🌹. అష్టాదశ శక్తి పీఠాలు -




🌻.


*. శ‌క్తి పీఠాలు

18 ప్ర‌ధాన‌మైన శ‌క్తి పీఠాల‌ను అష్టాద‌శ శ‌క్తి పీఠాలు అంటారు. వాటి వివ‌రాలు మీ కోసం..

🌻. 1. శాంకరి - శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.

🌻. 2. కామాక్షి - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

🌻. 3. శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింప బడుతున్నది.

🌻. 4. చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.

🌻. 5. జోగులాంబ - ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.

🌻. 6. భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.

🌻. 7. మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

🌻. 8. ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొన వచ్చును.

🌻. 9. మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.

🌻. 10. పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.

🌻. 11. గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా - వైతరిణీ నది తీరాన ఉన్నది.

🌻. 12. మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.

🌻. 13. కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.

🌻. 14. మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.


🌻. 15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.

🌻. 16. మంగళ గౌరి - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.

🌻. 17. విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్.

🌻. 18. సరస్వతి - జమ్ము, కాశ్మీర్ - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలో ఉందంటారు.
🌹 🌹 🌹 🌹 🌹
 14. శ్రీ  మాధవేశ్వరి దేవి - 14వ శక్తి పీఠం -  ప్రయాగ, , అలహాబాద్, ఉత్తరాఖండ్ 🌻
📚. ప్రసాద్ భరద్వాజ/ ప్రాంజలి ప్రభ 

. 🌴. శ్రీ మాధవేశ్వరి దేవి దివ్యస్తుతి 🌴

త్రివేణీ సంగమోద్భుతా త్రిశక్తీనాం సమాహృతిః |
ప్రజాపతికృత్యా శేష యాగమాభిలాషాభి వందితా |
బృహస్పతికరాంతస్థ పీయూష పరిసేవితా |
ప్రయాగే మాధవీ దేవీ సదాపాయాత్ శుభాకృతిః ||14 మాధవేశ్వరి దేవీ

🌻. ప్రయాగే మాధవేశ్వరి:

“ప్ర” అనగా గొప్ప. “యాగ” అనగా యాగము. కావున గొప్ప యాగము చేసిన ప్రదేశమైనందు వలన ఈ ప్రదేశమునకు “ప్రయాగ” అను పేరు వచ్చినది.

పూర్వం గంగా యమునల మధ్య సరస్వతీదేవి నది కూడా ప్రవహిస్తూ ఉండేది. గంగా నదిని “ఇడానాడి” గానూ, యమునానదిని “పింగళానడి” గాను, సరస్వతీ దేవిని “సుషుమ్నా నాడి”గా భావించి ఎందరో మహర్షులు, దేవర్షులు, ఈ సరస్వతి నదీ ప్రాంతంలో నివసించేవారు.

సరస్వతి నది ఉన్నంతకాలం గంగానదికి ప్రాచుర్యం లభించలేదు. సరస్వతి నది అంతర్వాహిని అయిన తరువాత గంగానదికి విశేష ప్రాచుర్యం లభించింది. ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమక్షేత్రమని పిలిచేవారు.

బ్రహ్మ యాగాలు చేసిన ప్రదేశం కనుక “ప్రయాగ క్షేత్రమని” ఆ క్షేత్రానికి పేరు వచ్చింది.

మాధవేశ్వరి అమ్మవారి "కుడిచేతి నాలుగువేళ్ళు" ప్రయాగ (అలహాబాద్) ప్రాంతంలో పడినట్లు దేవిభాగవతం చెబుతుంది. సతీదేవి వెళ్ళు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. కేవలం యంత్రాన్ని మాత్రమే ప్రతిష్ఠించారు.

నాలుగు దిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రమే ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హూండిలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్లు తృప్తి చెందుతారు. తాము తెచ్చిన కానుకలను ఊయలలో పెడతారు.

