తేట గీతి నేటి పద్యాలు


అన్నిటికంటే ఉతమైన పుష్పం ... పట్టి పుష్పం 
 అన్నిటి కంటే తీపిది ఏది  .... గొంతు 
సర్వ  శ్రేష్ఠుడైన రాజు ఎవరు ....  ఇంద్రుడు 
సూర్యుడు మరియు చెంద్రుడు దృష్టినుండి దాగినది ఏది ..... అంధకారం   








"ఓంకార రూప నమకాది సుసూక్త శంభో,
శ్రీ గౌరి దేవి హృదయాబ్జ విహార భృంగ !
శ్రీరుద్ర దేవ గురు దక్ష విదర్ప హారిన్ ,

శ్రీ చంద్రశేఖర విభో శరణం ప్రపద్యే !!!


Image may contain: Murthy Lingala
ప్రాంజలి ప్రభ పద్య పుష్పాలు .. తేటగీతి (౨) 
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

పుష్ప పరిమళ ము మనసు తాక గానె
హృదయ కలయక కళ వింత శోభ చెంది 
 పుష్ప మాయకు ఇంద్రియ నిగ్రహమ్ము
హింస వదలి యు క్షమ దయ ఆశ్ర యించు

మనసు లేని వాడు పూజచేయుటకన్న
మాని వేయు చుండు ఉత్త మమ్ము  
హృదయ మున్న వాడు పూజచేయుట వల్ల 
శాంతి  ధర్మ బుద్ధియు కల్గి యుండు 

ఆటవెలది 

అయ్యె దేదొ అయ్యె అనకురా మానవా
ఉనికి మర్చి ఉండవద్దు నీవు
సందియమ్ము తెల్పు బుధ్ధియు మానరా 
ఆశలొద్దు అడ్డు మాత్రమోద్దు

కుయ్యో మోర్రొ అంటే అడగరెవరనకు 
చేయు తప్పు దాచి లేవు నీవు
పట్టు పట్టి గట్టి పలుకులు వినిపించి 
కోపమాపు శక్తి మరచి ఉండు

కావు మమ్ము దేవ నిత్యమ్ము శక్తితొ 
పుణ్య ఇచ్చి పాప మార్గ తొలుచు  
మౌన మొదలి రావ రాజిల కృపతో
నిన్ను నమ్మి వేడు కొంటి దేవ  
--(())--

ప్రాంజలి ప్రభ పద్య పుష్పాలు .. తేటగీతి (3  ) 
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


శ్రీ భక్త మందారం 
తేటగీతి పద్యాలు 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

తెలిసి తెలియక ఊగిస లాడు మనసు 
దేనిని చూసిన దానిని మరువ లేక  
కినుకు ఆశలు బీటలు బారి ఉన్న 
హృదయ వేదన తెల్పిన వినరు ఎవరు 

లోతు ఎరిగియు నీతిని గూర్చి తెల్పు 
బరువు మోయుట బాధ్యత తప్ప దనకు 
జరుగు నది జరిగేదియు తెల్ప లేక
మనిషి మనుగడకు కలల గల గల లివి      

త్రాసు కదలిక జీవిత సత్య మవ్వు 
కెరట ఉరకలు బతుకుల ఆట అవ్వు 
నదుల పరుగులు సంపద వేట అవ్వు 
పురుష మహిళల కోర్కలు పవన మవ్వు 

లాభ నష్టము శ్రమలకు తగ్గ ఉండు  
మంచి చెడులను కళలను బట్టి ఉండు 
విద్య వినయము సంపద బట్టి ఉండు 
కాల మాయకు ఇదియెఅనేది లేదు

ధైర్య శాలివై విజయము వచ్చు వరకు 
ఎన్ని రోజులై న వినయ సహన ముంచి 
స్వార్ధ ఆలోచనలు మాని విజయ కాంక్ష 
స్థిర బుద్ధిని కలిగితే ఉండు జయము   

