నేటి కవిత్వం - పద్మ మాల 
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

చెప్పవే సాహసం వేటా  
తెల్పవే తాపసీ మాటా
తప్పులే చేయకే వాటా   
ఒప్పుకో మంచిదే బాటా   

పొందు సంతోష సౌందర్యం  
విందు  విశ్వాస  వైరాగ్యం 
సందు దొర్కాక ధీరత్వం 
అందుకే నా సహాయమే 
    
కాలమే వేద మాధుర్యం 
గోలయే జీవ సౌభాగ్యం 
పల్లమె నీటి మార్గత్వం 
ఎల్లలే దేశ  రక్షిత్వం 

సంతసించే సతీ ఉంటే
మంచి మార్గం పతీ ఉంటే
స్వాతి ముత్యం కళా ఉంటే
సంత సమ్మే ను సంసారం 

ఇత్తు నేఁ బద్మమాలల్ నీ   
కిత్తు సద్రత్నమాలల్ నీ
కిత్తు సౌవర్ణమాలల్ నీ   
కిత్తు నీ పద్యమాలల్ శ్రీ

రమ్ము నా కిమ్ము సౌఖ్యమ్మున్
జిమ్మ పీయూషముల్ సొంపై
సొమ్ము లీ జీవితమ్ముల్ బ్రే-
మమ్ముతో నుండఁగా ధాత్రిన్

నీల మేఘమ్ము లీరాత్రిన్
నేల యాకాశమున్ జేరెన్
చాలు నీయాట మాయావీ
బాల గోపాల రావేలా
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:


సర్వేజనా సుఖినోభవంతు

తల్లీ తనయుని సంభాషణ (చందస్సు )

 త్రిష్టుప్పు 1 (చందస్సు )
భారతీ లేక మాలతీ - మ/మ/మ/గగ 
*
రారేమీ  శ్రీవత్సా - కన్నారా రారా 
పేరేమీ చెప్పాలే - బాబూరా రారా 
ఫన్నీరూ పంచూతా - బిడ్డారా రారా
కల్లోలం లేదూరా - తల్లీబాధా రా  

అమ్మానే తప్పేమీ - చెయ్యాలేదమ్మా 
అన్నానూ ఆరోగ్యం - ఓర్పూ లేదమ్మా 
తిట్టానూ కొట్టానూ - మూర్ఖున్నేనమ్మా 
  కన్నీరూ మున్నీరూ -కార్చేస్తున్నానూ 

తప్పేమీ ఒప్పేమీ - కన్నాలేదూరా
కష్టాలే నష్టాలే - వస్తాఈ రారా 
నీ ధ్యేయం నీ గమ్యం - నే నడ్డే కాదే 
నీ సొంతం నీతేజం - నాభాదాతీర్పే 

అమ్మానే ఓడేనే - అందేరే ముందే 
ఆదర్శం ఆనందం -చూపే లేదూలే 
ఆలస్యం ఆయాసం - నన్నే కమ్మేలే 
వద్దామన్నారాలే - నన్నూ క్షమించూ 

ధర్మాన్నీ న్యాయాన్నీ - కాపాడీ రారా 
మర్మాన్నీ దైవాన్నీ - నమ్మాకే రారా 
చర్మాన్ని స్నేహాన్నీ - జాగ్రత్తా రారా 
అన్నాన్నీ వంశాన్నీ - బందంగారారా

తల్లీనీ భాష్పాలే - నన్నూ మార్చేనూ 
నేతప్పూ లేచైనూ - నిన్నూ ప్రేమాతో
పూజిస్తా పోషిస్తా - మన్నించాలమ్మా
నాతప్పూ తెల్సిందీ -వచ్చా క్షమించూ 

నీవురావడం మంచిందిరా 
ఆ అమ్మవారిని పూజించుదాం పదా 
అట్లాగేఅమ్మా

శ్రీవాణీ బ్రహ్మాణీ - చిద్రూపీ రాణీ
శ్రీవిద్యా గీర్దేవీ - శ్వేతాంగీ శ్రేష్ఠా
భావాబ్ధీ వాగ్భామా - భాషాబ్ధీ శాబ్దీ
దేవీ నిన్ బూజింతున్ - దీపమ్మై రావా
 --((*))--
ప్రాంజలి ప్రభ పద్య పుష్పాలు 
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 


