హాస్యం
ఉత్తర మిన్నులు - ఖండకావ్యం
విశ్వనాథవారు తానెన్నో ఖండకావ్యాలు వ్రాసినట్టు చెప్పారు। అవన్నీ ప్రచురణకు నోచుకోలేదు। వాటిలో కొన్నింటిని మాత్రం వారు తన "తొలి జనుస్సులందలి చెలికాడు" అని ఎంతో ప్రేమగా చెప్పుకున్న జువ్వాడి గౌతమరావుగారు ఎంతో శ్రద్ధ వహించి సంకలనం చేశారు। అలా సంకలనం చేసి ప్రాచుర్యంలోకి తెచ్చిన ఐదు పద్యాల ఖండ కావ్యం "ఉత్తర మిన్నులు।"
ఈ పద్యాలు చదువుతూంటే శరీరాన్ని వదిలి ఆ ఉత్తర మిన్నులలో "నునుపింజల" లో ఒకటై ఎగిరి మబ్బుపిల్లలతో సరిగా విహరించాలనే కోరిక కలుగక మానదు।
1।వపు రనలుండు తమ్మిపువుబందుగు కట్టిన బండి గుఱ్ఱముల్/
విపులపు కాలిగిట్ట లొరిపిళ్ళకు మిక్కిలి వెట్టయెక్కి ఱం/
పపుపొడివోని సన్న తెలిమబ్బులసందులనుండి జారి వ/
చ్చు పగులుటెండ కార్తికపుఁ జొక్కులు పోవగ నీదు జీవులన్।
2।చిలచిల రేగుచున్ బొగలు చిమ్ముచు నుచ్చెడు నాసలందు నా/
విలపము నుత్తరంపుదెస వెట్టిన ముట్టెలగట్టు నుర్వులం/
బలెఁ దొలిదిక్కు దూగిన సుమారగు మిన్నున దూలిపోవుమ/
బ్బులు నునుపింజలై విరిసిపోయెడు గాలికి నూగిరేగుచున్।
3।క్రుమ్మిన మింటిమార్గమునకున్ నడిపట్టున నిల్పినట్టి యం/
త్రమ్మునఁ బొల్చు పెన్మొసలి దౌడల చేటలవంటి జంట ఱం/
పమ్ములవంటి దంతముల మధ్య విశీర్ణములైన వెల్గు దూ/
లమ్ములవోలె జారెడు నిలాతలమందు వివస్వదంశువుల్।
4।ఱేలను దివ్వె లుంచి కబరీసుమగుచ్ఛలు పేరటాండ్రు నాం/
దోళితదేహలై చలికి దుప్పటులన్ మెయిఁ గప్పుగొంచు బల్/
లాలితవీథివీథి సకలంబును మ్రుగ్గురథాలు తీర్పగా/
హేళియు వచ్చి వానిపయినేగెడు రాగమనోజ్ఞమూర్తియై।
5।మొఱయికమాలి యార్నెలలు మూసిన సౌరపురీకవాటముల్/
యర్నే తెఱచిన కిఱ్ఱు, నుత్తరదిక్కునకున్ మఱలించినట్టి తా/
మరపువు నేస్తుబండిరుసు మాలుగుమూలుగు, మేలుకొన్న యా/
సిరిదొర యావులింత, విరచించిన రావము నిండె మిన్నులన్।
మిక్కిలి రూపసి అయిన అగ్ని తమ్మిపువుబందుగు(సూర్యుడి) కట్టిన బండి గుఱ్ఱాల కాలి గిట్టల ఒరిపిళ్ళకు బాగా వేడెక్కి సన్నటి చెక్కులా అయిపోయిన మబ్బుల సందుల్లోంచి జారి వస్తూన్న పగులుటెండ (తన వెచ్చదనంతో) కార్తీకపు చలిలో పరవశిస్తూంది।
పొగలు చిమ్ముతూ ఉత్తరపు దిక్కు తన ముట్టెను తూర్పు దిశకు పెట్టి నాసారంధ్రాలనుంచి నురుగులు కక్కుతున్నట్టు కనపడుతున్న దూదిపింజలవంటి మబ్బుతునకలు గాలికి రేగి ఊగి
విడిపోతున్నాయి బాగా కలగుండు పడిన ఆకాశ కాసారం మధ్య నిలిపిన యంత్రం వంటి మేఘంలో ప్రత్యక్షమైన మొసలి యొక్క రంపపు పళ్ళ ఖాళీల మధ్యనుంచి జారే వెలుగు దూలాల వలె భూమి మీదకు సూర్యకిరణాలు జారుతున్నాయి।
