శ్రీ భగవాన్ వాణి ----29 ---29 -01 -2023 to 31-01-2023
శ్రీ భగవాన్ వాణి ----29---
ఉన్నత చైతన్యం లేదా దేవుడు మనిషికి సంకల్ప స్వేచ్ఛను ఇచ్చాడు. కానీ మనిషి పెడదారిలో నడుస్తూ, చెడు పనులు చేస్తూ ఉండడం వల్ల చెడు స్పందనలు ఏర్పడతున్నాయి. ఆ చెడు స్పందనలను ప్రకృతి గ్రహిస్తుంది.
మనిషి ఉపచేతనాత్మక (sub consciousness mind ) మనస్సుని వినకుండా, పూర్తిగా ఆధ్యాత్మిక మార్గానికి దూరంగా వెళుతున్నాడు. అద్భుతమైన ప్రకృతి సమతుల్యాన్ని నాశనం చేస్తున్నాడు.
అందువల్ల ప్రకృతిలో ప్రతికూల శక్తి, చెడు స్పందనలు బాగా ఎక్కువవుతున్నాయి. ఇదంతా ఆధ్యాత్మిక లోపం వల్లనే, ప్రకృతికి మెరుగుపరచగల, నాశనం చేయగల సామర్ధ్యం ఉంది.
మనిషి యొక్క చెడు స్పందనలు వల్ల దృవాల స్థల మార్పు జరుగుతుంది. భౌతికంగా భూఅక్షం మారుతుంది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. భూకంపాలు, వరదలు, tornodos, అగ్నిపర్వతాలు బద్దలవడం, ఇవన్నీ ప్రకృతి మన ఆలోచనలు మారాలని మనకిచ్చే హెచ్చరికలు.
ఉదాహరణకు మన శరీరాన్ని భూమితో పోల్చవచ్చు. మన శరీరంలో, జలుబు, fever, వ్యాధుల ద్వారా మన శరీరం సమతుల్యస్థితికి చేరుకుంటుంది.
అలాగే ప్రకృతి ప్రకృతి వైపరిత్యాల ద్వారా సమతుల్యం పొందుతుంది. దైవదృష్టి అంతా పవిత్రంగా, ఉదారంగా, శాంతియుతంగా ఉండాలి. మనిషి సన్మార్గంలో నడవాలి.
ఎవరైయితే సన్మార్గంలో వుంటారో, ఎవరైతే ఉన్నత ఆవరణకు చేరి వుంటారో వారిని వారి స్పందనలు బట్టి ఆత్మలోక ఆత్మలు రక్షిస్తాయి.
ప్రపంచంలో 25% మాత్రమే బ్రతుకుతారు. కెనడా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలో కొన్ని ప్రదేశాలలో ప్రతికూల ఆలోచనలు తక్కువ ఉన్నాయి.
జల ప్రళయం, భూకంపంతో, ప్రపంచమంతా గొలుసుకట్టు ప్రతిస్పందనలు జరుగుతూ శుద్ధప్రక్రియ జరుగుతుంది.
శ్రీ భగవాన్ వాణి ----30---
మన స్ధూల సూక్ష్మ కారణ శరీరాలను 5 కోశాలుగా విభజించారు. అవే 1. అన్నమయ కోశం 2. ప్రాణమయ కోశం 3. మనోమయ కోశం 4. విజ్ఞానమయ కోశం 5. ఆనందమయ కోశం.
ఆత్మ యదార్ధంగా శుద్ధమైనది; అక్రియమైనది, శాశ్వతమైనది, ఆనందమయమైనది. అట్టి ఆత్మనే నేను. మరి శుద్ధమైన నేను కల్మషమైన వానిగా ఎందుకు అనిపిస్తున్నాను? అక్రియమైన నేను ఎందుకు పనులు చేస్తున్నట్లుగా ఉన్నాను? శాశ్వతమైన నేను ఎందుకు అనిత్యమైన వాడినని భావిస్తున్నాను? ఆనంద స్వరూపమైన నేను ఎందుకు దు:ఖపూరితుడుగా భావించబడుతున్నాను? ఎందుకిలా జరుగుతున్నది? ఇదంతా అనాత్మ సంబంధంవల్లనే. కల్మషమైన, క్రియాత్మకమైన, అనిత్యమైన, దు:ఖపూరితమైన అనాత్మ తాదాత్మ్యం వల్లనే; దేహ తాదాత్మ్యం వల్లనే; -పంచకోశ తాదాత్మ్యం వల్లనే - దీనినే ఉపమాన సహితంగా తెలియజేస్తున్నారు.
