poims

 నేటి పద్యాలు రచన మల్లాప్రగడ 


01.చం.ఋణమనుశేషమున్ మనల శేష ముగాను వసుంధరన్ గతిన్ 

ధనముయు వైరమేయగుట దాస్యముగాను సుఖమ్ము ప్రశ్నగన్ 

మనమను ముప్పు తప్పదయు మార్గముగానులె దుఃఖ భావమున్ 

క్షణమొకయోగ్యతేయగుట క్షామము మార్చెడి శక్తి జీవమున్


02.ఉ.ఏమని చెప్పదా మనసు యెల్లరు కాలము తీర్పులేయగున్ 

 ఆమని చుట్టు తిర్గగల య భ్యసనమ్మగు యెoత మార్పుగన్ 

రాముని చంపి రావణుడు రమ్యముగా నివసించె లంకలోన్ 

 కాముని లీలలే యగుట కామ్యత భావము మాయ కమ్మగన్


03.మ.భగవద్గీతయె ధైర్య మిచ్చెడిదిగాభాగ్యమ్ము జీవమ్ముకున్ 

భగవద్గీతయె ప్రేమ పాశములనేపాఠ్యమ్ము క్షేత్రమ్ముగన్ 

భగవద్గీతయె శాంతి సౌఖ్యములకే బంధమ్ము నిత్యమ్ముగన్ 

భగవద్గీతయె సామ దానమగుటేబాంధవ్య తీర్పే యగున్


04.మ.కరుణాసింధువు దైవ శాస్త్రముననే కాలమ్ము జీవేచ్ఛగన్ 

శరణంవ్యక్తము సర్వమున్ సగుణమైసామర్ధ్య మేతెల్పగన్ 

తరుణధ్యేయము వేద నాదమగుటే తత్త్వమ్ము నిశ్శబ్దమున్ 

మరణంపుట్టుక దైవ నిర్ణయముగా మార్గమ్ము గుర్వేయగున్


05.సుఖమేలప్పుడు చొచ్చుచూ కదలగాసూత్రమ్ము ప్రేమమ్ముగన్ 

ఒకటైరెండుగు వచ్చుబంధువులుగా నొప్పించ యుక్తేదిగన్ 

వికసించే వెలుగైన చీకటిని పిల్చెస్వేచ్ఛ యెందెందుకున్ 

సుఖమేదుఃఖము సర్వ మాయయగుటేముఖ్యమ్ము జీవమ్ముగన్


05.డంభము లేనిజీవనము డాంబిక మైనను చెప్పకుండగన్ 

లంబము నంట యాశలగు లాలన  లోలక మోను లీలగన్ 

రంభను గూడి రాఘవుడు రాజ్యము నేలె విలాస లీలలన్ 

గుంభముగాను నున్న కళ గుర్తులు నెంచెడి పాప పుణ్యమున్


06.చం.గురువుగమిమ్ము నెంచెమది గుర్తులు మాకు ప్రసాదమేయగున్ 

తరువులు మాదిరేబ్రతుకు తప్పు లెరంగ లె నట్టి బుద్ధిగన్ 

పరువు యెదన్న నేస్తమున పాఠ్య ము శక్తినిపెంచు భాషగన్ 

అరువగు పద్య భావముయు నాడిని బట్టియు గీత గుర్వుగన్


07.ఎవ్వరి కెవ్వరో యెరుక యేమని చెప్పెద యేమనస్సగన్ 

సవ్వడి లేనిలోకమిది సాధ్యమనే కన లేని బంధమున్ 

మువ్వల శబ్దమైబ్రతుకు మూల ముపాసన విద్యలేయగున్ 

నవ్వుల కొద్దినాట్యమగు నాడిశుభమ్మగు నేటి జీవమున్


08.చం.తలపుల తాహతేకలలు తాకుట తానుగ చెప్పలేకయున్ 

గెలుపు యనేది సత్యమగు గేలినిచేసెడి బుద్ధి మాధ్యమున్ 

వలపుల వాకిటే బ్రతుకు వాస్తవమే గతి కోర్కెమీరగన్ 

మలుపుల మాయ కమ్ముటయు మంచియు చెడ్డగ మార్చు జీవమున్ 


09. విద్దెలతల్లి నోర్పుగను వెల్లువ శక్తియు కొన్ని మార్గముల్ 

మద్దెల శబ్దమార్పులగు మానస యుక్తిగ నమ్మ గల్గియున్ 

హద్దుల జీవమైనగతి హారతి మాదిరి యర్పనేయగున్ 

సిద్దులు లేకపిల్లలకు సీఘ్రము రక్షణ తల్లియేయగున్ 


ఇంటికి సర్వమున్ మగువ యి ష్టమనస్సును పంచ నేస్తమున్ 

కంటికి వెల్గుగన్ కళల కానుక యేయగుటన్ విధీ 

ఒంటరి గాసమర్ధతతొ నొప్పుసహాయమునిత్యమున్ సుధీ 

ఇంటిన తోడునీడగుచు యిoతిగ శాంతిని పంచ యోగినిన్ 

 