ప్రతి 12 సం||లకొకసారి ఈ ప్రయాగ క్షేత్రంలో కుంభమేళా ఉత్సవం జరుగుతుంది. మరియు జీవకోటికి ప్రత్యక్షసాక్షి అయిన సూర్యభగవానుడు పూజించినందువల్ల భాస్కర క్షేత్రమని మరోపేరు కూడా ఈ ప్రయాగ క్షేత్రానికి వచ్చింది. కొంత కాలానికి సరస్వతీ నది అంతర్వాహినిగా ఉండిపోయింది.

ఈ క్షేత్రంలో సతీదేవి చేతివేలు పడింది. కావున ఇది ఒక శక్తి క్షేత్రంగా పూజలందుకుంటోంది. అక్బరు నిర్మించిన కోటలో అనాదిగా ఒక వటవృక్షం ఉంది. దాన్ని “అక్షయ వటము” అని పిలుస్తారు. ఈ వటవృక్షం శ్రీహరికి గొడుగుగా ఉంటుందని పురాణ సారం.

ఈ క్షేత్రంలో ముందుగా గంగాస్నానం చేశాక తరువాత యమునలో విడివిడిగా స్నానం చేయాలి. తలనీలాలర్పించటం అనేది ఈ సంగమస్థానంలో ఒక విశిష్ఠత. పురుషులు తలనీలాలు, స్త్రీలు జడ కొసలు ఈ నదీమ తల్లికి సమర్పిస్తారు.

గయాక్షేత్రంలో పిండ ప్రదానం ఎంత ప్రశస్తమో, గయ తరువాత పిండ ప్రదానానికి అంత ప్రాముఖ్యత కలిగినదీ ప్రయాగ. గంగా, యమునల మధ్య గల భూభాగమంతా పరమ పవిత్రమైనది మనం ప్రతిరోజూ చేసే సంధ్యా వందనంలో ఉంటుంది.

దానికి కారణమేమంటే గంగా, యమునల మధ్య భూమి దేవతకు నడుము. ఆ నదుల సంగమ స్థానం భూదేవికి ఒడి. తల్లి ఒడిలో లాలన పొందే శిశువులను ప్రేమించినట్లు ప్రేమతో లాలించే పవిత్ర పావన “మాతృక్షేత్రం” ఈ ప్రయాగ.

ఈ క్షేత్రం చేరుకున్నా దూరం నుంచైనా స్మరించి, ఇక్కడి ఒంటికి పూసుకుంటే త్రివేణి సంగమ స్నాన ఫలం లభిస్తుంది. ఈ మాధవేశ్వరి శక్తి పీఠం వలననే ఈ మహత్మ్యం లభిస్తున్నదని పురాణ ప్రవచనం.

స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. ఈమెను కృతియుగంలో దేవగురువైన  బృహస్పతి అమృతంతో అభిషేకించాడని పురాణాలు చెబుతున్నాయి.అమృతతీర్థం అని అంటారు. త్రేతాయయుగంలో రాము డు, ద్వాపరంలో శ్రీకృష్ఱుడు ఈ తల్లిని పూజించారు. సూర్యుడు పూజించడం వలన ఈ క్షేత్రాన్ని భాస్కరక్షేత్రం అని కూడా పిలుస్తారు.ఈ తల్లి శక్తిత్రయస్వరూపిణి.

దేవతలు ... రాక్షసులు అమృతాన్ని పొందడానికి పోటీలు పడుతున్న సమయంలో, అమృత భాండం బృహస్పతి చేతికి చిక్కింది. అది రాక్షసులకి దక్కకూడదనే ఉద్దేశంతో ఆయన దానిని తీసుకుని వెడుతుండగా, ఆ భాండంలోని అమృతం ఒలికి ఈ సంగమ క్షేత్రంలో పడిందనీ, ఈ కారణంగానే ఈ క్షేత్రానికి 'అమృత తీర్థం' అనే పేరు వచ్చిందని అంటుంటారు. ఈ క్షేత్రంలో పితృదేవతలకు ఆబ్దిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ వుంటాయి.

