శ్రీ భగవాన్ వాణి -------15 -01 -2023 to 21-01-2023


శ్రీ భగవాన్ వాణి ----15 ---15 -01 -2023

*భగవంతునిపై విశ్వాసాన్ని కలిగి ఉండటం అన్నిటికన్నా ముఖ్యం.

*అపార విశ్వాసం, అనంత శక్తి - ఇవే విజయసాధనకు మార్గాలు.

*ఒక్కోసారి మన లక్ష్యం దూరంగా, దుర్లభమైనదిగా ఉన్నట్లు భావన కలుగుతూ ఉంటుంది. ఇటువంటి సమయంలోనే ఓర్పుని, ధైర్యాన్ని చూపించాలి. ఎవరైతే ధీరత్వాన్ని, అచంచల భక్తిని తమ ఆదర్శం పట్ల చూపగలరో వారు తప్పక విజయులు అవుతారు.

*అంధకారం నుండి మానవులు వెలుగులోకి రావాలి. పవిత్రులై ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తూ విద్యావంతులు అవ్వాలి అప్పుడే లోకం నుండి దుఃఖం నిష్క్రమిస్తుంది అందుకు మరో మార్గం లేదు.

*సాధారణ బాధ్యతలను, ధర్మాలను నిర్వర్తిస్తూనే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చు. ప్రతీ కార్యమూ విశేషమైనదే అని తలస్తూ మన దారిలో ఉన్న పనులను చక్కబెడితే అదే ఆశీర్వాదమై భాసిస్తుంది.

*సజీవ దైవాన్ని సేవించండి! దేవుడు గుడ్డివాడుగా కుంటివాడుగా, దరిద్రుడుగా, బలహీనుడుగా, పాపిష్టిగా మీ వద్దకు వస్తున్నాడు.

భగవంతుని కొరకూ, ఆయన వారసులైన సమస్త ప్రజలు నా వారే కనుక వారి కొరకూ పనులు చేస్తున్నామనుకుంటే అంతకు మించిన ఆనందం ఏమి ఉండగలదు.

*సుఖ, దుఃఖాలు రెండూ బంధాన్ని, బానిసత్వాన్నే కలిగిస్తాయి-బంధించిన గొలుసు బంగారమైనా, ఇనుమైనా అది బంధనాన్నే కలిగిస్తుంది కదా!
*విజ్ఞాన కవాటాలను అందరికి తెరచివుంది. తాడిత పీడితులకు చేయూత ఒసగి, వారికి న్యాయంగా  చేకూరవలసిన హక్కులను, అధికారాలను అందించండి.
శుభంభూయాత్

శ్రీ భగవాన్ వాణి ----16 ---16 -01 -2023

             *నేను జీవితంలో విజయం సాధించాను అనుకుంటే పోరపాటే, మనషి ఒక్క గెలుపుతో ఎప్పుడు సరిపెట్టుకోడు.  అందుకే అసలైన గెలుపు సంతృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే లభిస్తుంది.

            *నిజాయితీ గల  స్నేహితుడు తోడుంటే ఆ స్నేహితుడు  వందమంది బంధువులతో   సమానం.

            *జాగృతి మేల్కొలుపు స్థితిని లేదా చైతన్యం  యొక్క సక్రియమైన సాధారణ క్రియాశీల దశను సూచిస్తుంది 

            *స్వప్న అంటే కల. వికల్పం అంతర్గత అవగాహనను సూచిస్తుంది. బాహ్య అవగాహన ఇంద్రియాల ద్వారా జరుగుతుంది మరియు అంతర్గత అవగాహన మనస్సు ద్వారా జరుగుతుంది 

                 *జ్ఞానాన్ని మనం సంపాదించనక్కర్లేదు.  అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు అంతా మంచే జరుగుతుంది

             *వివేక అంటే విచక్షణ. అవివేకా అంటే విచక్షణ లేకపోవడం. మాయ అంటే భ్రమ. సుషుప్తి అంటే గాఢ ​​నిద్ర. గాఢనిద్ర లేదా మాయలో విచక్షణ లేకపోవడం సహజంగా జరుగుతుంది 

             *నువ్వు నమ్మిన వారు నిన్ను మోసం చేసినా, నిన్ను నమ్మిన వారిని నీవు మోసం చేయకు. ఎందుకంటే నువ్వు మోసం చేసేది మనుషుల్ని కాదు వారు నీపై పెట్టుకున్న నమ్మకాలని.