ఉత్త మోత్తమ మైనట్టి  శక్తి యుక్తి 
భావ కంపన లకుచిక్కక, కళ విలువ 
తెల్సి ముందుకు ఉరుకుట, తెలివి తెచ్చు 
పనియు ఆశకు లొంగకు వచ్చు జయము   

నీడ నీవెంట ఉండును భయము లేక 
ధైర్య భావము తోడుగా విశ్వ మాయ 
వెంట పడకుండ ఊపిరి ఆగ కుండ 
నిజము ఏదోతె లుసుకొను మార్గ రక్ష  

పెద్దల పలుకు వేదము అదియు నిత్య 
సత్య  జీవిత లక్ష్యము కనుక నీవు 
ఉదయ భానుని ధ్యానించి జరుగ బోవు 
ప్రతిభ సాధన శోధన కలిగి ఉండు  
.
బ్రాంతి వద్దురా శాంతి కోసమును సాగు 
ప్రీతి అనునదేదియు లేదు విజయ కాంక్ష 
తప్ప, విజయము విలువ జగతికి మెట్టు   
నీవు అందుకు మూలము మవ్వ వలెను


--(())--


శ్రీ భక్త మందారం 
తేటగీతి పద్యాలు 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

తెలిసి తెలియక ఊగిస లాడు మనసు 
దేనిని చూసిన దానిని మరువ లేక  
కినుకు ఆశలు బీటలు బారి ఉన్న 
హృదయ వేదన తెల్పిన వినరు ఎవరు 

లోతు ఎరిగియు నీతిని గూర్చి తెల్పు 
బరువు మోయుట బాధ్యత తప్ప దనకు 
జరుగు నది జరిగేదియు తెల్ప లేక
మనిషి మనుగడకు కలల గల గల లివి      

త్రాసు కదలిక జీవిత సత్య మవ్వు 
కెరట ఉరకలు బతుకుల ఆట అవ్వు 
నదుల పరుగులు సంపద వేట అవ్వు 
పురుష మహిళల కోర్కలు పవన మవ్వు 

లాభ నష్టము శ్రమలకు తగ్గ ఉండు  
మంచి చెడులను కళలను బట్టి ఉండు 
విద్య వినయము సంపద బట్టి ఉండు 

కాల మాయకు ఇదియెఅనేది లేదు 

--(())--

శ్రీ భక్త మందారం" గురుపౌర్ణమి " సందర్భముగా  
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

నీటి బుడగల వెలుగులు వచ్చి ఉన్న 
కమ్ము కున్నటి చీకటి మార్చ లేవు 
కలల సంపద అస్థిర మవ్వు టేను  
కలలొ సౌఖ్యము తెరిచాక సూన్యమేను

భోగ భాగ్యమ్ము నిముషము కొద్ది మేను  
వస్తు సౌందర్య భావము చెప్పు నంత 
వెలుగు చీకటి మైత్రియు నిత్య సత్య 
భార్య భర్తల ప్రేమలు తార మెరుపు 
   
జన్మ సఖ్యత చేసిన మేలు చేరు    
కర్మ కర్తవ్య దక్షత బట్టి ఉండు 
భార్య పిల్లల పోషణ ధర్మ మార్గ 
స్త్రీకి గౌరవము కలుగు ప్రేమ బట్టి 

కామ మెక్కువ ఉండుట, జూద మాడు 
బుద్ధి మక్కువ ఉండుట, వేట పిచ్చి 
పెరిగి, చిక్కిన మహిళను బాధ పెట్టి, 
కళ్ళు త్రాగియు  ఉండేటి  మగని వీడు 

స్త్రీల కామము జలమున తెలు తెప్ప 
వయసు ఊరట ఆకర్షణ వలె  లాగు 
చిలిపి నటనలు మనసును లాగు చుండు 
స్త్రీలు లేనిదే  జగతికి ప్రగతి లేదు  
--(())--
శ్రీ భక్త మందారం" గురుపౌర్ణమి " సందర్భముగా  
తేటగీతి 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ప్రకృతి పరమార్ధము తెలిపే బుద్ధి తోను   
లోక మాయను జయించు యుక్తి తోను 
కాల నిర్ణయ గ్రాహ్యము చెప్ప లేవు
ధర్మ మార్గంబును నడిచె  శక్తి నీది  

