నేటి కథ
దరిద్రం, భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మని ఈ 32 నామాలతో పూజించండి.. అద్భుత ఫలితాలు పొందండి..
అర్ధంతో దుర్గాదేవి-ద్వాత్రింశన్నామావాళి..
దుర్గా దుర్గార్తి శమణీ, దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్చేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశినీ
దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహ
దుర్గమదేజ్ఞానదా, దుర్గ దైత్యలోకదవానలా
దుర్గమ, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణీ
దుర్గమార్గాప్రద, దుర్గమావిద్యా, దుర్గమాశ్రిత
దుర్గమజ్ఞానసంస్థాన, దుర్గమధ్యానభాసిని
దుర్గమోహ & దుర్గమగ, దుర్గమర్థస్వరూపిణీ
దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధదారిణీ
దుర్గమాంగీ, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరీ
దుర్గభీమా, దుర్గభామా, దుర్లభా, దుర్గధారిణీ..
ఇవి దుర్గాదేవి 32 నామాలు.
32 నామాలకు అర్ధం:
1.దుర్గా: భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి నీకు వందనం.
2.దుర్గార్తిశమణీ: కష్టాలను శమింపచేసేతల్లి నీకు వందనం.
3.దుర్గాపద్వినివారిణీ: ఆపదలను నివారించే తల్లీ నీకు వందనం.
4.దుర్గమచ్ఛేదినీ: కష్టాలను ఛేదించే తల్లీ నీకు వందనం.
5.దుర్గసాధినీ: దుర్గమమైనది సాధించే తల్లీ నీకు వందనం.
6.దుర్గనాశినీ: కష్టాలను నాశనం చేసే తల్లీ నీకు వందనం.
7.దుర్గతోద్దారిణీ: దుర్గాలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లీ నీకు వందనం.
8.దుర్గనిహంత్రీ: మనదెగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లీ నీకు వందనం.
9.దుర్గమాపహ: కష్టాలను వినాశనం చేసే తల్లీ నీకు వందనం.
10.దుర్గమదేజ్ఞానదా: రహస్యమైన ఆత్మజ్ఞానం లాంటి జ్ఞానాన్నిచ్చే తల్లీ నీకు వందనం.
11.దుర్గదైత్యలోకదవానలా: కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లీ నీకు వందనం.
12.దుర్గమ: అమ్మను సాధించడానికి ఆశక్యమైన తల్లీ నీకు వందనం(తేలికగా దర్శనం ఇవ్వని తల్లి).
13.దుర్గమాలోక: చర్మచక్షువులు,పంచేంద్రియాలతో చూడలేని తల్లీ నీకు వందనం.
14.దుర్గమాత్మస్వరూపిణీ: మనలోనే వసిస్తూ లభించడానికి సాధ్యం కాని ఆత్మస్వరూపమైన తల్లీ నీకు వందనం. అంటే మనలోపల ఉన్నా సరే మాటలలో వర్ణించలేని, కళ్ళతో చూడలేని, తెలుసుకోలేని తల్లి స్వరూపంమని అర్ధం
15.దుర్గమార్గాప్రదా: రహస్య మార్గానికి త్రోవచూపేతల్లీ నీకు వందనం.
16.దుర్గమవిద్యా: రహస్యమైన విద్యాస్వరూపమైన తల్లీ నీకు వందనం(శ్రీవిధ్యా స్వరూపం).
17.దుర్గమాశ్రిత: దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లీ నాకు వందనం (శ్రీచక్రం).
18.దుర్గమజ్ఞానసంస్థాన: అలవికాని జ్ఞానానికి సంస్థాన అంటే సాధ్యంకాని జ్ఞానానికి తల్లీ నీకు వందనం.
19.దుర్గమధ్యానభాసిని: ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాసించే తల్లీ నీకు వందనం.
20.దుర్గమోహ: ఆపదలను లాగేసే తల్లీ నీకు వందనం.
21.దుర్గమగ: కష్టాలను పరిష్కరించే తల్లీ నీకు వందనం.
22.దుర్గమార్థస్వరూపిణీ: ఈ పదానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి మనలోని చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి అని.. రెండోది దుర్గమమైన అర్ధాలుగల తల్లీ నీకు వందనం.
23.దుర్గమాసురసంహంత్రీ: దుర్గమాసురుడైన రాక్షసుడిని సంహరించిన తల్లీ నీకు వందనం.
24.దుర్గమాయుధదారిణీ: దుర్గమమైన ఆయుధాలను ధరించిన తల్లీ నీకు వందనం.
25.దుర్గమాంగీ: ఊహించలేని దివ్యమైన అంగాలు కల తల్లీ నీకు వందనం.
26.దుర్గమత: కల్మషాలను దూరం చేసే తల్లీ నీకు వందనం.
27.దుర్గమ్య: సాధించడానికి శక్యం కానీ తల్లీ నీకు వందనం.
