎🌙🌟🚩
ప్రార్థన ఎంతకాలం కొనసాగాలి ? దాని పర్యావసానం ఏమిటి !?"
ప్రార్థన అంటే స్వార్థంతో మన ఇష్టానికి అనుగుణంగా కాకుండా అంతర్యామిగా ఉన్న ఈశ్వర సంకల్పం మేరకు నడిపించాలని కోరుకోవటం. నిజానికి అలా కోరుకోవటం మనలో శుభేచ్ఛను కలిగించటంకోసమే. శుభేచ్ఛ అంటే ఈశ్వరేచ్ఛ. అది అర్థమైన తర్వాత ప్రార్థన చేయడానికి కూడా ఏమీ ఉండదు. ఆ స్థితి కలిగేవరకూ ప్రార్థనగా సాగిన భక్తి ఆ తర్వాత ఆరాధనగా పరిణమిస్తుంది. దైవం ఎడల ఆరాధనాభావం వస్తే ఆత్మీయత ఏర్పడుతుంది. అప్పుడు ప్రతీది దైవంతో చెప్పుకోవడమే కానీ అడగటం ఉండదు. అది చిన్న పిల్లవాడు స్కూల్ కి వెళుతూ 'అమ్మ వెళ్ళొస్తానని' చెప్పటం లాంటిది. అందులో ఏ కోరిక, ప్రార్ధన లేవు. కేవలం ఆత్మీయతే ఉంది. మనకి కూడా భగవంతునితో అలాంటి ఆత్మీయత వస్తే మనకంటూ ప్రత్యేకంగా ఏ సంకల్పం ఉండదు. అదే శరణాగతి. అప్పుడు దైవంతో ఏకాత్మతాభావనే ఉంటుంది. అందుకు మనం విశుద్ధ మనస్కులం కావాలి. దైవం అందరిలోనూ సమంగానే ఉన్నా, విశుద్ధ మనస్కుల్లో బాగా ప్రస్ఫుటం అవుతుందని భగవాన్ శ్రీరమణమహర్షి బోధించేవారు. అలా ప్రస్ఫుటమవ్వాలని ఎవరూ కోరుకోనక్కర్లేదు. అందుకే మన ప్రార్థనా విధానమంతా ఒక అంతిమ లక్ష్యంతోనే సాగుతుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
'ప్రార్థన ఆరాధనగా పరిణమించాలి'- (అధ్యాయం -99)
🕉🌞🌎🌙🌟🚩
[21:36, 16/02/2021] +91 92915 82862: 🕉🌞🌎🌙🌟🚩
""ఋభుగీత "(271)*
🕉🌞🌎🌙🌟🚩
"నామరూపాలు"
19వ అధ్యాయము
ఆధ్యాత్మికత అంటే... మనసులో స్వచ్ఛత ! జీవితంలో స్పష్టత !!
మనం ఉన్నది అమెరికా అయినా, అయోధ్య అయినా మనసు మారకుండా శాంతి సాధ్యం కాదు. మనసు మారితేనే జీవితాలు మారతాయి. మనసు బాగుంటేనే మన మధ్య సత్సంబంధాలు ఉంటాయి. అదే శాంతినిస్తుంది. కష్టాల్లో కూడా మనలోని శాంతి చెదరకుండా ఉండొచ్చని ప్రత్యక్షంగా ఆచరించి చూపేవారే మహానుభావులు. మనలోని భావాలే మాయకు కారణం. మనసు సౌమ్యత పొందే కొద్ది నెమ్మదిస్తుంది. నెమ్మదించిన మనసు బలంగా మారుతుంది. అదే స్థితప్రజ్ఞతకు దోహదపడుతుంది. ఆధ్యాత్మికత అంటే మనసులో స్వచ్ఛత, జీవితంలో స్పష్టతలే !
🕉🌞🌎🌙🌟🚩
[21:42, 16/02/2021] +91 92915 82862: 🌷156 - మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
శ్రద్ధలో పోకడలు
8. సాత్త్వికునకు సాత్త్వికాహారము ప్రియమగును. ఆయువు, సత్త్వము, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి అనువానిని పెంపుదల జేయు ఆహారము సాత్త్వికము. రసవంతములు, చమురు కలవి, స్థిరత్వము కలవి, హృదయమునకు ఇంపైనవి అగు ఆహారములిట్టివి.
(ఆయువనగా దేహ ప్రాణముల సంయోగ సామ్యము. సత్త్వమనగా కార్యభారమును దీర్ఘకాలము వహింపగలశక్తి. బలమనగా ధాతువుల వృద్ధి. ఆరోగ్యమనగా వాతపిత్తశ్లేష్మములు అను త్రిధాతువుల సామ్యము. సుఖమనగా ఇంద్రియములకు, దేహమునకు, మనస్సునకు నడుమ సామ్యము. ప్రీతి అనగా జిహ్వకు నచ్చుట.
రస్యములనగా రసము గల కాయలు, పండ్లు, పువ్వులు, ఆకులు. స్నిగ్ధములనగా నువ్వులు మున్నగు చమురు గల పదార్థములు. స్థిరములనగా దేహధాతువులకు స్థిరత్వమునిచ్చు పప్పులు, దుంపలు మొదలగునవి. హృద్యములనగా తేనె, నెయ్యి మున్నగు గుండెకు బలం ఇచ్చు వస్తువులు. సాత్వికునకు ఇవి అన్నియు ప్రియమై ఉండును.)
9. రజోగుణ ప్రకృతి గలవానికి కారము, పులుపు, ఉప్పు, వేడిగానున్నవి, జిహ్వకు తీక్షణమైన జీడి పండ్లు, కాకరకాయలు మున్నగునవి, ఎండబెట్టినవి, కాల్చినవి అగు ఆహారములిష్టమగును. ఇవి దుఃఖమును, శోకమును, రోగములను కలిగించును.
(రూక్షములనగా వరుగులు, వడియములు మున్నగునవి. విదాహికములనగా వేపుడులు, కాల్చిన కూరలు, మాంసం మున్నగునవి. దుఃఖము కలిగించునవి అనగా మనస్సునకు దిగులు, శోక భావము వృద్ధి పొందించునవి. ఉప్పు, పులుపు, కారములు హెచ్చుగా వాడుట వలన ఇవి కలుగును.)
🕉🌞🌎🌙🌟🚩
[21:49, 16/02/2021] +91 92915 82862: 171) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*ఈశ్వర సర్వభూతానాం
హృద్దేశేఽ ర్జున తిష్ఠతి ౹ భ్రామయన్సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా ౹౹171౹౹*
171. భగవద్గీతయందు శ్రీకృష్టుడిట్లు చెప్పెను: అర్జునా సర్వ భూతముల హృదయములందు ఈశ్వరుడు గలడు.మాయచే సకల జీవులను ఈశ్వరుడు యంత్రము నెక్కించిన బొమ్మలవలె త్రిప్పుచుండును.
సర్వభూతాని విజ్ఞానమయాస్తే హృదయేస్థితాః ౹ తదుపాదాన భూతేశస్తత్ర విక్రియతే ఖలు ౹౹172౹౹
172. "సర్వభూతాని"అనగా సకల ప్రాణుల యందలి జీవులు, ఆనందమయకోశములు.వానికి ఉపాదాన కారణమగుటచే ఈశ్వరుడు కూడా వికారమునొందును.అనగా ఉపాధివశమున వికారము నొందినట్లు కన్పించును.
దేహోది పంఞ్జరం యన్తం తదారోహోఽ భిమానితా ౹ విహితప్రతిషిద్ధేఘ ప్రవృత్తిర్ర్భమణం భవేత్ ౹౹173౹౹
173. యంత్రమనగా శరీర పంజరము.ఆరోహమనగా దాని యందు "నేను"అనే అభిమానముంచుట.
భ్రమణమనగా విహిత,నిషిద్ధ కర్మలను ఆచరించుట.
విజ్ఞానమయరూపేణ తత్ర్పవృత్తి స్వరూపతః ౹ స్వశక్త్యోశో విక్రియతే మాయయా భ్రామణం హి తత్ ౹౹174౹౹
174. ఈశ్వరుడు తన మాయచే జీవులను త్రిప్పుననగా ఈశ్వరుడు తన మాయాశక్తిచే ఆనందమయకోశముల రూపమునొంది వాని వికారములచే తాను వికారము నొందుచున్నట్లు కన్పించుట.
అన్తర్యమయతీత్యుక్త్యాఽ యమేవార్థః శ్రుతౌ శ్రుతః ౹ పృథివ్యాదిషు సర్వత్ర న్యయోఽ యం యోజ్యతాం ధియా ౹౹175౹౹
175. ఈశ్వరుడులో నుండి నియమించుననుచు శ్రుతి ఈ అర్థమునే చెప్పుచున్నది.ఈ న్యాయమునే పృథివి మొదలగు మహా భూతములకు,తదితర విషయములకు కూడా అన్వయింపవలెను.
వ్యాఖ్య:- స్త్రీ గర్భము నందు ఒక జీవి రక్త,మాంసాదులు,వాయువు,
ఉష్ణము,నీరు సమస్తము పంచుకుని రూపుదాల్చుట మెంత సత్యమో,
అలాగే సర్వభూతముల హృదరములందు ఈశ్వరుడు గలడు అనేది అంతే సత్యము.
ఆ ఈశ్వర మాయవలన మాత్రమే నేను అనే అభిమానం శరీరమనే యంత్రమునందు వుంచి బుద్ధిని ఆవరించి ఉన్న అజ్ఞాన మనస్సు కారణంగా మనశ్శరీరాలలోనూ పదార్థ నిర్మిత ప్రపంచాన్ని సత్యమని భావిస్తున్నాము.
నేను అనే అహంకారము ఉదయింపగనే వ్యక్తిత్వము అత్యంతబలహీన మగును.
"ఇది నాది","ఇది నా దేహము" అను భావన కలుగగనే చేయిపనిలో అసమర్థతగను, దౌర్బల్యము అనివార్యమగును. స్వాతంత్ర్యము హరించును.
జ్ఞానులసాంగత్యమున ఆత్మజ్ఞానముదయించును.తత్కాలమందే దృశ్యవిషయములుగా సత్యమనే భావన క్షీణించి చివరకు అదృశ్యమగును.అట్లు ప్రపంచ దృశ్య విషయముగా నశించినప్పుడు పరతత్త్వము మాత్రమే ఉండును.
ఆ చైతన్యము యొక్క అద్భుతమగు అభివ్యక్తియే అకారమే ప్రపంచముగా భావింపబడుచున్నది తప్ప వేరేదియుగాదు.
ఉపాధులన్నిటి ద్వారా చైతన్యమే వ్యక్తమవుతూ కర్మలను చేయిస్తొంది.బల్బులో విద్యుచ్ఛక్తి ఉంటూ కాంతిగా వ్యక్తమవుతున్నట్లే,ఆత్మ చైతన్యం శరీర కర్మలుగా వ్యక్తమవుతొంది.
బల్బులోపల విద్యుచ్ఛక్తి లేకపోతే బల్బు ద్వారా కాంతి వ్యక్తమే కాదు.
చైతన్యమే అన్ని ఉపాధులకు అధారంగా ఉంటూ నియమిస్తొంది.
మన దేహమునందు వున్న పంచభూతాల సమ్మేళనంతో సూక్ష్మముగా వుంటూ నానాత్వాన్ని అనుభవిస్తూనే అదంతా బ్రహ్మమేననీ రెండవదేదీ లేదనీ దృడంగా తెలుసుకుంటూ మాయాకల్పిత జగన్నాటకాన్ని ప్రసన్నంగా వీక్షించగలగాలి.
శరీరమే "నేను"గా పొరబడడానికి మించిన అజ్ఞానం మరేదీ ఉండబోదు.
🕉🌞🌏🌙🌟🚩
[21:52, 16/02/2021] +91 92915 82862: అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
1.ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గన బగిలె!!
2.ఎగసినగరుడని యేపున'ధా'యని జిగిదొలకచబుకు చేసినను నిగమాంతంబులు నిగమసంఘములు గగనము జగములు గడగడ వడకె!!
3.బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు గోపించినను సరుస నిఖిలములు జర్జరితములై తిరువున నలుగడ దిరదిర దిరిగె!!
4.పల్లించిననీపసిడిగరుడనిని కెల్లున నీవెక్కినయపుడు ఝల్లనె రాక్షససమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వేంకటరమణ!!
🕉🌞🌎🌙🌟🚩
[21:56, 16/02/2021] +91 92915 82862: ||శ్రీమన్నారాయణీయము||అష్టమ స్కంధము 27వ దశకము - లక్ష్మీస్వయంవరము వర్ణనము 28-3-శ్లోకము
🕉🌞🌎🌙🌟🚩
జగదీశ భవత్పరా తదానీం
కమనీయా కమలా బభూవ దేవి।
అమలామవలోక్య యాం విలోలః
సకలో౾ పి స్ప్రుహయాంబభూవ లోకః!
భావము:-
జగదీశా! కమలాలయైన లక్ష్మీదేవి, పిమ్మట ఆ క్షీరసాగరమునుండి ఉద్భవించెను. ఆమె మిక్కిలి మనోహర రూపముతో ప్రకాశించుచుండెను. ఆమె నిర్మలరూపమును చూచి, దేవదానవులిరువురు ఆకర్షితులై, ఆమెను కోరుకొనుచుండిరి.
వ్యాఖ్య:-
దూర్వాస మహర్షి శాపం వలన సముద్రంలో దాగి ఉన్న లక్ష్మీదేవిని బయటకు తీసుకురావడానికి క్షీరసాగర మథనం అనే ఒక మిష ఏర్పరిచి అమ్మను బయటకు రప్పించి తాను పరిగ్రహించాడు స్వామి.