శుద్ధమైన స్వచ్ఛమైన స్పటికాన్ని నీలంరంగు గల వస్త్రంపై ఉంచితే ఆ స్పటికం నీలం రంగులో కనిపిస్తుంది. దానిని అక్కడ నుండి తీసి ఎరుపు వస్త్రంపై ఉంచితే ఆ స్పటికం ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇంతకీ ఈ రంగులు వస్త్రాలకు చెందినవే గాని స్పటికానికి చెందినవి కావు. స్పటికం నీలం రంగులో కనిపించినప్పుడు కూడా, అది స్వచ్ఛమైనదే. ఎరుపు రంగులో కనిపించినప్పుడు కూడా అది రంగు లేనిదే. అలాగే పంచకోశాల తాదాత్మ్యం వల్లనే శుద్ధమైన ఆత్మ పంచాకోశ లక్షణాలతో ఉన్నట్లే కనిపిస్తుంది. పుట్టుకగాని, పెరుగుదలగాని, చావుగాని లేని ఆత్మ పుట్టుక, పెరుగుదల, చావు ఉన్న దేహంతో తాదాత్మ్యం వల్ల అలా అనిపిస్తున్నది. దు:ఖం లేని ఆత్మ దు:ఖ స్వరూపమైన మనస్సుతో కూడి దు:ఖమయంగా అనిపిస్తుంది. ఇలాగే పంచ కోశాల ధర్మాలన్నీ ఆత్మపై ఆరోపించబడుతున్నాయి. భ్రాంతిని కలిగించి శాంతిని దూరం చేస్తున్నాయి. మరేం చేయాలి? పంచ కోశాలను దూరం చేసి చూసినప్పుడు ఆత్మ స్వచ్ఛంగా ఉంటుంది. అట్టి స్వచ్ఛమైన ఆత్మనే నేను గాని ఈ పంచకోశాలు నేను గాను.
( i ) కొంత కాలం మాత్రం జీవించి, అనేక మార్పులు చెంది, చివరకు నశించి పోయే ఈ అన్నమయ కోశం (జడ శరీరం) నేనుకాదు. ఇది నా కన్నా వేరుగా ఉన్నది. నేను ఆత్మను
( ii ) ఆత్మనైన నా తేజంతో-చైతన్యంతో కదిలే ప్రాణమయ కోశం (ప్రాణాలు) నేనుకాదు. అవి నా కన్నా వేరైనవి. నేను శుద్ధ చైతన్యమైన ఆత్మను.
( iii ) అన్ని అవస్ధలలోను కనిపించక, దృశ్యంలా కనిపిస్తూ, మార్పులు చెందుతూ సుఖదు:ఖాలు అనుభవించే మనోమయ కోశం (మనస్సు) నేనుకాదు. నేను ఆత్మను.
( iv ) ఏవేవో కోరికలతో ఆలోచనలు చేస్తూ, ద్వంద్వాల మధ్య చెదిరిపోతూ, సర్వజ్ఞత్వం లోపించిన విజ్ఞానమయ కోశం (బుద్ధి) నేనుకాదు. నేను ఆ బుద్ధికి వెనుకనున్న ఆత్మను.
( v ) అజ్ఞానంలో ఉండి, ఏ విషయ జ్ఞానమూ లేని స్ధితిలో, దు:ఖరహిత స్ధితిలో ఉండే ఆనందమయ కోశం నేనుకాదు. నేను ఆ కోశానికి వెనుక నున్న ఆత్మను.
శ్రీ భగవాన్ వాణి ----31---
--(())--
మనం ఏది కామో అదిగా మనల్ని జనులు భావించాలని మన శక్తిని వెచ్చిస్తాం. ఆ శక్తిని మనం ఎలా ఉండాలనుకొంటున్నామో దానికోసం వినియోగించడం ఉత్తమం.
మన ప్రస్తుత స్థితికి మనమే బాధ్యులం. ఏం కాగోరతామో ఆ విధంగా అవడానికి మనకు శక్తి ఉంది. మన వర్తమాన స్థితి పూర్వకర్మల ఫలితమైతే మనం పొందగోరే స్థితి ప్రస్తుత కర్మల ఫలితంగా పొందవచ్చునని నిశ్చయమౌతుంది. కాబట్టి ఎలా ప్రవర్తించాలో మనం తెలుసుకోవాలి.
జీవునకు వెలుపల కనిపించే వస్తు సామాగ్రి భౌతికములు. లోపల అనిపించే సుఖములు, దుఃఖములు భౌతికములు కావు. ఇవి రెండును తన కన్న వేరుగా తోచుచుండును. యోగసాధనచే ఆత్మను ఈ రెండింటి యందును దర్శించువానికి సమస్తము తన అంతర్యామిత్వముగా తెలియును.
_*ఉన్నదున్నట్లు అర్థంకావడం ప్రమ.. అలా కనిపించకపోతే అది భ్రమ !!*_
_*సాధన అంటే ఏదో సాధించి పెట్టేది కాదు. అడ్డుగా ఉన్నదాన్ని తొలిగించేది. ఈ సత్యం గమనించకుండా మనసుకు ఏదో సాధించి పెట్టాలని చేసే సాధనలన్నీ లౌకికమైన క్రియాకలాపాలతో సమానం అవుతాయి. ద్వైతాద్వైతభావంలేని ఆత్మకు ఎదుటివారు మూర్ఖుడిగానూ, బద్ధుడిగానూ.. కనిపించరు. అలా కనిపిస్తే ఇక సిద్ధి, సాధనలకు తాను బద్ధుడు అవుతాడు. ప్రమ అంటే యథార్థ జ్ఞానం. ఉన్నది ఉన్నట్లుగా అర్థం కావడం ప్రమ. అలా కనిపించకపోతే అది భ్రమ. తాను ఆత్మస్వరూపుడనని తెలియడం, ఈ సృష్టిలో జరిగే ప్రతి క్రియాకలాపం ఈశ్వరాధీనం అని గుర్తించడం ప్రమ. మనసులో ప్రేమ... దృష్టిలో ప్రమ... ఇదే సాధన !*_--(())--
Comments
Post a Comment