01-05-
] Mallapragada Ramakrishna: 01/5..*ప్రతిఒక్కరికీ మేడే శుభాకాంక్షలు* పల్లవి వైవిధ్యమే నైవేద్యం కలియుగమే విశ్వాస వైద్యం ప్రకృతిలోని ప్రతి స్పందన మనసుకిచ్చే జీవన సాధ్యం ॥ చరణం – 1 ఎంత వైవిధ్యం ఈ ప్రకృతి మనిషి బ్రతుకులో అదే శృతి ఒకరికొకరు కలిసినపుడే ఏకత్వమనే అందమైన ఆకృతి ॥ భావ విన్యాసాల మధ్యన స్వీకారమే మధుర గీతి అరుణరంగుల ఆకాశమంత ఆవేశాలకూ ఒక ప్రతీకృతి ॥ చరణం – 2 ఇంకోవైపు నీలి నింగి తెలిమబ్బుల శాంతి రాగం మనలోన కారుణ్యాలకు ప్రేరణనిచ్చే దివ్య భాగం ॥ దట్టమైన పచ్చదనమది ధరణి మాత హృదయ కాంతి చూడగానే చిగురించే చైతన్యాల మధుర శాంతి ॥ చరణం – 3 వేగంగానో మంద్రంగానో పరుగెత్తే జీవన నీరు ఎదగాలనే మనసులోని ఆశలకది నిత్య తీరు ॥ ప్రకృతే మానవుడై వెలిగి మానవుడే ప్రకృతై నిలిచి రెండిటికీ అవినాభావం అనుబంధమై యుగయుగాల నిలిచి ॥ ముగింపు వైవిధ్యమే జీవన సత్యం విశ్వాసమే మానవ మంత్రం ప్రకృతి మనసు కలిసినపుడే పరవశమగు జీవన గానం ॥ **** : 01/5....101.|సుభాషితమ్| శ్లో𝕝𝕝*శాంతో దాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్*౹ *శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్*౹౹ *ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః*౹ *నిగ...