ఒకానొక సమయంలో దూర్వాస మహర్షి లోక సంచారానికి బయలుదేరగా పూలమాలతో ఎదురొచ్చిన ఒక అప్సరస దుర్వాసునికి నమస్కరించింది. ఆశీర్వదించిన మహర్షి ఆ పూల మాలను తనకు ఇమ్మని అడగగా, మహా ప్రసాదం స్వామి అంటూ అప్సరస ఆ మాలను మహర్షికి అప్పగించింది. పూల మాలను తీసుకున్న దూర్వాస మహర్షి స్వర్గమునుకు వెళ్ళగా అప్పుడే ఐరావతంపై వస్తున్న ఇంద్రుడు ఎదురుపడ్డాడు. భద్రగజం ఎక్కిన రాజు ఎదురుగా ఎవరొచ్చినా దిగరాదు అనే నియమాన్ని అనుసరించి అలాగే మహర్షికి వందనం సమర్పించాడు. దూర్వాస మహర్షి తన చేతిలోని మాలను ఇంద్రుడికి ఇవ్వగా ఆ మాలను వాసన చూసి ఐరావతం కుంభ స్థలంపై ఉంచాడు.
దూర్వాసుని ఇంద్రుని పరవశింప చేసిన మాల సువాసన ఐరావతాన్ని కూడా మత్తెక్కించగా తొండంతో ఆ మాలను తీసుకుని వాసన చూసి నేలకేసికొట్టింది. ఇంద్రుని పై ఆగ్రహించిన దూర్వాసుడు ఎంతో దూరం నుంచి తీసుకొచ్చిన మాలను స్వీకరించి ఏనుగుచే అవమానింప చేస్తావా అంటూ అధికార మదం, ఐశ్వర్య మదం నిన్ను కమ్ముకున్నాయంటూ ఈ నాటి నుంచి మూడు లోకాలలో లక్ష్మీ అంతర్ధానమవుతుందని శపించాడు.
మూడు లోకాలలో లక్ష్మి అదృశ్యం కాగానే రాక్షసులు స్వర్గంపై దాడి చేసిన స్వర్గాన్ని ఆక్రమించారు. రాజ్య భ్రష్టుడైన ఇంద్రుడు మరల స్వర్గాన్ని పొందడానికి రాక్షసులతో ఘోర యుద్ధం చేయగా ఆ యుద్ధంలో దేవతలు అపజయం పాలయ్యారు. కొందరు దేవతలు రాక్షసులతో పీడించబడి అంతం చేయబడ్డారు. ఇది తట్టుకోలేని దేవతలు రాక్షసుల బారి నుంచి తమను కాపాడి మృత్యువు లేని ఉపాయం సూచించమని శ్రీమన్నారాయణుని శరణు వేడారు.
రాక్షసులతో సంధి చేసుకుని వారితో కలిసి క్షీరసాగరంలో ఓషధులు వేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకి అనే సర్పాన్ని కవ్వపు తాడుగా చేసి చిలకగా వచ్చిన అమృతాన్ని తాగితే మరణించరని దేవతలకు స్వామి సూచించెను.
దేవతలు రాక్షసులతో సంధి చేసుకుని అందరూ కలిసి మందర పర్వతాన్ని ఎత్తడానికి విఫలయత్నం చేసి మరల శ్రీమహావిష్ణువుని ప్రార్ధించగా స్వామి గరుత్మంతునికి పర్వతాన్ని ఎత్తే పని పురమాయించగా ఆయన ఆ పర్వతాన్ని ముక్కుతో పట్టుకుని సముద్రంలో పడవేశాడు. అటు పిదప వాసుకిని ప్రార్ధించి అమృతంలో భాగం ఇస్తామని చెప్పి ఒప్పించి వాసుకుని తాడుగా చేసి పాలసముద్రాన్ని చిలకనారంభించారు. ఆ క్రమంలో పర్వతం నీట మునగ సాగింది. మరల స్వామిని ప్రార్ధించగా శ్రీమన్నారాయణుడు కూర్మ రూపాన్ని ధరించి పర్వతాన్ని మూపున మోశాడు. పర్వతం మునగలేదు కానీ ఒక పక్కకు ఒరగ సాగింది. దాన్ని ఆపడానికి స్వామి పర్వతం పై భాగాన కూర్చున్నాడు. పైన కింద మీరుండగా మధ్యన వాసుకి చుట్టబడి లాగుతుండగా ఆ ఒరిపిడికి తట్టుకోలేకున్నానని మందర పర్వతం ప్రార్ధించగా మధ్య భాగంలోను స్వామి వచ్చి చేరాడు.
తమ ముందు స్వామి నిలబడితేనే పని చేయగలమని దేవదానవులు ప్రార్ధించగా వారి ముందూ తానే నిలిచాడు. స్వామి తమ ముందున్నా పర్వతాన్ని లాగగల శక్తిని ప్రసాదించమని ప్రార్ధించగా దేవదానవులలోనూ తానే చేరాడు. దేవతలు రాక్షసులు కలిసి తనలో పర్వతాన్ని వేసి చిలుకుతుంటే తాను తట్టుకోలేకున్నానని సముద్రుడు ప్రార్ధించగా సముద్రుడిలోనూ తానే చేరాడు స్వామి. ఈ విధంగా పర్వతం పైన కింద మధ్యలో దేవతలలో మరియు వారి ముందు రాక్షసులలో మరియు వారి ముందు, సర్పంలో, సముద్రంలో ఇలా తొమ్మిది రూపాలలో స్వామి క్షీర సాగర మథనం చేశాడు. అన్నీ తానై అంతటా తానై పాల సముద్రాన్ని చిలికిన వాడు శ్రీమన్నారాయణుడే.
సముద్ర మథనం చేయగా మొదటగా వచ్చిన హాలాహలాన్ని శంకరుడికి ఇచ్చాడు స్వామి. అలాగే చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం, అప్సరసలు, కౌస్తుభమణి వంటివి వచ్చిన పిదప సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి ఉద్భవించింది. ఆ తరువాత వచ్చిన అమృతాన్ని దేవతలకు పంచాడు.
స్వామి ఇంత కష్టపడినది దేవతలకు అమృతం ఇవ్వడానికేనా అంటే లోతుగా ఆలోచిస్తే దూర్వాస శాపం వలన సముద్రంలో దాగి ఉన్న లక్ష్మీదేవిని బయటకు రప్పించడానికే ఇంత సంరంభం చేసాడు స్వామి. దేవతలకి అమృతం కోసమే చేసినట్టు అనిపించినా వాస్తవానికి లక్ష్మీదేవి కోసమే స్వామి ఇంత ప్రయాస పడ్డారు.
ఈ కథ కాకుండా భ్రుగుమహర్షి కుమార్తెగా లక్ష్మీదేవి జన్మించినట్లు మరో కధనం కూడా ప్రచారంలో ఉంది. ఆ కథ ప్రకారం....
భ్రుగుమహర్షి భార్య ఖ్యాతి పుత్రికా సంతానం కావాలని ఆశపడింది. ఆ కోరిక నేరవేరేందుకు జగన్మాత అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంది. జగన్మాత అనుగ్రహం మేరకు అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి ఆమెకు కూతురిగా జన్మింస్తుంది. భ్రుగుమహర్షి కుమార్తె కనుక ఆమెను భార్గవిగా పిలుస్తారు. ఇదే కాక వామనావతార గాథలో సైతం లక్ష్మీదేవి జననానికి సంబంధించిన కథ ఉంది.
🕉🌞🌎🌙🌟🚩
[22:00, 16/02/2021] +91 92915 82862: ఓం నమః శివాయ:
7-వేదములు📚((((((((((🕉)))))))))) ఆచార్య వాణి🧘♂️
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
6. యజ్ఞం
((((((((((🕉))))))))))
అగ్ని సహాయంతో, మంత్రోచ్చారణతో విధ్యుక్తమైన కర్మలు చేయటమే యజ్ఞయంటే. ''యజ్ఞ'' మన్న పదం ''యజ్'' అనే ధాతువునుండి వచ్చింది. దీని అర్థం - ''ఆరాధించు'', లేక, ''సమర్పించు''.
క్రతువుని మనసారా, పరమాత్మ పట్లా దేవతల పట్లా సంపూర్ణమైన భక్తి భావంతో నిర్వహించటమే యజ్ఞమంటే. ''మననం చేసేవాడిని రక్షించేది మంత్ర''మని చెప్పుకొన్నాం. పఠించేవాడిని కాపాడటం మంత్రం యొక్క విధి. మననమంటే మనసారా జపించటం. సాధారణంగా మంత్రాలని వినబడేట్టు ఉచ్ఛరించ వలసినా కొన్నిటిని మాత్రం అట్లా పలుకనక్కరలేదు. నిశ్శబ్దంగా జపించినా మంత్రాలు ఆయా నాడులను అనుకూలంగా ప్రకంపింప చేస్తాయి.
దానినే బిగ్గరగా వల్లె వేస్తే దాని కొక మహనీయత ఉన్నట్టు తెలుస్తుంది - అర్థం తెలియక పోయినా పరవశింప చేస్తుంది. మనస్సులో ఉన్నది. వల్లెవేసినప్పుడు బయటకు వస్తుంది. అది శరీరకదలిక ద్వారా కార్యరూపం దాలుస్తుంది. వేదోక్తమైన విధినిర్వహణకు మనస్సు, వాక్కు, కాయమూ ఒకే విధంగా పని చెయ్యాలి - అన్నీ పరిపూర్ణంగా పాలుపంచుకొంటున్నట్లవుతుంది. అంటే, మననం శబ్ద రూపంలో నోటి ద్వారా బయటకు వచ్చి, శరీరం చేసే పని ద్వారా యజ్ఞమవుతుంది.
అందువల్ల యజ్ఞము వేదోక్తమైన ముఖ్యమైన విధులలో ఒకటి. ఇతర మతాలలో లేదు: ఇటువంటి కర్మకాండ ఇతరమతాలలో లేదు. వేదాలపై ఆధారపడి యుండటం వల్ల మన మతాన్ని వైదిక మతమంటారు. దీనికీ, ప్రపంచంలో ఉన్న ఇప్పటి మతాలకీ ఒక ముఖ్య భేదముంది. క్రైస్తవమతం, ఇస్లాం ఇత్యాది మతాలు ''అందరూ ఆరాధించవలసిన దైవమొక్కడే'' అని అంటాయి.
వేదాలు కూడా అన్ని ఆత్మలూ తనలోనే ఉన్న ఒకే ఒక దేవుడున్నాడంటాయి. కాని, ''ఒక దేవుడు'' అన్న భావాన్ని అనుభవసిద్ధం చేసుకోవటానికి చింతనద్వారా కలిగే జ్ఞానమవసరం. ఆ స్థితిని చేరుకోవటానికి వినీతి ఎంతో అవసరం. భగవంతునితో ఏకమైనప్పుడు మనకి గోచరించే జగత్తు మాయమవుతుంది : ఆ స్థితిని చేరుకోవాలి. ప్రాపంచక విషయాలలో తేలిపోయే మన జీవితాలను ఎంతో క్రమ శిక్షణకు లోను చేస్తేనే గాని ఆ స్థితిని చేరుకోలేం. ఈ వ్యాపకాలలో చిక్కుకొన్న మనం ధర్మమార్గాన పోవాలి, మనస్సుని క్షాళనం చేసి, పరిణతిని కలిగించే క్రతువులని చెయ్యాలి. ఆ స్థితిని చేరుకొన్న తరువాత ప్రాపంచక బంధాలు తెగిపోతాయి. ఆ గమ్యాన్ని చేరటానికి వేదాలు అనేక మార్గాలనూ, ఉపాయాలనూ సూచించాయి.
వీటిలో యజ్ఞమనే కర్మ అతిముఖ్యమైనది. ఒకే ఒక దేవునికి కాక, అనేక దేవతలకు ఉపహారాలిస్తూ ఫలితాన్ని భగవంతునికి సమర్పించటమే యజ్ఞమంటే, యజ్ఞమన్నది మన మతానికి ప్రత్యేకం. ఏ ఇతర మతంలోనూ ఇది లేదు. వేదమంత్రాలని పఠిస్తూ వివిధ పదార్థాలని అగ్నికి ఆహుతి చెయ్యాలి యజ్ఞంలో. దీనిని ''హోమ'' మంటారు. అగ్నికి ఆహుతి చేసినా అన్నిటినీ అగ్నికే సమర్పిస్తున్నామని అర్థం కాదు. ప్రత్యేకంగా అగ్నికి సమర్పిస్తున్నట్టు మంత్రం చెప్పినప్పుడే అవి అగ్నికి చెందుతాయి.
ఇతర దేవతలకి అంటే రుద్రునకూ, విష్ణువునకూ, ఇంద్రునకూ, వరుణునకూ, వాయువునకూ, సోమునకూ సమర్పించిన వాటిని వారికి చేరుస్తాడు అగ్నిదేవుడు. మిగిలిన మతాలకీ, వైదిక మతానికీ గల ముఖ్యమైన వ్యత్యాసమిదే. మనం కూడా ఒకే దేవుడ్ని విశ్వసించినా, ఆయనకే కాక ఇతర దేవతలకి కూడ అగ్ని ద్వారా ఉపహారాలర్పిస్తాం.మానవసేవ భగవంతునికి ప్రీతిపాత్రమంటాం. సంఘసేవకులు ''మానవసేవే మాధవసేవ - సమాజానికి సేవ భగవంతునికి సేవ'' అంటారు.
ఆ విధంగానే యజ్ఞాల ద్వారా, భగవంతుని సృష్టియైన దేవతలకు యజ్ఞమూలకంగా సేవ చేయటం కూడ భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించి పెడుతుంది. భగవంతు డొక్కడే అనీ, ఆయనే అనేక దేవతల రూపాలను ధరిస్తాడనీ వేదాలు నొక్కి చెప్పుతాయి. ఏ దేవతని వర్ణించినా, ఆ దేవత పరమాత్మ అంటాం. వేదాలు కూడా దైవమొక్కడే అని చెప్తాయి. భగవంతునికీ దేవతలకీ గల భేదాన్ని మాత్రమే అవి సూచిస్తాయి.