28.దుర్గమేశ్వరి: విఘ్నాలకు అధినాయకురాలైన తల్లీ నీకు వందనం.
29.దుర్గభీమా: భీషణమైన పరాక్రమం కల తల్లీ నీకు వందనం.
30.దుర్గభామా: దుర్గ అనే స్త్రీ రూపం లోని తల్లీ నీకు వందనం.
31.దుర్గభా: ప్రకాశం గల తల్లీ నీకు వందనం.
32.దుర్గదారిణీ: రహస్యాన్ని ఛేదించే తల్లీ నీకు వందనం.
ఓం నమో దుర్గాయ నమః అంటూ ఈ 32నామాల దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళిని 108 సార్లు పారాయణం చేస్తే సర్వ దరిద్రాలు తొలగుతాయి అనేది పురాణాల కథనం.. భక్తుల నమ్మకం..
......
శ్రీ మాత్రే నమః....🙏
నేటి ఉషోదయ లఘు ప్రక్రియ.. ప్రాంజలి ప్రభ..18/3
*ధ్యానం అంటే
శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం అని
తలంపుకు తలంపుకు మధ్య ఉన్న పరతత్వం అని
*ధ్యానం అంటే
నోటిలోని మౌనం, మనస్సులోని శూన్యమని
స్థిరహృదయ స్పందన కలిగించు విధానమని
*ధ్యానం అంటే
శరీరాన్ని మరిచిపోతే - నిద్ర యని
మనస్సును మరిచిపోతే మగత యని
*మనిషి
నీళ్లలో మునిగితే - స్నానం యని
నీలో నువ్వు మునిగితే - ధ్యానం యని
*మనిషి
ఏమీ తినకుండా ఉండడం - ఉపవాసం యని
ఏ ఆలోచనలు లేకుండా ఉండడం - ధ్యానం యని
* ధ్యానం యొక్క
అంతిమ గమ్యం 'సాక్షి తత్వమే'.యని
మనసు ఎలా మొదలు పెడతావో అది నీ సమస్యయని
*ధ్యానం
మొదలైందా మనసుకు శాంతియని ..
ఇక సమస్యలన్నిటికీ అదే పరిహారం యని
*నాటకం
జీవుడికి ముగియడం - మరణం.అని
దేవుడికి ముగియడం- ప్రళయం. అని
*ఉన్నది ఒకే వస్తువు--
అది చలించడం చూచి, కొందరు 'శక్తి' అని
దానికి ఆశ్రయమైన అచలత్వాన్ని చూచి, మరికొందరు 'ఆత్మ' అని
*ప్రకృతి
కానరాని సుఘందాన్ని శరీరానికి అందిస్తుందని
శరీరంలోకి గాలి నీరు ద్వారా రక్త ప్రసారణిస్తుందని
*ప్రశ్నలకు
సమాధానమే కాదు ప్రశ్నించేదే ప్రశ్న అని
జవాబులోనే అందరికీ తెలుస్తుంది ప్రశ్న అని
*ఉదయం
వెలుగుల సంచార సూర్యుడు అని
బతుకును పండించి కార్య దక్షుడు అని
****
నాలో నీవు.. ఆంజనేయ..
*ఎక్కడ
అవిరామమైన అన్వేషణ, పరిపూర్ణతవైపు చేతులు చాస్తుందో,
పరిశుద్ధ జ్ఞాన వాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలో
ఇంకిపోదో,
*ఎక్కడ
మనస్సు నిర్భయంగా వుంటుందో,
న్యాయ ధర్మ సత్యాలు గతి తప్పక ఉంటుందో
*ఎక్కడ
మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,
సర్వము తానై నిత్యమూ జీవులకు సహాయ పడతాడో
*ఎక్కడ
విజ్ఞానం స్వేచ్ఛగా మనగలగుతుందో,
ప్రపంచం ముక్కముక్కలై మ్రగ్గిపోదో,
*ఎక్కడ
మాటలు అగాధమైన సత్యంనుంచి బాహిరిల్లుతవో,
ప్రేమ చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం వేంపర్లాడతావో
*నాలోని
లోభిత్వాన్ని, సంకుచితత్వాన్ని సమూలంగా నిర్మూలించు.
కష్టసుఖాలను తేలికగా భరించే శక్తి నాకు ప్రసాదించు.
నా ప్రేమను
నీ సేవలో ఫలప్రదం చేసుకునే శక్తిని నాకు యివ్వు.
నిరంతరం ధ్యానం చేసె వయసు నాకు యివ్వు
*పేదవారిని అనుగ్రహించు
తిరస్కరించకుండా, గౌరవించి సహాయ సహకార బలాన్ని
అధికార గర్వం ముందు తలవంచకుండా వుండే బలాన్ని
సగర్వంగా
తలయెత్తి రోజువారీ చిల్లర కష్టాలను చూచి నవ్వే తత్వాన్ని కలుగజేయి.
