నారద భక్తి సూత్రాలు 01 to 47







:

సశేషం.....




🌹 🌹 🌹 🌹 🌹




🌹 🌹 🌹 🌹 🌹



 🌹. నారద భక్తి సూత్రాలు - 6 🌹 

ప్రథమాధ్యాయం - సూత్రము - 4

🌻 4.  యల్లబ్ధ్వా పుమాన్‌ సిద్ధోభవతి, అమృతో భవతి, తృప్తో భవతి 🌻

            పరమప్రేమ స్వరూపం, అమృత స్వరూపం అయినట్టి ఈ భక్తిని సాధించిన పురుషుడు సిద్ధ పురుషుడగును, అమరుడగును, తృప్తుడగును.

            పురుషుడనగా దేహం అనే పురంలో నివసించే దేహి. దేహానికే స్త్రీ, పురుష లింగ భేదం గాని, దేహి ఎప్పుడూ పురుషుడే. అనగా ప్రకృతి కంటే విలక్షణుడు, ఆ ప్రకృతికి ఆధారం. భక్తుని యందున్న పురుషుడే ఆత్మ. భగవంతునియందున్న పురుషుడు కూడా అదే అఖండాత్మ. 

ఈ ఆత్మ దేహమందున్నప్పుడు ''నేను''గా తోస్తుంది. నేను అనే భక్తుడు పరవశించి, మైమరచి, భగవంతునితో కలసి ఏకాత్మగా ఉన్నప్పుడు ఆత్మాను భవం పొందుచున్నాడు.

            భక్తుడు భగవత్ప్రేమ అనే సాగరంలో మునిగి తేలుతూ తదేక భావంతో ఉండిపోతాడు. ఇక ఏ ఇతర భావాలూ అతనిలో కలుగవు. అందువలన ఆ భక్తుడు ఆత్మానందుడవుతాడు. జీవ భావాన్ని విడచిపెట్టి నిత్యతృప్తుడౌతాడు.

            సిద్ధుడు అంటే సాధన చేత క్రొత్తగా తృప్తి పొందినవాడు కాదు. సర్వకాల సర్వావస్థలందు అదే అమృత స్వరూపుడై, తృప్తుడై ఉన్నాడు. అజ్ఞాన వశం చేత దానిని మరిచాడు. అంతే ! 

జ్ఞానోదయం అయ్యే వరకు లేదని, ఇప్పుడయ్యాడని అనడం సబబు కాదు. జరిగిందేమిటంటే భక్తివలన, భగవంతుని సాహచర్యంలో మునిగి, తన అజ్ఞానావృత శరీర భావాన్ని విడచిపెట్టాడు. అందువలన తనదే అయినట్టి నిత్యానందాన్ని తిరిగి చవిచూశాడు. 

మొదట ఉన్నది మరపులో తెలియలేదు గాని, నిజానికి అప్పుడూ ఉన్నది. భక్తి పారవశ్యంలో మరపును వదలడం ద్వారా పొందినట్లు చెప్పినప్పటికీ, తనదే తనకు గుర్తు వచ్చి తన నిత్యానందాను భవంతో తృప్తుడైనాడు. దీనినే సిద్ధత్వం అంటారు.
సశేషం...

నారద భక్తి సూత్రాలు - 7 , ప్రథమాధ్యాయం - సూత్రము - 4

🌻 4.  యల్లబ్ధ్వా పుమాన్‌ సిద్ధోభవతి, అమృతో భవతి, తృప్తో భవతి  - 2 🌻

ఇది అష్టసిద్ధులు కలిగినటువంటి సిద్ధత్వం కాదు. భగవంతునిలో చేరి, భగవంతుడే అయినట్టి పునరనుభూతియే సిద్ధత్వం. ''అమృతస్య పుత్రా'' అంటుంది వేదం. 

మనం దేవుని ప్రతిరూపంగా సృష్టించబడ్డాం. అందువలన ఆయన లక్షణాలే మనలో కూడా ఉన్నాయి. అవేమంటే పరిపూర్ణత, శాశ్వతత్వం. ఇవి నిత్యానందాన్ని కలుగజేస్తాయి. 

అజ్ఞానమనే ముసుగులో ఉన్నప్పటికీ మనం మన సహజ లక్షణాన్ని మాత్రం విడువలేదు. అందుకే మనం ఆయన కొరకు అన్వేషించి ఆయనతో ఒక్కటయ్యేందుకు తపన పడుతున్నాం. 

ఆవరణ వలన ఆనంద స్వరూపుడైన ఆయన కోసం చేసే అన్వేషణ ప్రియం, మోదం, ప్రమోదమనే పద్ధతిలో బాహ్య ప్రపంచంలో జరుగుతున్నది. ఎప్పుడో ఒకరోజు తన నిత్యానందాన్ని తనలోనే కనుగొంటాడు. అందువలన మనకు తెలియకుండానే భగవదైక్యం ద్వారా సహజానందం సిద్ధింప చేసుకోవడానికి పురోగమిస్తూనే ఉన్నాం.  కనుక దివ్య జ్ఞాన సముపార్జన మానవుని జన్మహక్కు. ప్రేమ ద్వారా భగవంతుని చేరి ఆయనతో ఐక్యం కావడం మన జీవిత ధ్యేయంగా ఉంది. ఆ విషయం తెలిసి, భక్తిని ఆచరిస్తే సఫలీకృతమవుతాం.

            ఆత్మకు, శరీరేంద్రియాలకు అనుసంధానమై ఉన్న పురుషుడే ''నేను'' అనే జీవుడు. ఈ ''నేను'' శరీర తాదాత్మ్యతను విడచుటకు, ఆత్మతో అనుసంధానం చేసుకొనుటకు సాధన చేయాలి.  దీనికోసం తాను శరీరం కాదనే విషయాన్ని విచారణ చేయడం ద్వారా నిర్ణయించుకొని ప్రాపంచిక విషయాలందు వైరాగ్యం చెందాలి. తాను ఆత్మ అనే నిజాన్ని ఋజువు చేసుకొని భక్తి ద్వారా భగవంతుని అనుగ్రహం పొందాలి. తుదకు ఆయనతో కలసిపోవడమే అనుష్ఠానం.  దీని కొరకు భక్తిని సాధనగాను అనుష్ఠానంగాను, తీసుకొని ముఖ్యభక్తిగా మార్పు చెందించు కోవాలి. అప్పటి వరకు చేసే భక్తి క్రియలన్నీ బాహ్య భక్తి క్రిందకు వస్తాయి. ఈ భక్తి అనన్య భక్తిగా, ఏకాంత భక్తిగా పరిణమించవలసి ఉన్నది.  ఇంతవరకు చేసే సాధనను అపరభక్తి అంటారు. సాధన ఫలితంగా ముఖ్యభక్తి కలుగుతుంది. దృఢమైన ముఖ్యభక్తినే పరాభక్తి అంటారు. పర్యవసానమైన సిద్ధ వస్తువే పరాభక్తి అవుతుంది.

శ్లో||  యం లభ్ద్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః ||
-భగవద్గీత
తా||  దేనిని పొందితే మరి ఏ ఇతర లాభాన్ని అధికంగా పరిగణించరో దానిని పొందాలి. అదే పరాభక్తి. దీనినే ముక్తి అంటారు.
సశేషం.....

ప్రథమాధ్యాయం - సూత్రము - 5

 5. యత్ప్రాప్య నకించి ద్వాంఛతి నశోచతి నద్వేష్టి న రమతే నో త్సాహీ భవతి 

            ఆ పరాభక్తి ప్రాప్తించినప్పుడు ఇక ఏ వస్తువుమీద గాని, విషయాలపై గాని వ్యామోహం ఉండదు. అందువలన అతడు శోకించడు. ఎవరినీ ద్వేషించడు. విషయాసక్తిలేని వాడవుతాడు. దేనిపైనా ఉత్సాహం చూపడు. 

ఇతడి వైరాగ్యం నిగ్రహించినందువల్ల కలిగింది కాదు. తనలో తానే అయివున్న భగవంతునితో మమేకమై తన యందు తాను తనతోనే క్రీడిస్తున్నందువలన బయటి ప్రపంచమేదీ తనకు పట్టదు. అదే నిజ వైరాగ్యం. అందువలన అది అపరవైరాగ్యం కాదు. ఇది స్వతస్సిద్ధమైన పరావైరాగ్యమే అవుతుంది. ఎందుకంటె అతడు ప్రపంచాభిముఖం నుండి విరమించినవాడై భగవదున్ముఖుడై ఉన్నాడు. అందువలన అతడికి సంసారం లేదు, దుఃఖం లేదు.  అతనిలో రాగద్వేషాలు జనించవు. ఆ శ్రీహరియందు తన బుద్ధిని నిలిపి, నిశ్చయమై తిరిగి విషయాభిముఖమవటానికి ఇష్టపడడు.

            తులసీదాసు రామాయణంలో ఇలా ఉంది. ''నేను సద్గతి కోరను. జ్ఞానాన్ని కోరను. సంపదలను కోరను. అష్ట సిద్ధులను కోరను. పొగడ్తలు వద్దు. కాని శ్రీరాముని చరణారవిందాలపై మాత్రం అచంచల అప్రయత్న భక్తి భావం కుదిరితే చాలును''. పరమప్రేమ అంటే ఇదే.

            ప్రేమ అనేది ఏదీ కోరదు. ప్రేమ కోసం అన్నీ త్యాగం చేస్తుంది. కనుక ప్రేమికుడైన భక్తుడు ప్రియతముడైన భగవంతుడిని ఏమీ కోరడు. భక్త కన్నప్ప శివుని ఆ మాదిరిగానే ప్రేమించాడు. తానేమీ కోరలేదు. పైగా శివుని కళ్ళు నీరు కారుతుండే తన రెండు కళ్ళూ తీసి శివుడికి అమర్చాడు.  కోరవలసి వస్తే భక్తుడు తనలో భగవంతునిపై తరగని భక్తి కొనసాగేటట్లు అనుగ్రహించమని కోరతాడు. బాధలను తొలగించమని కూడా కోరడు. ''భగవంతుని కృప తనపై ఉంటే చాలును'' అని కోరుతాడు. కోరికలతో చేసే భక్తి నిజభక్తి కాదు. నిజభక్తుడు భగవంతుని కోసం సర్వమూ త్యాగం చేసి తాను కూడా సర్వసమర్పణమవుతాడు. అప్పుడు అదే పరాభక్తి అనబడుతుంది.

సశేషం....


🌹. నారద భక్తి సూత్రాలు - 9 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 5

5.యత్ప్రాప్య నకించి ద్వాంఛతి నశోచతి నద్వేష్టి న రమతే నోత్సాహీ భవతి  - 2 

  ప్రేమ ప్రియతముని నర్థించబోదు, ప్రియతముని సన్నిధి భక్తితో వేడుకొనును
                                                                   -మెహెర్‌ బాబా

            కనుక ఆ శ్రీహరి రూపంతో తాదాత్మ్యతే యోగం. తన్మయమే జ్ఞానం. ఈ భక్తుడికి వేరే యోగాభ్యాసం అవసరం లేదు. జ్ఞాన సముపార్జన కూడా అక్కరలేదు. గోపికల భక్తి అటువంటిది. వారు ఉద్ధవుడితో ఇలా అన్నారు.

            ''ఉద్ధవా ! మాకున్నది ఒక్క మనస్సే ! ఆ ఒక్కటీ మా శ్యామ సుందరునితో పాటే ఉంటున్నది. ఇక నీవు చెప్పే ఆరాధన చేయాలంటే మా వద్ద మా మనసులు లేవు కదా !''. ''మా తనువులు, మనసులు, ధనం అన్నీ ఆ ఒక్కడైన శ్యామ సుందరుడే ! సర్వకాల సర్వావస్థలు ఆ శ్యామ సుందరుడే ! మా హృదయమూ, జీవనమెల్లా ఆ శ్యామ సుందరుడే! మాకు యోగమెలా కుదురుతుంది ? రోమ రోమమూ శ్యామ సుందర మయమై ఉంటే !''

తనుమనోధనములుసమస్తముగురునకర్పణ మొనర్ప, అదియె సర్వార్పణమ్ము సుమ్ము            - మెహెర్‌ బాబా

            భక్తి పరాభక్తి అయితే, ఏ యోగం, జ్ఞానం అవసరం లేదని గోపికా భక్తి తెలుపుతున్నది. ఈ దృష్టి కలవారు సర్వ సత్త్వ సుఖ హితైక వర్తులవుతారు. 
ఇది వారికి ఉపాథి ఉన్నంత కాలం స్వధర్మమవుతుంది. ఇది నైజమేగాని బలవంతపు మాఘస్నానం వంటి తాత్కాలిక దీక్షలు కాదు.  అలాంటి వారే ధీరులు. వారే జ్ఞానులు, పరాభక్తులు. వారు దేనినీ కోరరు. అలాగే ఉన్నవాటిని వదిలించుకోవాలని అనుకోరు. వారి ఆచరణ లోకోత్తరం. అది లోక కళ్యాణ కారకం. అది భగవత్సేవా పరాయణం.
సశేషం.....

🌹. నారద భక్తి సూత్రాలు - 10 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 6

🌻 6. యత్‌ జ్ఞాత్వా మత్తో భవతి, స్తబ్ధో భవతి, ఆత్మారామోభవతి - 1 🌻

            ఆ ప్రేమ స్వరూపం ఏ భక్తుడిని వరించిందో అతడు మత్తుడవు తాడు. స్తబ్ధుడవుతాడు. తనయందు తాను రమిస్తూ ఉంటాడు. అనగా ఆత్మారాముడవుతాడు.

      శ్లో||  అహమేవ పరం బ్రహ్మా బ్రహ్మాహాం పరమం మతమ్‌
            ఏవం సమీక్ష న్నాత్మాన మాత్మన్యాధాయ నిష్కలే
            దశంతం తక్షకం పాదేలేలిహానం విషాననైః
            నద్రక్ష్యసి శరీరంచ విశ్వంచ పృథగాత్మనః ||

తా||  నేను పరబ్రహ్మమే. బ్రహ్మమే నేననుట నామతం. సర్వమూ ఆత్మయే అని ఉండటం మాత్రమే సత్యం. కావున తక్షకుడూ లేడు, కరవడమూ లేదు, మరణమూ లేదు అని భాగవతం బోధించిన శుక మహర్షి తెలియ చేస్తున్నాడు. ఈ బోధ విన్న పరీక్షిత్‌ మహారాజు ఇలా అన్నాడు.

            భగవంస్తక్షకాదిభ్యో మృత్యుభ్యో నచిభేమ్యహం |
            ప్రవిష్ఠో బ్రహ్మనిర్వాణమ్‌ అభయం దర్శితంత్వయా ||

            అనగా స్వామీ ! నేను మృత్యువంటే భయపడను. మీ బోధచేత బ్రహ్మ నిర్వాణ స్థితిని పొంది, మరణ భయాన్ని పోగొట్టే అభయ స్థితిని పొందాను.             భక్తి రసాన్ని గ్రోలిన భక్తుడు మకరందం గ్రోలిన తుమ్మెదవలె మత్తుడై మైమరచి విహరిస్తూ ఉంటాడు. భక్తి రసపానం చేసి మత్తుడైనవాడు ఇతరమైనటు వంటి దేనినీ కూడా భావించక, వాటి యెడల స్తబ్ధుడై ఉంటాడు. 