కష్ట మన్నది జీవితం లోన ఉండు 
ఇష్ట తృప్తిగా భావించు జీవ భావ 
నష్ట మన్నది చూడక  సౌఖ్య ముండి 
సౌమ్య సహనపు జీవిత మార్గ మవ్వు    

వంచన వలన వచ్చిన సంప దంత
బూడిదలొ సెంటు కల్పిన తెలివి లాగ 
వచ్చి నదివచ్చి నట్లుగా జారిపోవు 
తప్పు తెలిసాక మాత్రాన ఒప్పు లేవు   
     
తెలుసునని పదే తెలిపియు మోస పోయి 
నాను నేనని అన్నను నమ్మ లేదు 
మాట మాట పొల్లు పోయిన అది తప్పు 
మనిషిగా తప్పు ఒప్పుకో ముప్పు తప్పు  

స్త్రీల హృదయము తెలుసుకో లేవు సత్య 
వాక్కు మనసును చేరియు నిత్య శోభ 
సుఖమును పొంది కలగించు శక్తి  తరుణి 
లందు ఉండుట దేవుని లీలా వల్ల 

ఆటవెలది - ఆత్మ పరమాత్మా (౧) 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
జ్ఞాన ఆత్మ బుద్ధి దేహము లో ఉండు 
బాల్య యవ్వనమ్ము వృద్ధ దశకు 
మార్పు ఓర్పు నేర్పు జాగ్రత చేతన 
జ్ఞాన ముద్ర కోటి వంద నాలు  

ఎవరి మాయ వలన చేతన అనుభూతి 
తల్లి తండ్రి కొడుకు గురువు శిష్య 
బంధ మంటు జీవి తాంతము జరుగు     
దేవ దేవ కోటి వంద నాలు 

సూక్ష్మ అష్ట రూప పరిణామ  విశ్వము 
ఎవరి వలన జీవ కోటి సృష్టి 
నిత్య సత్య ధర్మ ఆత్మయే బ్రహ్మము  
జ్ఞాన దక్ష కోటి వంద నాలు 

ఆత్మ యొక్క సర్వ వ్యాపకా తత్వము 
దీని మనన పఠన ధ్యాన మిచ్చు 
శిష్య ఆత్మ యొక్క ఏకత్వ సంయోగ 
జనన మరణ ఋణము బంధ ముక్తి 

తేట గీతి 
మర్వ  వద్దెప్పుడు గురువు చెప్పు మాట 
చులకన వలదు  దేవుని నిర్ణయాన్ని   
సహజ మాటే కదా అని  మరువ వద్దు 
పెద్దలను  పిల్లలను గౌర వించి ఉండు     

మూగ జీవుల రక్షణ,  ద్యాస అంత 
ధనము చుట్టును తిరుగక ప్రేమ పంచి  
ఉన్న దాన్నొదలుట లేని దాని కొరకు
సుఖము అంటూను దుఃఖాన్ని తెచ్చుకోకు  
  
నిన్ను నీవుగ మరచుట మంచి కాదు 
ఉన్న వారిని ప్రేమించి శోభ పొందు 
దేహ ధారివి అనుకోకు దైవ దారి 
ఉంది నీకుయు స్వరూప ఆత్మ నీవు 

--(())--


Artflute - Buy Limited Edition Prints of Original Contemporary Art
ఆనంద పద్యాలు  
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
తేట గీతి 

రామచంద్రుడు ధరణిలో రాజుగాగ
ధర్మముద్దరణముజేయు తరుణ మందు
శక్తియుక్తుడౌ శివునట శరణు వేడె
అట్టి శూలియె నన్నిక యాదరించు

నిద్ర అందరికీ ఖాళి  లాంటిదేను 
నిద్ర సర్వప్రపంచము లీన మౌను 
నిద్ర సహజము జరగడం లేదు అనకు
నిద్ర  ఆరోగ్య సూక్తికి ముఖ్య మార్పు 