నేటి నా కీర్తన    
ప్రాంజలి ప్రభ  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  
సారంగ - త/త/త/త UUI UUI - UUI UUI
12 జగతి 2341

ఏముంది నీలోన - నీసుందరమ్మే న 
వాభ్యుదయామృత - నీ మానసాహిత్య 
సంగీత సౌలభ్య -  సౌందర్య ఉల్లాస 
ఉత్తేజ భావమ్ము - నన్నావ హించేను ..... 1  

ఏనాటి భంధమ్మో - ఈనాడు నీముందు 
నేతాడ లేకున్న - నీవెంత భేదమ్ము   
చూపించినా మాట  - నామమ్ము నీమీద 
యీనాటి కీ మార దంటే మనస్సొప్పు  ...... 2 

ప్రాణమ్ము నీవిందు  - గానమ్ము నీవిందు   
ధ్యానమ్ము నీవిందు - కాలమ్ము నీవిందు 
గాలమ్ము  నీవిందు - నాపంట పండించె  
చాలించు మాయాట -  ఇంకెందుకీ పూట .... 3  
    
మాటల్ వినోదమ్ము - పాటల్ వినోదమ్ము
చేతల్ వినోదమ్ము -  లీలల్ వినోదమ్ము 
నీ రూపు నీలాలు   - నీకళ్ళు వెన్నెల్లు
నాయందు యీపూట - సంతృప్తి కల్పించు .... 4          
         
గోపాల గోపాల - గోవింద గోవింద 
గోపాల గోపాల - గోవింద గోవింద
గోపాల గోపాల - గోవింద గోవింద
--((*))--



నేటి ఛందస్సు - ప్రాంజలి ప్రభ 
రచయత:మల్లప్రగడ రామకృష్ణ  

ఇది చిత్రం కాదు పరిణత చెందిన తరుణి
నీలి కన్నులు గల నీలాలు ఉన్న నీలవేణి
కడలిని కలియుటకు ఉరికే తరంగణి
చిరు నగవులు చిందించు చున్నట్టిఅలివేణి

సౌందర్యానికి వన్నెతెచ్చినట్టి మధురవాణి
వెన్నెల చీరతో పొందికగా ఉండేటి వాహిణి
మనసును ఉల్లాస పరిచే మందార మోహిణి
హావ భావ విణ్యాసాలతో మెరిసే కృష్ణవేణి

పసిడి మేనితో ఉర్రూత లూగించే రత్న గణి
సకల విద్యల్ని భోధన చేసేటి విద్యా వాణి 
సంగీత స్వరాల సాహిత్య సౌందర్య మహారాణి
చిరునవ్వులందిచి మైమరిపించే సుహాసిణి



నేటి నా కవిత - ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ

"కామనిభా" వృత్తము
గణములు - మ,స,త,ల
యతి - 6

కార్యాలంకృత భావా దాయిని 
సామాన్యా సమ వాత్సల్యాన్విత
సాంఘికా సుమ తత్వా నందిని 
ప్రారబ్ధా భవ బాంధవ్యాయిని

ఆరోగ్యామృత విద్యాదాయిని
సంతోషాల నవాభ్యుద్దాయిని   
నీప్రేమా మము సమ్మానింతును 
వీణాధారిణి నిత్యం కొల్తును

ఓంశ్రీరామ్ అనుటే నానిత్యము
శ్రీరామా రమ మామాతా పిత
దీనోద్ధారిణి సేవాలాంకృత
దివ్యానంద మయామాలక్ష్యము
           
--((*))--


సంస్తోత్రంబులు..
-------------------------

"కామనిభా" వృత్తము

గణములు - మ,స,త,ల
యతి - 6

వీణాధారిణి విద్యాదాయిని
వాణీ రూపిణి వాత్సల్యాన్విత
యేణీలోచన హృత్పద్మాసని
జ్ఞానాకారను సమ్మానింతును

తానే నేనను దాక్షిణ్యాకృతి
గానానందిని కావ్యాలంకృత
దీనోద్ధారిణి దివ్యాకారిణి
శ్రీ నాదాత్మను జెల్వన్‌ గొల్తును

వాగీశానిగఁ బ్రఖ్యాతంబయి
రాగోల్లాసిగ రంజింపన్‌ మది
వేగంబొప్పగ వృత్తాలందిడు
నా గీర్వాణికి నా కైమోడ్పులు

