భగవద్గీత.. 1


 ప్రాంజలి ప్రభ....శుభోదయం 

గౌరవనీయులైన సభ్యులందరికి తెలియపరుచునది యేమనగా 2018, 2o22, 2024 లో భగవద్గీత ను పద్యాల రూపములో ఆ భగవంతుని సంకల్పము తో వ్రాయటం కొంత జరిగింది. నేడు మరల టైపు చేసి రోజుకు 9 పధ్యాలు తెల్లవారుజామున ప్రతిఒక్కరూ చదువుకొనగలరని వాడ్సప్ గ్రూపుల్లోను, గూగుల్ ఫేస్బుక్ లోను ప్రాంజలిప్రభగా పొందు పరచదలిచాను. భగవద్గీత ను ఎందరో మహానుభావులు వ్రాసినారు. అయినా నాకు నేర్పిన గురువు, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నేను ఆరాధించే సీతా రామాంజనేయ స్వాములను ఆరాధిస్తూ లోగడ వ్రాసినవి ఇప్పుడు టైపు చేసి పెడుతున్నాను (చందస్సులో తప్పులు దొర్లినా తెలపగలరు సరిచేసి ముద్రణచేయించ అని పండితులను ఆర్ధిస్తున్నాను)


మీ 

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ,.

విశ్రాంతి ఘనాంకాధికారి, 

ప్రాంజలి ప్రభ, రచయిత, నిర్మాత 

హైదరాబాద్

*****

అసలు భగవద్గీత ఏం చెబుతుంది?*

-ధర్మాధర్మాల గురించి చెబుతుంది.

-కర్తవ్యం గురించి చెబుతుంది.

-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.

- ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.

-సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.

-ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.

-పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.

=ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.

-జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.

-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.

-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.

-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.

-పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.

-కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.

-నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.


అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం.

 అర్థం చేసుకున్నవారు ధన్యులు.నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.


గీత చదువుకో..... 

నీ రాత మార్చుకో.....

*****

భగవద్గీత అంటే ఏమిటి?

– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?

– రిటైర్‌మెంట్‌ రోజు  సహోద్యోగులు ఇచ్చే బహుమతా?

– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?

– అది కేవలం హిందువులదా?

– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?

కాదు

అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’

 సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి

☆సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం.  గీత చెప్పేదీ  నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.

☆ సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.

ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.*


 ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.*


భగవద్గీత మొదటి అధ్యాయం

 అర్జున విషాద యోగము 


ఉ.ధర్మజు తోడఁ తమ్ములు సుధర్మము తత్త్వము నేల యుండగన్ 

కర్మలనేమి యెంచగల కాలము తోడుగ నేల యుండుటన్ 

ధర్మము నాదు పుత్రుల విధానము సర్వము బోధజేయగ

న్నోర్మిగఁ తెల్పుమా గుణము నున్నతి యుత్సవ యుద్ధ మార్గమున్   (1)


ఉ.అప్పుడు సంజయుండనియె యాసల వెల్లువ గెల్పు కోసమున్ 

తప్పిదమేమి లేనిగతి తన్మయ పాండవ సేనయేననెన్ 


గొప్పగ యెంచియే గురుని వ్యూహము జూపమనన్ సుయోధనుం

డప్పుడు ధైర్యసాహసము గాను రయంబున వేడుకోగనెన్     (2)


హేగురు వర్య జూడుము సహేతువు విద్దెల బుద్ధి శాలిగన్ 

బాగుగ యుద్ధవీరులగు పాండు కుమారుల యుద్ధనీతియున్ 

సాగెడి సైన్య మెల్లరను సాధ్యము నెoతయు నెంచ గల్గుడీ

యోగపు వీరులై విజయ యోగ్యత యంతయు నీదు శక్తియున్ (3)


మెచ్చిన యోధులందరు మమేకగుణాడ్యులు దుష్ట కేతువుల్ 

అచ్చట చేకితానుడు సహాయదృ పండుసుధీర శ్రేష్టులున్ 

తెచ్చి ధనుస్సు లెత్తుచును తీవ్రత కాంక్షగ నుండి రందరున్

వచ్చిన వారినే వధగ వాక్కుల పర్వము క్షేత్రమందునన్(4)