ఒక్కోసారి బాహ్యానికి సరిపడని ప్రవర్తనతో బాలునివలె, పిచ్చి వానివలె, పిశాచివలె కన్పిస్తాడు. ఒకసారి నవ్వుతాడు. మరోసారి ఏడుస్తాడు. ఇంకోసారి నృత్యం చేస్తాడు. అతడి ఆంతరంగిక వివశత్వ అనుభవం తెలియక, బయటి ప్రవర్తన మాత్రం చూస్తే, అతడి చేష్టలు మనకు అర్థం కావు.

            అతని నవ్వుకు కారణం తన భక్తికి భగవంతుడు తలవంచి, ఓడిపోయాడని. అలాగే భగవద్దర్శనం ఆలస్యమైనందుకు ఏడుస్తాడు. తన మొరనాలకించలేదని కుపితుడౌతాడు. దర్శనం కాగానే గంతులు వేసి, ఆనందంతో నృత్యం చేస్తాడు. 

భక్తి పారవశ్యంతో పాడుతాడు. ఈ చర్యలకు కారణం మనకు కనిపించదు. అందువలన మనకు అర్థం కాదు. ఆ బాహ్య చర్యలు ఆ భక్తుడికి కూడా తెలియవు. 
తన లోపలి అనుభవాన్ని బట్టి అసంకల్పితంగా బాహ్య చర్యలుంటాయి. అయితే అతడి ఆత్మారామత్వం అతడికి మాత్రమే అనుభవైక వేద్యం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. నారద భక్తి సూత్రాలు - 11 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 6

🌻 6. యత్‌ జ్ఞాత్వా మత్తో భవతి, స్తబ్ధో భవతి, ఆత్మారామోభవతి - 2 🌻

పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు ఇట్టి పరిస్థితిలో ఎలాగుండెనో చూడండి.

   సీ.       వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై యొక్కడు నేడుచు, నొక్కచోట
            నశ్రాంత హరి భావనారూఢ చిత్తుడై యుద్ధతుడై పాడు, నొక్కచోట
            విష్ణుడింతియ కాని వేరొండు లేదని యొత్తిలినగుచుండు, నొక్కచోట
            నలినాక్షుడను నిధానము గంటి నేనని యుబ్బి గంతులువైచు, నొక్కచోట

   ఆ.       బలుకు, నొక్కచోట బరమేశు గేశవు
            బ్రణయ హర్షజనిత బాష్ప సలిల
            మిళితపులకుడై నిమీలిత నేత్రుడై
            యొక్కచోట నిలిచి యూరకుండు

తా||  ఆ ప్రహ్లాదాళ్వారు విష్ణుమూర్తి చింతనలో మునిగి చేష్టలుడిగిన వాడు. ఒక్కచోట ఒక్కడూ కూర్చుండి ఏడ్చేవాడు. నిర్విరామ శ్రీహరి చింతన చేయుచూ భగవదావేశపరుడై గొంతెత్తి గానం చేసేవాడు. వేరొక చోట అంతా విష్ణుమయమే గాని, ఇతరమేమీ లేదని నిర్ణయంచేసి నవ్వేవాడు. ఇంకొకచోట పద్మాక్షుడనే పెన్నిధిని కనుగొంటినని పొంగి గంతులు వేసేవాడు. 

మరొకచోట పరమేశ్వరుడైన కేశవునితో స్వగతంగా మాట్లాడు చుండేవాడు. మరొకచోట ఆ భక్తి చిత్తుడు ప్రేమ పూరిత భక్తి పారవశ్యంలో మైమరచి ఆనంద బాష్పాలు రాల్చేవాడు. పులకించిపోతూ నిమీలిత నేత్రుడై నిల్చొని ఉండేవాడు.        
           
 రాక్షసరాజు కుమారుడైనప్పటికీ, రాక్షస బాలుర సాంగత్య మున్నప్పటికీ, రాక్షస గురుని వద్ద విద్యనభ్యసించినప్పటికీ ఆ ప్రహ్లాదుడు మాత్రం ఈ విధమైన హరి భక్తుడగుట ఆతని పూర్వజన్మ సుకృతమై ఉండును.

            బ్రహ్మభూతః ప్రసన్నాత్మా నశోచతి నకాంక్షతి |
            సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్‌ ||
                                                                            - భగవద్గీత

తా||  సచ్చిదానంద పరబ్రహ్మయందు ఏకీభావ స్థితుడై, ప్రసన్న మనస్కుడైన యోగి దేనికినీ శోకించడు. దేనినీ ఆశించడు. సమస్త ప్రాణులందు సమభావంగల అట్టి యోగి ఆ పరాభక్తిని పొందుతాడు.



🌹. నారద భక్తి సూత్రాలు - 12 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 6

🌻 6. యత్‌ జ్ఞాత్వా మత్తో భవతి, స్తబ్ధో భవతి, ఆత్మారామోభవతి - 3 🌻

ముందు సూత్రంలో ‘‘ప్రాప్య’’ అన్నప్పుడు ప్రాపక ప్రాప్య భావాన్ని, ఈ సూత్రంలో ‘‘జ్ఞాత్వా’’ అన్నప్పుడు జ్ఞానజ్ఞేయ భావాన్ని సూచిస్తూ ముందు సూత్రంలో వృత్తి వ్యాపారాన్ని, ఈ సూత్రంలో వృత్తి స్థంభనను సూచిస్తున్నదని గ్రహించాలి. ఇలా ఏకాంత భక్తిలో భక్తి జ్ఞానాదులకు భేదం లేదు.

            1) భక్తితో మనసు ద్రవీభూతమై ప్రేమాకారాన్ని దాలుస్తుంది. బ్రహ్మ విద్యలో మనసు ద్రవీభూతం కాదు. అది ఏకాగ్ర వృత్తిలో అవ్యక్తంలో నెలకొంటుంది.

            2)  భక్తిలో మనసు సవికల్పమై ఉంటుంది. బ్రహ్మ విద్యలో అది నిర్వికల్పం.

            3)  భక్తికి భగవల్లీలా విశేష జ్ఞానం సాధనమవుతుంది. బ్రహ్మ విద్యయందు తత్త్వమసి వంటి ఉపనిషద్వాక్య జ్ఞానం సాధనమవుతుంది.

            4) భక్తికి భగవత్ప్రీతి ఫలమవుతుంది. బ్రహ్మ విద్యకు అజ్ఞాన నాశనం ఫలమవుతుంది.

            5) భక్తిలో ప్రాణికోటి యావత్తుకు అధికారం ఉంది. బ్రహ్మ విద్యకు సాధన చతుష్టయ సంపత్తి కలవాడే అధికారి.

            భక్తిలో గాని, బ్రహ్మ విద్యలో గాని పై విధమైన భేదమంతా సాధన క్రమ సంబంధమేగాని, అనుభూతి సంబంధం కాదు. అందువలన సాధకులు వారికి ప్రీతికరమైన ఏదో ఒక మార్గంలో సాధన చేసి పరమావధి పొంద వచ్చును. 

ఈ రెండు మార్గాలలో హెచ్చు తగ్గులు లేవు. కావలసింది మాత్రం శ్రద్ధతో కూడిన సాధన, మోక్షగమ్యంపై లక్షించడం. భక్తి ద్వారా భగవంతునికి సమర్పణ అవుతూ అహంకార మమకారాల అడ్డు తొలగించుకోవడం జరుగుతుంది. 

బ్రహ్మ విద్య సాధనతో కూడా అనాత్మ భావన పోతే శేషించేది ఆత్మ తత్త్వమే. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసినదేమంటే భక్తి సూత్రాలను అర్థం చేసుకొని ఆచరిస్తే ఈ భక్తి మార్గం ఇతరమైన వాటికంటే తక్కువేమీ కాదు.

            ‘‘మత్తః’’ అంటూ ఈశ్వరేచ్ఛయందు ఉన్మత్తమగుట. ‘‘స్తబ్ధః’’ అంటే నైష్కర్మ్యమని అర్థం. ‘‘ఆత్మారామః’’ అంటే భక్తుడు భగవంతునియందు తదేక పరాయణత్వమని అర్థం. అనగా ధర్మ విరుద్ధం కాని వ్యాపారంతో ఈశ్వరేచ్ఛ ననుసరించి ఉంటాడని నిర్ణయం.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. నారద భక్తి సూత్రాలు - 13 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 7

🌻 7. సా నకామయమానా, నిరోధ రూపత్వాత్‌  - 1 🌻

            పరమప్రేమ రూపమైన భక్తి ప్రాపంచిక వస్తువులపట్ల గల ప్రీతి రూపమైన కామం కాదు, దానికి వ్యతిరేకమైనది. అది అలౌకికమైనట్టి భగవంతునిపై ఉండే ప్రేమ.

   భక్తికి, కామానికి గల భేదం చెప్తున్నారు. కామం అనేది ఇంద్రియాలకు, మనసుకు చెందినది. నిమిత్త కారణంపై కామంజనిస్తుంది. భగవత్ప్రేమ అలా కాదు. అది మనస్సుకు సంబంధించినది కాదు. హృదయానికి సంబంధించినది. అది సహజంగా ఉప్పొంగేది.  మనోతీత మైనది. 

ప్రహ్లాదుడికి, ధృవుడికి వారి శైశవంలోనే భగవత్ప్రేమ పుట్టింది. కన్నప్ప, వివేకానంద, దయానంద మొదలగు వారిలో, వారి యవ్వనంలో భగవంతునిమీద ప్రీతి కలిగింది.

            కామం జనించడానికి పూర్వ విషయ వాసనలు కారణం. కాని భక్తి అనేది గత జన్మల శుభవాసనల వలన కలుగుతుంది. 

కొందరిలో అశుభ వాసనలు ఎక్కువ ఉన్నప్పటికీ అంతో ఇంతో శుభ వాసనలు కూడా ఉంటాయి. ఈ శుభవాసనల వలన ఎప్పటికైనా బ్రహ్మానందానుభవం కలగడానికి అంకురం ఉంటుంది. 

అది వెంటనే అంకురించవచ్చును లేక కొంత జాప్యం జరుగవచ్చు. కొన్ని కారణాల వలన మందంగా గాని, మధ్యమంగా గాని, తీవ్రంగా గాని ఉంటుంది.

ఈ శుభవాసన ఎందుకుంటుందంటే, పరమాత్మ నుండి వేరైన ఆత్మ కూడా తత్త్వంగా చూస్తే పరమాత్మయే. అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్లు, పరమాత్మ ఆత్మల మధ్య సహజమైన ఆకర్షణ ఉంటుంది. 

ఇట్టి ఆకర్షణనే భగవదనుగ్రహంగా చెప్పవచ్చు. అశుభ వాసనల కారణంగా ఆత్మ అజ్ఞానావరణలో కప్పబడి ఉన్నందున, పరమాత్మతో అనుసంధానం కాలేకపోతున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. నారద భక్తి సూత్రాలు - 14 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 7

🌻 7. సా నకామయమానా, నిరోధ రూపత్వాత్‌  - 2 🌻

ఎప్పుడైతే శుభవాసన వృత్తిగా మారుతుందో, అప్పుడు ఆత్మకున్న ఆవరణ కొద్దికొద్దిగా తొలగడం ప్రారంభమై పరమాత్మతో ఒక్కటయ్యేదాకా భక్తిని పెంపొందించు కుంటుంది. అన్ని విధాలైన అడ్డంకులను తొలగించుకుంటూ పోతుంది.

            మొదట అది కారణంతో కూడిన భక్తిగా ఉదయించి, గౌణభక్తి అని పిలువబడుతుంది. క్రమంగా భగవదైక్యం జరిగే సరికి అది ముఖ్య భక్తిగా పరిణ మిస్తుంది. 

ఐక్యతాసిద్ధితో పరాభక్తి అని పిలువబడుతుంది. ఇక్కడ ఆత్మ అంటే వ్యవహారంలో ''నేను''గా తోచిన పురుషుడు. ఆ నేనే సాధకుడు, లేక భక్తుడు.   

            ఆధ్యాత్మయోగేన వివిక్త సేవయా ప్రాణేంద్రియాత్మాభిజయేన సధ్య్రక్‌
            సచ్ఛ్రద్ధయా బ్రహ్మచర్యేణ శశ్వ దసంప్రమాదేన యమేన వాచాం
            కర్మాశయం హృదయగ్రంథి బంధ మవిద్యయాసాదితమప్రమత్తః
            అనేన యోగేన యథోపదేశమ్‌ సమ్యగ్వ్య పోహ్యోపరమేతం యోగాత్‌
-ఋషభుని ఉపదేశం

తా|| వివిక్త సేవ, ఆధ్యాత్మ యోగం, ఇంద్రియ ప్రాణ, మనో నిగ్రహం, శ్రద్ధ, బ్రహ్మచర్యం, యమం, నియమం, వీటిచే అవిద్యా గ్రంథి విడిపోగా, సమాధి స్థితిలో లింగదేహ భంగమును ఏ భక్తుడు సాధించి నిష్క్రమిస్తాడో వాడే సాయుజ్యం చెందినవాడు. వాడే పరాభక్తుడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

నారద భక్తి సూత్రాలు - 15 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 8

🌻 8. నిరోధస్తు లోకవేద వ్యాపార న్యాసః 🌻

            పరాభక్తి వలన లౌకిక వ్యాపారాలను, వేద విహిత వ్యాపారాలను కూడా నిరోధించడం జరుగుతుంది. అనగా సకల వ్యాపారాలను సన్యసించడం జరుగుతుంది.

            నిరోధించడమంటే అణచిపెట్టడం కాదు. భగవంతునికి సర్వ సమర్పణ కావడం కారణంగా వాటికవే భక్తుని నుండి దూరమవడం. అన్ని వ్యాపారాలకు భగవంతుడినే సూత్రధారిగా భావించి, భక్తుడు తన కర్తృభావాన్నుండి విడుదలవడం. పరాభక్తుడైనవాడు ప్రపంచంలో ఇంద్రియ సంబంధ వ్యాపారాలను పూర్తిగా విసర్జించినవాడవుతాడు. కాని వదలడమనేది ఇంతకు ముందే సాధనలో జరిగిపోయింది.

            భగవంతుని యెడల సమర్పణ, సమాకర్షణ అనేవి ఆత్మ- పరమాత్మల మధ్య సహజం. వీటి మధ్యనున్న అడ్డంకులను తొలగించడమే నిజమైన సాధన. అది ఇంతకుముందే జరిగింది కనుక, అతడు పరాభక్తుడని పిలువబడుతున్నాడు. పరాభక్తుడికి జగద్వ్యాపారం తోచనే తోచదు. అతడికి సంసారబంధం లేదు.

            కలలంబోలెడి పుత్ర మిత్ర వనితా రాగాది సంయోగముల్‌
            జలవాంఛారతి నెండమావులకు కాంక్షల్‌ సేయు చందంబునన్‌
            తలతున్‌ సత్యములంచు మూఢుడ వృథా తత్త్వజ్ఞుడన్‌ నాకు నీ
            విలసత్పాదయుగంబు జూపి కరుణన్‌ వీక్షింపు లక్ష్మీపతీ ||
                                                                                       - భాగవతం

తా||  కలలో తోచిన సంసారంలో భార్య, బిడ్డలు, మిత్రులు, బంధువులు, వీరందరితో జీవిస్తూ పర్యవసానంగా సుఖ దుఃఖాలను పొందుచున్న మానవుడు ఎలాగున్నాడంటే, ఎండమావులలో కనిపించే నీళ్ళతో దాహం తీర్చుకోవాలనే బలమైన కోర్కె కలిగి ఉన్నట్లుంది. ఇది మూఢత్వం కదా ! 