కారుణ్యాంబుధి కైవల్యప్రద
శ్రీరామా మణి శ్రీ మాహేశ్వరి
వీరారాధిత విశ్వేశప్రియ
శ్రీ రాజేశికిఁ జేతున్‌ జోతలు

సర్వశ్రేష్ఠయు సర్వంబైనది
సర్వాభీష్టద సర్వజ్ఞప్రియ
సర్వాకారిణి సర్వాధారకు
సర్వేశానికి సంస్తోత్రంబులు



నేటి కవిత 
ప్రాంజలి ప్రభ (ఛందస్సు)
తరుణం 

సమస్త జీవకోటిని ఉత్తేజ పరచే 
అనంత సౌఖ్యమిచ్చుట కాలాల మనసే
అనూష్య ప్రేమ తాపసి ఉత్తేజ పరిచే 
విశేష లోకమాయని తప్పించు మనసే 

విశాల ప్రాణ కోటికి ఉత్తేజ పరిచే 
సుఖాల విశ్వమయంచె ఆరాట మనసే 
వికాస తేజమిచ్చుట ఉత్తేజ పరిచే 
శుభాల కోప తాపము తప్పించు మనసే                                  
అకాల మృత్య దారికి ఉత్తేజ పరిచే 
మనో వికాస ఆశకు ఊహించు తరుణం 
సకాల ఊహ కోరిక ఉత్తేజ పరిచే
వినోద భావ వేడుక ఊరించు తరుణం   

--(*)--


ప్రాంజలి ప్రభ - నేటి కవిత
ఛందస్సు
(ప్రియుడు ప్రేయసితో పలికిన పల్కులు)

వేరొక భావము లేదియును
ఉన్నది చెప్పెద నీకియును
లేనిది చెప్పుట వద్దనకు
చెప్పుడు మాటలు నమ్మకము

వేచెద నిచ్చట నీకొరకు
చూపెద అంతయు కానుకను
వాదన వేదన ఎందుకులె   
కాలము గాళము నీకొరకు

చూచెద వంతయు వేడుకలొ  
తొందర చేయుము ఇక్కడకు
వద్దని రానని చెప్పకము
ఉన్నది పుచ్చుకొ అందరిలొ

ఊహకు అందని మార్పులను
చూచెద ఇప్పుడు చేష్టలను
కాచెద నిన్నియు ఇప్పుడును 
తప్పక చూపెద ఎప్పుడును
 
పుట్టిన రోజున అంతయును
పండుగ చేయుట సంతసము
ఆకలి తీర్చుట నేర్పెదను
దాహము తాపము తీర్చెదను

--((*))--


నేటి కవిత -1 
 (ఛందస్సు)  
కొత్త వృత్తము (telugu నేర్చుకోనేవారికి )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఘధ్వనిపూర - త/య/మ/గగ UUII UU - UUU UU 

సౌందర్యము సాహిత్యా నందా రామం 
బాంధవ్యము ప్రేమాదిత్యా తాత్పర్యం 
ప్రేమత్వము నిత్యాన్వేష్యా లాలిత్వం 
కారుణ్యము సద్భావా సంతోషాదిత్వం    


నేటి కవిత (చందస్సు 
ప్రాంజలి ప్రభ (తప్పేమిటి) -3

నచ్చినప్పుడే -  దేనినైనా ప్రశంసిస్తే తప్పేమిటి 
నచ్చనప్పుడే  - దేనినైనా విమర్శిస్తే తప్పేమిటి 
నమ్మినప్పుడే  - దేనినైనా ప్రభోధిస్తే  తప్పేమిటి 
నమ్మనప్పుడే  - దేనినైనా విభేదిస్తే  తప్పేమిటి 

శుభాకాంక్షలు  - ఎప్పుడైనా  చెప్పితే తప్పేమిటి 
సొలభ్యమ్ములు - ఎప్పుడైనా  ఒప్పితే తప్పేమిటి
సాహిత్యమ్ములు - ఎప్పుడైనా పల్కితే తప్పేమిటి 
అన్నాదమ్ములు - ఎప్పుడైన  కల్సితే తప్పేమిటి 

