"శ్రీ భగవాన్ వాణి" 08 -01 -2023 to 014-01-2023
ధనం కాదు, కీర్తి ప్రతిష్టలు కాదు, విద్వత్తు (పాండిత్యం) కాదు, సౌశీల్యమొక్కటే కష్టాలనే దుర్భేద్యమైన అడ్డుగోడలను చీల్చుకొని పోగలిగినది. దీనిని జ్ఞప్తి లో ఉంచుకోండి.
నేటి తరం వారిపై, ఆధునిక యువత పైనే నాకు విశ్వాసం. వారి నుండే నా కార్యనిర్వాహకులు రాగలరు. సింహాల వలె వారు సమస్యలన్నింటిని పరిష్కరిస్తారు.
మనిషికి సహాయం అంటూ ఏదీ లేదు. ఇంతకు ముందు ఎన్నడూ లేదు, ఇప్పడూ లేదు, ఇకపై ఉండదు. నీవు అనంత శక్తి సమన్వితుడవు, నీలోని శక్తి ద్వారానే నీ కప్టాల నుండి బయటపడాలి. నిన్ను నీవే రక్షించుకోవాలి. నీకు సహాయం చేసే వారెవరూ ఎన్నడూ లేరు. అలా ఉన్నారని భావించడం ఒక మధురభ్రాంతి. దీని వలన ఏ మేలూ ఒనగూరదు.
భగవంతుని వైపు వెళ్ళేలా చేసే ఏ కార్యమైనా సత్కార్యమే. అదే మన ధర్మం; మనల్ని అధోగతికి చేరేలా చేసే ఏ కార్యమైనా దుష్కార్యమే, అది మన ధర్మం కానే కాదు
లేచి నిలబడు, ధైర్యంగా బలిష్టంగా ఉండు. మొత్తం భాద్యతనంతా నీ భుజస్కంధాల మీదనే వేసుకో. నీ భవిష్యత్తుకు నీవే భాద్యుడవని తెలుసుకో. నీకు కావలసిన బలం , శక్తి... అన్నీ నీలోనే ఉన్నాయి.
.......
"శ్రీ భగవాన్ వాణి" ..... ....... 08 ..........08 -01 -2023
(శ్రీమద్భగవద్గీతా మకరంద మాధార అంతర్గత ఆధ్యాత్మిక సందర్భ సమస్య పరిష్కార సూక్తుల కధా ప్రవచనము ) -1(మొదటి అధ్యాయము )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
*ఆత్మవికాశానికి స్ఫూర్తిదాయక ఆలోచనలు*.
పుణ్య కర్మలన్నింటిలోనూ, శ్రేయస్సు కలిగించే వాటిలోనూ, మరియు అన్ని యజ్ఞాల్లోనూ జపయజ్ఞం ఉత్తమోత్తమమైనది. అలాగే తల్లి, తండ్రి, గురువు, కట్టుకున్న భార్య చెప్పే మాటలు ఏంతొ ఉన్నతమైనవి కానీ ఆలోచన, అనుకరణ, ఆచరణ, ఆదర్శమా అనాదర్శమా ఆటుపోటులా, నిర్ణయాల నిర్ధారణ, నీ ఓర్పు బట్టే ఉంటుంది. అది తెలుసుకొని నడిచినవాడు నిత్యధన్యముడు, ధీరుడుతో సమానం అర్జునా.
"ఈరోజు మంచిది కాదు అని తలచి రేపు చేద్దామని అనుకోవటం ఎప్పటికి మంచిది కాదు. మంచి చెడులు చూడటం కన్నా లక్ష్య సాధనకు కృషిలో మంచి కనబడుతుంది అని గ్రహించాలి అదేమన్నా బ్రతుకు దరి అని గుర్తించాలి."
*మనం మననం చేసే విషయం పవిత్రమైతే మరింత ఫలితం సిద్ధిస్తుంది. పదే పదే మననం చేయడం వల్ల అదే ధైర్యంగా మారి మంత్రమౌతుంది*.