ఎందరో దేవతలని భగవంతునిగా పేర్కొంటాయి కాబట్టి ''వేదాలు అనేక దేవుళ్లున్నారని అంటాయి'' అనుకోవటం తప్పు. ఒకే దేవుడు అనేక దేవతలుగా కనబడుతాడని అర్థం. విశ్వనియంత్రణకై అనేక దేవతలను సృష్టించాడు భగవంతుడు. ఈ దేవతలు వేరు వేరు విధులను నిర్వహించాలి - మన వలనే దేవతలు కూడ సృష్టింపబడ్డారు. మనని కూడ తననుండే సృష్టించాడు ఈశ్వరుడు.
అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవాత్మా, పరమాత్మా ఒకటే. అందువల్ల పరమాత్మ దేవతలకు కూడ ప్రతినిధే. అద్వైత సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకొనే స్థితికి చేరుకొనే వరకూ - మనకూ దేవతలకూ భేదముందనుకొంటూ యజ్ఞాలూ, పూజలూ లోకశ్రేయస్సుకోసం చేస్తూండాలని వేదాలు నిర్దేశించాయి. ప్రకృతిలోని శక్తులూ, సర్వభూతాలూ పరమాత్ముని ఆదేశానుసారం, దేవతల ఆధీనంలో, ప్రవర్తిస్తాయి.
కాబట్టి మనమూ, మనచుట్టూ ఉన్న ప్రపంచమూ ప్రకృతి శక్తులనుండి లబ్ధిని పొందాలంటే ఆయా అధిష్ఠాన దేవతలను సంతృప్తి పరచాలి. దేవతలు యజ్ఞాల వల్ల సంతుష్టులవుతారని వేదాలు చెప్తాయి. ఆధ్యాత్మికంగా మేల్కొన్నప్పుడూ పరమాత్ముని స్వయంగా గ్రహించినప్పుడూ విడిగా దేవతలని సంతృప్తి పరచవలసిన అవసరముండదు. మనం ద్వైత భావంతో ఉన్నంత కాలమూ ప్రతి దేవతనీ పూజించాలి. ఇది వేదవాక్కు.
🕉🌞🌏🌙🌟🚩
[
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 59 🌴
59. యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే |
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ||
🌷. తాత్పర్యం :
ఒకవేళ నా నిర్దేశము ననుసరించి వర్తించక యుద్ధము చేయకుందువేని నీవు తప్పుమార్గమును పట్టినవాడవగుదువు. నీ స్వభావము ననుసరించి నీవు యుద్ధమునందు నియుక్తుడవు కావలసియే యున్నది.
🌷. భాష్యము :
అర్జునుడు క్షత్రియగుణముతో జన్మించినవాడు మరియు యుద్ధవీరుడు. తత్కారణముగా యుద్ధము చేయుట అతని సహజధర్మమై యున్నది. కాని మిథ్యాహంకారము వలన అతడు గురువు, పితామహుడు, ఇతర మిత్రుల వధచే పాపము సంక్రమించునని భయపడుచున్నాడు.
అనగా ఇచ్చట అర్జునుడు కర్మలకు శుభాశుభ ఫలములను ఒసగునది తానేయైనట్లు తనను తాను …
[05:20, 17/02/2021] +91 98494 71690: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 294, 295 / Vishnu Sahasranama Contemplation - 294, 295 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
05:20, 17/02/2021] +91 98494 71690: 🌹. వివేక చూడామణి - 25 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అంతఃకరణాలు - 2 🍀
97. ఈ స్థూల శరీరాన్ని లింగ శరీరమని, అది పంచభూతాలతో తయారైనదని ఈ భూతములు విడిపోవుటాలు, కలయికలు అను విధానము ద్వారా పంచతన్మాత్రులుగా రూపొంది ఈ శరీరము గత జన్మలలో పొందిన అనుభవాలను, అనుభూతులను పొందుటకు తోడ్పడుచున్నది. అజ్ఞానము వలన అనంతమైన క్రియలు వాటి ఫలితములను జీవాత్మ అనుభవించుచున్నది.
98,99. కలలు జీవాత్మ యొక్క ప్రత్యేకమైన స్థితి మెలుకవ స్థితికి భిన్నముగా ఇది ప్రకాశించుచున్నది. కలలలో బుద్ధి లేక మనస్సు వివిధ పాత్రలను జీవాత్మకు సాక్షిగా పోషిస్తూ మెలుకవ స్థితుల యొక్క జ్ఞాపకాలకు అనుగుణముగా జీవాత్మ అనుభవించుచున్నది. అదే సమయములో ఆత్మ ప్రకాశమును గ్రహించి బుద్ధి అన్ని విషయాలను నడింపించు చున్నది. ఆత్మ బుద్ధి యొక్క చేష్టలకు అతీతముగా సాక్షిగా గమనించుచున్నది. ఎన్ని…
[05:21, 17/02/2021] +91 98494 71690: 🌹. దేవాపి మహర్షి బోధనలు - 35 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 26. జ్ఞానయోగము - కర్మయోగము - 1 🌻
సృష్టి ప్రణాళిక ననుసరించని జీవుడు సుఖమును కోల్పోవు చున్నాడు కాని ప్రయాణము మాత్రము సృష్టి ప్రణాళికననుసరించియే యుండును.
ప్రణాళికననుసరించు వారికి సృష్టి చక్రము నందు సమన్వయమేర్పడి కారణము లేని తృప్తి కల్గియుందురు. వారికి సర్వము యజ్ఞార్థకర్మయే కాని తమకు సంబంధించినదేదియు యుండదు. ప్రయాణమున సుఖముండును.
స్వభావము ననుసరించి లోకశ్రేయస్సు కోరి, ఫలాపేక్ష లేక కలవరపాటు లేక ఆచరించిన కర్మ వలన పరిపూర్ణ సిద్ధి కల్గును. ఫలాపేక్ష లేకపోయిననూ పనులయందు పట్టుదల సడల రాదు. ఇతరులు కూడ ఫలాపేక్ష లేక వర్తింపవలెనను బుద్ధి యుండరాదు. ప్రకృతి యందు పనులన్నియు గుణముల ప్రేరణచే కల్గునని గమనించి వ్యక్తులు కారణము కాదని తెలియవలెను.
ఇట్లు తెలియుట వలన తనపై కర్తృత్వము …
[05:21, 17/02/2021] +91 98494 71690: 🌹. చేయాల్సింది చేయకనే అసహనం 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
‘‘నాతో విసిగిపోయిన నేను నిస్సారమని తెలుసుకున్నాను... ఇప్పుడేం చెయ్యాలి?’’ అని నన్ను అడిగావు. అది ఒక గొప్ప ఆవిష్కరణ. అవును, నా భావన అదే. చాలా కొద్దిమంది మాత్రమే తాము చాలా విసిగిపోయామని తెలుసుకుంటారు. అది శుభారంభమే. తమ గురించి తప్ప, అది అందరికీ తెలుసు. ఇప్పుడు మనం కొన్ని అంతర్భావాలను అర్థం చేసుకోవాలి.
చిరాకుపడుతూ విసుక్కునే ఏకైక జంతువు కేవలం మనిషి మాత్రమే. అది మనిషికున్న ఒక గొప్ప ప్రత్యేకమైన హక్కు, మనుషులు ప్రదర్శించే దర్జాలో ఒక భాగం. విసుక్కునే గాడిదలను, దున్నపోతులను మీరెప్పుడైనా చూశారా? అవి ఎప్పుడూ విసుక్కోవు. విసుగు అంటే మీరు జీవించే తీరు సరిగాలేదని అర్థం. ‘‘నాకు చాలా విసుగ్గా ఉంది. అది పోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి’’ అనుకుంటూ మీరు ఏదో…
[05:21, 17/02/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 212 / Sri Lalitha Chaitanya Vijnanam - 212 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ‖ 54 ‖
🌻 212. 'మహారూపా' 🌻
గొప్ప రూపము కలది, శ్రేష్ఠమైన రూపము గలది అని అర్థము.
శ్రీమాత పరతత్త్వమునకు ప్రథమ రూపము. అవ్యక్తమగు పరతత్త్వము రూపముగొనుట మూలప్రకృతి మూలముననే. అవ్యక్తము వ్యక్తమగుట శ్రీమాత కార్యమే కనుక ఆమెదే ప్రధాన రూపము. ఆమె కారణముగనే ప్రధాన పురుషుడేర్పడును. ఏ లోకమునందు గల రూపమైనను ఆమె కారణముగనే ఏర్పడుచున్నది. ఆమె విశ్వరూప.
సృష్టియందు ప్రధానముగ వ్యక్తమగునవి కాలము, ప్రకృతి. ఈ రెండునూ పరతత్త్వము నుండి వ్యక్తమగును. కాలమునకు …
[17:31, 17/02/2021] +91 92915 82862: శ్రీ ఆది శంకరాచార్యుల విరచితం శ్రీ గణేశ పంచ రత్న స్తోత్రం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
1.ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం!!
కళాధరావతంసకం విలాసిలోక రక్షకం!!
అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం!!
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం!!
తాత్పర్యం:-
మోదకములు చేతిలో ఆనందంగా ఉంచుకుని, ఎల్లప్పుడూ మోక్షాన్ని ప్రసాదించే, శిరస్సున చంద్రుని ధరించిన, లోకాన్ని కాపాడే, నాయకులకే నాయకుడైన, అసురులను, అన్ని ఆశుభాలను నశింప జేసే ఆ విఘ్నేశునికి నా నమస్కారములు.
2.నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం!!
నమస్సురారి నిర్జనం నతాధికా పదుద్ధరం!!
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం!!
మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం!!
తాత్పర్యం:-
భక్తుల శత్రువులకు భయం కలిగించేవానికి, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్న వానికి, దేవతలు, అసురులచే నుతింపబడేవాడికి , భక్తుల విఘ్నాలను తొలగించే వానికి, దేవతలకే దేవునికి,సర్వ సంపదలకు అధిపతి అయిన వానికి, గజరాజుకు, దేవతల గణాలకు అధిపతి అయిన వానికి ఎల్లప్పుడూ నా నమస్కారములు.
3.సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం!!
ధరేదరోదరం వరం వరే భవక్త్ర మక్షరం!!
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం!!
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం!!
తాత్పర్యం:-
సమస్త లోకాలకు శుభం కలిగించే వానికి, లోకాన్ని గజాసురుని బారినుండి కాపాడిన వానికి, పెద్ద ఉదరముతో, గజముఖముతో జనులను ఆశీర్వదించే వానికి, కరుణను కురిపించే వానికి, తప్పులను క్షమించి, శుభము,యశస్సు కలిగించే వానికి, తనకు నమస్కరించే వానికి సర్వ శుభాలు కలుగ జేసే విఘ్నరాజునికి నా నమస్కారములు.
4.అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం!!
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం!!
ప్రపంచ నాశ భీషనం ధనంజయాది భూషణం!!
కపోల దాన వారణం భజే పురాణ వారణం!!
తాత్పర్యం:-
కోరికలను తీర్చి, బాధలను నశింపజేసే వానికి, అనాదిగా పూజింపబడిన వానికి, ప్రళయ కారకుడైన శివుని పెద్ద కుమారునికి,అసురుల గర్వాన్ని అణచే వానికి, ప్రళయ కాలంలో భీషణంగా ఉండే వానికి, సర్పము ఆభరణంగా ఉన్నవానికి, మద గజము వలె ఉత్సాహముగా ఉన్నవానికి, పురాతనమైన వానికి నా భజనలు.
5.నితాంతికాంత దంత కాంతిమంత కాంతకాత్మజం!!
అచింత్య రూప మంతహీన మంత రాయకృంతనం!!
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినం!!
తమేకదంతమేవతం విచింతయామి సంతతం!!
తాత్పర్యం:-
ఎంతో శోభతో ఉన్న దంతము కలవానికి (ఏకదంతునికి), మృత్యుంజయ కారకుడైన శివుని కుమారునికి, వర్ణనకు, ఊహకు అందని ఆకారము కలవానికి, అంతము లేని వానికి,విఘ్నాలు, ఆపదలు తొలగించే వానికి, వసంత రుతువులాగా యోగుల మనస్సులో నిలిచే వానికి ఎల్లప్పుడూ నా స్మరణ.
శ్రీఆదిశంకరాచార్య విరచితము శ్రీ గణేశ పంచరత్నం సంపూర్ణం.
🕉🌞🌎🌙🌟🚩
[17:46, 17/02/2021] +91 92915 82862: 🕉🌞🌎🌙🌟🚩
ఆచార్య సద్భోదన
మన యొక్క ఆలోచనలనీ, భావాలనీ నిర్లక్ష్యం చేస్తే ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధిని సాధించలేము. మన ఆంతరిక జీవితాన్ని క్రమబద్ధం చేసుకోవాలి. ఇది మనకి మనమే చేసుకోవాలి కానీ ఇంకొకరు చేసేది కాదు. ఎప్పుడైనా ఉత్సాహం తగ్గితే దానిని రెండింతలు, మూడింతలు చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడప్పుడూ ఆధ్యాత్మిక ప్రమత్తత ఆవులిస్తూ ఉంటుంది. దానిని సాహస హృదయంతో అధిగమించాలి. భగవంతుడు మనకు దూరంగా ఎక్కడో లేదు. మనం ఇలా భావించినందువల్లే అతడు దూరంగా ఉన్నట్లు అగుపిస్తున్నాడు. పవిత్రత, విశ్వాసాల ద్వారా ఆయన సామీప్యాన్ని పొందాలి.
శుభంభూయాత్
🕉🌞🌎🌙🌟🚩
[17:53, 17/02/2021] +91 92915 82862: శ్రీరమణీయం -(805)
🕉🌞🌎🌙🌟🚩
"ఆధ్యాత్మిక జీవనం అంత సులభంగా ఉండేట్లు కనిపించడం లేదే !?"
