Life

 




సుధాధరా - ర/జ/త/ర/లగ   

UIU . IUIU / UIU . IUIU 14 శక్వరి 5419 


రాధ నీతపంబుగా రమ్యతౌను సుభంబుగా 

రాధ యీసుఖంబుగా రక్షనౌను సమంబుగా 


ఛందమందు వ్రాయు నా చక్కనైన గీతిగా  

విందులిచ్చు పూలలో+ ప్రీణనమ్ము నీవెగా 

పంత మొద్దు  యిప్పుడే పావువంబు నీ దయా 

సంతసంబు సందడే సంబరాన నీకృపా 


నాదసింధు వీచికా నవ్వుచున్న మోహమో 

మోదమిచ్చు జన్మలో మోచనమ్ము నీవెగా 

కాదు నన్న ప్రేమయే కాల మాయ నీవెగా 

చేదు తీపి తప్పదే  చేరువైతి నేనుగా        


రాధవో సుధాధరా రాగవీణ మీఁటువో 

పూదఱిన్ సుమాలతో మోహనమ్ము నీవెగా 

భాదలేల నీకులే బంధమేను నీదిలే 

వాదమొద్దు మధ్యలో వాక్కు తీరు చాలులే 


నూతనాభ్రవీథిలో నూఁగు కాంతి చాఱవో  

వ్రాతలోని వాణిలో భావనమ్ము నీవెగా 

ఖ్యాతి నాన్న నీదిలే కాలమందు నీ కళే

స్వాతి ముత్యమైతివే సానుకూల సుందరీ

    

శీతలాంబరమ్ములో+ చేతనమ్ము నీవెగా 

కైతలోని ప్రేమకే కారణమ్ము నీవెగా 

రాత లన్ని నమ్ముటే రవ్వ వెల్లుగు చాలులే

ధాత్రి గాను నీవులే దారి చూపు మేలులే 

*****

జీవన దశల పద్యమాల.. మల్లా ప్రగడ

 జీవన దశలు – (6)

(తాత్విక-ఆధ్యాత్మిక దృష్టితో)

శిశు దశ

జన్మించిన వెంటనే మొదలయ్యే దశ.

నిర్దోషిత్వం, ఆశ్రితత్వం, సహజ పవిత్రత ప్రధాన లక్షణాలు.

జీవితం కృపపై ఆధారపడిన స్థితి.

బాల్య దశ

జిజ్ఞాస, ఆట, విద్యాబీజాల నాటకం ఈ దశలో జరుగుతుంది.

అనుకరణ ద్వారా లోకాన్ని నేర్చుకునే కాలం.

మనసు మృదువుగా మలచబడే సమయం.

యౌవన దశ

శక్తి, ఆకాంక్ష, స్వప్నాలు ఉప్పొంగే దశ.

ఆశలు–ఆకర్షణలు, కర్తవ్య భావం కలిసి నడిచే కాలం.

సృష్టి, సాధన, పోరాటాల కేంద్రబిందువు.

గృహస్థ దశ

బాధ్యత, సంబంధాలు, కుటుంబం, సమాజం ప్రధానమవుతాయి.

త్యాగం, సహనం, ధర్మాచరణకు పరీక్షల దశ.

జీవన భారాన్ని మోసే స్థిరత్వ కాలం.

వానప్రస్థ దశ

బాధ్యతల నుంచి క్రమంగా విరమణ.

అనుభవ జ్ఞానం, మార్గదర్శకత్వం ప్రధాన పాత్ర.

అంతర్ముఖత పెరిగి జీవనార్థం పై ఆలోచన.

సన్యాస / పరిపక్వ దశ

ఆశా-ఆసక్తుల నుంచి విముక్తి.

ఆత్మజ్ఞానం, శాంతి, సమత్వ భావం.

“నేను” నుంచి “సర్వం” వైపు ప్రయాణం.

👉 సారాంశంగా

జీవనం జన్మతో మొదలై, బాధ్యతల ద్వారా పక్వత పొంది,

జ్ఞానంతో శాంతిలో లీనమయ్యే ఒక నిరంతర యాత్ర.

ప్రతి దశ కూడా ముందటి దశకు ఫలితం,

తర్వాతి దశకు సిద్ధత.

***

[ రసమంజరి (01)

ఉ.శాంత రసం

శాంతిగ శ్వాసలందు శ్రమ సామ్యము సంతసమై నిద్రించునే

కాంతిగ దృష్టిలో కలత కాలము నీడలకర్మయేయగున్

అంతర దీపమై కళయ హoబగు మూలము ముఖ్య పొంగునే

సంతస నిత్యజీవితము శాంతపు మంజరి విశ్వమే యగున్

వరుస భావం

→ శాంతితో నిండిన శ్వాసలలో శ్రమ కూడా సమత్వంగా మారి, ఆనందరూపంగా విశ్రాంతి పొందుతుంది.

→ కాంతివంతమైన దృష్టి కలిగినవానికి కలతలు కాలపు నీడలుగా మాత్రమే మిగులుతాయి; అవి బంధనాలుగా ఉండవు.

