శ్రీ వేంకటేశ అష్టకం -1 వేంకటేశో వాసుదేవః ప్రద్యుమ్నోఽమితవిక్రమః | సంకర్షణోఽనిరుద్ధశ్చ శేషాద్రిపతిరేవ చ || 1 || జనార్దనః పద్మనాభో వేంకటాచలవాసినః | సృష్టికర్తా జగన్నాథో మాధవో భక్తవత్సలః || 2 || ❄ *ఓం నమో వేంకటేశాయ* ❄ *రోజుకో అన్నమయ్య సంకీర్తన* *ఇది మీకోసం చేస్తున్న సాహితీ యజ్ఞం.* *కుదిరితే నేర్చుకోండి.లేదా, ఒక్కసారి వినండి.* *పల్లవి:* వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని *చ1|| :* ఆమటి మ్రొక్కుల వాడే అది దేవుడే వాడు తోమని పల్యలవాడే దురిత దూర్యుడే *చ2| :* వడ్డీ కసులవాడే వనజనాభుడే పుట్టు గోద్రల్లకు బిడ్డ లిచ్చే గోవిందుడే *చ3| :* ఎలిమి కోరిరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగా శ్రీ వేంకటాద్రి నాధుడే. *రోజుకో అన్నమయ్య సంకీర్తన* * *రాగము: శంకరాభరణం* రేకు: 1000-6 సంపుటము: 20-6 *॥పల్లవి॥* అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ నలి నిందిర నీతో నవ్వినది *॥చ1॥* ఆదిలక్షి మోహనకమలంబున వేదమాత నిను వేసినది ఆదెస నీపై నభయహస్తమును సాదరమునఁ గడుఁ జాఁచినది *॥చ2॥* సిరి దనకన్నుల చింతామణులను పొరి నీపై దిగఁబోసినది వరదహస్తమున వలచెయి వట్టుక అరుదుగ విను మాఁటాడ...
Posts
Showing posts from September, 2021
సత్య దర్శనము
- Get link
- X
- Other Apps
1-సత్య దర్శనము ఓంశ్రీమాత్రే నమః *వేమన - రమణులు :-* *పరిచయ వాక్యాలు:-* *వేమన యెాగి, "తాను" పుట్టుచోటు తత్త్వము / రమణ మహర్షి. "నేను" పుట్టు చోటు ఆత్మ.* *వేమనయోగి 17వ శతాబ్దము నాటి విప్లవయెాగి, సత్యాన్వేషి మానవతావాదిగా తన కాలములోని సాంఘిక దురాచారములను ఎత్తి చూపెను. అతడొక ప్రజాకవి. ఆటవెలది పద్యములలో చిన్న మాటలతో సామాన్యులకు అర్థమగునట్లు మతములలోని మూఢవిశ్వాసములను వివరించి , నీతి బోధను గావించి , నిద్రాణూలైన ప్రజలను మేల్కొల్పను. "వ్రాలకందని పద్యముల్ వేల సంఖ్యలో" చెప్పెనూ.* *వేమన యోగి సంఘ సంస్కర్త యగుటయే గాక ఆత్మసాక్షాత్కారమును పొందుటను వేదాంతమును , జ్ఞాన మార్గమును , సులభళైలిలో , అటవెలది పద్యములలో , కవితా రూపమున , దాపరికము లేక , ఉన్నాదున్నట్లు , నిర్భయముగా చాటి చెప్పి మానవులకు జ్ఞానోదయమగునట్లు చేసెను.* ...
హాస్యం
- Get link
- X
- Other Apps
ఉత్తర మిన్నులు - ఖండకావ్యం విశ్వనాథవారు తానెన్నో ఖండకావ్యాలు వ్రాసినట్టు చెప్పారు। అవన్నీ ప్రచురణకు నోచుకోలేదు। వాటిలో కొన్నింటిని మాత్రం వారు తన "తొలి జనుస్సులందలి చెలికాడు" అని ఎంతో ప్రేమగా చెప్పుకున్న జువ్వాడి గౌతమరావుగారు ఎంతో శ్రద్ధ వహించి సంకలనం చేశారు। అలా సంకలనం చేసి ప్రాచుర్యంలోకి తెచ్చిన ఐదు పద్యాల ఖండ కావ్యం "ఉత్తర మిన్నులు।" ఈ పద్యాలు చదువుతూంటే శరీరాన్ని వదిలి ఆ ఉత్తర మిన్నులలో "నునుపింజల" లో ఒకటై ఎగిరి మబ్బుపిల్లలతో సరిగా విహరించాలనే కోరిక కలుగక మానదు। 1।వపు రనలుండు తమ్మిపువుబందుగు కట్టిన బండి గుఱ్ఱముల్/ విపులపు కాలిగిట్ట లొరిపిళ్ళకు మిక్కిలి వెట్టయెక్కి ఱం/ పపుపొడివోని సన్న తెలిమబ్బులసందులనుండి జారి వ/ చ్చు పగులుటెండ కార్తికపుఁ జొక్కులు పోవగ నీదు జీవులన్। 2।చిలచిల రేగుచున్ బొగలు చిమ్ముచు నుచ్చెడు నాసలందు నా/ విలపము నుత్తరంపుదెస వెట్టిన ముట్టెలగట్టు నుర్వులం/ బలెఁ దొలిదిక్కు దూగిన సుమారగు మిన్నున దూలిపోవుమ/ బ్బులు నునుపింజలై విరిసిపోయెడు గాలికి నూగిరేగుచున్। 3।క్రుమ్మిన మింటిమార్గమునకున్ నడిపట్టున నిల్పినట్టి యం/ త్రమ్మునఁ బొల్చు పెన్మొసలి...