సత్య దర్శనము
1-సత్య దర్శనము
ఓంశ్రీమాత్రే నమః
*వేమన - రమణులు :-*
*పరిచయ వాక్యాలు:-*
*వేమన యెాగి, "తాను" పుట్టుచోటు తత్త్వము / రమణ మహర్షి. "నేను" పుట్టు చోటు ఆత్మ.*
*వేమనయోగి 17వ శతాబ్దము నాటి విప్లవయెాగి, సత్యాన్వేషి మానవతావాదిగా తన కాలములోని సాంఘిక దురాచారములను ఎత్తి చూపెను. అతడొక ప్రజాకవి. ఆటవెలది పద్యములలో చిన్న మాటలతో సామాన్యులకు అర్థమగునట్లు మతములలోని మూఢవిశ్వాసములను వివరించి , నీతి బోధను గావించి , నిద్రాణూలైన ప్రజలను మేల్కొల్పను. "వ్రాలకందని పద్యముల్ వేల సంఖ్యలో" చెప్పెనూ.*
*వేమన యోగి సంఘ సంస్కర్త యగుటయే గాక ఆత్మసాక్షాత్కారమును పొందుటను వేదాంతమును , జ్ఞాన మార్గమును , సులభళైలిలో , అటవెలది పద్యములలో , కవితా రూపమున , దాపరికము లేక , ఉన్నాదున్నట్లు , నిర్భయముగా చాటి చెప్పి మానవులకు జ్ఞానోదయమగునట్లు చేసెను.*
*వేమన జ్ఞానమార పద్యములను తంజావూరు , మద్రాసు , కడప మొదలగు పెట్టణములలోని లైబ్రరీల నుండి సంగ్రహించి తొలుత CP Brown 1924 లో ప్రచురించెను.*
*Plato పండితుని వేదాంత భావములు వేనున అభిప్రాయములను పోలియున్నవని C.P. Brown తెలిపెను. వేమన జ్ఞానమార్గ పద్యములను మహర్షి రమణ భగవానుల ఉపదేశసారము, రమణగీత, ఉన్నది నలువది అను గ్రంథములలోని శ్లొకములతో పోల్చి చూచిన , రెండింటి యందును ఆత్మ సాక్షాత్కారమునకు ఒకే మార్గము చెప్పబడి యున్నదని విశదమగుచున్నది.*
*యెాగి వేమన ఆత్మానుభూతిని పొంది. జీవన్ ముక్తుడై జ్ఞానియైన తరువాత ఇతరులను తరింపజేయుటకై ( స్వయం తీర్వా పరాం సారయతి ) తాను ఆచరించిన జ్ఞానమార్గ పద్ధతిని ఇతరులకు బోధించెను.*
*స్వానుభవము లేక శాస్త్రవాసనలచే సంశయంబు చెడదు సాధకునకు, చిత్రదీపము తోడ చీకటి చెడనట్లు!! 103 వేమన వెదము - అరుద్ర*
*అని తన ఆత్మానుభూతిని గురించి చెప్పుకొనెను.*
*తాననుభవించినదిఇతరులకు, జ్ఞానమును ఉపదేశములను గావించుటకై మేనుగొనినట్జి శ్రీ భగవానుడు - రమణులు.*
((()))
-సత్య దర్శనము
*వేమన - రమణులు*
*మహర్తి రమణులు ఆత్మానుభూతిని పొంది జీవన్ముక్తుడైన తరువాత ఇతరులకు ఆత్మసాక్షాత్కారమును పొందు మార్గమును బోధించెను.*
*వేమన యోగి , రమణ మహర్షులు చెప్పిన జ్ఞానమార్గ పద్ధతులను పరిశీలించినచో రెండును ఒకటేనని తోచకమానదు.*
*1.ఉపదేశసారము అను గ్రంథమును భగవాన్ శ్రీ రమణ మహర్షి సంస్కృతమున వ్రాసెను. దీనికి సంబంధించిన ఒక కథ కలదు. పూర్వము దారుకావనము నందు ఋషులు దీక్షతో యజ్ఞయాగాది వైదిక కర్మకాండను ఆచరించుచుండిరి.*
*పై విషయమును మురుగనారు 70 శ్లోకములలో వివరించిరి. ఋషులకు శివుడు ప్రత్యక్షమై కర్మకాండ నాచరించిన మోక్షము కలుగదని, జ్ఞనమార్గమును అనుసరించవలెనని ఉపదేశించెను. శివుని ఉపదేశములను మురుగనారు శ్లోకరూపమున వ్రాయమని శ్రీ రమణ మహర్షిని కోరెను.*
*మహర్షి 30 శ్లోకములలో ఉపదేశసారము అను గ్రంథమును వ్రాసిన ఈ గ్రంథములో " భగవదాజ్ఞానుసారము కర్మఫలము లభించుననియు కర్మ దైవము కాదనియు " శ్రీరమణ మహర్షి వ్రాసెను. కర్మమార్గము కంటే జ్ఞానమార్గమే ముక్తిని కలిగించుటకు సూటియైనదని చెప్పెను.*
*కర్తు రాజ్ఞయా ప్రాప్యతే ఫలం!*
*కర్మ కిం ఫలం కర్మ తజ్జడం - ఉపదేశ సారము.*
*వేమన కూడ కర్మను పొగడలేదు.*
*కర్మము కర్మము కర్మమురా*
*కర్మముతో శివు గానము రా 195 - వేమన జ్ఞానమార్గ పద్యములు . C.P. BrONG*
*కర్మముతో స్వర్గపలము లభించును కాని ఆత్మసాక్షాత్కారము లభించదు.*
*2. కొన్ని ప్రశ్నలకు శ్రీ రమణులు చెప్పిన సమాధానములనాధారముగ తీసికొని శ్రీవాశిష్ట గణపతి ముని సంస్కృతమున రమణగీత ' అను గ్రంథమును వ్రాసిరి.*
*3. భగవాన్ రమణులు తమిళమున ' ఉన్నది నలుపది ' అను గ్రంథమును మురుగనార్ కోరగా రచించిరి. దీనిని వాశిష్ట గణపతిముని సంస్కృతమున ' సద్దర్శనము ' అను పేరుతో శ్లోక రూపమున రచించిరి. ఈ గ్రంతము ఆత్మాసాక్షాత్కార మార్గములను వివరించును.*
*పై మూడు గ్రంథములు ప్రస్థాన త్రయమునకు సమానమని పండితులు పొగడినారు.*
((()))
విఘ్నేశ్వర పూజ:-
[ విఘ్నము + ఈశ్వర + పూజ]
➡ విఘ్నము అంటే అడ్డంకులు
➡ ఈశ్వరుడు చేసేది ధ్యానము (తపస్సు)
➡ పూజ అనగా 'పూ'ర్తిగా 'జ'యించడం
అందువలన విఘ్నేశ్వర పూజ అంటే ..,
"మన సంకల్పం సిద్ధించాలంటే ధ్యానం చేసి మన యొక్క విఘ్నాలను తొలగించుకొని ఆ సంకల్పాన్ని పూర్తిగా జయించడం" అన్నమాట.
'దేహం మాత్రమే నేను' అని భావించడమే అజ్ఞానం.
ధ్యానం ఆ అజ్ఞానాన్ని తొలగిస్తుంది.
ధ్యానం వలన 'ఆత్మే తాను' అనే జ్ఞానం కలుగుతుంది.
శరీరాన్ని మరచి మనసుని పట్టుకుంటే - ధ్యాన యోగం. (యోగః చిత్తవృత్తి నిరోధః)
మనసుని మరచి బుద్ధిని పట్టుకుంటే - బుద్ధి యోగం. (అహింసా పరమో ధర్మః)
బుద్ధిని మరచి ఆత్మను పట్టుకుంటే - జ్ఞాన యోగం. (శుభాశుభ పరిత్యాగి)
ఆత్మను మరచి సర్వాత్మలతో కలిసి ఉంటే - సేవ యోగం. (మాధవ సేవే మానవ సేవ)
అక్షరాభ్యాసం:-
అక్షరం + అభ్యాసం
క్షరం అంటే నశించేది. అక్షరం అంటే నశింపులేనిది. నశింపులేనిది ఆత్మ పదార్థం. కావున అక్షరం అనగా ఆత్మ పదార్ధమే.
ఆ ఆత్మ పదార్థాన్ని తెలుసుకోవాలంటే చేయవలసిన అభ్యాసము "ధ్యానమే".
: త్రికరణ శుద్ధి అంటే --
➡️ మన మనస్సులో ఏది ఉంటుందో దాన్నే మాట్లాడటం.
