సర్వ రోగ నివారిణి.


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: 

ప్రకృతి ప్రసాదించిన అపురూప దివ్యౌషధం ఈ తేనె:

 👉తేనెలో  కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు ఉన్నాయి.

👉 థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్... లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనోఆమ్లాలూ ఎంజైములూ ఉంటాయి.

👉 ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలూ ఎక్కువగా ఉంటాయి

👉కాలిన గాయాలకీ చర్మ క్యాన్సర్లకీ పుండ్లకీ హనీ పూస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి.

👉 ఇది 'యాంటీ మైక్రోబియల్' ఏజెంట్‌గా చక్కగా పనిచేస్తుంది.

👉చెడువాసనల్నీ వాపునీ మచ్చల్నీ కూడా మటుమాయం చేస్తుంది.
 
👉 స్థానికంగా దొరికే తేనెనే మీరు తీసుకుంటే ఆయా కాలాల్లో వచ్చే ఎలర్జీలన్నింటినీ తట్టుకునే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

👉 ఎందుకంటే ఎలర్జీలు సాధారణంగా పరాగరేణువులవల్లే వస్తాయి. 

👉తేనెటీగలు మీ చుట్టుపక్కలున్న వెుక్కల నుంచే కదా తేనెను సేకరిస్తాయి కాబట్టి ఆ పరాగరేణువులు మీ శరీరంలో చేరి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయన్నమాట.

👉ఊబకాయులు పరగడుపున రెండు టీస్పూన్ల నిమ్మరసంలో అరచెంచా తేనెను రంగరించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

👉తేనెలో ఔషధగుణాలున్న నూనెలు, ఫ్లేవోనాయిడ్‌లు, టెర్పీన్లు, పాలీఫినాల్‌లు ఉన్నాయి. ఇవి అనేక రకాల అల్సర్లను తగ్గిస్తాయి.

👉ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు- క్యాన్సర్, హృద్రోగాల్ని అడ్డుకుంటాయి.

👉మధుమేహ వ్యాధిగ్రస్తులు  తేనెను మితంగా తీసుకుంటే బ్లడ్‌షుగర్ ఎంతమాత్రం పెరగదు. 

👉తేనె రక్తప్రవాహంలో మెల్లమెల్లగా కలుస్తూ ఇన్సులిన్ తయారీని నిరోధిస్తుంది.

👉అజీర్తికీ విరేచనాలకీ తేనె దివ్యమైన మందు.

👉తేనె పంచదారకు మంచి ప్రత్యామ్నాయం. పండ్లరసాల్లో తేనె కలిపి తాగితే శక్తి పెరుగుతుంది. అలసట రాదు.

👉రోజు ఉదయాన్నే (పరగడుపున) స్పూన్ నిమ్మరసం, మిరియాల పొడి, తేనే వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. 

👉గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది.

👉తేనెను గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. 

👉ఉదయం పాలలో కలుపుకొని తాగితే బరువు పెరుగుతారు.

👉తేనె చాలా సులభంగా జీర్ణమై, ఇతర ఆహార పదార్థాలకంటే త్వరగా రక్తంలో కలుస్తుంది.

👉తేనె తింటే సున్నితమైన జీర్ణాశయం లోపలి పొరకు ఎలాంటి హాని కలగదు.

👉రక్తంలో కలిసిన తేనె మూత్రపిండాలు, ఇతర అంతర్భాగాలకు వినాశనకారి కాదు.

👉తేనె త్వరగా జీర్ణమై ఇతర ఆహారపదార్థాల కంటే ఎక్కువ శక్తి ఉత్పాదకతను కలిగి ఉంటుంది.

👉జుట్టుకు తేనె రాస్తే తెల్లబడుతుంది. కాబట్టి పొరబాటున కూడా రాయవద్దు...' అనేది మన పెద్దవాళ్ల హెచ్చరిక ఎంతమాత్రం నిజం కాదు, తేనెవల్ల పొడిబారిన జుట్టు మృదువుగా అవుతుంది.

👉చర్మంలోని తేమగుణాన్ని పెంపొందించే శక్తి తేనెకు ఉంది ఉంది.

👉పొడి జుట్టుకి తేనె, మందారం కలిపి మాస్క్ వేస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.

👉తేనె లిప్‌బామ్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. పగిలిన పెదాల్ని సంరక్షిస్తుంది.

👉పాలు, తేనెల మిశ్రమాన్ని లేదా సెనగపిండిలో తెల్లసొన, తేనె కలిపి చర్మానికీ ముఖానికీ పట్టిస్తే అవి కాంతిమంతంగా మెరుస్తాయి.

👉మొటిమలు ఉన్న చోట తేనె రాసి ఒక అరగంట తర్వాత వెచ్చని నీటితో, తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తే మొటిమలు తగ్గుతాయి.

👉కృష్ణ వృత్తాలకి తేనెతో మసాజ్ చేసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి ఇలా ప్రతిరోజు చేస్తే కృష్ణ వృత్తాలు తగ్గుతాయి.

👉మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తేనెను వాడాలి.

👉తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు.

👉 అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు. 

👉తేనెను మరిగించకూడదు. తేనె ఉష్ణ వీర్య పదార్థం కాబట్టి తేనెను నేరుగా మంటపైన వేడిచేయకూడదు. 

👉తేనెను వేడి వాతావరణంలోనూ, ఎండాకాలంలో పరిమితంగానే వాడాలి. 

👉మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతోనూ కలపకూడదు.

👉తేనెను వర్షం నీళ్లతో కలిపి వాడకూడదు.

👉తేనెను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచితే పంచదార స్పటికాలు తయారవుతాయి.  

👉తేనెటీగలు రకరకాల పుల మకరందాలను పోగు చేసి తేనే రూపము లో మనకి అందిస్తున్నాయి .

👉తేనే లో ఉన్నా విటమిన్స్... శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిన్చును,

👉నిమ్మ రసము తో కలిపి దగ్గు , గొంతు నొప్పులకు బాగా పనిచేయును ,

👉యాంటీ బ్యాక్టీరియల్,  యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నందున చర్మము పై పూసిన గాయాలు మానును .

👉రాత్రిళ్ళు పాలు తేనే కలుపుకొనే త్రాగితే చక్కటి నిద్ర వస్తుంది.

👉నిమ్మ రసం లో తేనే కలుపుకొని తీసుకుంటే కడుపు ఉబ్బరం , ఆయాసము తగ్గుతుంది .

👉రెండు చెంచాల తేనే లో కోడిగుడ్డు లోని తెల్లని సొన , కొంచెం శనగపిండి కలుపుకొని ముఖానికి మర్దన చేసుకుంటే చర్మపు కాంతి పెరుగుతుంది .

👉తేనే లో పసుపు , వేపాకు పొడి కలిపి రాస్తే పుండ్లు మానుతాయి .

👉 తేనె (15 భాగాలు), దాల్చిన చెక్క పొడి (1 భాగం) ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పూట 2వారాలపాటు ప్రయోగిస్తే మొటిమలు తగ్గుతాయి.

👉 2 చెంచాలు తేనెను కప్పు దాల్చిన చెక్క కషాయానికి కలిపి పుచ్చుకుంటే కీళ్లనొప్పిలో ఉపశమనం లభిస్తుంది.

👉 తేనెకు పసుపును చేర్చి బాగా కలిపి పై పూతగా ప్రయోగిస్తే అగ్నిదగ్ధ వ్రణాలు మచ్చపడకుండా ఇన్ఫెక్షన్ కి గురికాకుండా త్వరగా తగ్గుతాయి.

👉 తేనె (4 భాగాలు), పిప్పళ్ల పొడి (1 భాగం), మిరియం పొడి, లవంగాల పొడి, జీలకర్ర పొడి కలిపి గొంతు తగిలేలా పుక్కిట పడితే గొంతునొప్పి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

👉2 భాగాల తేనెకు 1 భాగం మీగడను, నాలుగైదు చుక్కలు రోజ్ వాటర్‌ని కలిపి పెదవుల మీద ప్రయోగిస్తే పెదవుల పగుళ్లు తగ్గి నున్నగా తయారవుతాయి.

 తేనెకు జాజికాయ పొడిని కలిపి ఇస్తే పిల్లల్లో అతిసారం తగ్గుతుంది.

👉 2 చెంచాల తేనెను గ్లాసు నీళ్లకు చేర్చి వ్యాయామం ముందు తీసుకుంటే వ్యాయమ సమయంలో నిస్త్రాణ, నిస్సత్తువలు రాకుండా ఉంటాయి.

👉శృంగారానికి తేనె చాలా మంచి ఔషధం. టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి అవసరమయ్యే బీ విటమిన్ తేనె లో అధికంగా ఉంది.

👉 తేనె(3 భాగాలు), దాల్చిన పొడి (1 భాగం), ఆలివ్ నూనె (తగినంత) ఈ నిష్పత్తిలో కలిపి తలమీద ప్రయోగించి పావుగంట తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయి.

👉 3 భాగాల తేనెకు 1 భాగం దాల్చిన చెక్క పొడిని కలిపి పుచ్చుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

👉 3 భాగాల తేనెకు 1 భాగం దాల్చిన చెక్క పొడిని కలిపి చిగుళ్ల పైన ప్రయోగిస్తే వాపు తగ్గి దంతశూల నుంచి ఉపశమనం లభిస్తుంది.

👉 చెంచాడు దాల్చిన చెక్క పొడిని 2 గ్లాసుల నీళ్లకు చేర్చి అరగ్లాసు కషాయం మిగిలేంతవరకూ మరిగించాలి. దీనికి మూడు టీస్పూన్లు తేనెను కలిపి ఆహారానికి అరగంట ముందు రెండు పూటలా పుచ్చుకుంటూ ఉంటే స్థూలకాయంలో మంచి ఫలితం కనిపిస్తుంది.

👉 తేనెకు తగినంత పాల పొడి కలిపి ఫేస్‌మాస్క్ మాదిరిగా పెట్టుకుంటుంటే ముఖం మీద వున్న మంగు తొలగి కాంతివంతంగా తయారవుతుంది.

👉 తేనెను బాదం పప్పు పొడికి కలిపి పేస్టుగాచేసి ముఖం మీద ప్రయోగించి రుద్దుకోవాలి. 

👉ఇది చక్కని స్క్రబ్‌గా పనిచేస్తుంది. చర్మంమీద పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

👉 వృద్ధాప్య సమస్యల్లో తేనె చక్కగా ఉపయోగపడుతుంది. తేనె జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని సేద తీరేలా చేస్తుంది. మెదడును నిశ్శబ్దపరుస్తుంది. చర్మాన్ని బిగువుగా చేస్తుంది. చిన్నపాటి నొప్పులను దూరంచేస్తుంది. 

👉ఒక జగ్గులో 3 కప్పుల తేనెను, 2 కప్పుల సిడర్ వెనిగార్‌ని, 1 కప్పు నీళ్లను కలపాలి. దీనిని ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు చొప్పున తాగుతుంటే వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉంటుంది.

👉 ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉన్నవారు, హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నవారు తేనెను వాడి ప్రయోజనం పొందవచ్చు. 

👉తాజా ఆకుకూరల మీద తేనెను పరిచి తీసుకుంటుంటే హితకరంగా ఉంటుంది. రక్తహీనత క్రమంగా దూరమవుతుంది.

👉 1 లీటరు వేడి నీళ్లకు 1 కప్పు తేనెను, అరకప్పు నిమ్మ రసాన్ని చేర్చి నూలు గుడ్డను ముంచి నొప్పి, వాపు ఉన్నచోట కీలుమీద పరిస్తే కీళ్ళ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

👉 ఒక బాటిల్‌లో మూడువంతులు సిడర్ వెనిగార్‌ని నింపి, కప్పు తేనెను కలపాలి. బాగా గిలకొట్టాలి. దీనిని ఆహారం తర్వాత మౌత్‌వాష్‌గా పుక్కిట పట్టాలి. చివరగా నీళ్లతో పుక్కిలించాలి. దీంతో నోటి దుర్వాసన దూరమవుతుంది.