బాలకృష్ణ లీలలు


రాత్రిన బుట్టుకేయగుట రాచరికమ్మున బంధిగాననన్ 

ధాత్రియు యంధకారమగు దారులు గానకచిత్రమున్ గనెన్ 

మైత్రిగ నీలమోహనుడు మైకము గమ్మియు లీల జూపగన్ 

క్షేత్రము మార్చనెంచియు శుక్షేత్రము జేరియు బాలకృష్ణగన్


తొట్టిన చేరిలోపలయు తోడుగ నెవ్వరు లోకరీతిగన్ 

తొట్టియు యెట్టులౌను సరిపోయె డి సామికి చెప్పనేలగన్ 

తొట్టిన నీల మోహనుడు తొంబది లీలలుగాను జూపగన్ 

పట్టిన పట్టువీడకుయు బాలముభా వపు చేష్టలేయగున్


ముగ్గిన కాంతలేకలువ మూర్తిగ జూపుల కేను మోహమున్ 

నెగ్గినవేళనిన్ చురుకు నిష్ఠయమోహము మోక్షమేయగున్ 

తగ్గిన బాలమోహన సుతా మధురమ్మగు నవ్వులేయగున్ 

సిగ్గున గోపకాంతలగు సీఘ్రము పొందిరి కృష్ణ మాయగన్


కంస రాజ్యం 

ఊదరగొట్టు పాలకులు, గోలల నోపగ దుష్ట చేష్ట తా 

సూదినిమోపు భూమియును సూత్రము చోద్యపు బాల హింసయున్ 

సోదర భావమే గనని పొంతన లేకయు పాలనమ్మునన్

 వేదన పర్చ కాలమగు విద్దెల కృష్ణుని వేట రాజ్యమున్


భక్తిగ నిన్నుగొల్వగతి భారము నేరము యేల యీస్థితీ 

భక్తిగ వీడలేనిగతి భాద్యత లేయగు బంధమైవిదీ 

భక్తిగ సూక్తులేతెలుప భయ్యము తోడుగ నీడ నేస్తమున్ 

భక్తిగ క్షేమమివ్వమతి బానిస బత్కగు యేల దైవమా


రంగపురమ్మునా కలువ రక్తిగనే కులశేఖరాఖ్యుడౌ 

చెంగున బౌరులెల్లకళ సీఘ్రము జూపుచు వందనమ్ముగన్ 

జంగము భక్తవత్సలురె జాతర జేయచు కమ్మివేయుచున్ 

సంగతి ఘోషయాత్రలగు సందడి వెల్లువ సాగు చుండగన్


బండిత లోకమే యిది ప్రబంధము తెల్పగ మెత్తునోయగున్ 

చెండిత హావభావములు చింతలు తెచ్చెడు వైనమేమిగన్ 

దండిగ ధర్మమున్ తెలుప స్థైర్యము తోడుత నాకుబుద్దిగన్ 

మెండుగ మార్చదల్చగల మేటిగ సత్యము తెల్ప బూనుచున్


సుందర చంద్రికా వదన సూత్రము సోజ్యము హావ భావమున్ 

ముందర భద్రతామరచి ముఖ్యము మీదయ పొందగోరగన్ 

వంధిత వాదులే వరుస వాకిట లక్షలు తెచ్చి యాగమున్ 

బంధము కోరకే కదల బాధ్యత మీరక తర్గు వైనమున్


చూసిన నమ్మకమ్ముగన జూదము నైనను చెప్పకుండగన్ 

వేసిన రాయి తేలగల విద్దెలు నున్నను గొప్ప చెప్పకన్ 

మేసిన నవ్వుతారని మమేకము మర్చియు యుండుటేలనన్ 

కూసిన కూత కోతులన కూలక తప్పదు జీవితమ్ముగన్


ననచను వచ్చు సోమరి తనమ్మును నిష్ట ప్రయత్న మేయగన్ 

మనసున శాస్త్ర నిశ్చయము మార్గ వితర్క జయమ్ము మూలమున్ 

తనువుగ మౌనమే గతియు తన్మయ వాక్కులునోర్ప విద్యగన్ 

ప్రణమము సౌర్యసంపదయు సాగుమనస్సున దుఃఖశాంతిగన్


చూసిన నమ్మకమ్ముగన జూదము నైనను చెప్పకుండగన్ 

వేసిన రాయి తేలగల విద్దెలు నున్నను గొప్ప చెప్పకన్ 

మేసిన నవ్వుతారని మమేకము మర్చియు యుండు టేలనన్ 

కూసిన కూత కోతులన కూలక తప్పదు జీవితమ్ముగన్


కనులను చూడమై మరుపు కావ్యమువ్రాయ సుహాసినీ మదిన్ 

అణువణువే జపమ్ముగను యాశ్రిత నీడలుగావిలాసినీ 

చనువుగనేసహాయముయు ఛాయలమాదిరిగానుతాపసీ 

వినదగు నెంచ బుద్ధిగను విద్దెలుజూపు కలౌను బ్రహ్మిణీ


"ఇరువది యారె యక్షరము లేలుచు నున్నవి యాంధ్రభాషనున్"