➡️ ఏది మాట్లాడుతున్నామో దాన్నే చేయడం.
➡️ ఏం చేస్తున్నామో దాని గురించే మాట్లాడటం.
: శిష్యుడు:- సృష్టి, స్థితి, లయాలెందుకు?
సద్గురు:- ఇదంతా మాయమయి లీలా విశేషం.
➡️ లీల అన్నాక 'ఎందుకు?' అన్న ప్రశ్నకు తావులేదు.
➡️ లీలను లీల గానే దర్శించడం కంటే పరమార్థం వేరే ఏమీ లేదు.
➡️ చూ-స్తూ ఉం-డు (సాక్షితత్వం)
ఈ నాలుగు అక్షరాలే ఆధ్యాత్మిక సారం.
((()))
3-సత్య దర్శనము🧘♀️*
ఓంశ్రీమాత్రే నమః🔥
*వేమన - రమణులు*
*రమణ గ్రంథములు. ప్రస్థానత్రయము :-*
*1. ఉపదేశసారము- 1. ఉపనిషత్తులు*
*2. రమణ గీత- 2. భగవద్గీత లో*
*3. సద్దర్శనము- 3. బ్రహ్మ సూత్రములు*
*ఇట్టి సద్గ్రంధముల ద్వారా ఆత్మ సాక్షాత్కారమునకు సూటియైన మార్గములను సులభపద్ధతిలో బోధించిన భగవాన్ శ్రీ రమణ మహర్షి మానవులకు ఎనలేని ఉపకారము చేసిరి. పై గ్రంథములలో వేమన జ్ఞానమార్గ పద్యములను పోల్చి ఈ గ్రంథములో విమర్శించడం జరిగింది .*
*శ్రీ రమణాశ్రమం వారు అందరికీ మేలు కలుగవలెనన్న దృక్పథంతో ఆత్మసాక్షాత్కారమునకు మార్గమును సూచించు పైమూడు గ్రంథములను తెలుగులో అర్థసహితంగా ప్రచురించిరి వారి కృషి శ్లాఘనీయము.*
*వేమన బోధించిన మార్గము :-*
*తాను బోధించిన విద్యను వేమన క్రింది విధముగా నిర్వచించెను.*
*+ వేద విద్యగాదు , వీరవిద్యగాదు ,*
*బాధ విద్యగాదు , పరువుగాదు ,*
*మధురమైన యట్టి మనసు నిల్పెడి విద్య*
*సాధువిద్య ఎన్న సరగ వేమ !*
*-719 . వేమన జ్ఞానమార్గ పద్యములు . CP Brown.*
*ఈ పద్యమునకు ఎవరు సరియైన అర్థము వ్రాయలేదు. శ్రద్ధగా పరిశీలించినచో వేమన మనోగతమైన భావము మనకు గోచరించును.*
*1. వేద విద్య గాదు : - వేమన చెప్పిన విద్య వేదవిద్య కాదు.*
*పూర్వమీమాంసకులు వేదములో చెప్పబడిన యజ్ఞయాగాది కర్మకాండను స్వర్గకాము ఆచరించిరి. ( స్వర్గకామోయ జేత ) , వారు స్వర్గములో సుఖములను అనుభవించిన తరువాత యజ్ఞముల వలన ఆర్జించిన పుణ్యము ఖర్చుకాగా ( క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ) మరల భూలోకమున పునర్జన్మను పొందిరి.*
*దీనివలన జన్మరాహిత్యము మోక్షము సిద్ధించదు . దారుకా వనములో యజ్ఞయాగాది కర్మకాండను ఆచరించు ఋషులకు ఈశ్వరుడు ప్రత్యక్షమై జ్ఞానమార్గమును అవలంబించమని బోధించెను.*
*ఇంకను కలికాలములోని మానవులను గూర్చి భాగవతమిట్లు తెల్పుచ్నుది.*
*చ || అలసులు , మందబుద్ధిబలు , లల్పతరాయువు , లు గ్రరోగసంకలితులు , మందభాగ్యులు సుకర్మము లెవ్వియు చేయజాలరు.*
((()))
🧘♂️4-సత్య దర్శనము🧘♀️
వేమన - రమణులు
అనగా వైదిక కర్మలైన యజ్ఞ యాగాదుల నిర్వహణ శ్రమతో కూడుకున్నది. కలికాలములోని మానవులు , అలసులు , బుద్ధి మాంద్యము కలవారు , ఆయుస్సు తక్కువగా కలవారు. రోగములు కలవారు, భాగ్యహీనుల కావున యజ్ఞయాగాది కర్మలు చేయలేరు.
యజ్ఞయాగాది కర్మలొనర్చునప్పుడు తప్పు చేసిన పాపము కలిగి నరకమును అనుభవింతురు. ఈ విద్య పునర్జన్మము లేని మోక్షవిద్య కాదు. కావున వేమన చెప్పిన విద్య.
2. వీర విద్య కాదు : - వేమన విద్య తoత్ర మంత్రములను జపించి బలుల అర్పించి చేయు వీరసాధకుల విద్యకాదు. వీర సాధనను గురించి ( Sir John Woodroff ) Arthur Avalon రచించిన Priniciples of Tantra అనే గ్రంథములో వివరింప బడియున్నది.
మనసు నిల్పుటకు కఠినమైన నియమముల బూని వీరసాధకుడు తన తలనైను నటికి హోమగుండములో పడవైచును. రావణుడు తన పది తలలను కోసి హోమగుండములో పడవైచెను కదా ? అందరు వీర సాధకులు కాలేరు దేహత్యాగమునకు సిద్ధపడలేరు.
జయ విజయులు శాపమును పొంది రాక్షసులైరి. వారు మరల శ్రీహరిని చేరుటకు సాత్విక పద్ధతిలో ఏడు జన్మలు పట్టెడిది. కాని తామసిక పద్ధతిలో శ్రీహరిపై వైరమును బూని మూడు జన్మలలోనే విష్ణు దివ్య పదమును చేరిరి కదా !
సాధకులు సాత్విక మార్గముతో మనసు నిల్పి త్వరగా సిద్ధి గాంచలేరు. కఠినమైన నియమములను అవలంబించెదరు. ఉదాహరణమునకు స్త్రీని తిలకించుచు మనస్సు చలింపక మంత్రజపము చేయుట వీరిలో కొందరి ఆచారము. వీర సాధకులది తామస ప్రకృతి , తామస విద్య , క్షుద్ర దేవతా ఉపాసన. ఈ విద్యలో ఉపయోగించు ముద్రలను 'వెట్టి చేష్ట' లని వేమన భావించెను. + తంత్రమంత్రములను తారక మబ్బునా ? ( 59 వేమన వేదము ) అని పరిహాసము చేసెను. వేమన చెప్పినది తాంత్రిక మంత్రములతో వీర సాధకుడు చేసెడి విద్యకాదు. ఈ విద్యతో జన్మ రాహిత్యము , మోక్షము సిద్ధింపవు.
3. బాధ విద్య కాదు : - ఇది వరాహోపనిషత్తులో చెప్పిన వామదేవ మార్గము మరియు పతంజలి చెప్పిన అష్టాంగయోగము ( యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులు అష్టాంగములు ). వరాహోపనిషత్తులోను , ధ్యాన బిందు ఉనిషత్తులోను ప్రాణాయామము, హరయోగము, కుండలినీ యోగము చెప్పబడినవి.
కుండలినీ శక్తి సూది ఆకారము పొంది ఆరు చక్రములను ఛేదించునప్పుడు సాధకుడు బాధను అనుభవంచవలసి యుండును.