మరునాడు ప్రొద్దుటే తమవాకిళ్ళు కళకళలాడేటట్టు ముగ్గులేద్దామని రాత్రి పూట దివ్వెలు పెట్టుకుని చలికి ఉహుఁహుఁ అనుకుంటూ దుప్పట్లు కప్పుకుని పేరంటాళ్ళంతా 'లాలిత వీధి'ట! - బాగా గారాబం చేసిన వీధి అనుకుంటాను। రంగులముగ్గులు వేసి వీధిని గారాబం చేస్తున్నారన్నమాట!లాలితవీధి మొత్తం రథాల ముగ్గులు వేసేస్తున్నారు। (ఒక యింటి రథం మరో ఇంటి రథంతో ఢీ కొంటే కురుక్షేత్ర యుద్ధమేనేమో ) ఇది చాలదన్నట్టు హేళిగారు అంటే సూర్యుడు తన ఏడుగుఱ్ఱాల(రంగుల)రథం వేసుకుని వచ్చీసేడు। రాగమనోజ్ఞమూర్తి అన్నారుగా। విలాసంగా వీధిలో వేసిన ముగ్గులన్నీ చూసుకుంటూ రథాన్ని ఆటోలో, క్రూయిజింగ్ లో పెట్టి ఆకాశంలో మహా సంతోషంగా వెళ్తున్నాడు।
ఆర్నెల్లు మూసేసిన ఉత్తరాయణపు తలుపులు కిర్రుమనే శబ్దంతో తెరచి వెళ్తుంటే సూర్యుడి రథపుటిరుసు కూడా తలుపుల్లాగే బద్ధకంగా మూలిగింది। ఆ సౌండుకి ఆ దొరకి నిద్రనుంచి మెలకువ వచ్చి ఆవులిస్తే ఆ రవం ఉత్తర మిన్నుల నిండింది
ఏమేవ్! టవల్ ఎక్కడ తగలడ్డాది, స్నానానికెళ్ళాలి?
ఆ చిందులు తొక్కడం ఆపి, దండెం మీద వుంటుంది, పోనీ నా రెండు కళ్ళతోనూ చూడండి!
అగ్గిపెట్టె ఎక్కడ, దీపం వెలిగించడానికి!
అయ్యో రామా! అది మీ తడిచేతిలో పడి తడిసి ముద్దయింది, వూదొత్తివ్వండి, స్టౌ మీద వెలిగించి తెస్తాను
మీవాళ్ళేం మప్పేరో నాకైతే తెలియదు
అన్నం వుడుకుతున్న స్టౌ అంటు కాదూ!
ఈ చాదస్తం మొగుడితొ వేగలేక చేస్తున్నాను, తీరామోసి కూరలు కొనడము కూడా మప్పలేదు, వేళకింత తినడం మాత్రం మప్పేరు
ఇదిగో మా అమ్మనేమైనా అన్నావా జాగ్రత్త!
అదే మాట నేనూ అంటున్నాను!
అది సరే గాని ఇవాళ శాఖపాకాలేమిటోయ్!!?
పూజ మనసు పెట్టి చేసుకోవచ్చుగా!!
చెప్పరా నా బంగారం వంకాయ కొత్తిమీరి కారం, సాంబారు! అనుపానం!
కొబ్బరి, మామిడి పచ్చడి అది సరే గాని శ్రావణం వచ్చేస్తోంది
పూజలో వుండగా బుర్ర పాడయే ఆ విషయాలిప్పుడెందుకే నా హ్రుదయమా!
"ఏమేవ్...ఈ రోజు ఒక పనివాడిని మాట్లాడివచ్చాను. అతను అన్ని పనులూ చేస్తాడు.
అంట్లు తోముతాడు, గదులు తడిగుడ్డపెడతాడు, రుచికరమైన వంటలు చేస్తాడు,
ఉదయాన్నే వాకిలి ఊడ్చి కల్లాపి చల్లుతాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని మాటలు తిట్టినా నోరు మూసుకుని పడుండే మెత్తటి మనిషి..."
"శ్రీవారూ! అతన్ని మన అల్లుడిని చేసుకుందాము! వేరే పనివాడ్ని చూడండి!