ఈ సంసారం సత్యమని తలచుట వృథా ప్రయాస కదా ! సత్స్వరూపుడైన లక్ష్మీపతి యొక్క పాదపద్మములను చూపించమని, అట్టి దర్శనంతో పైన తెలిపిన సంసారంనుండి బంధవిముక్తు డగునని, అందుకొరకు అక్రూరుడు ప్రార్థిస్తున్నాడు.

మోక్షం కోసం అపరభక్తిలో చేసే సాధనకూడా ఆగిపోయి ఫలితం స్థిరమవుతుంది. ‘‘సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య’’ అని గీతలో చెప్పినట్లు భగవంతుని ఆలంబన చేసుకొని తను మన ధనాలను ఆయనకే సమర్పణ చేయడం అనేది ఆ పరాభక్తుడిలో సిద్ధమయ్యే ఉంది.

            అయితే ఆ పరాభక్తుడి వలన వ్యాపారం జరుగుతున్నట్లుంది గాని అతడు దానికి కర్తగాదు. అది కైంకర్య పద్ధతిగా జరుగుతుంది. 

అందువలన అతడికి పాప పుణ్య ఫలాలుండవు. అతడి వలన జరుగుతున్నట్లుగా కనబడే జగద్వ్యాపారం యజ్ఞంగా సాగుతుంది. అది లోకకళ్యాణ కారకం. ఆ పరాభక్తుడికి బంధమేర్పడదు. అతడు ముక్తుడే.

            యజ్ఞార్థా త్కర్మణో-న్య త్ర లోకో-యం కర్మబంధనః|
            తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచరః ||
-       (3:9) భగవద్గీత
        
            చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః
            బుద్ధి యోగ ముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవః |
-       (18:57) భగవద్గీత

            ఈ సూత్రంలో న్యాస శబ్దాన్ని పై శ్లోకార్థాలతో అన్వయించి చూస్తే సమర్పణను, కర్తరి త్యాగాన్ని తెలియచేస్తున్నది. న్యాసమనేది సహజం. 

ఈ న్యాసంలో ఎవడు నిష్ణాతుడో అతడి జీవితమంతా యజ్ఞమే. అనగా కైంకర్యమే. అతడే పూర్ణుడు, సిద్ధుడు. అతడినే పరాభక్తుడంటున్నారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌻 9. తస్మిన్న నన్యతా తద్విరోధి షూదాసీనతా చ  - 1 🌻

            పరాభక్తిలో సకల వ్యాపారాలు భగవత్కైంకర్యం జరుగగా, భక్తికి భిన్నంగా జరిగే పనులను ఉపేక్షా భావంతో చూస్తాడు. భగవదిచ్ఛే భక్తుడి ఇచ్ఛ అవుతుంది. భక్తుడి వ్యక్తిగత మనసు పనిచేయదు. 

అది దైవీ ప్రేరణతో నడుస్తుంది. పై సూత్రం లోని న్యాసానికున్న రెండు లక్షణాలను ఈ సూత్రంలో అనన్యత, ఉదాసీనతలను ప్రస్తావిస్తూ ఈశ్వరాయత్త చిత్తాన్ని కలిగియుండి వ్యవహరిస్తాడని పరాభక్తుడి గురించి చెప్తున్నారు. అనగా అతడి భావాలు భగవత్ప్రీతితో ఉంటాయి. ప్రపంచంతో బంధం ఉండక ఉదాసీనతతో ఉంటాడు.

            ఒకసారి భక్తుడిలో భగవంతుడు ప్రవేశించగానే, అతడి బుద్ధి భగవంతుడితో అనుసంధానం చెంది ఉంటుంది. అప్పుడు ఆ భగవంతుని కల్యాణ గుణాలే భక్తునిలో నిరంతరం చింతనారూపంలో ఉంటాయి. చిత్తం భగవద్దత్తం కాగానే అతడి ఇంద్రియాలకు కూడా ఆ భక్తి సోకుతుంది.

            జననము లేక కర్మముల జాడల బోక సమస్త చిత్త వ
            ర్తనుడగు చక్రికిం గవులుదార పదంబుల జన్మకర్మము
            ల్వి నుతులు సేయుచుండెదరు వేదరహస్యములందు నెందు జూ
            చిన మరిలేవు జీవునకు జెప్పిన కైవడి జన్మకర్మముల్‌
                                                                                   -భాగవతం

            వ్యాస భగవానుడు చెప్పుచున్నాడు. జన్మ కర్మలనేవి భగవంతుడికి లేవు. 

భగవంతుడంటే అజుడు, అవ్యయుడు, అంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వాత్మకుడు అని తెలియచేస్తున్నాడు. పరాభక్తుడన్నా, భగవంతుడన్నా ఒక్కటే. కనుక పరాభక్తుడికి జన్మ కర్మలు లేవు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹. నారద భక్తి సూత్రాలు - 17 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 9

🌻 9. తస్మిన్న నన్యతా తద్విరోధి షూదాసీనతా చ  - 2 🌻

రుక్మిణీ దేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రేమించడం వలన ఆమె ఇంద్రియాలకు కూడా ఆ భక్తి ఎలా సోకిందో చెప్తున్నది.

   సీ.       ఏ నీగుణములు కర్ణేంద్రియంబులు సోక దేహ తాపంబులు దీరిపోవు
            నేనీ శుభాకార మీక్షింప గన్నుల కఖిలార్థ  లాభంబు కలుగుచుండు
            నేనీ చరణసేవ లేప్రొద్దు జేసిన
                                    భువనోన్నతత్వంబు బొందగలుగు
            నేనీ లసన్నామ మేప్రొద్దు భక్తితోడ
         విన బంధ సంతతులు వాయు

   తే.       నట్టి నీయందు నా చిత్త మనవరతము
            నచ్చి యున్నది నీ యాన నానలేదు.
            కరుణ జూడుము కంసారి ఖలవిదారి
            శ్రీయుతా కార మాననీ చిత్తచోర !

తా||  రుక్మిణీదేవి అంటున్నది. ఓ కంసారీ ! ఎట్టి నీ గుణాలు చెవులకు సోకగానే శరీర తాపాలన్నీ తీరిపోతాయో, ఏ మంగళకరమైన నీ శుభాకారం చూడగానే కన్నులకు సకల ఫలాలు సిద్ధిస్తాయో, ఏ నీ చరణ సేవ చేసి నంతనే ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయో, ఏ నీ దివ్య మంగళ నామాన్ని భక్తితో స్మరించినంతటనే సకల బంధాలు వీడిపోవునో, అట్టి నీయందు నా చిత్తమెల్లప్పుడు నిలిచి ఉన్నది. ఈ నా స్థితిని నీ సాక్షిగా చెప్తున్నాను. నిజం సుమా ! స్త్రీ వంటి నా చపల చిత్తంలో భక్తి కలుగగానే నీవు నా పూర్వ చిత్తాన్ని దొంగిలించావు. ఓ శ్రీయుతాకారా! నాపై కరుణ చూపవా!

   ఇది రుక్మిణీదేవి పరమాత్మను ప్రార్థించిన విధం. ఇందులో భక్తి అనేది ఆమె జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు కూడా సోకి ఫలిత మిచ్చినట్లు లేదా ? తన్మయత్వంలో తననే మరువలేదా ?

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

 🌹. నారద భక్తి సూత్రాలు - 18 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 10

🌻 10. అన్యాశ్రయాణాం త్యాగో-నన్యతా 🌻

            పరాభక్తుడికి అహంకారం ఉండదు. భగవత్ప్రేరణను బట్టి భక్తుడు ఆ భగవంతుని పరికరంగా పనిచేసే అహంకారం మాత్రం ఉంటుంది. పరాభక్తిలో స్థిరం కాకమునుపు భక్తుడి మనసు చిత్తవృత్తుల ప్రకారం నడిచేది.

 ఆ చిత్త వృత్తులను ఉదాసీనంగా చూడటం అలవాటైన పిదప ఇక వ్యాపారం అంటూ ఉండదు. అతడికి తెలియకుండానే వ్యాపారం జరిగిపోతూ ఉంటుంది. 

అందువలన ఆ పరాభక్తుడు కర్తగా ఉండడు, భోక్తగా ఉండడు. అతడికి ఇష్టాయిష్టాలు ఉండవు. సకల వ్యాపారాలకు భగవంతుడే అధిష్ఠానంగా ఉంటాడు. 

ఇతరమైన అధిష్ఠానం గాని, ఉద్దీపనం గాని లేకుండుటను అనన్యత అని నిర్ణయిస్తారు. అందువలన పరాభక్తుడు అన్యాశ్రయాన్ని త్యాగం చేసి ఉంటాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

 🌹. నారద భక్తి సూత్రాలు - 19 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 11

🌻 11.  లోక వేదేషు తదనుకూలాచరణం తద్విరోధి షూదాసీనతా 🌻

            భక్తుడి లోకం భగవంతుడే. భగవత్ప్రీతి అతడికి సహజం. దీనికి ఆటంకం కలిగించే ఏ పని చేయడు. 

కాని ఏ పనీ చేయకుండా ఉండే పరిస్థితి కుదరదు. అందువలన వేరేదారి లేక తనకు లభించిన ఏకాగ్ర భక్తినే మరింత బలపరచు కుంటూ ఉంటాడు. 

అతడేమి చేసినా తనలో ఉండే భక్తికి అనుగుణంగానే ఉంటుంది. ఆ భక్తిని నిరంతరం పరిపోషించేవి గానే, అతని మాట, చేత ఉంటుంది. 

అందువలన ఊరకుండలేక భగవత్సేవ ప్రారంభిస్తాడు. ప్రాపంచిక విషయాలలోకి అతడి బుద్ధిపోదు. ఆ విషయాలు ఎదురైనప్పుడు ఉదాసీనత చెంది ఉంటాడు. 

చేయబడే కర్మ లౌకికమైనాసరే, వైదికమైనా సరే అది భగవత్ప్రీతిగా, భగవత్సేవగానే జరుగుతుంది. సర్వాధిష్ఠాన చేతనంతో కలిసిపోయి తనవరకు మాత్రం ఉదాసీనుడై ఉంటాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
 🌹. నారద భక్తి సూత్రాలు - 20 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 12

🌻 12.   భవతు నిశ్చయ దార్డ్యా దూర్థ్వ శాస్త్ర రక్షణమ్‌ - 1 🌻

            లోక వ్యాపారంగాని, వైదిక వ్యాపారం గాని, చివరకు మోక్షార్థ సాధన క్రియలు గాని, ఈ భక్తుడు చేయడు. అప్పుడు ఆ భక్తుడు ఊరకే ఉండాలి కదా! కాని ఊరకుండలేడు. అందుకని శాస్త్రార్థాలను అనుష్ఠిస్తూ ఉంటాడు. శాస్త్రాలు సాధకులకు అవసరమే గాని, పరాభక్తులకు అవసరం లేదు. 

అయినప్పటికీ భగవంతుని నిర్ణయించే శాస్త్రమంటే అతడికి ప్రీతి ఉండటం చేత అనుష్ఠానం చేస్తూ, ఉపరతి పొందుతూ ఉంటాడు. ఈ పని చేయడం వలన సాధకులకు ఆదర్శంగానూ, మార్గదర్శంగానూ ఉంటాడు. దీనినే శాస్త్ర రక్షణ అంటారు.

            దేశ కాల పాత్రతలకు తగినట్లుగా సాధనలను మార్చవలసి ఉంటుంది. ఈ పరాభక్తుడు అప్రయత్నంగా చేసే పనులు ఇతరుల సాధనకు మార్గదర్శకంగా పనికి వస్తాయి. 

ఈ మార్పులు ఒకప్పుడు పూర్వ శాస్త్రానికి కొంచెం సవరించినట్లుగా ఉంటాయి. ఈ విధంగా పరాభక్తుడు శాస్త్రాలలో క్రమంగా మార్పులు చేయడం జరుగుతుంది. పరాభక్తుడంటే సిద్ధుడు గనుక, అతడే ప్రమాణం.

 పూర్వ శాస్త్ర ప్రమాణాలను నవీనీకరించడానికి అతడికి అధికారమున్నది. ఈ విధంగా అతడి వలన శాస్త్ర రక్షణ జరుగుతూ ఉంటుంది. శాస్త్రాలు సంస్కరించబడతాయి. 

పరాభక్తుడు నిశ్చయ జ్ఞానంతో త్రికాలాబాధ్యమైన సాధ్యం కొరకు దేశ కాలమాన పాత్రతలతో  పరిమిత పరచబడే సాధనలలోని ఆచరణ విధానం ఇట్టి మహనీయుల ఆచరణ వలన సంస్కరింపబడి సర్వజనామోదంగా చేయబడుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 🌹 🌹 🌹 🌹
 🌹. నారద భక్తి సూత్రాలు - 20 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 12

🌻 12.   భవతు నిశ్చయ దార్డ్యా దూర్థ్వ శాస్త్ర రక్షణమ్‌ - 1 🌻

            లోక వ్యాపారంగాని, వైదిక వ్యాపారం గాని, చివరకు మోక్షార్థ సాధన క్రియలు గాని, ఈ భక్తుడు చేయడు. అప్పుడు ఆ భక్తుడు ఊరకే ఉండాలి కదా! కాని ఊరకుండలేడు. అందుకని శాస్త్రార్థాలను అనుష్ఠిస్తూ ఉంటాడు. శాస్త్రాలు సాధకులకు అవసరమే గాని, పరాభక్తులకు అవసరం లేదు. 

అయినప్పటికీ భగవంతుని నిర్ణయించే శాస్త్రమంటే అతడికి ప్రీతి ఉండటం చేత అనుష్ఠానం చేస్తూ, ఉపరతి పొందుతూ ఉంటాడు. ఈ పని చేయడం వలన సాధకులకు ఆదర్శంగానూ, మార్గదర్శంగానూ ఉంటాడు. దీనినే శాస్త్ర రక్షణ అంటారు.

            దేశ కాల పాత్రతలకు తగినట్లుగా సాధనలను మార్చవలసి ఉంటుంది. ఈ పరాభక్తుడు అప్రయత్నంగా చేసే పనులు ఇతరుల సాధనకు మార్గదర్శకంగా పనికి వస్తాయి. 

ఈ మార్పులు ఒకప్పుడు పూర్వ శాస్త్రానికి కొంచెం సవరించినట్లుగా ఉంటాయి. ఈ విధంగా పరాభక్తుడు శాస్త్రాలలో క్రమంగా మార్పులు చేయడం జరుగుతుంది. పరాభక్తుడంటే సిద్ధుడు గనుక, అతడే ప్రమాణం.

 పూర్వ శాస్త్ర ప్రమాణాలను నవీనీకరించడానికి అతడికి అధికారమున్నది. ఈ విధంగా అతడి వలన శాస్త్ర రక్షణ జరుగుతూ ఉంటుంది. శాస్త్రాలు సంస్కరించబడతాయి. 

