. చేయవలసినది- చేయదలచినది



. చేయవలసినది- చేయదలచినది - 1 🌻

ఆరాధన కాకుండా మనం చేసే పని జీవితంలో ఉండరాదు. మనం ఇతర జాతులను చూసినట్లయితే అక్కడ ఆరాధనే విశేషమే కనిపిస్తూ ఉంటుంది. 

సామాన్యంగా తెల్లజాతులలో 24 గంటలు వాళ్ళచేసే వ్యాపారం గానీ, వృత్తి గానీ సంఘానికి అంకితంగా, సంకేతంగా, ఆరాధనా విశేషంగా చేయటం ప్రారంభం చేశారు. అందుకని ఆరాధన విశేషాన్ని పునరుద్ధరించుట కొరకు భారతదేశంలో 19వ శతాబ్ధి నుండి మళ్ళీ చాలా చక్కని ప్రయత్నం చేస్తున్న మహాభావులనే పరమగురువులు అని అంటారు. 

వారిలో ముఖ్యంగా ఇద్దరు ఇప్పటికి 5 వేల సంవత్సరాల నుండి ఇప్పటివరకు అఖండమైన కృషి ధర్మసంస్థాపనకై చేస్తూ ఉన్నారు. వారే మరువు మహర్షి, దేవాపి మహర్షి. 

19వ శతాబ్ధి చివరలో 20వ శతాబ్ది ప్రారంభంలో (తమకు ఉన్న) భౌతిక శరీరంతో Master MORYA, Master KOOT HOOMI అనే పేర్లతో ఉండిరి‌. 

హిమాలయములలోని ఒక చిన్న గ్రామము నందుండి వారి శిష్యుడైన జ్వాలాకూలుడను మహనీయుని ద్వారా వాళ్ళు బ్రహ్మ విద్యా సర్వస్వమును వ్యాప్తి చేసి మళ్ళా క్రమశిక్షణను ప్రపంచంలో స్థాపించటానికి ఇచ్చారు. 

ఆ ఇచ్చిన మార్గం వేద, ఉపనిషత్ గీతాసమ్మతమైనది. దీనిని సకల జగత్తుకి‌ ఇచ్చిన ఫలితంగా ఈ రోజున పాశ్చాత్య దేశములలో కొన్ని లక్షల మంది అఖండంగా అనుసరణం ఆచరణం చేస్తూ ఉన్నారు..

🌻. చేయవలసినది- చేయదలచినది - 4 🌻

మళ్ళీ క్రమశిక్షణ మనం స్థాపనం చేసుకోవాలి. దాని కొరకు మనం ఒక Time పెట్టుకోవాలి. దీని కోసం మన సంస్థవారు యువకులంతా కలిసి మాస్టరు సి.వి.వి. గారు చెప్పిన ప్రకారం ఒక కాలమును నిర్ణయించుకున్నారు. 

ఉదయం 6.00 గంటల నుండి మీ ఇష్టం వచ్చినంత సేపు సాయంత్రం 6.00 గంటల నుండి మీ ఇష్టం వచ్చినంత సేపు అనుష్ఠానం చేసికొంటూ ఉండండి. (అని నియమం) ఈ సంస్థ యువకులలోంచి బయలు దేరి ఇన్ని దేశాలలోను స్థాపింపబడినది. 

ఈ సంస్థ ఇప్పుడు భారతదేశంలోనే కాక ఫ్రాన్స్, బెల్జియం, హాలండ్, స్విట్లర్లాండ్, వెస్ట్ జర్మనీ, స్కాండినేవియన్ దేశాలలో అనగా డెన్మార్క్ మొదలయిన దేశాలలో కూడా ఉన్నది. ఈ దేశాలన్నింటిలోను స్థానికమైన కాలమానం ప్రకారం ఉదయం, సాయంకాలం 6.00 గంటలకు ప్రార్థన చేసికొంటున్నారు. 