ఇలాంటి భర్త తనకు కావాలనేది మనమ్మాయి కోరిక మరి"
"వనజ! నువ్వు చెప్పేది నిజమేనా అని"
ఔను! మా అత్తగారు నన్ను వైవిద్యమైన రీతిలో భయపెడుతున్నారు ...
"ఏమని??? "
చెప్పిన పని సరిగ్గా చేయకుంటే నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ , వాట్సప్ ఫ్రెండ్స్ అందరికీ నా ఒరిజినల్ ఫోటో పంపిస్తానని భయపెడుతుంది..
బ్రెటరూ! నేను
రెండో మర్డర్ లో దోరికిపోయి జైలుపాలయ్యా,
నువ్వెలా వచ్చావోయ్?
బేంకోళ్ళ మోసం వల్ల
హడ్డెడ్డెడ్డె
ఎట్టా ఎట్టా? చెప్పు చెప్పు
రాత్రి దోంగతనానికని బేంకుకెళ్ళాను
కేష్ తెరవడానికి తాళాల గుత్తి, సుత్తి, సానము తీస్తూ అక్కడ రాసున్న అక్షరాలు చదివేను
ఏం రాశారు?
"కేష్ సేఫ్ తెరవడానికి కష్టపడక్కర్లేదు
పక్కనున్న హేండిల్ తిప్పగానే తలుపు తెరుచుకుంటుంది" అని
ఆగాగు! కధ నాకు తెలిసిపోయింది. అక్కడ రాసున్నట్లు చేసి ఇక్కడకోచ్చావంతేనా?
నీకెలా తెల్సు?
నీ సీనియర్ని కదా నేను కూడ నీలాగే మోసపోయాను ఎట్టెట్టెట్టా?
ఆడ్ని చంపుతూవుంటే వీడియో తీసుకున్నాడు సరే! చివరి కోరికని సరిపెట్టుకున్నా
అదే కోంప ముంచింది
కడేరహో బంట్రోతు
ఈ వుద్యోగాలు ఆరేడు తరాల ముందువట
--((**))--
8. . నేటి హాస్యం ఈ విషయం చిన్ని కధ రూపములో వివరించడానికి ప్రయత్నిస్తాను:-
అమలాపురం లో నివసించే పరందామయ్య గారు, ఆకివీడులో నివాసముంటున్న పరాంకుశం గారికి కుమార్తె వివాహ నిమిత్తము రెండొందల రూపాయలు చేబదులుగా ఇచ్చారు. ఆ రోజుల్లో "వాగ్దానము" తరతరాల పంశ గౌరవానికి సంబందించిందిగా, కుటుంబ ప్రతిష్టగా తలచేవారు. ఈ సూత్రాన్ననుసరించి పరాంకుశం గారు, పరందామయ్య గారికి "వచ్చే ఫలసాయానికి చేబదులు తీర్చేస్తాన"ని వాగ్ధానము చేసేసారు.
కష్టాలకు వాగ్దానాలతో సంబందము లేదు.
మొత్తానికి వాగ్ధానము భంగపడ్డాది.
నాలుగు ఫలసాయాలైనా పరాంకుశం గారు నుండి వులుకు,పలుకు లేవు.
కొన్నాళ్ళ పాటు పరాంకుశం గారికి , పరందామయ్య గారినుండి రొక్కము విషయమై వర్తమానాలు అందుతూనే వున్నా ఫలితములో ఎటువంటి మార్పూ లేదు.
పరందామయ్య గారి ఓపిక నశించడముతో పాటు, పైకము అవసరము కూడా పడింది.
అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. ఇక మరే గత్యంతరమూ లేదు.
పరందామయ్య గారు కడేరహో బంట్రోతు ని పిలిపించారు, విషయము వివరించారు, పరాంకుశం గారికి లేఖ రాసిచ్చారు, చిరునామా లేఖలో పొందు పరిచారు, కడేరహో బంట్రోతు ధానా, గుర్రము ధానా నెలకు సరిపోయేంత ఇచ్చారు, పావలా ఇచ్చారు.
కడేరహో బంట్రోతు గుర్రము మీద ఆకివీడు చేరాడు.