చరితను గుర్తుజేయట నిజాయితిగాను నిజమ్ము భాషగన్ 

కరుణను పెంచ శాంతిగను కాల ప్రభావముగాను విద్దెలన్ 

తరుణమునందున తాప సమాజము రక్షగ యాంద్ర భాషయున్


సరి సరిచేయలేనిదగు సాక్షిగ వర్ణన లెక్క గొప్పదౌ 

పరుల మనస్సునేమరచి పాఠము చెప్పభాష నేర్వగన్ 

వరుసగ వ్రాసి మొత్తమును వాలుగ తెల్ప గ కొన్నిమాత్రమున్ 

ఇరువది యారె యక్షరములేలుచు నున్నవి యాంద్రభాషనున్

నీవుగ చెప్పినామమత నీడల రూపము విశ్వ మందునన్

నీవుగ చెప్ప సత్యమిది నేస్తము మార్చుట లక్షణమ్ముగా

నీవుగ భక్త తత్పరుల నెంచియు శాంతిగ ప్రీతి పాత్రగన్

నీవుగ కోరుచుంటిని మనస్సును సత్యముగా జనార్ధనా


మంచిని పెంచ వంచనను మాపియు సౌఖ్యపు శాంతి నిచ్చుటన్

ఎంచిన లక్ష్య సాధనలను ఎల్లలు దాటక చూప గల్గుటన్

వంచన లేని జీవితము వర్షము మాదిరి కాక శోభగన్

సంచిత భావమే వయసు సేవల భాగ్యమదీ జనార్ధనా


దాహమేయి కుటుంబ ఖర్చులు మార్చలేముయు ఎందుకో

స్నేహమే మది శాంతిసౌఖ్యము సేతు బంధము ఎందుకో

మోహమే ప్రగతీ కధామయ మోక్షమార్గము ఎందుకో

ప్యూహమేయిది నీవు నేర్పిన పూజ్యమేను జనార్ధనా


హంస మేలును చూడలేవు సహించలేవుయు ఎందుకో

మాంస మైనను పక్షియేయది వల్లమాలిన ప్రేమ మీ

మాంస మేలను శ్వేతవర్ణ సమాన పక్షియు నేత్రమై 

హంసవాహన వాగ్దేవీ మది విద్యగాను జనార్ధనా


నీతిలేకను చావలేకను నేతలేయగు ఎందుకో

ఖ్యాతి కోరియు దొడ్డి దారియు కాల మార్పులు ఎందుకో

నేతలే గతి చేపలే యగు నిమ్మ కుండుట ఎందుకో

జాత కమ్మగు కొంగవైనము జాడ్జ్యమేను జనార్ధనా


గృహములేని,కుటుంబమెప్పుడు క్లేశమొందుచు నుండునో

సహనమన్నది లేకపోయిన శాంతిసౌఖ్యములుండవో

యహముచే దిరుగాడువానికి హర్షమెట్టుల గల్గు, నా

యహము వీడి చరించువాడిల నాద్యుడౌను సుధీమణీ!!49


గగనమెయ్యది మానవాళికి, కాదుకాదు,ప్రయత్నమున్