భీమార్జుల్ సమవీరులున్ కళలుగన్ భీభత్స పోరేయగున్ 

సామంతుల్ గణధీరులై సమరమున్ సంగ్రామపృధ్వైనదిన్ 

భూమీసుల్ సహకారవీరులగుటన్ భుద్దీత్వ ధర్మమ్ముగన్ 

ధీమంతుల్ జయవాంఛలే గనగ నీధీరుల్ వివాదమ్మునన్ (5)


ఉ. పాండు కుమారులున్ తమరి పాశమమేమది జూపయుండిరిన్       

పాండవ మద్యమున్ సమయ బాలకుమారులు గానుయుద్ధమున్         

కండబలంబునున్ గలిగి గమ్యనిజంబగు ధైర్య వాక్కులన్

నిండుగ యుద్ధవీరులతొ నిర్ణయ లక్ష్యము పోరుయేయగున్  (6 )


ఉ. ఎందరొ భూసురుల్ కలసి వెల్గుగ యందరు జోరుగుండగన్              

అందరిలోను మిన్నగను నన్నుగ నెంచిన విజ్ఞతేయగున్    

సందడి యుద్ధకారణము షంబున జుట్టెడి వీరులేయగున్ 

గందర గోళమున్ బడితి గావఁగ నాయకు లౌను సైన్యమున్ (7 )


ఉ. మీరలు భీష్మ కర్ణ శృత కీర్తి శతానుడు కుంతి భోజడున్ 

వీర వికర్ణ సౌభద్రుడు విశ్వస శారద మాన్య లేయగున్ 

భూరిశ్ర వుండు నీదు పుత్రులు భూజన దృష్టితొ ధర్మ తేజులున్

వీరులు యేకమై సమయ విద్దెలు చూపు సు క్షేత్రయుద్ధమున్ (8)


ఉ.ఇంకను పెక్కుమంది బల యి చ్ఛవిశారద యుద్ధ కౌసలమ్ 

జంకక నన్ను కోరి తమ జాడలు తెల్పియు ప్రాణ నోడ్డియున్ 

వంకలు లేని యుద్ధకళ వాలుగ సిద్ధము గాను నుండగన్ 

సంకట మేమిలేకయు సహాయము చేసిరి వీర సైనికుల్    (9)


విధేయుడు 

మల్లాప్రగడ రామకృష్ణ 

( యీ పద్యాలు నా ఆలోచన మాత్రమే దయచేసి తప్పులు తెలపండి)

ప్రాంజలి ప్రభ 

భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగము 

 

చం.అపరి మితమ్ముసేన కళ యాసయ లక్ష్యముగాను కౌరవుల్ 

అపజయమేయెరుంగకళ డాదిగ భీష్మ సుయోధ నిల్వగన్ 

నిరతము మేలు జూపుచునె నిర్మల పాండవ సేననిల్వగన్ 

అపజయమౌను సత్యముయు నాదిగ వాక్కులు నమ్ము సైన్యమున్ (10)


ఉ. కావున మీరు ధైర్యము సకాలము తోడుగ నుండ 

గల్గగన్ 

కావగ భీష్మ వెంట కళ కార్య నిర్వాహక మందు తోడుగన్ 

నావిజయంబయే యదియు నాదగు ధైర్యము సంపదేయగున్ 

కావున విశ్వసింతు మది కార్యము యుద్ధము యే జయమ్ముగన్ (11)


ఉ. భీష్మ సుయోధనా పలుకు ప్రీతిగ నెంచియు యుద్ధ భేరీ రో 

చిష్మగ సంతసమ్మును స చిత్తము తెల్పగ ధైర్యమే బలమ్

భీష్ముడు సింహనాదమను భీకర శంఖము పూరణేయగున్      

భీష్ముడు తాను యందరికి పూర్ణయశస్సునె నివ్వ జూపగన్  (12 ) 