👉 చిన్నపిల్లలు పక్క తడుపుతున్నప్పుడు రెండు టీ స్పూన్ల తేనెను పిల్లలకు రెండుపూటలా ఇస్తుండాలి. 

👉 రెండు చెంచాలు తేనెను, కోడిగుడ్డు తెల్లసొనను, గోధుమ పిండిని కలిపి పేస్టుమాదిరిగా చేసి సెగ్గడ్డమీద పూసి పైన గుడ్డతో కట్టుకట్టాలి. ఇలా చేస్తే గడ్డ పగిలిపోతుంది.

👉 తేనెను వేడి పాలకు గాని, కాఫీకి గాని లేదా టీకి గాని కలిపి పుచ్చుకుంటే గొంతులో అసౌకర్యంగా ఊపిరితిత్తుల్లో పట్టేసినట్లు ఉండటం తగ్గుతుంది.

👉చెంచాడు అల్లం రసానికి చెంచాడు తేనెను కలిపి మూడు పూటలా పుచ్చుకుంటూ వుంటే దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది.

👉 స్టౌ వద్ద కాలిన గాయాలకు, వేడి నీళ్లుపడటంవల్ల కాలిన గాయాలకు తేనెను నేరుగా ప్రయోగించవచ్చు. 

👉 మోచేతులు, పాదాల వంటి భాగాల్లో చర్మం పగిలి ఇబ్బందిని కలిగిస్తుంటే తేనె, నిమ్మరసం ఆలివ్ నూనె కలిపి పేస్టులా చేసి ప్రయోగించాలి.

👉 ఒక కప్పు వేడి పాలలో, చెంచా తేనె కలిపి పిల్లలతో తాగిస్తే అలసట దూరమై పుష్టిగా తయారవుతారు. 

👉కడుపులో క్రిములను, పుండ్లను తగ్గించడానికి, రక్తలేమిని నివారించడానికి ఇది చక్కని ఔషధం. 

👉రాత్రి పడుకునే ముందు తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది.

👉 రెండు చెంచాల తేనె, నాలుగు చెంచాల నిమ్మరసం, చిటికెడు ఉప్పు బాగా కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించాలి. ఇలా చేస్తే నోట్లో పొక్కులు, దుర్వాసన తగ్గుతాయి.

👉 పొద్దున్నే కాఫీ, టీలకు బదులుగా తేనె టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

👉 పరగడుపున కప్పు వేణ్నీళ్లలో చెంచా తేనె కలిపి మెల్లగా చప్పరిస్తూ తాగాలి. అజీర్తి సమస్యలకు ఇది చక్కని ఔషధం. రోజుకు రెండు మూడు సార్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది.

👉 కప్పు వేణ్నీళ్లలో కొంచెం నిమ్మరసం, చెంచా తేనెను బాగా కలపాలి. కాలేయ సమస్యలున్న వాళ్లు దీన్ని తాగితే మంచి ఫలితాలుంటాయి. ముఖ వర్ఛస్సు పెరుగుతుంది. శరీరం మీద మచ్చలు చాలా తేలిగ్గా తగ్గుతాయి. పడుకునే ముందు తాగితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు  ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏

--(())--

మెంతుల ఆరోగ్య ప్రయోజనాలు 

👉మెంతి కూర రోజూ మన ఆహారంతో పాటు తీసుకుంటే మన ఆరోగ్యానికి తిరుగులేదు. 

👉మెంతి పొడి, 5 నుండి 50 గ్రాముల మోతాదులో తీసుకోవడం వలన కార్బోహైడ్రేట్ జీవక్రియను మెరుగుపరుస్తుంది.
 
👉 మధుమేహంతో  బాధపడుతున్న వ్యక్తుల్లో రక్త  గ్లూకోస్ స్థాయిలను తగ్గిస్తుంది.

👉 మెంతి నీటిలో గాలక్టోమన్నన్ (galactomannan) ఉంటుంది, ఇది ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

👉నీటిలో నానబెట్టిన మెంతులను రాత్రి పడుకునేముందు తీసుకుంటే అధికముగా ఉన్న కొవ్వు తగ్గుతుంది.

👉ఇది మాత్రమే కాక రక్తపోటు స్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది.

👉 ఋతుస్రావం మొదటి మూడు రోజులలో వచ్చే కడుపు నొప్పి కి మెంతులు వాడటం వలన నొప్పిని తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.

👉 ఇది  ఋతు చక్రాలను క్రమబద్ధీకరించడంలో కూడా  సహాయపడుతుంది.

👉కడుపు ఉబ్బరం మరియు అజీర్ణం వంటి వివిధ కడుపు సమస్యలను నివారించడానికి మెంతి విత్తనాలు సాంప్రదాయకంగా ఉపయోగిస్తారు.

👉కడుపు, కడుపులోని పేగులను మెంతులు శుభ్రం చేస్తాయి.

👉 ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన, అవి మలబద్ధకాన్ని కూడా నివారించవచ్చు.

👉 మెంతుల యొక్క పాలి ఇన్సురరేట్డ్ కొవ్వు ఆమ్లాలు (polyunsaturated fatty acids) అనేవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.

👉  ఈ కారణంగా కీళ్ళ నొప్పి తగ్గించడానికి మరియు ఆర్థిరైటిక్ వ్యక్తులలో వాపును తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

👉మెంతి విత్తనాలను వివిధ జీర్ణ సమస్యలను నివారించడానికి ఉపయోగిస్తారు.

 👉 శరీరంలో వేడినొప్పి తగ్గించే ప్రభావం, మలబద్ధకం మరియు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను నివారించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 

👉రోజుకు కనీసం రెండుసార్లు మెంతిపొడిని తీసుకుంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని కూడా నిరోధిస్తుంది.

👉పైత్యం ఎక్కువగా ఉన్నపుడు మెంతి ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి దానికి ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.

👉మెంతులు స్త్రీలలో వివిధ రకాల రుగ్మతలను నయం చేయడానికి ఉపయోగించబడతాయి.

👉మహిళల పాలిసిస్టిక్ అండాశయ వ్యాధి లేదా సిండ్రోమ్ యొక్క లక్షణాలను నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది.

👉 మెంతి విత్తనాల దీర్ఘకాలిక వినియోగం కూడా అండాశయ తిత్తులు మొత్తం పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

👉మెంతికూర కు గాయాన్ని తగ్గించే మరియు వాపును నివారించే లక్షణాలు ఉండడం వలన దీనిని ఎక్కువగా శ్వాసకోశ వ్యాధుల లక్షణాల ప్రభావాన్ని తగ్గించేందుకు వినియోగిస్తారు.

👉 మెంతులకి యాంటీ బాక్టీరియల్ మరియు యాంటివైరల్ లక్షణాలను కలిగి ఉన్న కారణంగా ఇది శ్వాసకోశ వ్యాధులకు బాధ్యత వహిస్తున్న సూక్ష్మజీవులను నాశనం చేయడానికి సహాయపడుతుంది.

👉దీని ఉపశమనం కలిగించే చర్యలు శ్లేష్మ పొరను మెత్తగా చేసి కఫాన్ని పోగొడతాయి. 

👉మెంతులను తీసుకోవడం వల్ల కిడ్నీ, మూత్రణాళ సభందిత సమస్యలు నయమవుతాయి.

👉ఇంకా శరీరంపై వేడి ప్రభావాలు, బ్రోన్కైటిస్ వంటి వివిధ శ్వాసకోశ రుగ్మతల లక్షణాల నుండి మరియు దగ్గు మరియు సాధారణ జలుబు వంటి సాధారణ అంటురోగాల నుండి ఉపశమనంలభిస్తుంది.

👉మెంతులు,  దాల్చినచెక్క, అల్లం లేదా మిరియాలతో చేసిన టీ ని తీసుకోవడం వలన మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.

👉 ఇది మీ ఇన్సులిన్ మరియు ఇతర నియంత్రిత ఔషధాలపై మీరు ఆధార పడడాన్ని తగ్గిస్తుంది.

👉మెంతి ఆకులను దంచి తలకు పట్టిస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా వెంట్రుకలు నిగానిగలాడుతాయి.

👉ముఖం పై వైట్ హెడ్స్ ఉన్నవారు ఈ మెంతి ఆకు పేస్ట్ ని రాత్రి పూట అప్లై చేసి ఉదయం శుభ్రం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా ఈ వైట్ హెడ్స్ సమస్య తగ్గుతుంది.


--(())--

* సంపూర్ణ ఆరోగ్యానికి సిరి సంపదలు ఈ చిరుధాన్యాలు- 

👉ఆధునిక వ్యవసాయ పద్దతిలో ఉత్పాదన చేసిన పదార్థాలను తినడం కారణంగా నేడు ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. 

👉ఆ రోగాలను దేహం నుంచి దూరం చేసే శక్తి ఈ చిరు ధాన్యాలకు (కొర్రలు, అండుకొర్రలు ,ఊదలు, సామలు ,అరికెలు) ఉంది. 

👉చిరు ధాన్యాల్లో ఇంకా రాగులు, సజ్జలు , వరిగెలు తడి తార ధాన్యాలు ఉన్నాయి. వీటికి తటస్థ ధాన్యాలు అని పేరు పెట్టారు.

👉ఈ తటస్థ ధాన్యాలు రోగాలను దూరం చేయలేవు. 

👉పైన పేర్కొన్న చిరుధాన్యాలు రోగాలను నయం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని మనకు ఇస్తున్నాయి అందుకే వాటిని సిరిధాన్యాలు అని పిలవబడుతోంది. 

👉సిరిధాన్యాలు ( కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలు ) ప్రకృతి ప్రసాదించిన ఓషధ గుణాల సమ్మిళితమై తిండిగింజలు.

👉 వీటిని తరచూ క్రమం తప్పకుండా తింటూవుంటే 6 నెలల నుంచి 2 సవత్సరాలలో ఎవరైనా వారి వ్యాధులను నిర్ములించుకోవచ్చు.

👉 సిరిధాన్యాలు పోషకాలను అందరించడమే కాకుండా, రోగ కారకాలను శరీరం నుంచి తొలగించి, దేహాన్ని శుద్ధి చేసి మనిషికి ఆరోగ్యం అందిస్తాయి.

ఏ సిరిధాన్యం ఏ యే వ్యాధులను తగ్గిస్తుంది? 

👉కొర్రలు : నరాల శక్తి , మానసిక దృఢత్వం,అర్థరైటిస్, పార్కిన్ సన్, మూర్చరోగాల నుంచి విముక్తి.

👉అరికెలు : రక్తశుద్ధి , రక్తహీనత, రోగనిరోధక శక్తీ, మధుమేహం, మలబద్దకం, నిద్రలేమి సమస్యల నివారణ.

👉ఊదలు: లివరు మరియూ కిడ్నీ సమస్యలు, కొలెస్ట్రాల్ తగ్గించడం, కామెర్లు సమస్యల నివారణ.

👉సామలు : అండాశయం, వీర్యకణ సమస్యలు, పిసిఓడి , సంతానలేమి సమస్యల నివారణ.

👉అండుకొర్రలు : జీర్ణాశయ సమస్యలు, ఆర్థరైటిస్, బి.పి., థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణ.

✍️సిరిధాన్యాల ఆరోగ్య విలువలు:

కొర్ర బియ్యం: 
👉గర్భిణీ స్త్రీలకూ మంచి ఆహారమని చెప్పవచ్చు. 

👉కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కూడా పోగెట్టే సరైన ధాన్యమిది.

👉 పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మూర్ఛలు వస్తాయి. దీనిని పోగొట్టగలిగే లక్షణం కొర్రలకు ఉంది.

👉  నరాల బలహీనత కు సరైన ఆహరం కొర్ర బియ్యం. 

👉కొన్ని రకాల చర్మ రోగాలను తగ్గించేందుకు, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఉదర క్యాన్సర్,పార్కిన్సన్ రోగం ఆస్తమా (అరికెలతో పాటుగా )నివారించడంలో కూడా కొర్రబియ్యం ఉపయోగపడుతుంది.