ఈ ప్రార్థన చేసికొనేటప్పుడు కూర్చున్న తరువాత ముందు 'ఓంకారము' మూడు పర్యాయములు చేసి తరువాత గురుస్తోత్రం చేసికోవాలి. 

తరువాత గాయత్రీ మంత్రం పదిమారులు సస్వరంగా కంఠమెత్తి ముక్తకంఠంగా ఉచ్చారణ చేసికొనవలసినది. అది అయిన తరువాత గురుశిష్య సంబంధాన్ని స్థాపించు "శంనో మిత్రః శంవరుణః" అను మంత్రమును ఉచ్చరించవలెను. 

తరువాత జ్వాలాకూల మహర్షి యావత్ర్పపంచమునకు బ్రహ్మ విద్యా సమన్వయం చేయటం కోసం, ఒక సుప్రభాతం (Invocation) అనునది ఇచ్చారు. ఆ Invocation‌ ని ఉదయం పూట చేసికొనవలసినది. తరువాత నేను ఒక Invocation ఇచ్చాను. వీటిని ఇన్ని దేశాల వారు ఒక Standard క్రింద పెట్టుకున్నారు. 

దీనిని అనుష్ఠానం చేసికొనునపుడు ప్రతి ఇంటిలోను ఒక దేవుని మందిరం ఏర్పాటు చేసికొనవలసినది. దేవుని ఏర్పాటు చేసికొన్న స్థానం (ప్రదేశం) ఒకటి తప్పనిసరిగా ఉండాలి. అని ఇన్ని దేశాల వారు నియమంగా పెట్టుకున్నారు.

🌻. చేయవలసినది- చేయదలచినది - 5 🌻

ప్రతి ఇంటిలోను ఒక దేవుని మందిరం ఏర్పాటు చేసికొనవలసినది. దేవుని ఏర్పాటు చేసికొన్న స్థానం (ప్రదేశం) ఒకటి తప్పనిసరిగా ఉండాలి. అని ఇన్ని దేశాల వారు నియమంగా పెట్టుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మన దేశంలోను దేవుని గూర్చి సాధన‌ లేని ఇళ్ళుకూడా కొన్ని ఉన్నాయి. నాస్తికుల విషయం నేను చెప్పటం లేదు. నాస్తికులకి మనం చెప్పుకొంటున్న దానికి పెద్ద భేదం ఏం లేదు. 

నాస్తికుడు తదేక ధ్యానంతో తన మతాన్ని ఆరాధిస్తున్నాడు కనుక మన కన్నా కొంచెం ఆస్తికుడి క్రిందనే లెక్క అని మనం తెలుసుకోవాలి. ఎందుకనగా ఎప్పుడైతే తదేక నిష్ఠ ఉన్నదో దాని పేరే అస్తికం. ఇప్పుడు ఆస్తికుల కన్నా నాస్తిక మతాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తూన్న వాళ్ళకి తదేక నిష్ఠ, దాని యందు ఆరాధన హెచ్చుగా ఉన్నది కనుక వాళ్ళకు తెలియకుండానే వాళ్ళలో ఆస్తికమతం ఆరంభమవుతూ ఉన్నది. దాని గురించి అనవలసిన విషయం ఏమీ‌‌ లేదు. 

దాన్ని ఎదుర్కొనుటలో పాషండులమవుతూ మన కర్తవ్యం మనం మరచిపోతాం. అది కూడా మనం చేయకూడదు. భగవంతుని లీల అయిన, క్రీడలయిన భాగములుగా ఇన్నింటిని తెలిసికొని ఈ ప్రార్థనను మన దినచర్యలో నిత్యము అనుష్ఠానము చేసికొని అమలుపరచుకొనవలెను.


