శ్రీ భగవాన్ వాణి ... 32 ...
శ్రీ భగవాన్ వాణి ... 32 ...
*" సముద్రంలోని నీరు సూర్యుని నుంచి వచ్చే వేడి కి ఆవిరై ఆకాశం వైపు ప్రయాణించి మేఘమవుతుంది.
*ఆకాశంలో చల్లటి గాలి స్పర్శతో మేఘాలలోని నీరు వర్షరూపంలో తిరిగి భూమిని చేరుతుంది. అనేక అనేక బిందువుల రూపంలోని నీరు కాలువలుగా...నదిగా మారి...సముద్రంలో కలుస్తాయి.
*సాగరంలోని నీటి బిందువులు ఆవిరై ఆకాశంలోకి వెళ్లి మేఘాలుగా మారినట్లు...నీటిబిందువుల రూపంలోని సాధకులు ఉపాసకులు చల్లటి గాలి తో నిండిన మేఘ రూపంలోని గురు స్పర్శతో... తిరిగి వర్షబిందువులుగా మారి అనేక అనేక ఉపాసకులుగా నేలను చేరి ప్రయాణించి సాగరరూపంలోని పరమాత్మలో విలీనం అవుతారు.అదే తన్లీనత.
*సాధన యొక్క లక్ష్యం అస్థిత్వాన్ని కోల్పోవటం. లక్ష్యబోధంతో బాహ్య అవబోధాలన్నింటినీ తొలగించుకొని అంతరంలోకి ప్రయాణించి సాగర రూపంలోని పరమాత్మలో విలీనం కావాలి."
*వినయశీలుడే అందరికన్నా గొప్పవాడు. వినయాన్ని మించిన ఆభరణం ఏమున్నది!*
*కార్యసిద్ధి, కీర్తి లభించినప్పుడు కొంతమంది మరింత పరిపక్వతతో అణకువగా ఉంటారు. అయితే మరికొందరు వారి దృక్కోణాన్ని కోల్పోతారు.*
*ఒక సాధారణ మానవుడు తన గొప్పలను సదా చెప్పుకుంటూ ఉంటే, మహనీయులు తమ ప్రతిభలు జయాపజయాలు, సుఖదుఃఖాల ద్వారా భగవంతుడే వ్యక్తీకరింప బడుతున్నాడని భావిస్తారు.*
*సకల అనుభవాల ద్వారా వారు సత్యాన్ని మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. దైవేచ్ఛ మన ఆలోచనల ద్వారా నెరవేరుతుందని తెలుసుకోవటమే ఆ పరమసత్యం.*
*శుభం భూయాత్*
శ్రీ భగవాన్ వాణి ... 33 ...
శ్రీ భగవాన్ వాణి ... 34 ...23--2-2023
సామాన్యముగ న్యూనతగాని, ఆధిక్యము గాని లేని సమబుద్ధియే మహానుభావుల లక్షణము. కాని శ్రీ కృష్ణునికి ఆధిక్యము అను బుద్ధి లేకుండుటయే గాక , అందరును సమానమను అభిప్రాయము కూడ అతనికి లేదు.
అనగా ఎవడు చేసుకొనిన కర్మకు తగిన ఫలము వానిని అనుభవింప జేయుటయు, ఎదుటివాని స్వభావమునకు తగినట్లు ప్రవర్తించుటయు కృష్ణుని లక్షణములు.
తానందరికి సముడు గాని, తనయందు అందరును సమముగా ప్రవర్తింపరు. కనుకనే కృష్ణుడందరి యెడల ఒకే విధముగ ప్రవర్తింపలేదు.
గోపకుల యెడల చూపిన ప్రవర్తనకును, యాదవుల యెడ చూపిన ప్రవర్తనకు సంబంధము లేదు. పాండవుల యెడ చూపిన ప్రవర్తనకు , కౌరవుల యెడ చూపిన ప్రవర్తనకు సంబంధము లేదు. భక్తుల యెడ చూపిన ప్రవర్తనకు ఋషుల యెడ చూపిన ప్రవర్తనకు సంబంధము లేదు. ఇట్లే మిగిలిన చేష్టలనూహింపవలెను.
భగవంతుడు జీవులకు కల్పవృక్షముగా పనిచేయును. ఎవ్వరేమి కోరి అర్చింతురో వారి కది సమకూర్చును.