అరికెలు బియ్యం :
👉రక్త శుద్ధికి, ఎముకల గుజ్జు సమర్థవంతంగా పనిచేసేలా చూసేందుకు, ఆస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, ప్రోస్టేటు, రక్త క్యాన్సర్, ప్రేగులు, థైరాయిడు, గొంతు,క్లోమ గ్రంథులు, కాలేయపు క్యాన్సర్లు తగ్గించుకోవడానికి

👉డెంగ్యూ, టైఫాయిడు, వైరస్ జ్వరాలతో నీరసించిన వారి రక్తం శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి ఈ అరికెలు.

సామ బియ్యం:
👉 మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులు బాగు చేస్తాయి . 

👉ఆడవారిలో పీసీఓడీ తగ్గించుకోవచ్చు. 

👉మగ వారిలో వీర్యకరణల సంఖ్య పెరుగుతుంది.

👉  నాడి వ్యవస్థ శుద్ధికి, మెదడు, గొంతు, రక్త క్యాన్సర్, థైరాయిడు, క్లోమ గ్రంథుల క్యాన్సర్ల నియంత్రణకు ఇవి వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.

ఊద బియ్యం: 
👉థైరాయిడు, క్లోమ, గ్రంథులకు మంచివి. 

👉చక్కెర వ్యాధిని పారదోలుతాయి. 

👉కాలేయం , మూత్రాశయం , గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి.

👉 కామెర్లను తగ్గించడానికి వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. 

👉కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊద బియ్యం పనికివస్తాయి.

అండుకొర్ర బియ్యం : 
👉మొలలు, మూలశంక, ఫిషర్లు. అల్సర్లు, మెదడు, రక్తం, స్తనాలు ఎముకలు , ఉదరప్రేగుల,చర్మ సంబంధ క్యాన్సర్లను చికిత్సకు బాగా ఉపయోగపడుతాయి.

👉చిరు ధాన్యాలను తీసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు:

👉రోజు 50 నుండి 70 నిముషాలు నడవడం అవసరం.

👉అధికంగా ఆకుకూరలు, సేంద్రియ ఆహరం తీసుకోవాలి.

👉మునగ ఆకు, మునగ కాయ, మెంతులు, మెంతికూర, కలబంద, కాకరకాయ, బెండకాయ, జామకాయల వాడకం పెంచుకోవాలి. 

👉జామ,నేరేడు, మామిడి ఆకుల కషాయాన్ని ఉదయం తాగాలి.

👉పాల వాడకం తగ్గించి పెరుగు మజ్జిగల రూపంలోనే తీసుకోవాలి. 

👉 మైదాతో చేసిన ఆహారాలను, రిఫైన్డ్ నూనెలను దూరంగా ఉంచాలి. 

👉 గానుగ నూనెలు గాని ఆర్గానిక్  నూనెలు వినియోగించాలి.

👉ఉద్రేకాలు, ఆవేశాలను నియంత్రించుకోవాలి.

👉వరి అన్నం, గోధుమలు , మైదాతో కూడిన పదార్థాలు అతి తక్కువ వాడటం లేదా వాటిని పూర్తిగా దూరంగా ఉంచాలి.

🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు  ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏


--(())--

* కాకరకాయలో ఉన్న గొప్ప ఔషధ గుణాలు:

👉కాకర కాయ రసం చేదుగా ఉన్నా.. ఈ చేదే ఎన్నో ఔషాధాల సమ్మేళనం.

👉కాకర కాయలో  బీ, సి విటమిన్లతో పాటు పొటాషియం, మేగ్సీషియం, సోడియం, ఫాస్పరస్ వంటి ధాతువులు ఉన్నాయి. 

👉మనం తినే ఆకు కూరల్లో ఉన్న క్యాల్షియం కంటే కాకరలో రెండింతలు అధికంగా క్యాల్షియం వుంటుంది.

👉కాకరకాయ జ్యూస్‌ను రోజూ తాగితే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.

👉 కాకరకాయ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి.

👉 కాకరకాయ జ్యూస్‌లో ఉండే ఔషధ గుణాలు ఇన్సులిన్‌లా పనిచేస్తాయి. అందువల్ల షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

👉కాకర కంటి శుక్లం, దృష్టి లోపం సమస్యల నివారిణిగా పనిచేస్తుంది. 

👉ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ "A" కళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. 

👉కాకరకాయ  అతిసారం,నులిపురుగులు, గజ్జి, తామర వంటి చర్మవ్యాధులకు కాకర కాయలు ఔషధంగా ఉపయోగపడతాయి.

👉శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

👉అలెర్జీలు దరి చేరవు. వైరస్, బాక్టీరియాపై పోరాడుతోంది. 

👉ఇందులోని అనామ్లజనకాలు అనారోగ్యానికి వ్యతిరేకంగా శక్తివంతమైన రక్షణ కేంద్రాలుగా పనిచేస్తాయి. 

👉 ముఖ్యంగా మహిళలో వచ్చే గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

👉మలబద్దకాన్ని వదిలించుకునేందుకు రోజుకు రెండు సార్లు అరస్పూన్‌ చొప్పున తీసుకుంటే చాలు.

👉 తాజాగా తీసిన కాకర పసరును, నీళ్ళతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. 

👉కాకరకాయలో ఇనుము, మెగ్నీషియం, పోటాషియం, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

👉ఒక్క కాకర కాయలో బచ్చలికూరలో ఉండే కాల్షియం, ఒక అరటి పండులో ఉండే పొటాషియం ఉంది. 

👉కాకర కాయ రసంలో  చేదు తగ్గాలంటే కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే మంచిది. 

👉నల్ల మిరియాలు, అల్లం చిటెకెడు కలుపుకుంటే మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

👉కాకర రసం శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించటంలో దోహదపడుతుంది. 

👉 గుండెపోటును, రక్తపోటును కూడా గణనీయంగా తగ్గిస్తుంది. 

👉కాకర కాయ రసంలో ఇనుము, ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించి హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

👉కాకర కాయ గుజ్జులో విటమిన్ ఏ, సి తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. 

👉 శరీర ముడతలనుపోగొడుతోంది. చర్మ సంబంధమైన రోగాలను తగ్గిస్తుంది.

👉విటమిన్ ఏ, సి, జింక్ చర్మానికి మెరుపును అందిస్తాయి. 

👉జుట్టుకు కాకర కాయ గుజ్జును రాసుకోవటం వల్ల నిగనిగలాడుతూ మెరుస్తుంది. 

👉చుండ్రు నివారణకు దోహదం చేస్తుంది. తల దురదను తగ్గిస్తుంది. 

👉కాకర కాయ రసానికి పెరుగు, స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ వలే తయారు చేసుకుని రాసుకుని 30 నిమిషాలు తలస్నానం చేస్తే కాంతివంతంగా ఉంటుంది.

👉మద్యం సేవించేవారు ఈ కాకార కాయ రసాన్ని సేవిస్తే కాలేయంలో పేరుకుపోయిన ఆల్కాహాల్‌ను పూర్తిగా శుభ్రం చేస్తుంది. 

👉కాలేయ సమస్యలను నివారిస్తుంది. 

👉కాలేయ ఎంజైమ్ల యాంటీ ఆక్సిడెంట్ పటిష్టత ద్వారా కాలేయ వైఫల్య సమస్యలను అధిగమించవచ్చు. 

👉మూత్రాశయం పనితీరు కూడా బాగుంటుంది.

👉కొవ్వు కణాల తొలగించటంలో చక్కగా ఉపకరిస్తుంది. 

👉కాకరకాయలో కొవ్వు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. 

👉ఈ రసాన్ని సేవిస్తే సులభంగా బరువు తగ్గవచ్చు.

👉 కొత్తగా కొవ్వు కణాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. ఊబకాయంతో బాధపడేవారికి మంచి చికిత్స.

👉 కాకరకాయ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. 

👉కాకరకాయ జ్యూస్‌లో ఉండే ఔషధ గుణాలు ఇన్సులిన్‌లా పనిచేస్తాయి. 

👉కాకరకాయ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగితే అధిక బరువు తగ్గుతారు. 

👉శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. 

👉జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. 

👉జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. 

👉కాకరకాయల్లో సమృద్ధిగా ఉండే ఫైబర్ మలబద్దక సమస్యను పోగొడుతుంది.

👉గ్యాస్, అసిడిటీ, అజీర్ణం ఉండవు.

👉కాకరకాయలో ఉండే ఔషధ పదార్థాలు శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపి శరీరాన్ని శుభ్రం చేస్తాయి.

👉 చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. 

👉 కాకరకాయ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల శరరీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సమస్యలు రావు. 

👉కాకరకాయ జ్యూస్‌ను రోజూ తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

👉 కాకర జ్యూస్‌ను రోజూ ఒక గ్లాస్ తీసుకుంటూ వస్తే రక్తపోటు, హైబీపీ, అలర్జీలను దూరం చేసుకోవచ్చు. 

👉రెండు స్పూన్ల కాకర రసంతో కాసింత నిమ్మరసం చేర్చి మూడు నుంచి ఆరు నెలల పాటు తీసుకుంటే రక్త సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చు.

👉 కాకర ప్రారంభ దశలో ఉన్న కలరాను దూరం చేస్తుంది.  కలరాతో ఏర్పడే వాంతులకు కూడా కాకర కళ్లెం వేస్తుంది. 

👉 కాకర జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటూ వస్తే కంటి సమస్యలు, దృష్టిలోపాలను దూరం చేసుకోవచ్చు. 

👉కాకర పండును తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. 

👉 అలెర్జీ, చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటి వ్యాధుల్ని కూడా కాకర నయం చేస్తుంది.

👉 శ్వాస సంబంధిత సమస్యలకు సైతం కాకర దివ్యౌషధంగా పనిచేస్తుంది. 

👉కీళ్ళనొప్పులు తగ్గించే గుణం కాకర కాయకు ఉంది.

👉 కాకరరసాన్ని బాధిస్తున్న కీలుమీద రాసి నెమ్మదిగా మర్దన చేయాలి. 

👉షుగర్‌ వ్యాది గలవారు మూడు నెలలపాటు వరుసగా కాకరరసం తీసుకోవాలి. 

👉కాకరను ఆహారంగా తీసుకున్నా, షుగర్‌ స్థాయి మారుతుంది. 

👉కడుపులో పరాన్నజీవులు చేరటంవల్ల పలురకాల ఇబ్బందులు, అనారోగ్యాలు వస్తాయి. ఆ అనారోగ్యకారక పరాన్నజీవులను కాకరపసరు తొలగిస్తుంది.


--(())--

0_149d5a_c56bf0f1_orig (600×800)

ఆముదం యొక్క గొప్ప ఆరోగ్య అద్భుతాలు..

👉ఇది కారం, చేదు రుచులతో వేడి చేసే స్వభావం కలిగి ఉంటుంది. 

👉ఆముదం నూనెలో విటమిన్‌ ఈ, ప్రోటీన్లు, ఖనిజలవణాలు సమృద్ధిగా ఉంటాయి. 

👉ఆముదంలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీయాసిడ్లు అధిక మోతాదులో లభిస్తాయి.

👉 అంతేకాకుండా, చర్మానికి అవసరమయ్యే పోషకాలు మరియు అత్యవసర విటమిన్లు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి, అందానికి చాలా ఉపయోగపడతాయి.

👉ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఆముదంలో పుష్కలంగా ఉంటాయి. ఇవి కొత్త ఆరోగ్యకరమైన చర్మ కణాలను, కాంతివంతమైన చర్మాన్ని వృద్ధి చేస్తాయి. 

👉అంతేకాక, అకాల చర్మసంబంధమైన ముడతలను నివారించడానికి సహాయం చేస్తుంది. అతినీలలోహిత కిరణాలు యొక్క ప్రభావం చర్మంపై పడకుండా ఒక రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది.

👉సమస్త వాతరోగాలనూ పోగొట్టడంలో అగ్రస్థానం లో ఉన్నది. 

👉కడుపులోను, పొత్తికడుపులోను వచ్చే నొప్పులను, రక్తవికారాలను నివారింప చేస్తుంది. 