ఈ దేవిని అలోపీదేవిగా పిలవటానిక ఇక్కడ ప్రచారంలో వున్న కధ....ఒకప్పుడు ఇదంతా దట్టమైన అరణ్య ప్రదేశం.  ఈ ప్రాంతంవారు ఆడపిల్లకి పెళ్ళిచేసి డోలీలో కూర్చోబెట్టి అత్తవారింటికి పంపిస్తారు.  అలా ఒక పెళ్ళి కూతురుని పంపించేటప్పుడు బందిపోటు దొంగలు వారిని ఆపి దోచుకున్నారు.  పెళ్ళికూతురు అమ్మవారిని ప్రార్ధించగా, ఆవిడ పెళ్ళికూతురుని మాయంచేసి, ఆ దొంగలబారినుండి రక్షించిందట.  అప్పటినుంచి ఆ దేవిని అలోపీదేవిగా వ్యవహరిస్తున్నారు.  అలోపీ అంటే మాయమవటం అని అర్ధం.  అప్పటినుంచీ అక్కడివారు పెళ్ళిళ్ళకి ముందు ఈ అమ్మవారిని పూజించి శుభకార్యం మొదలు పెడతారు.

నవరాత్రులలోని 9వ రోజుని ఈ అమ్మవారి రోజుగా చెబుతారు.
****
🌻. 8. శ్రీ  ఏకవీరాదేవి  - 8వ శక్తి పీఠం - మహార్, మహారాష్ట్ర  🌻

🌴. శ్రీ  ఏకవీరాదేవి దివ్యస్తుతి 🌴

దత్తాత్రేయ సమారాధ్యా అవసూయాత్రిసేవితా |
ఏకవీర మహాదేవీ మస్తకే నైవశోభినీ |
రేణుకా మాతా శ్రీక్షేత్రా మాయా సంహార రూపిణీ |
కృపయాపాతునస్సర్వాం మయూరే ఏకవీర్యా || 8

 పెన్‌గంగా అనబడే పంచగంగా నది తీరాన అమ్మవారు ఏకవీర దేవిగా ఆవిర్భవించినట్లు ఇక్కడ పురాణాలు చెపుతున్నాయి. అమ్మవారిని ఇక్కడ భక్తులు ఏకవీర దేవిగా, రేణుకాదేవిగా పిలుస్తారు.

ఈ క్షేత్రం నాందేడ్‌ పట్టణానికి 127 కి.మీ. దూరంలో ఉంది.  ఏకవీరాదేవి ఆలయం మహారాష్ట్రలోని మహుర్లో వెలసియున్నది. సతీదేవి యొక్క కుడిచేయు ఇక్కడ పడినది చెబుతారు. మిగతా శక్తిపీఠాలలో లోగా ఇక్కడ భక్తుల తాకిడి ఉండదు. ఇక్కడ ప్రధాన దేవత రేణుకా దేవి.

ఏకవీరాదేవి రేణుకాదేవి పెద్ద సోదరి అని భావిస్తారు. ఇక్కడ ఈ ఇద్దరే దేవతలే కాక పరశురామ ఆలయం. దత్తాత్రేయస్వామి ఆలయం, అనసూయామాత ఆలయం, అత్రి మహర్షి, మాతృతీర్ధం మరియు దేవదేవేశ్వరుని మందిరాలు కూడా ఉన్నవి. ఇక్కడి ప్రత్యేకత ప్రసాదం. తమలపాకులు, వక్కపొడి నూరి ఇస్తారు.

ఈ ప్రదేశంలోని 3 పర్వతాలున్నాయి. ఒక శిఖరం మీద దత్తాత్రేయ స్వామి, రేండవ పర్వతంపైన అత్రి, అనసూయల ఆలయాలు ఉన్నాయి.