వూరి పొలిమేరలనుండీ కనిపించిన ప్రతీవారికీ లేఖ చూంపించి చిరునామా అడిగాడు. మొత్తానికి పరాంకుశం గారిని కనుగొని, లేఖ అందించాడు. ఇంటి వీది గుమ్మం దగ్గర గుర్రాన్ని కట్టేసాడు, ఇంటి వారిని భియ్యము, పప్పు, వుప్పు, కట్టెలు అడిగి, మూడు పేద్ద రాళ్ళు తెచ్చి వంట చేసుకుని తినేసాడు. గుర్రానికి ధానా కూడా ఇంటివారి దగ్గరే తీసుకుని దానికి మేపి వీది గడప మీదే పడుక్కుండిపోయేవాడు. రెండు రోజులయేసరికి గుర్రము, కడేరహో బంట్రోతు చేసిన గలీజు కి వీదంతా కంపు కొట్టేది. పరాంకుశం గారి పరువు మంట గలిసేది.
ఆఖరుకి పరాంకుశం గారి నుండి పైకము, దారి ఖర్చులు పుచ్చుకుని, పరందామయ్య గారికి చేరవేసేవాడు.
పరాంకుశం గారు మళ్ళా పావలా ఇచ్చేవారు
ధన్యవాదాలు
8. . నేటి హాస్యం
వాయ్యో వామ్మో నాయనో నాకు చెముడు వచ్చింది
ఏహే! ముందు ఏడుపు ఆపు!
ఇప్పటి దాకా బాగున్నావు ఏమొచ్చిందిరా?
ఇందాకటి నుంచి నువ్వు మాట్లాడు తున్నావు ,
ఒక్క మాట వినపడటం లేదు నాకు!
ఏడ్చినట్లుంది .... ఇందాకటి నుంచి నేను మాట్లాడటం లేదు ఒక్కపొడి నములుతున్నా
--((**))--
8. . నేటి హాస్యం
నాన్నారూ... నాకు అర్జెంటుగా వెయ్యి రూపాయలు కావాలి. కళ్ళజోడు కొనాలి.
దూరంగా ఉన్న వస్తువులు అస్సలు కనబడట్లేదు.
ఒకసారి వీదిలోకి రా సుపుత్రా!
చెప్పండి నాన్నారూ!
ఆకాశం లో కనిపిస్తున్నారు కదా... అదేమిట్రా?
చంద్రుడు నాన్నారూ!
ఇంతకంటే దూరం చూడాల్సిన అవసరం నీకు ఎందుకొస్తుంది చెప్పు!!!
--((**))--
8. . నేటి హాస్యం "దెయ్యం మొహమా! డెబ్బైరెండు ఏళ్ళోచ్చినా ఇంకా తప్పులు చేస్తూండడమే! నీకెన్నిసార్లు చెప్పానే, కళ్ళజోడు పెట్టుకొని వంట చేయమని, కూర, పప్పునిండా అన్నీ వెంట్రుకలే "
"నేనూ మీకెన్నిసార్లు చెప్పాను?
కళ్ళజోడు లేకుండా అన్నానికి రావద్దని, అవి కొత్తిమీర కాడలు, చూసి అగోరించండి"
--((**))--
8. . నేటి హాస్యం ఏమే కోడలుపిల్లా! మీ ఇంట్లో కుళాయి వుండి కూడా మరో కుళాయి వేయిస్తున్నారు! ఏమిటి కథ?
ఏమీ లేదు అత్తయ్య గారు! ఆయన ఈ నెల
పదవీ విరమణ చేస్తారు!
ఆ వచ్చే డబ్బులతో పాల వ్యాపారం పెడతాము !
ఆ అవసరానికే ప్రత్యేకంగా ఈ కొత్త నీటి కుళాయి!
8. . నేటి హాస్యం
గురువుగారూ! హోటల్ లో భోజనం చేసి వస్తూ రిలయన్స్ మాల్ లో మీ కోసం ఈ పళ్ళు తెచ్చాను, దయచేసి స్వీకరించండి!
తీసుకుంటాను గాని ఓ షరతు.........
నువ్వు న్యాయ శాస్త్ర విధ్యార్దివి కాబట్టి ఆ భాషలోనే నాకు పళ్ళు ఇవ్వాలి.
8. . నేటి హాస్యం
మాష్టారు!