👉మొలలు హృద్రోగము, విషజ్వరము, కుష్ఠు, దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర బంధము మొదలైన సమస్యలను కూడా సులువుగా పోగొడుతుంది.

👉 శరీరంలో పేరుకుపోయిన దుష్ట విష పదార్థాలను కరిగించి బయటకు తోసివేస్తుంది. 

👉నరాలకు సత్తువ కలిగిస్తుంది. 

👉కడుపు నొప్పిని తగ్గించటంలో ఇంత నాణ్యమైనది మరొకటి లేదని కూడా చెప్పవచ్చు.
  
 👉దీనిని దీపాలు వెలిగించడానికి ఉపయోగిస్తారు.

👉 ఆయుర్వేదంలో విరేచనకారిగా ఉపయోగించారు.

 👉ఆముదపు ఆకుల రసం పచ్చకామెర్లు వ్యాధిని కొన్ని రోజులలో నయం చేస్తుంది. 

👉 చెవిపోటుకు... ఆముదపు ఆకులను నిప్పులపైన వెచ్చచేసి దంచి రసం తీసి, దానితో సమానంగా అల్లం రసం, నువ్వుల నూనె, అతి మధు రం, ఉప్పు కలిపి తైలం మిగిలేవరకు చిన్న మంట మీద మరగబెట్టి వడపోసి, ఆ నూనె చెవిలో పది చుక్కలు వేస్తే వెంటనే చెవిపోటు తగ్గిపోతుంది.

👉 శరీరంపై నల్ల మచ్చలకు... ఆముదపు గింజలు 225 తీసుకొని పై పెచ్చులు తీసివేసి, లోపలి పప్పులో 12 గ్రాముల శొంఠి పొడి కలిపి మెత్తగా నూరి, కుంకుడు గింజలంత మాత్రలు చేసి నిలువ ఉంచుకొని, పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటలా మంచి నీళ్ళతో వేసుకొంటూ ఉంటే రెండు లేక మూడు నెలల్లో నల్లమచ్చలన్నీ సమసిపోతాయి. 

👉బోదకాలకు... ఆముదం వేళ్ళు, ఉమ్మెత్త వేళ్ళు, వావిలి చెట్టు వేళ్ళు, తెల్ల గలిజేరు వేళ్ళు, మునగ చెట్టు వేళ్ళు, ఆవాలు వీటిని సమానంగా తీసుకొని మంచి నీటితో దంచి రసాలు తీసి, ఆ రసం ఎంత ఉంటే అంత ఆముదం కలిపి, నూనె మాత్రమే మిగిలే వరకు మరగబెట్టి, వడపోసి, ఆ నూనెలో సగభాగం తేనె మైనం కలిపి ఆయింట్‌మెంట్‌లాగా తయారు చేసుకొని నిలువ ఉంచి, బోదకాల మీద లేపనం చేస్తూ ఉంటే కాలు యధాస్థితికి వస్తుంది.

👉 దగ్గుకు... ఆముదంలో తాలింపు వేసిన చామదుంపల కూర తింటూ ఉంటే దగ్గులు తగ్గిపోతాయి. 

👉మూత్రపిండ వ్యాధులకు... మంచి ప్రశస్తమైన ఆముదాన్ని రోజూ రాత్రి పడుకోబోయే ముందు పది గ్రాముల మోతాదుగా నియమబద్ధంగా శారీరక శక్తిని బట్టి సేవిస్తూ ఉంటే మూత్రపిండాలు బాగుంటాయి. మూత్ర బంధం విడిపోతుంది. మూత్ర కోశంలోని రాళ్ళు కరిగిపోతాయి. 

👉అరికాళ్ళ మంటలకు... ఆముదము, కొబ్బరి నూనె సమానంగా కలిపి అరికాళ్ళకు బాగా మర్దనా చేస్తూంటే, అతిత్వరగా అరికాళ్లు మంటలు అణగిపోతాయి. 

👉కీళ్ళ నొప్పులకు... ఆముదము చెట్టు చిగురాకులు, ఉమ్మెత్త చిగురాకులు, జిల్లేడు చిగురాకులు, పొగాకు చిగురాకులు వీటిని భాగాలుగా తీసుకొని మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసి గాలికి ఆరబెట్టి నిలువ ఉంచుకొని, పూటకొక మాత్ర మంచినీళ్ళతో సేవిస్తూ ఉంటే కీళ్ళ నొప్పులు హరించి పోతాయి.

👉 సుఖనిద్రకు... ఎర్రాముదం చెట్టు వేరు 10 గ్రాములు మోతాదుగా తీసుకొని నలగ్గొట్టి పావు లీటర్‌ నీటిలో వేసి సగం నీళ్ళు మిగిలేలా మరగబెట్టి, వడపోసి త్రాగితే సఖంగా నిద్ర పడుతుంది. 

👉అతి నిద్రకు... ఆముదపు చెట్టు పూవులను పాలతో నూరి కణతలకు పట్టువేసి, తల పైన కూడా వేసి కట్టుకడితే అతి మగతగా ఉండి ఎక్కువగా నిద్ర వచ్చే సమస్య నివారణ అవుతుంది. 

👉రేచీకటికి... మంచి వంటాముదాన్ని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తలకు పెడుతూ ఉంటే, రెండు మూడు నెలలలో రేచీకటి తగ్గి పోతుంది.

👉ముఖ్యంగా జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా పనిచేస్తుందన్న విషయం అందరికి తెలిసిందే. జుట్టు పెరిగి, పట్టుకుచ్చులా మారేందుకు ఆముదం వాడుతుంటాం.

👉వెన్ను నొప్పి కోసం ఆముదాన్ని ఒక పూతగా వెన్నుపై మృదువుగా మర్దన చేసి దానిపై ఒక వస్త్రాన్ని కప్పి ఉంచాలి. దానిపై వేడి నీటి సంచి (హాట్ వాటర్ బ్యాగ్) ఉంచితే  మంచి ఫలితం ఉంటుంది.

👉నిమ్మరసం, తేనె, ఆముదం మిశ్రమం ని ముఖం పై మర్దనా చేసి 20 నిమిషాల వరకు ఉంచి ఆ తర్వాత శుభ్రం చేస్తే ముఖం చాలా కాంతివంతంగాను మరియు తెల్లగాను వస్తుంది. 

👉మొటిమలను, మచ్చలనూ తగ్గిస్తుంది.

👉పగిలిన పెదవులను మృదువుగా చేస్తుంది.

👉ముఖంపై ఏర్పడే నల్లని మచ్చలను (పిగ్మెంటేషన్) తగ్గిస్తుంది


🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు  ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏

--(())--
అందరికీ ఆరోగ్య దేవత ఈ వేప: 

🙏పోస్ట్ పెద్దగా ఉంది అని చదవకుండా వదిలేయకండి. కొంచెం ఓపిక పెట్టి మొత్తం చదవండి. వేపలో వుండే చాలా గొప్ప ఆరోగ్య విలువలు తెలుసుకుంటారు.

✍️వేప చెట్టు లో బెరడు, ఆకులు, పువ్వులు, గింజలు, కలప, నూనె, పిట్టు….. సమస్తం మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది.

✍️వేప యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చిగురువాపును నివారించడానికి సహాయపడతాయి.

✍️ తీవ్రమైన చిగుళ్ల వ్యాధితో వచ్చే చిగుళ్ల రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. 

✍️వేప నోటిలోని బ్యాక్టీరియా తగ్గించి దుర్వాసనను తొలగించడానికి సహాయపడుతుంది.

✍️పళ్ళు, చిగుళ్ళు శుభ్రం చేయడానికి వేప పుల్లలు ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల పంటి వ్యాధులు దరిచేరవు.

✍️షుగర్ వ్యాధితో బాధపడే వారి పాలిట వేప ఒక సంజీవని అని చెప్పవచ్చు.

✍️  వేపాకు రక్తంలో షుగర్ స్థాయిని పెరగకుండా చేసి షుగర్ వ్యాధిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

✍️లేత వేపాకు చిగుర్లు నిత్యం కొంత తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి నియంత్రించవచ్చు.

✍️వేప చిగుళ్లు ఉప్పు వేసి మెత్తగా నూరి చిన్న చిన్న ఉండలుగా చేసి నిత్యం ఉదయం సాయంకాలం తీసుకుంటూ ఉంటే చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది.

✍️వేప పువ్వు కూడా మధుమేహ వ్యాధికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

✍️మెంతులు, లేత వేప ఆకులు రుబ్బి, ఆ రసం వడకట్టి కటిక చేదు గానే ఉన్నప్పటికీ రోజుకు రెండు పూటలా ఓ స్పూన్ చొప్పున తీసుకుంటూంటే మధుమేహం తగ్గుతుంది.

✍️వేప బెరడు చేదుగా ఉన్న, మన ఆరోగ్యం మరియు సౌందర్యాన్ని పెంచడానికి బాగా పనిచేస్తుంది.

✍️ వేప బెరడు చర్మవ్యాధులకు, జ్వరాలు, అంటువ్యాధులకు మంచి మందు. 

✍️ఆకలి మందగించినపుడు మరియూ కాలేయ వ్యాధులు ఉన్నప్పుడు, వేప చెట్టు బెరడు 60 గ్రా|| తీసుకుని 4 గ్లాసు నీళ్ళలో కలిపి ఉడికించి 1గ్లాసు  కషాయంగా అయ్యేవరకు మరిగించాలి.. ఈ కషాయాన్ని తగిన మోతాదులో తీసుకుంటే ఆకలి బాగా పుట్టడంతో పాటూ కాలేయ వ్యాధులు మటుమాయం అవుతాయి.

✍️లేత వేప బెరడు, ఆకుల తో నూరి గాయాలు పై పూత గ వాడుకోవచ్చు.

✍️వేప బెరడు పొడిని రెండు చెంచాలు ఉదయం, రాత్రి గోరు వెచ్చని నీటితో సేవిస్తే మలేరియా తగ్గుతుంది.

✍️వేప బెరడు ని కాల్చి మసి చేసి సీసాలో ఉంచి భద్రపరచుకోవాలి. రసి కారే పుండు మీద ఆ మసి చల్లితే పుండ్లు మానుతాయి. 

✍️వేప చెట్టు బెరడు చర్మ రోగ నివారిణి గా పనిచేస్తుంది. 

✍️వేప బెరడు కషాయం లా కాచి, చల్లార్చి ఉదయం సాయంత్రం (రెండు పూటలా) సేవిస్తే చర్మ వ్యాధులు నివారణ అవుతాయి.

✍️ప్రేగుల్లో క్రిములుంటే, వేప చెట్టు బెరడు (పట్టా) మెత్తని చూర్ణం చేసి ఉదయం సాయంత్రం ఒక్క చెంచా చొప్పున వారం రోజులు తీసుకోవాలి.

✍️వేపగింజలు 10 గ్రా. శొంఠి 10 గ్రా, నల్ల మిరియాలు 10, తులసి ఆకులు తీసుకుని కలిపి మెత్తగా నూరుకోవాలి.  దీన్ని ఉదయం, సాయంత్రం సేవిస్తూంటే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

✍️లేత వేపాకులు గ్లాసు నీటిలో అరగంట మరగబెట్టి చల్లారాక వడగట్టి ప్రతి రెండు గంటలకు ఒకసారి సేవిస్తే కాలేయానికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.

✍️ వేపకాయలను, కడుపులో పరుగులు చావడానికి ఉపయోగిస్తారు,

✍️వేప పువ్వులు నూరి కట్టు కట్టడంతో కుష్టు, బొల్లి, సోరియాసిస్ వంటి చర్మవ్యాధులు పోతాయి.

✍️వేపపువ్వు బోదకాలు నివారణ బాగా ఉపకరిస్తుంది.

✍️వేప పువ్వులను నూనె/నెయ్యి లో వేయించి దీనికి కొద్దిగా ఉప్పు, చిటికెడు మిరియాలు పొడి చేర్చి నిత్యం ఉదయం మధ్యాహ్నం తినే అన్నం మొదటి ముద్దు కలుపుకొని తినడం వల్ల ఉబ్బసం వ్యాధి తగ్గుముఖం పడుతుంది.

