శ్రీ భగవాన్ వాణి ----22 ---22 -01 -2023 to 28-01-2023


ఈ విశ్వంలో ఏ శక్తి మనల్ని నియంత్రించడం గాని, శాసించడం కానీ చెయ్యదు. అంతా మన ఇష్టాను సారంగానే జరుగుతుంది. మనల్ని అదుపు చేసే శక్తి ఎవ్వరికి లేదని అనుకోవటం తప్పు. మన వెనుక ఏముందో మనకు తెలియదు, ముందు ఏమి జరుగుతుందో తెలియదు. మనకు తెలి సిందల్లా ధర్మాన్ని అనుసరించి బతుకుటకు ప్రయత్నం చేయాలి.
మన మేధస్సు తర్క వితర్క లమధ్య చిక్కి విశ్లేషణ ఆలోచన ఆచరణ చుట్టూ తిరుగుతుంటుంది.
మనకు తెలియకుండా మనలో దాగి ఉన్న అహం ఒక్కసారి తుఫాన్ లా వస్తుంది. దానికి మూలమ్
అను కున్నది తారుమారు అవ్వడం, ప్రేమ అనుమానంగా మారటం కానీ అది క్షణం చల్లబడ్డ తర్వాత అర్ధం చేసుకో గలుగుతుంది, అలాంటి వారి ముందు ఓర్పు వహించటం మాత్రమే.
ఎక్కువ వాక్చాతుర్యం ఉన్న వ్యక్తిని తెలివైన వాడిగా గుర్తిస్తాము. కానీ అది మంచిది కాదు . ఎవరైతే అంతర్ ప్రపంచం ద్వారా వచ్చే భావనలను అర్థం చేసుకుని ఆచరిస్తారో, వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు.
ప్రకృతిలో అన్ని జీవరాసులు సమానమే, ప్రకృతికి తెలివైన వాళ్ళు, పిచ్చివాళ్ళు, బుద్ధిమాంద్యం కలవారు అందరూ సమానమే. అందరిలో ఉన్న చైతన్య పరిణామ వికాసంలో ఒకరు ముందు, ఒకరు వెనుక అంతే.
ఆధ్యాత్మికంగా ఎదగడం, అనుభవాల ద్వారా మనోశక్తి విస్తరించడం సహజం అనంత జ్ఞానాన్ని వినియోగంలోకి తేవడం అని అర్థం.మన జ్ఞానం బోధించే కొద్ది మన మేధస్సు వినియోగం లోకి వస్తుంది. ఇదే ఏకాగ్రతకు మూల కారణం. దీనికి ప్రేమ తోడుగా యుంటే సాధించలేని దంటూ లేదు దీనికి మూలమ్ అమ్మవారి కృపా కటాక్షం
--(())--

వాల్మీకి మహర్షి విరచిత యోగ వాశిష్ట సారము
--(())--
శ్రీ భగవాన్ వాణి ----24 ---24 -01 -2023
వీటిలో ప్రాణవాయువు శరీరములో ఊపిరితిత్తులనుండి ముక్కురంద్రముల వరకు వ్యాపించివున్నది. ప్రాణవాయువు రెండు ఊపిరితిత్తుల నుండి ముక్కురంధ్రముల ద్వార బయటికి లోపలికి చలించుచున్నది. మనిషి పుట్టుకలో బయటినుండి శ్వాస లోపలికి ప్రవేశిస్తున్నది, చావులో లోపలి నుండి బయటికి వెళ్లిపోవుచున్నది. శ్వాస బయటినుండి పోయిన, లోపలినుండి బయటికి వచ్చిన రెండుగానే బయలుదేరుచున్నది.
రెండు ఊపిరితిత్తులనుండి బయలుదేరిన శ్వాస రెండు చీలికలుగానే బయటికి వస్తున్నది. కావున శ్వాసను వృక్షముగ పోల్చి, మొదలులో రెండుకొమ్మలు పుట్టిన వృక్షమని అన్నారు. దానినే ఆది ద్వయంబు వృక్షము అన్నారు. శ్వాస లోపలికి బయటికి చలించడములో రెండు శబ్దములు పుట్టుచున్నవి. అవి సో, హం అను శబ్దములు, శ్వాస వలన కలుగు శబ్దములు కావున విూదటి రెండక్షరములని అని అన్నారు.