న్యాయపరమైన నా పిత్రార్జితముతో, నేను ఈ పళ్ళను, చట్టప్రకారం వ్యాపారం చేయుచున్న వ్యాపారి దగ్గర కొన్నాను. మా నాన్నగారు నా పోషణ నిమిత్తము పంపుచున్న పైకముపై నాకు క్రయ, విక్రయ, ధాన, వితరణాది హక్కులను ప్రసాదించినారు. ఈ పళ్ళు న్యాయ వ్యతిరేక సొత్తు గాని, ఱుణగ్రస్తమైనవి గాని కావని నిరూపించు నిమిత్తం దుకాణదారుడిచ్చిన కొనుగోలు రశీదును పొందుపరచుచున్నాను.
8. . నేటి హాస్యం
ఈ పళ్ళు మీకు ఇచ్చుటలో కేవలం గురుభక్తి తప్ప, "క్విడ్-ప్రో-కో" వంటి న్యాయ వ్యతిరేక దురాశతో కాదని ప్రకటిస్తున్నాను. నేను మీకు సమర్పించుకుంటున్న ఈ పళ్ళపై మీరు క్రయ, విక్రయ, ధాన, వితరణాది సర్వ హక్కులు కలిగి వుంటారు.
ఈ పళ్ళను మీరు నోటితో కొరికి గాని, ఏ విదమైన ఆయుధముతోనైనను మీకు నచ్చిన భంగిమలో, పరిమాణముులో కోసుకొని తినే హక్కు కలిగి వుంటారు. ఈ పళ్ళలో ఏ విదమైన నిధి, నిక్షేపాలు, బంగారు, వెండి, వజ్ర, వైఢూర్యాలు, రతనాలు, ఖనిజం మొదలైన సంపద నిక్షిప్తమై వున్ననూ మీరు, మీ వారసులు మాత్రమే హక్కుదారులు. ఈ పళ్ళలోని పిక్కలు విత్తనములుగా రూపాంతరము చెంది, ఫలములు తద్వారా సంక్రమించిన ఆస్తులకు కూడా మీరూ, మీ వారసులు మాత్రమే హక్కుదారులు. ఈ పళ్ళద్వారా సంక్రమించే ఆస్తులలో నాకు గాని, నా వారసులకు గాని ఏ విదమైన హక్కు వుండదని ప్రకటిస్తున్నాను.
దయవుంచి గ్రహించ ప్రార్ధన
8. . నేటి హాస్యం ఏమేవ్!
నా బంగారం కట్టుడు పళ్ళు కనిపించి చావట్లా
అలమారులో పెట్టా, చూసి చచ్చావా?
ఆఁ! నల్లపూసలు వున్నట్టుండి పేరుకుపోతే అమంళమేమైనా జరుగుతుందేమేనని హడలిపోయి కంసాలిని పిలిస్తే బంగారం కావాలన్నాడని అవిచ్చేసానండి
నీ పిండాకూడు కాకులకెట్టా
ఆ పళ్ళు లేకపోతే రాత్రి నువ్ పెట్టే వుప్పుపిండం కడుపులోకి దిగక నువ్ అనుకొనే అమంగళం జరిగే తీరుతుందే
మధు! కాఫి ఏదోయ్?
హమ్మయ్య! లేచారా! గంటబట్టి ఎదురు చూస్తున్నాను స్వామీ!
కాఫి కలిపి 50-50 న 60-40 న అన్నది తేల్చుకుని నా వాటా నాకిచ్చి, మీ కాఫి మీరు తాగండి ముందు!
అసలేమౌతోందో నాకిప్పుడే తెలియాలి!
--((**))--
8. . నేటి హాస్యం
నాకు మూడు రోజులు విరామం!
మీ భాషలో శెలవు!
ఏమిటీ! చెప్పా పెట్టకుండా శెలవా?
మాకు వారం ముందు చెబితే గాని PL దొరకదు, ముందు రోజు చెబితే గాని CL దొరకదు,
దొరికినా ఆకస్మిక పని భారం పడితే రద్దైపోతాయి, అటువంటిది నువ్వు చెప్పా పెట్టకుండా శెలవ్ ప్రకటించేసుకుంటావా?
అందునా పళ్ళై పదారో రోజు పండగ కూడా కాలేదు,
రేపు హానీమూన్ కి రిజర్వేషన్ అయిపోయినది, అప్పుడే శెలవా?
అవన్నీ నాకు తెలవదు శ్రీవారూ!
అత్తయ్య గారు మరీ మరీ ఈ విషయంలో వక్కాణించారు మరీనూ,
ఈ మూడు రోజులు అన్ని పనులు మీరే చూసుకోవాలి,
నా దరి చేరరాదు సుమండీ!