ఆలోచనలు - ఎప్పుడైనా  తప్పుగా వర్ణిస్తే తప్పేమిటి 
వినోదములు - ఎప్పుడైనా  ఒప్పుగా వప్పిస్తే తప్పేమిటి 
వివాదములు - ఎప్పుడైనా  గొప్పగా  తప్పిస్తే తప్పేమిటి 
ప్రమాదములు - ఎప్పుడైనా తెల్యకా  కల్గితే  తప్పేమిటి       

--((*))--

ప్రాంజలి ప్రభ - నేటి కవిత-5
 ఓం శ్రీ రామ్ (ఛందస్సు )
ఆంతర్గత అర్ధం చెప్పగలరా

Flowers

కళ్ళలో నీరు - కూడికలో తంటా
నీళ్ళల్లో వేడి - చీకటిలో వెల్గు
ముళ్ళల్లో ముప్పు - వాకిటిలో ముగ్గు
గళ్ళలో ఆట - పటికలో నాచు

పల్లంలో నీరు - చిటికలో పని
గొల్లంలో గాడి - ఘడియల్లో గాలి
అల్లంలో ఘాటు - మడిగలో ధూలి
పళ్లెంలో మచ్చ - తడికలో ఖాళి

వయసులో మార్పు - కలువలో కైపు
సొగసులో సోంపు - ప్రమిదలో నూనె
మనసులో మాయ - చేరుకులో తీపి
వలపులో తడి - నడకలో దూరం

మమతలో కుళ్ళు - కలలలో రూపు
నవతలో తుళ్లు  - మడుగులో మంచు
పడతిలో వళ్ళు - గొడుగులో నీడ  
జపములో జల్లు - కధలలో కత    

నడకలో మార్పు - యువతలో ఓర్పు 
మనిషికో తీర్పు  -  మమతలో నేర్పు  
యువతిలో కైపు  -  చిరుతలో పర్గు 
చెలిమిలో  తీపి  -  బలిమిలో వాపు 

--((*))--

6. ఇంద్రవజ్ర - UUI UU - IIUI UU
నేటి కవిత (ఛందస్సు }

సంక్రాంతి (ఛందస్సు )

ఓర్పు నేర్పు కూర్పు తీర్పు పంచు సంక్రాంతి  
శాంతి కాంతి పంచె బ్రాంతి తుంచే సంక్రాంతి 
పంట వచ్చే మంచి పంచే శోభ  సంక్రాంతి      
అక్క బావ అన్న  చెల్లి బిడ్డ సంక్రాంతి 

సూర్య చంద్ర నింగి నేల వెల్గు సంక్రాంతి  
పెంచు కున్న ప్రేమ పంచు తున్న సంక్రాంతి 
పెంచు తున్న డబ్బు మబ్బు మాయ సంక్రాంతి        
మంచి మార్పు కోసం ప్రేమ పంచు సంక్రాంతి 

బంధు మిత్ర స్నేహ భావ పంచే సంక్రాంతి 
తల్లి తండ్రి కూర్చో బెట్టి చేయు సంక్రాంతి 
పిండి  వంట  చేసి  కల్సి  తినే  సంక్రాంతి
పెద్ద చిన్న ఆట పాట శోభ సంక్రాంతి     

నువ్వు నేను కల్సే భావం ఉండె సంక్రాంతి 
ఇచ్చి పుచ్చు కొనే ప్రేమ పంచే  సంక్రాంతి
పూల ముగ్గు గొబ్బి పెట్టే  శోభ  సంక్రాంతి 
కొత్త బియ్యం తీపి బెల్లం పంచే సంక్రాంతి  


--((*))--


నేటి నా కీర్తన 
ప్రాంజలి ప్రభ 
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి  రామకృష్ణ   
విశాలాంతిక - త/త/త/గ UUI UUI - UUIU
10 పంక్తి 293
ఏమాయ కమ్మింది - మాపైన  మే 
మేమీ చె సి యున్న - ఇంతా మనో 
మార్గమ్ములే ప్రశ్న - లయ్యెనుగా 