కోరినదిచ్చును గాని తానిచ్చునది యని యుండదు. కోరుట వలన గలుగు మోసము ఇది. కోరనివారికి తానే నిర్ణయించును. కనుక కోరనివారి కిచ్చునట్టి స్థితి కోరినవారు పుచ్చుకొనలేక పోవుచున్నారు.
శ్రీ భగవాన్ వాణి ... 35 ...--2-2023
* సహనం లేని వ్యక్తి ఎన్నటికీ విజయం పొందలేడు.
* మీలో ఏ పాపమూ లేదు, దైన్యమూ లేదు, మీరు అనంతశక్తి సంపన్నులు. లేవండి! మేల్కొనండి! మీలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించండి."
*తాత్కాలిక సంతోషం దుఃఖాన్ని తెస్తుంది. తాత్కాలిక సంతోషం అంటే దేనిపైనో ఆధారపడి వచ్చే సంతోషం. ఒక విషయంపై ఆధారపడి ఉండే సంతోషం విషయంతోపాటే పోతుంది. ఈ సృష్టిలో ఏ విషయమైనా శాశ్వతంగా నిలిచి ఉండదు. కనుక సంతోషం శాశ్వతంగా నిలిచి ఉండదు. ఈ విషయం అర్థమైతే కలిగిన సంతోషానికి సాక్షిగా ఉండటం తప్ప కొత్త సంతోషాన్ని కోరుకోం. సంతోషాన్ని కోరుకునే గుణంపోతే దుఃఖం కూడా దూరమవుతుంది. ఎందుకంటే రాని సంతోషాన్ని కోరుకోవటంవల్ల, వచ్చిన సంతోషం నిలిచి ఉండాలనుకోవడం వల్లనే దుఃఖం వస్తుంది. ఆత్మ/దైవం శాశ్వతం, సర్వవ్యాపితం కనుక వాటితో వచ్చే సంతోషం శాశ్వతంగా ఉంటుంది !
* ఆత్మోద్ధరణ - దేవుడు, జీవుడు, బుద్ధి, చిత్తము ఈ నాలుగు ప్రజ్ఞలుగ నున్నవాడు మానవుడు. సామన్య మానవుని చిత్తము బాహ్య ప్రపంచముతో ముడిపడి యుండును. బాహ్యమును దర్శించుటకు, అనుభూతి చెందుటకు పాంచభౌతిక శరీరమున్నది. స్వభావము బాహ్య ప్రపంచమందలి అనుభవముల ఆధారముగ గట్టిపడు చుండును. ఇష్టము, అయిష్టము, అభిప్రాయములు ఏర్పడి అవి సత్య మనిపించు చుండును. తాను, తన స్వభావము కాదని తెలియుటకు వలసిన బుద్ధి కూడ తన యందే యున్నది. బుద్ధిని వినియోగించినచో స్వభావము నుండి తాను విడిపడ వచ్చును. విచక్షణ బుద్ధి లక్షణమే. ఇట్లు అంతయు వ్యాపించిన ఒకే తత్త్వము గుణముల ద్వారా ప్రత్యేకమై, బుద్ధిని, స్వభావమును కలిగి యుండును. ఇట్లు ప్రజ్ఞ నాలుగు స్థితులలో మానవుని యందు
*****
శ్రీ భగవాన్ వాణి ... ప్రాంజలి ప్రభ .... 24 --02 -2023
maallaprgada ramakrishna
ప్రేమ దేవుడికి సంబంధించిన అంతిమ అనుభవం. అస్తిత్వం అర్థరహితం కాదని ప్రేమ నిరూపిస్తుంది. జీవితం అర్థవంత మయిందని చూపిస్తుంది. ప్రేమను అనుభవానికి తెచ్చుకోని వ్యక్తి జీవితం అర్థరహిత మనుకుంటాడు. యాదృచ్ఛిక మనుకుంటాడు. అజ్ఞాత, అచేతనమయిన సహజశక్తుల దయాదాక్షిణ్యాలు అనుకుంటాడు. భౌతికవాదులు జీవితాన్ని చూసే విధానమది. కేవలం పదార్థాల సమ్మేళనం అనుకుంటారు.