దగునటంచు నొనర్ప బూనుచు దర్లి ముందుకు నేగినన్

ప్రగతితో బయనింత్రునిక్కము లక్ష్యసాధన తోడనో

జగతిలో వరకీర్తి నందెరు చక్కగాను సుధీమణీ!!50


మ.విలువేలేకయు మాటలేల యిక నీ వేమన్న తప్పేయగున్ 
పిలుపే గౌరవమైన నిత్యసుఖమై పీ యూషమై జీవమున్ 
వలపే ప్రేమని యాసయే వలదులే వాశ్చాయ సంజాయి షీ 
పలుకే యిష్టము యాత్మ గౌరవముయే పెంచేటి ప్రేమమ్ముగన్

కోరిక దుఃఖమే ఎగుట కోపము సంతస భోగసంపదన్
చేరిక నోర్పునేర్పుయగు చిత్తము నేస్తముబట్టి జీవమున్ 
దారిక యిచ్చిపుచ్చుకొను దానముధర్మము యెల్లవేళలన్
 తీరిక సేవలే యగుట తీరుగ సౌఖ్యత కాలమేయగున్

పెంచిన తల్లి తండ్రులచె పెళ్లిగ వొప్పియు సంబరమ్ముణన్ 
ఎంచిన భర్త పొందగల యెల్లరుమెచ్చగ పెళ్ళి దీవెనల్ 
సంచిత కొత్తయింటసుఖ సాహససందడి కొత్తకాపురమ్ 
పంచగ ప్రేమపిల్లలగు పాఠములన్నియు గౌరవమ్ముగన్

సంప్రాప్తిస్వర మాయ మోహముగనే సాధ్యమ్ము సర్వమ్ము గన్ 
 ఈప్రాపంచము లో కళే విధిగనే యిచ్చాను సారమ్ముగన్ 
 ఈ ప్రావీణ్యము దేశభక్తిగనుసుధా నిశ్చేష్ట బంధమ్ముగన్ 
 ఈప్రాధాన్యత యే సమానముసుధీ యీతృప్తి ధర్మమ్ముగన్

శా..ప్రశ్నిస్తా నవజీవ మార్గ చదువే ప్రాబల్య మౌనమ్ముగా
ప్రశ్నిస్తా సహనమ్ముగాను బతుకే ప్రాముఖ్య లేదేందుకో
ప్రశ్నిస్తా మమకారమేది మనమౌ ప్రాధాన్యతా లేదులే
ప్రశ్నిస్తా నిజమార్గమేది విధిగా ప్రావీణ్య తా యీశ్వరా

డబ్బుయనేయహమ్ము నటడాంభికవాక్కులు కొత్త పుంతలున్ 
జబ్బుపడేవిధానములు జాతరభావము ఎందుకప్పుడున్
మబ్బులు చీకటేను సినిమా ధనకాంక్షయు  కష్టపెట్టుటన్ 
పబ్బము చిత్రమే నయిన ప్రశ్నల క్షేమము కోరుటేయగున్

ఆపదనున్న బంధములు ఆదరనే గతిలేక జీవమున్ 
ఓపిక గీటు రాయగుట నొప్పులు నెంచక వేదనేయగున్ 
చూపిన ప్రేమ సేవలను చూడని నేస్తము యేలయీగతిన్ 
పాపిగ కర్మజీవమని పాఠము చెప్పెది బంధు వర్గమున్