సరే! ఇప్పుడు నేనేం చెయ్యాలి?
"నవ్వూ, పువ్వూ లేకుండా ఏమిటా ఆముదం తాగిన ముఖం నువ్వూను " అని నన్ను నిన్న అన్నారుగా, అదే మాట ఇప్పుడు మీకు వర్తిస్తుంది!
ఏదీ ఒక నవ్వు నవ్వండి!
************
14.. నేటి హాస్యం
"ఏమిటా గావు కేకలు? నువ్వు చెప్పినట్టుగానే చారు పెట్టానుగా!
మూడు గ్లాసుల నీళ్ళు, పిడికెడు పసుపు, చిటికెడు చారుపొడి, చెయ్యినిండా వుప్పు, క్రికెట్ బంతి సైజులో చింతపండు, పోపులో ఆవాలు చారెడు చొప్పున పుంజెడు సార్లు, పుంజెడు అంటే నాలుగు సార్లే కదా!
13. . . నేటి హాస్యం
చూడండి శ్రీవారూ! నేన్నదానికి, మీరు విన్నదానికీ సంబంధం లేదు!
ఓహో! తమది స్టెనో వుద్యోగం కదా!
పుస్తకం తెచ్చుకోండి డిక్టేషన్ ఇస్తాను!
12 . నేటి హాస్యం "మర్యాదగా మీ పర్సు ఇవ్వండి!
లేకపోతే నా చేతిలోనున్న ఈ గన్ను పేలుద్ది"
"దొంగగారూ మన మధ్య ఆ గన్నువగొడవలొద్దు!ఇదిగో పర్సు"
"హహ్హహ్హహ్హా! ఇందులో ఒక్క బుల్లెట్ కూడా లేదు"
"పోనీలే! పర్సు పారేద్దామనుకున్నాను చిరిగిపోయిందని. నువ్వడిగేవు కదాని ఇచ్చేసాను" పర్సులో ఒక్క రూపాయి కూడా లేదులే"
11. నేటి హాస్యం
మాష్టారూ! మీరొక్కరేగా స్టేషన్ ప్లాట్ ఫారమ్ మీద వున్నది?
ఔను సారూ!
అయితే నాలుగు ప్లాట్ ఫారమ్ టిక్కెట్లు ఎందుకు కొన్నట్టో?
ఏమీ లేదు సారూ!
ట్రైన్ నాలుగు గంటలు ఆలస్యం!
టిక్కెట్ కాల పరిమితి కేవలం రెండు గంటలే,
ఎనిమిది గంటలు ప్లాట్ ఫారం పై ఉన్నా పర్వా లేదనే వుద్దేశం తో నాలుగూ ఒకేసారి కొనేసాను!
హహ్హహ్హహ్హా!!!!!!!!!
10 . నేటి హాస్యం
పాల వాళ్ళు ధర్నా చేస్తే పాలు రోడ్ మీద పార పోస్తారు ..
కూరగాయల వాళ్ళు ధర్నా చేస్తే కూరగాయలు అన్ని తెచ్చి రోడ్ మీద పడేస్తారు .
ఈ బ్యాంక్ వాళ్లు ఎప్పుడు మారుతారో ఏమో......
ఉట్టి ధర్నాలు మత్రమే చేస్తారు......
బ్యాంకుల సమ్మె.నాడు నోట్ల కట్టలు ఎప్పుడు పారేస్తారో
--((*))--
9. . నేటి హాస్యం
రావే కోడలా! ఈ నరకలోకంలో నేనొక్కర్తినే నరకయాతన పడుతున్నానంటే నమ్ము,
పోనీలే నా నరకయాతనలో నువ్వు కూడా కొంత పంచుకొని నాకు వెసులుబాటు కలిగిద్దువు!
అత్తయ్యగారు! ఈ నరకలోకంలో
గతజన్మ వావి వరుసలుండవస్సలు,
అయినా మీరు నన్ను కాల్చుకుతిన్నది చాలలేదా?
అయినా నేనిక్కడుండేది మూడు రోజులే,
ఆ తరువాత స్వర్గానికే!
నిజమేనే! నిన్ను రాచి రంపాన పెట్టిన పాపం నన్నిక్కడ నరకయాతనలకు గురి చేస్తోందనుకో!
అది సరే గాని కోడలి వల్ల బాహా సుఖపడ్డావా?
