శ్రీ భగవాన్ వాణి ----22 ---22 -01 -2023 to 28-01-2023

 





Prayer beads, Aleppo, Syria..  Be we Catholic, Muslim, what ever our religion.  We have to pray for PEACE!

శ్రీ భగవాన్ వాణి ----22 ---22 -01 -2023

- ఏకాగ్రత 
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఈ విశ్వంలో ఏ శక్తి మనల్ని నియంత్రించడం గాని, శాసించడం కానీ చెయ్యదు. అంతా మన ఇష్టాను సారంగానే జరుగుతుంది. మనల్ని అదుపు చేసే శక్తి ఎవ్వరికి లేదని అనుకోవటం తప్పు. మన వెనుక ఏముందో మనకు తెలియదు, ముందు ఏమి జరుగుతుందో తెలియదు. మనకు తెలి సిందల్లా ధర్మాన్ని అనుసరించి బతుకుటకు ప్రయత్నం చేయాలి.
    
మన మేధస్సు తర్క వితర్క లమధ్య చిక్కి విశ్లేషణ ఆలోచన ఆచరణ చుట్టూ తిరుగుతుంటుంది.
మనకు తెలియకుండా మనలో దాగి ఉన్న అహం ఒక్కసారి తుఫాన్ లా వస్తుంది. దానికి మూలమ్
అను కున్నది తారుమారు అవ్వడం, ప్రేమ అనుమానంగా మారటం కానీ అది క్షణం చల్లబడ్డ తర్వాత అర్ధం చేసుకో గలుగుతుంది, అలాంటి వారి ముందు ఓర్పు వహించటం మాత్రమే.        

ఎక్కువ వాక్చాతుర్యం ఉన్న వ్యక్తిని తెలివైన వాడిగా గుర్తిస్తాము. కానీ అది మంచిది కాదు . ఎవరైతే అంతర్ ప్రపంచం ద్వారా వచ్చే భావనలను అర్థం చేసుకుని ఆచరిస్తారో, వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు.

ప్రకృతిలో అన్ని జీవరాసులు సమానమే, ప్రకృతికి తెలివైన వాళ్ళు, పిచ్చివాళ్ళు, బుద్ధిమాంద్యం  కలవారు అందరూ సమానమే. అందరిలో ఉన్న చైతన్య పరిణామ వికాసంలో ఒకరు ముందు, ఒకరు వెనుక అంతే.

ఆధ్యాత్మికంగా ఎదగడం, అనుభవాల ద్వారా మనోశక్తి విస్తరించడం సహజం  అనంత జ్ఞానాన్ని వినియోగంలోకి తేవడం అని అర్థం.మన జ్ఞానం బోధించే కొద్ది మన మేధస్సు  వినియోగం లోకి వస్తుంది. ఇదే ఏకాగ్రతకు మూల కారణం. దీనికి ప్రేమ తోడుగా యుంటే సాధించలేని దంటూ  లేదు దీనికి మూలమ్ అమ్మవారి కృపా కటాక్షం    
--(())--



Transcendental Love | A Common Thread

శ్రీ భగవాన్ వాణి ----23 ---23 -01 -2023

        శూన్యమ గు ఆకాశమునకు పేరు మాత్రమే కలదు. వేరే రూపములేనట్లు, మనస్సుకు కూడ ఎటువంటి రూపము లేదు. అయినను ఆకాశము వలె మనస్సు సర్వత్ర విస్తరించియున్నది. చంచల శక్తితో కూడిన మనస్సొక్కటియే స్ఫురించుచున్నది, భ్రమించుచున్నది, స్వర్గ, నరకములకు పోవుచున్నది, యోచించుచున్నది. సంసారమున నిమగ్నమగుచున్నది, పతనమగుచున్నది లేక ముక్తి పొందుచున్నది. 

ఇదంతయు మనస్సు యొక్క పనియే గాని, జగత్తు వేరుగ లేదు. సంకల్పమే మనస్సు. చలనము నుండి వాయువు, ద్రవ్యము నుండి నీరు వేరుకానట్లు, మనస్సు సంకల్పము కంటే వేరు కాదు. దేహ రూపియగు బ్రహ్మమే మనస్సనిజెప్పబడి, అది భౌతిక బుద్ధిని సృష్టించుచున్నది. దృశ్య ప్రపంచమే మనస్సు. చిత్త మాలిన్యముల వలెనే నీకీ దృశ్యమగు విశ్వము కనిపించుచున్నది. ఈ మాలిన్యం తొలగినచో, దృశ్యము అగుపడదు. అపుడు నిర్మల దర్పణము వలె స్వచ్ఛమగుదుము.