(()))
5-సత్య దర్శనము *వేమన - రమణులు*
*మనసు నిల్పలేక + యొడలు బడల చేసి , యుగ్రతసము , తమరు చేసి మేమి తత్త్వంబు గనలేరు . - వేమన + ఆసనాది విధులు అధమ యోగంబులు*
*-168 . వేమన పద్యములు*
*కుండలినీ శక్తి షట్చక్రములను భేదించి , సహస్రారము చేరిప్పటికిని అనేక సిద్ధులు లభించును. కాని మోక్షము సిద్ధించదు. " జ్ఞానాదేవహి కైవల్యం " అని శంకరుడు చెప్పినట్లు సాధకుడు ఆత్మజ్ఞానమును పొందవలెను.*
*కుండలినీ విద్య శక్తుల సాధించుటకు ఉపయోగపడుట చేత రజోగుణ ప్రధానమైనది. వేమన చెప్పిన పద్యములలో షట్చక్రములను గూర్చి చెప్పిన కొన్ని పద్యములు మాత్రమే కనుపించు చున్నవి. ఇవి వేమన చెప్పినవి కావేమో ? తరువాతి వారు ఈ పద్యములను చేర్చియుందురు. పడవైచెను కుండలినీ విద్య అనగా మనస్సుతో కూడిన విద్యయే.*
*+ మానసంబు కలిమి మధ్యమంబు - 168 వేమన పద్యములు.*
*ఇది ' మనసు నిల్పడి ' విద్య కాదు . దీని వలన మోక్షము , జన్మ రాహిత్యము కలుగవు.*
*4. పరువు కాదు : - పరువు , ప్రతిష్ఠలకై ధన సంపాదనకై నేర్చుకొను విద్యకాదు. వైద్యము , జ్యోతిషము , భౌతిక రసాయన శాస్త్రములు మొదలైనవి అపరావిద్యలు. ఏ విద్యచే బ్రహ్మ సాక్షాత్కారము కలుగునో అది పరావిద్య , వేమన, రమణులు చెప్పిన విద్య పరావిద్య.*
*5. అయినచో వేమన చెప్పిన విద్య ఏది ?*
*“ మనసు నిల్పెడి విద్య " ఇది మధురమైన సాధు విద్య అనగా సాత్వికమైనది విద్య. మనసు నిల్పువాడు మర్మజ్ఞుడగు యోగి వేమన. మనస్సనగా యేమి ? మనస్సునెట్లు నిలుపవచ్చును ? పై ప్రశ్నలకు భగవాన్ రమణ మహర్షి సమాధానములు చెప్పిరి.*
*మానసంతు కిం , మార్గణే కృతే సన ,*
*నైవమాసం , మార్గఆర్జవాల్ . - ఉపదేశసారము.*
*అనగా మనస్సను వస్తువు ప్రత్యేకముగా లేదు. అది ఆత్మ నుండియే పుట్టుచున్నది. మనోవృత్తులు అనగా ఆలోచనలు. ఆలోచనా సమూహమే మనస్సు.*
*వృత్తయ స్త్యహంవృత్తి మాశ్రితా!!*
(((())))
*🧘♂️6-సత్య దర్శనము🧘♀️*
*వేమన - రమణులు*
*నేను అనునది మొదటి ఆలోచన తరువాత నీవు , వాడు , అది అను ఆలోచనలు ఏర్పడును. ఈ ఆలోచనల నాపికొనుటకు రమణ గీతలో ప్రాణగత్యాగతి ప్రత్యవేక్షణము ( రేచక పూరకములలోని ఊపిరిని గమనించుట ) చెప్పబడినది.*
*శ్లో " ప్రాణ రోధశ్చ , మనసా ప్రాణస్య ప్రత్యవేక్షణం|*
*కుంభకం సిద్ధ్యతి హ్యేవం సతత ప్రత్యవేక్షణాల్ ||* -రమణ గీత.*
*ప్రాణమును గమనించినచో సహజ కుంభకము సిద్ధించి ఆలోచనలు ఆగిపోవును. ఇది మనోలయ స్థితి. వేమన కూడ నిన్ను నీవు తెలుసుకొన వలెనన్న ఆలోచనలనీ కొనవలెనని తెలిపెను.*
*నిను నీ వెఱుగగనెంచిన*
*మనమున సంకల్పములను మానగవలెరా . - వేమన.*
*ఇట్లు మనస్సు లయము చెందినను ' నేను ' అను తొలి ఆలోచన మిగిలియుండును. అహమయంకుతో , భవతిచిన్వతః అయి పతత్యహం , నిజవిచారణం , - ఉపదేశసారము. ' నేను ' అనునది ఎక్కడ పుట్టుచున్నది ? అని వెదకి దాని పుట్టు చోటును కనుగొన్నచో, ' నేను ' అనునది పడును , అనగా అహంకారము నశించును.*
*అహమినాశభా , జ్యహమహంతయా*
*స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సత్ - ఉపదేశసారము.*
*' నేను ' అడిగిన చోట వేరొక ' నేను ' ( ఆత్మ ) సాక్షాత్కారమగును , ఇది మనో వినాశస్థితి.*
*వేమన ఇట్లు చెప్పెను. " మానవుని నీవు ఎవ్వరని ప్రశ్నించగా ' నేను ' అని బదులు చెప్పగలడే కాని తానెవ్వరో తనకు తెలియదు. అనగా తాను ఆత్మయని తెలియదు "*
*+ ఎవ్వరెవ్వరన నేనను నేమెఱింగియు తానెవండని ఎఱుగని మానవుండు - వేమన*
*+ మనసుదాను నిలుప మరియు దా బ్రహ్మంబు ( 64 )*
*ఇంకను + తన్నుతా తెలిసిన తానెపో బ్రహ్మంబు అనెను.*
*+ " తానుగా నుండుటే తన్నెరుంగుటర "*
*వేమన రమణులిద్దరు కూడ అహంకారము పుట్టు చోటు ఆత్మయని తెలిపిరి.*
*వేమన : - + తాను పుట్టు చోటుతత్త్వంబు తలపోయ.*
*రమణులు : - అహంకారము లేక ' నేను ' పుట్టుచాటు ఆత్మ.*
*కాబట్టి వేమన రమణులిద్దరు కూడ జ్ఞాన మార్గమునే అవలంబించిరి. వేమనమ " యెగి వేమన" అనుట కంటె 'జ్ఞానివేమన' అనుట సమంజసముగా మండును.*
((()))
7-సత్య దర్శనము ---ఓంశ్రీమాత్రే నమః
వేమన - రమణులు -- మనస్సు - జగత్తు
ధియా సహోదేతి ధియాస్తమేతి
లోక స్తతో ధీ ప్రవిభాస్య ఏష
ధీలోక జన్మ క్షయ ధామపూర్ణం
సద్వస్తు జన్మ క్షయ శూన్య మేకం || - సద్ధర్శనము
అర్థము : - అంతఃకరణ చతుష్టయము ఉన్నప్పుడే జగత్తు గోచరించును. అంతః కరణము వల్లనే జగత్తు ప్రకాశించును. నిద్రలో అంత:కరణము లేనప్పుడు జగత్తు గోచరించదు.
అనగా జగత్తు అంతఃకరణముతో పుట్టి అంతఃకరణముతో నశించును. రెండు తోడుగా పుట్టి తోడుగా నశించును. కాబట్టి జగత్తు, మనస్సు నిత్య సత్యములు కావు. ఈ రెండు ఆత్మలోనే పుట్టి ఆత్మలో నశించును. ఆత్మకు చావు పుట్టుకలు లేవు. సాక్షి మాత్రముగా ఉండి, జగత్తు, మనస్సు వీని పుట్టుట, గిట్టుటను గమనించును.
వివరణ : - అంతఃకరణము అనగా మనో, బుద్ధి, చిత్తాహంకారములు.
1 మనస్సు :- జ్ఞానేంద్రియముల ద్వారా విషయములను గ్రహించును.
2. బుద్ధి :- నిర్ణయించును.
3. చిత్తము :- స్మృతి కలిగించును.
4. అహంకారము:- కర్తగా భావించును.
ఆత్మ నుండి అహంకారము ఏర్పడును. దాని నుండి మనస్సు ( ఆలోచనలు ) ఏర్పడును. దాని నుండి నిశ్చయాత్మకమైన బుద్ధి కలుగును. చిత్తము నిర్ణయములను జ్ఞప్తి చేయును. ఈ అంతఃకరణ చతుష్ణయమే జగత్తును కనబడునట్టు చేయును. అప్పుడు లోక వ్యవహారములు తెలియును. ఆత్మ వస్తువునకు చావు పుట్టుకలు లేవు. అది సాక్షి మాత్రముగా ఉండి, జగత్తు యొక్క చావు పుట్టుకలను గమనించును.
మనస్సు లేని యెడల స్వయముగా జగత్తునకు అస్థిత్వము లేదు . ఆత్మ నుండియే పుట్టును మనస్సు పుట్టు స్థానము కనుగొన్న ఆత్మను పొందవచ్చును.
చిత్త మనెడి వేరు శిధిలమైనప్పుడే
ప్రకృతి యనెడు చెట్టు పడును ; పిదప
కోర్కెలనెడి పెద్ద కొమ్మలెండును గదా ? - వేమన.