పరాభక్తుడు నిశ్చయ జ్ఞానంతో త్రికాలాబాధ్యమైన సాధ్యం కొరకు దేశ కాలమాన పాత్రతలతో  పరిమిత పరచబడే సాధనలలోని ఆచరణ విధానం ఇట్టి మహనీయుల ఆచరణ వలన సంస్కరింపబడి సర్వజనామోదంగా చేయబడుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 🌹 🌹 🌹 🌹


 🌹. నారద భక్తి సూత్రాలు - 22 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 13

🌻 13. అన్యథా పావిత్య్ర శంకయా 🌻

       శాస్త్రాలను మార్చడం అనేది పరాభక్తుని బుద్ధిననుసరించి జరుగదు. 

ఒకవేళ అతడొక మేధావిగా శాస్త్రాల నభ్యసించి ఏవేవి మార్పులు చేస్తే బాగుంటుందని ఆలోచించి నిర్ణయిస్తే, అతడు పతనం చెందుతాడు. అది శాస్త్ర రక్షణ కానేరదు. 

స్వానుభవపూర్వకంగా ఉన్న దానినే అవసరమైనప్పుడు పరాభక్తుడి ద్వారా ఆ మార్పు చేస్తున్నట్లు అతడికి కూడా తెలియకుండానే లోక కళ్యాణార్థము జరిగేది శాస్త్ర రక్షణ. 

ఇది దైవీ ప్రేరణ వల్ల జరిగేది. బోధించే గురువులంతా, ఈ సత్యాన్ని గ్రహించి వర్తించాలని తెలియ చేస్తున్నారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


 🌹. నారద భక్తి సూత్రాలు - 23 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 14

🌻 14.   లోకోఽపి తావదేవ, భోజనాది వ్యాపారస్త్వా శరీర ధారణావధి 🌻

            లోకాచారాలు దేశకాల పాత్రతలనుబట్టి భిన్న భిన్నంగా ఉంటాయి. నియమాలు అన్ని చోట్లా, అన్ని కాలాలలో అందరిలో ఒకే విధంగా ఉండవు. 

సిద్ధుడికి మాత్రం ఏ నియమం వర్తించదు. అతడు ఒకప్పుడు లోకాచారానికి విరుద్ధంగా కూడా ఉండవచ్చును. ఎందుకంటే అతడు స్వయం బుద్ధితో పనిచేయడు. 

ఈశ్వర ప్రేరణను బట్టి వర్తిస్తాడు. ఆ పరాభక్తుడేది ఆచరిస్తే అదే ధర్మమౌతుంది. ఈ విధమైన మార్పుకు కారణం దేశ కాల పాత్రతలలో వచ్చిన మార్పే గాని అది పూర్వ శాస్త్ర తిరస్కారం కాదు.

            శరీర ధారణ విషయంలోను, భోజనాది వ్యాపారాల విషయంలోను అతడు తన జీవితాన్ని భగవత్సేవకు వినియోగపడేలా ఉంటాడు. అంతేగాని శరీరేంద్రియ, లోక సంబంధ విషయాలను అతడెప్పుడో అధిగమించే ఉన్నాడు. 

ఏనాడో భగవదర్పితమయి ఉన్నాడు. తన శరీర పోషణ కొరకు  కాకుండా, భగవత్సేవ కొరకు మాత్రమే ఏదైనా చేస్తూ ఉంటాడు. అయినా వ్యాధి, బాధలు కలిగినప్పుడు శరీర పోషణను ఉపేక్షించడు. 

అతడు శరీరాభి మానాన్ని విడచినవాడు గనుక, ఆ శరీరాన్ని భగవత్సేవకు ఉపయోగపడే పనిముట్టుగా భావించి దానిని పనిచేసే స్థితిలో ఉంచుకోవడానికన్నట్లు బాగు చేసుకుంటూ ఉంటాడు. సార్వజనీనమైన సామాన్యమైన రీతిలో ఇతరుల ఉన్నతికొరకు వ్యవహరిస్తూ ఉంటాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. నారద భక్తి సూత్రాలు - 24 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 15

🌻. 15. తల్లక్షణాని వాచ్యంతే నానా మత భేదాత్‌ - 1 🌻

            పరాభక్తుని లక్షణాలు ఇతరులకు అర్థం కావు. వారు అతడి బాహ్య క్రియలను బట్టి నిర్ణయిస్తే, అది అతడి ఆంతరంగిక స్థితితో సరిపోదు. 

చూచేవారి ఊహలనుబట్టి కూడా భిన్న భిన్నాలుగా ఉంటుంది. అయినా అతడి నిజ స్థితి ఏ ఒక్కరి ఊహకు సరిపోదు. భక్తుని లక్షణం ఆ భక్తునికి మాత్రమే అనుభవగోచరం. అయినప్పటికీ పరాభక్తుని లక్షణాలు మరొక పరాభక్తునికి తెలుస్తాయి. 

అదే మాదిరి నారద మహర్షి వంటి వారికి తెలుస్తుంది. కనుకనే మనకు యీ నారద భక్తి సూత్రాలు లభించాయి. పరాభక్తులు ఈ క్రింది విధంగా చెప్తున్నారు.

       1. ఈ పరాభక్తి అనాది కర్మలను నశింపచేస్తుంది. అనాది కర్మలంటే మొదటి జన్మకు కారణమైన ఈశ్వర దత్త కర్మలు. తరువాతి కర్మలు జీవుడు ప్రతి జన్మలోనూ కొద్దికొద్దిగా సంపాదించినవి. తాను చేసిన కర్మవలన జన్మ, ప్రతి జన్మలోనూ మరల కర్మ చేయుట. ఆ విధంగా జన్మ కర్మ చక్రమందు తిరుగు చున్నాడు. 

ఇట్టి జనన మరణ చక్రం ఈశ్వరుని నియమం. దీనిని భవం అంటారు. జీవుడు నిష్కామ కర్మ యోగం, భక్తి యోగం మొదలైన సాధనలచేత వాసనాక్షయానికి ప్రయత్నిస్తే, అనాది సంస్కార బీజం మాత్రం మిగిలి ఉండి, అది ఈశ్వరానుగ్రహం వలన నశించిన పిదప పరాభక్తి సిద్ధిస్తుంది.

      2. అంతర్యామియైన భగవంతుని కల్యాణ గుణాలను వినినంతనే తన భావాన్ని తైలధారలాగా ప్రవహింపచేస్తాడు. ఇది ఆ పరాభక్తుని ప్రయత్నమేమీ లేకనే సహజంగా జరుగుతుంది. 

అంతర్యామితో అను సంధానమైన పరాభక్తుడు భావావేశం పొంది తను ఏయే వర్ణనలను విని ఆ భగవంతుని నిర్ణయించాడో అదే వర్ణనలతో భగవంతుని కీర్తిస్తాడు. గానం చేస్తూ కవిత్వం పొంగిస్తాడు. అంతకుముందు అతడు కవి కాక పోయినా సంగీత విద్వాంసుడు కాకపోయినా, ఆ విధంగా చేస్తాడు. అలవాటు లేకపోయినా ఏవేవో చేస్తూ ఉంటాడు.

      3. మూఢులకు ప్రాపంచిక భోగాల పట్ల ఎంతటి ప్రీతి ఉంటుందో అంతకంటే తీవ్రంగా ఈ పరాభక్తుడు భగవంతుని పట్ల ప్రీతిని కలిగి ఉంటాడు. అసలు ప్రాపంచికమైనవి అతనికి తోచవు. 

అవి ఎదురైనా ఉదాసీనత వహించి ఉంటాడు. వేటితోనూ బంధింపబడి ఉండడు. భగవంతుని విషయంలో మాత్రం విడచి ఉండలేని విరహంతో ఉంటాడు. 

భగవంతుని ఒక్క క్షణం కూడా మరచి ఉండడు. భగవంతునితో అను సంధానమై, తెంపులేని ప్రేమలో మునిగి ఉంటాడు. భగవంతుని కోసం ప్రాణాలైనా అర్పిస్తాడు.

సశేషం...


 🌹. నారద భక్తి సూత్రాలు - 25 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 15

🌻. 15. తల్లక్షణాని వాచ్యంతే నానా మత భేదాత్‌ - 2 🌻

4. పరాభక్తుడు భగవత్ప్రీతి కలిగి ఉండి భగవంతుని నుండి ఏమీ కోరడు. ఏ ఫలం ఆశించడు. అతడి భక్తి అచంచలం, ఏకాగ్రం. 

ఇది యోగస్థితిగా కనిపిస్తుంది. కాని అది సిద్ధించినదే కనుక అది క్షేమ స్థితి. అది కౌశలం. అది పరాకాష్ఠ. 

5. పరాభక్తుడిలో ఒకసారి భగవంతుని కల్యాణ గుణాల భావన యౌగికం కాగా ఇక అది ఎన్నటికీ చెదరదు, తరగదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా భగవంతుడిపై ఉన్న అతడి ప్రేమ ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అతడు ఆ పట్టును వదలడు. 

సాధకులకైతే లౌకికమైన వాటినన్నీ వదిలితే గాని ఈ భగవత్ప్రేమ సిద్ధించదు. ఈ విధంగా సిద్ధమైనదే పరాభక్తి. ఇది సమాప్తస్థితి. అతడిలో జీవ భావానికి సంకేతమైన అహంకార మమకారాలు తిరిగి తలెత్తవు. 

ఎందుకంటే సత్యం అనుభవమయ్యాక అసత్యం మరలా ఎందుకు నిర్ణయమవుతుంది ? ఉన్నది భగవంతుడే, భగవంతుడు తప్ప అన్యం లేదు అనే సత్యం గోచరమై, అనుభవ సిద్ధమైన పిదప ఇక జీవ భావంగాని, ప్రపంచ భావంగాని తోచదు. ఇదే కదా పరాభక్తి అంటే !

            6. శాండిల్య భక్తి సూత్రాల ప్రకారం భగవంతుని పట్ల పరమప్రేమ కలిగి ఉండటమే పరాభక్తి అవుతుంది. పరమప్రేమ అంటేనే లౌకిక ప్రేమకు పరమై విలక్షణమైనది. 

అనగా అలౌకికమైన భగవత్ప్రేమ. భగవంతుడు సచ్చిదానందుడు గనుక, పరమప్రేమ అంటే పరమశాంతి, పరమానందం. ఇది పరాభక్తి లక్షణమై ఉన్నది.

            7. స్వప్నేశ్వరుని ప్రకారం భగవంతుని మహిమలను గ్రహించి అనుభవిస్తున్నప్పుడు కలిగిన ప్రీతి పరాభక్తి అవుతుంది. భగవంతుని మహిమలను గ్రహించే భక్తుడు ముఖ్యభక్తుడు. ఆ మహిమకు పరవశించడమనేది ఇంకా భగవంతునిలో ఐక్యం కానట్టి స్థితి. 

భగవంతునితో అనుసంధానమైనట్టి భక్తుడు తన భావావేశ స్థితిలో కూడా ఆయన కంటే వేరుగా ఉండడు. అనగా భగవత్ప్రీతి అనేది క్రియగా ఉండదు. అది ఘన రూపమై ఉంటుంది. అదే పరాభక్తి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

నారద భక్తి సూత్రాలు - 25 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 15

🌻. 15. తల్లక్షణాని వాచ్యంతే నానా మత భేదాత్‌ - 2 🌻

4. పరాభక్తుడు భగవత్ప్రీతి కలిగి ఉండి భగవంతుని నుండి ఏమీ కోరడు. ఏ ఫలం ఆశించడు. అతడి భక్తి అచంచలం, ఏకాగ్రం. 

ఇది యోగస్థితిగా కనిపిస్తుంది. కాని అది సిద్ధించినదే కనుక అది క్షేమ స్థితి. అది కౌశలం. అది పరాకాష్ఠ. 

5. పరాభక్తుడిలో ఒకసారి భగవంతుని కల్యాణ గుణాల భావన యౌగికం కాగా ఇక అది ఎన్నటికీ చెదరదు, తరగదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా భగవంతుడిపై ఉన్న అతడి ప్రేమ ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అతడు ఆ పట్టును వదలడు. 

సాధకులకైతే లౌకికమైన వాటినన్నీ వదిలితే గాని ఈ భగవత్ప్రేమ సిద్ధించదు. ఈ విధంగా సిద్ధమైనదే పరాభక్తి. ఇది సమాప్తస్థితి. అతడిలో జీవ భావానికి సంకేతమైన అహంకార మమకారాలు తిరిగి తలెత్తవు. 

ఎందుకంటే సత్యం అనుభవమయ్యాక అసత్యం మరలా ఎందుకు నిర్ణయమవుతుంది ? ఉన్నది భగవంతుడే, భగవంతుడు తప్ప అన్యం లేదు అనే సత్యం గోచరమై, అనుభవ సిద్ధమైన పిదప ఇక జీవ భావంగాని, ప్రపంచ భావంగాని తోచదు. ఇదే కదా పరాభక్తి అంటే !

            6. శాండిల్య భక్తి సూత్రాల ప్రకారం భగవంతుని పట్ల పరమప్రేమ కలిగి ఉండటమే పరాభక్తి అవుతుంది. పరమప్రేమ అంటేనే లౌకిక ప్రేమకు పరమై విలక్షణమైనది. 

అనగా అలౌకికమైన భగవత్ప్రేమ. భగవంతుడు సచ్చిదానందుడు గనుక, పరమప్రేమ అంటే పరమశాంతి, పరమానందం. ఇది పరాభక్తి లక్షణమై ఉన్నది.

            7. స్వప్నేశ్వరుని ప్రకారం భగవంతుని మహిమలను గ్రహించి అనుభవిస్తున్నప్పుడు కలిగిన ప్రీతి పరాభక్తి అవుతుంది. భగవంతుని మహిమలను గ్రహించే భక్తుడు ముఖ్యభక్తుడు. ఆ మహిమకు పరవశించడమనేది ఇంకా భగవంతునిలో ఐక్యం కానట్టి స్థితి. 

భగవంతునితో అనుసంధానమైనట్టి భక్తుడు తన భావావేశ స్థితిలో కూడా ఆయన కంటే వేరుగా ఉండడు. అనగా భగవత్ప్రీతి అనేది క్రియగా ఉండదు. అది ఘన రూపమై ఉంటుంది. అదే పరాభక్తి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 

 🌹. నారద భక్తి సూత్రాలు - 26 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 15

🌻. 15. తల్లక్షణాని వాచ్యంతే నానా మత భేదాత్‌ - 3 🌻

   8. ఆర్ధ్రత చెందిన హృదయమే పరాభక్తి స్వరూపం. అనగా అతడి మనసు అతడి హృదయంలో విలీనమైంది. ఇక మనసనేది లేదు. 

తిరిగి మనసును పుట్టించే హృదయం భగవన్మయమైనందున, అది లోక వృత్తులనుండి విడుదలై ఉన్నది. అలౌకికమైనట్టి పరమానందమే పరాభక్తి.

        9. రూపగోస్వామి ప్రకారం కర్మ జ్ఞానాదుల చేత ఆవరింపబడ కుండా ఉన్నప్పుడు, అతడిలో ఏ స్థిరమైన భగవదానందానుభవముంటుందో అదే పరాభక్తి అవుతుంది. 

కర్మ జ్ఞానాదులచేత ఆవరింపబడినవాడు జీవుడు గనుక, పరాభక్తిలో జీవభావం నశిస్తుంది. అన్ని విధాలైన ఆవరణ దోషాలు నశిస్తే, మిగిలేది స్థిరరూప పరమానందానుభవమే. అదే పరాభక్తి.

      10. భగవత్సాక్షాత్కారమే పరాభక్తి. సాక్షాత్కారమన్నా అపరోక్షాను భవమన్నా, ఆ భగవంతునితో ఐక్యతానుసాంధానరూప పరమానందమే. ఇదే సాయుజ్యం అనబడుతుంది.