              *మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు,  కోపంతో గుణవంతుడు కాలేడు. కానీ మంచి తనంతో మంచి వాడు కాగలడు.


శ్రీ భగవాన్ వాణి ----17 ---17 -01 -2023

*మనం భూమితోను, ప్రకృతితోను సంబంధం కోల్పోయామా? విశ్వానికి సహజంగా ఉన్న ఆవృత్తులతోనూ, మానవ వ్యవస్థతోను మానవ జాతి ఎలా సమన్వయం సాధించగలదన్న ప్రశ్నకు సద్గురు జవాబు చెప్తున్నారు.

*ఒక జీవితకాలంలో మీరు దీనిగురించి తెలుసుకోవాలనుకుంటే అది చాలా కష్టమైన పని. కాని ప్రజలు తమ శరీరంలో ఎంతలోతుగా చిక్కుకుపోయి ఉన్నారంటే వాళలు శరీరాన్ని సాధనంగా చూడలేనంతగా. 

*శరీరంతో వారి అనుబంధం, గుర్తింపు ఎంత లోతుగా ఉన్నాయంటే వాళలు దీన్ని ‘నేను’ గానే చూడడం కొనసాగి స్తున్నారు. ఈ శరీరాన్ని మీరు ‘నేను’గా చూసిన క్షణంలోనే దానికి బోలెడంత భావోద్వేగం జోడింప బడుతుంది. ఇక మనం దాన్ని సాధనంగా ఉపయోగించలేం.

*యోగాలో భూత శుద్ధి ప్రక్రియ అంతా ఇదే - పంచభూతాలనుండి విముక్తం కావడమే. మీరు ప్రభావవం తంగా మీకూ, పంచభూతాలకూ మధ్య దూరాన్ని సృష్ట…

* బంధింపబడుటలో, అనగా జీవుడుగా అస్తిత్వమందుటలో సుఖము అలవడవలెను. ఆ సుఖము తెలియుటకు జ్ఞానమునందు ఇచ్ఛ కలుగవలెను. ఇట్లు జ్ఞాన సుఖములను జమిలిగా పేనుకొనిన నిర్మల ప్రకాశరూపమగు గుణమే సత్త్వము.

* గర్భ నిబంధనము నందు కర్మము లేక వ్యాపారము జరుగవలెను. దానికగు క్రియాశక్తియే తృష్ణారూపమున పెనవేసుకుని రజోగుణము ఉద్భవించును. ఇందు రాగము, అనురాగము ఇమిడియుండును.

* దేహధారణకు భౌతికత్వమావశ్యకము. జ్ఞానమునకు నిద్రా స్థితియే ద్రవ్యత్వము లేక భౌతికత్వము. దీనితో పెనగొని తమోగుణముద్భవించును. ఉన్న స్థితికి కట్టుబడియుండుట, అపరిమితము పరిమితముగా భాసించుట దీనికి ఆవశ్యకము. కనుక అలసత్వము (నిర్లక్ష్యము), పొరబడుట (అపరిమితము పరిమితముగా నమ్ముట), మోహము దీనియందు ఇమిడి ఉండును.

(((***)))

శ్రీ భగవాన్ వాణి...18..18-01-1022

*మనిషి తన జీవితాన్ని కలల ఇసుకతో కట్టుకుంటాడు. కాబట్టే వ్యక్తి ఏం చేసినా ప్రతిదీ నిష్పలమవుతుంది. అన్ని ఇళ్ళు కూలిపోతాయి. దాని పునాదులు శాశ్వతత్వంలో వుండవు. క్షణికమయిన దాంట్లో వుంటాయి. ఒక ఇసుక భవనం కూలిపోతే వ్యక్తి మరొక దాన్ని నిర్మిస్తాడు. ఒక కల మాయమైతే మరొక కల కంటాడు.