--((()))--
8-సత్య దర్శనము
ఓంశ్రీమాత్రే నమః మన - రమణులు
బాహ్య పూజలు, మంత్రజపములు
భవన్తు సద్దర్శన సాధనాని
పరస్య నామాకృతిభి: సపర్యా:
సద్వస్తుని ప్రాప్తత దాత్మ భావా
నిఫైవ సద్దర్శన మిత్య వేహి || - సద్దర్శనము
అర్థము:- తనకున్నట్లే దేవునికి రూపనాములున్నవని భావించి విగ్రహములకు షోడశ ఉపచార పూజలు చేయుదురు. ఇవి ఆత్మ సాక్షాత్కారమునకు ఏ కొంచెమో ఉపయోగపడును.
ఈ పూజలు మనస్సుతో చేసెడి కలాపములు. నిజమైన ఆత్మ యుండుటే. సాక్షాత్కారము పొందుట అనగా మనోమూలమైన ఆత్మయందు నిలకడ కలిగి పూజులను గూర్చి వేమన అభిప్రాయము చూడుడు.
+ 1.ఆసనాదులెల్ల అభిషేక పూజలు
కాశీయాత్ర వ్రతకల్పకములు
మనసు నిలక నెన్ని మార్గముల్ నడచిన
పని గొనవు తెలియగ బరగ వేమ !
825- వేమన జ్ఞానమార్గ పద్యములు సి.పి. బ్రౌన్
+ 2. గుడి దేహ మాత్మ దేవుడు
చెడురాళ్ళకు పట్టి పూజ సేయకు వేమా !
+ 3. పూజ పూజ సేయ పూజారి తానాయె
పూజవస్తు వెన్న భువిని తాను
ఏడపూజ సేయ నెల్ల దిక్కులు తానె
828, 144, వేమన జ్ఞానమార్గ పద్యములు సి.పి. బ్రౌన్.
ఆరంభమున భక్తిలో ద్వైత భావముండును. అనగా దేవుడు వేరు నీవు వేరు అనే భావము. అహం బ్రహ్మస్మి సోహం అనే భావముండదు.
శ్రీశంకరాచార్యులు , "స్వస్వరూపాను సంధానం భక్తిరిత్యలిరీయతే " అని భక్తిని నిర్వచించిరి. అనగా తన్ను తాను తెలిసికొనుటకు ఆత్మ సాక్షాత్కారము పొందుటకు చేయు ప్రయత్నమే భక్తి దీనిని పరాభక్తి అందురు.
+ "చూపులోన నుంచి చూడంగవలవదా ?"
అని వేమన లోచూపుతో ఆత్మను పొందవలెనని చెప్పెను .569- వేమన జ్ఞానమార్గము పద్యములు , సి.పి. బ్రౌన్.
మనస్సును అంతర్ముఖము చేయు అభ్యాసమే ఉత్తమము. ఆత్మను నేరుగా పొందుటకు వీలగును. మనస్సును అంతర్ముఖము చేయుటకు మహర్షి మూడు పద్ధతులు తెలిపిరి.
1. మార్గణము 2. మజ్జనము 3. వాయునిరోధము.
ఈ పద్ధతులను అభ్యసించి మనస్సు పుట్టు చోటును చేరి ఆత్మ యందు నిలకడ కలిగి యుండుటయే సత్యదర్శనము.
బుద్ధ ప్రబోధిత ధ్యానమార్గం -- ఆనాపానసతి:-
పశువును పశుపతిగా చేసే పాశుపతాస్త్రమే 'ఆనాపానసతి' ధ్యాన మార్గం.
➡ పాళీ భాషలో 'ఆన' అంటే 'ఉచ్ఛ్వాస'
➡ 'అపాన' అంటే 'నిశ్వాస'
➡ 'సతి' అంటే 'కూడుకుని 'ఉండడం'.
కనుక ఆనాపానసతి అంటే మన శ్వాసను మనం సాక్షి తత్వంగా గమనించడమే.
👉 దీనివల్ల మన మనస్సు త్వరగా శూన్య స్థితిని పొందును.
ఇతరుల 'చరణాల'ను వదలి 'ఆచరణ'ను మొదలుపెట్టాలి.
✳ భౌతిక శరీరం - అద్దం లో చూడవచ్చు - మాతాపితానుసారిణి
✳ మనస్సు - చేసే కర్మలను బట్టి తెలుస్తుంది - సమాజానుసారిణి
✳ బుద్ధి - గురువుకు తెలుస్తుంది - కర్మానుసారిణి
✳ ఆత్మ - ధ్యానంలో దొరుకుతుంది - సర్వాత్మానుసారిణి
✳ సర్వాత్మ - చూడటానికి ఏమీ లేదు - ఏ అనుసారిణి కాదు, ఎందుకంటే ఆత్మే సర్వాత్మ కనుక.
ఎలా మొదలుపెడతావో ధ్యానాన్ని... అది నీ సమస్య ;
ధ్యానం మొదలైందా ... ఇక సమస్యలన్నింటికీ అదే పరిహారం.
➡ శ్వాస మీద ధ్యాస + సరైన వ్యవధి + ప్రతిరోజు = ఆనాపానసతి అభ్యాసం
➡ ఆనాపానసతి ద్వారా = మనోనిశ్చలత / ప్రాణశక్తి విజృంభణ
➡ ధ్యానము + స్వాధ్యాయము + సజ్జన సాంగత్యము ద్వారా = జ్ఞాన చక్షువు
➡ జ్ఞాన చక్షువు ద్వారా = అనుక్షణ జాగరుకత
➡ అనుక్షణ జాగరుకత ద్వారా = సంకల్పశక్తి
➡ వికల్ప రహిత సంకల్ప ఏకధార ద్వారా = సంకల్ప శుద్ధి
➡ సంకల్ప శుద్ధి + సంకల్పశక్తి + పరిశ్రమ ద్వారా = సంకల్ప సిద్ధి.
లక్ష్మీదేవి ఎల్లప్పుడు నారాయణుని పాదాల చెంతే వుంటుంది.
అంతరార్థం ఏమిటంటే:- నరుడు లక్ష్మీని (సంపదని) నెత్తిమీద పెట్టుకున్నందు వల్లే కష్టాల పాలవుతున్నారు. నారాయణుడు అనగా ఆత్మ పదార్థం.
(నారాయణ= నరునిలో ప్రయాణం చేసేది =ఆత్మ)
నేను ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకున్న వారికి లక్ష్మి ఎల్లప్పుడు పాదాల చెంతే కదా ఉండేది.
