Posts

Showing posts from December, 2025

Life

Image
  సుధాధరా - ర/జ/త/ర/లగ    UIU . IUIU / UIU . IUIU 14 శక్వరి 5419  రాధ నీతపంబుగా రమ్యతౌను సుభంబుగా  రాధ యీసుఖంబుగా రక్షనౌను సమంబుగా  ఛందమందు వ్రాయు నా చక్కనైన గీతిగా   విందులిచ్చు పూలలో+ ప్రీణనమ్ము నీవెగా  పంత మొద్దు  యిప్పుడే పావువంబు నీ దయా  సంతసంబు సందడే సంబరాన నీకృపా  నాదసింధు వీచికా నవ్వుచున్న మోహమో  మోదమిచ్చు జన్మలో మోచనమ్ము నీవెగా  కాదు నన్న ప్రేమయే కాల మాయ నీవెగా  చేదు తీపి తప్పదే  చేరువైతి నేనుగా         రాధవో సుధాధరా రాగవీణ మీఁటువో  పూదఱిన్ సుమాలతో మోహనమ్ము నీవెగా  భాదలేల నీకులే బంధమేను నీదిలే  వాదమొద్దు మధ్యలో వాక్కు తీరు చాలులే  నూతనాభ్రవీథిలో నూఁగు కాంతి చాఱవో   వ్రాతలోని వాణిలో భావనమ్ము నీవెగా  ఖ్యాతి నాన్న నీదిలే కాలమందు నీ కళే స్వాతి ముత్యమైతివే సానుకూల సుందరీ      శీతలాంబరమ్ములో+ చేతనమ్ము నీవెగా  కైతలోని ప్రేమకే కారణమ్ము నీవెగా  రాత లన్ని నమ్ముటే రవ్వ వెల్లుగు చాలులే ధాత్రి గాను నీవులే దారి చూపు మేలులే  ...
Image
 శ్రీ గురుభ్యోనమః 🙏 శ్రుతమగు వేద మంత్రముగ ఋగ్యజు సామములందు స్తుత్యమై, వెతలను  దీర్చు  మంత్రముగ   వేదన   బాప  అధర్వణంబునన్, శ్రుతి  స్మృతమైన  మంత్రముల శ్రుత్యుడు, స్థుత్యుడునైన విష్ణువే స్థితమయి దోచు 'మంత్ర'గ ప్రసిద్ధుడు విష్ణు సహస్ర నామమున్. ‘మంత్ర’ అంటే “వేదమంత్రముల ద్వారా తెలియదగిన వాడు” అని అర్ధం. ‘మంత్ర’ అనేది సంస్కృత పదం. 'మన్' అంటే మనస్సు... 'త్ర' అంటే సాధనం. మంత్ర అంటే మనసును నియంత్రించే సాధనం. మంత్రాల్లో ధ్వని అనేది కీలక పాత్ర పోషిస్తుంది.  సత్యయుగం మొదట్లో ఉన్న ఋగ్యజు సామాధర్వణ వేదాలలో శ్లోక, సంగీత, గద్య రూపాలలో ఉచ్చరింపబడే మంత్రాలు దేవతలను స్తుతించటానికి నిర్దేశింపబడితే, సత్య యుగం చివర్లో విశ్వశక్తి రూపంలో  అందుబాటు లోకి వచ్చిన అధర్వణ వేదంలో మానవులు తమ కష్ట భయాలను పోగొట్టుకోవటానికి ఉద్దేశించిన మంత్రాలన్నీ ఋషుల ద్వారా ప్రస్తావించబడ్డాయని చెబుతారు. స్మృతుల ద్వారానూ, శ్రుతుల ద్వారానూ బహిర్గతమైన వేద మంత్రాలలో, అది ఏ దేవతను ఉద్దేశించి ఉచ్చరింపబడిననూ... వాటిలో ప్రధానంగా వినపడేదీ  మరియు స్తుతించబడేదీ  ఆ మంత్రాలలో ...