తలమేల కులమేల తప్పులేల జగతి

కళ లేల గోల లేల కంపు లేల జగతి

విలలాప సఖ్య లేల వింత లేల జగతి

అలలాయె కలలాయె ఒప్పు లేల జగతి

 ఒక కోరిక నెరవేరకుంటే యింకొక కోరికలోకి దూకుతాడు. ఆ కాంక్ష వైఫల్య పునాదిగా వున్నదని గుర్తించం. కోరిక అంటే సమస్తానికి వ్యతిరేకంగా సాగడం. అది అసాధ్యమైన లక్ష్యం. అది వీలుపడదు. కోరిక లేకపోవడమంటే అనంతంతో బాటు ఆహ్లాదంగా గడపడం, దాంతో సాగడం, అంటే సొంత కోరిక లేకపోవడం.*

*మనసు మనుగడ తిరగలి మమతల లోగిలి కౌగిలి

వయసు ఉరకలు ఉరవడి వలపుల ఆకలి కౌగిలి

సొగసు మెరుపుల తలథల మలుపుల జాబిలి కౌగిలి

కలసు మతి గతి పరువము తడి పొడి ఓ కలి కౌగిలి*

*సొంత కోరిక లేకపోవడమంటే, సమస్తమూ ఏమి కాంక్షిస్తుందో అదే నా కాంక్ష నా వ్యక్తిగతమయిన లక్ష్యమంటూ ఏదీ లేదు అని అర్థం. మనం అస్తిత్వమంటే మనలో భాగమని వినడానికి అలవాటు పడ్డాం. మనం సముద్రపు అలలం. మనకు వ్యక్తిగత లక్ష్యాలు లేవు. ధ్యానమంటే మనకు ప్రత్యేకమయిన వునికి లేదని మనం గుర్తించడం మనం ద్వీపాలం కామని తెలుసుకోవడం. మనం  అనంత ఖండంలో భాగాలం. దాన్ని దేవుడను, సత్యమను, అంతమమను, కేవలమను, నీ యిష్టమొచ్చిన పేరు పెట్టుకో!*

*సశేషం ...*


శ్రీ భగవాన్ వాణి ----19 ---18 -01 -2023

 యేకాగ్రత :: మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

        ప్రాణుల దేశంలో  కోటాను కోట్ల జీవ కణాలతో ఏర్పడింది. ప్రతి జీవకణానకి ఆత్మ, మనస్సులో మేధస్సు ఉంటాయి. అన్ని వ్యక్తి గత లక్షణం. బుధ్ధితో మనసు కలిసి సామూహిక0గా మారి ప్రాణుల సంకల్పశక్తి, ఊహాశక్తి కి అనుగుణంగా స్పందిస్తాయి. ఇవి ప్రేమ, ప్రకృతి, కాలానుగుణంగా  మారుతాయి. 

        కొన్ని సంవత్సరాల తరబడి ఒక వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతున్నట్లైతే ఆ వ్యక్తి ఆ వ్యాధి నయ మవ్వాలని, అహం చేరకుండా ఓర్పుతో వైద్యుడు తెలిపినట్లు నమ్మకమనే ఏకాగ్రత  సంకల్పిస్తే అతను ఆ వ్యాధి నాయమైనట్లు, దేహం ఆరోగ్యంగా ఉన్నట్లు అతను ఊహాశక్తితో కలలు కంటే, తక్షణమే దేహంలోని జీవకణాల సామూహికం దానికి స్పందించి దేహంలో సరికొత్త జీవరసాయనాలు, విద్యుదయస్కాంత శక్తి విడుదలై ఆ వ్యాధి నయం చేయబడుతుంది.

        ఊహాశక్తి, ఏకాగ్రత తో ఆశయాలు,భయాలు,సంకల్పాలు,ద్వారా విద్యుదయస్కాంత శక్తిని మెదడు సంగ్రహించి మనస్సు కి చేరవేస్తుంది.

         దేహం మరణించిన వెంటనే  మెదడు పంచభూతాలలో కలిసిపోతుంది. బత్కునీడలో వున్న వారి కొంత మనసు వికల్పమై కాలంతో ప్రేమ తగ్గిపోతుంది 

🌹 🌹 🌹 🌹 🌹


#freetoedit #mahadev #shiv

శ్రీ భగవాన్ వాణి ----20 ---20 -01 -2023 
  రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ                  

భూమి మీదపడ్డ ప్రతి ప్రాణి, ఏదో విధముగా బతకగలదు. కానీ ఈ విధంగానే బతకాలని ఆలోచనలే మనిషిని బతక నివ్వదు. కోరికల పుట్టతో దారులే అగమ్య గోచరం 
.      
 పక్షి రెక్కలతో గుడ్డును పొదిగి రక్షించినట్లు ఈశ్వరుడు రక్షిస్తాడు. అయితే, మనం హృదయ పూర్వకంగా నమ్మాలి.