→ అంతరంగంలో దీపంలా వెలిగే జ్ఞానకళ, అహంకార మూలాన్ని కరిగించి, అసలైన సారాన్ని వెలికితీస్తుంది.

→ అలా ఆనందమయమైన నిత్యజీవితం, శాంతిరసపు పుష్పమాలగా విశ్వమంతా విరసిల్లుతుంది.

చిన్న సాహిత్య గమనిక

****

[: రసమంజరి (02)కరుణరసం


కన్నీరే కనులై సుఖంబు కలగన్ కాలంబు సంసారమున్

పన్నీరై మృదువైన వాక్కులగుటన్ పాఠ్యంబు మందారమై 

నన్నూ నీవని తేడలే నరుకుచున్  నాడుల్ల  బంధమునే

అన్నాయేయగు జీవధర్మ కరుణన్ ఆకాంక్ష గామంజరీ 

వరుస భావం

→ సంసార జీవనంలో కన్నీరే కళ్లై, అదే అనుభవంగా మారి చివరకు సుఖాన్ని నేర్పే కాలప్రవాహంగా మారుతుంది.

→ కరుణతో పలికే మృదువైన మాటలు పన్నీరులా పరిమళించి, జీవనానికి మధురమైన పాఠ్యంగా, మందార పుష్పంలా వికసిస్తాయి.

→ ‘నేను–నీవు’ అనే భేదాలను కోసివేసి, అందరినీ ఒకే నాడి బంధంలో కలిపే శక్తి కరుణకే సొంతం.

→ అటువంటి కరుణే అన్నివిధాలా జీవధర్మంగా నిలిచి, మానవాళి ఆకాంక్షగా వికసించిన రసమంజరి అవుతుంది.

*****

: రసమంజరి (03)వీరరసం

ఉ.

భీతిగ బాధ్య బంధనము భీకర భూమిన భారమేయగున్ 

కేతన ధైర్య మార్గమగు కీలక కాలము క్షేమ మ్రోగునే

నీతిగ ధర్మమే యగుట నీడల చిత్తము యేక మవ్వగన్

జాతికి జ్వాల జీవనమె జాగృతి వీరుని మంజరే యగున్ 

వరుస భావం

→ భయంతో ఏర్పడిన బాధ్యతా బంధనాలు, భీకరమైన భూమిపైనే భారంగా మారి జీవనాన్ని కుంగదీస్తాయి.

→ ధైర్యమే జెండాగా ఎగసినప్పుడు, కాలమే కీలక మలుపు తిరిగి క్షేమసందేశాన్ని మ్రోగిస్తుంది.

→ నీతితో నడిచే ధర్మమార్గంలో, చిత్తంలోని నీడలు తొలగి మనస్సు ఏకాగ్రత పొందుతుంది.

→ జాతి జీవనంలో జ్వాలలా వెలిగేది జాగృత వీరుడే; అతడే వీరరస మంజరిలో పరిమళించే పుష్పం.

: భక్తి రసం (04) చెం. 


శరణ మనస్సుగాకదలశబ్దము శాశ్వత కాల శ్వాసగన్

స్మరణగ దీపమైహృదయ శాంతిగ కాంతిగ లక్ష్యమే యగున్

చరణము సేవగా యగుట జాప్యము  చిత్తము కాక నెమ్మదిన్

కరుణ కృపానిధానమగు కర్తగ భక్తిగ మంజరే యగున్

వరుస భావం

→ శరణాగతమైన మనస్సులో కదిలే ప్రతి శబ్దమూ, కాలాన్నే శ్వాసగా చేసుకున్న శాశ్వత నాదంగా మారుతుంది.

→ భగవత్ స్మరణ హృదయంలో దీపంలా వెలిగి, శాంతి–కాంతులే జీవన లక్ష్యంగా నిలుస్తాయి.

→ చరణసేవనే సాధనగా స్వీకరించినప్పుడు, చిత్తం చంచలతను విడిచి నెమ్మదిగా స్థిరపడుతుంది.

→ కరుణా–కృపల నిధియైన పరమకర్తయందు లీనమైన భక్తి, మంజరిలా వికసించి పరిమళిస్తుంది.