నీతోవచ్చు మనస్సుయే తెలివియై నీడల్లె వెంటాడుటన్ 
టీతోవచ్చు కవిత్వ మీతనికి పోటీ లేదు ముమ్మాటికీన్ 
నాతో నీతిగనేటి పల్కులుగు బుద్ధీసంఘ క్షేమమ్ముగన్ 
రాతేదైన సహాయసౌఖ్య విధితమ్ రాజ్యమ్ము జీవమ్ముగన్

చలి దుప్పటి కప్పు కొని కలలవాకిట నిలబడి ఉన్నా 
 గిలిగింతలు పెట్టే కొంటె పిచ్చుక ఒకటి కలబడు చున్నా 
 ఇపుడు కలవరింతలేల కలిసిపోయే కాలము ఇదే నన్నా 
బెరుకు వదలి చురుకు చూపులు కలపి పోదామని యున్నా 

చలితాకిడికి బిగుచుకున్న గుప్పిట తెరుపించాలని యున్నా
మనసురాపిడికి మూతబడిన తలుపువలపు తెరవాళన్నా
 ఆశల పల్లకి యెక్కి అనుభవ స్పందనలను తెలపాలన్నా
ఇక కలలు తీర్చ కౌగిలిలో చిక్కి కరిగి పోవాలని యున్నా

యీ మనసు సిధిలం కాకమునుపే చెంతకు చేరి యున్నా 
యీమనిషి శిలజంగామారకముందే తెరతీయాలినియున్నా 
ఆలస్యం ఎందుకు అనుభవం పంచు కుందామని యున్నా 
సుఖ దుఖాల బ్రతుకుతెరువు తెలుసుకోవాలని యున్నా

దుర్భాషే మరిచెన్ సహాయ గతిగన్  సూత్రమ్ము సౌఖ్యమ్ముగన్ 
దౌర్భాగ్యంబున నున్న వారిమనసే ధ్యానంబు గామార్చగన్ 
ఆర్భాటంబుగ నేనుగొల్వ ప్రజక న్యాయంబె చేకూరెడిన్ 
ఆర్భాటం సుఖ దుఃఖ మార్గముగనున్ ఆశ్చర్య జీవమ్ముగన్

*అంశం.. రక్త సంబంధపు బంధు వర్గము* 

కట్టిన తాడుబట్టి కాంచనమాయగ కీడుగా సుమీ 
 పుట్టిన పిల్లలే గనక పూర్వ వాసన మంట గల్పగా 
 చుట్టరికంబు జూచుటయు చోజ్యపు పల్కులు కీచులాటతో 
బట్టకు కూడు గూడుకు స భాధను తెల్పెడి రక్తబంధమున్

సంపద కోరియాసలకు సంబర మైనది వ్యాధి పెర్గగా 
పంపక డబ్బుబట్టితగు పాఠము నేర్వక సంతకమ్ముగన్ 
కంపర బుద్ధిలంచముకు కాలము తిప్ప గతౌను మూర్ఖతన్ 
బంపర బిడ్డలంచముయు బాధ్యత బంధము గుర్తు చేసియున్

క్రీస్తుగ జన్మ భూమిగన కీలక మార్పు జనమ్ము కోరగన్
క్రీస్తుగ దృష్టి దైవమగు కీర్తన జేయగ రక్ష జేయుటన్ 
క్రీస్తుకు వందనంబులన కీర్తికి మూలము ధైర్య సంపదన్ 
క్రీస్తుగ బాధతిర్చగలగు వెళ్తురు సౌఖ్యము పంచె దైవమున్

సాక్షి వినాయకన్ తెలుప సంఘటనే మది వాంఛ లేగతిన్ 
వీక్షన యేనుమాదుకళ వేగమె మాకున కష్టమేయగున్ 
మోక్షము యేనొసంగుటయు మోసము కక్షల మధ్య సాగగన్ 
కక్షల కాలమేయగుట కాలముగాకరుణించు మాయగన్

అంకుర చిత్రమాలికగ ఆశయ సాధన జెప్పి యుండియున్ 
వంకలు లేనిభారతము వాలుగ బిర్దులు యిచ్చియుండగన్ 
అంకిత భావ చిత్రముల అర్థము జెప్పెడి నేస్తమేయగున్ 
శంకర సన్నిధానమున శ్వాముగ మోక్షపు జీవయాత్రయున్