అయ్యో రాత!
మా తరం వాళ్ళము రెండిందాలా బాదలనుభవించామనుకో అత్తయ్య!
నా పెళ్ళయ్షాక అత్తగారి ధాష్టీకం
కొడుకు పెళ్ళి చేసుకున్నాక కోడలి ధాష్టీకము!
--((*))--
8. . నేటి హాస్యం
"ఏమండీ ..కోడల్ని చూసారా .ఏమి సంస్కారం ..ఏమి ఒద్దిక ,పొందిక .ఈకాలంలో కూడా ఇలా గంటల తరబడి తలొంచుకుని పెళ్ళి పీఠలపై కూర్చునే ఆడపిల్ల దొరకడం మన పూర్వజన్మ సుక్రుతము, అదృష్టమే "
........................కళ్ళద్దాలెట్టుకుని జాగర్తగా చూడవే
చేతుల్లోనున్న మొబైల్ పని చేస్తోంది
ఆ ..... ఆ...
--((*))--
7. నేటి హాస్యం
"తల్లీ! మీ ఆయన అడుగుజాడల్లో నువ్వు నడవడం లేదని మీ అత్తగారు ఒక్కటే పోరు పెడుతున్నారు"
"అమ్మా! ఆయన అడుగుజాడల్లో నడవాలంటే నేను కూడా రోజూ బార్‌కు, పేకాటకు వెళ్లాలి"
ఆ ...... ఆ......
--((*))--
6. నేటి హాస్యం
MOBILES తో జనబాహుళ్యం ...
*నిద్ర*= కళ్ళు ముసుకుంటే రాదు
*Net* Off చేస్తే వస్తుంది
ఆకలితో ఉన్నవాడికి అన్నం,
Android ఫోన్ వున్న
వాడికి charger ఇవ్వడం పుణ్యకార్యం
కోన్నిరోజుల ముందు వరకు
అందరు *బేటా* కొరకు ఎదురుచుశాం,
ఇప్పుడేమొ *Data* కొరకు
Phone పాడైతే పిల్లలు చేసారంటాం,
పిల్లలు పాడైతే Phone కారణం అంటాం.
ఒకప్పుడు ఇంట్లో నుండి
బయటకు వెళ్ళేటప్పుడు
*పెద్దవాళ్ళ ఆశీర్వాదం* తీసుకుని వెళ్ళేవాళ్ళం,
ఇప్పుడేమొ *ఫోన్ బ్యాటరీ ఫుల్* చేస్కోనీ వెళతాం
Suddenly phone balance ఐపోతే,
మనం మాట్లాడాల్సిన ఆవతలి వ్యక్తి
భూమ్మీద దొరుకుతాడో లేదో అనేంత కంగారు పడిపోతాం
Battery low అయి 1%లేదా 2% మీద ఉందనుకోండీ అప్పుడు చూడాలీ,
చార్జర్ వైపు ఎలా పరుగెడతామంటే
ఉహించుకోండి....
కొందరు phone pattern password ఎలా set చేస్తారంటే,
వామ్మొ.....
దాంట్లో ఎదో ISI పత్రాలు దాచుకున్నట్టు..
అనుకోకుండా ఫోన్ మిత్రుల దగ్గర మరిచిపోయినమనుకో.....
మన అమాయక ప్రేయసీనీ శక్తీమాన్ దగ్గర వదిలేసినట్టు అన్పిస్తుంది..
Mobile company వాళ్ళతో ఒక request ఏంటంటే pls phone back side లో ఒక చిన్న lunch box తయారు చేసేయ్యండీ
--((**))--
5. నేటి హాస్యం
దేముడికి తనవాటా రాబట్టుకోవడం తెలుసు -
ఒక పిసినారి గుడికి వెళ్లి జేబులన్నీ కెలికి ఒక చిరిగిపోయిన పదిరూపాయల నోటు హుండిలో వేసి ప్రసాదం కోసం చూస్తున్నాడు.
అంతలో వెనుక ఉన్న ఒక మహిళ ఇతనికి ఒక 50 రూపాయాల నోట్ల కట్ట అందించిది .