ఇంతెందుకాలోచనా అందురే 
కాలమ్ము మాయగా చుడాలిగా 
పంతమ్ము పోకుమా అద్రుష్టమే 

ఎవ్వారె మన్నాను మౌనంగ ఉం 
డీ దేశ కష్టమ్ము భావించియే 
శుబ్రమ్ము చేస్తేను ఆరోగ్యమే  

ఏరోగ మూ రాదు భయ్యమ్ములే 
కుండంగ జీవించు ఆనందమే 
పంచియు ఆహ్లాద మే పొందుటే 

ఉద్వేగ ఉద్యోగ సేవార్ధమ్ము 
ఎందెందు అందందే ఆరోగ్యమ్ము 
బిడ్డల్తొ ఉండేది సౌకర్యమే 

ఏరోగ మీదాక రాకుండులే 
ఏకష్టమూ రాక సౌఖ్యమ్ములే 
ఎంచేసు యున్నానొ ఈమాయలో         


రారయ్య రారయ్య మా ఇంటి కీ 
అందించు అందించు నీ వెల్గులే
పాదంబు పాదంబు నీ పూజలే
ప్రేమంబు నీయందు ఈ పూటలే  
    
ప్రాణమ్ము నిల్పంగ నీ చెంతలే 
దీపంబు వెల్గించె ఈ వేళలో
పుష్పమ్ము అర్పించె ఈ మాయలో 
లీలల్ గనన్ రమ్ము - లీలామయా

ఆలించు పాలించు మాశీస్సుతో        
ప్రేమించు దీవించు యాచించితే 
వద్దన్న కాదన్న మాటాడరా 
లీలల్ గనన్ రమ్ము - లీలామయా

గానమ్ము గొంతందు గల్గించరా
నాట్యమ్ము నీయందు చేయించరా  
మౌనమ్ము జాలించి  రావేలరా
లీలల్ గనన్ రమ్ము - లీలామయా

యానంద పీయూష - మందించరా
నేనంత నీయందు - దాసాను రా 
కళ్ళల్లొ కాంతుల్ ని- నింపాలిరా    
లీలల్ గనన్ రమ్ము - లీలామయా

--((*))--

UUIUUIIUIUU  (తతజగ ) (తెల్గు దేశం)

కాలం సమావృత్త ప్రభావమే గ
మ్యా గమ్య, సవ్యా సహజత్వ మాల 
స్వరూప విజ్ఞాన నవీన భావ సత్యా
ధర్మ ప్రపంచం మన తెల్గు దేశం 


   తప్త - స/భ/త/త/గ 
13 అతిజగతి 2356 
IIU UII UUI UUI U -13
కళవుంటే మనసంతా సదా భావ మే  
తరుఉంటే ఉపయోగం సదా నిత్యమే 
మమతుంటే తనువంతా సదా ప్రేమమే 

 సిరులన్నీ జగమంతా సదా మార్పుయే   


 త్రిష్టుప్పు 1 (చందస్సు )
భారతీ లేక మాలతీ - మ/మ/మ/గగ 
UUU -UUU - UUU -UU 
పేరేమీ చెప్పాలే - బాబూరా రారా 
ఫన్నీరూ పంచూతా - బిడ్డారా రారా
కాలాన్నీ తెల్పాలీ - నిత్యానందంగా      
దేహాన్నీ నిల్పాలీ - దర్మమార్గంగా 
  
అన్నానూ ఆరోగ్యం - ఓర్పూ లేదమ్మా 
తిట్టానూ కొట్టానూ - మూర్ఖున్నేనమ్మా 
ఆలస్యం ఆయాసం - నన్నే కమ్మేలే 
వద్దామన్నారాలే - నన్నూ క్షమించూ 

తల్లీనీ భాష్పాలే - నన్నూ మార్చేనూ 
నేతప్పూ లేచైనూ - నిన్నూ ప్రేమాతో
పూజిస్తా పోషిస్తా - మన్నించాలమ్మా
నాతప్పూ తెల్సిందీ -వచ్చా క్షమించూ 

శ్రీవాణీ బ్రహ్మాణీ - చిద్రూపీ రాణీ
శ్రీవిద్యా గీర్దేవీ - శ్వేతాంగీ శ్రేష్ఠా
భావాబ్ధీ వాగ్భామా - భాషాబ్ధీ శాబ్దీ
దేవీ నిన్ బూజింతున్ - దీపమ్మై రావా
 --((*))--


UI -UII -UI - UIIU UIU  (CHANDASSU)
ప్రేమతో లత లల్లి - మాలలగా హారతీ
ప్రేమతో మనసంత - దీపముగా మార్చితీ 
ప్రేమతో నిరతమ్ము - మశ్చిక చేశానయ్యా 
ప్రేమతో వ్యధలన్ని - తెల్పితిలే నీదయే 
    