పంతంతో యధరమ్ము పంచవనితేపాఠమ్ము నేర్చేనులే
చెంతాచేరిక సౌఖ్యమేకదలగన్ చిన్మాయ యేజర్గ గన్
చింతాతీర్చగ నవ్వగన్ విధిగనున్ చెల్మీమనోమార్గమున్ 
కాంతాకామ్యముగన్ కళేజపముగన్ కాలమ్ము తీర్పేయగున్


బుద్ధి యన్న పలుకు విన్న బుడత డైన 
చేయు చేష్టలన్నియుచూడు చిత్త మార్పు 
కాననొచ్చు మహిమతోడు కాల మందు 
తేనె బూసిన కత్తి ధాత్రీసురుండు

మనసుకన్నరిపుడుమరియెవ్వరేరోయి
మదినినున్నతలపెమాయసేయి
తలపులెపుడుతెచ్చుతగులాటమింను
అదుపుసేయకున్నహానిగును

సౌఖ్య మివ్వలేని సౌజన్య మెందుకో 
చెప్పలేని బ్రతుకు చేరు వవదు 
జీవుడైన నేమి గీతవాక్కును బట్టి 
విద్య లేని వాడు వింత పశువు

తే.గీ.  తప్పుచేసి తప్పించుకు తిరుగ రాదు 
 అప్పుకూడు మేలుయనియే ఆశపడకు
 చేరి మూర్ఖుని మనసు రంజింప రాదు 
 కాల తీర్పును బట్టియే కాపురమగు

ఉ. భాగ్యము నాది నీ కనుల వాకిట  నిల్చితి చెప్పలేకనున్ 
యోగ్యత కాదుకాదనకు యో ర్వగనుండెడి దారిచూపు సౌ 
భాగ్యము నామనంబుకళ వాక్కునిజంబగు తీరుకూర్చ వై 
రాగ్యము నీదుభక్తిగను రాగము కీర్తన పద్యమేయగున్

ఉ. దిద్దిన వ్రాతగుండ్రమగు తెల్వి మనస్సును పెంచగల్గగన్
హద్దున మాటలున్నను సహాయ తపస్సగు కాలమందునన్ 
పద్దున పాపపుణ్యములు పాశ యశస్సగు యెల్లవేళలన్ 
బుద్దియు శాంతితత్త్వమగు పున్నమి వెన్నెల తీరుయేయగున్

ఉ. సాకుల వల్లసాగిడి సగమ్యము మార్పులు నేర్పులేయగున్ 
ఆకుల చాటుపిందెలు వలె ఆశలు వెల్లువ నిత్యమేయగున్ 
మాకుననున్ననేమియు సమాయలు మర్చెది సత్యమేయనే 
కాకులు పల్కె స్వాగత ముగాదిని నవ్య వసంత మూర్తికిన్

మ. స్వరవేదాంతమదిన్ సమ ర్ధతగనున్ సామర్ధ్యమేభావమున్ 
వరదీక్ష్యత్వము నేమమున్ గనుచు నే వాశ్చల్య సిద్దేంద్రిగన్ 
స్పర సిద్ధాంతము గాను సేవలుగనున్ పాఠ్యమ్ము దేహమ్ముగన్ 
తరమున్ జీవముగన్ సహాయముగనున్ తన్మాయ మార్చేందుకున్  

చం:కలలను తీర్చ చేష్టలకుకాలము జిక్కియు భాధ మార్చ గల్గగన్   
మలుపుల లీల మాత్రమగు మార్గము కృషుడు విశ్వరూపమున్ 
పలుకుల నేస్త మీశ్వరియుపాయము తెల్పుచు కాల నిర్ణయమ్     
తలపులు చెప్ప శీలముయు దాపము దాల్చిన సూత్రధారిగన్ . 