✍️ వేప గింజల రసాన్ని తేనెతో కలిపి సేవిస్తే పచ్చ కామెర్ల వ్యాధి నయం అవుతుంది.

✍️చర్మంపై పొంగు వ్యాధి వల్ల ఏర్పడే మచ్చలను, వేప చిగుళ్లను నూరి మర్దనా చేసి మచ్చలు పోతాయి.

✍️వేపపండ్లు తింటే మలబద్దకం నివారణ అవుతుంది.

✍️వేపపువ్వు పొడి, కొంచెం తేనె లేక బెల్లం తో కలిపి తీసుకుంటే బలహీనత తగ్గుతుంది.

✍️వేపనూనె రాసి, తామర, దద్దుర్లు నివారించవచ్చు

✍️అల్సర్లు, పేగు పూత వంటివి నివారణ అవుతాయి. 

✍️కీళ్లు,జాయింట్ల వద్ద మర్దనా చేస్తే  నొప్పులు తగ్గుతాయి.

✍️వేపనూనె శరీరానికి రాయడం వల్ల చర్మ సంబంధ వ్యాధులు నివారణ అవుతాయి.

✍️వేప నూనె ఒక గ్రాము రోజూ పరగడుపున సేవిస్తే మధుమేహం నయం చేయవచ్చు. 

✍️ వేపనూనె తో సొరియాసిస్ వ్యాధి, చిన్న చిన్న కురుపులు తగ్గించడంలో దోహద పడుతుంది.

✍️వేప విత్తనాలు కుష్టు రోగ నివారణలు ఉపయోగపడతాయి.

✍️వేప చిగురు రోజూ తినడం అలవాటు గా మార్చుకున్న వారికి దగ్గు, అజీర్ణం, కడుపులో పురుగుల బెడద ఉండవు.

✍️లేతాకులు రోజూ నమిలి తినేవారికి కడుపు ఉబ్బరమనేది ఉండదు. కడుపు నొప్పి వారి దరిజేరదు.

✍️వేపాకులు నమిలితే వాంతులు, వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతాయి.

✍️వేపాకు రసం కాలేయం మీద పని చేసి సర్వ రోగాలను అరికడుతుంది. ( అమ్మవారు,చికెన్ పాక్స్) సోకిన వ్యక్తి పరుపు/పడకపై వేపాకులు పరవడం పూర్వం నుంచి ఉంది.

✍️వేసవి కాలం ఆరంభం నుంచి నిత్యం ఉదయం వేప చిగుళ్లు నమిలితే వడగాలులు, ఎండ తీవ్రత నుంచి తట్టుకునే శక్తి లభిస్తుంది.

✍️వేప కడుపులో నులి పురుగులు నిర్మూలించే శక్తి వేపపూతకి ఉంది.

✍️వేపకు కషాయం కడుపులోని ఏలిక పాములు నివారణ అపూర్వం గా పనిచేస్తుంది.

✍️వేప కషాయం ప్యాంక్రియాస్ గ్రంధి, రక్తంలో ఇన్సులిన్ స్థాయిని క్రమబద్దీ కరించడానికి తోడ్పడుతుంది. 

✍️వేపకు కషాయం రోజుకు రెండుసార్లు తాగితేఎటువంటి జ్వరమైనా తగ్గిపోతుంది.

✍️వేపాకులు ఉడికించి ఛాతీ మీద పట్టు వేయడం వల్ల పిల్లలకు జలుబు, దగ్గు తగ్గుతాయి.

✍️వేపాకు పొడి సున్నిపిండి సమపాళ్లలో కలిపి వాడితే చర్మ వ్యాధులు దరిచేరవు. 

✍️రక్తం గడ్డకట్టకుండా ఉంచే గుణం వేపకు ఉంది.

✍️వేపాకులు మెత్తగా నూరి ముద్దగా చేసి, దానియందు సమపాళ్లలో తేనె కలిపి సేవిస్తే ఆయాసం తగ్గుతుంది.

✍️వేపాకు పసరు గాయం తగిలిన చోట ఉంచి కట్టు కడితే వాపు, నొప్పి నుండి ఉపశమనం
కలుగుతుంది. 

✍️వేపాకు పసరు పాముకాటుకు, తేలుకాటుకు దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది.

✍️వేపాకు నమిలి రసం మాత్రమే మింగితే కడుపు నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

✍️వేపాకు పొడి తేనెతో కలిపి ఉదయం, సాయంకాలం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుముఖం పడతాయి.

✍️వేపాకు పసుపు మెత్తగా నూరి రాస్తే అరికాళ్ల పగుళ్లు నెమ్మదిస్తాయి.

✍️వేపాకు కషాయాన్ని సేవించడం వల్ల మూత్ర పిండాలు సంబంధించిన జబ్బులు నయం చేయవచ్చు.

✍️వేపాకులను దంచి  ముఖం పైన గల మొటిమలు, మచ్చలు పైన రాస్తూ వుంటే అవి మటుమాయం ఆవుతాయి.

✍️వేపాకులు మెత్తగా నూరి గాయాల మీద రాయడం వల్ల  గజ్జి, తామర, ఎగ్జిమా, తీట, గుల్ల కురుపులు క్రమంగా తగ్గిపోతాయి.

✍️వేపాకు పొడి తేనెతో కలిపి ముఖానికి పట్టించి, ఓ అరగంట తర్వాత శుభ్రం చేస్తే ముఖంలో కొత్త కాంతులు తళుక్కుమంటాయి.

✍️వేపపొడి, పసుపు, రోజ్ వాటర్ సమపాళ్లలో కలిపి, వారానికి రెండు సార్లు ముఖానికి రాసుకుంటే మొటిమలు మచ్చలు తగ్గుతాయి.

✍️వేపాకు కాల్చి, ఆ భస్మాన్ని నేతితో కలిపి ముఖానికి పూస్తే ఎటువంటి మచ్చలైనా కానీ ఒక్క నెలలో మటు మాయం అవుతాయి. 

✍️కొందరికి అరికాళ్లు, అరిచేతులు మృదుత్వం కోల్పోయి మొద్దు బారినట్లు గా ఉంటాయి. ఇటువంటి సమస్యలున్నవారు ప్రతిరోజూ నిద్రించే ముందు వేప గింజల పొడి చేసి, ఆముదం లో కలిపి బాగా నిర్ధన చేసుకుంటే కాళ్లు చేతులు మృదువుగా మారతాయి.

✍️వేప, గులాబీ పూల రేకులు సమానంగా తీసుకుని, వాటిని ఆవిరి మీద ఉడికించి, ముద్దగాచేసి ముఖానికి 2 వారాల పాటు దట్టంగా పట్టిస్తూ, ఓ గంట సేపు ఉంచి స్నానం చేస్తూంటే ముఖ సౌందర్యం పెరుగుతుంది.

✍️వేపాకులు, పాలు, సెనగ పిండి, పసుపు పొడి సమపాళ్లలో కలిపి మెత్తగా పేస్టు లా రుబ్బు, ఆ ముద్దు ముఖానికి రాసుకుని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇది కూడా మొటిమల నివారణి గా సమర్థవంతంగా పనిచేస్తుంది.

✍️ కనురెప్పల క్రింద ఏర్పడే నల్లని చారలు, వలయాల సమస్య కోసం వేప నూనె రాస్తూ ఉంటే మాయం అవుతాయి.

✍️కళ్ళు మంటలు గా ఉన్నవారు వేపచిగుర్లను కంటి మీద పెట్టుకుంటే మంట తగ్గుతాయి.

వేపాకుని నీటిలో మరగబెట్టి, ఆ నీటితో తలస్నానం చేస్తే చుండ్రు,దురద తగ్గుతాయి.

✍️వేప నూనె తలకు రాస్తుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.

✍️వేప నూనె ను క్రమం తప్పకుండా మూడు నెలలపాటు తలకు రాసి చూడండి. వెంట్రుకలు పెరగడం,వెంట్రుకలు నిగనిగలాడడం తధ్యం.

✍️మరగబెట్టిన కొబ్బరినూనెలో వేపాకు రసం కలిపి, కొబ్బరి నూనె కు రంగు మారడం గమనించి, ప్రతిరోజూ తల పట్టిస్తూ వుంటే చుండ్రు బాధ – పేల బాధలు అంతరిస్తాయి.

✍️ఇలాంటి సమస్యల నివారణ తో పాటు ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి.

🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు  ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏


--(())__
పసుపు యొక్క అద్భుతమైన ఆయుర్వేద గుణాలు:

✍️పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, మరియు యాంటిక్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి.

✍️పసుపు ఫ్రీ రాడికల్స్ తోనూ, వ్యాధులతోనూ పోరాడుతుంది. ఇది క్యాన్సర్ కణాల విస్తరణను కూడా నిరోధిస్తుంది.

✍️పసుపులో ఉండే అతి ముఖ్యమైన బయోయాక్టివ్ సమ్మేళనం కర్కుమిన్.

✍️దీన్ని ఆర్థరైటిస్, చర్మ క్యాన్సర్, గాయాలు, కాలేయ వ్యాధులు మరియు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు మూలికా చికిత్సగా ఉపయోగిస్తారు.

✍️పసుపులోని యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కాలేయ వ్యాధులకు అద్భుత చికిత్సగా పని చేస్తాయి. 

✍️పసుపులోని కర్కుమిన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలదు. ఇది కాలేయాన్ని కాపాడుతుంది మరియు గట్టిపడకుండా చేస్తుంది.

✍️ నాన్-ఆల్కహాలిక్ ఫాటీ లివర్ వ్యాధి చికిత్సకు కూడా కర్కుమిన్ సహాయపడుతుంది

✍️పసుపులో కర్కుమిన్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది మరియు ఇది డయాబెటిస్ చికిత్సకు సహాయపడుతుంది.

✍️ ఈ సమ్మేళనం డయాబెటిక్ న్యూరోపతిని కూడా నివారించగలదు.

✍️ముఖ్యంగా ఆక్సీకరణ ఒత్తిడికి చికిత్స చేస్తుంది.

✍️కర్కుమిన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడమే కాకుండా, రక్తంలో అధిక కొవ్వు స్థాయిని నియంత్రిస్తుంది.

✍️పసుపు బీటా కణాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. బీటా కణాలు ఇన్సులిన్‌ను తయారు చేస్తాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే హార్మోన్.

✍️పసుపులోని కర్కుమిన్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. 

✍️పసుపులోని గుణాలు మన రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి, మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడతాయి

✍️కోలన్ (పెద్దప్రేగు) క్యాన్సర్, కడుపు క్యాన్సర్ మరియు చర్మపు క్యాన్సర్లకు వ్యతిరేకంగా పనిచేసే రక్షణ ప్రభావాన్నిపసుపు కలిగి ఉంటుంది.

✍️పసుపు కెమోథెరపీని మరింత ప్రభావవంతం చేసి ఆరోగ్యకరమైన కణాలను రక్షిస్తుంది.

✍️కర్కుమిన్ క్యాన్సర్ కణాల నాశనానికి కూడా తోడ్పడుతుంది. ఇది రియాక్టివ్ ఆక్సిజన్ జాతులను స్కావెంజింగ్ చేయడం ద్వారా దీనిని సాధిస్తుంది.

✍️ ప్రోస్టేట్,  ఊపిరితిత్తులు మరియు క్లోమం వంటి వాటితో సహా క్యాన్సర్ కణాలను చంపడంలోనూ, ఆరోగ్యకరమైన వాటిని రక్షించడంలోనూ ఇది చక్కని పాత్ర పోషిస్తుంది

✍️పసుపులోని కర్కుమిన్ స్థూలకాయానికి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ ను నివారించవచ్చు.

✍️ ఇది కొవ్వును కరిగించే ప్రక్రియను పెంచుతుంది.

✍️ఊబకాయానికి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ ఒక కారణం. 