*పార్ధా ! మృత్యువు అనివార్యమైనపుడు, రాళ్ళు రప్పల్లాగా పడి ఉండటంకంటే ధీరులుగా మరణించటం మేలు కాదా? ఈ అశాశ్వతమైన ప్రపంచంలో ఇంకా ఒకటి రెండు రోజులు ఎక్కువ బ్రతికి ప్రయోజనమే ముంది? తుప్పపట్టేకంటే, ఈషణ్మాత్రమైనా పరులకు మేలు చేయటంలో అరిగిపోవటం మంచిది*.
"నిజాయితి బ్రతుకులో ఉన్న తృప్తి మరి ఎక్కడ కనబడదని గ్రహించాలి (గీత - 28 నుండి 35)"
(((****))))
సశేషము
"శ్రీ భగవాన్ వాణి" ..... ....... 09 ..........09 -01 -2023
(శ్రీమద్భగవద్గీతా మకరంద మాధార అంతర్గత ఆధ్యాత్మిక సందర్భ సమస్య పరిష్కార సూక్తుల కధా ప్రవచనము ) -1(మొదటి అధ్యాయము )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
"ఇచట ప్రవచింపదగిన దేమున్నది? ప్రవచింపరాని దేమున్నది? చేయదగిన దేమున్నది? చేయగూడని దేమున్నది? అంతయును బ్రహ్మమే ! చంపెడివాడవు నీవు కాదు, చంపడేది వారు కాదు, వారు చేసిన కర్మల వళ్ళ భూమి రుణ తీర్చుకుంటారు"
"చదువదగిన దేమిటి? చదువరాని దేమిటి? సేవింపదగిన దేమిటి? సేవింపరాని దేమిటి? సర్పమును బ్రహ్మమే. (అంతయును బ్రహ్మముగా నెవనికి భాసింపుచున్నదో వానికి విధి నిషేధము లుండవు). నీ ఎన్ని చదివినా ఉదరము నింపుకొనుటకే, చదవరానిది శృంగారమనుకున్న విధి ఆటకు తోడు అదే, సేవించినా, సేవింపక పోయినా నీ లక్షయం మారకుండా ఉంటె మన:శాంతి ఉంటుంది అర్జునా "
"తెలియ దగిన దేమిటి? తెలియరాని దేమిటి? తిన దిగిన దేమిటి! తినరానిదేమిటి? అంతటను బ్రహ్మమే నిండి యున్నది! అసలు నీకు ఎందుకు తెలియాలి, నీకు తెలియకుండా గాలి చేరి నీలో హృదయం స్పందిస్తుంది, ఆడదాని మనసు తెలియకపోతే ఏమి నిన్ను సుఖపెడుతున్నదికదా అది చాలదా, నీవు ఇది తినవచ్చు ఇది తినకూడదని
'అనుకోవడటం దేనికి నాలుక ఉంది కదా ఇష్టమైతే కొంతు లోనుండి ఉదారంలోకి పంపుతున్నది తినే తిండిని నీవు నిమిత్త మాత్రుడవు"
"చేయవలసినదొక్కటే! అన్ని వేళల యందును - అన్ని చోటులయందును ముక్తి కారణమైన 'హంస ధ్యానము - హంస ధ్యాన మొక్కటియే' అచరింప వలెను.
*హంస ధ్యానము :- గాలిని లోనికి బీల్చుచు 'సో ' అను అక్షరమును - విడుచుచు 'హం' అను అక్షరమును అనుసంధానము చేయవలెను.
'అనుసంధానము = శ్వాసగమనంలో .... ఉచ్వాసకు 'సో ' అను అక్షరమును, నిశ్వాసకు 'హం' అను అక్షరమును భావించుట. ఇదియే హంస ధ్యానము. ఇది బ్రహ్మానుభవమును గలిగించు ప్రక్రియ. వివరములకు 'సూత సంహితను పరిశీలించునది.
సర్వమును బ్రహ్మమే!
*"గౌరవం" అనేది ధనము, బంగారం, ఇచ్చి కొనుక్కోవడానికి అదేమీ అంగట్లోదొరికే సరుకు కాదు! అందుకు వయసు ఒకటే సరిపోదు!! గౌరవాన్ని కేవలం తన గుణ గణాలతో మాత్రమే సంపాదించుకోగలం, నీ ప్రవర్తన, పరివర్తన, సహాయ సహకారాలే మనసున మనిషిగా గుర్తించగలుగుతాయి !!*
"అవసర మనుకున్నప్పుడు ఆత్మబంధువులు, కన్నబిడ్డలు, ధర్మము తప్పారని తెలిసినప్పుడు తనవారు అయినను సరే భాధ పెట్టక తప్పదు. అధర్మాన్ని అనచడమే మానవ సంకల్పము, దాన్ని సక్రమ మార్గమును తెచ్చుటకు చేయాలి నిత్య కృషి" .