 గాలి వీచనిచో లతాదులు కదలవు. అలానే ఆత్మలో ఏకత్వముఏర్పడిన, చిత్త స్పందన ఆగి, రాగ ద్వేషములు వాసనలు దొలగిపోవును. అద్దము నందు ప్రతిబింబము లేకున్న అద్దము స్వచ్చమగునట్లు, నీవు ఈ జగత్తు కాదు అని భావించిన ద్రష్ట కూడ కేవలుడగును. 

ఇదంతయు విన్న శ్రీరాముడు, వసిష్ఠు నీవిధముగా ప్రశ్నించెను. సత్తునకు వినాశము లేదు. అసత్తునకు ఉత్పత్తి లేదు. ఎడతెగక దోషములతో నిండి సద్వస్తువు వలె ప్రకాశించు ఈ జగత్తు, అసత్యమని ఎట్లు తెలుసుకొనగలమో తెలుపు మనగా, వసిష్ఠుడు ఇట్లు పల్కుచున్నాడు. ఈ దృశ్య ప్రపంచము శాంతించు మంత్రమును చెప్పుచున్నాను. దీని వలన దృశ్య భావము నశించును. ఆకాశాది భూతములు, వ్యవహారమందు మాత్రమే జగత్తు అనబడును. కాని పరమార్ధ దశ యందు బ్రహ్మమే కలదు.

 ఈ ప్రపంచము స్వప్నమున గాంచు గృహాదుల వలె, మనస్సు యొక్క కల్పనమే. ఈ మనస్సుకు యుత్పత్తి లేదు, శరీరము లేదు. స్వప్నము, స్వప్నమును గాంచలేనట్లు మనస్సు అసత్తయ్యి, నిజేచ్చ వలన, నిజ శరీరమును కల్పించుకొని, దాని వలన, ఇంద్రజాలము వలె జగత్తును విస్తరించుచున్నది. చంచల శక్తితో కూడిన మనస్సోక్కటియే స్ఫురించుచున్నది, భ్రమించుచున్నది.

 స్వర్గ నరకములకు బోవుచున్నది. సంసారమున నిమగ్నమగుచున్నది. ముక్తినందుచుచున్నది. ఇదంతయు మనస్సు యొక్క పనే. మనస్సు గాక మఱి జగత్తులేదు. మహాప్రళయమున దృశ్య సృష్టి అంతయు లయమగును. అప్పుడు మిగిలేది బ్రహ్మ మొక్కటియే.
వాల్మీకి మహర్షి విరచిత యోగ వాశిష్ట సారము 

--(())--

శ్రీ భగవాన్ వాణి ----24 ---24 -01 -2023

మన శరీరములో ప్రతి ఒక్కరికి శ్వాస ఆడుచున్నది. శ్వాసను బట్టి ప్రాణమున్నదని లేదని చెప్పవచ్చును. కావున శ్వాసను ప్రాణము అన్నారు. అనగ గాలి అని అర్థము మన శరీరములో ఐదు రకముల గాలులు గలవు. అవి వరుసగ వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాణ వాయువులంటాము. వాటినే పంచప్రాణములని కూడ అనుచున్నాము. 

వీటిలో ప్రాణవాయువు శరీరములో ఊపిరితిత్తులనుండి ముక్కురంద్రముల వరకు వ్యాపించివున్నది. ప్రాణవాయువు రెండు ఊపిరితిత్తుల నుండి ముక్కురంధ్రముల ద్వార బయటికి లోపలికి చలించుచున్నది. మనిషి పుట్టుకలో బయటినుండి శ్వాస లోపలికి ప్రవేశిస్తున్నది, చావులో లోపలి నుండి బయటికి వెళ్లిపోవుచున్నది. శ్వాస బయటినుండి పోయిన, లోపలినుండి బయటికి వచ్చిన రెండుగానే బయలుదేరుచున్నది. 