✍️పసుపు ఇన్ఫ్లమేషన్తో పోరాడుతుంది కాబట్టి, ఇది ఊబకాయానికి చికిత్స చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 

✍️పసుపులోని కర్కుమిన్ కొవ్వును నిల్వ చేసే కణాల ఉత్పత్తిని నిరోధిస్తుంది. 

✍️దానితో పాటు జీవక్రియను మెరుగుపరుస్తుంది. 

✍️సరైన ఆహారంతో పాటు వ్యాయామం కూడా చేస్తే తప్పక బరువు తగ్గుతారు.

✍️పసుపు, దానిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాల కారణంగా, గాయాలు మరియు దీర్ఘకాలిక వాపు కారణంగా కలిగే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

✍️పసుపులోని కర్కుమిన్ గుండె జబ్బులను నివారిస్తుంది. 

✍️దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కార్డియోటాక్సిసిటీ మరియు డయాబెటిస్ సంబంధిత గుండె సమస్యలను నివారిస్తాయి.

✍️పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సక్రమంగా లేని హృదయ స్పందనలను నివారిస్తాయి.

✍️పసుపు గ్యాస్ట్రిక్ అల్సర్లకు చికిత్స చేస్తుంది. 

✍️పసుపుకు ఈ యాంటీఅల్సర్ ప్రభావం దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాల నుండి వస్తుంది.

✍️పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అన్నవాహికలో కలిగే మంట తగ్గించడానికి కూడా సహాయపడతాయి. 

✍️ఇది ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, కొలొరెక్టల్ క్యాన్సర్, కాలేయ వ్యాధి మరియు విరేచనాలు వంటి జీర్ణ సంబంధ వ్యాధుల చికిత్సకు కూడా సహాయపడుతుంది.

✍️అల్జీమర్స్ వ్యాధి ఉన్న రోగులలో మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

✍️పసుపులోని కర్కుమిన్ డయాబెటిస్ ఉన్నవారిలో కూడా మెదడు పనితీరును పెంచుతుంది. 

✍️పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. 

✍️వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.

✍️ఆడవారిలో నెలసరి రోజులలో కలిగే నొప్పికి పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా పనిచేస్తాయి.

✍️ పసుపు న్యూరోట్రాన్స్మిటర్ల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

✍️పసుపు రుమటాయిడ్ మరియు ఆర్థరైటిస్ ఉన్నవారిలో రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. 

✍️ పసుపు యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలకు చికిత్స చేయడంలో సహాయపడతాయి 

✍️పసుపులోని కర్కుమినాయిడ్స్ మోకాలి నొప్పికి కూడా చికిత్స చేస్తాయి.

✍️ పసుపుకు గాయాలను నయం చేసే శక్తి ఉంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గాయాలను నయం చేయడానికి దోహదపడతాయి. 

✍️పసుపు పొడిని మరిగించిన పాలతో కలిపి తీసుకుంటే దగ్గు మరియు ఇతర శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.

✍️పసుపులోని కర్కుమిన్ ఉబ్బసాన్ని కూడా తగ్గిస్తుంది.

✍️ పసుపు యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సైనస్ లలో కలిగే వాపును కూడా తగ్గిస్తాయి.

✍️పసుపు యొక్క యాంటీ బాక్టీరియల్ ప్రభావాలు మొటిమలతో సహా అనేక చర్మ సమస్యలకి చికిత్స చేయడంలో సహాయపడతాయి. 

✍️మొటిమల వల్ల కలిగే మంట, ఎరుపులను తగ్గించడానికి ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది.

✍️ పసుపును ఫేస్ మాస్క్ లో ఉపయోగించడం ద్వారా ఈ చర్మ సమస్యలను తగ్గించవచ్చు.

✍️పసుపు యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సోరియాసిస్ మరియు తామర చికిత్సకు సహాయపడతాయి.

✍️ యాంటీబయాటిక్స్‌తో కలిపినప్పుడు, కర్కుమిన్ సోరియాసిస్ నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

✍️పసుపు యొక్క యాంటీఆక్సిడెంట్ లక్షణాల రక్తప్రసరణ మెరుగుపరచి నొప్పిని తగ్గిస్తాయి. 

✍️ఇది సోరియాసిస్ మరియు తామర వంటి చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

✍️పసుపు యొక్క యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వృద్ధాప్య లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి.

✍️పసుపులో యాంటీముటాజెనిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

✍️ సూర్యకిరణాల వల్ల చర్మానికి జరిగే సన్‌బర్న్ వంటివాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

✍️పసుపులో చర్మాన్ని బిగుతుగా చేసే గుణాలు ఉన్నాయి. సాగిన చర్మాన్ని బిగుతుగా చేసి స్ట్రెచ్ మార్క్స్ తగ్గడానికి సహాయపడుతుంది.

✍️పసుపులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పాదాల పగుళ్ళను తగ్గించడానికి సహాయపడతాయి.

✍️పసుపు చర్మంపై ఉండే  మృతకణాలను తొలగించడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది.

✍️ఇంకా చాలా అద్భుతమైన గుణాలు దాగి ఉన్నాయి ఈ పసుపులో.. కానీ మోతాదుకి మించి వాడకూడదు.



--(())-- ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు

👉ఉల్లిపాయలు కేవలం వంటలో రుచి మాత్రమే కాదు.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా తోడ్పడతాయి. అందుకే, ఉల్లికి అంత డిమాండ్.

👉 ఉల్లి లేనిదే మన వంటకం పూర్తి కాదు. 

👉కొందరు ఉల్లిని వండకుండా పచ్చివే తినేస్తుంటారు. ఆహారంలో నంజుకుని మరీ తింటారు.

👉ఉల్లి పాయలు కోస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టించినా.. శరీరానికి మాత్రం ఎలాంటి కీడు చేయవు.

👉 ఉల్లిగడ్డలను కోసేప్పుడు అందులో నుంచి కొన్ని ఎంజైమ్స్‌తోపాటు ఘాటైన సల్ఫర్ గ్యాస్ విడుదలవుతుంది. అందుకే, వాటిని కోయగానే కళ్ల మంటలు పుడతాయి.

👉పచ్చి ఉల్లిగడ్డలు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. 

👉ఎర్రగా ఉండే ఉల్లిపాయలు శరీరంలో మంచి కొవ్వుల ఏర్పాటుకు తోడ్పడతాయి. 

👉ఉల్లిలో అధిక మోతాదులో ఉండే సల్ఫర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి, పీచు పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

👉పచ్చి ఉల్లిపాయలు నిద్రలేమిని దూరం చేస్తాయి. 

👉క్యాన్సర్‌ను సైతం నిరోధిస్తాయి. 

👉ఉల్లి కీళ్లకు, గుండెకు మేలు చేస్తుంది. 

👉ఉల్లి  రక్తపోటును అదుపులో ఉంచుతాయి. 

👉ఉల్లి రసం, తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి త్వరగా తగ్గిపోతాయి.

👉బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, డయేరియాల నుంచి ఉల్లి కాపాడుతుంది.

👉 మనషుల శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నివారించగల యాంటీఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. 

👉ఉల్లిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. 

👉పచ్చి ఉల్లిపాయను రోజు తిన్నట్లయితే ఎముకల బలహీనతను అధిగమించవచ్చు. 

👉ఉల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు సంబంధ సమస్యల్ని దూరం చేస్తాయి. 

👉ఉల్లి రసాన్ని మాడుకు పట్టించడం వల్ల జుట్టు రాలడంతోపాటు చుండ్రు సమస్యలు తగ్గుతాయి. 

👉జుట్టు పట్టు కుచ్చులా మెరుస్తుంది. 
మాడుకు రక్త ప్రసరణ పెంచడం వల్ల జుట్టు పెరుగుతుంది.

👉మధుమేహంతో బాధపడే వారు పచ్చి ఉల్లిపాయలను తినం ఎంతో మంచిది. 

👉ఉల్లి గడ్డ ఇన్సూలిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. 

👉ఇందులో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రణ ఉంచుతుంది.

👉 జ్ఞాపకశక్తిని పెంచడానికి, గుండె జబ్బులను దూరం చేయడానికి ఉల్లి మంచి ఔషదం.

👉రక్త నాళాల్లో రక్తం గడ్డకడితే గుండె పోటు ఇతరాత్ర సమస్యలు రావచ్చు. అయితే, ఉల్లి శరీరంలోని రక్తం పల్చగా ఉంచి కణాలు స్వేచ్ఛగా ప్రవహించేందుకు దోహదం చేస్తుంది. 

👉గుండె జబ్బులు, బీపీతోనూ బాధపడే వాళ్లు రోజూ ఉల్లిని తీసుకోవటం చాలా మంచిది.

👉మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఉల్లి మంచి ఔషదం. 

👉ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి రోజూ ఉదయం వేళలో తీసుకుంటే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. 

👉అందుకే మన మన పెద్దలు ఉదయన్నే పెరుగు, ఉల్లిగడ్డను ఆహారంగా తీసుకొనేవారు.

 👉ఉల్లిపాయలు వేసి తయారు చేసే కర్డ్‌బాత్ కూడా ఆరోగ్యానికి మంచిదే. 

👉విసర్జన సమయంలో మూత్రంలో మంట, నొప్పి ఏర్పడుతున్నట్లయితే ఉల్లిని తీసుకోండి.

👉 కొన్ని ఉల్లి గడ్డలను నీటిలో వేసి బాగా మరిగించి తాగండి. మరీ ఎక్కువగా తీసుకోకండి.

👉ఉల్లి రసాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. 

👉ఉల్లి విత్తనాలు వీర్యాన్ని పెంచుతాయి. మగవారికి శృంగార సమయంలో మంచి శక్తిని ఇస్తుంది.

👉తెల్ల ఉల్లిని పేస్టులా చేసుకుని వెన్నతో కలిపి వేయించండి.

👉 తర్వాత కాస్త తేనె కలిపి ఖాళీ కడుపున తాగిగే వయాగ్రాలా పనిచేస్తుంది.

👉 ఒక టేబుల్ స్పూన్ ఉల్లి రసం, ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం కలిపి తీసుకున్నా లైంగిక శక్తి పెరుగుతుంది. 

👉రోజుకు మూడుసార్లు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. 

👉ఉల్లి సెక్స్ కోరికలను పెంచడానికే కాదు.. జననేంద్రియాలు సక్రమంగా పనిచేసేందుకు కూడా ఉపయోగపడుతుంది.

👉చర్మ సౌందర్యాన్ని పెంచుకోవాలంటే ఉల్లిని తప్పకుండా తీసుకోండి. 

👉ఆలివ్ ఆయిల్, ఉల్లి రసాన్ని సమపాళ్లలో కలపి ముఖానికి పట్టిస్తే.. మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. 

👉కాలిన చిన్న చిన్న గాయలను నివారించడానికి కూడా ఉల్లి  ఉపయోగపడతాయి. 

👉కాలిన ప్రదేశంలో ఉల్లిపాయ రసాన్ని రాసినట్లయితే ఉపశమనం లభిస్తుంది. 

👉కాలిన చోటు బొబ్బలు రాకుండా నిరోధిస్తుంది. 

👉అలాగే, కాలిన చోట బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. 

👉తేనెటీగలు లేదా తేలు కుట్టినప్పుడు ఏర్పడే నొప్పిని నివారించేందుకు కాస్త ఉల్లి రసాన్ని రాయండి.

👉దంతక్షయ సమస్యలు ఉన్నవారు ఉల్లి గడ్డలను ఎక్కువగా తీసుకోండి. 

👉పచ్చి ఉల్లిపాయ ముక్కలను కనీసం 2-3 నిమిషాలు నమలండి. దీనివల్ల నోటిలో ఉండే క్రిములు చనిపోతాయి. 

👉పంటి నొప్పి, చిగుళ్ల సమస్య నుంచి కూడా ఉశమనం లభిస్తుంది. 

👉చెవి నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే కొన్ని ఉల్లి రసం చుక్కలు వేస్తే ఉపశమనం లభిస్తుంది

👉ఉల్లి గడ్డల్లోని సల్ఫర్ సమ్మేళనాలు ఆస్త్మాకు కారణమయ్యే బయో కెమికల్ చెయిన్ ఫార్మేషన్‌ను నిలిపివేస్తుందని పరిశోధనల్లో తేలింది.