ఈ పిసినారి ఆమెకు హుండీ అందదేమో అనుకుని ఆ కట్ట హుండిలో వేసి బయటకు వస్తు కంగారుగా జేబులు తడుముతున్నాడు -
ఆ మహిళ ఏమిటి ఈ కంగారు అనడిగింది, నా జేబులో ఒక నోట్లకట్ట ఉండాలి, అది లేదు అన్నాడు. మీరు హుండిలో వేసినప్పుడు కింద పడిపోతీ మీకు అందించాను కదా అదీ హుండిలో వేసారు కదా అందా అమ్మడు - పిసినారి తలతిరిగి క్రింద పడిపోయాడు
--((*))--
3. . నేటి హస్యం
శ్రీమతి గారూ!
ఎదురింటి బామ్మగారు ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ?
ఏమీ లేదండీ!
రోజూ రాత్రి దోంగవాడు వాళ్ళ చెట్టెక్కి రెండు, మూడు కొబ్బరి బోండాలు పట్టుకుపోతున్నాడట.
వీడికిలా కాదని ఆవిడ మడి చీర తడిపి రాత్రి చెట్టు చుట్టూ కట్టేరట. ఆ దొంగ ఏకంగా ఏబై బోండాలు మడిచీరెలో మూట కట్టుకుని చక్కా పోయాట్ట.
అవునా ..... అవునండి .....
ఏమి వదల్లేదా
--((**))--
2. . నేటి హస్యం
డాక్టర్ గారూ!
ఆ పేషెంట్ కుట్లు విప్పనివ్వట్లేదు సర్.
డాక్టర్ : ఎందుకు ?
పదివేలు ఇచ్చి కష్టపడి వేయించుకున్న కుట్లుని విప్పుతారెందుకు అని అంటున్నాడు.
--((**))--
1. నేటి హస్యం
గురువు :పిల్లలు నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాదానము చెప్పండి
దేవుడు చేసే పని ఏమిటి ?
పిల్లలు
1 . గురువు స్థానంలో ఉండి బోధ చేయటం కదా మాష్టారు
2. జనన మరణాలు సృష్టించటం కదా మాష్టార్
౩. ప్రళయాన్ని శృష్టించి ఆడుకోవటం కదా సార్
గురువు: రేపటి లోపు సమాధానములు వ్రాసు కొని రండి
మరునాడు : అందరు తమకు తెలిసినవి వ్రాసుకొని వచ్చారు.
గురువు:: ఎం రామకృష్ణ నీవు సమాధానము ఏమి వ్రాసుకు రాలేదు ఏమిటి ?
ముందు మీరు సమాధానము చెప్పండి తర్వాత నేను చెపుతాను అన్నాడు అందరి ముందు
గురువు : ఎం చెప్పాలో తెలియక ఒక్క అరుపు అరిచి పిల్లలకు పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి అన్నాడు .
రామకృష్ణ : నేను చెపుతాను గురువుగారు నాకు అనుమతిస్తే
గురువు : చెప్పు
ఏమీ లేదు నేను సమాధానము చెప్పే వాడ్ని కనుక ఒక్క క్షణం గురువు స్థానంలో ఉంటా అన్నాడు
గురువు : సరే అట్లాగే అని పిల్లల మధ్య కూర్చున్నాడు.
రామకృష్ణ : దేవుడు చేసే పని అహంకారులను క్రింద కూర్చో పెట్టడం , అనుకువగా ఉన్న వారిని అందలం ఎక్కించటం .
ఆ.......... ఆ.....................
--((**))--
Comme
3.మహావ్యాగ్ర: ఈ శిరస్సు శివ సంబంధమైన నంది, గణపతి మరియు ఇతర శివ దేవతలను శరభేశ్వరునితో సహా అణచివేసింది. ఈ శిరస్సును తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే దేవతల నుంచి, దయ్యాల నుండి, ప్రకృతినుండి, మానవులనుండి లభించే అన్ని రకాల ప్రమాదాలు నివారించ బత్తాయి
శ్రీలలితా సహస్రనామ భాష్యము
990వ నామ మంత్రము : ఓం అభ్యాసాతిశయజ్ఞాతాయై నమః
చిరకాలాభ్యాసాతిశయముచే తెలియబడు తల్లికి నమస్కారము।
శ్రీ
కాయ పండు గాను మారి కాల చక్ర మవ్వుటే
కాయ మగును పంచ భూత కళల నిత్య నేతగా
మాయ చేత రోత బతుకు మహిమ లాగ కర్గునే
చేయు నిత్య గీత పఠన చేర్చు మోక్ష మార్గమే
Comments
Post a Comment