రెండు ఊపిరితిత్తులనుండి బయలుదేరిన శ్వాస రెండు చీలికలుగానే బయటికి వస్తున్నది. కావున శ్వాసను వృక్షముగ పోల్చి, మొదలులో రెండుకొమ్మలు పుట్టిన వృక్షమని అన్నారు. దానినే ఆది ద్వయంబు వృక్షము అన్నారు. శ్వాస లోపలికి బయటికి చలించడములో రెండు శబ్దములు పుట్టుచున్నవి. అవి సో, హం అను శబ్దములు, శ్వాస వలన కలుగు శబ్దములు కావున విూదటి రెండక్షరములని అని అన్నారు. 

లోపలికి పోవునపుడు ఒక శబ్దము బయటికి వచ్చునపుడొక శబ్దము పుట్టుచు ప్రత్యేకత కల్గియున్నవి. లోపలికి పోవు "సో" శబ్దమును బయటికి వచ్చు "హం" శబ్దములను రెండిటిని కలిసి చూస్తే '"ఓం" అను శబ్దము పుట్టుచున్నది. మొదటిదైన సో శబ్దములో 'ఓ' శబ్దము చివరిగ వినిపిస్తున్నది. 

అలాగే రెండవదైన హం శబ్దములో "మ్‌" శబ్దము వినిపిస్తున్నది. రెండిటిని కలిపితే ఓం అను శబ్దము తయారగుచున్నది. కావున ఆదియు అంత్యము కూడిన అని మూడవ చరణములో అన్నారు.

 ప్రతి జీవరాసి శరీరములోను శ్వాసలో "ఓమ్‌" అను శబ్దము ఇమిడి ఉన్నది. ఆధ్యాత్మికములో అత్యంత ప్రాముఖ్యమైనది కావున వేద వేద్యులకు వేదాంతమని చెప్పారు.

***

శ్రీ భగవాన్ వాణి ----25 ---25 -01 -2023

జీవితానికి అన్నీ ఉపయోగమే, ఉపయోగము లేదంటే  ని మనసు మనసులో లేదని మాట 

భార్యనైనా భర్త  సమయోచితముగా ఉపయోగించుకోవటం, భర్తనైనా భార్య  సుఖలాలసుగా గుర్తించటం కూడా ఒక ఉపయోగమే.     

జీవితంలోంచి దువ్వెన అనే వస్తువు చిన్నదని ఉపయోగించటం మానవనుకో,  నువ్వు జడలు కట్టిన జుట్టుతో భయంకరంగా ఉంటావు. .  
  
జీవితంలోంచి అద్దం అనే వస్తువును తొలగించా వనుకో , నిన్ను నువ్వే చూసుకో లేనంత అసహ్యం గా ఉంటావు..

జీవితంలోంచి చీపురు అనే వస్తువును తొలగించా వనుకో, నిన్ను నువ్వే చూసుకో లేనంత చెత్త నీచుట్టూ చేరి దుర్వాసన పిల్చా సి బతకాల్సి వస్తుంది. .

ఒక్కరోజు కాఫీ కానీ, టీ కానీ, పాలు కానీ, తాగద్దను కున్నావనుకో, ఆ రుచి మరవ లేక ఆత్మారాముని బాధపెట్టలేక, నిద్రలేక మనసు చింతకు  చేరుట అవసరమా   ..

నీ జీవితాన్నే అందంగా, సౌఖ్యం గా చేస్తూన్న ఇలాంటి చిన్న చిన్న వస్తువులకు నువ్వెప్పుడైనా 
ధన్యవాదములు తెల్పి మెచ్చుకున్నావా 
 
అన్నీ  పూటలా నీకు సకాలంలో తిండి ఏర్పాటు చేస్తున్న నీ తల్లికో లేక నీ భార్యకో....ఒక్క రోజైనాధన్యవాదములు తెల్పి మెచ్చుకున్నావా ..

చెట్టు యొక్క దయా దాక్షిణ్యాలపై బతుకుతున్న  నీవు ఒక్క రోజైనా చెట్టును ప్రేమగా స్పర్శిస్తూ ధన్యవాదములు తెల్పి మెచ్చుకున్నావా ....