సత్యాన్ని అర్థం చేసుకోవడం, తేలికైన తెలిసిన మార్గంలోనే అర్థం చేసుకోవటం ఆధ్యాత్మిక జీవనాన్ని సులభతరం చేస్తుంది. ముందు దేవుడున్నాడని తెలుసుకునేందుకు, ఆయన సమర్థతను గుర్తించేందుకు, ఆయనను ఎలా ఆరాధించాలో తెలియజేసేందుకు, దైవాన్ని ఎలా దర్శనం చేసుకోవాలో చెప్పేందుకు, చివరికి తాను ఆ దైవానికి భిన్నంగాలేనని రూఢీ చేసుకునేందుకు.. ఇలా అంచలంచలుగా ప్రతి ఒక్కరూ తమలోని దివ్యత్వాన్ని తెలుసుకోవడం ద్వారా మరింత ఉన్నతమైన, వివేకవంతమైన, నాణ్యమైన జీవనంతో ఆదర్శంగా నిలుస్తారు. ప్రార్థనగా మొదలైన భక్తి ఆరాధనగా పరిణమించి మన స్వస్వరూపాన్ని తెలుసుకోవటమే ఆధ్యాత్మికతలోని అంతర్యం !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
'ప్రార్థన ఆరాధనగా పరిణమించాలి'- (అధ్యాయం -99)
🕉🌞🌎🌙🌟🚩
[17:53, 17/02/2021] +91 92915 82862: "ఋభుగీత "(272)
🕉🌞🌎🌙🌟🚩
"నామరూపాలు"
19వ అధ్యాయము
పరమశాంతి సొంతమైతే ఇక ప్రత్యేక సాధనలతో పనిలేదు !!
లౌకికజీవనం, భౌతికజీవనం అంతా గతానుభవంపై ఆధారపడి ఉంటుంది. దైవానుభవం అలాంటిది కాదు. దానికి గతానుభవంతో పనిలేదు. ఎందుకంటే అది నిరంతరం ఉంటుంది. నిత్యనూతనంగా ఉంటుంది. అది మరొకదానితో పోల్చదగింది కాదు. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిదికాదు. అది నిరంతరాయ వర్తమానం. భూత, భవిష్యత్ లతో సత్యానికి నిమిత్తం లేదు. ఆధ్యాత్మికత అంటేనే శాంతి సాధన. పవిత్రమైన జీవనంతో పరమశాంతి మన సొంతమైతే, ఇక ప్రత్యేక సాధనతో పనిలేదు !
🕉🌞🌎🌙🌟🚩
[05:42, 18/02/2021] +91 98494 71690: 🌹. వివేక చూడామణి - 26 / Viveka Chudamani - 26 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అంతఃకరణాలు - 3 🍀
100. ఈ స్థూల శరీరము ఆత్మ యొక్క అన్ని కార్యాలకు పరికరముగా తోడ్పడుచున్నది. ఆత్మ పరిపూర్ణ జ్ఞానముతో ఏ విధముగా అయితే వడ్రంగి; భాడిత, సుత్తి, మొదలగు పరికరములతో పనిచేసినట్లు ఆత్మ పనిచేయుచున్నది.
101. కండ్లు బలహీనముగా, గుడ్డిగ లేక చురుగ్గా ఉన్నప్పటికి అలానే చెవి; మూగగా చెముడు కలిగి ఉన్నప్పటికి, అన్ని తెలిసిన ఆత్మకు ఆ చెవిటి తనము, గుడ్డి తనము ఉండవు, అంటవు.
102. శ్వాస తీసుకొనుట, వదులుట, ఆవలింతలు, తుమ్ములు, శ్వాస బిగబెట్టుట శరీరమును వదులుట అనునవి ప్రాణము యొక్క వివిధ పనులు. మిగిలినవి దప్పిక, ఆకలి అనునవి ప్రాణ శక్తి యొక్క ఇతర పనులు.
103. పంచ జ్ఞానేంద్రియాలైన కన్ను, ముక్కు మొదలగువాని వెనుక మనస్సు పనిచేస్తున్నది. అలానే శరీరములోని వివిధ భాగములు ఆత్మ యొక్క ప్రతిబింబాలే.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 5
🍀 5 - 1. ఆత్మోద్ధరణ - తనను తానే ఉద్ధరించుకొనవలెను. తనను తాను అధోగతికి చేర్చుకొనగూడదు. తనను తానుద్ధరించు కొన్నప్పుడు, తనకు తాను బంధువు. అట్లు కానిచో తనకు తానే శత్రువగును. తాను - నేను అను ప్రజ్ఞ మనయందు నాలుగు స్థితులలో యున్నది. అందు మూడు స్థితులు దివ్యము. ఒక స్థితి దివ్యమే అయినను స్వభావమున బంధింపబడి యుండును. ముందు మూడు స్థితులు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న వ్యూహము లనియు, నాలుగవది అనిరుద్ధ వ్యూహ మనియు తెలుపుదురు. మొదటి ప్రజ్ఞను 'పరమాత్మ', రెండవ ప్రజ్ఞను జీవాత్మ లేక ప్రత్యగాత్మ అందురు. మొదటి ప్రజ్ఞను వాసుదేవ ప్రజ్ఞ యని, రెండవ ప్రజ్ఞను సంకర్షణ ప్రజ్ఞయని కూడ అందురు. అట్లే మొదటి ప్రజ్ఞను నారాయణుడని, రెండవ ప్రజ్ఞను నరుడని కూడ యందురు. 🍀
ఉద్ద రేదాత్మనం 2 త్మానాం నాత్మాన మవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపు రాత్మనః || 5
తనను తానే ఉద్ధరించుకొనవలెను. తనను తాను అధోగతికి చేర్చుకొనగూడదు. తనను తానుద్ధరించు కొన్నప్పుడు, తనకు తాను బంధువు. అట్లు కానిచో తనకు తానే శత్రువగును.
తాను - నేను అను ప్రజ్ఞ మనయందు నాలుగు స్థితులలో యున్నది. అందు మూడు స్థితులు దివ్యము. ఒక స్థితి దివ్యమే అయినను స్వభావమున బంధింపబడి యుండును. ముందు మూడు స్థితులు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న వ్యూహము లనియు, నాలుగవది అనిరుద్ధ వ్యూహ మనియు తెలుపుదురు.
మొదటిది మనయందలి దైవము. ఆ ప్రజ్ఞ మనయందు త్రిగుణములను దాటి యుండును. రెండవది మనిషి తానొకడు వేరుగ నున్నాడని భావించుట.
గోధుమపిండియే చపాతీగ యున్నట్లు ఈ స్థితిని భావించవచ్చును. అనగా రెండవ స్థితి మొత్తము నుండి ప్రత్యేకముగ ఏర్పడిన స్థితి. ఇది త్రిగుణముల కీవలయుండును.
మొదటి ప్రజ్ఞ మనయందలి దైవము కాగ, రెండవ ప్రజ్ఞ “మనము” అని మనను గూర్చి మనము భావించుచున్న తెలివి, మొత్తము నుండి త్రిగుణముల ద్వారా ప్రత్యేకముగ నేర్పడినవి. అందువలన ఈ రెండవ స్థితిని “ప్రత్యగాత్మ” అని కూడ అందురు.
మొదటి ప్రజ్ఞను 'పరమాత్మ', రెండవ ప్రజ్ఞను జీవాత్మ లేక ప్రత్యగాత్మ అందురు. మొదటి ప్రజ్ఞను వాసుదేవ ప్రజ్ఞ యని, రెండవ ప్రజ్ఞను సంకర్షణ ప్రజ్ఞయని కూడ అందురు. అట్లే మొదటి ప్రజ్ఞను నారాయణుడని, రెండవ ప్రజ్ఞను నరుడని కూడ యందురు.
మొదటి ప్రజ్ఞ మంచి నీరువలె భావించినచో, రెండవ ప్రజ్ఞ అందు తేలుచున్న మంచుగడ్డ యని భావింపవచ్చును. మంచినీరే మంచుగడ్డ అయినది. పరమాత్మయే ప్రత్యగాత్మ అయినది. ఈ మార్పు త్రిగుణముల ద్వారా జరుగుట వలన జీవాత్మపై త్రిగుణముల ప్రభావముండును.
నీరే మంచుగడ్డ అయినప్పటికిని, మంచుగడ్డకు కొన్ని క్రొత్త గుణములు వచ్చును. అమితమగు శీతలత్వము, పగిలిపోవుట, గట్టిపడుట, ఎవరి పైనను విసిరినచో వారికి కొద్దిగ దెబ్బతగులుట యుండును. మంచి నీటికి లేని గుణములు మంచుగడ్డకు ఏర్పడినవి. అట్లే దైవమునకు లేని గుణములు జీవున కేర్పడినవి. ఒక నూతన స్వభావ మేర్పడును.
గుణముల సమ్మిశ్రమమును బట్టి అనేకములగు స్వభావములు గోచరించు చుండును. తన స్వభావము కన్న తాను వేరుగ బుద్ధిమంతు డగువాడు చూచుకొనవచ్చును. తాను, తన స్వభావముగ తనని తాను విడమర్చుకొన వచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[19:33, 18/02/2021] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 352 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
90. అధ్యాయము - 02
🌻. సనత్కుమారుని శాపము - 2 🌻
సనత్కుమారుడిట్లు పలికెను
మీరు అక్కా చెల్లెళ్ళు ముగ్గురు మూర్ఖులు. మీలో యోగ్యమగు జ్ఞానము లేదు. మీరు పితృదేవతల కుమర్తెలే అయినా, మీకు వేదతాత్పర్యము ఎరుక లేదనుట నిశ్చయము(20) మీరు గర్వముచే లేచి నిలబడలేదు. మాకు నమస్కరించలేదు. కావున, మోహితులైన మీరు మానవ శరీరమును పొంది స్వర్గమునకు దూరమగుదురు గాక!(21) జ్ఞానమునుండి వంచితులైన మీరు ముగ్గురు కూడ మానవస్త్రీలై జన్మించెదరు గాక! మీరు చేసుకొన్న కర్మయొక్క ప్రభావము వలననే మీకిట్టి ఫలము లభించుచున్నది(22)
బ్రహ్మ ఇట్లు పలికెను-
జ్ఞానమునుండి వంచితులైన వారు, మిక్కిలి భయపడినవారు, తలవంచుకున్న వారు అగు ఆ ముగ్గురు ఈ మాటలను విని, ఆయన పాదములపై బడి ఇట్లు పల…
[19:33, 18/02/2021] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 236 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. దేవలమహర్షి - 7 🌻
36. ఆ రెండు ఫలాలనూ మాత్రమే కోరినట్లయితే, మోహంలేని సంసారయాత్ర చేయవచ్చు. నిజానికి ఏ వస్తువులో మాత్రం ఏమి దోషముంది? మోహమనే దోషం మన బుద్ధిలోనే ఉంది. భార్యలోనో, సంతానంలోనో ఏమి దోషముంది?
37. మనను పీడిస్తున్నది మన బుద్ధిలోని దోషమే. అది వారి యందలి మోహమే. మనమేలా ఉండాలో అలా ఉండ గలిగితే, సంసారబంధాలు మనకు ఉపకారమే చేస్తాయి. సేవ చేస్తాయి, వెళ్ళిపోతాయి. మనం కూడా చివరకు బంధనం లేకుండా వెళ్ళిపోతాము.
38. నారదమహర్షి దేవలుదికి అనేక ధర్మాలు చెప్పాడు. “జీవుడు ఎవ్వరి వాడూ కాదు. నాది అనే వస్తువు ఏదీ ఈ ప్రపంచంలో జీవుడికి లేదు.
39. ఇతర జీవులు కాని, ఇతర పదార్థములు కాని తనవి కావు. తనకు ఏ సంబంధమూ లేదు.ఒక్కడే ఉంటాడు. తన దేహంద్వారా సుఖదుఃఖాలను తానే సృష్టించుకుంటూ, పునర్జన్మకై తానే కర్మచేసుకుంటూ ఉంటాడు.
40. అనేక పుణ్యపాప కర్మల వలన వచ్చిన ఆయా దేహములు, ఆయా కర్మలు క్షీణించటంతో నశించి, తాను బ్రహ్మమయుడై పోతున్నాడు. దానినే మోక్షం అంటారు.
41. పుణ్యపాపకర్మల వినాసనమునకు జ్ఞానమే కారణమౌతోంది. జ్ఞానమనే కుఠారంతో(గొడ్డలితో) పుణ్యపాపకర్మలచే నిర్మితమైన సంసారమనే వృక్షాన్ని ఛేదించు. ఇదే సాంఖ్యమతం.
42. పుణ్యపాప కర్మల మూలాన్ని ఛేదిస్తే, జీవుడు బ్రహ్మీభావం పొందడమనేది సహజంగా జరిగిపోతుంది. దానిని ఎవరూ ప్రత్యేకంగా కోరుకోనవసంలేదు. విజ్ఞానులు దీనిని ఇలా అర్థంచేసుకుంటున్నారూ అని నారదమహర్షి బోధించాడు.
43. మహర్షులు ఆత్మజ్ఞానులు, ఆప్తకాములు. మోక్షం పొందినవారు. శరీరం ఉన్నతరువాత ఏంచేసినా కర్మ ఏర్పడి, కర్మలోంచి ఫలంపుట్టి, దాని ఫలితంగా మరొకజన్మ ఎత్తవలసి వస్తుంది కనుక; అలా కాక, శరీరానికి తపస్సు తప్ప మరొక కర్తవ్యం ఏదీ లేకుండా వారు ఉంటారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[19:34, 18/02/2021] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 175 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 13 🌻
667. ఒక మానవుని తనవలెనే పరిపూర్ణుని చేయుటయే సద్గురువు చేయు ఘనమైన లీల.
668. ఏకకాలమందే, ఆత్మ చైతన్యమును + సృష్టి చైతన్యమును కలవాడై, సచ్చిదానంద స్థితిని ఎఱుకతో అనుభవించుటయే గాక దానిని పరులకై వినియోగించును. ఇది సద్గురువు లేక, అవతారపురుషుని స్థితి.