*🧘♂️9-సత్య దర్శనము🧘♀️*
*వేమన - రమణులు*
*ద్వంద్వములు, త్రిపుటులు*
*శ్లో॥ద్వంద్వాని సర్వాణ్యఖిలాస్త్రి పుట్యః*
*కించిత్సమాశ్రిత్య విభాంతి వస్తు*
*తన్మార్గణేస్యా దలితం సమస్తం ,*
*న పశ్యతాం సచ్చలనం కదా పి || - సద్దర్శనము*
*అర్థము : - జయాపజయాలు, సుఖ దుఃఖములు మొదలైనవి ద్వంద్వాలు. చూచువాడు, చూడబడేది, చూపు అనునది త్రిపుటి. ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండును.*
*ఇవి ఏర్పడుటకు ఏదో ఒక మూల పదార్ధము ఆధారముగా ఉండవలెను. ఆ మూలపదార్థాన్ని వెదకి దానిలో లీనమైన యెడల ద్వంద్వములు త్రిపుటులు ఉండును ఆత్మను వెదకి సాక్షాత్కారము పొందిన వాడే నిజమైన తత్త్వవేత్త. వానికి ద్వంద్వములు త్రిపుటులు వర్తింపవు.*
*వివరణ : - కార్య కారణములను అధిగమించినది ఆత్మ. కర్త , కర్మ , క్రియ అను త్రిపుటి ఉన్నప్పుడు లోకానుభవం కలుగును. తాను కర్త అయినప్పుడే క్రియ , కర్మ , ఉండును. కర్మ ఫలానుభవం ఉండును. తాను కీర్తి కానప్పుడు కర్మ , క్రయ ఉండవు త్రిపుటి ఉండదు. ప్రారబ్ధ , సంచిత ఆగామి కర్మలు మూడు లేవు. కార్య కారణములు*
*లేని ఆత్మ కేవల ఆనంద స్వరూపము. అచ్చట ఉచ్చ నీచలు , సుఖదుఃఖములు అను ద్వంద్వములు కూడ లేవు. హేతు వాదులు ఆత్మలో కార్యకారణములు వెదుకుట నిరర్థకము. కర్త , కర్మ , క్రియ అను త్రిపుటి విభాగమునకు కూడ తావు లేదు.*
*" కామ : కర్తా , నాహం కర్తా , కామః కరోతి , నాహం కరోమి , " నేను కర్తను కాదు , నాలోని కామమే కర్త అని వేదము చెప్పును.*
*తాను కర్త కాదని తెలిసికొని , తన ఇంద్రియములను , మనస్సును దాటి ఆత్మ విచారము సాగించవలయును. ఆత్మను పొందినవాడే నిజమైన తత్త్వవేత్త. కలత లేనివాడు.*
🕉️🌞🌏🌙🌟🚩
*🧘♂️10-సత్య దర్శనము🧘♀️* రమణులు*
*పరా - అపరావిద్యలు.*
*శ్లో ॥ విద్యాకథం భాతి న చేదవిద్యా ?*
*విద్యాం వినా కిం ప్రతిభా త్యవిద్యా ?*
*ద్వయం చ కస్యేతి విచార్యమూల*
*స్వరూప నిష్ణా పరామార్థ విద్యా " - సద్దర్శనము*
*అర్థము : - అవిద్య లేని యెడల విద్య యొక్క గొప్పతనము తెలియరాదు. అజ్ఞానము లేని యెడల జ్ఞానము ప్రకాశింపదు.*
*జ్ఞానము లేని యెడల అజ్ఞానము మున్నదని ఎట్లు తెలియును ? జ్ఞానా జ్ఞానములు లోక వ్యవహారములు. కాని జ్ఞానా జ్ఞానములు లేని తన్ను తాను తెలియుటే జ్ఞానము. అదే పరావిద్య లేక పరమార్థ విద్య లేక ఆధ్యాత్మ విద్య.*
*వివరణ : - చీకటి ఉన్నప్పుడే వెలుగు గొప్పదనము తెలియును. నీవు ఒక చీకటి గదిలో కూర్చున్నావు. దానిలో సామానులు ఉన్నవి. అవి నీకు కనిపించవు. వెలుతురు రాగానే అవి నీకు గోచరించును. చీకటి ఉన్నప్పుడే వెలుతురు గొప్పతనము తెలియును.*
*కావున అజ్ఞానము ( చీకటి ) లేని యెడల జ్ఞానము ( వెలుతురు ) ప్రకాశించదు. అట్లే జ్ఞానము లేకపోయిన అజ్ఞానమున్నదని తెలియదు. ఇది లోకములోని విద్య, అవిద్యల వ్యవహారము. జ్ఞానాజ్ఞానము లెవ్వరి కని, తన్ను తాను తెలియు జ్ఞానమే నిజమైన జ్ఞానము.*
*+ తలచుట , తలపమి రెండును*
*తలపక తానుండెనేని తత్త్వము వేమా !*
*100 వేమన జ్ఞాన మార్గ పద్యములు - సి.పి. బ్రౌన్.*
*"ఆధ్యాత్మవిద్యా విద్యానాం" గీత 10-32*
*లోకములోని విద్యాలన్నియు, కార్యకారణ ముందు చేతము, తర్కము చేతను పంచేoద్రియములు , మనస్సు చేతను గ్రహింపవీలగును కాని కార్య కారణములను అధిగమించినది ఆధ్యాత్మ విద్య.*
*సీ ॥ కార్యవర్గంబును కారణ సంఘంబు*
*నధికరించి చరించు నాత్మతత్త్య*
*మధాత్మ మనబడు - భాగవతము*
*పై సద్దర్శన శ్లోకములో మహర్షి రమణులు పరా , అపరా విద్యలకు గల తారతమ్యము సూచించినారు.*
*ముండకోపనిషత్తులో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము, శిక్షా, వ్యాకరణము, నిరుక్తము, చందస్సు, జ్యోతిషము మొదలైనవి అపరావిద్యలని చెప్పబడినవి.*
*ఏ విద్యచే బ్రహ్మ సాక్షాత్కారము కల్గునో అది పరావిద్య పరోక్ష జ్ఞానము అపరావిద్య. అపరోక్షజ్ఞానము పరావిద్య.*
*ఆత్మ విచారమనగా కేవల శాస్త్ర చర్చ కాదు. అహం మూలమును వెదకుట అని శ్రీరమణులు తెలిపిరి. అపరావిద్య అహంకారమును కలిగించును.*
*జ్ఞానము అనగా తెలిసికొనుట అని అర్థము. ఆత్మజ్ఞానములో తెలిసికొనువాడు తెలియబడునది, తెలిసికొను క్రియ, అను త్రిపుటి లేదు. అన్నియు ఒక్కటే అగును. అందువలన ఆత్మ జ్ఞానమును ఆత్మానుభూతి అనియు, సాక్షాత్కారమనియు చెప్పుదురు.*
*మనస్సు చేత ఆత్మను తెలిసికొనలేము తర్కము చేతకాని, ఇంద్రియముల చేత గాని ఆత్మను తెలిసికొనలేము, అది అతీంద్రియము, అమనస్కము , అనుభవైక్య వేద్యము.*
*శ్లో | జ్ఞాన వర్ణితా జ్ఞానహీన చిత్*
*జ్ఞానమస్తి కిం జ్ఞాతు మంతరం - ఉపదేశసారము.*
*జ్ఞానము అజ్ఞానము లేని బోధయే జ్ఞానమగును. అనగా తెలియుట తెలియమిలేని, లేక తెలియుట తెలియుమి రెండింటిని అతిశయించిన, లేక ఏతెలివి యందు ఒక దానిని తెలియుట గాని తెలియక పోవుటగాని లేదో ఆ తెలివియే జ్ఞానము.*
*ఈ ఆత్మజ్ఞానము తెలిసికొనుటకు వేరు వస్తువు లేదు. లోకానుభవము నందు విషయము దానిని తెలిసికొను జ్ఞానము - రెండు ఉండును . ఆత్మాను భూతియందు ఆత్మాయే విషయము. అందువలన దానిని తెలిసికొనుటకు వేరు జ్ఞానము లేదు. త్రిపుటీ విభాగమే నిర్వచనమునకు ఆధారమగుట చేత ఆత్మానుభూతి అనిర్వచ్యము.*
***
మరణం అంటే 'అనంతం'గా మారటం
➡ జననం అంటే 'పరిమితం' లోకి జారటం
: *🧘♂️11-సత్య దర్శనము🧘♀️*
*వేమన - రమణులు*
*ఇంద్రియములను మనస్సును నడిపేదెవరు ?*
*శ్లో:- బోద్ధార మాత్మాన మజానతో యో*
*బోధః సకింస్యా త్పరమార్థ బోధః ?*
*బోధస్య బోధ్యస్యచ సంశ్రయం స్వం*
*విజానత స్తద్వితయం వినశ్యత్ "*
*అర్థము : - లోకములోని విద్యలను విషయములను మనస్సు తెలిసికొనును. అది నిజమైన జ్ఞానము కాదు. లోక విషయ జ్ఞానము అజ్ఞానమే. తెలుసుకునే వాడెెవడని వెదకి ఆత్మను చేరిన తెలిసికొనేవాడు తెలియబడే వస్తువు ఉండవు.*
*వివరణ :-*
*తలచుట తలపమి రెండును*
*తలపక తానుండెనేని తత్త్వము వేమా !*
*మొదట మనము ఆత్మను విషయమను కొందుము, తరువాత శూన్యముగా భావించెదము. తరువాత ఆత్మను ఆత్మగా చూచెదము. ఈ దశలో చూచుట ఉండదు. ఆత్మగా నుండుటయే.*
*పైదశలో తెలిసికొనువాడు , తెలిసికొనుట , తెలిసికొనబడునది అను త్రిపుటి ఉండదు.*
*ప్రపంచములోని జ్ఞానమంతటిని తెలిసికొనుటకు కారణమెవడని తెలిసికొనకపోయిన యెడల, కేవల ప్రపంచ విజ్ఞానము వలన ప్రయోజనమేమి ? ప్రపంచ విజ్ఞానము దేశకాలములకు పరిమితమై యుండును. తెలిసికొనుట తెలియ లేని దేశకాలాతీతమైన జ్ఞానమే నిజమైన ఆత్మజ్ఞానము, మనస్సునకది అతీతమైనది చెప్పుటకు వీలుకానిది.*