*నమ్మకం అనేది తేటనీరులాంటిది, తగినకొద్దీ తియాయిగా స్నేహంలో ఉంది. ఇది మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటే సమానమైన ధర్మాన్ని అనుకరించగలము, సమాజాన్ని నిలబెట్టుటకు మన వంతుకృషిచేయగలము పార్ధా *
(((****))))
సశేషము
"శ్రీ భగవాన్ వాణి" ..... ....... 10 ..........10 -01 -2023
*సమాజంలో అందరిదీ ఒకే రీతి జీవిత గమనం కాదు. కొందరు భాగ్యవంతులు, మరికొందరివి దైన్యమైన జీవన పరిస్థితులు. ఎందరో వారిలోని సామర్థ్యాన్ని సహజ ప్రతిభలను వృద్ధి చేసుకునే అవకాశమూ ఆలోచనా లేనివారు. వీళ్లంతా సంతోషంగా బతుకుతున్నారా అంటే, కచ్చితంగా ఔనని చెప్పలేం.*
*ఆనందం మనసుకు సంబంధించింది.అదేమీ ఎండమావి కాదు. ఆనంద స్థితిని అందుకోవడం కష్టతరం కాదు. ఎందుకంటే సంపదలకు, లేమికి అతీతమైంది ఆనందం. కొన్నిసార్లు బండి లాగేవాడిలో కనపడే ఆనందం సొంత కారు నడిపేవాడిలో కనిపించకపోవచ్చు.*
*సంతోషం లేని సంపదలు విషతుల్యమైన రసభరిత ఫలాల్లాంటివని కౌటిల్యుడు రాజనీతి శాస్త్రంలో చెబుతాడు. మనలో చైతన్యం ఉంటే సంతోషం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కష్టసుఖాల మధ్య తేడా గమనించని వ్యక్తి మనసు సదా నిర్మలంగా ఉంటుంది. నిర్మల హృదయం గలవాడు ఆనందంగా ఉంటాడు. ఆనందం వేరెక్కడో దొరికే వస్తువు కాదు. మనలోని చైతన్యమే ఆనందం!*
*ఏది ఉన్నా లేకున్నా, అసంతృప్తితో జీవించేవాడికి ఆనందం అందని ద్రాక్ష లాంటిదే. జీవన మార్గంలో ఎంత వేగిరపడినా అందరికీ అన్నీ అందవు. దేనికైనా కొన్ని పరిమితులుంటాయని గమనించాలి. ఈ హద్దులను గుర్తించలేకపోతే నిరాశ, నిస్పృహ తప్పవు. మనిషికి దుఃఖం ఇక్కడే ప్రారంభమవుతుంది. ఆశించడంలో తప్పులేదు. ఆశించినదాన్ని అందుకోవడం కోసం శ్రమ పడాలి. ఆశ లాలస కాకూడదు. శక్తికి మించిన ఆశ దురాశే అవుతుంది. గాఢమైన కోరికలతో సతమతం కావడం మంచి లక్షణం కాదు. అది దుఃఖానికి కారణమవుతుంది. ఎక్కడైతే కోపం, దురాశ, ఈర్ష్య ఉండవో ఆ శూన్యంలో చైతన్యం వికసిస్తుంది. ఆ చైతన్యమే ఆనందానికి హేతువవుతుంది.*
*వక్తగా వేదికనెక్కి ప్రసంగి స్తుంటే... సభలో నిశ్శబ్దం ఆవహించి అందరూ ఆ ప్రసంగాన్ని విని చివర్లో ఆ ప్రాంగణం కరతాళ ధ్వనులతో నిండిపోతే ఆ వక్త లోపలినుంచి ఉబికి ఉబికి పొంగిపొరలి వచ్చేదే ఆనందం. ఆ ఆనందం ఎలాంటిదంటే గతంలో తనను విమర్శించినవారిని సైతం హృదయపూర్వకంగా క్షమించేటంతటిది! తోటలో గుంత తవ్వి ఒక మొక్క నాటడంలో మనం పూర్తిగా నిమగ్నమై ఆ పరిసరాలనే మరచిపోతే... అదిగో అక్కడ ఉంటుంది ఆనందం!*