అప్పుడె శంఖనాదపు రవమ్ములు తప్పెట శబ్ద భేరిగన్ 

చప్పుడు వాద్యముల్ విను విచిత్రపు భీతిని కల్గచేయుచున్

దప్పుల చప్పుడే గనుము దాహము యుద్ధ కళేసమర్ధతే 

గొప్పగ గెల్పు కోరియును కొండలు పిండిగ చేయ దల్చగన్  (13 )


తెల్లని వెల్గులా రధము తీరిక జాతర యుద్ధమేయగున్ 

నుల్లముగా కిరీటిగను యుండగ ధైర్యము నూరిపోయుచున్ 

నల్లని వాడు కృష్ణుడు సనాతన ధర్మము నిల్ప గల్గగన్                               

చల్లగ శంకకంఠరవ చేష్టలు పెర్గియు యుద్ధ విద్యగన్   (14 )    


కృష్ణుడు పాంచజన్యమను కాలపు శంఖము నూద సాగగన్ 

కృష్ణుడి తోనుయర్జునుడు కాలపు శంఖము పాంచజన్యమున్ 

కృష్ణుడితోను భీముడు సకాలపు శంఖము పౌoడ్ర మేయగున్ 

కృష్ణుడితోను పాండవులు కాలపు శంఖము నూద సాగిరిన్ (15)


కుంతీపుత్రుడు ధర్మరాజు జయమున్ పూజ్యమ్ముగాభావమున్ 

శాంతీయుద్ధముశాఖ నాద నకులున్ సాధ్యా సుఘోషమ్ యనే

బ్రాంతీ తొల్గసహా దెవుండు మణిపుష్పా శంఖ పూరించగన్ 

కుంతీపుత్రుయనంత విజ్జయమున్ పూరించ శంఖమ్ముగన్  (16 )

మ.శరవిద్యామది నేర్చి యున్నటి మహా సౌర్యా శిఖండీగనున్ 

వరపు త్రామది సాత్యకీ భుజబలా కాశీ మహారాజుగన్ 

స్వరమాహత్యముగాయజేయ సు భద్రా పుత్రుండు వేర్వేరుగన్ 

ధరణీతత్త్వము తెల్ప ద్రౌపదియు స్వేతాంబర్యు శంఖo లుదెన్  (17)


చం.అపజయమే మెరుంగకయె సాత్యకిసేవ మహా ప్రభున్ సుధీ 

ధ్రుపద మహాప్రభున్ యపర సూత్రపు యుద్ధ సమర్ధ తా సుధీ 

స్వపరము యుద్ధ కౌసలము సాగుటవిద్యలుగాను యుద్ధమున్ 

అపర సుధీరమందునను యాసలుగాను లె శంఖమూదగన్ (18)

ప్రాంజలి ప్రభ 

భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగము(3) 


ఉ.పాండవ యోధులున్ పలుకు పారుత శంఖపు నాదమేయగున్ 

మెండగు మిన్ను ముట్టగల మానస నాదము భీకరమ్ముగన్ 

మొండి సుయోధనన్ గనుము మేలుకు సేనను తిప్పు చుండగన్ 

గుండెలు ముక్కలేయగుట గుర్తుగ శంఖ నినాదమేయగున్  (19)


ఉ.హేదృత రాష్ట్రనే తెలుపుహేయపు యుద్ధసమమ్ము చూడుమున్ 

మోదము తోడుపార్ధుడు సమోహము తోనుగనే సుసైన్యమున్ 

నాదము జేయుచూధనసు నారిబిగించియు చూచుచుండగన్ 

నీదగు సేననిల్వలగు నీ సుత లెల్లరు చేయు యుద్ధమున్  (20)


శా:: హేకృష్ణా యనుచూకిరీటి పలుకుల్ నేచేయ యుద్ధమ్మునన్ 

హేకృష్ణా యెవరెవ్వరీ బలములన్ నేచూడ ప్రారంభమున్ 

హేకృష్ణా కదనమ్మునందు నిలుపున్ నేసేయ క్షేత్రమ్మునన్ 

హేకృష్ణా నిలబెట్టుమధ్యరధమున్ యేమార్గ యుద్ధమ్మునన్  (21 )  