*అచల తత్త్వమనగ ననుభవ గమ్యంబు*
*చూచి చెప్పరాదు సూక్ష్మమదియు*
*అదియు గురువు లేక అబ్బునా తెలియంగ ? - వేమన*
*" ఎటిగెడి తన్ను ఎఱుగక ఇతరము ( లోకజ్ఞానము ) నెఱుగుట అజ్ఞానమే కాని జ్ఞానమగునా ? " ఆత్మయే లోక జ్ఞానమునకాధారము. ఆత్మను తెలిసికొనుట నిజమైన జ్ఞానము.*
*మనస్సు పంచేంద్రియముల ద్వారా ప్రపంచ విషయములను , విద్యలను తెలసికొనగలదని మనము అనుకొనెదము. కాని కేనోపనిషత్తు ఏమి చెప్పినదో చూడండి.*
*" శ్రోత్రస్య శ్రోత్రం , మనసోమనో , యద్వాదోహ వాచం , స ఉప్రాణస్య ప్రాణం చక్షుషశ్చక్షురితి ముచ్యధీరా : ప్రేత్యాస్మాల్లోకా దమృతా భవన్తి."*
*" ఆత్మ శక్తి వలననే చెవి వినును , కన్ను చూచును ,నోరు (నాలుక) మాట్లాడును. మనస్సు జీవితమును తెలిసికొనును. తెలివిగలవాడు జ్ఞానేంద్రియములను మనస్సును అధిగమించి ఆత్మ సాక్షాత్కారము పొందును. " కాబట్టి ఇంద్రియములకు , మనస్సుకు శక్తి నిచ్చిన ఆత్మను పొందవలెను.*
*నాంది*
*శ్లో ॥ సత్సత్యయా : కిన్ను విహాయ సస్తం ?*
*హృద్యేష చినా రహితో హృదాఖ్య :*
*కథం స్మరామ స్తమమేయ మేకం ?*
*తస్యస్కృతి సత్ర దృడైవ నిష్ణా||. - సద్ధర్శనము.*
*అర్థము : - ఉన్నది అనగా జ్ఞానరూపమై యుండు సద్వస్తువు లేక, ఉన్నట్లు తోచు జ్ఞానము ఉండగలదా ? ఆ సద్వస్తువు తలంపులు లేనిది. అది తలంపులకు మూలమైన హృదయము నందున్నది. దానికి హృదయము లేక ఆత్మ అని కూడ పేర్లు కలవు. ఆ సద్వస్తువును స్మరించుటెట్లు ? ఆ వస్తువును ఎల్లప్పుడు జ్ఞప్తి యందుచుకొని అదిగా ( అనగా ఆత్మగా ) ఉండుటయే. ఈ శ్లోకమున ఆత్మ నిష్ఠ. ఆత్మ విచారము సూచింప బడినవి, + " హృదయమందు బ్రహ్మ ముండుట తెలియుడీ " వేమన పద్యములు.*
*వివరణ : - ఈ శ్లోకము సద్దర్శన గ్రంథమునకు నాంది వంటిది. గ్రంథములో ప్రధానాంశమైన ఆత్మవిచారము చెప్పబడినదని ఈ శ్లోకము ద్వారా సూచింపబడినది. సాధారణముగా గ్రంధారంభమున విఘ్నములను తొలగించు విఘ్నేశ్వరుని స్తుతి చేయుట సంప్రదాయము. అట్లుకాక ఇక్కడ సర్వదేవతా రూపమైన ఆత్మస్తుతి చేయబడినది.*
*శ్రీ విఘ్నేశ్వరుని సాధారణముగా స్తుతించు శ్లోకమును శ్రీ గణపతి ముని ఆత్మస్వరూపియైన శ్రీ రమణుల పరముగా చెప్పుట ఒక విశేషము గమనించుడు.*
*శ్లో ॥ శుక్లాంబర ధరం , విష్ణుం ,* *శశి వర్ణం , చతుర్భుజం ,*
*ప్రసన్నవదనం , ధ్యాయేత్* *సర్వ విఘ్నోప శాంతయే!!*
*తెల్లని కౌపీనమును ధరించినవాడు , అంతట వ్యాపించినవాడు , తెల్లని దేహకాంతి కలవాడు , మనోబుద్ధి చిత్త, అహంకారములను నాల్గింటిని (చతుర్ భూక్) మ్రింగినవాడు , బ్రహ్మానందమును అనుభవించుటను సూచించు చిరునవ్వు ముఖము కలవాడు అగు రమణ మహర్షి విఘ్నములను శాంతింపజేయుగాక.*
*ఆత్మసాక్షాత్కారము అనగా ఆత్మగా నుండుటయే. ఆత్మ సాక్షాత్కారమును పొందిన శ్రీ రమణుల కన్న వేరే దైవము లేడు. అతనికి భిన్నంగా వేరే దైవము సాక్షాత్కారము చెందడు కదా ? అతడే సర్వదేవతా స్వరూపము.*
***
ప్రశ్న:- 'నేను-నాది'ని ఎలా అంతం చేయడం?
సమాధానం:- 'నేను-నాది'ని అనంతం చేయడమే.
అనన్య చిన్తయోన్తమం యే జనా పర్యుపశ్యతే!
యేషాం నిత్యాధియుక్తానం యోగక్షేమవహామ్యహమ్!!
త్రై గుణ్య విషయవేదా నిస్త్రెగుణ్యో భవార్జున!
నిర్ద్వంద్వో నిత్య సత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్!!
పై రెండు శ్లోకాలలో ఒకే పదం రెండు శ్లోకాలలోను వచ్చినది. ఆ పదమేమనగా యోగ క్షేమం(1వ శ్లోకం), నిర్ యోగ క్షేమం (2వ శ్లోకం)
మొదటి శ్లోకం యొక్క అర్థం ఏమనగా:-
ఎప్పుడైతే నన్ను అనగా ధ్యానాన్ని ఆచరిస్తున్నారో మీ యొక్క యోగ క్షేమాలు నేను చూసుకుంటాను అని. దీని అంతరార్థం ఏమనగా--
యోగము - ఆధ్యాత్మికంగా ఎదగడం. ఉదాహరణకు దివ్యచక్షువు ఉత్తేజితం కావడం, పూర్వజన్మలు చూసుకోవడం, సూక్ష్మ శరీర యానం మొదలైనవి.
క్షేమము - భౌతిక పరంగా ఎదగడం. ఉదాహరణకు మంచి ఉద్యోగం రావడం, ఆరోగ్యంగా ఉండడం, డబ్బు కలిసి రావడం మొదలైనవి. అనగా మనం ఎప్పుడైతే ధ్యానాన్ని చేస్తున్నామో మనం ఆధ్యాత్మికంగా మరియు ప్రాపంచికంగా ఎదుగుతాము, అని.
యోగక్షేమం యొక్క రెండవ శ్లోకం యొక్క అంతరార్థం ఏమనగా మనకు యోగక్షేమాలు కలగకపోయినా ధ్యానాన్ని ఆచరించవలెను అని. అప్పుడే త్రిగుణాతీతులు అనబడతారు.
అందువలన మనకు యోగక్షేమాలు కలిగిన, కలగకపోయినా ధ్యానాన్ని ఆచరించవలెను అనేది సారాంశం.
*🧘♂️12-సత్య దర్శనము🧘♀️*
*వేమన - రమణులు* *జ్ఞానాజ్ఞానములు లేనిదే జ్ఞానము.*
*నిద్రానవిద్యా గ్రహణం నవిద్యాః*
*గృహ్లాతి కించిన్న యథార్థ బోదే*
*ఈ నిద్రా పదార్థ గ్రహణే తరాస్యా*
*చ్చి దేవ విద్యా విలసన్త శూన్యా " -*
*అర్థము : - మెలకువలోను కలలలోను తెలిసికొనునది జ్ఞానము కాదు. అహంకారము ( మనస్సు ) నిద్రలో లేదు. కాబట్టి తెలిసికొనుట ఉండదు. దీనిని సామాన్యముగా అజ్ఞాన స్థితి అనుకొందురు. తెలిసికొనుటకును , తెలిసికొన చేయుటకు అన్యము లేక తాను వెలుగుటయే ఆత్మజ్ఞానము. ఈ స్థితి శూన్య స్థితికాదు.*
+ *మనసులేనివారు మరగిన శూన్యంబు*
*శూన్యమనగ రాదు సూటిగాను - వేమన*
*ఆత్మ శూన్యము కాదని వేమన అభిప్రాయము.*
*వివరణ : - మేలుకొన్నప్పుడు , కలలోను , కర్త , కర్మ , క్రియ అను త్రిపుటితో విషయజ్ఞానము కలుగును. ఇది యదార్థజ్ఞానము కాదు. మనస్సు ఇంద్రియముల ద్వారా బాహ్య విషయములను గ్రహించును. తెలుసుకొను మనస్సు , అహంకారము నిద్రలో లేవు కాబట్టి తెలిసికొనుట నిద్రలో జరుగదు.*
*తెలిసికొనుట , తెలియజెప్పుట అనునవి లేక ప్రకాశించు ఆత్మయందు నిలకడగా నుండుటే నిజమైన జ్ఞానము. అది జ్ఞానా జ్ఞానములు లేని స్థితి. ఈ స్థితి , శూన్యము కాదు శూన్యము ప్రకాశింపదు. ఆత్మ స్వయం ప్రకాశము.*
*జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థలను మనస్సే కల్పించును నిజమైన జాగ్రత్ స్థితి వీటి మూడింటి కన్నా అవ్వలిది నిద్ర అజ్ఞానము కాదు అది నీ సహజ స్థితి. జాగృతి జ్ఞానము కాదు అజ్ఞానమే, జ్ఞానా జ్ఞానముల కవ్వలిది ఆత్మ.*
*నిద్ర ప్రజ్ఞానము , నిద్రలో జీవుడు ప్రజ్ఞాన ఘనుడు. ప్రజ్ఞానం బ్రహ్మ అని మాండూక్య ఉపనిషత్తు చెప్పుచున్నది. నిద్రలో ఆత్మసత్ మేలుకున్న అది అసత్ లేక అహంకారము ఆత్మను శూన్యమని భావింపరాదు.*
***
గాఢనిద్ర మరియు ధ్యానం యొక్క పోలిక - ఆలోచించడం మాయమవుతుంది.