*ధనం, ప్రతిష్ఠ, అధికారం కోసం వెంపర్లాడతాం. వాటిలోనే ఆనందం ఉందని అనుకొంటాం. ద్వేషం, అసూయ, కోపం మనల్ని వెన్నంటి ఉంటాయి. అయినా వాటిని గమనించం. సూర్యోదయానికి ముందే చల్లని వాతావరణంలో కిలకిలా రావాలు చేస్తూ ఆకాశంలో ఎగిరే పక్షులను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ప్రాతఃకాలంలో చల్లని గాలులకు ఊగుతున్న చెట్లు, మంచు కురిసిన పచ్చిక, ఇంటిముందు ఉదయాన్నే రంగవల్లులు దిద్దుతున్న గృహిణుల కళాభిరుచి... పరిశీలిస్తే ఎంతగానో ఆకట్టుకుంటాయి. మనసును కట్టిపడేస్తాయి. ఆ ఆనందం ముందు ధనం, ప్రతిష్ఠ, అధికారం ఏ పాటివి? అటువంటి అభిరుచి మొలకెత్తితే- మనుషుల్లో ఆనందం మొక్కగా మారి మానవుతుంది. మనలోని చైతన్యం వికసిస్తే ఆనందం మనసును ఆవహించి ఉంటుంది.*
*యోగి ఎందుకు ఆనందంగా ఉంటాడు? ఆయన వద్ద డబ్బు లేదు. అధికారం అంతకన్నా లేదు. ఆ యోగిలోని చైతన్యం కారణంగా ఎప్పుడూ చిరునగవుతో అంతర్లీనంగా ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. దైవం పట్ల అప్రమత్తతతో, ఎరుకతో ఉంటాడు. ఆనందంగా జీవించగలిగితే పవిత్రత మనల్ని అనుసరించి ఉంటుంది. సంతోషంగా ఉండేందుకు మనిషి మనసుతో సంబంధం పెట్టుకొని భౌతిక విషయాలపట్ల నిర్లిప్తంగా ఉండాలి. సుఖం, దుఃఖం మనకు సంబంధించిన వ్యక్తులపై ఆధారపడి ఉంటాయి. ఆనందం అలా కాదు. అది మన మనసు లోలోపలి నుంచి ఉబికే ఊట!*
(((****))))
సశేషము
మేఘాలలో అన్ని రంగులు అలా యెందుకు మిళితమై ఖేలాలవుతాయో నాకు అర్థమవుతుంది. రంగు రంగుల పూలు ఎందుకు పుష్పిస్తాయో నాకు తెలుస్తుంది.
నృత్యంలో నీ అడుగులకు శృతి కలుపుతూ నేను పాట పాడినప్పుడు, ఆకులు గలగలలో సంగీతం ఎందుకు వినిపిస్తుందో, చెవి వొగ్గి వినే పృథ్వివద్దకు సాగరతరంగాలు తమ సంగీత సందేశాన్ని ఎందుకు పంపుతవో నాకు అర్థమవుతుంది.
పూలలో తేనె యెందుకని దాగి వున్నదో, తీయని మధురసం పండ్లలో ఎందుకని దాగివున్నదో నాకు అర్థమవుతుంది.
ఉదయ కాంతితో ప్రవహించే ఆనందం ఏమిటో, వసంత మంద మలయానిలం శరీరాన్ని " తాకినప్పుడు పులకరింపు ఎందుకు కలుగుతుందో నాకు బోధ పడుతుంది.
జీవన్మరణాల మధ్యకాని, ఈ లోకంనుంచి మరొక లోకానికి కాని ఎక్కడికి నన్ను నడిపించినా, నడిపించేది నీవే! నీవే, నా అనంత జీవనపథంలో తోడు నీడవు. అపరిచితను తన అనుబంధాలతో నా హృదయాన్ని కట్టివేస్తావు.