ఊహ నీదియు కాని - చేతలు నా వేనమ్మా   
ఊహ గా బ్రత కాలి -  ఆశలు నీ వేనమ్మా  
ఊహతో  జత గల - ప్రేమల నా బాంధవ్యం 
ఊహాగా  లత కధ  -  అల్లిక  నీ భంధమ్మే 


ఛందస్సు ( ప్రాంజలి ప్రభ )
UUII UU - UUUUU
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
 
ప్రేమమ్ముల తోడన్ - దాహమ్ముల్ గాదా 
రాగమ్ముల తోడన్ - రాజిల్లెన్ గాదా
వేషమ్ముల తోడన్ - మౌసమ్ముల్ గదా
వేదమ్ముల తోడన్ - భాగ్యమ్ముల్ గాదా


ప్రాంజలి ప్రభ (6/   / 2/2019 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 


నను మరచి వెళ్ళావు  
నన్ను వీడి ఉన్నావు 
మనసులోకి చేరవు, 
నిద్ర రాక చేస్తావు  

గుండెలోనే ఉన్నావు 
మనసునంత దోచావు
మమత ఆశ చూపావు 
మనుగడ వద్దన్నావు 

మాటలతో మైమరిపించావు 
పాటలతో మనసు చేరావు 
ఒక్క మాటకే విడిచి వెల్లావు
వలపందించి మరిచావు  

నీరూపే నాలో ఉంచావు
నన్ను మరచి నీవు తిరిగావు 
నన్నే నీవు అనుమానించావు 
విడిగా బతికి చూపమన్నావు 

నా తొందరపాటు గుర్తున్చావు 
నా ప్రశ్నకు బదులు చెప్పవు 
స్త్రీ వై గర్వపడుతున్నావు 
సమాజాన్ని గమనించలేకున్నావు 

నా మన్చే నన్ను నడిపిస్తుంది
నా పుణ్యం దారి చూపిస్తుంది 
భారత దేశం నన్నాదరిస్తుంది 
నేను నీకు చెప్పేది ఒక్కటే

నిన్ను నీవు ఆత్మావలోకం చేసుకో     
నిజం తెల్సుకొని నడవడిక మార్చుకో
కాల గమనంలో నన్ను కలుసుకో 
జీవితాన్ని పువ్వులవణంగా మార్చుకో 

అంతేనా నాకు చెప్పేది
ప్రస్తుతానికి అంతే 
అంతేనా నాకు చెప్పేది
ప్రస్తుతానికి అంతే 

--((**))--


చేయుము సాయము..
------------------------------
మోదకము వృత్తము
గణములు- భ,భ,భ,భ
యతి - 7

ఆదరమొప్పఁగ నన్నగ మ్రొక్కిడి
మోదకమిత్తును, మోదము నిత్తువ!
కాదిది భక్ష్యము, కాదు గణేశ్వర !
పాదము లన్నిట భా యుగ ముండును!

కోరకె చూపెను గ్రొత్తది వృత్తము
శారద తల్లియె సంతస మీయఁగ
నేరికి చెప్పుదు నీయెద పొంగును
చేరితి నందుకె చెప్పఁగ నీకిటు

నచ్చినఁ జెప్పుము నాన్చక శ్రీకర
మెచ్చెడి రీతిని మేలుగఁ గూర్చెదఁ
జెచ్చెర నొక్కటి చిన్నది మాలిక
నచ్చపు ప్రేమము నన్నకు నీకును

వేరొక కూరుపు వేడుక గూర్చిన
హారము నల్లెద నట్టులె నేర్పున
తీరిక యున్నది, తిట్టదు తల్లియు,
నేరకమైనను నిచ్చును స్ఫూర్తిని

ఏమని యంటివి? యేమియు నచ్చవ !
ప్రేమను లడ్డులఁ బెట్టఁగ మందువ!
శ్రీమతి భారతి చెప్పఁని పాఠము !
యేమెయిఁ జేయుట! యేరినిఁ గోరుట!

విన్నది సత్యమె! వేడుక గాదుగ!
కొన్నవి యైనను గోపము నొందవ!
యెన్నిటి నిచ్చిన నేమని పల్కవ!
అన్నిటి వేగమె హాయిగఁ దిందువ!