            11. యమునాచార్యుల ప్రకారం, భగవద్వియోగ భయమే పరాభక్తి అవుతుంది. 

చిన్న పిల్లలు భయపడినప్పుడు తల్లిని కౌగిలించుకొని బయటి వస్తువుల ద్వారా కలిగిన భయం నుండి విడుదలై తల్లియందు ఏలాగున సేద తీరుతారో, అదే విధంగా భక్తుడు భగవంతునిలో చేరి నిర్భయుడౌతాడు. 

భగవంతుని నుండి వేరవడానికి భయపడతాడని చెప్పడంలో అర్థం భగవంతునితో మమేకమౌతాడని చెప్పడమే అవుతుంది.

            ఈ విధంగా పరాభక్తి లక్షణాలను వారి వారి అనుభవాలను బట్టి అనేక మతస్థులు, స్వానుభవపరులు వివరించారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. నారద భక్తి సూత్రాలు - 28 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 16

 🌻 16. పూజాదిష్వనురాగ ఇతిపారాశర్యః  - 2 🌻 

హృదయమే లేని పూజనాచరించుట కన్న
 మానివేయుట కడునుత్తమంబు సుమ్ము               -మెహెర్‌ బాబా

            హృదయ పూర్వక భక్తి భగవంతుని మీదనే కాకుండా భాగవతోత్త ముల మీదను, ఆచార్యుల మీదను కూడా ఉంటుంది. భక్తుని భావన దాసానుదాసుడుగా ఉంటుంది. అతడు నమ్రత, అణకువ, విధేయత, అర్పణ భావాలు కలిగి ఉంటాడు. 

అతడిలో ‘‘నేను’’ అనేది చచ్చిపోయేటంతటగా తగ్గి ఉంటుంది. అప్పుడే అతడు భగవదనుగ్రహం పొందుతాడు. భగవంతునితో నిరంతర సాన్నిధ్యాన్ని అనుభవిస్తాడు. మైమరచి, పరవశించి ఉంటాడు.

            ఈ చెప్పినదంతా భక్తి సాధనలో భాగమే. అయితే భవత్సాక్షాత్కారం కలిగిన తరువాత కూడా పూజాదికాలు జరిపే పరాభక్తులు కూడా ఉంటారు. నిజానికి వారికవి అవసరం లేవు. 

అయినా ఇతరులు ఆ విధంగా సాధన చేయాలని చేస్తూ ఉంటారు. వారిలో ఇలా చేయాలని ఒక ప్రేరణ ఉంటుంది. వారిలో లోకాన్ని పట్టించుకునే ఆలోచన ఉండదు. 

కాని ఈ విధమైన ప్రేరణలు సాధకులకు మార్గదర్శకంగా ఉండటానికి పనికి వస్తాయి. ఇట్టి దైవీ ప్రేరణ వలన భగవంతునికి సంబంధించిన అనేక కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. 

ఉత్సవ ఊరేగింపులు, ఏకాహం, సప్తాహం వంటివి దేవాలయ పునర్నిర్మాణాలు, అన్న సంతర్పణలు, దీనజన సేవ, ఇవన్నీ నారాయణసేవగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి పరాభక్తుని విషయంలో పూజాదికాలే అవుతాయి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. నారద భక్తి సూత్రాలు - 29 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 17

 🌻 17. కథాదిష్వితి గర్గః - 1 🌻 

            భగవంతుని సచ్చరిత్రలను ఆసక్తిగా వినడం, భగవంతుని లీలలను, అనుగ్రహాలను తెలిసి పరవశించడం వంటివి కూడా భక్తి సాధన క్రిందకు వస్తాయి అని గర్గ మహర్షి మతం.           

            జపం, కీర్తనం, పురాణ పఠనం, హరికథా గానం, స్తోత్రాదులు ఇవన్నీ కూడా శ్రద్ధతో, భక్తి ప్రపత్తులతో చేస్తే అది కూడా భక్తి సాధనే అవుతుంది. కాని ఇవి కాయిక, వాచిక భక్తి క్రిందకు వస్తాయి. కొందరు పరాభక్తులు మాత్రం ఈ భక్తి క్రియలు వారికి అవసరం లేనప్పటికీ ఇతరులకు ఆదర్శంగా ఉండటానికి చేస్తూనే ఉంటారు. ఇది దైవీ ప్రేరణ వలన గాని, భగవత్ప్రేమ పొంగిపొర్లడం వలన గాని క్రియా రూపమౌతుంది.

            ప్రేమ గంభీరమై, అనివార్యమైన భక్తి
            వాగ్రూపము వహించి, ప్రకటితమగు     -మెహెర్‌ బాబా

            భక్తి సాధనలో సాధకుడు తనను తాను సంస్కరించుకుంటూ పోతాడు. పిమ్మట గౌణభక్తి ముఖ్యభక్తిగా మారినప్పుడే భగవదనుగ్రహం లభిస్తుంది. భగవంతుడు భక్తి గీతాలతో కూడిన నాలుక భాష వినిపించు కోడు. హృదయపూర్వకమైనది మాత్రమే ఆయనను చేరుతుంది.

            నామ జప సంకీర్తనములవంటి
            జిహ్వ భాషకు దేవుడు చెవినొసగడు
            కర్మకాండ నన్ను కప్పివేయును సుమా !
            విమల పూజ నన్ను వెలికి దెచ్చు   -మెహెర్‌ బాబా

            విష్ణు సహస్రనామం తెలియచేసిన భీష్ముని ఉపదేశమేమనగా ''భగవంతుని నామస్మరణ, అర్చన, ధ్యానం, స్తుతి రూపమైన భజన ఆచరించుట ఉత్తమ ధర్మం''. యజ్ఞాలలో కెల్లా ఉత్తమ యజ్ఞం జపయజ్ఞం అని గీతా వాక్యం కదా ! యజ్ఞం అంటే నిష్కామ రూపక్రియ అని అర్థం. పై చెప్పినవన్నీ భక్తి సాధనగా చేస్తూ చివరకు హృదయ పూర్వకంగా చేసికొననిచో అవి భగవంతునికి చేరవు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. నారద భక్తి సూత్రాలు - 30 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 17

 🌻 17. కథాదిష్వితి గర్గః - 2 🌻 

నిరాడంబరమైన నిశ్శబ్ద భక్తి అయితే అది హృదయ భాష. హృదయంలో ఏర్పడిన ప్రేమ సందేశమయితేనే, భగవంతునికి చేరుతుంది. 

ముఖ్యభక్తిని సాధించాలంటే భగవదనుగ్రహం కావాలి. కనుక భగవంతుని ప్రేమించవలసిన రీతిగా ప్రేమించాలి. అది ఇంద్రియాల సంబంధంగా ఉండకూడదు. స్వార్థంతో కూడినది కాదు. కోరికలకోసం కాదు. 

మమకార వ్యామోహాలున్నప్పుడది భగవత్ప్రేమ కాదు. అహంకారం అడ్డు తొలగే వరకు అది గౌణభక్తి మాత్రమే. ఈ భక్తి హృదయపూర్వకంగా మారినప్పుడు అది అకారణ భక్తి అవుతుంది. పర్యవసానంగా ముఖ్యభక్తి అవుతుంది. భగవదనుగ్రహం కలిగేది ముఖ్యభక్తులుగా మారినవారికే. 

అప్పుడతడు ప్రాపంచిక విషయాలనుండి విడుదలవుతాడు. ఫలితంగా భగవంతునితో మమేకమవుతాడు. ఈ స్థితిని పరాభక్తి అంటారు. దీనినే పరమప్రేమ అని కూడా అంటారు.

            పరాభక్తులను జీవన్ముక్తులని అద్వైతులంటారు. విశిష్టాద్వైత మతస్థులు వీరిని భాగవతోత్తములంటారు. వీరిలో అహంకారం యొక్క జాడ ఉండదు. 

సాధనలో ఈ అహంకారం పోగొట్టుకోక తప్పదు. అహంకారంతో జీవించడం వేరు, భక్తుడుగా ఉండడం వేరు అని అనుకుంటూ ఉంటారు కొందరు భక్తులు. కాని నిజమైన భక్తి కావాలంటే దురహంకారమే కాదు, సాత్వికాహంకారం కూడా తొలగిపోవాలి.  అహంకారం అడ్డు తొలగనిదే ముక్తుడు కాలేరు.

            భగవంతునికి, భక్తునికి మధ్య అహంకారమే అడ్డు గనుక, భగవదైక్యం జరగాలంటే అహంకారం పోవాలి.

            నీవు నన్ను ప్రేమించు, నీకు - నాకు       
            అంతరమ్మున నేమియు నడ్డుకొనదు
            ప్రేమ కల్గియుండుము, ఎప్డు ప్రేమ కల్గి
            యుందో, భగవదైక్య మవశ్యమందగలవు
                  -మెహెర్‌ బాబా

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

 🌹. నారద భక్తి సూత్రాలు - 31 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 18

 🌻 18. ఆత్మరత్య విరోధేనేతి శాండిల్యః - 1 🌻 

              పరాభక్తి ద్వారా ఆత్మానందం కలుగుతుంది. ఆత్మానందం లేని భక్తి గౌణభక్తి అవుతుంది. ఆ భక్తి మొదట అవసరమే అయినా అవి ఆత్మానందానికి దారి తీయకపోతే వ్యర్థమౌతుంది అని శాండిల్య మహర్షి చెప్తున్నారు.

            ఆత్మానందం కలగాలంటే బుద్ధి ప్రాపంచిక విషయాల మీదికి పోకూడదు. విషయ త్యాగం కావాలి. పనులు చేస్తున్నట్లుగా కాదు. అవే జరిగి పోతున్నట్లు, వాటికి అసంగంగా ఉండాలి. రాగద్వేషాలు, ఈర్ష్యాసూయలు, దంభం, దర్పం, అహంకారం పోవాలి. 

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు భక్తుడిలో జయించబడి ఉండాలి. భక్తుడు తన ప్రవర్తనలో తమోగుణం గాని, రజోగుణం గాని లేకుండా చేసుకోవాలి. చివరకు సత్వగుణ ప్రవర్తనలోనూ, కీర్తి కాంక్ష, ''నేను ఈ మంచి పనిచేశాను'' అనే భావన కూడా రాకూడదు.

            తనచేత ఉపకారం పొందిన వారిని మరచి పోవాలి. తనచేత ఉపకారం పొందిన వారితో తనకు తరువాత ప్రత్యుపకారమవసరమైనప్పుడు అతడు నిరాకరించినా సరే తాను అతడికి గతంలో చేసిన సహాయం గుర్తుకు రాకూడదు. ఉపకారికి ఉపకారం చేయడం కాదు. అపకారికి ఉపకారం నెపమెన్నక చేసేవాడు మాత్రమే గౌణభక్తి నుండి విడుదలవుతాడు.

ఎవరికైతే త్రిగుణాల ప్రభావం ఉండదో వారికి అహంకారం అడ్డు తొలగుతుంది. అట్టి ఖాళీలోనే ప్రశాంతత కలుగుతుంది. అప్పుడు భక్తి హృదయ పూర్వకమైతే సాధన ఫలంగా ఆత్మానందం కలుగుతుంది. నేను భక్తి క్రియలు జరుపుతున్నాననే స్పృహ లేకుండా ఉంటాడు. ''నేను'' అనే ముసుగు ఉన్నంత వరకు భగవత్ప్రేమ సహజం కాజాలదు.

  నేను అను సంకుచితమైన నీదు ముసుగు 
క్షణములో తొలగింపజాలు ప్రేమ !
 నీవు శాశ్వత జ్ఞాన మాసింతువేని ముందు నిను నీవు మరచిపోవలయును    -మెహెర్‌ బాబా

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. నారద భక్తి సూత్రాలు - 32 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 19

 🌻 19.   నారదస్తు తదర్పితాఖిలాచరతా తద్విస్మరణే పరమ వ్యాకులతేతిచ 🌻 

            సమస్త ఆచార వ్యవహారాలను భగవదర్పితం చేసిన భక్తుడికి భగవంతుడు ఎప్పుడైనా మరుపుకు వస్తే బాధపడుతుండడం భక్తి లక్షణం అవుతుంది. ఇది నారద మతం.

            పూజలు, కీర్తనలు వాటికవే భక్తి లక్షణాలు కావు. నిజమైన భక్తుడికి భగవద్విస్మృతి ఎన్నడూ కలుగదు. 

విస్మృతి ఎప్పుడైనా కలిగితే అందుకు దుఃఖపడతాడు. ఆ దుఃఖపడడంలో అతడు మరలా భగవంతునినే తలచు కుంటూ ఉంటాడు. ఆ విధంగా భగవంతుడు ఎప్పుడూ నిలిచే ఉంటాడు.

            భగవంతుని మరువకుండా నిరంతరం స్మృతిలో ఉంచుకుంటే ఆయన కోసం స్తోత్రాలు చేయడం, మొదలైనవి అనవసరం.

 మొదట వాచిక భక్తి ఉన్నప్పటికీ భక్తుని చిత్తం భగవంతునికి అంకితమయ్యాక, పూర్వపు భక్తి విధానం అంత ముఖ్యం కాదు. మెహెర్‌బాబా తన భక్తులకు ఈ విధంగా చెప్పారు.

 ‘‘హారాలు వేయడం, మోకరిల్లడం, స్తోత్ర పాఠాలు వల్లించడం మొదలైనవి అనవసరం. భగవంతుని కనుగొనే మార్గంలో ప్రేమ, విధేయత, అర్పణ ఈ మూడూ ప్రధానం. మానవుడికి ప్రేమించడం తెలుసు. 

అది మానవుడికి భగవంతుడిచ్చిన కానుక. అయితే లోక సంబంధమైన వాటిని కాకుండా, అదే ప్రేమను భగవంతునిపై చూపడాన్ని సహజం చేసుకోవాలి. 

దానికోసం అర్పణ, లేక కైంకర్యం అనేది మానవుడు తిరిగి భగవంతునికి ఇవ్వవలసిన కానుక. భక్తుడు ప్రియతమ భగవంతుని ఇచ్ఛకు లోబడి ఆయనతో ఐక్యతను ఆశించాలి. 

ప్రేమ కన్నా విధేయత, విధేయతకన్నా అర్పణ గొప్పవి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ, విధేయత, అర్పణ - ఈ మూడూ కలిస్తే భగవత్ప్రేమ అవుతుంది’’.

            ఇట్టి ప్రేమలో ప్రేమికుడు ప్రియతముని ఒక్క క్షణం కూడా మరచి ఉండలేడు. ఒక వేళ మరచినా, పశ్చాత్తాపంతో మరలా ఆ భగవంతునినే నిలుపు కుంటాడు. నిరంతరం భగవద్ధ్యాసలోనే ఉంటాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. నారద భక్తి సూత్రాలు - 31 🌹
ప్రథమాధ్యాయం - సూత్రము - 19

 🌻 18. ఆత్మరత్య విరోధేనేతి శాండిల్యః - 2 🌻

భగవంతుడు చైతన్యపు లోతుల్లో మౌనంగా ఉంటాడు. భక్తుడు కూడా అదే స్థితిలో ఉంటేనే భక్తుడు ఆయనతో కలసి ఆత్మానందుడవుతాడు. దీనినే భగవదనుగ్రహం అంటారు.