నీతో ఒకసారి పరిచయం లభిస్తే చాలు- ఇక అపరిచితులంటూ ఎవరూ వుండరు. నీకు మూసిన ద్వారం ఏదీ వుండదు.
అందరితో కలిసి ఆనందంలో భాగము పంచుకొనే ఆ భాగ్యం నన్ను వదలి వెళ్లకుండా నావెంటే వుండు 🌹
*కొన్నిసార్లు మీరు చాలా అకస్మాత్తుగా కొంత ఎక్కువ సృహలోకి వెళ్ళేంత పరిస్థతి ఎదురుకావచ్చు. కానీ ఇది ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇది మీకు చాలా ఎక్కువ అయితే మీరు దానిని సవ్యంగా గ్రహించ లేరు. ఎప్పడూ వచ్చిన ఉన్నత సృహని ఎలా జీర్ణించుకుంటారు అనేది ముఖ్యం. అది కేవలం ఒక అనుభవం కాదు మీ స్వయం యొక్క అవగాహన. అనుభవమైతే అది వచ్చి పోతుంది; అది ఒక సంగ్రహావలోకనంగానే మిగిలిపోతుంది. ఏ అనుభవమూ శాశ్వతంగా ఉండదు - మీ స్వయం మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. అంతర్గత విషయాల గురించి మరీ అత్యాశతో ఉండకండి. అత్యాశ బాహ్య విషయాలలో ఎంత చెడ్డదో, అంతర్గత విషయాలలో కూడా అంతే చెడ్డది.*
*మీరు డబ్బు మరియు అధికారం మరియు ప్రతిష్ట కోసం అత్యాశతో ఉన్నప్పుడు ఇది చాలా ప్రమాదకరం కాదు. ఎందుకంటే ఆ విషయాలు వ్యర్థమైనవి. మీరు అత్యాశతో ఉన్నారా లేదా అనే దానితో పెద్దగా తేడా లేదు. కానీ లోపల ఉన్న దురాశ, మీరు లోపలి మార్గంలో వెళ్ళినప్పుడు, చాలా ప్రమాదకరమైనది కావచ్చు. చాలా మందికి దాదాపు పిచ్చి పట్టింది. ఇది వారి కళ్లకు చాలా మిరుమిట్లు గొలిపేలా ఉంటుంది మరియు వారు అంధులుగా మారవచ్చు. రావడం, వెళ్లడం ఎప్పుడూ మంచిది. ఇది స్థిరమైన లయగా ఉండనివ్వండి, తద్వారా మీరు ప్రపంచానికి దూరంగా ఉండరు మరియు ప్రపంచంలో ఎన్నడూ ఉండరు. దాని ద్వారా అధిగమిస్తున్నారని మీరు గ్రహిస్తారు. ఈ ప్రక్రియ చాలా క్రమానుగతంగా జరగాలి. ఒక పువ్వు క్రమక్రమంగా తెరుచు కుంటున్నప్పుడు ప్రారంభమైందో మీరు గ్రహించలేరు. ఆంతరిక సృహ కూడా అంత సహజంగా అది
(((****))))
సశేషము
శ్రీ భగవాన్ వాణి..... 12-01-2023
*పద్మం బురద నించీ పుడుతుంది. మురికి నిండిన బురద నుండి అపూర్వ సౌందర్య భరితమైన పుష్పం పుడుతుంది. అంటే బురద మట్టిలో ఏదో సౌందర్య భరితమయింది దాగుంది. కాబట్టి బురద మట్టిని తిరస్కరించకు. దాంట్లో కలువపూలు వున్నాయి. అంత మనోహరమయిన పరిమళమున్న మహా సుకుమారమయిన పుష్పం.*
*అడుగులకు శృతి కలుపుతూ ఆత్రు తగుట
ఆకుల గల గలలు వంత పాటగుట యు
మన్ను చెవి ఒగ్గి పులకించి మదన పడుట
జల్లు సంగీత సుస్వర కాల మగుట*
*ధవళకాంతితో మెరిసే పద్మం బురద నించి వచ్చిన సంగతి మరిచిపోకూడదు. మనిషి సాధారణ మట్టిగా పుట్టాడు. కానీ మనిషిలో పద్మముంది. కేవలం బీజంగా వుంది. మనిషిని తిరస్కరించ కూడదు. మనిషిని ఆమోదించాలి. రూపాంతరం చెందించాలి. కారణం దాంట్లో సౌందర్యం దాగి వుంది. అది లోపల దాగి వుంది. దాన్ని ఉపరితలానికి తీసుకురావాలి.*
*అడుగులకు శృతి కలుపుతూ ఆత్రు తగుట
ఆకుల గల గలలు వంత పాటగుట యు
మన్ను చెవి ఒగ్గి పులకించి మదన పడుట
జల్లు సంగీత సుస్వర కాల మగుట*
(((****))))
సశేషము
శ్రీ భగవాన్ వాణి.....13..... 13-01-2023
జీవితము మొత్తము time table ప్రకారము నడవాలి. ఇన్ని గంటలకు శుచియై దైవ ప్రార్ధన, ఇన్ని గంటలకు భోజనము, ఇన్ని గంటలకు నిద్ర అలా కాలాన్ని నియమించుకొని ఆయా కాలాలలో ఆ పనులు చేయాలి. సూర్యుడు, గ్రహములన్నియూ అలాగే చేస్తున్నాయి.