గాఢనిద్ర మరియు ధ్యానం యొక్క తేడా - గాఢ నిద్రలో ఎరుక కూడా అదృశ్యమవుతుంది., కానీ ధ్యానంలో ఎరుక మిగిలి ఉంటుంది.
*🧘♂️13-సత్య దర్శనము🧘♀️*
*వేమన - రమణులు*
*నిత్య సత్యవస్తువులు కావు. అని ఉన్నట్లు తోచుచున్నవి. ఆత్మ వస్తువు అన్ని వేళలా అంతట ఉండు సత్యము.*
*శ్రీరమణులు మనస్సనునది ఒకటి వేరుగా లేదు అనిరి. మనస్సనగా ఆలోచనా సమూహమే ( ఆలోచనయే మనస్సు - మహోపనిషత్తు ) , ఆలోచనలన్నీ ఆత్మ నుండియే బయటికి వచ్చును.*
*శ్లో|| నిర్గచ్ఛంతియత స్సర్వా వృత్తయో దేహధారిణాం!*
*హృదయం తత్సమాఖ్యాతం భావనాకృతి వర్ణనం!! - రమణ గీత 5-2*
*దేహధారులకు సకలములగు సంకల్పములు ఎచట నుండి బయలు దేరునో అదియే హృదయము లేక ఆత్మ. మనస్సు బాహ్య ప్రపంచమును చూడకలదు కాని దానికి మూలమైన ఆత్మను చూడలేదు. ఆత్మ మనస్సునకు అందదు ( యతో నాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ ఆత్మ వాక్కులచే వర్తింప వీలు కానిది. మనస్సునకు అందనిది. ) పట్టకారు తన కాడలతో అన్నిటిని పట్టుకొన కలదు కాని తనను ఆడించు చేతిని పట్టుకొన లేనట్లు, మనస్సు బాహ్య వస్తువులను తెలిసికొనును కాని తనకు మూలమైన ఆత్మను తెలిసికొన జాలదు. అయితే తలపులు లేని మనస్సు ఆత్మను తెలిసుకోగలదు.*
*నిను నీవెలుగగ దలచిన*
*మనమున సంకల్పములను మానగవలెరా - వేమన.*
*" ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్ " అని భగవద్గీత చెప్పెను. ఆత్మ యందు మనస్సు నుంచి ఆలోచనలు చేయ వద్దు ఆత్మ నుండి వచ్చు ఆలోచనలను ఆత్మలోనే అణచి వేయమని అర్థము. ఆలోచనలు లేని మనస్సును శుద్ధ మనస్సు అందురు. ఈ ఆత్మనే హృదయమని కూడ పిలిచెదరు. + " హృదయమందు బ్రహ్మ ముండుట తెలియుడి - వేమన, మనస్సు పని చేయుచున్నంత వరకే బాహ్య ప్రపంచము గోచరించుచున్నది. మనస్సే ఆత్మను మరగుపరచుచున్నది. ఆలోచనలని అంతర్ముఖుడు వైన కాని ఆత్మ సాక్షాత్కారము పొందలేవు.*
*అయినచో ఈ ఆత్మను స్మరించుట ఎట్లు ? ఆలోచనల నాపి, ఆత్మ యందు లగ్నమైన మనస్సు కలిగి, ఆత్మగా నుండుటయే ఆత్మస్మరణము. ఆత్మ సాక్షాత్కార మనగా ఆత్మగా నుండుటయే.*
*+ ఈ కనులను మిమ్ము ఎట్లు చూడగవచ్చు*
*చూచు కనులు వేరు , చూపువేరు*
*చూపులోన నుంచి చూడంగ వలవదా ?*
*- వేమన జ్ఞానమార్గ పద్యములు.*
*-వేమన లో చూపుతో ఆత్మను చూడవలెనని చెప్పెను.*
***
*🧘♂️14-సత్య దర్శనము🧘♀️*
*వేమన - రమణులు* *మృత్యుంజయము*
*మృత్యుంజయం మృత్యుభి యాశ్రితానా ,*
*మహం మతి రృత్యుము పైతి పూర్వం :
*ఆధస్వభావా దమ్యులేషు తేషు*
*కథం పున రృత్యుధియోజవకాశః "*
*అర్థము : - మహేశ్వరునకు చావు పుట్టుకలు లేవు. చావు పుట్టుకలు కల మానపుడు, మరణ భయముతో మహేశ్వరుని శరణు పొందును, మహేశ్వరుడు వాని అహంకార మమకారములను తొలగించును. ఆ మానవుడు స్వస్వరూపుడై మరణ భయము లేని బ్రహ్మమయుడౌను, మృత్యుచింతన వానికెక్కడిది ? సహజమైన మృత్యువు రాక ముందే మృత్యువు లేని ఆత్మస్థితిని పొందగలడు.*
*వివరణ : - వేమన పై విషయమునే సూచించెను.*
+ *అంతరంగమందు అభవునుద్దేశించి*
*తలప ముక్తి తన్ను దగులు గాక*
*బాహ్యరంగమందు బరికింప లేదయా !*
*+ - 127 వేమన జ్ఞానమార్గ పద్యములు.*
*అభవుడనగా పుట్టుక లేనివాడు పై శ్లోకములో చెప్పిన మృత్యుంజయుడు అతనిని తలచిన ముక్తి లభించును అనగా చావు పుట్టుకలు నశించును. మరణ భయము నశించును మరణము దేహమునకే ఆత్మ సాక్షాత్కారము పొందిన తరువాత పునర్జన్మ లేదు.*
*పుట్టుక తరువాత చావు , చావు తరువాత పుట్టుక - దీనికి దు:ఖింప పని లేదని మహాకవి రవీంద్రనాథ టాగూరు చెప్పిరి. వారు కవిత్వ ధోరణిలో క్రింది ఉదాహరణము నిచ్చిరి.*
*తల్లి యొక్క ఒక్క చన్నులోని పాలు బిడ్డ త్రాగునప్పుడు అందులోని పాలు అయిపోగానే బిడ్డను రెండవ చన్ను వద్దకు తల్లి మార్చును.*
*ఈ మధ్య కాలములో బిడ్డ కెవ్వుమని ఏడ్చును. ఇది మరణ బాధ వంటిది. అట్లే మరణించిన మానవునకు ప్రకృతి వేరొక జన్మ కలిగించును. అందువలన మరణమును ధైర్యముగా ఎదుర్కొమ్మని రవీంద్రుడు సూచించెను.*
*భగవద్గీత ఇట్లు చెప్పుచున్నది.*
*శ్లో:- వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృణాతి నరో పరాణి! తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ!! - గీత*
***
15-సత్య దర్శనము🧘♀️*
*వేమన - రమణులు* *కాలము*
*భూతం భవిష్యచ్చ భవత్స్వకాలే ;*
*తద్వర్తమానస్య విహాయ తత్త్వం ,*
*హాస్యాన కిం స్యాద్దతభావిచర్చా ,*
*వి నైక సంఖ్యా గణనేవ లోకే ? || - సద్దర్శనము.*
*అర్థము : - కాలమును మూడుగా విభజింతురు.*
*1. భూతకాలము, 2. వర్తమానకాలము , 3. భవిష్యత్కాలము. భూతకాలము దాని కాలమునందు వర్తమాన కాలమే కదా ? అట్లే భవిష్యత్ కాలము కూడ దాని కాలము నందది వర్తమాన కాలముగా పరిగణింపబడును.*
*కావున వర్తమాన కాలమొకటి యేఉన్నది. వర్తమానములో తత్వ మెరుగక భూత భవిష్యత్ కాలముల గూర్చి చర్చించుట ఒకటవ సంఖ్యను వదిలి లెక్కించుట వంటిది.*