లిప్తకాలములో భౌతిక చైతన్యముగల సామాన్య మానవుని, ఆత్మచైతన్యముగల భగవంతుని చేయగల సర్వ సమర్దుడతను.
669. ప్రతియుంగమందును ఎల్లకాలమూలందును ఉన్నట్టి పంచ సద్గురువులు అఖిల విశ్వమును పాలింతురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[19:34, 18/02/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 31 / Sri Lalita Sahasranamavali - Meaning -31 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 31. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా |
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ ‖ 31 ‖ 🍀
78. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా -
మహాగణపతి చేత నశింపచేయబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కిలి సంతోషించింది.
79. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణీ -
రాక్షస రాజైన భండాసురిని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
పై సందర్భములో పోతనగారి పద్యరత్నము:
సీస పద్యము
మహితరౌద్రంబున మల్లుర కశనియై;
నరుల కద్భుతముగ నాథుఁ డగుచు
శృంగారమునఁ బురస్త్రీలకుఁ గాముఁడై;
నిజమృత్యువై కంసునికి భయముగ
మూఢులు భీభత్సమునుఁ బొంద వికటుఁడై;
తండ్రికి దయరాఁగఁ దనయు డగుచు
ఖలులకు విరసంబుగా దండియై గోప;
కులకు హాస్యంబుగాఁ గులజుఁ డగుచు
ఆటవెలది
బాంధవులకుఁ బ్రేమ భాసిల్ల వేలుపై
శాంత మొనర యోగి జనుల కెల్లఁ
బరమతత్వ మగుచు భాసిల్లె బలునితో
మాధవుండు రంగమధ్య మందు.
భావము
మల్లరంగం నడుమ బలరామ సహితుడైన కృష్ణుడు, రౌద్రరసంతో మల్లురకు పిడుగులా కనిపించాడు; అద్భుతరసంతో పురస్త్రీలకు పంచశరుడుగా భాసిల్లాడు; భయానకరసంతో కంసునికి వాడి పాలిటి మృత్యువుగా మూర్తీభవించాడు; బీభత్సరసంతో మూర్ఖులకు వికటుడుగా కనిపించాడు; కరుణరసంతో తండ్రికి కన్నబిడ్డడుగా కరుణ కలిగించాడు; వీరరసంతో దుర్మార్గులకు విద్వేషం కలిగించాడు; హాస్యరసంతో గోపకులను కులదీపకుడుగా గోచరించాడు; ప్రేమరసంతో చుట్టాలకు దేవుడుగానూ, శాంతరసంతో యోగిజనులకు పరబ్రహ్మ స్వరూపుడుగానూ ప్రకాశించాడు.
శ్రీ ఆది శంకరాచార్య విరచితం శ్రీ గురు అష్టకము
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
“నిజమైన గురువుకి సమానమైన దానిని మూడు లోకాలలోను చెప్పలేము. పరుసవేది దేన్నైనా బంగారంగా మార్చుతుందేమో కాని ఇంకొక పరుసవేదిగా మార్చదు. కాని ఒక గురువు తన్ను నమ్మి శరణుజొచ్చిన శిష్యుడిని తనంతటివాడిని చేస్తాడు. కాబట్టి గురువు అసమానుడు. అల్ప బుద్ధి కలవాణ్ణి కూడా పండితుణ్ణి చెయ్యగలడు గురువు.
జగద్గురువులైన ఆదిశంకరులు గురువు గురించి చాలా గొప్పగా చెబుతారు. వారు ఒకచోట అడుగుతారు, “ఎన్ని ఉన్నా, మనస్సు గురు పాదములను పట్టుకోకపోతే ఏమిటి దాని ఉపయోగం?” అని.వారి రచించిన ‘గురు అష్టకం’లో ప్రతి చోట అడుగుతారు. ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?అని. ఎనిమిది శ్లోకములలోను దీన్ని మకుటంగా ఉంచి మనల్ని ప్రశ్నిస్తున్నారు.
శ్రీశంకర భగవత్పాదులు రచించిన గురు అష్టకం శిష్యునికి ఉండాల్సిన ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తుంది. శిష్యుడికి ఉండాల్సింది గురువు మీద నమ్మకం, విశ్వాసం. మనకు ఎవరి మీద ఐతే గురి కలుగుతుందో వారే గురువు. లోకంలో నిషిద్ధ గురువులు కూడా ఉంటారు. వాళ్ళని పట్టుకోవడం అంటే బురద పాము నోట్లో ఉన్న కప్పవంటి జీవితం అవుతుంది.
🚩(గురుఅష్టకం)🚩
ॐॐॐॐॐॐॐॐ
1) శరీరం సురూపం తథా వా కళత్రం!
యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే!
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్॥
మంచి దేహధారుడ్యము, అందమైన భార్య, పేరు ప్రతిష్టలు, మేరు సమానమైన ధనం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
2)కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం!
గృహం బాంధవాః సర్వ మేతద్ద్విజాతం!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే!
తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
భార్య, ధనము, పిల్లలు, వారి పిల్లలు, ఇళ్ళు, బంధువులు, గొప్ప వంశంలో జన్మ ఉన్నప్పటికి గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
3) షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా!
కవిత్వాది గద్యం సుపద్యం కరోతి!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే!
తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
ఆరు వేదాంగములు (శిక్ష, చందస్సు, వ్యాకరణం, నిరుక్త, కల్ప, జ్యోతిష్య), నాలుగు వేదాలు, గద్య పద్య రాయగల జ్ఞానం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
4) విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః!
సదాచారవృత్తేషు మత్తో న చాన్యః!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే!
తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
విదేశాలలో మంచి పేరు, స్వదేశంలో హోదా పలుకుబడి, అందరూ మెచ్చే గుణము, మంచి జీవితం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
5) క్షమామండలే భూపభూపాలవృందౌ!
సదా సేవితం యస్య పాదారవిందమ్!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే!
తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
గొప్ప రాజ్యానికి చక్రవర్తివైనా, రాజులు మహారాజుల చేత సేవింపబడుతున్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
6) యశో మే గతం దిక్షు దానప్రతాపాత్!
జగద్వస్తు సర్వం కరే సత్ప్రసాదాత్!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే!
తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
నీ ఖ్యాతి నలుదెశలా వ్యాపించి ప్రపంచమంతా నీ దయాగుణాన్ని ప్రశంచించినా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
7) న భోగే న యోగే న వా వాజిరాజౌ!
న కాన్తాసుఖే నైవ విత్తేషు చిత్తం!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే!
తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
భోగము, యోగము, ఇష్టము, అగ్నికార్యము, విషయ సుఖము, విత్తములపై నీ మనస్సు విరక్తి పొందినా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
8) అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే!
న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే!
తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
నీ మనస్సు అరణ్యమున ఉన్నా, ఇంట్లో ఉన్న, సమాన్య విషయములపై తిరుగుతూ ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
9) అనర్ఘ్యాణి రత్నాది ముక్తాని సమ్యక్!
సమాలింగితా కామినీ యామినీషు!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే!
తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
వెలకట్టలేని మణులు, రత్నాలు, వజ్రవైఢూర్యాలు సదా నిన్ను అనిగమించే అంటిపెట్టుకునే భార్య ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
10) గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ!
యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ !
లభేత్ వాంఛితార్థ పదం బ్రహ్మసంజ్ఞం!
గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం ॥
ఫలశ్రుతి:-
*ఎవరైతే ఈ గుర్వాష్టకాన్ని చెదువుతారో, నేర్చుకుంటారో, మననం చేస్తారో, గురువు చెప్పిన విషయాలను నిత్యం స్మరిస్తూ గురు పాదపద్మములపై మనస్సు లగ్నం చేస్తారో, అటువంటివారు యోగి అయినా, సన్యాసి
అయినా, రాజు అయినా, బ్రహ్మచారి అయినా, గృహస్తు అయినా తనికి శాశ్వత పరతత్వమగు పరబ్రహ్మం సిద్ధిస్తుంది.*
సదాశివ సమారంభాం, శంకరాచార్య మధ్యమాం!
అస్మదాచార్య పర్యంతం, వందే గురు పరంపరాం!!
ఇసుమంత ఆచరణ, ఇరవై వేల టన్నుల వ్యర్ధమైన మాటలతో సమానం.
🕉️🌞🌏🌙🌟🚩
స్వామి వివేకానంద స్ఫూర్తి - రోజుకో సూక్తి.
వీరులై ఉండండి. ధీరులై ఉండండి.మనిషి మరణించేది ఒక్కసారి మాత్రమే.నా శిష్యులు పిరిపందలు కాకూడదు.
లే మేలుకో !లక్ష్యం చేరేవరకుఆగకు! భయపడకు.మానవజాతి చరిత్రలో మహోన్నతశక్తి అంతా ప్రజలనుండే ప్రభవిస్తూ వచ్చింది.అలాంటి ప్రజా శ్రేణులనుంచే ప్రపంచంలోని మహా మనీషులంతా ఉద్భవించారు.
🕉🌞🌎🌙🌟🚩
[15:40, 08/02/2021] +91 92915 82862: భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩
"క చ ట త ప అనే అయిదు వర్ణాలలో *క అనేది నోటిలో చాలా లోపలి కి తగులుతుంది. చ చాలా మద్యస్తములోనూ, ట చివరిలో త పంటి దగ్గర, ప పెదవుల దగ్గర తగులుతాయి. పెదవుల నుంచి గొంతు వరకు ఉండే అన్ని ప్రాంతాలనీ నాలుక ముట్టుకుంటూ, నృత్యము చేసుకుంటూ, మన చేత వాక్యాలు పలికిస్తూ ఉంటుంది.*
అదంతా వాగ్దేవతల కూటమి. కంఠము నుంచి నాలుక కొన వరకు ఉన్న భాగమును వాగ్భవ కూటము అన్నారు."
🕉🌞🌎🌙🌟🚩
ఆచార్య సద్భోదన
అఖండశక్తితో మహోన్నతంగా స్థిరంగా నిలబడాలి.
పరిస్థితులు అనుకూలంగా ఉంటే అందరూ మంచిగానే ప్రవర్తిస్తారు. కానీ ఏదైనా వ్యతిరేకత ఎదురైనపుడు కూడా మనిషి ధైర్యంగా నెట్టుకు రాగలిగితేనే విజేతగా నిలుస్తాడు.
ఆపద కలిగినపుడు దాని నుండి పారిపోయి మరియొక సమస్య తెచ్చుకోవాడం సరియైనది కాదు. భగవంతుని మార్గదర్శనం చేయమని నిజాయితీగా ప్రార్థించాలి.
మనం ఆ శ్రీమన్నారాయణునితో ఎంతగా సంబంధాన్ని ఏర్పరచుకుంటే అంతగా శక్తిశాలురం అవుతాము. ఇంక అప్పుడు ఏ బలహీనతలూ మనల్ని బాధించలేవు.
శుభంభూయాత్
🕉🌞🌎🌙🌟🚩
+91 98494 71690: 🌹. గీతోపనిషత్తు -145 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚
శ్లోకము 28
🍀 26. మననము - మోక్షపరాయణులు యింద్రియ మనో బుద్ధులను నియమముతో బ్రహ్మమున సమర్పణ చేయుదురు. ఇచ్ఛ, భయము, క్రోధముల నుండి వారు విగతులై, పై తెలిపిన సమర్పణ భావనచే ఎల్లప్పుడును మోక్షస్థితి యందుందురు. సద్గుణములను దైవపరముగ ఆరాధించుచు, కాలము దానియందు వినియోగించు కొలది, యితర గుణములు దూరము కాగలవు. మననమున దైవమును స్థిరపరచుకొని బుద్ధి, మనసు, యింద్రియములను కూడ అట్టి దైవ మననమున నింపిన మునులకు నిత్యముండు స్థితి ముక్త స్థితి. భగవానుడు “మనసా, వాచ, కర్మణా నన్నే ఆశ్రయింపుము" అని పలుమార్లు తెలుపుచు నుండును. బ్రహ్మము నాశ్రయించిన వానికి బ్రహ్మమే మిగులును. దైవమును ఆశ్రయించిన వారికి దైవమే మిగులును. 🍀
యతేంద్రియ మనోబుద్ది ర్ముని ర్మోక్షపరాయణః |
విగతేచ్ఛాభయ,ధో యస్సదా ముక్త ఏవ సః || 28
మోక్షపరాయణులు యింద్రియ మనో బుద్ధులను నియమముతో బ్రహ్మమున సమర్పణ చేయుదురు. ఇచ్ఛ, భయము, క్రోధముల నుండి వారు విగతులై, పై తెలిపిన సమర్పణ భావనచే ఎల్లప్పుడును మోక్షస్థితి యందుందురు.
భగవానుడు సుళువగు మార్గములను బోధించు చుండును. ఆ బోధనలు సహితము మానవులు తలక్రిందులు చేసుకొని త్రిప్పలు పడుచుందురు. ఈ శ్లోకమును సామాన్యముగ ఈ క్రింది విధముగ భావింతురు.
ఇష్టము, భయము, క్రోధము అనువానిని విడచి నిగ్రహముతో యింద్రియములను, మనసును, బుద్ధిని అధిగమించి మోక్షపరాయణులు ఎల్లప్పుడును ముక్త స్థితి యందుందురు. పై విధముగ భావించి కోరికలుండరాదని, భయపడరాదని, కోపము కలుగరాదని తెలుపుచుందురు. జన్మల తరబడి సాధన జరిపినను ఈ మూడును వదలవు.
వదల్చుకొనదలచిన విషయములు ఎప్పుడును వదలవు. పొందవలసిన సద్విషయములు పొందుటకు ప్రయత్నము చేయవలెను గాని మరియొక మార్గము లేదు.
సద్గుణములను దైవపరముగ ఆరాధించుచు, కాలము దానియందు వినియోగించు కొలది, యితర గుణములు దూరము కాగలవు. చీట్ల పేక ఆడు వ్యక్తి భగవద్భజన, బోధన, స్తోత్ర పారాయణ, సత్కర్మా చరణములలో సమయము వినియోగించు చున్నచో క్రమముగ చీట్ల పేకాడుట తగ్గును.