శ్వేత ముఖ దేహ కాంతుల నొప్పి మహిత
స్వేచ్ఛ పద వాక్కు వెల్గుల నొప్పు మహిత
జ్వాల మయ మస్త కాంతులు తెల్పు మహిత
ప్రేమ మయ వేద బోధలు తెల్పు మహిత

వినయ  వశిన్యాదులైన శక్తులతొ మహిత
వినయ చరితార్థులైనమౌనులతొ మహిత
వినయ చదువార్జులైన విద్యలతొ  మహిత
వినయ సముపార్జులైన శక్తులతొ మహిత  

సకల  వాక్కుల సృష్టి కర్త మది మహిత
సకల దాహము తీర్చు భర్త మది మహిత
సకల దేహము ఇచ్చి పుచ్చు మది మహిత
సకల దానము చేసి సేవ మది మహిత


--(())--

ఆనంద పద్యాలు  
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

స్పర్శ, ఉద్రేక, మానంద భావ ప్రాప్తి 
జ్ఞాన సున్నిత వాక్కులు  వినయ యుక్తి  
మనిషి అనుకరణవలన దేహ తృప్తి   
చలిలొ ఎండలో దేహాన్కి ప్రేమ శక్తి 

విషయ వాంఛల ప్రేమను పొందు చుండు 
బయట లోపల శక్తుల వాళ్ళ వచ్చు 
దీక్ష సాగించి పంతము వల్ల వచ్చు 
ప్రేమ ఆకర్ష ఆనంద స్పర్శ వల్ల 

చలిలొ వెచ్చదనమ్మును కోరు చుండు 
సెగలొ చల్ల దనమ్మును  కోరు చుండు 
పగలు రేయి ఆనందము పొందు చుండు 
ప్రకృతి  పారవశ్యమ్మున  స్వేశ్చ ప్రాప్తి 

మెట్టు మారిన ఆనంద ముండు పట్టు 
చెట్టు  చేరిన ఆనంద నీడ ఉండు 
గుట్టు విప్పిన సంతస ముండు చుండు 
కట్టు కట్టిన ఆనంద  సుఖము బాధ 

కలల చావుల బతుకులు "పంది "రింట 
కోడి , కప్ప పోరు  వింత గుండె 
కళల బ్రాహ్మణ వాక్కు చేప ట్టి నాను 
మంచి మార్గ మెంచి బత్కు చుండె 

పరువు కప్పల గంతులు రాజ కీయ  
మార్గ ముప్పు  పంది రింట చేరు
కొక్కరికో అను కోడి కూత  బతుకు  
చేప ముళ్ళు  గుచ్చి నట్లు భాద   


--(())--

Reality is not something that you integrate into your personal view of things. Reality is life without your distorting stories, ideas, and beliefs. It is perfect unity free of all reference points, with nowhere to stand and nothing to grab hold of....




తేటగీతి ఆటవెలది పద్యాలు 
కలల -ఆశ  17-06-2020
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామ కృష్ణ  

కలకు  నిద్రయు ఆధార ముండు టేను  
జగతి పెనుమాయ నిత్యము కప్పియుండు 
నేను అనునది నిత్యము  ఆశ పరము 
జయ మనునది ఫలితము ఇహము అహము 

నామ రూపసహితుడను కలల యందు 
నామ కల కనే  రూపరహితుడు వలెను   
పడవ తీరము చేరాక అనవసరము
మోక్ష మొచ్చాక దేహము అనవసరము

అలక కాదును అధరము పంచు నీడ
మనసు వికసిత వేదము పగలు రేయి
పనులు పరిమిత సుఖము లు పంచు మాయ
సహజ శాంతియు సౌఖ్యము ప్రేమ తోడు

సత్య మన్నది దేవుడు లోన ఉండు 
నేను దేవున్ని అంటుంటె దోష ముండు 
జ్ఞాన మందించి పోషించె సృష్టి కర్త 
నీకు నిద్రలోఅజ్ఞానము కాన రాదు 