🌻. చేయవలసినది- చేయదలచినది - 6 🌻

మన నిత్యజీవితంలో మనం ఒకరినొకరం చేసికొనే వాటిలో ఉద్యోగ ధర్మములు, వృత్తి ధర్మములు ఉన్నాయి. వీటిని అనుష్ఠించు కొనేటప్పుడు పెద్దలు పరోపకారమను ప్రక్రియను మనకు ప్రసాదించినారు. 

ఈ పరోపకారము వలననే భగవత్పరమైన ఆరాధనా విశేషం సాధ్యమవుతుంది. దీని ద్వారానే ఆనంద సామ్రాజ్యం స్థాపింపబడుతుంది. 

ప్రార్థన చేసికొనుటగానీ, సాధన చేసికొనుట గానీ, యోగాభ్యాసము గానీ ఒంటరిగా చేయరాదు. 

ఇదికూడా గుర్తుంచుకొనవలెను. ఒక్కడు గదిలో కూర్చుని చేసికొంటే కుండలినీ సిద్ధి అవుతుందని గానీ, మంత్రసిద్ధి అవుతుందని గానీ పొరపాటు పడరాదు. 

మనకు వేదయుగమునందు యజ్ఞాశాలలు కలవు. అందులో పది మంది కూర్చుని చేయు యజ్ఞములు, పరిషత్తులు మొదలగు ఆరాధనా విశేషములు కూడా కలవు. 

ఒక్కడే కూర్చుని మౌనంగా ధ్యానం చేయుట అనునది వేదకాలంలొ ఎక్కడా ఉన్నట్లు మనకు కనిపించదు. 

ఒకవేళ స్నానం చేస్తూ అనుష్ఠానం చేసినా, దోసిలితో నీళ్ళు తీసికొని సూర్యభగవానునికి సమర్పణం చేస్తూ మనసా, వాచా, కర్మణా ముక్తకంఠంతో ఉచ్చరిస్తూ ఆరాధన చేశారు గానీ మనస్సులో మంత్రమును ధ్యానం చేసెననుట వేదకాలములో మనకు ఎక్కడా తెలియరాదు.

🌻. చేయవలసినది- చేయదలచినది - 7 🌻

 కన్నులు మూసికొన్న, ముక్కు మూసికొన్న,ఇంద్రియాల్ని‌ మనస్సులోనికి నిగ్రహించుకొనుటకు, మనస్సును ఆత్మలోకి నిగ్రహించుకొనుటకు సాధన కొరకు మాత్రమే గాని‌ మూసికొనటం కోసం కాదు. 

ఎలా అయితే శరీరం వదిలి నిద్రలో మనం కాలు, చేయి కూడదీసికొనుట కోసం మనలోనికి‌ మనం వెళ్ళిపోతామో, అలాంటిదే కన్నులు మూసికొన్నా, ముక్కులు మూసికొన్నా. 

ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ లీనమైపోవటం ఎక్కడా చెప్పలేదు. ఋషులు చతుర్విధపురుషార్థములు, వాటి సమన్వయము, ధర్మాచరణం, ధర్మాచరణం వలన వచ్చే కామము, దాని వలన వచ్చే అర్థము, త్యాగం చేత పరమేశ్వరుని‌ యందు‌ అర్పణ బుద్ధితో చేయటం వలన వచ్చే మోక్షము గురించి చెప్పారు గానీ ఏదో‌ ఒక స్థితిలో కన్నులు మూసికొని ఉండిపోవటం చెప్పలేదు. 

ప్రార్థన గానీ, అనుష్ఠానం గానీ, నిరంతరం చేస్తూండటం వలన వికాసం చెందుతూ ఉంటూ ఉంటాం. చేస్తూ ఉన్నన్నాళ్ళు వికాసం చెందుతాం, 

చేయటం మానేసిన తరువాత రోజున వికాసం ఆగిపోతుంది. ఎన్ని పదుల సంవత్సరాలు వందల సంవత్సరాలు (జన్మలు) సాధన చేసినా మానేస్తే భ్రష్టుపట్టిపోతాం. 