అప్పుడు జీవితం అర్థరహితం. అర్థరహితమైన, ప్రాముఖ్యత లేని జీవితం పాట పాడలేదు. నాట్యమాడలేదు. అర్థవంతం కాని జీవితాన్ని పిరికివాళ్ళు మాత్రమే బతుకుతారు. జీవితం అర్థరహితం కాదు. అసాధారణమయిన విలువ కలిగింది. కానీ దాన్ని మనం కనిపెట్టాలి. ప్రేమ నీకు మార్గాల్ని చూపిస్తుంది. కాంతి నిస్తుంది. ధ్యానపు ఛాయల్ని ప్రదర్శిస్తుంది. ధ్యానం కిటికీలు తెరిచి దేవుణ్ణి చూపిస్తుంది.
ప్రతి ఒక్కరూ ఏదో ఒక అసంపూర్ణతతోనే బ్రతుకుతారు. ఇది ఎప్పటికీ పూర్తికాదు. ఇది భౌతిక జీవితం యొక్క బాధాకరమైన పార్శ్వం. భౌతిక జీవితం అంటే మనకు చిత్రీకరించబడిన చిత్రం ఇదే. కానీ మన లోపల మనకు ఓదార్పు ను సంతృప్తిని కలిగించే ఒక మూలం ఉంది. దీని ఆభాస మనకు అంత తరచుగా రాదు. మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఉంది, అది మన దృష్టిగోచరం కాకుండా ఉంటోంది.
చైతన్యంతో మనస్సు కలిసి ఉన్నప్పుడు, కనిపించే ప్రపంచం స్వప్న స్థితిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది, ఇక్కడ వస్తుమయ ప్రపంచం ఉనికిలో ఉండదు అని సూత్రం చెబుతుంది. అత్యున్నత స్థాయి చైతన్యంలో, సాధకుడు శూన్య స్థితిలో ఉన్నట్లుగా వస్తుమయ ప్రపంచం అదృశ్యమవుతుంది. శూన్యం అనేది మిగతావాటన్నిటినీ తిరస్కరించే స్థితి. ఇంద్రియాల నుండి ఉద్భవించిన ఆలోచనలతో మనస్సు కలవరపడకుండా ఉంటేనే అలాంటి స్థితి సాధ్యమవుతుంది.
భౌతిక వస్తువులను అతిస్వల్ప కాలంలోనే నిర్లక్ష్యంగా పాడు చేయడం, చిందరవందర గావించడం, ఇంద్రియోద్వేగంచే గాని, తామసిక జడత్వంచే గాని భౌతిక వస్తువులను, సేవలను దుర్వినియోగం చెయ్యడం, దుబారా చెయ్యడం - ఈ లక్షణాలు అభ్యుదయానికి ప్రతిబంధకాలై లక్ష్మిని వెడల గొటుతాయి.
ఇంకా వుంది
****
శ్రీ భగవాన్ వాణి .... శాంతి మంత్ర పలుకులు .. ప్రాంజలి ప్రభ . 36
ఏ పని చేసినా సఫలం కావాలని కోరుకోవటం మానవ సహజం.
ఉన్నతమైన జీవితాన్ని గడపాలనుకోవటం కూడా సహజమే.
అందుకు ఏమి చేయాలి? పెద్దలేమంటారంటే మనసు పెట్టిచేయాలి అంటారు.
మాట కూడా మంచిగా మాట్లాడలన్నా చదవాలన్నా మనసులో దృఢమైన భావం జనించాలి. ఆప్పడు ఆ మాటకు బలముంటుంది. ఆ పనికి ఫలముంటుంది. ఉన్నత మన జీవనాన్ని, ఉన్నత స్థితిని ఆకాంక్షించే వారికి మనస్సు, వాక్కు ఒక్కటిగా యుండటం ఆవశ్యకం.
అందుకే ప్రతిఒక్కరు ఈవిధముగా ప్రార్ధించాలి
వాక్కు మనసునందున మనసు వాక్కునందున ప్రతిష్ఠతమగుగాక!
పరమాత్మ నాలో ప్రకాశించెదవుగాక!
మనస్సు వాక్కు రెండూ వేదాల యథారార్థాన్ని నాకు తీసుకు వస్తాయి గాక.!
నేను విన్నది యావత్తు నన్ను వీడ కుండుగాక.!
నేర్చుకన్న దానిని రేయింబవళ్ళు యోచించస్తాను గాక!
నేను వ్యావహారిక సత్యాన్ని పలికెదను గాక!