ఓర్పు చూపి పల్కు నేర్పుతు బతకాలి 
శాంతి కోరు వారు మంచి చేయు
ఆస్తి అన్న  దేది నీదియు లేదులే
ఏది ఏమి తెల్పి భయము వలదు

స్పర్శ శబ్ద రూప జీవ భావమ్ముయె
దేహి దేహ బ్రాంతి కానె కాదు
ప్రేమ అర్ధ కామ తన్మాత్ర దేహమ్ము
ద్వంద జీవ భావ సాక్షి దేహి


--(())--


తేట గీతి నేటి పద్యాలు 
వృద్ధాప్యం -  
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మనిషి యద్భవ  తత్భావ  మేను  అనక 
మనసు భౌతిక వాస్తవ  మేది  గనక 
వినయ భావపు మర్మము తెల్సు కొనక 
విషయ  వాంఛల వెంటన ఉండు కనుక  ...... 

యుక్త  మధ్యమ వృద్ధాప్య  భావ మెలదు 
త్యాగ బుద్ధియు ఉన్నదో  లేదొ  గనుము 
శక్తి అంతయు ఖర్చును  చేసి గనుము 
తార తమ్యము తెలిసికో  ఆట గనుము  ........

దేహ కాంతియు వృద్ధాప్య మందు తగ్గు 
మేధ  శక్తియు  వృద్ధాప్య మందు పెర్గు 
మూడు కాళ్ళను మోసియు ఉండు చుండు 
చూపు మంద గిస్తుందని తెల్సి ఉండు  ........

ప్రకృతి మౌనముండినదని పూజ చేయి 
వికృతి  తాండవించినదని  సేవ చేయి 
సుకృతి ఇదియును అదియును తెల్సి బతుకు 
ఎశృతి విన్నను మంచిని తెల్పి కదులు  ...... 



మనకు  నైతిక భౌతిక విలువ లుండు 
మనము అద్భుత ఆధ్యాత్మికములొ నుండు 
మనసు చట్రంలొ చిక్కితే  కష్ట ముండు 
మనమె  ఆచార సాంప్రదాయముతొ నుండు 

నీలొ  నమ్మక వ్యవస్థ  తిరుగు చుండు 
కాల నిర్ణయ మార్పులు చూస్తు ఉండు       
హోళి ఆడేటి  కాంక్షయు లేక యుండు 
జాలి చూపియు సంపద పంచి ఉండు 

4 Saatchi Art Artists to Know: Spotlight on Germany – Canvas: A Blog By Saatchi Art

ప్రాంజలి ప్రభ తేటగీతి పద్యాలు... చదువు 

చదువు లకుగణపతి శక్తి యుక్తి ముక్తి
కదలె మలుపులు తలుపులు మార్పు ఓర్పు
విధిని అనుకరించి మనసు పెర్గి కుసుమ
మధుర భావాలు ఓంకార శబ్ధ కరుణ  ......... 

చదువు చక్కగా మక్కువై నిశ్శబ్దంగ
మెదడు ఆలోచనమలుపు ఏక మయ్యె
మదిలొ కారుణ్య భావము పెరిగి మాట
మంచి తత్వము పెరిగేటి విద్య విలువ ........

తల్లి తండ్రుల స్వాసలు అర్ధ మవ్వ 
కల్ల లాడక నిత్యము సత్య విద్య
మెల్ల మెల్లగ అర్ధము చేసు కున్న
పిల్ల లందరు వచ్చును వృధ్ధియె లోకి .........

అయ్య సంపద ఆకలి తీర్చి పెట్టు
మాయ మర్మము తెల్వక గురువు బోధ
కాయ పోషణ ఆరోగ్య రక్ష చదువు
ఛాయ బేధము ఉండదు కులము మతము ....

చదువు మూలపు టమ్మవు సర్వ జగతి 
వినయ వేదపు బోధల ప్రగతి యుగము
ప్రతిభ వేగము పెంచును మాత తీర్పు
మనసు మేధస్సు పెంచేటి తల్లి మనసు  ......