            మౌనంలోనే యదార్థం ఇవ్వడం, పుచ్చుకొనడం జరుగుతుంది
-మెహెర్‌ బాబా

            అనగా భక్తుడు భగవంతుని యెడల సహజ ప్రేమలో ఉంటూ, ప్రాపంచిక విషయాలపై మౌనం వహిస్తే భగవదనుగ్రహం కలుగుతుంది.

నేను అనేది మౌనపడ్డప్పుడు, ఆ ''నేను'' అనే అడ్డు తొలగుతుంది. ''నేను'' పోతే భగవత్ప్రేమ సాక్షాత్కరిస్తుంది. అప్పుడు ఆత్మానందుడౌతాడు.

            భగవంతుడు తప్ప మరే ఇతరమైనవి నీలో ఉన్నా భగవంతుడు నీలో ప్రతిష్ఠితమవడానికి బిడియ పడతాడని మెహెర్‌బాబా చెప్పేవారు.

కామక్రోధాదిక వైరి షట్కము జయించు
 దనుక, లేదు దివ్య పద దర్శనంబు          -మెహెర్‌ బాబా

            భక్త ప్రహ్లాదుడు తన తండ్రితో ఇలా అన్నాడు.

            లోకములన్నియు గడియలో జయించిన వాడ, వింద్రియా
            నీకము జిత్తమున్‌ గెలువ నేరవు, నిన్ను నిబద్ధుజేయు నీ
            భీకర శత్రులార్వురబ్రభిన్నుల జేసిన, బ్రాణికోటిలో
            నీకు విరోధి లేడొకడు నేర్పున జూడుము, దానవేశ్వరా !

తా||  నీ విన్ని లోకాలను గడియలో జయించిన పరాక్రమశాలివి అయినను నీవు నీ ఇంద్రియాలను, నీ చిత్తాన్ని జయించలేకపోతివి. నిన్ను గట్టిగా బంధించి ఉన్న ఆర్గురు భయంకరమైన శత్రువులు నీలోనే ఉన్నారు.

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆర్గురు శత్రువులను జయించినచో ఇక బయటి లోకాలలో ఏ ఒక్కడైనను నీకు విరోధిగా ఉండడు కదా ! ఈ విషయాన్ని వివేకంతో గ్రహించుము తండ్రీ !

కనుక అంతః శత్రువులను జయిస్తే భగవంతుని యొక్క పవిత్ర ప్రేమ సామ్రాజ్యంలో ప్రవేశిస్తాడు భక్తుడు.

నన్ను ప్రేమించి, ఆత్మార్పణము నెవండు
సేయు, నాతడు నన్గాంచు చిత్తమల
ఎవరు భగవానుకై మరణింత్రు - వారు
శాశ్వతంబుగ నివసింత్రు - సత్యమిద్ది                -మెహెర్‌ బాబా

            సర్వ సమర్పణ జేసికొన్న భక్తుడు ఆత్మానందం పొందుతాడు. అందుకోసం అడ్డుగా ఉన్న అహంకారాదులను తొలగించుకున్న భక్తుడు భగవంతుని ప్రేమ స్వరూప లక్షణంతో మమేకమవుతాడు.

            భక్తి అనేది ఆధ్యాత్మికమే గాని, కాయిక, వాచిక, మానసికాలు కాదని తెలియాలి. మానసిక భక్తిలో ధ్యానావస్థ, విక్షేపావస్థలను అధిగమించి ఆత్మానందం పొందటానికి ఉన్న విరోధాలను భగవంతుని యందలి ప్రీతిచే తొలగించుకోవటం తప్పనిసరి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. నారద భక్తి సూత్రాలు - 35 🌹
ప్రథమాధ్యాయం - సూత్రము - 22

🌻 22. తత్రాపి న మహాత్మ్య జ్ఞాన విస్మృతి త్యపవాదః 🌻

            గోపికలు లౌకికమైన కామదృష్టితో వ్యవహరించి ఉండవచ్చునని సందేహించినా, లేకపోతే ఆ గోపికలు శ్రీకృష్ణ స్వామిని, మానవునిగానే భావించినా ఆ శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి అని ఉదాహరణగా ఒక కథ ఉన్నది. అయినా భగవద్గీతను ఉపదేశించి తాను కర్మయోగిగా ప్రసిద్ధి కెక్కినది అందరికీ తెలిసినదే.

            శ్రీ కృష్ణుడు గోపికల ప్రేమలో వ్యత్యాసమున్నదనుకున్నా, గోపికల ప్రేమ కామంతో కూడినదిగా, శ్రీ కృష్ణుని ప్రేమ దైవీ ప్రేమగా గుర్తించి చూద్దాం. ఈ రెండు ప్రేమలూ కలిశాయి అనుకుందాం.

ఉదాహరణగా రెండు పదార్థాల కలయికలో దేని ప్రభావం ఎక్కువో దాని ప్రభావమే రెండవదాని మీద పని చేస్తుంది. అగ్ని ప్రభావం ఎక్కువైతే నీరు ఆవిరౌతుంది. నీటి ప్రభావం ఎక్కువైతే అగ్ని చల్లారిపోతుంది.

ఇక్కడ శ్రీ కృష్ణుని ప్రేమ మహత్తుతోను, జ్ఞానంతోనూ కూడిందగుటచేత ఆ కృష్ణ ప్రేమ గోపికల ప్రేమ ప్రభావాన్ని అణచివేస్తుంది. అనగా కామ్యకమైన గోపికల ప్రేమ ఆవిరైపోతుంది. వారిలో దైవీ ప్రేమ ప్రతిష్ఠితమవుతుంది.

            మరొక ఉదాహరణ చూద్దాం. వెలుగును చీకటి, చీకటిగా మారుస్తుందా? లేక చీకటిని వెలుగు, వెలుగుగా మారుస్తుందా ?

ఇక్కడ జ్ఞాన ప్రకాశమే గోపికల లోని అజ్ఞానమనే చీకటిని వెలుగుగా మారుస్తుంది. అందువలన గోపికల మానవ సహజమైన ప్రేమకు ప్రతిగా శ్రీకృష్ణుని దివ్య ప్రేమ స్పర్శతో గోపికల ప్రేమ కూడా దివ్యమే అవుతుంది.
🌹 🌹 🌹 🌹 🌹

: 🌹. నారద భక్తి సూత్రాలు - 36 🌹
ప్రథమాధ్యాయం - సూత్రము - 23

🌻 23. తద్విహీనం జారాణా మివ 🌻

            గోపికాంగనల ప్రేమ భగవంతుని మాహాత్మ్యం తెలియనిదైతే అది వ్యభిచారమే అవుతుందేమో ? అని సంశయం.

            ఒకవేళ గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను వారికంటే వేరుగా, కేవలం గొప్ప వాడిగా చూచినట్లైతే, ఆ శ్రీకృష్ణుని కీర్తిస్తూ, పూజిస్తూనే ఉండిపోయేవారు. వారి భక్తి అప్పుడు కాయిక, వాచిక భక్తి అయ్యుండేది.

కాని ఆ గోపికాంగనలు శ్రీ కృష్ణుని హృదయాంతరంగలో పెట్టుకుని తన్మయులై ఉన్నారు కదా ! శరీరధారిగా అవతరించిన పరమాత్మను భగవంతుడిగా భావించి ఆలింగనం చేసుకుంటే అది జారత్వ మెలాగవుతుంది?

అవతార్‌ మెహెర్‌ బాబాను భగవంతునిగా నమ్మిన స్త్రీ భక్తులు ఆయనను ఆలింగనం చేసుకోలేదా ? ఇరువురూ అజ్ఞానులైతే అది జారత్వ మౌతుంది గాని ఒకరు భగవంతుడైనప్పుడు రెండవ వాడైన అజ్ఞానిలో దివ్యత్వం ప్రకాశింప బడుతుంది.

అప్పుడు ఆ భగవంతడు ఒక్కడే పురుషోత్తముడు ఇతరులు స్త్రీలైనా, పురుషులైనా సరే, అందరూ స్త్రీలతో సమానం.

   కనుక గోపికాంగనల భక్తిని కామంతో కూడినదిగా శంకించ నవసరం లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. నారద భక్తి సూత్రాలు - 43 🌹
ప్రథమాధ్యాయం - సూత్రము - 26

🌻 26. ఫలరూపత్వాత్‌ 🌻

            పరాభక్తి అంటే సాధించగా వచ్చే ఫలితం కాదు. దానికదే ఫలరూపంగా ఉన్నది. అది సిద్ధమే గాని సాధ్యంగా వచ్చేది కాదు.

            ఈ పరాభక్తి సిద్ధించే వరకే ఏ యోగమైనా. అది సిద్ధించడానికి ఒక మెట్టు క్రిందితో యోగాలన్నీ ఆగిపోతాయి.

అనగా యోగాలు, సాధనలు, వాటి ఫలితాలు భక్తుడిని పరాభక్తి అనే అనుభూతికి సంసిద్ధ పరుస్తాయే గాని, సాధనల ఫలితం పరాభక్తి కాదు.

సాధనలన్నీ పరాభక్తి లక్ష్యంగా అహంకారాదుల అడ్డు తొలగించే ఉపాయాలుగా అవసరమౌతాయి. పరా భక్తికి ఒక మెట్టు క్రింద కలిగే ముఖ్యభక్తికి తీసుకొని వెళ్తాయి.

పరాభక్తి మాత్రం సిద్ధ వస్తువు. అది ఎప్పటినుండో, ఎట్టి మార్పు లేకుండా ఉన్నదున్నట్లున్నదే. కొన్ని అవాంతర కారణాల వలన భక్తుడికి తెలియబడలేదు.

తెలియబడటంలో జాప్యమేగాని అన్ని విధాలైన అడ్డంకులను తొలగించుకుంటూ పోయేవరకు మొదట అది లేదన్నట్లుండి, అడ్డు తొలగిన వెంటనే అది అలాగే, అక్కడే సాక్షాత్కరించినట్లైంది.

తెర వెనుకనే ఉండి, తెర తీయగానే దర్శనమైనట్లు, అది ఆద్యంతాలు లేక సిద్ధమై ఉన్నది. అన్ని సాధనలూ తెరలు తొలగించడానికే గాని, పరాభక్తిని పొందడానికి కాదు. తెర చినిగితే అది ఉండనే ఉన్నది.

అందువలన పరాభక్తిని ఫల రూపంగానే చెప్తున్నారు. పరాభక్తికి ప్రాప్తి, అప్రాప్తి అని లేదు. దానిని స్వతఃసిద్ధం అంటే సరిపోతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. నారద భక్తి సూత్రాలు - 50 🌹
ప్రథమాధ్యాయం - సూత్రము - 28

🌻 28. తస్యాః జ్ఞానమేవ సాధన మిత్యేకే 🌻

   జ్ఞానం వల్లనే మోక్షమని కొందరి అభిప్రాయం. అది నిజమే. ఏది సాధించాలన్నా దాని పూర్వాపరాలు తెలియాలి. పెద్దల అనుభవంతో వ్రాయబడిన తత్సంబంధ శాస్త్రాలు పఠించాలి. సాధనలకు తగిన ఉపాయం తోచాలి. ఇదంతా జ్ఞానమే కదా !

అంతేకాదు ఆ వస్తువు మనకు అవసరమా? కాదా ? లేక ఎవరైనా సరే తప్పక సాధించవలసిన అవసర ముంటుందా ? ఇవన్నీ తెలిపేదే జ్ఞానం. ఇలాంటి ప్రశ్నలను అనుబంధ చతుష్టయంగా వేదాంతం చెబుతుంది.

            (1) విషయం (2) సంబంధం (3) ప్రయోజనం (4) అధికారి

ఇక్కడ విషయం అంటే భక్తి విషయం. దీని లక్ష్యంగా భగవదను భూతి సిద్ధిస్తుంది. సంబంధం అంటే మానవులందరికీ సంబంధించిందే ఈ భక్తి విషయం. అయితే మాత్రం, భక్తి సాధన చేయవలసిన అవసరమేమున్నది ? ప్రయోజన మున్నది గనుక చేయాలి.

ఆ ప్రయోజనం వద్దనుకుంటే మరిన్ని జన్మలలో తిరు గాడుతూ కష్టాలు, బాధలు, వ్యాధులు, దరిద్రం, వృద్ధాప్య బాధలు, మరణ  బాధ, గర్భస్థ నరకం మొదలగునవి తప్పవు. వీటినుండి విముక్తి కావటమే ప్రయోజనం.

భగవంతుని చిన్న చిన్న కోరికలను తీర్చమని అడగటం కంటే ఆయనలో ఐక్యత చెందేటందుకు  ఆయన సంపూర్ణ అనుగ్రహాన్ని కోరడం ప్రయోజనం కదా !

            భక్తి మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించాక  దీనికి మానవు లందరూ అర్హులే. అహంకారాదుల అడ్డు తొలగితేగాని భగవదనుగ్రహం లభించదు గనుక, కొంత ముందస్తు సాధన చేయవలసి ఉంటుంది. అవే శమదమాదులు, యమ నియమాదులు. వీటిని సంపాదించినవాడు భక్తి మార్గంలో ప్రవేశించడానికి అధికారి. అయితే బాహ్యభక్తిని వెంటనే ఆరంభించవచ్చును.

క్రమంగా అధికారి అయిునవాడు గౌణభక్తిని ముఖ్య భక్తిగా మార్చుకొనగలుగుతాడు. గమ్యమైనట్టి పరాభక్తిని సిద్ధింపచేసు కొంటాడు. యోగం కూడా అభ్యాసమైతే భగవదనుభూతి చెందడం తేలికవుతుంది.

అంగన్యాస, కరన్యాస, హృదయన్యాస పూర్వకమైన అనుష్ఠానం కూడా పరాభక్తి లక్ష్యంగా చేయవచ్చును. ఆ భగవంతుడిని తన అంగాంగాలయందు భావిస్తూ చివరకు ఏకమొత్తంగా తానే భగవంతుడనే యోగం కలిగితే అదీ యోగ్యతే.

            నారద మహర్షి ప్రకారం భక్తి ప్రధానంగా చేసుకొని జ్ఞానం, యోగం సహాయంగా ఉండాలని నిర్ణయం.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. నారద భక్తి సూత్రాలు - 34 🌹
ప్రథమాధ్యాయం - సూత్రము - 21

🌻 21. యథా వ్రజ గోపికానామ్‌ - 2 🌻

    ‘‘అహో! వీరెంతో ధన్యాత్ములు. వీరు పాలు పితుకుతూ, మజ్జిగ చిలుకుతూ, అన్ని పనులూ చేస్తూ కూడా సర్వావస్థలలోనూ భక్తితో నిండిన హృదయాలతో హరి కీర్తనలు పాడుతూ ఉంటారు. వీరి భక్తి రసం ఆనంద బాష్పాలుగా కారిపోతున్నది. వీరు భగవత్స్మరణ తప్ప మరేమీ ఎరుగరు. వీరిని ఏమని పొగడెదను’’ ?

            గోపికలతో జరిపిన శ్రీకృష్ణ రాసలీల, గోపికల నిష్కపట పరి పూర్ణమైన ప్రేమ, వారి సంసార పరిత్యాగం మొదలగునవి భక్తి సాధకు లందరికీ ఆదర్శ ప్రాయం. నింబార్క, జయదేవ, గౌరాంగ, వల్లభాచార్యుల వంటి వారికి ఆ గోపికల భక్తి ప్రేరణ అయ్యింది. గోపికల భక్తి పరాభక్తియే గాని, తక్కువది కాదు. అది గుణ ప్రేరిత భక్తికాదు. అది పరమాత్మపై కలిగిన ఏకాగ్రతతో కూడిన భావపరమైన సంగత్వం. ఇది జీవేశ్వరైక్యమేగాని, మరొక అర్థం తీయరాదు.