పార మార్థకసత్యాన్ని పలికెదను గాక.!
ఆ భగవంతుడు నన్నుగురువును కాపాడుగాక.!
నన్ను రక్షించు గాక.!
గురువును రక్షించుగాక..!
****
శ్రీ భగవాన్ వాణి ... 35 ...--2-2023
* వేదము నీ స్వరూపమే. నీ ముఖమే వేదము. సదాచారమనే మార్గమునందు పయనించు నీవు సదాచారమనే మార్గమునందు నడచువారిచే పొందబడెదవు. వ్యాపకమైన కీర్తి గలవాడు, సత్యస్వరూపుడు, సత్యము, ప్రియమైనవాడు, సత్యవర్తనముచే పొందగినవాడు . మాయావి, మాయను వశము చేసుకున్నవాడు . బ్రహ్మనుండి పుట్టినవాడు, పరబ్రహ్మస్వరూపుడు, బ్రహ్మజ్ఞానులు తన స్వరూపమైనవాడు.
*వేదోక్త కర్మానుష్ఠానముచే ప్రసన్నుడవగు వాడు, స్మృతి విహిత ధర్మమునందు ప్రీతిగలవాడు, జరాయుజ, ఉద్భిజ, ఆండజ, స్వేదజములను ప్రాణులే స్వరూపమైనవాడు, జలములో మరియు భూమిపై నివసించే ప్రాణులే స్వరూపముగా గలవాడు.
*ఓ దేవా! దేవతలు మొదలగు వారందరిలో శ్రేష్ఠులు నీ విభూతులే. దేవతలలో ఇంద్రుడు నీవే. గ్రహములలో సూర్యుడు నీవే . లోకములలో సత్యలోకము నీవే. నదులలో మందాకిని నీవే. వర్ణములలో శ్వేత వర్ణమునీవే. సరస్సులలో మానస సరోవరము నీవే . పర్వతములలో హిమవంతుడవు నీవే. గోవులలో కామధేనువు నీవే. సముద్రములలో పాలసముద్రము నీవే. లోహములలో బంగారము నీవే .
ఓ ఈశ్వరా! తపస్స్వరూపుడవగు నీవు తపస్సును చేయువారికి ఫలమునిచ్చెదవు. స్తుతిస్వరూపుడవగు నీవు నిత్యము భక్తులచే స్తుతింపబడెదవు. నీ మనస్సు భక్తుల స్తుతిచే మిక్కిలి ఆనందించును .
* ఆచరణ యందు దోషాలుంటాయనే కారణాన కర్మను మాని వేయడం కంటే, వాటి నిర్మూలనకై కర్మను సాధనగా చేపట్టడం శ్రేయస్కరం. దోషాలు రాకూడదన్న దృఢసంకల్పం కలిగి వుండి, నీ కోశ సంశుద్ధికి దేవీశక్తి నాహ్వానిస్తూండే పక్షంలో ఆ దోషాలు రానేరావు.
*సంస్కార బలం- వాసనా బలం- గుణ బలం, నీ సూక్ష్మ శరీరం మీద పనిచేస్తే విచారణ, విచక్షణ విజ్ఞత మరపుకు వచ్చేస్తాయి.*
*ప్రకృతి త్రిగుణాత్మకమై నీ మీద ప్రభావితమవుతుంది. ఇది సృష్టి ధర్మం.*
*తత్వ వివేకం ద్వారా నిర్ణయమయ్యేది బ్రహ్మము మాత్రమే అది నీ స్వరూపము.*
*'త్వం' పద లక్ష్యార్ధము ':- ' తత్ ' పద వాచ్యార్ధము. 'తత్ ' పద లక్ష్యార్ధము 'అసి' పద వాచ్యార్ధము 'అసి ' పద వాచ్యార్ధమే నీ లక్ష్యార్ధము ఆ నిలకడ చెంది ఉండాలి.*
*శ్రవణ మాత్రము చేత తరించినవాడు ప్రహ్లాదుడు. మననము చేత తరించినవాడు భృగువు. నిధిధ్యాసనంలో తరించినవాడు మార్కండేయుడు.*
*యోగైనా - జ్ఞానైనా- సాధకుడైనా శరీర ధారులు నిషిధ్ధ కర్మ తీవ్ర ఫలితాన్నిస్తుంది.*