ప్రాంజలి ప్రభ సందర్భ పరంగా పద్య పుష్పాలు తేటగీతి
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ

పరుగు మాధవ ప్రేమ నందు కొనుటకుయె
సిరులు కల్పించే గానమ్ము వేణు లీల
మరచి పోలేని కృష్ణుని ప్రేమ చరిత
తరుణి తమకము తికమక తరుణ తపతి   ..... 1

కాల మాయకు చిక్కిన ప్రేమ దక్కు
దక్షత దీపమే అందరి వెలుగు చూపు
కరుణయు దయయు భయమును మాపు శక్తి
సర్వ శక్తితొ నిత్యము శాంతి గొలుపు  ...............  2

శోక మోహము లేకయు ఎవడు ఉన్న
కర్మ చేయుచూ ఉన్నట్టి తరుణ వినయ
మాటల కరుణ శుభములు అశుభములను
తలచు  జీవిత ముక్తుడు అగుచు ఉండు   .......... 3

నేను తెల్ల కాగితముగా ఉన్న,  కలము
తోను మది ఊహ కందని ప్రేమ మనసు
అద్ది అడుగులు ఏడును,  గీత గీత
కలిపి ఒకటిగా చిత్రాన్ని గీసి చూపు  ................  4

నాన్న వేలును బట్టియు గమన మార్గ
మంత చూపియు ధైర్యాన్ని కల్గ చేయు
అమ్మ వేలును బట్టియు స్థన్యము అంది
పుచ్చి ఆకలి తీర్చి యు ప్రేమ పంచు ...... ,... 5

అంద మైన వర్ణ ఛత్రము బతుకులు
హృదయ మంత నిజము తెలుపు రంగు
తొడుగు మడుగు కడుగు వర్షపు బతుకులు
వీధి దీప వెలుగు ఇంటి యంత     .......   6

మధుర వినయ తలపు మాటలను పలికించు
నిత్య సత్య మధ్య బోధ వల్ల
వద్దు అన్న వెంట అయస్కాంత ఆకర్ష
జీవితాన్కి మలుపు తలపు దిక్కు  ........   7

కాల చక్రము నందు కదులుచు ఉండు
మాయ, యీ జన్మ పరమాత్మ లీల లేలు,
ధనము కూడు కరోనా లక్షణాల మాయ
ఏ నిముషమున ఏమియు తెల్ప లేవు  ...... 8

రైలు రాకతొ ప్రధాని పాద యాత్ర
వామ హస్తమ్ము ఛత్రమ్ము కలిగి ఉండి
దేశ సేవకు ప్రజల మధ్య  ఆయన
నీలి మేఘాల జల్లుల మధ్య నడిచె ........ 9

మంచి మనసుకు మంచి పని మంచి ఫలము
ఒక్క రొక్కరు ఏకమై జగతి బలము
ధర్మ రక్షణ ఓదార్పు ఓర్పు  సేవ
మనిషి రోగిగ మారక ఆదు కోండి   ....... 10

సకల శాస్త్రములు జదివి వ్రాసి ఇచ్చి
దెలప గలరు, చావు దెలప లేరు కనుక
చావు దెలపలేని చదువులు వద్దు అనకు
చదువు ఉద్యోగము గృహము తోన కూడు    ....11

*మధుర గానము మనసును చేర్చు వాణి
పలుకు పల్లవి మంగళ స్వర రాణి
సుస్వ రాలతో సంగీత హృదయ వేణి
ప్రజ్ఞ థీమణి వినయపు అమృత వాణి    .... 12
--(())--


----
"సకరుణవరసుశ్రీ నీలవర్ణప్రదేహ ,
సదమలహృదయానందప్రమోదప్రదాయిన్ !
సురవినుతవిభో !కళ్యాణ వైభోగ దేవ ,
తవశరణమహం కాంక్షే సుమాంగళ్య రూపిన్ !!!
----
सकरुण वर सुश्रीनीलवर्णप्रदेह ,

सदमल हृदयानंद प्रमोद प्रदायिन् !

सुर नुत विभो कल्याण वैभोग देव ,


तव शरणमहं कांक्षे सुमांगल्य रूपिन्!!!"

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