****


[31/12 3:52 PM] . Mallapragada: రసమంజరి (05) అద్భుత రసం

అంబర వీధులందున అనాదిగ అర్చన నాద మవ్వగన్
సంబర చంద్ర సూర్యకళ సాధ్యపు చిత్తము చిత్రమే యగున్
గుంబన లోకమందుగతి గుర్తు యపారమహత్యమేయగున్
ఝంబన జీవనంబగు ఝం బని యద్భుత మంజరే యగున్
🙏
వరుస భావం
→ ఆకాశ మార్గములన్నింటిలోనూ ఆది లేనిదైన అర్చన నాదమే వ్యాపించి, సృష్టి అంతటా దివ్య ధ్వనిగా మారుతుంది.
→ చంద్ర–సూర్యుల కళల సమ్మేళనంతో, సాధనచేత సిద్ధించిన చిత్తం ఒక అద్భుత చిత్రంలా ప్రకాశిస్తుంది.
→ సమూహ లోకజీవనంలో ప్రతి గతి కూడా అపారమైన మహిమకు గుర్తుగా అవతరిస్తుంది.
→ ఉల్లాసంతో తాళలయలు పలికే జీవనమే, ఝంబని నాదంలా కంపించే అద్భుతరస మంజరిగా విరసిల్లుతుంది.
*****
[31/12 4:07 PM] . Mallapragada: రసమంజరి (06) శృంగార రసం

నయనములందు నీలిమలు నెమ్మదిగానులె నర్తనంబుగన్
పయనము హంసయైతపన పాశమనస్సుగ సాగు చుండగన్
భయవదనంసుధారసము బాధ్యతవేష విరహంబు తీరగన్
శ్రియలయ జీవనంబగుట శృంగర మంజరి సౌఖ్యమే యగున్
వరుస భావం
→ చూపుల్లో నీలిమ పరచుకొని, భావాలు నెమ్మదిగా నర్తనంలా కదులుతాయి; శృంగారం శబ్దరహితంగా ప్రారంభమవుతుంది.
→ జీవన ప్రయాణం హంసలా స్వచ్ఛంగా సాగుతూ, తపన అనే పాశంతో మనస్సును సున్నితంగా కట్టిపడేస్తుంది.
→ ముఖంలోని సుధారసమే భయాన్ని తొలగించి, బాధ్యతల వేషంలో దాగిన విరహాన్ని కరిగిస్తుంది.
→ లక్ష్మీ నివాసమైన జీవనమే శృంగారరస మంజరిగా మారి, సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది.
చిన్న సాహిత్య వ్యాఖ్య
[31/12 4:25 PM] . Mallapragada: రసమంజరి (07)హాస్య రసం
చెం.
చిరుచిరు నవ్వులైకనుల చిత్రము చూపుల సంతసంబు గన్
పరిపరి విద్యలైపలుకు పాఠము నవ్వులరేయి చిత్తమున్
సరిసరి యేక వాక్కులగు సాధ్యముతీరుగ నేస్తమేయగన్
కరుణతొ జోలపాటలగు కాలపు హాస్యమెమంజరీ యగున్
వరుస భావం
→ చిన్న చిన్న నవ్వులే కళ్లలో చిత్రాలై మెరుస్తూ, చూపులంతా ఆనందంతో నిండుతాయి.
→ జీవన విద్యలన్నీ మాటలలో కాక, నవ్వుల రూపంలో మనసుకు పాఠాలుగా చేరుతాయి.
→ సమానత్వంతో పలికే ఒక్క మాట సైతం సాధ్యాన్ని సాధించి, మనుషులను నేస్తాలుగా చేస్తుంది.
→ కరుణ కలిసిన జోలపాటలా కాలమే నవ్విస్తూ, జీవనమంతా హాస్యరస మంజరిగా మారుతుంది.
****
[31/12 6:08 PM] . Mallapragada: 8. రస మంజరి.. భయానకం
చెం.
చెదిరిన జీవితం గమన చీకటి చుట్టునముట్టి చింతతో
చిదిమిన హృద్య మందు సహచిత్తము కష్టముచెంత చేరితే
నదముభయానకంపలుకునమ్మకమోసముభీకరంభగన్
విధరము లేని లోకమునవిద్య లుభయానమందు మంజరీ

వరుస భావం (భయానక రసం)
జీవితం చెదిరిపోయిన వేళ,
దారులన్నీ చీకటి చేత చుట్టుముట్టబడతాయి.
మనసు నలిగిపోయి, హృదయంలోని సహచిత్తం
కష్టానికి అట్టడుగున చేరినప్పుడు
ప్రతి శబ్దమూ భయానకంగా అనిపిస్తుంది.
నమ్మకం మోసంగా మారి,
భీకరమైన అనిశ్చితి అడుగడుగునా నిలుస్తుంది.
ఆశ్రయం లేని ఈ లోకంలో
విద్య, వివేకమూ కూడ భయమే నింపుతాయి.
అలా, మనసంతా భయంతో నిండిన
భయానక రసమంజరిగా జీవితం మారుతుంది.
***
[31/12 6:24 PM] . Mallapragada: 9.ఉ. భీభత్స రసం
మానవ జన్మ దాహము సమాన సుఖంబని స్వార్ధ కుచ్చితం
వైన జుగుప్సవాంఛలగు వైపరి బుద్ధియు శిద్దికామమున్
మౌన విరాగ భీకరము మౌఖ్య రసంబగు క్రూర తత్త్వమున్
జ్ఞానమనేది నీచమగు వాక్కుల మధ్యన జీవ మంజరీ