మూడవ శిఖరం సతీదేవి కుడిస్తనం పడిన శ్రీ క్షేత్రం.. ఈ శిఖరంపైన గల ఆలయంలోగల ఏకవీరాదేవి విగ్రహం భయంకర రూపంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పెద్ద తల మాత్రమే ఉంటుంది.

అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు.

జమదగ్ని మహర్షి తన భార్య రేణుకాదేవి మనసు చెదిరిందని ఆగ్రహించి ఆమె తల తీసేయమని కొడుకైన పరశురాముడిని ఆదేశిస్తాడు. తండ్రి మాటను పరశురాముడు శిరసావహిస్తాడు. ఫలితంగా మొండెం నుంచి వేరైన రేణుకామాత తల అక్కడికి దగ్గరలో వున్న ఓ గూడెంలో పడుతుంది.

రేణుకామాత పాతివ్రత్యం గురించి ముందుగానే తెలిసి వుండటం వలన, ఆ గూడెం ప్రజలు ఆమె తల పడిన ప్రదేశంలో గుడికట్టి పూజించడం మొదలు పెట్టారు. అలా ఇక్కడి అమ్మవారు పూజలు అందుకుంటోందని భక్తుల విశ్వాసం. ఈ తల్లినే ‘ఛిన్నమస్త’ అని కూడా అంటారు.

అయితే ఇది రేణుకా మాత ఆలయమేగానీ శక్తి పీఠం కాదనే మాట ప్రచారంలో వుంది. అక్కడికి దగ్గరలోనే అంటే మాహొర్ కి 10 కిలోమీటర్ల దూరంలో అసలైన శక్తి పీఠం ఉందనేది స్థానికుల విశ్వాసం.

పొలాల మధ్య చిన్న గుడిలో వెలసిన ఈ అమ్మవారి ప్రతిమ కూడా ముఖం వరకు (తల భాగం ) మాత్రమే ఉండటం విశేషం. నిజమైన శక్తి పీఠం ఇదేనని చెప్పే ఆధారాలు ఇక్కడ ఉన్నాయని చెబుతున్నారు. ఏదేవైనా ఈ ప్రాంతానికి వెళితే రేణుకా మాత క్షేత్రంతో పాటు అమ్మవారి శక్తి పీఠాన్ని దర్శించిన భాగ్యం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 ఆ అమ్మను బుద్ధి అనే అక్షింతల అర్చన చేస్తూ హృదయమనే కమలంలో సుస్థిరంగా నిలుపుకోవాలి. అమ్మ కోసం మనం తపిస్తే అమ్మ మనకోసం పరితపిస్తుంది.

ఇక అమ్మ ఏకవీరికా దేవిగా వెలసిన మయూర పురం దర్శనం ఎంతో పుణ్యప్రదమైనది.

 సహ్యద్రి పర్వత శ్రేణులో ఒక శిఖరంపై గల ఈ పీఠాన్ని దర్శించేందుకు ఎందరో తాంత్రికులు, క్షుద్రోపాసకులు వచ్చి బలులు ఇచ్చి అమ్మను సంతృప్తిపరుస్తారు. దీనినే మహాగ్రామమని, తులజాపూర్ అని అంటుంటారు. ఈ క్షేత్రాన్ని ఛత్రపతి శివాజీ కూడా దర్శించాడని అంటారు. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక.

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 72వ నామం ఏకవీరాదేవిది వస్తుంది.