చేస్తే ఏం వస్తుందనేదేం లేదు. చేస్తూ ఉండటం పరమాత్మ యందు ఉండటం కోసమే. పరమాత్మ యందు ఉండటం మొదలు పెట్టిన తరువాత సాధన చేయకపోవటం ఉండదు. నిరంతరం నిత్యం ఉండేదే సాధన..

🌹 🌹 🌹 🌹 🌹


🌻. చేయవలసినది- చేయదలచినది - 9 🌻 

మానవజీవిత రంగంలో ప్రతి ఒక్కడు పరమాత్మను తనకు సహాయంగా ఆవాహన చేసి తన హృదయంలోనికి ఆహ్వానం చేసికొనుటకు సంకేతంగా మహాభారతంలో ఈ ఘట్టం ఉన్నది. 

శ్రీకృష్ణుని, యుద్ధంలో సహాయమును ఆపేక్షించుట కొరకు అర్జునుడు, దుర్యోధనుడు వస్తారు. దుర్యోధనుడు తలవైపున అర్జునుడు పాదముల వైపున కూర్చొనుట ఈ కథను మనమెరుగుదుము. పాదముల వైపున కూర్చున్నవాడు అనుగ్రహింప బడినాడు. 

పరమాత్మ తన దొంగనిద్రలో నుండి మేల్కొని కనులు తెరిచేటప్పటికి ఎదురుగా కాళ్ళవైపున చూస్తుండగా అర్జునుడు కనబడినాడు. తలవైపున కూర్చున్న దుర్యోధనుడు కనిపించలేదు. అతడు నేను వచ్చానని చెప్పుకోవలసి వచ్చింది. 

నేను వచ్చానని చెప్పుకున్నవాడి గతి యుద్ధంలో ఏమైందో మనం చూశాము గదా! ఈ ప్రపంచంలోకి నేను వచ్చానండోయ్ నేనిది పాస్ అయినాను అది చదువుకున్నాను. నాకు ఆస్తి ఇంత ఉంది. నగరంలో నేనింత‌ మందిని ఎరుగుదును. నాకు హోదా ఇంత ఉంది. నేనింతమందిని కంట్రోల్ చేయగలను అన్నవాడి గతి దుర్యోధనుడి గతే అవుతుంది. ఇది లాభం లేదు. 

కావలసినదల్లా పాదముల దగ్గర కూర్చోగలగటమే. సంఘంలో ఉన్న జీవులను చూచి, వారిలో పరమాత్మను చూచి, తదర్చన బుద్ధితో, తదర్పణబుద్ధితో తన వృత్తి వ్యాపారాదులను ఆరంభించుకొనవలెను. ఇది మహాభారతానికి (మన జీవితానికి మధ్యన) ఉన్న సంకేతం. 

దుర్యోధనునితో పాటు వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణుని ఏమీ కోరలేదు‌ శ్రీకృష్ణుడే "యాదవుల సహాయం కావాలా? నేను ఒక్కడినే కావాలా? అని అడుగుతూ నేను యుద్ధం చేయను అస్ర్తం పట్టను, అని అన్నాడు. "నీ యుద్ధం, సహాయం కాదయ్యా నేను కోరేది. నీవు నా రథమందు వసింపుమయ్య! నందకుమారా యదుభూషణ" అని (అర్జునుడు) కోరాడు‌. కోరగానే కృష్ణుడు యుద్ధంలో రథం మీద కూర్చున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹


🌻. చేయవలసినది- చేయదలచినది - 11 🌻

భగవద్గీతలో "క్షుద్రం హృదయదౌర్బల్యం త్వక్త్వోత్త్విష్ఠ పరంతప" క్షద్రమైన హృదయ దౌర్బల్యమును వదిలి పెట్టి మళ్ళీ నీ కర్తవ్యాన్ని స్వీకరించు అని చెప్పబడిన ఉపదేశాన్ని (ఆదేశంగా) తీసికో. 