ఈశ్వరుడు శరీరాదుల యందు అంతర్యామియై యుండి కూడ దాని ప్రకృతి లక్షణములతో అంటు పడడు. 

నగలలో నున్న బంగారము ఆభరణము యొక్క ఆకారము , పేరు మొదలగు వానిని అంటించుకొనదు. అందుండియు బంగారముగనే యుండును, మట్టి బొమ్మలతో ఉండేది మట్టే, అట్లాగే వస్త్రాలలో ఉండేది దూదే.    . 

అట్లే భగవంతుడు జీవులలో జీవుడై విహరించుచుండియు జీవిత్వమంటించు కొనక , దేవుడుగనే యుండును.

గురువు రూపాన గాని, తల్లితండ్రుల రూపాన గాని, స్త్రీ/ భార్య రూపానగాని ప్రతిఒక్కరింట   
కొంత విద్యా సంపద వెలుగు కమ్మివుంటుంది అదే శివదృష్టి. 
 .  
      గురువు (ఉద్యోగం) వెతుక్కుంటూ మన వద్దకు వస్తుంది  కాకుంటే ఎలాగో తన వద్దకు రప్పించుకుంటాడు. ఆ గురువు మనల్ని ఎప్పుడూ ఒక కంట కనిపెట్టే ఉంటాడు. ఈశ్వరుడు, గురువును మనకు చూపుతాడు.

      తన బిడ్డ క్షేమం తండ్రి కంటే విచారించేవారు ఎవరు? ఆయన ( ఈశ్వరుడు , గురువు ) సదా మన చుట్టూ ఆవరించే ఉన్నాడు.

ఈశ్వరతత్వాన్ని అర్ధం చేసుకోవటం ఎవరివల్లాకాదు, ఒక్క ఆ అమ్మవారికి తప్పా, అలాగే  ఏకాగ్రత గలవాని వాక్కు ఏ పరిస్థితిలో తప్పని సత్యం ఇది కూడా ఈశ్వర సంకల్పమే    

--(())--



శ్రీ భగవాన్ వాణి ----21 ---21 -01 -2023 - ఏకాగ్రత 2 )
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

చేతులు చేతులు కలిపితే వేడి పుట్టు, రాయి రాయి రాపిడితో నిప్పు పుట్టు, మాట మాటలతో మనసులో మంట పుట్టు, కళ్ళు కళ్ళ చూపులతో ఆకర్షణ పుట్టు. 
    
అడవిలో వెదురుబొంగులు ఒకదానికొకటి రాచుకొని నిప్పు పుట్టును. దానితో వెదుర్లు అంటుకొనును. ఇట్లు రగిలిన కారుచిచ్చునకు మరల గాలియే తోడగును. దానితో వనమంతయు మండిపోవును.

అదే విధముగ భూమికి బరువైన లోకభీకర లక్షణములతో  నాయకులు సంపదలు పెంచుకొని మాయమాటలతో, నమ్మకద్రోహంతో ప్రజలను బాధ పెట్టుచుండిరి.

అప్పుడు భగవంతుడు వారిలోని కామక్రోధములైన అసుర లక్షణములనే కదలించి వారి నడుమ యుద్ధప్రేమ పుట్టించెను.

యుద్ధమున సారథియై పనిచేసి వారందరిని నంతము చేసి భూభారము తొలగించెను.

యుక్తా యుక్త వయస్సును లెక్క చేయకుండా పాప ప్రక్షాలనను కనివిని ఎరగని విధముగా ఎక్కువమంది వ్యసనాలకు లోబడినవారు, నమ్మకద్రోహులు, దైవాన్ని దూషించేవారు రోగము లతో భూమి భారాన్ని తగ్గించు కొన్ని మార్గాలు విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి.    

ఆనాడు దుర్మార్గులను శిష్టించేందుకు కృష్ణుడు సారధి వహించాడు. ఈ నాడు ఏకాగ్రతతో  అపరమాత్మునిని  ప్రార్ధనలతో రక్షణ కల్పించే శక్తి ఏర్పడుతుంది ప్రతి ఒక్కరిలో  .   

🌹 🌹 🌹 🌹 🌹

Comments

Post a Comment

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