అర్ధ మాత్రా పరాసూక్ష్మా, సూక్ష్మార్ధార్ధ పరాపరా
ఏకవీరా విశేషాఖ్యా షష్టీ దేవీ మనస్వినీ  72

. సాధకులు ప్రపంచములోని కుటిలోపాయముల పట్ల సదా జాగురూకులై ఉండాలి. మాయా మోహజాలంలో పడకుండా సావధానత వహించాలి. 🌹

శ్రీగురుభ్యోనమః🙏

సతీదేవి 'నా యందు ప్రసన్నుడవై నీవు నా కోరిక తీర్చమని శివుని ప్రార్ధించెను.  పరమేశ్వరుడు మందస్మితము చేసెను. దక్షుడు సభలో తన గురించిన పలికిన పలుకులు  పరమేశ్వరునికి జ్ఞాపకమునకు వచ్చినవి.

నీవు దేహ సంబంధ అభిమానముతో పిలవక పోయినా వెడదామను కుంటున్నావు. నీవు వెడితే వాళ్ళు పలకరించరు. వెనుకటి కోపముతోనే చూస్తారు. నువ్వు దుఃఖపడతావు. నువ్వు దుఃఖపడితే నేను చూడలేను.I కాబట్టి మనము వెళ్లకపోవడమే మంచిదని శివుడంటాడు.

విద్య, తపస్సు, ధనము, వయసు, అందము, కులము అనునవి సద్గుణములు అనుకొనరాదు.

వక్రబుద్ధులైన దుష్టుల ఇండ్లకు పూజ్యస్థానమున పూజింపబడువారు పోరాదు.

దైవముపై భక్తి నిలిపిన వారు పాటించునది గుణములనే గాని, చుట్టరికములను కాదు, అని శివుడు సతీదేవితో అంటాడు.


🌻. 7. శ్రీ మహాలక్ష్మి దేవి - 7వ శక్తి పీఠం -  కొల్హాపూర్, మహారాష్ట్ర  🌻

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సుర పూజితే|
శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే||

తా|| శ్రీ పీఠముపై సుఖముగా కూర్చొని యుండి, శంఖము, చక్రము, గద మరియు అభయ హస్తముద్రతో నుండి మాయను మటుమాయం చేసే మహామాయగా దేవతల రత్న కిరీట కాంతులతో మొరయుచున్న పద్మపాదములుగల తల్లి, దేవతలచే పూజింపబడుతున్న మహాలక్ష్మికి భక్తిపూర్వక నమస్కారము.

అష్టాదశ శక్తి పీఠములలో ముఖ్యమైన శక్తిపీఠము కొలాహపురి మహలక్ష్మీ శక్తిపీఠము. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. ఇక్కడ చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంత మేలుచేస్తుందని ఆర్యోక్తి.

ఈ క్షేత్రానికి పూర్వనామం “కరవీర” పట్టణం. ఈ కొలాహపూర్ సముద్ర మట్టానికి 550 అడుగుల ఎత్తులో వున్నది. క్రీ.శ. 9వ శతాబ్దంలో ఈ మహాలక్ష్మి ఆలయం నిర్మించబడినదని చరిత్రకారుల భవన.

ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

పద్మావతి పురంవంటి కొలాహపురంలో కొలువైనది, కరుణ మాత్రమున వీరత్వము నొసగే కరవీర పురవాసిని, విభూతి అనగా ఐశ్వర్యప్రదమైన శివలింగమును కిరీటంపై ధరించి, వాత్సల్యంతో కోరిన వారికి సంపదనొసగే సచ్చిదానంద స్వరూపిణీ, ఓ లక్ష్మిదేవీ నీకు జయమగుకాక…

మాత లుంగం గదాం ఖేటం పానపాత్రం చ భిభ్రతే|
నాగలింగం చ యోనించ భిభ్రతీ నృప మూర్థని||

కొలాహపురి మహలక్ష్మికి నాలుగు చేతులున్నాయి. (కొలాహపుర మహాత్మ్యము) క్రింద కుడిచేతిలో మాతలుంగ ఫలం (మాదిఫలం), పైకుడి చేతిలో కిందికి దిగి ఉన్న పెద్ద గద, పైన ఎడమ చేతిలో డాలు, క్రింది ఎడమ చేతిలో పానపాత్ర ఉండగా, శిరస్సుపై ఒక నాగపడగ, దానిలో శివలింగము, యోని ముద్ర ఉన్నాయి. చంద్రఘంటా దేవి కిరీటంలోని ఘంటయే లక్ష్మిదేవి కిరీటంలోని శివలింగంగా మారిందని పెద్దల ప్రవచనం.