ఏమి చేయవలెనో చెప్పవలెను గాని, ఏమి చేయరాదో చెప్పుట వలన ఉపయోగము లేదు. వాహనమునందు ప్రయాణము చేయుచున్న పిల్లవానికి, చేతులు బయట పెట్టకు అని చెప్పినట్లుండును. భగవానుడు “మనసా, వాచ, కర్మణా నన్నే ఆశ్రయింపుము" అని పలుమార్లు తెలుపుచు నుండును. బ్రహ్మము నాశ్రయించిన వానికి బ్రహ్మమే మిగులును. దైవమును ఆశ్రయించిన వారికి దైవమే మిగులును.
దైవసాన్నిధ్యమున నున్నపుడు దైవమునే కోరుట యుండును గాని, యితరములను కోరుట యుండదు గదా! దైవభావన యున్నచోట భయ భావన ఎట్లు కలుగ గలదు? క్రోధమెట్లు కలుగ గలదు?
దైవ స్మరణయందు మనసు, బుద్ధి లగ్నమైన వానికి యిచ్ఛా భయ క్రోధము లుండుట కవకాశమే లేదు. మననమున దైవమును స్థిరపరచుకొని బుద్ధి, మనసు, యింద్రియములను కూడ అట్టి దైవ మననమున నింపిన మునులకు నిత్యముండు స్థితి ముక్త స్థితి. అట్టి వారిని యిచ్ఛా భయ క్రోధములు స్పృశింపనైనా స్పృశింప లేవు.
ఈ అధ్యాయమున ఆరవ శ్లోకముననే మననము ద్వారా బ్రహ్మముతో యోగయుక్తుడై యుండుట తెలుపబడినది. వారే మునులు. వారి యింద్రియములు, మనసు, బుద్ధి, నిరంతర మననము కారణముగ యమము చెంది యుండును. అట్టి మననము కారణముగ భయక్రోధాది భావము లుండవు. ప్రహ్లాదుడు, అంబరీషుడు అట్టివారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 . శ్రీ శివ మహా పురాణము - 344 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
87. అధ్యాయము - 42
🌻. దక్షుని ఉద్ధారము -2 🌻
హే వీరభద్రా! మహాబాహో! నీవు ఎట్టి కర్మను చేసితివి ? వత్సా? చూడుము. నీవు దేవతలు, ఋషులు మొదలగు వారిపై అతిశీఘ్రముగా కఠినమగు దండమును అమలు చేసితివి (19). వత్సా! దక్షుడు ఇట్టి విచిత్రమగు యజ్ఞమును అనుష్ఠించి, ఇట్టి ఫలమును పొందినాడు. నీవాతనిని శీఘ్రముగా గొనిరమ్ము (20). ఈ తీరున శంకరునిచే ఆజ్ఞాపింపబడినవాడై వీరభద్రుడు సత్వరమే దక్షుని మొండెమును తెచ్చి శంభుని ఎదుట పారవైచెను (21). ఓ మహర్షీ! లోకములకు శుభములనిచ్చు ఆ శంకరుడు తలలేని ఆ మొండెమును చూచి చిరునవ్వుతో వీరభద్రుని ఉద్దేశించి ఇట్లనెను (22).
శిరస్సు ఎక్కడ ? అని ప్రశ్నించగా, వీరభద్రప్రభుడు ' హే శంకరా! నేను శిరస్సును ఆ సమయములోనే అగ్నిహోత్రమునందు హోమము జేసితిని' అని పలికెను (23). వీరభద్రుని ఈ పలుకులను విని శంకురుడు తాను పూర్వమునందు చెప్పిన తీరుగనే దేతలను ఆజ్ఞాపించెను (24). శివభగవానుడు చెప్పిన తీరుగనే మేము విష్ణువు మొదలగు అందరితో గూడి భృగువు మొదలగు వారిని శీఘ్రముగా స్వస్థులను చేసితిమి (25). అపుడు శంభుని గొప్ప ఆజ్ఞచే ఆ దక్ష ప్రజాపతికి యజ్ఞ పశువు యొక్క శిరస్సును వెంటనే సంధానము చేసిరి (26). శిరస్సును సంధించగానే, శంభుని కృపాదృష్టి వానిపై పడెను. వెంటనే ఆ ప్రజాపతి ప్రాణములను పొంది నిద్రనుండి లేచిన వాడు వలె లేచి నిలబడెను (27).
దక్షుడు లేవగానే ఎదురుగా కరుణానిధియగు శంభుని చూచి, సంతసించిన మనస్సు గలవాడై, మిక్కిలి ప్రసన్నమైన అంతరంగము గలవాడై ప్రీతితో నిలబడెను (28). అతడు పూర్వము శివుని యందలి తీవ్రమగు ద్వేషముచే మలినీకృతమైన అంతరంగము కలవాడుగా నుండెను. శివుని చూచుట తోడనే ఆతని అంతరంగము శరత్కాలచంద్రుని వలెన నిర్మలమాయెను (29). అతడు అపుడు శివుని స్తుతింపగోరెను. కాని మరణించిన కుమార్తె గుర్తుకు వచ్చుటచే ఆ దుఃఖముతో, మరియు శివుని యందలి భక్తితో ఆతడు మాటలాడలేక పోయెను (30). అపుడు దక్షుడు కొంతసేపటికి ప్రసన్నమైన మనస్సుగలవాడై సిగ్గుతో కూడినవాడై, లోకములకు మంగళములనిచ్చు శివశంకరుని నమస్కరించి స్తుతించెను (31).
దక్షుడిట్లు పలికెను -
వరములనిచ్చువాడు, సర్వశ్రేష్ఠుడు, జ్ఞాన సముద్రుడు, సనాతనుడు, దేవ ప్రభువులకు ప్రభువు, పాపములను హరించువాడు, సర్వదా సుఖస్వరూపుడు, ప్రాణులకు ఏకైక బంధువు అగు మహేశ్వర దేవుని నమస్కరించుచున్నాను (32). జగత్తునకు అధీశ్వరుడు, జగత్స్వరూపుడు, పురాతనుడు, పరబ్రహ్మయే స్వీయ ఆత్మగా గలవాడు, ప్రాణులను సంహరించువాడు, జగత్తులోని పదార్థముల ఉనికికి మూలమైన సత్తా స్వరూపుడు, పరాత్పరుడు అగు శంకరుని నమస్కరించుచున్నాను (33). ఓ దేవదేవా !మహాదేవా!దయను చూపుము. నీకు నమస్కారము. హే శంభో! దయానిధీ!ఈనాడు నేను చేసిన అపరాధమును క్షమించుము (34).
నీత్త్వము తెలిసినది. నీవు సర్వులపై అధీశ్వరుడవు. విష్ణు బ్రహ్మాదులు నిన్ను సేవించెదరు. కల్ప వృక్షము వంటి వాడవు. నీవు సర్వదా దుష్టులను దండించెదవు. స్వతంత్రుడు, భక్తులకు కోరికలను వరరూపములో నిచ్చువాడు అగు పరమాత్మవు నీవే (37).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
+91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 228 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మైత్రేయమహర్షి - 5 🌻
29. పాపకర్మలను కూడా తనలో లయంచేసుకున్నవాడు కృష్ణపరమాత్మ. మరి అటువంటి వాళ్ళను కూడా ఏ మహత్తుచేత తనలో లయంచేసుకున్నాడు! ఎటువంటి శక్తిచేత అట్లా చేసుకున్నాడు!
30. పరమాత్మ భావనతో వాళ్ళను తనలో లయంచేసుకున్నాడని అర్థం. అంతేకాని, కృష్ణభావంతో వాళ్ళను చంపితే వాళ్ళు మళ్ళీ పుడతారు. కృష్ణుడనే ఒక వ్యక్తి చంపినట్లయితే, యుద్ధంలో నిహతులైనవాళ్ళు స్వర్గానికి వెళ్ళి మళ్ళీ ఎలాగ పుడతారో, అలాగ పుట్టవలసిందే కదా!
31. ‘శ్రీకృష్ణుడి చేతులలో’ చంపబడ్డ శిశుపాల దంతవక్త్రులుకూడా మళ్ళీ పుట్టవలసిందే! కాని అలా జరగలేదు. తనలో లయంచెందటం అంటే ఏమిటి? రాక్షసులనేటువంటి ఈ సమిధులను యజ్ఞంలో వ్రేల్చి పరమాత్మకు త్యాగం చేసాడు. కాబట్టి ఆ జీవులు పరమాత్మలో లయంచెందారు.
32. సాధనలు అనేది జడము. యజ్ఞంలో ఉపయోగించే సృక్సువములకు పుణ్యమ్రాంట్లుగా, కృష్ణుడనే బహుతికరూపానికికూడా ఫలం ఉండదు. తాను ఆత్మ స్వరూపుడై, సాక్షి మాత్రుడుగా ఉండాలి.
33. పరమాత్మ వస్తువు కూడా ఈ దేహంలో ఉండే వ్యక్తిచేత పనిచేస్తుంది. కర్మ నశిస్తుంది, కర్మఫలము నశిస్తుంది, కర్మఫలభోక్తలూ నశిస్తారు. ఎవరూకూడా మిగిలి ఉండరు. అంతాకూడా తాత్కాలికమే! నిత్యం కాదు, అనిత్యం. అట్లాంటి అనిత్యమైన కర్మకు ఫలమూ అనిత్యమైనదే.
34. ఈ విషయాలన్నీ మైత్రేయుడికి ఉపదేశించి, తనలో ఉండేటటువంటి జ్ఞానాంశను అతడిలో నిస్ఖిప్తంచేసాడు కృష్ణపరమాత్మ. కృష్ణాంశ, కృష్ణతత్త్వములోని అవతారరహస్యాన్ని ఇంకమరెవరికీ ఆయన ఇవ్వలేదు. మైత్రేయుడికే ప్రసాదించాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
+91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 167 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 5 🌻
646. మానవుడు దైవత్వ సిద్ధిని బడయుటకును, అటుపిమ్మట సాధారణ చైతన్యమును తిరిగి పొంది సద్గురువగుటకును కూడా, సద్గురువు యొక్క సహాయమే అవసరము.
647. సద్గురువు జ్ఞాన సూర్యుడగుటచే, తాను సంకల్పించినచో ఎవరికైనను రెప్పపాటు కాలములో మోక్షమును ప్రసాదించగలడు.
648. సద్గురువు నుండి నిస్సంగమును పొందినవాడు పరిపూర్ణుడగును.
649. సద్గురువు ఆరోగ్యముగా గాని, లేక అనారోగ్యముగా నున్నట్లు గాని సామాన్య మానవునకు కనపడును. కానీ నిజముగా సద్గురువు ద్వంద్వాతీతుడు కాబట్టి ద్వంద్వము లు అతని అనంతత్వమును స్పృశించనేరవు. ద్వంద్వానుభవము లన్నియు మాయ అని సద్గురువునకు తెలియును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
+91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 22 / Bhagavad-Gita - 22 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము 🌴
శ్లోకము 22
యావదేతాన్నిరీక్షేహం
యోద్దుకామానవస్థితాన్ ||
కైర్మయా సహ యోద్ధవ్య
మస్మిన్ రణసముద్యమే ||
🌷. తాత్పర్యం :
ఈ మహా పోరాటంలో, రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను పరీక్షించాలి.
🌷. బాష్యము :
శ్రీకృష్ణుడు పూర్ణపురుషోత్తముడగు దేవదేవుడైన తన నిర్హేతుక కరుణ వలన మిత్రుని సేవ యందు నియుక్తుడయ్యెను. తన భక్తుల యెడ ప్రేమను చూపుటలో అతడెన్నడును విఫలత్వము నొందడు. కనుకనే అతడు ఇచ్చట “అచ్యుతుని”గా సంబోధింపబడినాడు. రథసారథిగా అతడు అర్జునిని ఆదేశములను అమలుపరచ వలసివచ్చును. ఆ విధముగా నొనర్చుటకు ఆ దేవదేవుడు సంకోచింపనందున అచ్యుతునిగా పిలువబడినాడు.
తన భక్తుని కొరకు రథచోదకుని స్థానమును గ్రహించినను అతని దివ్యస్థితికి ఎన్నడును భంగము రాదు. అన్ని పరిస్థితుల యందును అతడు దేవదేవుడే. ఇంద్రియాధిపతియైన హృషీకేశుడే. భగవానుడు మరియు అతని సేవకుని నడుమ గల సంభందము దివ్యమైనది మరియు మధురమైనది. సేవకుడు సదా భగవానునికి సేవను గూర్చ సంసిద్ధుడై యుండును.
అదేవిధముగా భగవానుడు సైతము భక్తునికి ఏదియో కొంత సేవగూర్చెడి అవకాశము కొరకై వేచియుండును. ఆదేశము లొసగువానిగా తాను ఆజ్ఞల నొసగుట కన్నాను శుద్ధభక్తుడైనవాడు తనను ఆజ్ఞాపించు స్థానమును గైకొనినచో అతడు మిక్కిలి ముదమందును. వాస్తవమునకు అతడు ప్రభువైనందున ప్రతియెక్కరు అతని ఆజ్ఞాపాలకులే. ఆజ్ఞాపించుట అతనికి అధికులెవ్వరు లేరు.
కాని తనను శుద్ధభక్తుడైనవాడు ఆజ్ఞాపించుట తటస్థించినపుడు ఆ దేవదేవుడు దివ్యానందమును ననుభవించును. అయినప్పటికి అన్ని పరిస్థితుల యందును అతడు అచ్యుతుడైన ప్రభువే అయియున్నాడు.
భగవానుని శుద్ధభక్తునిగా అర్జునుడు జ్ఞాతులతో మరియు సోదరులతో యుద్ధము చేయగోరలేదు.