వరుస భావం (బీభత్స రసం)
మానవ జన్మను
సుఖదాహమే లక్ష్యమని భావిస్తూ
స్వార్థంలో కుచ్చితమయ్యే మనస్సు,
నీచమైన వాంఛల వెంట పరిగెత్తి
జుగుప్సను పుట్టిస్తుంది.
అసహ్యమైన ఆలోచనలు,
వక్రమైన బుద్ధి,
సిద్ధి కోరికల పేరిట
క్రూరత్వాన్ని ఆచరిస్తాయి.
అక్కడ మాటలు అవసరం లేని
మౌన విరాగమే భీకరంగా నిలుస్తుంది.
అదే బీభత్స రసానికి మూలంగా,
మానవ విలువలను చిదిమేసే
క్రూర తత్త్వంగా మారుతుంది.
అటువంటి నీచ వాక్యాల మధ్యన
జ్ఞానం కూడ నలిగి,
జీవితం మొత్తం
బీభత్స రసమంజరిగా పరిణమిస్తుంది.
****
[31/12 6:35 PM] . Mallapragada: (10) రస మంజరి... శాంతిరసం

" నాతికి నవ్వులే ముఖము నమ్మక శాంతియు హావ భావమున్
నాతికి పువ్వులే సొబగు నవ్య విధాన సుఖంబు పంచుటన్
నాతికిమువ్వలే కళలు నాట్యము తీరుగ శాంతమే యగున్
నాతియె జువ్వలై కలల నందమువోవుగ ప్రేమ మంజరీ."

వరుస భావం (శాంత రసం)
అక్కడ ఇక కలత లేదు.
ముఖమంతా సహజమైన నవ్వే నిలుస్తుంది.
నమ్మకం, శాంతి — అవే హావభావాలవుతాయి.
అక్కడ పువ్వుల్లాంటి సౌందర్యం,
కొత్త విధానంలో పంచే సుఖంగా మారుతుంది.
కళలు మువ్వలై మ్రోగవు —
నాట్యంలా నిశ్శబ్దంగా శాంతిని పలుకుతాయి.
కలలు కూడా జువ్వలై
మృదువుగా ఎగిరిపోతాయి.
అక్కడ మిగిలేది ప్రేమ మాత్రమే —
అది జీవనమంతా పరచిన
శాంత రసమంజరి.
****


(01)..ముగ్ధ

ఉ.

కాలము ముద్దుగామలిచె కాగల ముగ్ధమనస్సు లీలలే

గాలము తీరునవ్వులగు గమ్యముసవ్యపునిత్య సంతసీ

తేలిక చూపులై కనులు తిప్పగ తర్కము చేయ యాకలై

మాలిక సుందరాంగముల మన్నన వేయుము విజ్ఞతేయగున్

వరుస భావం – (01) ముగ్ధ::కాలమే ఒక ముద్దుల శిల్పిగా మారిముగ్ధమనస్సును మలచే లీలలు సాగుతాయి.నవ్వులే గాలిలా ప్రవహించిజీవిత గమ్యాన్ని సవ్యమైన ఆనందదారికి నడిపిస్తాయి.కనుల తేలిక చూపులు చిత్తాన్ని అటుఇటు తిప్పగఆకాంక్షలకు కట్టడి అవసరమని బోధ కలుగుతుంది.అప్పుడు శరీరసౌందర్యాల పట్ల వచ్చే మన్ననబాహ్య అలంకారంగా కాకవిజ్ఞత అనే అంతర్గత శోభగా మారుతుంది.

****

: (02) యౌవనం

యౌవన మార్పులే ముదయ యక్కర పొంగెడు కొత్తయూ హలే 

సా విధ సౌరవంబుగను సంగమ కాంక్షలు సవ్వడే యగున్

భావము బుద్ధిమించకయె బ్రాంతిగ నుండక దృశ్య చేష్టలై

కావున కట్టడేయగుచు కాముక తృప్తికి జీవ నార్పణమ్

వరుస భావం – (02) యౌవనం::యౌవన దశలో మనసు మార్పులతో నిండిపోతుంది.కొత్త ఊహలు ఉవ్వెత్తున పొంగుతాయి, కోరికలు స్వరాలతో కదలాడుతాయి. ఆకర్షణలు, సంగమ కాంక్షలు జీవనాన్ని ముందుకు నడిపే శక్తిలా కనిపిస్తాయి.కానీ అవి అదుపు తప్పితే దృష్టి భ్రమకు లోనవుతుంది.అందుకే భావం బుద్ధిని మించకూడదు. చూపులు, చేష్టలు సవ్యంగా నిలవాలి.యౌవనానికి నిజమైన సార్థకతకాముక తృప్తిలో కాదు,జీవనాన్ని నియమంతో, అర్పణ భావంతో నడిపించడంలోనే ఉంటుంది.

****

 (03) పరిపక్వత 

ఉ.