ఉ. వైరులు నేనుగాగనెద వైనము యేమియు తేల్చగల్లగన్ 

పోరును బెవ్వరో లోనన బుద్ధిగనెంచెడి యుద్ధవీరులన్

వారల నెంచ శక్తిగను వాలును వీలును కల్గ చేయుమున్ 

సారధి మధ్యనే రదము సాగుము చూచెద ఎవ్వరెవ్వరో       (22 )


చం. ఒకపరిచూచెదానడుమ నొక్క విధమ్మును గాంచ యుద్దమున్

సకల సుయోధనాప్రియము సేసెడిరాజులు గాంచ యుద్దమున్ 

నఖశిఖబుద్దిగూర్చుటకు నమ్మకమైనది యుద్ధ క్షేత్రమున్

మకతిక రాజులేకలరు మానసమేను సమమ్ము నెంచెదన్    (23 ) 


సంజయ వ్యాఖ్యానము 


ఉ.దివ్యరధమ్మునే నిలిపె భీష్మసుయోధన ద్రోణ గుర్వులన్ 

భవ్య పథమ్మునే సలిపి బంధన భాద్యత రాజులేయగున్

నవ్య పథమ్మునే కదలి నమ్మకవీరులుఁ కాంచగల్గగన్ 

సవ్యర ధమ్మునే నిలిపె సాధన గుర్తుగ యుద్ధకాలమున్  (24 )


మ.పరికించూ సమయమ్ముగాను సమమౌపాఠ్యమ్ము తెల్పెమ్ దుకున్                                 

కురువిరుల్ జయకాంక్షగాను పరుగే కూర్పౌను నేస్తమ్ముగాఁ 

తరుణమ్మున్ కళ లేవిధీ గమనమే తత్త్వమ్ము వైనమ్ముగాఁ

మరులేగొల్పుచు పాండుమద్యమడు సామర్ధ్యమ్ము చూపేందుకున్ (25 )


ప్రాంజలి ప్రభ 

భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగము(4) 


సమరము సేయ వచ్చిన సుశాఖ జయమ్మును గోరు రాజులున్ 

తమతమబంధుమిత్రులను గాంచశుభమ్ము కష్టమ్ము యే లనున్ 

మమతను జూపవిద్యలన మాయలయుద్ధకలౌను యే లనున్ 

సమతను జూపశోకముయుసాము యిదేమిసుమమ్ము కాంచగన్   (28)


సహబంధుత్వము పోరు సల్ప జయమున్ సాధ్యమ్ము సిద్దేదియున్ 

సహదాహమ్ముయు శోకమేయగుయుటన్ సామమ్ము యేలేమదీ 

సహదేహంశిధిలమ్ముగాను వణ కుల్ సాగేశరీరమ్ముగన్ 

సహవాక్కుల్ గని ధైర్యమున్ సడలుటన్ సంగ్రామ మందున్ మదీ  (29)


ఉ. చర్మతపించగా మనసు జాడ్యము మార్పుకు నీడలేయగున్ 

మర్మము చెప్పకే వదలె మానధనస్సును యప్పుడప్పుడే 

ధర్మము చిత్తమేస్థిరము దరియు లేకయు భ్రాంతిచెందెగా 

కర్మల తోడుగా నిలువకాలము భాదలు వెంట యుండుటన్ (30)


మ. కనుచుంటీ నశుభమ్ముసూచనలుగా కాలమ్ము క్షేత్రమ్ముయున్ 

రణరంగాన మదీయభావములుగారంజిల్లవేయుద్ధమున్ 

మనమేగెల్పులు లాభమేమిగనుచూ మార్గమ్ము ప్రశ్నేయగున్

మనసేమాన్యుగుణమ్ముగాను కళ మాయోను సర్వమ్ముగాఁ (31 )