ఉత్తిష్ఠ అన్న మాటకు ఎప్పుడయినా అర్థం ఇదే. "మేల్కాంచు, మేల్కాంచు" నిద్ర నుండే కాదు ఏవైతే మనకు ఉండకూడని లక్షణాలు ఉన్నాయో మనం వాటి నుండి మేల్కాంచవలెను. ఈ పదమునే "నిద్ర" అనుదానిగా మనం స్వీకరించవలెను. భగవద్గీతలో కృష్ణుడు అర్జునునకు చేసిన ప్రబోధం ఇదే. 

ఎవరికి ఇది కావాలో వారందూ స్వీకరించినట్లయితే వారితో జాతి మళ్ళీ ప్రారంభమవుతుంది. జాతిలో జనాభా లెక్కలలోనికి వచ్చేవాళ్ళం అందరం భారతీయులం అని అనలేం. భారతజాతి నిర్మాణమునకు ఎవరెవరమయితే పూనుకుంటామో, వాళ్ళమంతా భారతీయులం క్రిందకు వస్తాము. మిగతవాళ్ళమంతా తిండిపోతురాయుళ్ళ క్రిందకు వస్తాము. పెద్దలయిన పరమగురువుల పరమోపదేశం ఏమనగా తన‌ కర్తవ్యం ఎవరితే ఆచరిస్తున్నారో వారే నిజమయిన భారతీయులము. 

మన డిస్పెన్సరీలలో కూడా మన వాళ్ళు ఇదే PRINCIPLE పెట్టుకున్నారు. ఎవరయితే కేవలం మందులు పుచ్చుకోవటమే ‌కాకుండా, మందులు ఇవ్వటం కోసం, హృదయంలో ఉన్న ఆసక్తిని తెలియజేస్తారో వాళ్ళకు ఎల్లప్పుడు ఉపదేశం (మోక్షదాయకమైన) జరుగుతూనే ఉంటుంది. 

మనమెవ్వరమూ చేయనక్కరలేదు పరమాత్మయే చేస్తూ ఉంటాడు, కేవలం మందులు పుచ్చుకొనుట కొరకు ఆ టైముకి వచ్చి వెళ్ళే వాళ్ళు పరీక్షించుటకు వచ్చే పరమాత్మ స్వరూపులు. వాళ్ళ సేవ చేసే వీళ్ళు దీక్షా కంకణ బద్ధులుగా చెప్పబడుదురు..


🌻. చేయవలసినది- చేయదలచినది - 13 🌻

వాడు బాధపడ్తూనే మర్నాడు మళ్ళీ అంతే నంటారా? ఇంక లాభం లేదంటారా?" అని అడిగాడు. "లాభం లేదురా అప్పా మోక్షం రాదు. పోవలసినది బంధం తప్ప రావలసినది మోక్షం కాదు." 

మనం ఏ దరిద్రాలనయితే కొని తెచ్చిపెట్టుకున్నామో, అవి తొలగించుకొనుటే కావాలి కానీ, కొత్తగా వచ్చేదేమీ లేదు. ఇంతకు ముందున్న స్థితినే మోక్షం అని పిలుస్తున్నావు. 

దుఃఖం నీవు తెచ్చుకొని అంతకుముందున్న సవ్యస్థితిని సుఖమని పిలుస్తున్నావు. సుఖం రావాలి. సుఖం రావాలి అని కోరితే వచ్చేదేముంది? (దుఃఖం తప్ప) చోటులో ఇల్లు కట్టుకుని ఇంటిలో చోటు కోసం వెతుక్కుంటుంటే చోటు పరిమితంగానే ఉంటుంది. అంతకు ముందున్నది చోటు. మధ్యన మనం కట్టుకున్నది ఇల్లు. 

మోక్షం వచ్ఛేదేమీ లేదు బంధము పోవటమే కావలసిన స్థితి. మనం సాధన చేస్తున్నప్పుడు ప్రశాంత స్థితికొచ్చిన కొద్దీ వాతావరణము నందు మనస్సు వంగుతుంది. (వాతావరణమునకు మనస్సు లొంగుతుంది.) 