ఈ పరిపక్వతే పలుకు యీశ వయస్సున కొట్టకంతులే

ఈ పద నేస్తసఖ్యతగు యి చ్ఛల తీరుగ పొందికేయగున్

సాపని పొందయౌవనము సాక్షి సహాయ పరంపరాయగున్

ఈ పవలింపుసృష్టిగను యీ మది ఆమని సంగమoబుగన్

వరుస భావం – జీవన దశల పద్యమాల

(03) పరిపక్వత::పరిపక్వత అనేది వయస్సు పెరిగినట్లు కనిపించడంలో కాదు,మనసు మాటలలో, పనులలో మెరయడంలో ఉంటుంది.ఈ దశలో కోరికలు ఢీకొనవు,స్నేహం–సఖ్యతలుగా మృదువుగా స్థిరపడతాయి.యౌవనంలో పొందిన అనుభవాలుఇప్పుడు సాక్షులుగా, సహాయక శక్తులుగా మారతాయి.అతి లేక అలసట లేకసృష్టి లయలో జీవితం పవళించి,మనసు ఆమని కాలంలాశాంతి–సంగమాన్ని పొందుతుంది.

******

: (04) ప్రౌఢత్వం

ఉ.

ప్రౌఢత నిర్ణయంబు సహ ప్రౌఢ  ప్రవర్తనలో  ప్రశాంతతన్

గాఢ వివేకమే గళము కాలము నేర్పిన పాఠ్య కాంతిగన్

మూఢమె లేని సజ్జనగ ముఖ్య ముభావ సుకర్తయేయగున్

ఈడుగ జోడుయే యగుచు యీప్సిత జీవన ధర్మ మార్గమున్

 వరుస భావం – (04) ప్రౌఢత్వం:::ప్రౌఢత్వం అంటే నిర్ణయాలలో స్థిరత్వం కలిగి ఉండడం.ప్రవర్తనలో ఆవేశం లేక ప్రశాంతత నిలవడం.కాలం నేర్పిన అనుభవాలు వివేకంగా మాటల్లో, పనుల్లో ప్రతిఫలించడం.మూఢత్వానికి చోటు లేకసజ్జన గుణాలతో సత్కార్యాలు చేయగలగడం.వ్యక్తిగత జీవితం, సమాజ జీవితంరెండూ కలసి నడిచేలాధర్మ మార్గంలో జీవనాన్ని ముందుకు తీసుకువెళ్లడమేప్రౌఢత్వం యొక్క నిజమైన స్వరూపం.

****

: శా

వైమల్యం మలినంబు వీడివయసున్ వైకల్ప మేవీడుటన్

కామంక్రోధమువీడిజీవనమగున్ కర్తవ్య లక్ష్యంబుగన్

సామాన్యం యహలోభమత్సరముగన్ సాదృశ్య ధర్మంబుగన్

ప్రామాణ్యం వెలుగొందుటే పలుకుగా ప్రావీణ్య జీవంబుగన్

వరుస భావం – (05) వైమల్యం::వైమల్యం అంటే మనసు మలినాన్ని, లోపాలను వీడిన స్థితి.అహంకారం, లోభం, క్రోధo, మోహం—తల్లిపోవడం.ఈ దశలో జీవనం కర్తవ్య లక్ష్యానికి అనుగుణంగా నడుస్తుంది.అనవసర ఆశలు, వ్యభిచారం, ఆవేశాలు మనసును దోచలేవు.సాధారణ జీవన కర్మలు సమతుల్యంగా ఉంటాయి,ధర్మం సాక్షాత్కారం అవుతుంది,ప్రామాణ్యం, నిజాయితీ, పరిపూర్ణత—జీవితంలో వెలుగులు విరిసినట్లే.వైమల్యం అనేది ప్రౌఢత్వానికి తర్వత వచ్చే, సులభం కాదు, శుద్ధతతో కూడిన జీవన దశ.

***

సాంప్రదాయ..సామాజిక..తాత్విక.. దృష్టితో.. స్త్రీల 30 రకాల పేర్లతో వారి లక్షణాల సూచనలుగా పద్య..భావ.. రచన 

మీ విధేయుడు..మల్లాప్రగడ 

(01) మాతృమూర్తి

కష్టము కళ్ళతో కరుణ కంటతడవ్వక కామ్య మాతగన్

ఇష్టముదీప్తికాంతులగ యిచ్ఛసహాయమువిశ్వ మందునన్

పుష్టిగ పుణ్యధాత్రిగ సపూజ్యము పక్వము సర్వతీరుగన్

దృష్టిగ జంటజన్మలకు తృప్తిగ పంచెది జీవ మాతగన్

వరుస భావం :మాతృమూర్తి తన కళ్లలో కష్టం నింపుకొని, బయటకు మాత్రం కరుణతోనే స్పందిస్తూ కన్నీరు కనబడనీయని త్యాగస్వరూపిణి. ఆమె ఆకాంక్షలు వ్యక్తిగతమైనవిగా కాక, లోకమంతటికీ ఉపకారం చేయాలనే ఇష్టసంకల్పంగా వెలుగుతాయి. పుణ్యధాత్రిగా, పోషణశక్తిగా పరిపక్వతతో పూజార్హమైన స్థానంలో నిలిచి, తరతరాల జన్మలకు దృష్టిగా మారి, జీవనమనే యాత్రలో తృప్తిని పంచే జీవమాతగా విరాజిల్లుతుంది.