ప్రేమతో సర్వస్వాన్నీ, నీ ఇచ్ఛకు సమర్పించే శక్తి నాలో ప్రేరేపించు. కలగజేయి
* దీర్ఘ
యాత్ర చివరకు వచ్చిందని,
నాలో శక్తి అంతా నశించిందని,
నా ముందుత్రోవ కనిపించడం లేదని,
ప్రాధేయం అయిపోయిందని,
ఎక్కడికో వెళ్లి ఏకాంతంలో తలదాచుకునే సమయం వచ్చిందని
ఇచ్ఛ అనంతం.
పాతబడిన మాటల స్థానే కొత్తపాటలు నాలో
పాత బాటలు కనిపించకుండా చెరిగిపోయిన చోట నాలో
***
*శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర
కొండలరాయుడు నిలయము కొండ
మొక్కులు తీర్చగా మోక్షమిచ్చు కొండ
కట్టెదుర
వైకుంఠము కాణాచయినకొండ
తెట్టెలాయ మహిమలే తిరుమలకొండ
వేదములే
శిలలై వెలసినదికొండ
యేదెస పుణ్యరాసులే యేరులైనదికొండ
గాదిలి
బ్రహ్మాది లోకముల కొనలకొండ
శ్రీదేవుడుండేటి శేషాద్రి యీకొండ
సర్వదేవతలు
మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్విఁదపసులే
తరువులై నిలిచిన కొండ
పూర్వపు టంజనాద్రి యీపొడవాటి కొండ
వరముల
కొటారుగా ఎక్కణించి పెంచేకొండ
పరుగు లక్ష్మీకాంతు సోబనపుకొండ
కురిసి సంపదలెల్ల
గుహల నిండిన కొండ
విరివైన దిదివో శ్రీవేంకటపుకొండ
పదిలంబగు
అంతరంగమే పరమ వైకుంఠం. తిరుమల కొండ
పాపాలను హరించి మోక్ష మిచ్చె కొండ
* చక్కని
తల్లికి చాంగుభళా
తండ్రికి చాంగుభళా
*చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా
మక్కువ కళ్ళచూపులకు చాంగు భళా
*కులికెడి
మురిపెపు కుమ్మరింపు చాంగు భళా
తన సళుపు చూపులకు చాంగు భళా
*పలుకుల
సొలపుల పతితో కసరెడి చలముల యలుకకు చాంగుభళా
మలుపులు పతితో కలిగెడి సుఖముగ కదలిక చాంగుభళా
కిన్నెరతో
పతి కెలన నిలుచు తన చన్ను మెఱుగులకు చాంగుభళా ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుభళా .
*జందెపు ముత్యపు
సరుల హారముల చందన గంథిక చాంగుభళా
విం దైన వేంకట విభు పెనచిన తనసంది దండ్రులకు ఛాంగు భళా.
ఓం శ్రీ పద్మావతి వేంకటేశాయనమః
గోవిందా గోవిందా గోవిందా
***
సీసపద్యం : కొత్తకొత్త ఆశలతో
జీవితమే నిత్య జీవ విధిసమరం
జగతికి సూర్యుడే జయము నిచ్చు
కష్ట సుఖాలతో అమర పోరు కొమరం
కడలి అలల తీరు కలలు నిజము
ఆత్మ కలహ సత్య ఆశ దుమారము
ఆశ పల్లకి యమ ఆట భ్రమర
సమతలేను మమత సుకుమార చామరం
మనిషి మనుగడేను మాయ జయము
తే. చట్ర కొక్కేల తామరం సమర మేను
సంధ్య సంధి సమస్యల సృజన తీర్పు
విద్య వినయమ్ము వివరమ్ము విధిగ మార్పు
కష్ట సుఖము పంచుటే కళల ఓర్పు
.......
అంశం : కొత్తకొత్త ఆశలతో
సీస పద్యము
కొత్త కొత్త కళలు కోరు చిగుళ్లతో
దివ్వె వెలుగు నిచ్చు దిన యుగాది
మానవోన్నత చూపి మనసు ఇచ్చియు పుచ్చి
మానవాభ్యు దయము మంచి చేయు
మధుర వసంతాన్ని మానశో ల్లాశాన్ని
మచ్చలేనిమనిషి మమత పంచు
శుభ శుభాలతో సుఖ వత్సరముగాను
వెలిగించు జ్యోతులు విజయ మగుట
తే:నూతన ఉషస్సుల ఉగాది స్ఫూర్తి నిచ్చి
తెలుగు లోగిళ్లు సంబరం చిరునగవుతొ
సంస్కృతి భవిష్య వాణి నే చెప్ప గలుగు
శోభకృత్ నామ వత్సర శోభ ఇదియు
.....
మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

Comments
Post a Comment