 ప్రాంజలి ప్రభ కం. బాసర మదిలీలగనే వాసన గతిమతియునీడ వాక్కుగ తీరన్ శ్వాస బలముగా పలుకే మీసర కురుమేది గుజ్ఞ మేడా వునిలా  — భావార్థం: బాసరలోని మాత (సరస్వతి) లీలల వలన మనసులో వాసనలుగా జ్ఞానం పరిపక్వమై, ఆ జ్ఞానమే వాక్కుగా మారి, శ్వాస బలంతో స్పష్టంగా వెలువడుతుంది. అలాంటి జ్ఞానవాక్కు ఉన్నచో అజ్ఞానమయ కురుమేడి వంటి మూర్ఖత్వం నిలవదు—అది కరుగుతుంది. 👉 తెలుగు పద్య సౌరభం వారి సమస్య: ముచ్చును మనువాడె ముదిత యొకతె. ఆ.వె. మచ్చిక తన నెంచి మనసు మాయను పంచి ఐచ్చికబల తోడు యైక్య గుణము స్వచ్ఛతగను సుఖము వాక్కు వరుస కల్పి ముచ్చును మనువాడె ముదిత యొకతె. . భావవ్యాఖ్య: మచ్చికతో—అంటే సన్నిహిత ప్రేమతో—మనసును మాయగా పంచుతూ, ఇచ్చాశక్తి బలంతో ఐక్యత అనే గుణాన్ని పెంపొందించి, స్వచ్ఛతతో కూడిన సుఖాన్ని వాక్కుల వరుసగా మలిచే ఆ ముదితురాలే (ఆ స్త్రీయే) మనువాడె—అంటే హృదయాన్ని గెలిచే వరం. ** అస్తవ్యస్తాక్షర సమస్య:  మీ లాగు కురుమేది జ్ఞ ఖు సరమేడావుని సమస్య:  మీరకు మీ గురువులాజ్ఞ మేదిని సఖుడా! క: ఓరిమి నెన్నడు విడువకు, చేరకు దురితులను, గుట్టు చెప్పకు మెపుడున్, పోరకురా! పందలతో, మీరకుమీ  గురువులాజ్ఞ మేదిని సఖుడా!...
 * ***** వేంకటేశ్వర కీర్తన “అనుమానాన్ని తుంచుకో… అనందాన్ని పెంచుకో” 🌸 పల్లవి అనుమానమ్మును తుంచుకో రా… అనందమును పెంచుకో రా… శ్రీనివాసుని చరణములపై శ్రద్ధ భక్తులు చేకూర్చుకో రా…॥ 🌸 అనుపల్లవి తిరుమల వాసుడే రక్షకుడు రా తిరుచాన కొండపై తారకుడా వేంకటరమణుని స్మరించగా రా వేదవేద్యుడై వెలుగెత్తు రా…॥ 🌸 చరణం – 1 నోలోనున్న మూర్ఖత్వం తుంచుకో దాగివున్న మంచితనం పెంచుకో ఇతరులపై శతృత్వం తుంచుకో గోవింద గోవింద అని స్నేహం పెంచుకో…॥ 🌸 చరణం – 2 నీ లోనున్న స్వలాభం తుంచుకో సమాజ శ్రేయస్సును నిత్యం పెంచుకో తిరుపతి రాయుడి కృపతో రా అణకువలో ఆప్యాయతను పెంచుకో…॥ 🌸 చరణం – 3 అనుకోని నష్టములు తుంచుకో అనుకున్న లాభములు యెన్నో పెంచుకో జీవితమందు నాశనం తుంచుకో శెషాద్రి శిఖరంపై నమ్మకం పెంచుకో…॥ 🌸 చరణం – 4 దురాలోచన పతనమును తుంచుకో నీవు చేసిన ప్రగతి ప్రతిదినం పెంచుకో అవిద్యాంధకారమును తుంచుకో వేంకటేశ జ్ఞానదీపమును వెలిగించుకొ రా…॥ 🌸 చరణం – 5 మానవ విభేదాలన్నీ తుంచుకో మనుషులతో విధేయతను పెంచుకో అజ్ఞానం అంధకారము తుంచుకో శ్రీ హరి దయామృతాన్ని పెంచుకో…॥ 🌸 చరణం – 6 అశాస్త్రీయ భావమును తుంచుకో భగవద...