****

(02)చెం. గృహలక్ష్మి

విరిసెడి దీప్తిగన్ సహన విద్యల హృద్య సుధాపరంబుగన్

సిరిగలిగేటిపుణ్యఫల ప్రీతియు పాకెడి సంప్రదాయిగన్

పరిపరియైక్యసంపదగ పాశము బంధము ఇంటిలక్ష్మిగన్

కరుణగయిష్టసౌఖ్యములుగా గృహలక్ష్మిగసందడేయగున్

వరుస భావం :గృహలక్ష్మి సహనం, విద్య, హృద్యమైన స్వభావంతో ఇంటిని అమృతసుధలా పరిమళింపజేస్తుంది. ఆమె వల్ల పుణ్యఫలాలు వికసించి, ప్రీతి సంప్రదాయంగా మారి తరతరాలకు చేరుతాయి. ఐక్యత, సంపద, అనుబంధం, బంధం అన్నీ ఒకే ధారగా ఇంటిలో నిలిచే శక్తి ఆమెనే. కరుణతో, ఇష్టసౌఖ్యాలను అందిస్తూ, ఇంటినంతా ఆనందోత్సవంగా మార్చే గృహలక్ష్మిగా ఆమె విరాజిల్లుతుంది.

******

(03) చెం. ధర్మపత్నీ

ధర్మసహాయధైర్యమగుదారిగ చూపె సుధామయీ యగున్

కర్మఫలంబు కట్టడిస కార్యము గా సహధర్మి ణీయగున్

నిర్మల నిష్ఠలే గృహము నిల్పెడి గాఢము సర్వమేయగున్

శర్మము మాన్పి శీలవతి శాంతిని పంచెడి ధర్మ పత్నిగన్

వరుస భావం :ధర్మపత్నీ ధర్మానికి బలమిచ్చే ధైర్యసహాయస్వరూపిణి. జీవితానికి సరైన దారిని అమృతసుధలా మృదువుగా చూపిస్తుంది. కర్మఫలాన్ని కట్టడి చేస్తూ, కర్తవ్యాలను భర్తతో సమానంగా భుజాన మోసే సహధర్మిణిగా నిలుస్తుంది. నిర్మలమైన నిష్ఠలతో గృహాన్ని గాఢంగా నిలబెట్టి, అవమానం–వేదనలను తొలగించి, శీలసంపన్నతతో శాంతిని పంచే ధర్మపత్నిగా ఆమె జీవనాన్ని పరిపూర్ణం చేస్తుంది.

(04) చంపకమాల.. సహధర్మచారణీ

బలమగువాక్కు మానవులబాధలునొందుచుజీవితమ్మునన్

నలిగిన శాంతిపంచగల నమ్ముచు సఖ్యత ప్రేమ భావమున్

అలికిడి మార్చనిష్ఠగల యా పరమాత్ముని వేడ శ్రీమతీ

కలిగినలేక పోయిన సకాల సహా యపుధర్మ చారిణీ

వరుస భావం :సహధర్మచారిణి బలమైన వాక్కుతో, జీవితంలో మానవులు ఎదుర్కొనే బాధలను తానే అనుభవిస్తూ కూడా, ఇతరులకు శాంతిని పంచగల శక్తిని కలిగినది. సఖ్యత, ప్రేమ అనే భావాలపై నమ్మకంతో జీవనబాటలో ముందుకు సాగుతుంది. కలతలు, అలికిడులను మార్చే నిష్ఠతో పరమాత్ముని ప్రార్థిస్తూ, ఉన్నా లేకపోయినా—అన్ని పరిస్థితుల్లోనూ తోడుగా నిలిచే ధర్మసహాయస్వరూపిణిగా ఆమె జీవనయాత్రను సార్థకం చేస్తుంది.

05. జననీ 

జననీవిశ్వమయాoతరంగముననేజన్మార్ధ దేహంబుగన్ 

గుణగమ్యార్ధపరంవిధానముగనేగుణ్యంబు దాహంబుగన్ 

ప్రణతీభావము సర్వమోక్షముగనే ప్రాబల్య లక్ష్యంబుగన్ 

గణవాణీసధనంబుగాబ్రతుకుగన్ గమ్యంబు లోకంబునన్ 

05. జననీ.. భావం::జననీ అనేది విశ్వమంతటా వ్యాపించి ఉన్న శక్తి. ఆమె ప్రతి జీవి అంతరంగంలో నిత్యంగా స్పందించే చైతన్యం.మనకు లభించిన ఈ జన్మ, ఈ దేహం —జీవనార్థాన్ని తెలుసుకోవడానికి ఇచ్చిన సాధనం.గుణముల ద్వారా గమ్యం సిద్ధించునని, పుణ్యబుద్ధి కలగడం సహజ తపనగా మారుతుందనిజననీ తత్త్వం బోధిస్తుంది.శరణాగతి భావమే పరమ మోక్షానికి మార్గం,అదే జీవిత లక్ష్యంగా బలంగా నిలవాలి.మన మాట, మన కర్మ, మన జీవితం —అన్నీ సాధనగా మారిలోకహితమే అంతిమ గమ్యంగా నిలవాలిఅనే సందేశాన్ని ఈ పద్యం తెలియజేస్తుంది.