మనసు పరిపూర్ణమైన భక్తిలో మునిగిన తర్వాత ఇక తానంటూ ఉండడు !
'ఇంకా బాగా' అన్నమాట బాహ్యానికి సరిపోతుంది గానీ మనసుకు వర్తించదు. కానీ లౌకికసుఖాల విషయంలో మనం మనసుకు ఇంకా బాగా అవి అలవాటు చేసి లేని సంతోషాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాం. అదే అశాంతిగా పరిణమిస్తుంది. మంత్రం, సాధన తపస్సులు లౌకిక ఫలాలకోసం కాదు. అందుకే వాటి విషయంలో ఎంత దూరం వచ్చాము అని వెనక్కి తిరిగి చూసుకోకూడదు. కొలత వేయడంలో మన ప్రమేయం ఉంటుంది. కాని ఆధ్యాత్మికత అప్రమేయమైనది. ధ్యానానుభవం తెలుస్తుంది అంటే అతను ధ్యానంలో లేడని అర్థం. ఎందుకంటే ధ్యానం, ధ్యానం తెలియడం అనేవి పరస్పర విరుద్ధాలు. మనసు పరిపూర్ణమైన భక్తిలో మునిగిన తర్వాత ఇక తానంటూ ఉండడు. ఆస్థితిలో జరిగే మౌనమైనా, ఏ ఒక్క మంత్రమైనా, స్మరణ అయినా చాలు తరింపచేయడానికి !
అడ్డగోలుగా ఉంటే ఆ జీవితాలకు క్రమము ఉండదు. క్రమము లేనిదే ప్రజ్ఞకు వ్యాపన ముండదు. జీవితమును ఒక వ్రతముగా నిర్వర్తించే వాడికి అందరికోసము తాను జీవించడమన్నది తెలుస్తుంది. తన కోసము జీవించేవాడు మ్లేచ్చుడు. అనగా మలము నందు ఇచ్ఛ కలవాడని అర్ధము.
(((****))))
సశేషము
శ్రీ భగవాన్ వాణి.....14..... 14-01-2023
ఆత్మజ్ఞానము అంటే తన నిజస్వరూపం తాను తెలుసుకోవడం. అందుకే ఆత్మజ్ఞానంలో మనకు లభించేది పరాయిది కాదు.. మహనీయమైన ఆత్మే. ఆత్మజ్ఞానము ఎవరికీ భిన్నంకాదు. అందుకే అది జ్ఞానాస్పదము. ఆత్మజ్ఞానము పొందిన వ్యక్తి తానే ఒక మహాతీర్థమౌతాడు. ఆత్మజ్ఞానము పొందిన వ్యక్తికి జయము కరతలామలకం, ఆత్మజ్ఞాని నిత్య విజయుడు. భౌతిక జీవితంలో మనం అభ్యసించాల్సినవి అనేక శాస్త్రాలు ఉంటాయి. కానీ వీటన్నింటికీ మూలం ఆత్మజ్ఞానము. అందుకే అదే పరమశాస్త్రము !
కళ్ళు తెరిస్తే - సాకార ధ్యానం.
(((****))))
సశేషము
Comments
Post a Comment