*సాధకుడు ఏమరిపాటు లేకుండా ఉండాలి. కత్తి అంచు మీద నడవటం వచ్చా అన్నారు పెద్దస్వామి వారు. కాలు తెగకుండా కత్తి అంచు మీద నడవగలిగే నైపుణ్యం నీకు వస్తే స్వరూప జ్ఞానం వస్తుంది. 'యోగాత్ కర్మ సుకౌశలం'.*
*నేను అమనస్క స్థితిలో నిర్ణయమైతే ఆ నేను ఆత్మ బ్రహ్మ.*
*రూప- గుణ- ధర్మా ల చే ఆనందించే అభ్యాసాన్ని పోగొట్టుకోవాలి.*
*రూప, గుణ, ధర్మాలచే వ్యవహరించాలి ఆనందానుభవాన్ని పొందకూడదు.*
నారద భక్తి సూత్రాలు -
చతుర్ధాధ్యాయం - సూత్రము - 63
🌻 63. స్తీ ధన నాస్తిక (వైరి) చరిత్రం న శ్రవణీయమ్ ॥| 🌻
పురుషులలో శృంగారం ఉదయించడానికి కారణ భూతమైన స్త్రీల కథలను వినరాదు. ఇంద్రియ భోగాలకు, వ్యసనాలకు ఆలవాలమైన ధనంతో ముడిపడిఉన్న విషయాలను వినరాదు. నాస్తికులతో వాదన చేయరాదు. ఈ మూడింటిని శత్రువులుగా చూడవలెను.
స్త్రీ విషయంగా దర్శనం, స్పర్శనం, కేళి, కీరనం, గుహ్యభాషణం, సంకల్పం, అధ్యవసాయం, క్రియానివృత్తి అని ఎనిమిది మైధున భావా లున్నాయి. స్త్రీ సంపర్కం చేయకున్నను పై ఎనిమిది వికారాల వలన మనసు చలించి భక్తిభావం విచ్చిన్న మవుతుంది. స్త్రీలపై తృష్ణ భోగ్యతా బుద్ధి విడనాడాలి. అట్లే స్త్రీలు కూడా పురుషుల యెడ ఈ విధమైన వికారాలు కలుగకుండా చూచుకోవాలి.
సమయం వృథా చేయకండి..!! 🌹🌹*
*ప్రతి రోజు ప్రాణులు నశించుట మనం చూస్తూనే ఉన్నాము. అయినా ప్రతి యొక్కరు తాము శాశ్వతమని భావిస్తుంటారు.*
*ప్రపంచంలో అదే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం తాను ఎంత కాలం జీవిస్తాడు అని ఎవరు చెప్పలేరు.*
*ముందటి రోజు చాలా ఆరోగ్యవంతుడిగా ఉన్న వ్యక్తి మరునాడు మరణించడం మనం చూస్తూనే ఉన్నాం.*
*ఇది వాస్తవం కాబట్టి, ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే చిత్తశుద్ధితో ధర్మాచరణకై కృషి చేయాలి. ఒక విషయాన్ని తరచుగా మనకు మనం జ్ఞాపకం చేసుకోవాలి.*
*ఓ మనసా! నీ ఇంద్రియాలన్నీ సక్రమముగా పనిచేస్తున్నప్పుడే పరమాత్మను సేవించాలి. కర్మేంద్రియాలు శక్తిని కోల్పోయినప్పుడు నీవు ఏమీ చేయలేవు.*
*వృద్ధాప్యం దాపురించిన పిదప నీవు దేవాలయానికి వెళ్లాలన్నా, ఉపవాసములు వుండాలన్నా అనుగ్రహ భాషణాలు వినాలన్నా ఓపిక ఉండదు.*
*అందువలన ఓపిక ఉన్న సమయంలోనే పరమాత్మను సేవిస్తూ ధర్మాచరణ కొనసాగించాలి. అలా కాకుండా అనవసరంగా మీన మేషాలను లెక్కపెడుతూ ధర్మాచరణను వృద్ధాప్యంలో చేయవచ్చని భావిస్తే ఏమీ సాధించకుండా జీవితాన్ని ముగిస్తాం.*
*కాబట్టి యౌవన దశలోనే భగవంతుని సేవను ధర్మాచరణను చిత్తశుద్ధితో ప్రారంభించాలి...*
*శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః*
*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments
Post a Comment