వాతావరణములోని విఘ్నములు తొలగుతాయి. మనకు ఎదుటివాడి వలన ఏం ప్రయోజనముందని అనుకొనిన (కోరిన) కొద్ధీ వాతావరణమునకు (పరిసరములకు) దాస్యం చేయుట సంభవించును. 

ఈ రెండూ ప్రస్తుతం ఉన్న భారతీయుడు తెలిసికొనవలెను. భారతదేశంలో ఉన్న ఎక్కువమందిమి విషాదయోగంలోనే ఉన్నాము. సాంఖ్య యోగం నుండి ప్రారంభించి మోక్ష సన్న్యాసయోగం దాకా రావాలి.

🌹 🌹 🌹 🌹 🌹


🌻. చేయవలసినది- చేయదలచినది - 14 🌻

మొదటలో మనం వైరాగ్యం వచ్చింది మనకు అని అనుకుంటాం. ఈ విషయంలోనే అర్జునుడు కూడా కృష్ణునితో 
"శిష్యస్తేహంశాధి మాం త్వాం ప్రపన్నం" " నీకు నేను శిష్యుడిని నీవు చెప్పినట్లుగా నేను వింటాను. నన్ను శాసించు నేను ప్రసన్నుడిని నీకు శరణాగతుడిని" అని అన్నాడు. 

ఈ మాటలు ఎం తోచనపుడు, బాధగా ఉన్నప్పుడు, చికాకుగా ఉన్నప్పుడు అందరం అంటూనే ఉంటాం "నాకు ఆ పరమాత్మే దిక్కు" అని కూడా అంటూ ఉంటాం. కాని ఇంట్లో ఉన్న వాళ్ళలో ఒకడంటే ఒకడికి పడదు. ఒకళ్ళంటే ఒకడికి పడనపుడు ఇంక ఆ పరమాత్మ దిక్కు ఏమిటి? ఒకళ్ళంటే ఒకడికి పడకుండా ఉండటం, ఒక మతం వాడంటే మరొక మతం వాడికి పడకుండా ఉండటం లాంటిది. 

మళ్ళీ మనకు కొంచెం మంచి‌ రోజులు వచ్చేటపప్పటికి, అవతలివాడి మీద మన అభిప్రాయాలు మనకు (వేరుగా) ఉన్నాయే? అలాంటిది మాకు పరమాత్మయే దిక్కు అనే మాట ఎంతవరకు నిజం? (Correct) మనకు ఎటువంటి అభిప్రాయం లేనపుడు పరమాత్మ దిక్కు అని అర్థం. అప్పుడే నిజంగా మనం పరమాత్మను నమ్మినట్లు. వాడిని (పరమాత్మను) నమ్మాలి. మన‌ జాగ్రత్త మీద మన ప్రయత్నం మీద మనము ఉండాలి. అనంటే అది నమ్మకం ఎలా అవుతూంది? ఇది కూడా తెలిసికోవాలి. 

కనుక శరణాగతి చెందానన్న అర్జునుడు "ఒరేయ్ నువ్వు యుద్ధం చేయరా" కర్మ కన్నా జ్ఞానం గొప్పది అని కృష్ణుడు అనగా,

"జ్యాయాసీ చేత్కర్మణస్తే మతాబుద్ధి ర్జనార్దన  తత్కిం కర్మణే ఘేరామాం నియోజయసికేశవ" 

కర్మకన్నా జ్ఞానం గొప్పదని అన్మావు కదా నన్ను మళ్ళీ ఆ ఘేరమైన కర్మలోనికి ఎందుకు పంపిస్తున్నావు?" అని అడిగాడు.

🌹 🌹 🌹 🌹 🌹







































                   🌹 🌹 🌹 🌹 🌹






Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