అత్రి, అనసూయల పుత్రుడైన సద్గురు దత్తాత్రేయుడు ప్రతిరోజు మద్యాహ్నం ఈ లక్ష్మీదేవి వద్దకు వచ్చి భిక్షస్వీకరించేవాడట. వింధ్య గర్వమణచిన అగస్త్యుడు కొలాహపురి క్షేత్రదర్శనంతో దేవి సాక్షాత్కారం పొందాడు.

వందే పద్మకరాం ప్రసన్న వదనాం సర్వసౌభాగ్యదాయినీం|
వందే కరవీరపురస్థితాం మహాలక్షీం మానసార్చిత వందనం||

ఇక్కడ అమ్మవారి మూడు కళ్ళు పడ్డాయి అని చెప్పుతారు. మహాలక్ష్మి అనే పేరు ఉండడం మూలంగా ఈ అమ్మవారిని శ్రీ మహావిష్ణువు భార్య అని అనుకుంటారు. కానీ, ఈమె విష్ణుపత్ని కాదు. 18 భుజాలతో రజోగుణంతో భాసిల్లుతున్న మహాశక్తి. 

రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి.  కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు.

కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు.

మహాప్రళయకాలంలో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు.

🌻. స్థల పురాణం  :
మహారాష్ట్రలోని కొల్హాపురంలో పంచగంగా నదీ సమీపంలో ఈ శక్తి పీఠం విరాజిల్లుతోంది.

సిరిసంపదలను ప్రసాదించే ఈ శక్తి పీఠం గురించిన ప్రస్తావన మనకి పురాణాల్లో కనిపిస్తుంది. ఒకానొకప్పుడు ఈ ప్రాంతాన్ని కరవీరుడు పాలిస్తూ వున్న కారణంగా ఇది 'కరవీరపురం'గా ప్రసిద్ధి చెందింది.

కరవీరుడు అతని ముగ్గురు సోదరులు ప్రజలను నానాకష్టాలు పెడుతూ ఉండటంతో, రాక్షస కుమారులైన ఆ నలుగురిని కూడా శివుడు సంహరించాడు.

దాంతో కరవీరుడి తండ్రి అయిన కొల్హుడు ప్రతీకారంతో రగిలిపోతూ దేవతలపైకి దండెత్తాడు. దాంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి అతణ్ణి సంహరించింది. కొల్హుడి అభ్యర్ధన మేరకు ఆ ప్రాంతానికి అతని పేరు స్థిరపడేలా అనుగ్రహించింది.

ఇక్కడి అమ్మవారు మూడు అడుగుల ఎత్తులో శివలింగాకారంలో దర్శనమిస్తూ ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.

మహిమాన్వితమైనటువంటి ఈ శక్తి పీఠానికి క్షేత్ర పాలకుడు కపిలేశ్వరుడు, ముందుగా ఆయనను దర్శించిన తరువాతనే అమ్మవారిని దర్శించాలి.

అమ్మవారికి చెరో వైపున మహాకాళి - మహా సరస్వతి ఆలయములు వున్నాయి. నవదుర్గల ఆలయాలు ... నవగ్రహాల ఆలయాలతో పాటు, సాక్షి గణపతి .. సూర్యనారాయణుడు .. దత్తాత్రేయుడు ఇక్కడ కొలువుదీరి కనిపిస్తారు.

దత్తాత్రేయుడు ఈ అమ్మవారి దగ్గరే ప్రతి రోజు బిక్ష స్వీకరించేవాడని స్థల పురాణం చెబుతోంది.
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