లోపలికి పోవునపుడు ఒక శబ్దము బయటికి వచ్చునపుడొక శబ్దము పుట్టుచు ప్రత్యేకత కల్గియున్నవి. లోపలికి పోవు "సో" శబ్దమును బయటికి వచ్చు "హం" శబ్దములను రెండిటిని కలిసి చూస్తే '"ఓం" అను శబ్దము పుట్టుచున్నది. మొదటిదైన సో శబ్దములో 'ఓ' శబ్దము చివరిగ వినిపిస్తున్నది.
అలాగే రెండవదైన హం శబ్దములో "మ్" శబ్దము వినిపిస్తున్నది. రెండిటిని కలిపితే ఓం అను శబ్దము తయారగుచున్నది. కావున ఆదియు అంత్యము కూడిన అని మూడవ చరణములో అన్నారు.
ప్రతి జీవరాసి శరీరములోను శ్వాసలో "ఓమ్" అను శబ్దము ఇమిడి ఉన్నది. ఆధ్యాత్మికములో అత్యంత ప్రాముఖ్యమైనది కావున వేద వేద్యులకు వేదాంతమని చెప్పారు.
***
శ్రీ భగవాన్ వాణి ----25 ---25 -01 -2023
జీవితానికి అన్నీ ఉపయోగమే, ఉపయోగము లేదంటే ని మనసు మనసులో లేదని మాట
శ్రీ భగవాన్ వాణి ----26 ---26 -01 -2023
బ్రహ్మ రాత అక్షరం పొల్లుబోదు, బ్రహ్మాండ మంతా జ్వాలా తోరణంగా మారినా, బతికే ప్రాణులెన్నో ఆరోగ్యానికి హాని ఎడారిలో ఉన్న, పసిడి పర్వతముపై దాగి ఉన్న
అనారోగ్యం రాకమానదు, కుండను సముద్రంలో ముంచిన, బావిలో ముంచిన కుండడే తేగలవు, అంతకన్నా రావు అదే వ్యర్ధాగ్నిని ఆర్పకపోతే నష్టం, దానికితోడు నెయ్యిని పోస్తే ప్రభంజనం, అట్లే కోర్కలకు కళ్ళెం వెయ్యకపోతే నష్టం, ఆశలు పెరిగినకొద్ది ఆరోగ్యానికి నష్టం, మానవ ప్రయత్నం తో దైవసంకల్పం అవసరం
సత్యం పల్కని చోట, ధర్మం గుర్తించని చోట, న్యాయం ఉండని చోట, దీపారాధన చెయ్యని చోట, సాధు సాంగత్యం లేని చోట, ధనం సమ్మతి చెందని చోట, ధన కాంక్షము నింగిన చోట, శత్రురాహిత్యం లేని చోట, ఋణం ఇవ్వని చోట, నమ్మకం లేని చోట,
కాపురం చేయ రాదు, చెయ్యవలసిన స్థితి, బ్రహ్మరాత ధిక్కారం, ఎవ్వరి వల్ల కానే కాదు
తల్లి,తండ్రి, గురువు, దైవ బలం మన అయుష్యుకు మనః శాంతి కి మార్గం
*ఈశ్వరుడనగా శరీరధారులకు ఆత్మ స్వరూపుడు. ఈశ్వరుడు లేకపోతే మనము లేము. ఈశ్వరుని ప్రతిబింబముగా మనమున్నాము.**ఈశ్వరుడు మనలో ఉండడము చేత పంచభూతములు పనిచేస్తున్నాయి. ఈశ్వరుడు మనలో ఉండడము చేతనే మనలో ఎరుక పనిచేస్తుంది. ఈశ్వరుడు ఉండడము చేతనే మనకు ఆయుర్దాయము ఉంటుంది.**ఈశ్వరుడు మనయందు మనవలె ఉంటే, మనమే ఉన్నామని అనుకుంటూ ఉంటాము. నిజానికి నేను కాదు ఉన్నది ఈశ్వరుడే అని తెలియడమే జ్ఞానము. అపుడే ఈశ్వరుడు మన యందు పరిపూర్ణముగా అవతరించి మన సమస్తము అతనే నిర్వర్తిస్తాడు.
--(())--
Excellent
ReplyDelete