ఉ. కోరను నేనుగాజయము శోకము తెచ్చెడి యుద్ధమేయిదిన్ 

కొరను రాజ్యమున్ సకల శోభలు సౌఖ్యములన్ని కోరనున్ 

కోరను భోగమేమి యన కోరు మరింకను రాజ్యమెందుకున్ 

పోరును చేయనే యనుచు పొందను కీర్తిని దేని చేతగన్  (32 )


మ. సుఖమేయాసలు మర్చిపోరుగనుటేసూత్రమ్ము గారాజులున్ 

సకలమ్మేభయ మొంది వచ్చెరనియే సేవళ్ళు చేసే విధిన్ 

వికసించేయువవీరులే కదులుటే విద్యార్థులే యుద్దమున్ 

ప్రకటించే విధి రాజులే సమయమే ప్రావీణ్య మేజూపగన్ (౩౩)                       


చం. కలరిటయాసలేవదలి కాలపు గెల్పుయు వోటమేయగున్ 

గలరిట మేధసంపదయు గమ్యముజూప మనస్సు ప్రశ్నగన్ 

గలరిట శక్తిమంతులు సగౌరవమొంది రణమ్ము జేయఁగన్ 

గలరిట వచ్చిరీ ధనమును గాంచియు కొందరుయుండిరేగతిన్ (34)

                   

శా:: ముల్లోకాలు యెకమ్ముగాను కలిసే ముఖ్యమ్ము యన్నా మదీ 

ముల్లోకాలను దిక్కరించదలిచా ముప్పేన రాజ్యమ్మునన్ 

కల్లోలమ్ కదిలించయుద్ధమిదియున్ కష్టమ్ము తెచ్చేదిగన్ 

ఉల్లమ్మున్ కదిలించ రక్త సెలయే రూగుర్తు కొచ్చే సుధీ      (35 )


ఉ.చంపుట పాపమే మనకు చంతన చుట్టము లందరందఱున్ 

కంపుయనేసువాసనను కమ్ముకు పీల్చిన కష్టమేయగున్

దంపుడు మాదిరే మనము దంచిన తప్పును మూట కట్టుటన్ 

సొంపుగ ధార్త్రరాష్ట్రులను సొమ్మును దోచిన తప్పుయేగదా  (36 )


ఉ.చుట్టములౌను కౌరవలు చూపులు కల్పియు యుద్ధమేలనున్ 

జట్టును సంహరించుటయు సాక్షిగ నుండుట యేను తప్పగున్ 

ఎట్టుల జంపగల్గగల యెల్లఁరు నేస్తములౌను యెట్టులన్ 

పట్టున సౌఖ్యమున్ కొరకు పంతము యుద్ధము యేలమానుమున్ (37 )


ఉ.వీఱుకులక్షయమ్ముగను విద్యలు మర్చియు ద్రోహబుద్ధిగన్

వీరులయాసపాసములు విచ్చియు దుర్భరమౌను యేలనున్ 

వారికులమ్ముబంధముల వాక్కులు బుద్దులు మార్పులేయగున్ 

ఘోరమనేక్షయం యగుట గోకుల కృష్ణగ తెల్పుచున్డితిన్   (38 )


మ.జనవాంఛల్ యెఱిఁగేమనం కదలగా జాప్యమ్ము సత్యమ్ముగన్ 

మనచిత్తంబులు మంచినెంచగనునే మార్గమ్ము దారేయగున్

మనబంధుత్వమునే గమించగలిగే మనము తీర్పేయగున్ 

గొనమేదోషము పాపమే యగుటనే గోప్యమ్ము విధ్యే యగున్ (39 ) 


ఉ.ధర్మము నంతరించికళ దానము లేకయు పాపమేయగున్ 

కర్మల బాధ్యతే యగుట కాలమనస్సుయు వక్ర బుద్ధిగన్ 

నిర్మలమైన జీవముయు నీచముగాకధలౌను కాలమున్ 

మర్మము మాయమోహమగు మచ్చను తెచ్చుట యేల యిప్పుడున్ (40 )


