నేటి కథ
దరిద్రం, భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మని ఈ 32 నామాలతో పూజించండి.. అద్భుత ఫలితాలు పొందండి.. అర్ధంతో దుర్గాదేవి-ద్వాత్రింశన్నామావాళి.. దుర్గా దుర్గార్తి శమణీ, దుర్గాపద్వినివారిణీ దుర్గమచ్చేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశినీ దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహ దుర్గమదేజ్ఞానదా, దుర్గ దైత్యలోకదవానలా దుర్గమ, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణీ దుర్గమార్గాప్రద, దుర్గమావిద్యా, దుర్గమాశ్రిత దుర్గమజ్ఞానసంస్థాన, దుర్గమధ్యానభాసిని దుర్గమోహ & దుర్గమగ, దుర్గమర్థస్వరూపిణీ దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధదారిణీ దుర్గమాంగీ, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరీ దుర్గభీమా, దుర్గభామా, దుర్లభా, దుర్గధారిణీ.. ఇవి దుర్గాదేవి 32 నామాలు. 32 నామాలకు అర్ధం: 1.దుర్గా: భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి నీకు వందనం. 2.దుర్గార్తిశమణీ: కష్టాలను శమింపచేసేతల్లి నీకు వందనం. 3.దుర్గాపద్వినివారిణీ: ఆపదలను నివారించే తల్లీ నీకు వందనం. 4.దుర్గమచ్ఛేదినీ: కష్టాలను ఛేదించే తల్లీ నీకు వందనం. 5.దుర్గసాధినీ: దుర్గమమైనది సాధించే తల్లీ నీకు వందనం. 6.దుర్గనాశినీ: కష్టాలను నాశనం చేసే తల్లీ నీకు వందనం. 7.దుర్గతోద్దారిణీ: దుర్గ...