ఎండకూ, వానకూ, అమ్మకూ ,నాన్నకూ....నిన్ను ఆనందంగా ఉంచుతున్న ఈ ప్రకృతికీ.....గురువుకు....నువ్వు ధన్యవాదములు తెల్పి మెచ్చుకున్నావా .

నిజానికి పై న వ్రాసిన కొన్ని  వస్తువులేవీ...నీ దగ్గరనుండీ ఏమీ ఆశించకుండా... నిస్వార్థంగా....ఎన్నో యుగాలుగా సేవ చేస్తున్నాయి. వాటికి ధన్యవాదములు తెల్పి మెచ్చుకున్నావా 

సృష్టిలో ప్రతి వస్తుకనీసం రోజుకొక్కసారి అయినా వు ఉపయోగం ఉన్నది, దాన్ని ఉపయోగించుకొనే శక్తి భగవంతుడు మానవులకిచ్చాడు  ధన్యవాదములు తెల్పి మెచ్చుకున్నావా 

ప్రతిఒక్కరు ధన్యవాదములు తెల్పి మెచ్చు కుంటే మనస్సు తేలికపడి ఏకాగ్రత పెరుగుతుంది ఇది అక్షరాలా నిజం. 

--(())--

శ్రీ భగవాన్ వాణి ----26 ---26 -01 -2023

*. దుస్సంగః సర్వధైవ త్యాజ్యః ॥ 🌻 
ఏ రకమైన దుస్సాంగత్యమైనా సరే, అన్నీ వదలివెయాలి. 

సాధనలో ఉన్న భక్తుడు, కోరికలను నిగ్రహిస్తూ ఉండగా, దుస్పాంగత్యం కలిగితే ఆ కోరికలు రెట్టించి, అవకాశాన్ని వినియోగించు కుంటాయి. సాధకుడు పతనమవుతాదు. 
కామ్యక కర్మలను చేస్తాడు. ఇంకా దిగజారితే నిషిద్ల కర్మలను కూడా చేస్తాడు. అక్రమ మార్గాల నవలంబిస్తాడు. వీటివల్ల నిగ్రహ శక్తి కోల్పోతాడు. 

అహంకార మమకారాలను అడ్డు తొలగించు కోవలసింది పోయి వాటిని పెంచి గట్టి పరచుకుంటాడు. విరోధ ఉపాయం విఫల మవుతుంది. అనుకూల ఉపాయాలకు విఘ్నమేర్పడుతుంది. 

అవకాశం కోసం పొంచి ఉండే అరిషడ్వర్గం, సందు దొరకగానె దాడి చేస్తుంది. విషయ సంగత్వం గాఢంగా కలుగుతుంది.

అంతవరకు చేసిన సాధనంతా మంటగలసి పోతుంది. సాధనలో పురోగమనం ఉండకపోగా తిరోగమనం జరుగుతుంది. 

దుస్సాంగత్యం వలన పతనమైనవాడు తిరిగి పుంజుకోవడం అరుదు. పశ్చాత్తాప పడినప్పటికీ నైరాశ్యం ఆవరించి ఖిన్నుడవుతాడు. గురువు పర్యవేక్షణలో సాధన చెస్తే శిష్యుడిని సకాలంలో హెచ్చరిస్తాడా గురువు. తిరిగి సన్మార్గంలో పెడతాడు. 

ఒక్కోసారి సన్మార్గంలో ఉన్న శిష్యుని దుష్ట సంస్కారాలను బయటికి లాగి గురువు పరిక్ష పెడతాడు. అప్పుడది ముందు జాగ్రత్త చర్య అవుతుంది.

బలహీనమైన మనసు గల శిష్యుడిని హెచ్చరిస్తూ, రక్షిస్తూ ఉంటాడు. గురు కృప రుచి మరిగిన శిష్యుడైతే, గుర్వాజ్జను పాటిస్తూ, సాధన చేసాడు.

గురువు ప్రత్యక్షంగా లేకపోయినా గురు కృపను గుర్తించలేక పోయినా, శిష్యుడు దుస్సాంగత్యంలో  పడిపోయె ప్రమాదమున్నది.

అతనిని ఇక రక్షించేవారే ఉండరు. ఇటువంటి అవాంతరాల విషయాల్లో ముందస్తు జాగ్రత్త అవసరమని ఈ సూత్రం చెప్తున్నది.

***

Comments

Post a Comment

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ

05-02-2026