ఉ. ఈశ్వర లీలలేయగుట యిచ్ఛగ వాక్కుల సర్వమేయగున్ 
ఈశ్వరి జిక్కి నేస్తమగు యిష్టగుణింతము మంచి చేయగన్ 
ఈశ్వర పత్నిగా గిరుజ యిల్లు సు శీల ముగాను చెంతనున్ 
ఈశ్వరి మాయయేయగుట యీస్థితి లీల లు యెల్ల వేళలన్  

మ.  రణమౌనే జీవితమ్మున సమా రాజ్యమ్ము కోర్కేయగున్ 
ధ్వని చేతన్ రసభంగమౌను పరమార్ధం బెల్ల వ్యర్థంబుగన్ 
మునివాక్కుల్ విధి యాటలోను గతిగా ముఖ్యమ్ము భోదేయగున్ 
వని తాతృప్తియు పొంద నేస్తముగనున్ వాక్కల్ సయోధ్యమ్ముగన్

చం.  కలియుగలీలలేయగుట కాలమనస్సగు మాయలేయగున్ 
కలసి కుటుంబజీవనము కాల తరంగముగాను స్నేహమున్
కళలగువేళకాలముయు కష్టమునష్టముగాను నోర్పుగన్ 
కలకలనవ్వులేగతియు కాలసమూహముగాను జీవమున్   

ఉ.  అంకుర చిత్రమాలికగ ఆశయ సాధన జెప్పి యుండియున్ 
వంకలు లేనిభారతము వాలుగ బిర్దులు యిచ్చియుండగన్ 
అంకిత భావ చిత్రముల అర్థము జెప్పెడి నేస్తమేయగున్ 
శంకర సన్నిధానమున శ్వాముగ మోక్షపు జీవయాత్రయున్

శా: పంతంతో యధరమ్ము పంచవనితేపాఠమ్ము నేర్చేనులే
చెంతాచేరిక సౌఖ్యమేకదలగన్ చిన్మాయ యేజర్గ గన్
చింతాతీర్చగ నవ్వగన్ విధిగనున్ చెల్మీమనోమార్గమున్ 
కాంతాకామ్యముగన్ కళేజపముగన్ కాలమ్ము తీర్పేయగున్

ఉ.  సంపద కోరియాసలకు సంబర మైనది వ్యాధి పెర్గగా 
పంపక డబ్బుబట్టితగు పాఠము నేర్వక సంతకమ్ముగన్ 
కంపర బుద్ధిలంచముకు కాలము తిప్ప గతౌను మూర్ఖతన్ 
బంపర బిడ్డలంచముయు బాధ్యత బంధము గుర్తు చేసియున్

 అంశం.. రక్త సంబంధపు బంధు వర్గము 

ఉ. కట్టిన తాడుబట్టి కాంచనమాయగ కీడుగా సుమీ 
 పుట్టిన పిల్లలే గనక పూర్వ వాసన మంట గల్పగా 
 చుట్టరికంబు జూచుటయు చోజ్యపు పల్కులు కీచులాటతో 
బట్టకు కూడు గూడుకు స భాధను తెల్పెడి రక్తబంధమున్

ఉ. రంగపురమ్మునా కలువ రక్తిగనే కులశేఖరాఖ్యుడౌ 
చెంగున బౌరులెల్లకళ సీఘ్రము జూపుచు వందనమ్ముగన్ 
జంగము భక్తవత్సలురె జాతర జేయచు కమ్మివేయుచున్ 
సంగతి ఘోషయాత్రలగు సందడి వెల్లువ సాగు చుండగన్

ఉ .బండిత లోకమే యిది ప్రబంధము తెల్పగ మెత్తునోయగున్ 
చెండిత హావభావములు చింతలు తెచ్చెడు వైనమేమిగన్ 
దండిగ ధర్మమున్ తెలుప స్థైర్యము తోడుత నాకుబుద్దిగన్ 
మెండుగ మార్చదల్చగల మేటిగ సత్యము తెల్ప బూనుచున్

ఉ. చూసిన నమ్మకమ్ముగన జూదము నైనను చెప్పకుండగన్ 
వేసిన రాయి తేలగల విద్దెలు నున్నను గొప్ప చెప్పకన్ 
మేసిన నవ్వుతారని మమేకము మర్చియు యుండుటేలనన్ 
కూసిన కూత కోతులన కూలక తప్పదు జీవితమ్ముగన్

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