👉 దగ్గుతో బాధపడేవారు నోరు ఆరిపోకుండా ఉండేందుకు ఉల్లిని తీసుకోవడం ఉత్తమం. 

👉జాండీస్, కామెర్ల నివారణకు కూడా ఉల్లి ఉపయోగపడుతుంది.

👉 ఉల్లిపాయ ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి.. తర్వాతి రోజు ఉదయం చిటికెడు ఉప్పు వేసుకుని తాగినట్లయితే సమస్య దూరమవుతుంది.

👉 ఉల్లి గడ్డలు క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. 

👉 ఫైల్స్‌తో బాధపడుతున్నవారు ఉల్లి గడ్డ ముక్కలు, కాస్త పంచదార వేసుకుని తింటే ఉపశమనం లభిస్తుంది. 

👉వేసవిలో వేడి చేస్తే ఉల్లి గుజ్జును పాదాలకు, మెడకు పూస్తే చలవ చేస్తుంది. 

👉 గ్యాస్ట్రో సిండ్రోమ్ సమస్యలతో బాధపడేవారు ఉల్లి గడ్డలతను తింటే ఉపశమనం లభిస్తుంది. 

👉ఉల్లిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ వల్ల కడుపు నొప్పిని దూరం చేస్తాయి. 

👉ఉల్లిలోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్ధరైటిస్ నొప్పిని నివారిస్తాయి.

👉 రక్తహీనతో బాధపడేవారు పటికీ బెల్లం నీటితో ఉల్లిపాయలను కలిపి తీసుకుంటే మంచిది. 

👉 ఉల్లి పాయలు రక్తంలోని కొవ్వులను తొలగిస్తాయి.


👉🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు  ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏


--(())-- సర్వ రోగ నివారిణి  ఈ త్రిఫల:

👉త్రిఫల  చూర్ణం అనగా ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమము. 

✍️ఉసిరి: 

👉ఉసిరిలో సి విటమిను అత్యధికంగా ఉంటుంది.

👉 ఉసిరిలో టానిక్‌ ఆమ్లం, గ్లోకోజ్‌, ప్రొటీన్‌, కాల్షియాలు ఉన్నాయి. 

👉ఉసిరి పిత్తదోషాన్ని సరిచేస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది.

👉 సాఫీ విరోచనానికి దోహదపడుతుంది. 

👉రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. 

👉జ్వరాన్ని తగ్గిస్తుంది. 

👉కడుపులో వాపు, పేగుగోడల వాపు, కడుపులో మంటలు, పుండ్లకు ఉసిరి విరుగుడు.

👉 మలబద్ధమును తగ్గిస్తుంది. విరేచనాలు, కాలేయ లోపం, కడుపులో మంటలను నిరోధిస్తుంది.

✍️తానికాయ: 

👉తానికాయ వగరు, ఘాటు రుచి కలిగి ఉంటుంది.

👉 దీనిలో విటమిను ఎ అధికంగా ఉంటుంది. 

👉ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

👉ఎలర్జీలను నివారిస్తుంది. 

👉ప్రేగుల్లో చేరిన పరాన్న జీవులను సంహరిస్తుంది.

👉 గొంతులో ఏర్పడిన ఇబ్బందులను తొలగిస్తుంది. 

👉రక్తస్రావాన్ని అరికడుతుంది. 

👉కఫదోషాలను నివారిస్తుంది. 

👉శరీరంలో అదనంగా చేరిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది

👉 ఉబ్బస వ్యాధులను నివారిస్తుంది. 

👉శ్వాసకోశ సమస్యలు, ఎడతెగని దగ్గులను నివారిస్తుంది.

✍️కరక్కాయ: 

👉త్రిఫలచూర్ణంలోని ముఖ్యమైన ఫలాల్లో కరక్కాయ ఒకటి.

👉 విరోచనాలను కట్టిస్తుంది. 

👉ఛాతీలో మంటను తగ్గిస్తుంది. 

👉కాలేయం సరిగా పనిచేసేటట్లు చేస్తుంది. 

👉వాత దోషాలను అరికడుతుంది.

👉కండరాలు తీవ్రంగా కొట్టుకోవటాన్ని తగ్గిస్తుంది. 

👉నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. 

👉మలబద్ధాన్ని తొలగించి, నాడీ స్థిరత్వాన్ని ఇస్తుంది. 

👉శారీరక బలహీనతను, అనవసరపు ఆదుర్దాలను తొలగిస్తుంది. 

👉జీర్ణాశయపు గోడలను బలోపేతం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

👉ఆహారంలోని పోషకాలను గ్రహించేశక్తిని మెరుగుపరుస్తుంది.

✍️ఇపుడు ఈ మూడు కలిపిన త్రిఫల చేసే అద్భుతమైన పనులు:

👉త్రిఫలను నీటిలో కలిపిన కషాయంగా, రాత్రి పూట పాలు లేదా తేనెతో తీసుకోవాలి.

👉 వైద్యుని సలహాననుసరించి రోజూ రెండు నుండి అయిదు గ్రాముల త్రిఫల చూర్ణం ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు.

👉 ఈ మూడు ఫలాల పొడులను సమపాళ్ళలో కలపడం వలన ఇది శక్తివంతమౌతుంది. 

👉సమపాళ్ళలో కాక మూడుపాళ్ళు ఉసిరి, రెండు పాళ్ళు తానికాయ, ఒకపాలు కరక్కాయ కలిపిన త్రిఫల చూర్ణం, త్రిఫల మాత్రల రూపంలో కూడా తీసుకోవచ్చు.

👉కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. 

👉కాలేయానికి చెరుపు చేసే విషపూరిత పదార్థాలను త్రిఫల తొలగిస్తుంది.

👉అజీర్ణం, విరేచనాలు వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు రెండు స్పూన్ల నీటిలో ఒక స్పూన్‌ త్రిఫల చూర్ణం వేసి మరిగించి వడగట్టి ఆ కషాయానికి కొద్దిగా నీరు కలిపి తీసుకోవాలి.

👉మలబద్ధము బాధిస్తున్నప్పుడు అయిదు గ్రాముల త్రిఫలచూర్ణాన్ని కొద్దిగా తేనెతో కలిపి ఒక ముద్దగా చేసి అరకప్పు పాలతో పాటుగా పడుకునేముందు తాగితే ఇబ్బంది తొలగిపోతుంది.

👉ఒక చెంచా త్రిఫలచూర్ణం రెండు చెంచాల కొబ్బరి నూనెలో మరిగించి వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే శిరోజాలకు మంచిటానిక్‌లా పనిచేస్తుంది. 

👉తలస్నానం తరువాత త్రిఫల చూర్ణం కషాయంతో చివరిగా తలమీద పోసుకుంటే శిరోజాలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి.

👉చర్మరక్షణలో త్రిఫల రక్తాన్ని శుద్ధిచేస్తుంది. 

👉రక్తశుద్ధితో చర్మవ్యాధులు తొలగిపోతాయి. 

👉ఎటువంటి చర్మతత్వం కలిగినవారికైనా త్రిఫల మేలు చేస్తుంది. 

👉చర్మం కోమలంగా ఉండేలా చేస్తుంది. చర్మానికి మెరుగునిస్తుంది.

👉 శరీరంలో పేరుకున్న విషపదార్థాలను తొలగిస్తుంది. 

👉చర్మంలోని రక్తనాళాల్లో రక్తప్రసరణను పెంచి చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది.

👉 చర్మానికి పోషణనిస్తుంది. చర్మానికి సహజంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. 

👉కొందరి చర్మం సున్నితంగా ఉండి ఎలర్జీలకు గురి అవుతుంది. ఈ లోపాన్ని త్రిఫల సరిచేస్తుంది.

👉 సూర్యరశ్మి వలన కలిగే దుష్ప్రభావాలను కూడా త్రిఫల నిరోధిస్తుంది.

👉త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రుతుచక్ర సమస్యలను కూడా అరికట్టవచ్చు. 

👉రుతుచక్రం సరిగ్గా లేనివారు వైద్యుని సలహామేరకు త్రిఫల చూర్ణాన్ని వాడవచ్చు.

👉కళ్లకు, చర్మానికి, గుండెకు ఎంతో మేలు చేస్తుంది.

👉జుట్టును త్వరగా తెల్లగా అవనీయదు. అలాగే జుట్టు బాగా పెరిగేందుకు సహకరిస్తుంది.

👉ముసలితనం త్వరగా రానీయదు.

👉జ్ఞాపకశక్తిని బాగా వృద్ధి చేస్తుంది.

👉ఎర్ర రక్త కణాలను బాగా వృద్ధి చేస్తుంది.

👉రోగనిరోధక వ్యవస్థను బాగా శక్తివంతం చేస్తుంది.

👉ఆహారం బాగా సక్రమంగా జీర్ణం అయేలా చేస్తుంది.

👉ఆమ్లత (అసిడిటీ) ను తగ్గిస్తుంది.

👉ఆకలిని బాగా పెంచుతుంది.

👉యురినరి ట్రాక్ట్ సమస్యల నుంచి బాగా కాపాడుతుంది.

👉సంతాన సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది.

👉శ్వాస కోశ సంబంధమైన సమస్యలు రావు. ఒక వేళ ఉన్నాకూడా అదుపులో ఉంటాయి.

👉కాలేయమును చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.

👉శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది.

👉పెద్ద ప్రేవు లను శుభ్రంగా ఉంచి, పెద్ద ప్రేవు లకుఏమీ వ్యాధులు రాకుండా రక్షిస్తుంది.

👉రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

👉జీర్ణశక్తిని పెంచుతుంది.

👉అధిక బరువును అరికడుతుంది.

👉శరీరం లోని లోని చెడు పదార్ధాలను బయటకు పంపిస్తుంది.

👉శరీరంలో బాక్టీరియాను వృద్ధి కాకుండా ఆపుతుంది.

👉కాన్సరును కూడా నిరోధిస్తుంది.

👉కాన్సరు కణములు పెరగకుండా కాపాడుతుంది.

👉రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

👉ఎలర్జీని అదుపులో ఉంచుతుంది.

👉సీరుం కొలెస్ట్రాల్ ను బాగా తగ్గిస్తుంది.

👉చక్కగా విరేచనం అయేలా చేస్తుంది.

👉హెచ్ ఐ వీని కూడా నిరోధించ గల శక్తి త్రిఫల చూర్ణమునకు ఉంది.

👉నేత్రవ్యాధు లను నిరోధించే శక్తి త్రిఫలకు ఉంది.

🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు  ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏


--(())--


అజీర్ణం మరియూ గ్యాస్ సమస్యలు, నివారణ మార్గాలు.

ప్రస్తుత ఆహార అలవాట్లు, జీవన విధానం లో మార్పుల వల్ల ప్రతి వంద మందిలో తొంభై తొమ్మిది మందికి పైన చెప్పిన సమస్యలు ఉన్నాయి.

అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? 
👉శరీరం శ్రమపడే ఏ పని చేయకుండా , ఎంతో శ్రమ చేస్తేనే జీర్ణమయ్యే కఠినమైన ఆహారాన్ని తీసుకోవడం.

👉ఆ భుజించే ఆహారం కూడా సరిగా నమలి తినకుండా ఎదో కొంపలు మునిగిపోతున్నట్లు త్వర త్వరగా తినేయడం.

👉తినేటప్పుడు ఆహారం మీద ధ్యాస పెట్టకుండా ఏ టీవీ మీదనో లేక అతిగా మాట్లాడుతూనో, లేక గొడవలు పడుతూనో, లేక ఏవో ఆలోచనలతో భుజించడం.

👉ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన కూరలని మళ్ళీ మళ్ళీ వేడి చేసి తినడం.

👉ఒకసారి తిన్న ఆహారం జీర్ణం కాకముందే భోజన సమయం అయింది అని మళ్ళీ తినడం.