*వివరణ : - జరిగిన కాలము యొక్క జ్ఞాపకములు , జరుగబోయే కాలము యొక్క ఊహాగానములు, వీని వలన ప్రయోజనమేమి? అవి కూడ వాని కాలములలో వర్తమానములుగా భావింపబడును కదా ? ఉన్నది వర్తమానమే.*
*దాని నిజస్థితిని తెలిసికొనక ( ప్రస్తుతము నీవు ఆత్మసాక్షాత్కారమునకై ప్రయత్నింపక ) భూత భవిష్యత్కాలములను విచారించిట ఒకటవ సంఖ్యను వదిలి లెక్కించుట యగును. ఇప్పుడు ఆత్మసాక్షాత్కారమును పొందినచో భూత , భవిష్య ద్వర్తమాన కాలముల ప్రసక్తి లేదు.*
*వేమన కూడ భూత , భవిష్యద్వర్తమాన కాలములు ఒకటియే అని చెప్పెను.*
*+ నాడు , నేడు అన్న వాడును వాడును*
*వేడు వాడు అన్న వేడు నేడు*
*నాడు నేడు దెలిసి నగుబాటు కాకుండ*
*మూడొకటి ( గ ) వెలసిన ముక్తి వేమ ! - 998 వేమన జ్ఞానమార్గ పద్యములు సి.పి.బ్రౌన్.*
*శ్రీ దత్తాత్రేయ అవధూత గీతలో 8 వ అధ్యాయము 7 వ శ్లోకములో అవరూత " వర్తమానేషువర్తేత " వర్తమాన కాలమున వర్తించెడి వాడని చెప్పబడినది. శ్రీ షిర్డీసాయి అష్టోత్తర శతనామములలో ' భూత భవిష్యద్భావ వర్జితాయ " అని ఉన్నది. కావున మూడు కాలములు ఒకటేనని వేమన రమణులు చెప్పిరి.*
*భగవద్గీత రెండవ అధ్యాయములో శ్రీకృష్ణుడు ఆత్మత్రికాలాబాధ్యము అని ఇట్లు తెలిపెను.*
*శ్లో ॥ నవ్వేవాహం జాతువాసం నత్వం వేమే జనాధి సాః|*
*న చైవనభవిష్యామి సర్వే వయ మతః పరమ్||*
*ఆత్మస్వరూపులైన నేను , నీవు , ఈ రాజులు త్రికాలముల యందు నిత్యులము.*
*నేను ఒకప్పుడు లేని వాడనుగాను. నీవును లేని వాడవు గావు. ఈ భీష్మాది రాజులు లేని వారు కారు. మన మందరము ఈ దేహము నాశము చెందిన పిమ్మట లేకపోవువారము గాము.*
*దేహమునకు పుట్టుట, పెరుగుట కాలదేశములు వర్తించును. ఆత్మ దేశకాలాతీతము. ఆత్మ సాధనతో దేశకాలములు అంతరించును.*
****
17-సత్య దర్శనము :: వేమన - రమణులు 17.జ్ఞాని - అజ్ఞాని
దేహాత్మ భావే జడౌ సమానా; వేకస్య దేహే హృది దీప్త ఆత్మా
ఆక్రమ్యదేహం చ జగచ్చ పూర్ణంః పరస్య మేయం తను మాత్ర మాత్మా! - సద్దర్శనము.
అర్థము : - దేహాత్మ భావముతో అజ్ఞాని తన పరిమితి తన దేహము వరకే అని భావించును. ఇతరములన్నియు తనకు వేరని అనుకొనును. జ్ఞాని అట్లు కాక తనలో ప్రకాశించే అంతరాత్మను తెలిసికొని, తాను సంకుచితమైన దేహము కాదని ఆత్మయే తానని భావించును.
వివరణ : - ' తత్వమసి ' ఆ బ్రహ్మము నీవే అని మహావాక్యము చెప్పుచున్నది . జ్ఞాని , ' అహం బ్రహ్మాస్మి ' నేను బ్రహ్మమును అను ఆత్మానుభూతిని పొందును.
ఇట్టిట్టనరాని బ్రహ్మము తానే యగును." అయమాత్మా బ్రహ్మ " అనుట చేత తానే సర్వవ్యాపకమైన ఆత్మగా తెలిసికొనును. దేహ పరిధులను దాటి జగత్తు అంతా తానేనని గ్రహించును . అందరిలోను అన్నిటిలోను ఆత్మ ఉన్నదని భావించును.
" మత్త పరతరం నాన్యత కించి దస్తి ధనంజయ " గీత. తనకు వేరుగా ఏమి లేదు అని భావించును. సర్వము తానేయైన వాడు ' అందరిని సమభావముతో చూచును. ' ఆత్మాపమ్యేన సర్వత్రసమం పశ్యతి " ఆత్మకున్ సములుగా జింతించు "
అజ్ఞాని దేహాత్మభావము కలిగి తన పరిమితి దేహమువరకు, ఇతరులను జగత్తును వేరని చూచును. దేహములలో స్త్రీ పురుష భేదము గుర్తించును " నేను వచ్చినాను " " నేను నడచినాను " అన్నప్పుడు ఈదేహమే తాను రా!
ఇదియే జ్ఞానికి అజ్ఞానికి గల భేదము . అజ్ఞానిది దేహాత్మభావము జ్ఞానం మన కలిగియుండును.
భావము:-
తాను తనువుననుచు త్రయమని యెంచెడు
మోహవారి రాశి మునిగి యున్న
జనులకెట్లు మోక్ష సంగతి సిద్ధించు ?
వేమన జ్ఞానమార్గ పద్యములు -
తాను దేహమని , స్థూల , సూక్ష్మ , కారణ దేహములు అనగా తనుత్రయము యెంచెడి వానికి మోక్షమెట్లు సిద్ధించును ?
తొమ్మిది కంతుల తిత్తికి
నిమ్ముగ సామ్ములును కులము నేటికి చెపుమా
నమ్మకు దేహము నీవని
బమ్మము నేననుచుదెలియబలుకు రవేమా!
వేమన జ్ఞానమార్గ పద్యములు - సి.పి. బ్రౌన్
శ్రీరమణులు పశుపక్షి మృగాదులను కూడ ప్రేమతో చూచేవారు. కొండలో తగవులాడే రెండు కోతుల సమూహముల మధ్య సామరస్యము కుదిర్చిరి. ఒక గోవునకు లక్ష్మి అను పేరు పెట్టి దయతో పోషించిరి.
కొమ్మలన్నిటిని నరికి వేసిన ఒక చెట్టును కొండపై చూచి కన్నీరు కార్చిరి. తులసి ఆకులను పూజకై తీసుక వెళ్ళు భక్తునిలో " తులసి చెట్టు ఆకులను గిల్లినట్లే నీవు కూడ నీ దేహమును గిల్లికొని చూడు " అని రమణులు చెప్పిరి.
శ్రీ రమణ భగవానులు దయా సముద్రులు అని ఎవరో అనగా "సముద్రమునకు చెలియలికట్ట అను పరిమితి ఉన్నది. నా దయకు అట్టి పరిమితి" లేదనిరి.
🕉🌞🌏🌙🌟🚩
మహా ప్రస్థానం:-
ప్రస్థానం అనగా యాత్ర
మహాప్రస్థానం అనగా అంతిమయాత్ర (తిరిగి రాని యాత్ర)
ఈ యాత్ర జరగవలసినది ఆత్మకు కానీ, దేహానికి కాదు.
అనగా ఆత్మ, భూమి మీద జన్మకు మళ్ళీ తిరిగి రాని యాత్రను నిర్వర్తించాలి.
ఈ యాత్రను సమాప్తం చేయాలంటే 'నేను' అనే అహంకారం తొలగాలి.
అహంకారం పోవాలంటే "ధ్యానం", ఆత్మ విచారణ, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం తప్పకుండా చేయాలి.
రోగం అనేది శిక్ష కాదు, 'ఓ శిక్షణ'.
Comments
Post a Comment