🌺

 06. జగన్మాత 

 జగన్మాత తత్వం జనారక్షయోగ్యం 

 సగమ్యా తత్వం సదా శక్తి యోగ్యం

ప్రగల్బాల తత్త్వం ప్రజా యుక్తి యోగ్యం

 యుగాంతార్ధ దీక్షా యురమ్యత్వభోజ్యం 

భావార్థం – 06. జగన్మాత::— జగన్మాత యొక్క మూల తత్వం సమస్త జనుల రక్షణకై ఉద్దేశించబడినది. ఆమె కరుణా స్వరూపిణి; లోక సంక్షేమమే ఆమె ధ్యేయం.— ఆమె తత్వం సాధకులకు సులభంగా అనుభవానికి వచ్చేది. నిత్య శక్తితో యోగమై, చైతన్యరూపంగా సర్వదా ప్రవహిస్తుంది.— ఆమె శక్తి ప్రగాఢమైనది, ప్రభావశీలమైనది. ప్రజల బుద్ధి, నైతికత, ధర్మబోధలతో అనుసంధానమై లోక వ్యవహారాలను నడిపిస్తుంది.— యుగాంత కాలాలలో కూడా ఆ తత్వం దీక్షారూపంగా నిలిచి, ఆత్మకు ఆనందాన్నీ, శాంతినీ ప్రసాదించే అమృతస్వరూపంగా అనుభవమవుతుంది.

👉

 07.గుణవతి 

చంపకమాల::

గుణవతి సర్వ సౌఖ్యమును,గుర్తుగ ధన్యత సంభవంబుగన్  

గణ గతిజీవధాతువగు, గమ్యమొనర్చగ మాత వేడుకన్!

ప్రణమది మోపి నా దమగు,రమ్యత బాధ్యతగమ్య మూలమున్ 

క్షణమన దాటి శైలమున , నందరి కోర్కెలు దీర్చు తల్లియే 

భావార్థం – 07. గుణవతి (చంపకమాల)

— గుణసంపన్నురాలైన ఆ తల్లి సర్వ సుఖాలకు కారణమై, జీవితానికి ధన్యతను ప్రసాదించే శుభలక్షణంగా నిలుస్తుంది.— సమస్త జీవరాశుల గమనం, స్థితి, ప్రాణాధారం అన్నిటికీ మూలమైన ఆమె, సాధకుల లక్ష్యసిద్ధికి ఆనందదాయక మైన మార్గాన్ని చూపుతుంది.— వినయంతో నమస్కరించిన వారికి, వారి బాధ్యతలను తేలికపరచి, ప్రభావశీలమైన ఫలసిద్ధికి మూలకారణంగా అవతరిస్తుంది.— క్షణకాలం ఆలస్యం లేకుండా, అచలమైన నిశ్చయంతో, అందరి కోరికలను తీర్చే పరమకారుణ్య స్వరూపిణి ఆ తల్లే.

👉

: 08. శీలవతి...చంపకమాల::

(భ జ స న గ గ . 8 వనమాయురి)

శీలవతి శాంతి శశి సౌరభము గానున్

కీలకముగానగు మనోగమన తీరున్

లీలగ సుగమ్య కళ జీవనపు ధారిన్,

మూలమగు ముక్తి కరుణామయియె మార్గమ్

భావార్థం – 08. శీలవతి 

— శీలవతి అయిన ఆ తల్లి, శాంతిని ప్రసరింపజేసే చంద్రిక వలె, సౌమ్యతా సౌరభ్యాలతో మనసులను పరిమళింపజేస్తుంది.— మనస్సు నడిచే దారికి కీలకమైన నియమంగా నిలిచి, ఆలోచనలకు సరిదిద్దు దిశను చూపుతుంది.— జీవన ప్రవాహంలో కళలన్నిటినీ లీలగా, సులభంగా సమన్వయపరుస్తూ, జీవితం సుగమంగా సాగేలా చేస్తుంది.— కరుణామయి అయిన ఆమెనే ముక్తికి మూలకారణమైన మార్గంగా అవతరిస్తుంది.