కులమునధర్మమంతయుసగూడునులేని పరిస్థితిన్ గతీ

బలముయు తగ్గిభయ్యమను పాఠముగానుజనమ్ము నుండుటన్                    

కులములుయన్నిపాపమనుచూపులుగాను కులస్త్రీలేయగున్ 

తలపులు మారి దోషములు తాపముపెర్గ గలేటి బుద్ధిగన్  (41 )


మ.కులసౌకర్యము లేకజీవ సుఖమే కూలేటి జన్మమ్ముగాఁ  

కులఘాతల్ బ్రతుకే తయారగుటయే మర్మమ్ము గాకర్మగన్   

కులకర్మల్ మరిచే విధీ మలుపుగన్ కూల్చున్ సజీవమ్ముగన్ 

కుల శ్రాద్దక్రియ లన్నివేదనలగున్ చూపుల్ విశేషమ్ముగన్  (42 )


కౌరవసేనవీరులను కౌముది భావము యేల నెంచగన్ 

ధీరత సొంపు గ్రూరతగ ధీరులు క్రూరులు పొంచి యుండగన్ 

బోరనఁ ద్రోవగా రభస  బే-పును జూపుచు రౌద్ర రూపమున్ 

వారు భయంబునే వలసె వాదుల వైనము నేమి చెప్పగన్ (43)


ఉ.పిమ్మట పార్ధుడే యుభయ సేనలయందును మేనమామలున్

ఉమ్మడి యుద్ధమందు గురువుల్ పిన తండ్రులు నెందరెందరున్ 

నమ్మక పౌరులున్ మిత్రులు గా గణ నీయులు యెoదరెందరో            

చెమ్మగ యర్జునున్ కలిగి చింతయు కల్గెను యప్పుడప్పుడున్   (26 )


చం.గురుజనమేనమామలయు గుర్తుకు వచ్చెడి బంధువుల్ సుధీ

వరుసకుసోదరుల్ సుతులుబావలు మామలుగాను యుండిరిన్ 

పరిచయమిత్రులే గనుము పాశము బంధముగాను చూడగన్ 

సరిగమ యుద్ధనేస్తములు సాధ్యపు వారు గనౌను వీరులున్   (27 )


కులధర్మానికి నాశము జ్వరముగన్ కూల్చేటి బుద్ధిగనున్ 

కులమేధావుల శాశ్వతానరకమున్ మూలమ్ము యుద్దమ్ము భా 

ధల వల్లా భయ మౌను స్త్రీల కళలే దారుల్ సమోహమ్ముగన్ 

కలకాలమ్ముయు ప్రాప్తియే నరకమున్ కామ్యమ్ము క్షేత్రమ్ముగన్  (44 )

             

మేథావుల్ గనె చేయు యుద్ధముయుగన్  మోక్షమ్ము యెవ్వారికిన్ 

ఈధర్మమ్ ధరణీ మనస్సుగమనమున్ నేమమ్ము పాపమ్ముగాఁ

హాదారుణ్యతగాను రాజ్యజయముగన్ భావమ్ము ప్రశ్నల్ గనే 

మీదారుల్ గతితప్పినాశమగుటన్ మిధ్యేను యుద్ధముగన్     (45 ) 


ఆయుధ హీణుడై మనసు యాశయ మేవదలేసి యుండఁగన్

సాయుధ సేనయుద్దమును సాధ్యవధింపగు శస్త్ర మేలనిన్ 

నాయువు వీడనున్నమది  హాసము తోడుగ యుద్దమాపితిన్ 

సాయ వధింపుగా యెలను శాస్త్రము శస్త్రము నొప్పకుండగన్  (46 )


సంజయ ఉవాచ 


శోకము విగ్నమాససుడు సోద్యము నంతయు జూడగల్గగన్ 

శోకముతోను బాణములు సోద్యమునత్వజనమ్ము గానుగన్ 

శోకముతోనునే రధము వోర్పుగానే వదలేసి యుండఁగన్ 

శోకవిలాపమే కలిగి సొమ్మను యుద్ధము మను కుండగన్     (47 ) 


"అర్జునవిషాద యోగము " మొదటి అధ్యాయము సమాప్తము


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