కాని ఎటువంటి శాంతిమయ రాయబారమునకు సైతము సమ్మతింపని దుర్యోధనుని మొండితనము వలననే అతడు యుద్ధరంగమునకు బలవంతముగా రావలసివచ్చెను. కనుకనే యుద్ధరంగమునందు ఏ ప్రముఖుల ఉపస్థితులై యుండిరా యని గాంచుటలో అతడు ఆతురతను కలిగియుండెను. రణరంగమున శాంతియత్నములు చేయుటున్న ప్రశ్నలేకున్నను వారిని అతడు తిరిగి చూడగోరెను. అంతియేగాక అవాంచితమైన యుద్ధము వైపుకు వారెంత మ్రొగ్గు చూపియుండిరో అతడు గాంచగోరెను.
🌹 🌹 🌹 🌹 🌹
[17:10, 08/02/2021] +91 92915 82862: 🌷148 - మంద్రగీత🌷
పురుషోత్తమ ప్రాప్తి
19. సమ్మోహము చెందక నన్నీవిధముగా పురుషోత్తముడని ఎవడు తెలిసికొనునో అతడు సమస్తము తెలిసినవాడు. అతడు సర్వభావముల చేతను నన్నే భజించును.
(సమ్మోహము చెందక అనగా క్షరాక్షర పురుషులను చూచునపుడు పురుషోత్తముని యంశలే అని మరువక అని అర్థము. ముగ్గురు పురుషులను వేరుగా గుర్తింపనిచో విజ్ఞానము జ్ఞాన వికాసము లేవు. ఒక్కని అంశములుగా నుండుట మరచినచో సర్వజ్ఞత, మోక్షము లేదు. క్షరాక్షరులను తెలియక పురుషోత్తమునే భావించినను అనుగ్రహ విశేషమున తెలియుట అను వికాసము తప్పదు. తెలిసినవారెల్ల ఇట్లే తెలిసికొనిరి. నిమిత్తములు శాస్త్రములు కావచ్చును. తెలియుట మాత్రము అనుగ్రహ విశేషము. సర్వభావములచే నన్ను భజించుట ఆనగా కంటితో శరీరమును, మనస్సుతో మనస్సును, బుద్ధితో బుద్ధిని, లౌకిక వ్యాపారములతో లోకవ్యక్తులను చూచుచుండియు పురుషోత్తముడుగా ఉపాసించుట.)
20. ఇప్పుడు నాచే ఉపదేశించబడినది రహస్యములలో రహస్యమగు శాస్త్రము. దీనిని తెలిసినవాడు బుద్ధిమంతుడు, కృతకృత్యుడు అగును.
(అతిరహస్యమనగా దాచదగినదికాక, సృష్టిలో దాగియున్నదని యర్థము. దీనిని తెలికొనుటకు 'జ్ఞాత్వా' అని వాడక "బుద్ధ్వా" అని వాడుటవలన బుద్ధి యోగముననే దీనియందు మేల్కాంచవలెనని అర్థము. ఇది దర్శనమే గాని జ్ఞేయము కాదు. క్షేత్రక్షేత్రజ్ఞులకు పరమాత్మ జ్ఞేయము, పురుషోత్తముని యందు క్షేత్రజ్ఞుడు మేల్కాంచవలెను.
కృతకృత్యుడగుట అనగా చేయబడిన కృత్యము కలవాడు. ఆచరింపవలసిన కర్మలాచరించి కర్మబంధ విమోచనము చెందినవాడు. ఆచరింపవలసిన కార్యములను గూర్చి పదునెనిమిదవ అధ్యాయమున వివరింపబడును.)
*** 163) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
జాగ్రత్స్వప్న జగత్తత్ర లీనం బీజ ఇవ ద్రుమః ౹ తస్మాదశేషజగతో వాసనాస్తత్ర సంస్థితాః ౹౹152౹౹
152. విత్తనమునందు వృక్షము లీనమై ఉన్నట్లే జాగ్రత్స్వప్న జగత్తులు సుషుప్తియందు లీనమై ఉన్నవి.అదే విధముగ అశేష జగత్తు యొక్క వాసనలు మాయయందు సుప్తములై ఉన్నవి.
యా బుద్ధివాసనాస్తాసు చైతన్యం ప్రతిబింబతి ౹ మేఘాకాశవదసృష్టి చిదాభాసోఽ సుమీయతామ్ ౹౹153౹౹
153. బుద్ధియందు అట్లు సుప్తావస్థయందున్న జగద్వాసనలపై కూటస్థ చైతన్యము ప్రతిఫలించును. అస్పష్టత వలన అది అనుభవమునకు రాకున్నను దాని ఉనికిని అనుమానింపవచ్చును. మేఘమునందలి నీటి కణములలో ఆకాశప్రతిఫలనము ఊహించినట్లే.
సాభాసమేవ తద్బీజం ధీరూపేణ ప్రరోహతి ౹ అతో బుద్ధౌ చిదాభాసో విస్పష్టం ప్రతిభాసతే ౹౹154౹౹
154. ఆ కూటస్థ చైతన్య ప్రతిఫలనముతో కూడిన మాయాబీజమే పెరిగి బుద్ధిరూపము దాల్చును.ఆపై బుద్ధియందు చిదాభాసము,చైతన్య ప్రతిఫలనము,స్పష్టముగ అహంతయై కనిపించును.
వ్యాఖ్య:- ఆత్మయైన తాను జాగ్రత్స్వప్న సుషుప్తు లనియెడు త్రివిధావస్థల నెరుగు చుండుటచే తానే చిద్రూపాత్మయై యున్నాడు.
జాగ్రత్స్వప్నములలో తప్ప సుషుప్తియందు ఆత్మ దేనిని గూడా తెలిసికొనదుగాన జడమని నిశ్చయించగూడదు.
సుషుప్తి యందు ఏ వస్తువునుగూడ తెలిసికొనలేదు అని చైతన్య సహాయంతో తెలుపు జ్ఞానము ఉండనే వున్నది.
అలాగే జాగ్రత్స్వప్న జగత్తులు సుషుప్తి యందు లీనమై పోయి చైతన్యము ప్రతిఫలించును.
అస్పష్టత వలన అనుభవము తెలియకున్నను ఏమీ తెలియలేదనేది బుద్ధి యందు తెలుయునది కూటస్థచైతన్య ఉనికిగా ఊహించవచ్చును.
మేఘమునందు వున్న నీటి కణములయందు ఆకాశప్రతిఫలనము ఊహించి నట్లుగానే.
ఆ కూటస్థ చైతన్య ప్రతిఫలనముతో కూడిన మాయాబీజమే పెరిగి బుద్ధిరూపము దాల్చును. చైతన్యము బుద్ధియందు ప్రతిఫలించి తద్వారా ఇంద్రియములను,ఇంద్రియముల ద్వారా బాహ్య వస్తువులను ప్రకాశింపజేయును.
అంతఃకరణమును,ఇంద్రియములును పరిచ్చిన్నములైయున్నవి. ఎయ్యది పరిచ్ఛిన్నమో అయ్యది ఘటమువలె కార్యమై యున్నది.ఏది కార్యమో అది జడము కాన ఈ చిద్రూపాత్మయే అంతఃకరణమందు ప్రతిఫలించి ఇంద్రియములను,ఇంద్రియముల ద్వారా బాహ్య జగత్తును ప్రకాశింపచేయుచున్నది.
స్పష్టముగ అహంతయై కన్పించుచున్నది.
అల్పతరమగు "అహంతను"నిరోధించి
"సర్వము నేనే" లేక
"నేను అత్యంత సూక్ష్మముగా, స్వతంత్రముగా ఉన్నాను";
అనుభావనను కలిగి శ్రేష్టతరమగు
"అహంత"ను ఆశ్రయింపవలెను.
కనుక "ఇది సత్యము",
"ఇది సత్యము కాదు"అను పేర్కొన గల్గిన విభాగమేదియు లేదు.అపరిచ్ఛిన్న చైతన్యపు అద్భుతమగు అభివ్యక్తం తప్ప.
****
47)-శ్రీ రామదాసు కీర్తన
మధ్యమావతి - చాపు ( -త్రిపుట)
పల్లవి:-
నిను బోనిచ్చెదనా సీతారామ
నిన్ను బోనిచ్చెదనా సీతారామ!! ని!!
అను పల్లవి:-
నిన్ను బోనిచ్చెదనా నన్ను రక్షింపక ఏ
మైనగాని నా కనులాన శ్రీరామా!! ని!!
చరణము(లు):-
రట్టు చేసెద నిన్ను అరికట్టుదునింక మొర
బెట్టుకోరా దిక్కు గలిగితే రామ!! ని!!
గట్టిగ నీ పదకమలము లెప్పుడు
పట్టి నా మదిలో గట్టియుందును శ్రీరామా!! ని!!
పడిపడి మీ వెంటబడి తిరుగ నెంతో
జడియను నీవెందు జరిగెదవురా రామ!! ని!!
తడయక నీ తల్లితండ్రులు వచ్చినగాని
విడిచిపెట్టిన నీకొడుకునురా శ్రీరామా!! ని!!
మా వాడని మొగమాటము లేక నే
సేవజేసి రవ్వ సేయుదురా రామ!! ని!!
నీవు భద్రాచల నిలయుడవై నన్ను
కావవయ్యా రామదాస పోషక శ్రీరామా!! ని!!
🕉🌞🌏🌙🌟🚩
: *||శ్రీమన్నారాయణీయము|| అష్టమ స్కంధము
27వ దశకము - కూర్మావతారము వర్ణనము
27-6-శ్లోకము*
🕉🌞🌎🌙🌟🚩
క్షుబ్ధాద్రౌ క్షుభితజలోదరే తదానీం దుగ్దాబ్దౌ గురుతరభారతో నిమగ్నే।
దేవేషు వ్యధితతమేషు తత్ప్రియైషీః కమఠతమం కఠోరపృష్ఠామ్॥
భావము:-
ఆ క్షీరసాగరమును దేవతలు - దానవులు మథించుచుండగా, ఆ మందరపర్వత భారమునకు సముద్రము కల్లోలభరితమయ్యెను. మథించుచున్న ఆ మందరపర్వతము - పెనుభారముచే, ఒత్తిడికిలోనై మునిగిపోయెను; దేవతలు (లేవనెత్తు శక్తిలేక) మిక్కిలి వ్యధ చెందగా, ప్రభూ! నీవు వారికి ఆనందము కలిగించుచూ కఠోరమైన మూపుభాగము కలిగిన 'కూర్మరూపమును' ధరించితివి.
వ్యాఖ్య:-
అలా మునిగిపోతున్న పర్వతాన్ని చూసిదీనంగా కూర్చున్న దేవతలనూ, రాక్షసులనూ చూసి, వారికి అభయం ప్రసాదించాడు. పర్వతం కింద పడి చనిపోయిన వారందరినీ బతికించాడు.
బతికిన వారితో పాటుగా పర్వతాన్ని మోసేందుకు అంతా సిద్ధమవుతుంటే, మీకెందుకు శ్రమ అన్నట్టుగా శ్రీహరే కల్పించుకుని ఒంటి చేత్తో మందరాన్ని ఎత్తి పట్టాడు. దాన్ని గరుత్మంతుడి మీద పెట్టాడు.
‘‘తీసుకుని వెళ్ళి క్షీరసాగరంలో జాగ్రత్తగా ఉంచు.’’ ఆజ్ఞాపించాడు. సరేనన్నట్టుగా పర్వతంతో పాటుగా రివ్వున ఎగిరిపోయి, పర్వతాన్ని క్షీరసాగరంలో ఉంచాడు గరుత్మంతుడు.
ఇక తాడుగా వాసుకి కావాలి. అందుకని అతన్ని ప్రార్థించారు దేవదానవులు. కరుణించాడు వాసుకి. మందరాన్ని తాడుగా చుట్టుకున్నాడు.‘‘అటూ ఇటూ పట్టుకోండి.’’ అని శ్రీహరి ఆజ్ఞాపిస్తే వాసుకి తల దిక్కున దేవతలూ, తోక దిక్కున రాక్షసులూ పట్టుకున్నారు.
సర్పం తల దిక్కున పట్టుకోమని దేవతలను ముందే హెచ్చరించాడు శ్రీహరి. ఆ హెచ్చరికను గమనించిన రాక్షసులు అందుకు ఒప్పుకోలేదు. పైగా తోక దిక్కున సర్పాన్ని పట్టుకోవడం తమకి అవమానంగా భావించారు. దేవతలతో గొడవ పడ్డారు.
సర్ది చెప్పాడు శ్రీహరి.తోక వైపున దేవతలు పట్టుకుంటారన్నాడు. తనతో పాటుగా దేవతలంతా వాసుకి తోకని పట్టుకున్నారు. రాక్షసులు తలని పట్టుకున్నారు.
క్షీరసాగరాన్ని మథించసాగారు. మందరపర్వతానికి అడుగున ఆధారం లేదు. దాంతో మథిస్తుంటే పట్టుతప్పి, పర్వతం సముద్రంలో మునిగిపోసాగింది. ఏం చేయాలిప్పుడు?
మళ్ళీ తలలు పట్టుకున్నారు దేవదానవులు. శ్రీహరి మళ్ళీ కలుగజేసుకున్నాడు. కూర్మావతారం ఎత్తి పాలసముద్రంలోకి ప్రవేశించాడు. మందరపర్వతాన్ని వీపున ధరించి, లేవనెత్తాడు.
తాబేలు ఏమిటి, మందరాన్ని మోయడం ఏమిటని ఆశ్చర్యమా? మామూలు తాబేలు కాదది. మహాతాబేలది!
దాని వీపు లక్ష యోజనాల విస్తీర్ణం అంటే ఆలోచించుకోండి. అలాంటి వీపు మీద మందరాన్ని మోస్తూ, క్షీరసాగరాన్ని మథించేందుకు దేవదానవుల్లోనూ, మందరగిరినీ, వాసుకునీ ఆవహించి శ్రీహరి బలాన్నీ, ధైర్యాన్నీ కలుగజేశాడు.