            ఎందుకంటే ప్రాపంచిక వస్తువులపై ఏకాగ్రత బంధహేతువవుతుంది గాని, పరమాత్మపై ఏకాగ్రత అలా కాదు. అది ముక్తిదాయకమవుతుంది.

            ఆ కాలంలో గోపికలు శ్రీకృష్ణుని ముందుగా అతని దేహాన్ని ప్రేమించి, తరువాత అతని కల్యాణ గుణాలకు ఆకర్షితులై, అతని మహత్తును, లీలలుగా చూచి ఆనంద పరవశులై క్రమంగా నిరంతరం హృదయ పూర్వకంగా ప్రేమిస్తూ ఆయనను విడచి ఉండలేని వారుగా తయారయ్యారు. కాని ఈ కాలంలో అది అపవిత్రానికే దారి తీస్తుంది. గోపికల భక్తి మీద ఉన్న సందేహాలను నివృత్తి చేయబోతున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. నారద భక్తి సూత్రాలు - 37 🌹
ప్రథమాధ్యాయం - సూత్రము - 24

🌻 24. నాస్త్యేవ తస్మిన్‌ తత్సుఖ సుఖిత్వమ్‌  - 1 🌻

            అయినా ఆ గోపికాంగనలకు ఆ విధమైన కామ సుఖాసక్తి బొత్తిగా లేదు. ఒకవేళ ఆ గోపికాంగనలు జారాంగనలై ఉంటే స్వార్థంతో వారి సుఖాన్ని మాత్రమే చూచుకునే వారు గాని, వారి ప్రియుని సుఖాన్ని గురించి అంతగా ఆలోచించేవారు కారు. ఇక్కడ చూస్తే శ్రీ కృష్ణుని సౌఖ్యమే వారు కాంక్షిస్తున్నారు. అందుకోసం వారు ఏ త్యాగానికైనా సిద్ధమై ఉన్నారు.

శ్రీకృష్ణ సేవనే స్వధర్మంగా పాటించి, ఆయన సౌఖ్యమే వారి సౌఖ్యంగా భావించారు. వారి వారి కష్ట సుఖాలను కూడా పట్టించుకోలేదు. అందువలన ఆ గోపికాంగనల భక్తి పరాభక్తి క్రిందకే వస్తుంది. ఎందుకంటే ఆ కృష్ణ భక్తిలో ఉండడం వలన వారి వారి అహంకార మమకారాలు వాటికవే వదిలిపోయాయి.

ఇచ్చుటెరుగును ప్రేమయె, ఎంత మాత్రమైన ప్రత్యుపకారంబు నడగకెపుడు      -మెహెర్‌ బాబా

        భగవంతుని యెడల ప్రేమ నిజమైనచో తాను ప్రేమించు చున్నందుకు ప్రత్యుపకారం కోరదు. గోపికలు శ్రీ కృష్ణుని ఏమీ కోరలేదు. తమ ప్రియునికేమివ్వ గలమనే ఆలోచన తప్ప మరే దిగులు లేదు వారిలో.

      దివ్య ప్రియతమునైక్యమనే ధ్యేయమొకటె
 దక్క, తక్కిన కోరికల్‌ తగదు కోర           -మెహెర్‌ బాబా

ఇచ్చుటేగాని కోరడమెరుగని గోపికల గురించి శ్రీ కృష్ణ పరమాత్మయే చెప్పాడు కదా, ఆ గోపికల భక్తికి తాను ఋణగ్రస్తుడయ్యాడని ? ఇక గోపి కాంగనల భక్తిని శంకించనవసరం లేదు.

            ఇంచుక మాయలేక మదినెప్పుడు బాయని భక్తి తోడ వ
            ర్తించుచు నెవ్వడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సే
            వించు నతండు గాంచు నరవింద భవాదులకైన దుర్లభో
            దంచితమైన యా హరి యుదార మహాద్భుత కర్మ మార్గముల్‌ ||                                                                                            -భాగవతం

తా||  మాయ అనగా అజ్ఞానం. అజ్ఞానమనేది కొంచెమైనా ఉండరాదు. అంతా ఈశ్వరుడేననే సర్వాత్మ భావం పూర్తిగా ఉండాలి. ఇట్టి జ్ఞాననిష్ఠకే భక్తి అని పేరు.

            అలాగే గోపికాంగనలు కూడా సర్వత్రా ఆ శ్రీకృష్ణునినే గాంచు చుండేవారు. పరవశించి రాసలీలలో పాల్గొంటూ ''నారీ నారీ నడుమ మురారి''గా, ''హరికి హరికి నడుమ వయ్యారి''గా దర్శించేవారు. ఇదే వారి భక్తి విశేషం.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

 🌹. నారద భక్తి సూత్రాలు - 38 🌹
ప్రథమాధ్యాయం - సూత్రము - 25

🌻. 25. సాతు కర్మ జ్ఞాన యోగేభ్యో ఽప్యధికతరా - 1 🌻

            ఇప్పటిదాకా పరాభక్తి లక్షణం గురించి వివరించడమైనది. ఇక పరాభక్తి యొక్క గొప్పతనం (మహత్వం) తెలుపుచున్నారు.

ఈ పరాభక్తి కర్మ, జ్ఞాన యోగాలు మూడింటికంటె గొప్ప ఫలసిద్ధిగా ఉన్నది.

            జ్ఞాన యోగంలో నిత్యానిత్య వస్తు వివేచనా శక్తి, దానితో ఆత్మానాత్మ వివేకం బాగా పనిచేస్తుంది.

కర్మ యోగంలో లౌకిక పదార్థాల మీద ఇచ్ఛను నిగ్రహించి, కర్మలు చేయడంలో నేను, నాది అనే వాటిని లేకుండా చేసుకునే ప్రయత్నం జరుగుతుంది.

భక్తి యోగంలో భగవంతుడిని ఆయన కల్యాణ గుణాలను కీర్తిస్తూ, అవతారుల సచ్ఛరిత్రలను చదువుతూ వారి లీలలను వింటూ మననం చేస్తూ, గానం చేస్తూ పరవశించడం ద్వారా నేను, నాది నుండి దూరమౌతారు.

            యోగమేదైనా అనుభవం ఒక్కటే. సచ్చిదానందానుభవమే మోక్షమని అద్వైతం, పరమప్రేమ రూపమే మోక్షమని రామానుజ మతం, రాధాకృష్ణుల ప్రేమైక్యతయే మోక్షమని చైతన్యమతం చెప్తున్నాయి.

            సాధక జనులను పెద్దలు మూడు తరగతులుగా విభజన చేశారు.

(1) హృదయ ప్రధానులు అనగా ఆవేశానుభూతిపరులు. వీరికి భక్తి మార్గం చూపబడినది.

(2) బుద్ధి ప్రధానులు. అనగా కేవలం వివేకి అగు మానవులు. వీరికి వివేచనా పూర్వకమైన జ్ఞాన మార్గం చూపబడినది.

(3) హృదయ, బుద్ధి ప్రధానులు. అనగా చురుకైనవారు. వీరు హృదయపు విలువలకు, బుద్ధి సూత్రాలకు మధ్య ఊగులాడుతూ ఉంటారు. ఇట్టి సమ్మిళిత ప్రవృత్తి కలవారికి నిష్కామకర్మ యోగ మార్గం చూపబడింది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

 🌹. నారద భక్తి సూత్రాలు - 39 🌹
ప్రథమాధ్యాయం - సూత్రము - 25

🌻. 25. సాతు కర్మ జ్ఞాన యోగేభ్యో ఽప్యధికతరా - 2 🌻

అన్ని మార్గాలలో భక్తి మార్గం సులభం. ఇది ఎక్కువ మందికి సాధ్యంగా కనిపిస్తుంది. గమ్యమైన మోక్షం అన్ని యోగాలలో ఒక్కటే అయినా సాధన మార్గాలు భిన్నం.

ఒక్కొక్క మార్గం ఒక్కొక్కరికి కష్టమైతే, మరొక్కరికి సులభం అనిపిస్తుంది. భక్తిమార్గం మాత్రం సాధనలోకి వెంటనే ప్రవేశించడం వరకు అందరకూ తేలికే.

సాధన విషయానికి వస్తే అన్ని మార్గాలలోనూ అహంకార, మమకారాలను విడచిపెట్టి సంసార బంధం నుంచి విముక్తి పొందడం తప్పనిసరి. మోక్షం అనేది సాధనకు ఫలం కాదు. సాధనకు ఫలం బంధ విముక్తి.

            బంధ విముక్తికై వారి వారి జన్మాంతర సంస్కారాలను బట్టి కొందరు జ్ఞానమార్గంలోను, మరికొందరు భక్తి మార్గంలోను, ఇంకా కొందరు యోగ మార్గం లోను సాధన చేస్తూ ఉంటారు.

ఎవరికి ఇష్టమైనది వారికి సులభం. ఇష్టం కానిది కష్టం. వీటిలో ఏది గొప్ప మార్గమో నిర్ణయించడం కష్టం.

            పాతంజలి యోగమార్గం చిత్త వృత్తి నిరోధమే ప్రధానమంటుంది. ఇక్కడ బ్రహ్మానందానికి బదులు శూన్యత ఏర్పడుతుంది. దీనిని తమః ప్రధాన సమాధి అని కొందరు అంటారు.

కపిలుని సాంఖ్యం నిత్యమైన ఆత్మయే తానని, అనిత్యమైన దేహేంద్రియాలు తాను కాదని నిర్ణయిస్తుంది. తద్వారా పరోక్ష జ్ఞానం, పాండిత్యం కలుగుతాయి గాని, అపరోక్షానుభూతి కష్టతరమవుతుంది.         

            భక్తి మార్గమైతే అందరికీ అందుబాటులో ఉండి అవగాహన అవుతుంది. హృదయమంతా భగవంతునితో నింపుకోగలిగితే, పారవశ్యంలో దేహాదులను మరిస్తే, భక్తుడు గమ్యం చేరవచ్చు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

. నారద భక్తి సూత్రాలు - 40 🌹
ప్రథమాధ్యాయం - సూత్రము - 25

🌻. 25. సాతు కర్మ జ్ఞాన యోగేభ్యో ఽప్యధికతరా - 3 🌻

అయితే మూడు మార్గాలలో ప్రతి ఒక్క దానికి, ఇతర రెండు మార్గాల సహాయం అవసరమవుతుంది. ఎలాగంటే తత్త్వ విచారణ చేసిన వారికి యోగబలం కూడా ఉంటేనే గాని అపరోక్షానుభూతి కలుగదు. ఇష్టదైవ భక్తికి బదులు గురు భక్తి తీవ్రంగా ఉంటేనే గాని జ్ఞానం సిద్ధించదు.

దీనికి చతుర్విధ గురు శుశ్రూషలు చేయాలి. అవి అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావశుశ్రూష, ఆత్మ శుశ్రూష అని నాలుగు విధాలు. ఈ శుశ్రూషలను బాహ్యార్థంతో గాక అంతరార్థంతో చేయాలి.

గురువంటే సాక్షాత్‌ పరబ్రహ్మ అని తెలియాలి. ఎంత చేసినా, భక్తిలో కలిగే విధంగా ఇతర మార్గాలలో పారవశ్యం లభించదు. దీనికోసం యోగబలం అవసర మవుతుంది.

భక్తి కూడా ప్రధానంగా ఉన్నప్పుడే అపరోక్షానుభూతి కలుగుతుంది. ముందుగా దైవభక్తిలో నిష్ణాతులైన వారే గురు భక్తిలో కుదురుకొనగలరు.

            యోగాభ్యాసం చేసేవారికి మార్గదర్శకులైన గురువు దొరకాలి. అయినా యోగి స్వప్రయత్నంతోనే యోగ సాధన చేయాలి.

అది యోగా భ్యాసకుడి నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. సమాధి స్థితులలో సవితర్క  సమాధితోనో, సవిచార సమాధితోనో ఆగిపోతారు. దీనిని రజః ప్రధాన సమాధి అని కొందరు అంటారు.

            ఇక్కడ తర్కం, విచారణ అనేవి జ్ఞాన మార్గంలో లభించేవి. ఈ రెండింటి ఫలం ఆనందం. ఫలితంగా వచ్చే సానంద సమాధి సిద్ధ వస్తువు కానందున అది మోక్షం కాదు. పైగా చిత్త వృత్తి నిరోధమైతే వచ్చే ప్రశాంతతను ఆత్మానందమని పొరబడతారు.

ఆందోళన కలిగించే వృత్తులు ఆగిపోవడం వలన లభించే ప్రశాంతతను అనుభవిస్తారే గాని, ఆ శూన్యంలో స్వరూప చైతన్యానుభవాన్ని గుర్తించలేరు.

కొందరికి ప్రజ్ఞాత సమాధి కలిగి సూక్ష్మ ప్రపంచానుభవాలు వస్తాయి. అది మోక్షం కాదు. దృశ్యాలు, శబ్దాలువస్తే కూడా అది మోక్షం కాదు.

కొందరు వాటిని భగవత్సా క్షాత్కారంగా భావిస్తారు. ఇవన్నీ సాధకుని ప్రజ్ఞలో కలిగే అనుభవాలు గనుక ప్రజ్ఞాత సమాధులంటారు. ఇవన్నీ సవికల్పమే గాని నిర్వికల్పం కాదు.

మోక్షమంటే సహజ నిర్వికల్ప సమాధి లేక అసంప్రజ్ఞాత సమాధి.  దీనిని సత్వప్రధాన సమాధి అని కొందరు అంటారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. నారద భక్తి సూత్రాలు - 41 🌹
ప్రథమాధ్యాయం - సూత్రము - 25

🌻. 25. సాతు కర్మ జ్ఞాన యోగేభ్యో ఽప్యధికతరా - 4 🌻

దైవభక్తి ఉండి, దైవమంటే ఏమో తెలుసుకున్న జ్ఞానులకు యోగమార్గం సులభం. చిత్తవృత్తులాగిన స్థితిలో జడత్వానికి బదులు స్వీయ చైతన్యానుభవం కలగాలంటే ఇతర మార్గాల సహాయం అవసరమవుతుంది.

స్వామి వివేకానందుల వారిలా అన్నారు. ‘‘భక్తి లేని వేదాంతం వెఱ్ఱియే. వేదాంతం లేని భక్తి మూఢ నమ్మకం మాత్రమే’’.

            భక్తి విషయంలో జ్ఞానం లోపిస్తే అది గౌణభక్తిగా, లేక బాహ్య భక్తిగానే ఉండిపోతుంది. ముఖ్యభక్తిగా మారదు.

భక్తి సాధకులు అహం కారాదుల ప్రతి బంధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన జ్ఞాన సముపార్జన చేయాలి. లేకపోతే బాహ్య భక్తిలో వినోదిస్తూ కాలక్షేపం చేస్తారు.  వీరికి పరాభక్తి సిద్ధించదు.

సాధన చతుష్టయ సంపత్తిలో భాగంగా వివేక వైరాగ్యాలు, శమించడం, దమించడం, ద్వంద్వ రూప ప్రపంచంలో సమదృష్టి మొదలైనవి తెలుసుకుని ఆచరించాలి. అప్పుడే భక్తి సాఫల్యమవుతుంది.