👉

: 09.సతీమణి

(జ స జ స .. 6. జలోద్గతి )

సతీమణి సుసాధ్య సాధ్యము గనే 

మతీ స్థితి సుమాల సఖ్యతగనే

రతీ సుఖ తరంబు భవ్య తగనే

యతీకధ జయంబు ఫలంబు గనే 

భావార్థం – 09. సతీమణి

— సతీమణి స్వరూపం కష్టసాధ్యమైన కార్యాలకూ సుసాధ్యంగా మారే శక్తిని కలిగినది; ధర్మమార్గంలో అసాధ్యమన్నది ఉండదు.— ఆమె బుద్ధి స్థితి శుభ్రమైనది, సమతుల్యమైనది; మనస్సు, ఆలోచన, ఆచరణలతో సఖ్యతను కలిగిస్తుంది.— గృహజీవితంలో సుఖసౌభాగ్యాలు శుభ్రంగా, భవ్యంగా ప్రవహించేలా ఆమె సాన్నిధ్యం మార్గం వేస్తుంది.— నియమశీలత, ఆత్మసంయమం అనే యతి భావనతో జీవించినప్పుడు, చివరకు విజయం ఫలంగా లభిస్తుందని ఈ తత్త్వం బోధిస్తుంది.

👉

: 10.పతివ్రత::

 పతివ్రత  సఖ్యతా భవము పాఠ్యము తృప్తిగపంచ దేహమున్ 

స్థితివిధి వ్రాతగాసుఖము స్నేహమువిద్య పరం సుధాహమున్ 

రతి శృతి సంగమం సహన రమ్యత లక్ష్యతగాను జీవితం

మతిగుణ మార్గమేకదల మాయల ఛేదన తత్వ భావమున్ 

భావార్థం – 10. పతివ్రత

— పతివ్రత జీవితం సఖ్యతనే పాఠంగా నేర్పుతుంది. శరీరంలోని ఐదు తత్త్వాలు (పంచదేహ భావన) సంతృప్తితో సమతుల్యంగా నిలుస్తాయి.— జీవన స్థితి విధిగా మారి, సుఖం–స్నేహం–విద్య అన్నీ అమృతధారలా ప్రవహిస్తాయి; సంసారం భారంగా కాక అనుభూతిగా మారుతుంది.— ప్రేమ, అనురాగం, సహనం కలసి జీవనాన్ని రమ్యమైన లక్ష్యంగా మారుస్తాయి; కేవలం భోగం కాదు, పరిపక్వతకు దారి తీసే సంయమిత అనుభవమవుతుంది.— బుద్ధి–గుణాల సమన్వయ మార్గంలో నడిచినప్పుడు, మాయా బంధనాలు తొలగిపోతాయి; పతివ్రత తత్వం ఆధ్యాత్మిక విముక్తికి దారి చూపుతుంది.

👉

 11. కరుణామయి

కరుణామయి సారికగా కదలా 

విరజాజి సితార వినమ్రతగా 

అరునోదయకాలయశస్సుగనే 

తరుణంబుసహనంబుతపంబుగనే 

భావార్థం (సరళంగా)

కరుణామయి అయిన అమ్మ

సారిక పక్షిలా లోకమంతా తిరుగుతూ

ప్రతి హృదయాన్ని తాకుతూ

కదలాడే చైతన్యంగా నిలుస్తుంది.

ఆమె నడకలో

విరజాజి పువ్వులాంటి పవిత్రత,

సితార తారల వంటి ప్రకాశం,

వినమ్రతతో కూడిన మహిమాన్విత గుణం ప్రతిఫలిస్తాయి.

ఆమె కరుణ

అరుణోదయ వేళ ఉదయించే కాంతిలా

యశస్సుతో ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంది.

ఆ కరుణా స్వరూపమే

యువత్వానికి సహనంగా,

సహనానికి తపస్సుగా మారి

జీవితాన్ని శుద్ధి చేసే మార్గంగా నిలుస్తుంది.

******

: 12. మైత్రిణి వైరభావముల మైకము నుండియు మార్చగల్గగన్

నైతిక సత్యమై కళలు నైరుతి సైతము సంఖ్యతేయగున్

జ్యోతిగ జీవనంబగుట నొన్నత భావము లోకమేయగున్

ప్రీతిగ దేహలక్ష్యము ప్రేరణ నేస్తము దేహ బంధమున్

భావార్థం (12. మైత్రిణి)

మైత్రిణి అయిన జగన్మాత

మనుషులలో ఉన్న వైరభావాలను కూడ ఐక్యతగా మార్చగల శక్తి కలది.

విభేదంగా కనిపించే దిశలూ, పరిస్థితులూ

ఆమె సాన్నిధ్యంలో నైతిక సత్యంగా, సమన్వయంగా మారుతాయి.

ఆమె బోధించే జీవనమార్గం

కేవలం జీవించడమే కాదు —

జీవితాన్నే ఒక జ్యోతిలా, ఒక ఉన్నత ఆదర్శంగా

లోకానికి వెలుగుగా నిలిపేది.

ఆ వెలుగులో

శరీర లక్ష్యాలూ, సంబంధాలూ

కేవలం బంధాలుగా కాక

ప్రీతి, ప్రేరణ, స్నేహంగా పరిణమించి

మనుష్య జీవనానికి అర్థాన్ని ఇస్తాయి.

🙏

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