👉తిన్న వెంటనే కనీసం వంద అడుగులైనా వేయకుండా వెంటనే కూర్చోవడం, లేదా పడుకుని నిద్రపోవడం, లేక రాత్రి సమయంలో నిద్రపోకుండా ఎక్కువగా మేలుకోవడం.

👉మద్యపాన మరియూ ధూమపానం లక్షణాలు. అధిక మసాలా మరియూ అధికంగా నూనె పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం.

నివారణ మార్గాలు:
👉కరక్కాయ బెరడు, శొంఠి ఈ రెంటినీ సమభాగాలుగా తీసుకుని పెనం మీద దోరగా వేయించి చూర్ణంగా చేసి దానికి పాత బెల్లం కానీ లేక సైన్ధవ లవణ చూర్ణం కానీ కలిపి నిలువ ఉంచుకుని రోజూ ఆహారం తీసుకునే ముందు ఐదు గ్రాముల మోతాదులో తీసుకుంటే  ఆహారం బాగా జీర్ణం అవుతుంది.

👉ధనియాలు మరియూ శొంఠి సమ భాగాలుగా తీసుకుని మంచినీటితో కలిపి కషాయం చేసి గోరు వెచ్చగా ఉన్నపుడు త్రాగితే అజీర్తి వల్ల వచ్చే కడుపు నొప్పి, కడుపులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి.

👉నిద్ర లేవగానే బద్ధకంగా అనిపిస్తూ, నిన్న తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల సుఖ విరేచనం కాలేక చాలా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు అశ్రద్ధ చేయకుండా పైన తెలిపిన కరక్కాయ బెరడు, శొంఠి మరియు సైన్ధవ లవణాల మిశ్రమం అర టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ మోతాదులో చల్లని నీళ్ళలో కలిపి త్రాగి తరువాత సులభంగా జీర్ణం అయ్యే ఆహారం పరిమితంగా భుజిస్తే ఆనాటి అజీర్ణ సమస్య తగ్గిపోతుంది. 

👉శొంఠి, పిప్పళ్లు, మిరియాలు,వాము, సైన్ధవ లవణం, తెల్ల జీలకర్ర, నల్ల జీలకర్రలను సమ భాగాలుగా తీసుకుని దానికి పొంగించిన ఇంగువ కొంచెం కలిపి చూర్ణం చేసుకుని భోజనం చేసే ముందు మొదటి ముద్దలో ఈ చూర్ణం మూడు నుండి ఐదు గ్రాముల వరకు కలిపి అందులో తగు మోతాదు నెయ్యి వేసి కలిపి తీసుకుంటే అజీర్ణ వాయురోగాలు హరించిపోతాయి. కడుపులో జఠరాగ్ని ఎల్లప్పుడూ సమంగా ఉండి రక్త వృద్ధి, శరీర పుష్టి కలుగుతుంది.

👉ఉసిరికాయ బెరడు చూర్ణం 30గ్రా. తానికాయ బెరడు చూర్ణం 60గ్రా. కరక్కాయ బెరడు చూర్ణం 180గ్రా. పటిక బెల్లం చూర్ణం 270గ్రా. అన్ని కలిపి నిల్వ చేసుకుని పూటకి ఐదు గ్రాముల నుండి పది గ్రాముల చొప్పున గోరు వెచ్చని నీళ్లతో కలిపి రెండు పూటలా తీసుకుంటే బాగా అగ్ని దీపనం కలిగి ఆహారం సక్రమంగా జీర్ణమై, సుఖ విరేచనం జరిగి, ఎప్పటికప్పుడు శరీరం శుద్ధి కాబడి ఆరోగ్యంగా ఉంటుంది. ఇది సర్వ రోగ హర చూర్ణం.

👉వాము 50గ్రా. శొంఠి 50గ్రా. సైన్ధవ లవణం 50గ్రా. అన్ని కలిపి ఒక గాజు డబ్బాలో వేసి ఈ పదార్థాలు అన్ని మునిగే వరకు నిమ్మ రసం పోసి మూత పెట్టి ఈ డబ్బాని ఎండలో ఒక రోజంతా పెట్టాలి.. ఆ తర్వాత మళ్ళీ అందులో నిమ్మ రసం పోయాలి.. మరుసటి రోజు మళ్ళీ ఎండలో పెట్టాలి. ఇలా మూడు రోజులు చేస్తే లేహ్యం లాగా తయారు అవుతుంది. ఈ లేహ్యన్ని ఐదు నుండి పది గ్రాముల చొప్పున రోజుకి రెండు పూటలు తీసుకోవాలి. ఇలా చేస్తే అజీర్ణం వల్లే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు, ప్రేగులకు సంబంధించిన సమస్త రోగాలను హరించి రక్త శుద్ధి, రక్త వృద్ధి, దేహ బలం కలుగును.

👉సోంపు 100గ్రా. తెల్ల జీలకర్ర 50గ్రా. పటిక బెల్లం 100గ్రా. మెత్తగా దంచుకుని పూటకి ఐదు గ్రాముల చొప్పున రోజుకి రెండు పూటలు భోజనం తర్వాత తీసుకుని మంచి నీళ్ళు త్రాగుతూ ఉంటే కడుపు ఉబ్బరం, కడుపులో మెలి తిప్పడం, నీళ్ల విరేచనాలు మొదలైన ఉదర సంబంధ సమస్యలు తొలిగిపోతాయి.

👉కరక్కాయ బెరడు చూర్ణం, పిప్పలి చూర్ణం,వాయు  విడంగాల చూర్ణం,చిత్రమూలం వేరు చూర్ణం, గానుగ గింజల చూర్ణం సమ భాగాలుగా తీసుకుని కొంచెం దోరగా వేయించి ఈ మిశ్రమానికి సమానముగా పటిక బెల్లం కలిపి ముద్దగా దంచి మిరియాల గింజల సైజులో ఉండలుగా చేసి గాలిలో ఆరబెట్టి నిల్వ ఉంచుకుని రోజుకి మూడు పూటలా ఒక్కో మాత్ర చొప్పున భోజనం తర్వాత తీసుకుంటూ వస్తే సకల అజీర్ణ రోగాలు హరించి, రక్త శుద్ధి మరియు రక్త వృద్ధి జరిగి శరీరం కూడా కాంతివంతంగా మారుతుంది. ఇవి పిల్లలు, పెద్దలు అందరూ కూడా వాడవచ్చు. మిరియాల సైజు కంటే పెద్దగా కాకుండా చూసుకోవాలి

👉అపానవాయువు అధికముగా ఉన్న వాళ్ళు నల్లఉప్పు 50గ్రా. వాము చూర్ణం 100గ్రా. కలిపి రోజుకి రెండు లేక మూడు పూటలు ఈ చూర్ణాన్ని మజ్జిగతో తీసుకుంటే ఈ సమస్య తగ్గుతుంది.

👉అల్లం, బెల్లం సమ భాగాలుగా తీసుకుని రోజు పరకడుపున తీసుకుంటే పైత్యం, వాంతులు, కడుపులో వికారం లాంటి సమస్యలు తగ్గిపోతాయి.

🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు  ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏


--(())--

ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్య వరం... ఈ ఆకు కూరలు.

👉శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తాయి.

👉 నిత్యం ఆకు కూరలని తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది.

👉ఆకు కూరలు వండుకునే ముందు కచ్చితంగా ఒకటికిరెండు సార్లు కడగటం మంచిది.

👉ఆకుకూరలలో ముఖ్యమైనవి : తోట కూర, గోంగూర, మట్టుబచ్చలి ఆకు, చుక్క కూర, మెంతికూర, కొత్తిమీర, తీగ బచ్చలి,పుదీనా ఆకు, కరివేపాకు, బచ్చలి, పాలకూర, పొన్నగంటి కూర, చింతచిగురు, మునగాకు, పప్పు కూర, సోయా ఆకు, ఉల్లికాడలు, కాబేజీ, శెనగాకు, తమలపాకు, చిర్రాకు, చక్రవర్తి కూర, పెరుగు తోట కూర, కోడి జుట్టు ఆకు,
అవిశ ఆకు etc...

👉డైట్ చేస్తున్న వారి కోసం ఆకుకూరలు ఒక అద్భుతమైన ఆహారం. 

👉వీటిలో తక్కువ కార్బోహైడ్రేట్స్ మరియు చాలా తక్కువగా బ్లడ్ గ్లూకోజ్ లు కలిగి ఉంటాయి.

👉ఆకుకూరల్లో విటిమిన్ ఎ, కె మరియు ఇ పుష్కలంగా ఉంటాయి. 

👉ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తుంది మరియు శాస్వ సంబంధిత సమస్యల నుండి రక్షిస్తుంది.

👉 యూరినరీ మరియు పేగు సంబంధిత సమస్యలను నివారించడంలో అద్భుతంగా పని చేస్తాయి.

👉ఒక కప్పు ఆకూరలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మలబద్దకాన్ని మీ దరిదాపుల్లో చేరనివ్వదు.

👉ఆకుకూరల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండి మీ జీవక్రియను శుభ్రం చేస్తుంది.

👉 ఆకుకూరలు శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడే గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది.

👉 ఆకుకూరల్లోని విటమిన్స్ మరియు మినిరల్స్ హైబ్లడ్ ప్రెజర్ ను నివారించడానికి సహాయపడుతాయి.

👉ఆకుకూరలు  యాంటీక్యాన్సర్ గుణాలను కలిగి ఉండి ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.

👉 చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ప్రతి రోజూ ఒక కప్పు ఆకుకూరలు తీసుకోవడం మంచిది.

👉ఆకు కూరలలో కెరోటిన్‌ అనే పదార్ధం సమృద్ధిగా ఉంటుంది.ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

👉 అంతే కాదు వీటిలో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ స్కిన్ మాయిశ్చరైజ్ గా అద్భుతంగా పనిచేస్తాయి.

👉 మొటిమలు, మచ్చలు, రాషెస్ వంటి అనేక చర్మ సమస్యలతో పోరాడటానికి సహాయపడుతాయి.

👉ఆకుకూరల్లో సెలీనియం, మరియు ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి మెదడు మరియు నరాల పని తీరును మెరుగు చేస్తుంది.

👉 ఆకుకూరల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ళనొప్పలను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి

👉ఆకు కూరలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. 

👉రక్త కణాల వృద్ధికి ఇనుము చాలా అవసరం. 
గర్భిణీలు, బాలింతలు, ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఇనుము అవసరము ఎక్కువగా ఉంటుంది. 

👉ఐరన్ లోపం వల్ల వచ్చే అనీమియా వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది.

👉తోటకూర, శనగ కూర, బొబ్బెర్ల ఆకులు, బచ్చలి, ఆవాకులు, పొనగంటి మొదలైనవి వాటిలో ఇనుము ఎక్కువగా లభిస్తుంది..

👉ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి.

👉ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగి ఉంటాయి.

👉ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి.

👉విటమిన్-ఎ లోపం కారణంగా  కంటిచూపును కోల్పోతారు. 

👉ఆకుకూరల ద్వారా లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎగా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.

👉విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం.

👉మధుమేహ వ్యాధి (షుగర్ వ్యాధి), గుండె జబ్బులు  ఉన్నవారు ఈ ఆకు కూరలు తింటే ఉపశమనం పొందుతారు.

👉ఆకు కూరల్లో  క్యాలరీలు చాలా తక్కువ, కొవ్వు పదార్ధాలు కూడా తక్కువే. మాంసకృత్తుల శాతము చాలా అధికము. అలాగే పీచు పదార్థాలు, ఇనుము, కాల్షియం అధిక మోతాదుల్లో ఉంటాయి. 

👉ఆకుకూరల్లో కెలోరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.

👉 వంటచేసేటపుడు ఆకుకూరలను స్వల్ప వ్యవధిలోనే ఉడికించాలి. లేదంటే ఇందులో వుండే సి విటమిన్ ను కోల్పోయే ప్రమాదం ఉంది

👉ఇంకా ఎన్నో గొప్ప విలువలను కలిగిన ఈ ఆకు కూరలు ప్రతి రోజు మీ ఆహారంలో తీసుకోవడం మరవకండి. 

🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు  ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