            వీనిని బట్టి తేలిందేమంటే ఏ ఒక్క మార్గం అవలంబించినా ఇతర మార్గాల సహాయం తీసుకొనవలసిన అవసరముంటున్నది. అందువలన ఏది గొప్ప మార్గమనే దానిని అందరికీ సరిపోయేటట్లు నిర్ణయం చేయలేము.

            శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో నిరాకార బ్రహ్మంను సేవించడం కంటే సగుణారాధనయే శ్రేష్ఠమని తెలిపాడు.

నిరాకార బ్రహ్మను జ్ఞాన, యోగ పద్ధతులతో గ్రహించడం శ్రమతో కూడినదని తెలిపాడు. ఈ మూడు మార్గాలలోను దేహాభి మానమే అడ్డుగా నిలుస్తున్నదని తెలుస్తున్నది.

భక్తి మార్గంలో అయితే భక్తుల కర్మలు, కర్మ ఫలితాలు అన్నీ ఆ పరమాత్మకే అర్పిస్తే శీఘ్రమే మోక్ష ప్రాప్తి కలుగు తుంది అని గీతాచార్యులు తెలిపారు.

దీనికోసం అభ్యాస యోగం, అది కుదరకపోతే భగవదర్పిత బుద్ధితో కర్మల నాచరించడం, అదీ వీలుకాకపోతే కర్మ ఫలత్యాగం చేయడం, ఇలా అర్థమయ్యే సాధనలను చేయవలసిన ప్రయత్నాలను భక్తియోగం తెలియచేస్తుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. నారద భక్తి సూత్రాలు - 42 🌹
ప్రథమాధ్యాయం - సూత్రము - 25

🌻. 25. సాతు కర్మ జ్ఞాన యోగేభ్యో ఽప్యధికతరా - 5 🌻

గీతాచార్యులు నుడివిందేమంటే ‘‘తత్త్వం తెలియని అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్ఠం. అట్టి పాండిత్యం కంటె కర్మ ఫలత్యాగం గొప్పది. దానివలన పరమశాంతి లభిస్తుంది.

శరీరాభిమానాన్ని వదలి, త్రిగుణాలతో కూడిన స్వభావాన్ని విడచినవాడు స్థితప్రజ్ఞుడు. అట్టి భక్తుడు అంటే పరమాత్మకు అత్యంత ప్రీతి’’ అని భగవద్గీతలోని భక్తియోగ సారాంశం.

            కనుక సాధకుడు ఏ మార్గంలో తన సాధన మొదలుపెట్టినా ఫలితం ప్రాప్తించే సమయానికి ఇతర యోగాలు కూడా కలసిపోతాయి. చివరకు మోక్షం అనేది అందరికీ ఒక్కటే. అయితే పరాభక్తి గొప్పదిగా నారద మహర్షి ప్రశంసిస్తారు.

        వశిష్ఠులవారు అన్ని యోగాలు వివరించి, స్వీయ మార్గం జ్ఞానమని చెప్తారు. శ్రీరామునికి కూడా ఆ జ్ఞాన మార్గమే సరిపోతుందని బోధించారు. ఏది గొప్పది అని మాత్రం వశిష్ఠులవారు తేల్చి చెప్పలేదు.

     శ్రీ సీతారామాంజనేయ సంవాదం అనే గ్రంథంలో శ్రీ సీతారాములు శ్రీ ఆంజనేయుల వారికి సాంఖ్య తారక అమనస్క యోగాలను నేర్పి, భక్త ఆంజనేయుని పరబ్రహ్మ స్వరూపంగా ఆరూఢం చేశారు.

      శ్లో||  దేహ బుద్ధ్యా-స్మి దాసోహం
            జీవబుద్ధ్ద్యాత్మ త్వదంశకః
            ఆత్మ బుద్ధ్యా త్వమేవాహమితి
            మేనిశ్చితా మతిః ||

తా||  దేహబుద్ధితో కూడిన ఆంజనేయుడు భగవంతునికి దాసుడు. జీవ బుద్ధితో కూడిన ఆంజనేయుడు భగవంతుని అంశగా భావించి ఆ భగవంతునితో సమాన మంటున్నాడు.

ఆత్మ బుద్ధితో కూడినప్పుడు ఆంజనేయుడు ఆ శ్రీరామునికంటే వేరుకాదు. ఇద్దరని లేకుండా ఒక్కటైన పరబ్రహ్మ స్వరూపమనేది శ్రీ ఆంజనేయుని స్వస్వరూపం.

            అత్రచ ప్రథమమ్‌ మహత్సేవ తతస్తద్ధర్మ శ్రద్ధా
            తతో భగవత్కథా శ్రవణమ్‌ తతో భగవతి రతిః తయాచ
            దేహద్వయ వివిక్తాత్మ జ్ఞానమ్‌ తతో దృఢభక్తిః
            తతో భగవతత్త్వ విజ్ఞానమ్‌ తత స్సర్వజ్ఞత్వాది గుణావిర్భావః ||

తా||  శ్రద్ధ అంటే కర్మ యోగం. తరువాతే భగవద్రతి అనగా భక్తి యోగం. తరువాత దేహ ద్వయ వివిక్త ఆత్మజ్ఞానం. ఇది జ్ఞాన యోగం. తరువాత దృఢ భక్తి. ఇది జ్ఞాననిష్ఠ లేక అనన్య భక్తి. సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వాలు ముక్తుడికి పై క్రమంలో అయత్నంగా సిద్ధిస్తాయి.

            ఇక్కడ అన్ని యోగాలు అవసరంగా కనిపిస్తూ చివరకు అన్నీ సాధకుడిలో అప్రయత్నంగా జరిగి, ముక్తికి దారి తీస్తున్నట్లు శ్రీధరాచార్యులు వివరించారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. నారద భక్తి సూత్రాలు - 43 🌹
ప్రథమాధ్యాయం - సూత్రము - 26

🌻 26. ఫలరూపత్వాత్‌ 🌻

            పరాభక్తి అంటే సాధించగా వచ్చే ఫలితం కాదు. దానికదే ఫలరూపంగా ఉన్నది. అది సిద్ధమే గాని సాధ్యంగా వచ్చేది కాదు.

            ఈ పరాభక్తి సిద్ధించే వరకే ఏ యోగమైనా. అది సిద్ధించడానికి ఒక మెట్టు క్రిందితో యోగాలన్నీ ఆగిపోతాయి.

అనగా యోగాలు, సాధనలు, వాటి ఫలితాలు భక్తుడిని పరాభక్తి అనే అనుభూతికి సంసిద్ధ పరుస్తాయే గాని, సాధనల ఫలితం పరాభక్తి కాదు.

సాధనలన్నీ పరాభక్తి లక్ష్యంగా అహంకారాదుల అడ్డు తొలగించే ఉపాయాలుగా అవసరమౌతాయి. పరా భక్తికి ఒక మెట్టు క్రింద కలిగే ముఖ్యభక్తికి తీసుకొని వెళ్తాయి.

పరాభక్తి మాత్రం సిద్ధ వస్తువు. అది ఎప్పటినుండో, ఎట్టి మార్పు లేకుండా ఉన్నదున్నట్లున్నదే. కొన్ని అవాంతర కారణాల వలన భక్తుడికి తెలియబడలేదు.

తెలియబడటంలో జాప్యమేగాని అన్ని విధాలైన అడ్డంకులను తొలగించుకుంటూ పోయేవరకు మొదట అది లేదన్నట్లుండి, అడ్డు తొలగిన వెంటనే అది అలాగే, అక్కడే సాక్షాత్కరించినట్లైంది.

తెర వెనుకనే ఉండి, తెర తీయగానే దర్శనమైనట్లు, అది ఆద్యంతాలు లేక సిద్ధమై ఉన్నది. అన్ని సాధనలూ తెరలు తొలగించడానికే గాని, పరాభక్తిని పొందడానికి కాదు. తెర చినిగితే అది ఉండనే ఉన్నది.

అందువలన పరాభక్తిని ఫల రూపంగానే చెప్తున్నారు. పరాభక్తికి ప్రాప్తి, అప్రాప్తి అని లేదు. దానిని స్వతఃసిద్ధం అంటే సరిపోతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. నారద భక్తి సూత్రాలు - 44 🌹
ప్రథమాధ్యాయం - సూత్రము - 27

🌻 27. ఈశ్వర రస్యాప్యభిమాన ద్వేషిత్వాత్‌ దైన్య ప్రియత్వాత్‌ - 1 🌻

            ఈశ్వరుడు భక్తుడిని అనుగ్రహించడానికి భక్తుని యెడల ప్రత్యేకంగా అభిమానంగాని, ద్వేషంగాని ఉండవు.

ఈశ్వరునికి పక్షపాత బుద్ధి ఉంటే ఆయనను ఈశ్వరుడని ఎందుకంటాం ? భక్తులు మాత్రం దైన్య స్థితిని బట్టి గాని, ప్రీతిని బట్టిని గాని ఈశ్వరుని మీద అటువంటి పక్షపాతాన్ని ఆరోపిస్తూ ఉంటారు.

            నిజానికి భగవదనుగ్రహం సదా సర్వత్రా సహజంగానే ఉంటుంది. ఆ అనుగ్రహాన్ని పొందడానికి భక్తుడు తనలోనే ఉన్న అహంకారాదుల అడ్డు తొలగించు కుంటే భగవదనుగ్రహానికి పాత్రుడవుతాడు. అడ్డు తెరలను తొలగించుకుంటే ఈశ్వరానుగ్రహం సహజంగానే లభిస్తుంది.

 మానవ అనుగ్రహం కావాలంటే చేయవలసిన పనులు మనకు తెలుసు. అటువంటివన్నీ అహంకారాదులతో, స్వార్థంతో కూడుకొని ఉంటాయి.

ఈశ్వరానుగ్రహానికి ఏమీ చేయనవసరం లేదు. భక్తులందరికీ ఒకే ఒక్క నియమం. అదేమంటే వారి వారి అహంకార మమ కారాలను వదలాలి.

వస్తువుల మీద,  విషయాల మీద ఆసక్తిని వదలి, సర్వమూ ఈశ్వరమయంగా చూడగలిగిన భక్తిని కలిగి ఉండటమే వారి అర్హత.

అహము, ఆత్మాభిమానమ్ము లణగియున్న
మనసుకే, భగవానుడు కనబడును.                  -మెహెర్‌ బాబా

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. నారద భక్తి సూత్రాలు - 45 🌹
థమాధ్యాయం - సూత్రము - 27

🌻 27. ఈశ్వర రస్యాప్యభిమాన ద్వేషిత్వాత్‌ దైన్య ప్రియత్వాత్‌ - 2 🌻

అహంకారాదులను నశింపజేయడానికి ఉపాయం జ్ఞాన బోధలో దొరుకుతుంది. నేను నాది అనేవి పోవాలంటే శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానాలు కావాలి.

భగవంతుని ఆలంబనగా చేసుకొని బాహ్య ఇంద్రియాలను విషయాలపైకి పోనివ్వకుండా నిగ్రహించడం దమమనబడుతుంది.

ఈ నిగ్రహం సహజమై, మనోబుద్ధులు నిశ్చలమవడం శమమనబడుతుంది. శత్రు మిత్ర భేదం లేకుండా అందరిమీద నిస్వార్థ, నిష్పక్షపాత బుద్ధిని కలిగియుండడం తితిక్ష అనబడుతుంది.

దీనిని సమదృష్టి అనిగాని, అంతా ఈశ్వర మయంగా చూడడమనిగాని వర్ణించవచ్చును. ఇట్టి సమదృష్టిని సాధించడానికి ఉపాయంగా నిత్యం తన మనసును ఈశ్వర చింతనలో ఉంచి, లగ్నం చేసి, ఆనంద పడడం ఉపరతి అనబడుతుంది.

భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడనే విశ్వాసం, శ్రద్ధ అవుతుంది. ఆ భగవంతునిచే పొందదగిన అనుభవాన్ని పొందడానికి భక్తుడు చేసే సాధన నిజాయితీతో కూడుకొని కాపట్యం లేకుండడాన్ని సమాధానమంటారు. పరాభక్తి లక్ష్యం ఎంత తీవ్రంగా ఉంటుందో అట్టి తీవ్రతయే మోక్షేచ్ఛ.

            అంతేగాని, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి తగిన సాధన చేయ కుండా ఈశ్వరునికే పక్షపాత బుద్ధిని అంటగట్టడం అవివేక మవుతుంది. ఈశ్వర కృప అపారం.

అది ఎల్లప్పుడు వర్షిస్తూనే ఉంటుంది. భక్తుడి పాత్ర తెరచి ఉంటే అది కృపావర్షంతో నిండుతుంది. బోర్లించిన కుండ నిండదు కదా ?

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. నారద భక్తి సూత్రాలు - 47 🌹
ప్రథమాధ్యాయం - సూత్రము - 27

🌻 27. ఈశ్వర రస్యాప్యభిమాన ద్వేషిత్వాత్‌ దైన్య ప్రియత్వాత్‌ - 4 🌻

ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని మన తలపులలో, మాటలలో, చేతలలో మన వలన ఎవరికీ కీడు కలుగరాదు. ఇదే అహింస. అబద్ధమాడరాదు.

ఇతరుల వస్తువులను, శ్రమను దోచుకొనరాదు. అవినీతి, అక్రమ చర్యలు మానాలి. పరస్త్రీని తల్లివలె భావించాలి. సకల జీవరాసుల యెడల దయ కలిగి ఉండాలి. ఎట్టి దాపరికం లేకుండా నిజాయితీగా ఉండాలి.

 ఎవరెంత రెచ్చగొట్టినా ఓర్పు నశించక, సత్వ గుణంలోనే ఉండాలి. భేద భావన, శత్రు భావన మనలో ప్రవేశించరాదు. అరిషడ్వర్గాన్ని జయించి స్థైర్యం, ధైర్యం, నిగ్రహం సాధించాలి.

మితాహారం, హితాహారం భుజించడం. బ్రతుకుట కొరకే తినుట గాని, తినుట కొరకు బ్రతుకుట కాదు. జిహ్వ చాపల్యం పనికిరాదు. భక్తి సాధనలో ఏకాగ్రత కుదురుటకు మన లోపల, బయట శుచిగా ఉండాలి.

2. నియమం : నియమమనగా నిరంతరం భగవచ్చింతన చేయడం, ప్రాపంచిక విషయాలను ఇష్టంగా చూడక, తప్పదు కదా అని పట్టించుకోవడం. అయ్యప్ప దీక్ష ఉద్దేశ్యం అదే. మనలోని కల్మషాలను తొలగించాలనే దీక్షను చేపట్టాలి. దాని కొరకు కొన్ని సత్కార్యాలు ఆచరించాలి.

భాగవతోత్తములను, ఆచార్యులను చేరి సత్సంగం చేయాలి. వారి ఆజ్ఞలను, సూచనలను పాటించాలి. స్వార్థం, అహంకారం మనలో వ్యక్తం కాకుండా చూచుకోవాలి. అదే తపస్సు.

 ప్రాప్తించిన దానితో సంతోషపడి తృప్తిగా ఉండాలి. ఎంత కష్టపడినా లభించకపోతే, దుఃఖపడరాదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
writer 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ, selkarana Mallapragada ramakrishna 

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