దాంతో మథనం సులభతరం అయింది.
ఎప్పుడయితే శ్రీహరి కూర్మావతారం ఎత్తాడని తెలుసుకున్నారో అప్పుడు బ్రహ్మ రుద్రాదులు అది చూసేందుకు అక్కడకు వచ్చారు. చూసి తరించారు. పుష్పవృష్టి కురిపించారు.
****
ఓం నమః శివాయ:
18-78-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
🕉🌞🌎🌙🌟🚩
అll శ్రీకృష్ణార్జునులుండుచోట విజయము, ఐశ్వర్యము మున్నగు శుభలక్షణములు వెలయుచుండునని సంజయుడు పలుకుచున్నాడు –
యత్ర యోగేశ్వరః కృష్ణో
యత్ర పార్థో ధనుర్ధరః |
తత్ర శ్రీర్విజయో భూతిః
ధృవా నీతిర్మతిర్మమ ||
తా:- ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడున్ను , ఎచట ధనుర్ధారియగు అర్జునుడున్ను ఉందురో అచట సంపదయు, విజయమున్ను ఐశ్వర్యమున్ను, దృఢమగు నీతియు ఉండునని నా యభిప్రాయము.
వ్యాఖ్య:- గీతా గ్రంథ మీశ్లోకముతో సుసంపన్నమగుచున్నది. భగవత్సాన్నిధ్యమందు, భక్తుని సాన్నిధ్యమందు ఎట్టి శుభప్రదమైన వాతావరణమేర్పడునో ఈ శ్లోకముద్వారా వెల్లడిచేయబడినది.
ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణభగవానుడుండునో, మఱియు నెచట ధనుర్ధారియగు అర్జునుడుండునో అచట ఐశ్వర్యము, విజయము మున్నగునవి వెలయుచుండునని చెప్పబడినది. కాబట్టి విజయమును, నీతిని, జ్ఞానసంపదను అభిలషించువారు భగవచ్చింతనాదులద్వారా సాక్షాత్ భగవానుని తమ హృదయమందు ప్రతిష్టింపజేసికొనవలెను.
భగవంతుడగు శ్రీకృష్ణుడుండుచోటే కాక, భక్తుడగు అర్జునుడుండుచోట గూడ అట్టి విజయాదులు సంభవించునని యేల చెప్పబడెననగా - అర్జునుడు సామాన్యభక్తుడు కాడు. ధనుర్ధారియగు భక్తుడు. అనగా బాహ్యశత్రువుల నే ప్రకారము గాండీవముచే జయించివైచెనో, అట్లే అంతఃశత్రువులనుగూడ గీతాజ్ఞానరూపధనుస్సుచే ఛేదించివైచి మోహరహితుడై విలసిల్లెను
(నష్టో మోహః).
ఈ ప్రకారముగ అజ్ఞానము నశించిన భక్తుడు సాక్షాత్ భగవంతుడే యగుచున్నాడు. (బ్రహ్మవిద్బ్రహ్మైవ భవతి) కావున ప్రకృతిని జయించినట్టియు, మాయాశత్రువును జ్ఞానఖడ్గముచే, జ్ఞానధనుస్సుచే విచ్ఛిన్న మొనర్చినట్టియు - భక్తుడుండుచోటగూడ భగవత్సాన్నిధ్యమందువలె విజయ సంపదాదులు వర్ధిల్లుచుండుటలో ఆశ్చర్యమేమియును లేదు.
అయితే ఇచట తెలిపినది సామాన్యభక్తుని విషయముకాదనియు, అజ్ఞానమును, కామక్రోధాదులను జయించి ప్రకృతిపై విజయమును సాధించిన (ధనుర్ధరుడగు) భక్తునివిషయమే చెప్పబడినదనియు నెఱుగవలెను.
కాబట్టి గీతాజ్ఞానరూప మహాధనుస్సును జేబట్టినవాడును, నిష్కామకర్మ, భక్తి జ్ఞాన ధ్యాన వైరాగ్యాదులు అను అస్త్రములను ధరించినవాడు నగు భక్తునిచెంత సాక్షాత్ భగవానుని సాన్నిధ్యమందువలె విజయాదులు వర్ధిల్లుచుండునని భావము. అట్టి పరమభక్తులు, జ్ఞానులు సాక్షాత్ భగవత్స్వరూపులుగనే యుందురు. కావున దైవమందెట్టి పవిత్రీకరణశక్తి యుండునో వారియందున్ను అట్టి శక్తి యుండును. ఏలయనిన, అతిశయభక్తిస్థితియందు, లేక జ్ఞానస్థితియందు భక్తునకును భగవంతునకును, లేక జ్ఞానికిని దేవునకును భేదము యుండదు. (జ్ఞానీత్వాత్మైవ మే మతమ్).
మఱియు "ధనుర్ధరః” అనుపదము కర్మయోగమును, నిర్మల అనుష్ఠానమును గూడ సూచించుచున్నది. ప్రతివ్యక్తికిని తత్త్వబోధతో బాటు అనుష్ఠానముగూడ ఉండవలెనని ఆ పదముచే స్పష్టమగుచున్నది.
ఎచట శ్రీకృష్ణుడుండునో అచట విజయ, ఐశ్వర్యము లుండునని తెలుపుటవలన ప్రతివారును తమ గృహమందును, తమ హృదయమందును భగవంతుని స్థాపించుకొని నిరంతరము అర్చన పూజాధ్యానాదులు సలుపుచుండినచో అచ్చోట సాక్షాత్ పరమాత్మయే నివసించుచుండును.
గావున అట విజయైశ్వర్యాదులు తప్పక నుండగలవు. అట్లే ఎచట భక్తి జ్ఞాన వైరాగ్యాదులు, దైవీసంపత్తి గలిగియున్న మహనీయులు, భక్తవర్యులు నివసించుచుందురో అచ్చోట ధనుర్ధారియగు అర్జునుని సన్నిధానమందువలె విజయాదులు వర్థిల్లునని గ్రహింపవలెను. లోకమునందును ఇపుడు భగవత్పూజాదులు జరుగుచోట, మహనీయులుండు చోట శుభప్రదమైన వాతావరణము, విజయాది సల్లక్షణములు ఉండియుండుట మనము చూచుచునే యున్నాము.
ప్రతిజీవియు విజయమునే కోరునుగాని అపజయమును గాదు. సంపదనే కోరునుగాని దారిద్ర్యమునుగాదు. కాని అవి లభించుట కుపాయమేమి? ఆ యుపాయ మీ శ్లోకమున చెప్పబడినది. దానిని కార్యాన్విత మొనర్చుకొనినచో తప్పక ఆ విజయాదులు జనులకు లభించగలవు. శ్రీకృష్ణపరమాత్మను వారి హృదయమందు, వారి గేహమందు చేర్చుటయే ఆ యుపాయము. భగవంతుని భక్తిపూర్వకముగ ధ్యానించుచు భగవత్సాన్నిధ్యము ననుభవించుచుండుటయే ఆ యుపాయము.
ఎచట శ్రీకృష్ణుడుండునో అచట విజయాదులుండుట తథ్యము. కాబట్టి భగవత్సాన్నిధ్యమును గలుగజేసికొనుచుండు భగవద్భక్తులకు విజయాదులు తప్పక సిద్ధించితీరును. అట్లే మహనీయులగు జ్ఞానులు, యోగిపుంగవులు మున్నగువారి సాంగత్యమందును అట్టి మహచ్ఛక్తి కలుగగలదు. కావున భగవత్సాన్నిధ్యము, సజ్జనసాంగత్యము రెండిటిని కలుగజేసికొనుచు శ్రీకృష్ణార్జునుల (నరనారాయణుల) యిరువురి సాంగత్యశ్రీని అనుభవించుచుండవలెను.
మఱియు ఎచ్చోట (ఏ పక్షమున) శ్రీకృష్ణుడు, అర్జునుడు ఉండునో, ధర్మమేపక్షమున నుండునో అచట (ఆ పక్షమున) విజయము తప్పక కలుగునను వాక్యమును చెప్పుటద్వారా సంజయుడు పాండవ పక్షముననే విజయము కలుగునను భావమును ధృతరాష్ట్రునకు ధ్వనింపజేసెను. (ఆ వాక్యమును వినియైనను ధృతరాష్ట్రుడు సంధిచేసికొని యుద్ధమును మాన్పించుట శ్రేయస్కరమని యాతనికి గూఢముగ బోధింపబడినది).
ఈ శ్లోకమందలి " ధ్రువానీతి” అను పదమునకు "నీతి మున్నగునవి తప్పక కలుగును' అని కొందఱు అర్థము చెప్పిరి.
గీతయొక్క అంతమున సంజయునిచే బోధింపబడిన ఈ "యత్రయోగేశ్వరః కృష్ణో" - అను మహత్తరమగు శ్లోకమును భక్తులు మఱల మఱల జ్ఞాపకము చేసికొనుచు భగవత్సాన్నిధ్యమును తమ హృదయమున నిరంతరము కలుగజేసికొనుచు భగవదనుగ్రహముచే జీవితములను ఆనందమయములుగ నొనర్చుకొందురుగాక!
మఱియు భగవానునిచే కరుణతో బోధింపబడిన ఈ గీతాశాస్త్రము నంతను చక్కగ పఠించి, అనుష్టించి, ఆత్మానుభూతిని బడసి జన్మరాహిత్యరూప నిత్యానందపదవి నొందుటద్వారా మానవ జీవితమును కృతార్థము చేసికొందురు గాక!
హరిః ఓం తత్ సత్
శ్రీమన్మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం
శ్రీమద్భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం
యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే మోక్షసన్న్యాసయోగోనామ
అష్టాదశోఽధ్యాయః
ఇది శ్రీవ్యాసముని విరచితమైనదియు, నూఱువేల శ్లోకములు గలదియును, ఛందోబద్ధ మైనదియు నగు శ్రీమహాభారతమున భీష్మపర్వమునగల ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జునసంవాదమును నగు
శ్రీ భగవద్గీతలందు మోక్షసన్న్యాసయోగమను
పదునెనిమిదవ అధ్యాయము
సంపూర్ణము
హరిః ఓమ్ తత్ సత్
శ్రీ పరబ్రహ్మార్పణమస్తు ఓమ్.
🕉🌞🌎🌙🌟🚩
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
819వ నామ మంత్రము
ఓం సర్వాంతర్యామిన్యై నమః
సర్వజీవులలో వసిస్తూ ఇంద్రియ-అంతఃకరణాలను నియమించు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వాంతర్యామినీ యను ఆరక్షరముల (షడాక్షరీ) నామ మంత్రమును ఓం సర్వాంతర్యామిన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు సాధకులకు ఆ తల్లి వెన్నంటి ఉంటూ, ఏవిధమైన కష్టములు కలుగకుండా, సర్వము మంగళప్రదముగా యగునట్లుగా అనుగ్రహించుచుండును.
పరమేశ్వరి జగత్తునందు ఇందుగలదందులేదని సందేహము వలదన్నట్లు జీవకోటిలో ఉంటూ, జీవుల రక్షణభారాన్ని వహిస్తూ ఉంటుంది. అమ్మవారు పరమాత్మ. జీవులను సృష్టించునది తానే. ఆ జీవకోటి ఆత్మగా వసించునదిగూడా తానే. ఈ ఆత్మ అంతర్యామి. ఈ ఆత్మయే అంతటికి కారణభూతుడు అని మాండూక్యోపనిషత్తులో చెప్పబడినది. పాంచభౌతికస్వరూపమైన జగత్తును సృష్టించి, ఆ జగత్తునందు ప్రవేశించి మ…
[04:35, 17/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
244వ నామ మంత్రము 17.02.2021
ఓం చరాచర జగన్నాథాయై నమః
స్థావరజంగమాత్మకమగు జగత్తుకు స్వామినియై విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి చరాచరజగన్నాథా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం చరాచరజగన్నాథాయై నమః అని ఉచ్చరించుచు, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు భక్తులను ఆతల్లి కరుణించి సుఖశాంతులతో జీవించునటులును, సదా పరమాత్మ నామస్మరణతో తరించునటులును అనుగ్రహించును.
ఈ సృష్టిలో జంగమములు అనగా కదలునవి (చరించునవి), స్థావరములు (కదలనివి లేక చరించలేనివి) అని రెండు విధములైనవిగా జగత్తునందు గలవు. పర్వతములు, రాళ్ళు ఇలాంటివి కదలవు. కాని ఒకప్పుడు పర్వతములు కదలుతుండెడివి అని పురాణగాథ కలదు. పూర్వము కృతయుగమున పర్వతములకు అన్నింటికి ఱెక్కలు కలిగి ఉండెను. అప్పుడు అవి ఎల్లయెడల అతిరయముతో తిరుగుచు ఉండినందున ప్రాణులకు మిక్కిలి భయము కలుగుచు ఉండెను. అది నిలుపుటకై ఇంద్రుఁడు తన వజ్రాయుధముచే పర్వతముల ఱెక్కలు తెగకొట్టసాగెను. ఆసమయమున వాయుదేవుని సాహాయమువలన మైనాకుఁడు అసు పర్వతము తప్పించుకొని పోయి సముద్రములో దాగుకొనెను.
పక్షులు, జంతువులు, మానవజాతి అనేది జంగమములు. అనగా కదలునవి. అయితే వృక్షములు కదలకపోయినను, భూమిలో తమ వ్రేళ్ళను నీరు, పోషకపదార్థముల కొఱకు వ్యాపింపజేసుకుంటాయి గనుక వీటిని స్థావరములు అనడానికి వీలులేదు. ఈ విధంగా జగత్తును స్థావరజంగమాత్మకమైన జగత్తు అందురు. ఇదే చరాచరజగత్తు అని కూడా అంటాము.ఇటు చరాచరజగత్తునకు పరమేశ్వరి సృష్టికర్త. నాథురాలు. గనుక పరమేశ్వరి చరాచరజగన్నాథా యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం చరాచరజగన్నాథాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Comments
Post a Comment