తీయని వార్తనుఁ దెల్పితివయ్యరొ!
చేయక జాప్యము చెచ్చెర దెచ్చెద
హాయిగఁ గైకొని యందుచుఁ దృప్తినిఁ
జేయుము సాయము సేరఁగ గమ్యము

సుప్రభ
12:12 PM
12-01-2017
నేటి కవిత (ఛందస్సు) 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 
వాన జళ్లు కురిసే

వాన జళ్లు కురిసే - వలపు వళ్ళు తడిసే
లేత మళ్లి మెరిసే - మగువ తుళ్ళి ఎగసే 
కాల మాయ తెలిసే - కలువ పూవు వగసే   
మాట నేర్పు జడిసే - తనువు తాప మెగసే     

కొమ్మ చాటు పిందెలే - చెమ్మ పాటు నీడలే
బామ్మ పోటు లేదులే - అమ్మ మాటు ప్రేమలే
కట్టు బాటు లేదులే - తట్టు కొనే మాటలే
ఒట్టు చాటు కాదులే - చుట్టు కొనే ప్రేమలే   

చెక్క చెమ్మ ఆటలే - చేతి ముద్ద వేటులే
చేను కంది పోదులే - చేరు కున్న పాటులే 
చేవ చావ లేదులే -   వెన్న ముద్దా ఆలీలే 
చేదు మోటు కాదులే - చేరి కోరి తీపిలే   
--((*))--










సారంగ, విశాలాంతిక, అర్ధసమ వృత్తము కామాంతిక, కుసుమ షట్పది -

సారంగ - నాలుగు త-గణములు
ఆధారము - ప్రాకృతపైంగలము, హేమచంద్ర జయకీర్తులు
నడక - ఖండగతి 
ఇతర నామములు - సారంగరూపకము, కామవతారము

విశాలాంతిక - మూడు త-గణములు, ఒక గురువు
ఆధారము - వాగ్వల్లభ
నడక - ఖండగతి
సారంగ - త/త/త/త UUI UUI - UUI UUI
12 జగతి 2341
ప్రాణమ్ములో నుండు - ప్రాణమ్ము నీవందు
గానమ్ములో నిండు - గానమ్ము నీవందు
ధ్యానమ్ములోఁ జిందు - ధ్వానమ్ము నీవందు
నేనాటి బంధమ్మొ - యీనాఁడు నీవిందు - (1)
లీలల్ వినోదమ్ము - లీలల్ ప్రమోదమ్ము
చాలించు మాయాట - జాలమ్ము లీపూఁట
నీలాలు నీవంటి - నేలన్ వెతన్ గంటి
నాలించు మోనాథ - యాలించు మీగాథ - (2)
విశాలాంతిక - త/త/త/గ UUI UUI - UUIU
10 పంక్తి 293
ప్రాణమ్ము నిల్పంగ - రావేలరా
గానమ్ము గొంతందుఁ - గల్గించరా
మౌనమ్ముఁ జాలించి - మాటాడరా
యానంద పీయూష - మందించరా - (3)
లీలల్ గనన్ రమ్ము - లీలామయా
మాలల్ గొనన్ రమ్ము - మాలీ హరీ
తేలించ రమ్మంటిఁ - దెప్పన్ ననున్
ఆలించి పాలించు - మాశీస్సుతో - (4)
అర్ధసమ వృత్తము కామాంతిక -
బేసి పాదములు - సారంగ (కామావతారము, సారంగరూపకము)
సరి పాదములు - విశాలాంతిక
పై ఉదాహరణములలో 1,3 మఱియు 2,4 పద్యములతో నిర్మించబడిన కామాంతిక అర్ధసమ వృత్తములు -
ప్రాణమ్ములో నుండు - ప్రాణమ్ము నీవందుఁ
బ్రాణమ్ము నిల్పంగ - రావేలరా
గానమ్ములో నిండు - గానమ్ము నీవందు
గానమ్ము గొంతందుఁ - గల్గించరా
ధ్యానమ్ములోఁ జిందు - ధ్వానమ్ము నీవందు
మౌనమ్ముఁ జాలించి - మాటాడరా
యేనాటి బంధమ్మొ - యీనాఁడు నీవందు
నానంద పీయూష - మందించరా - (5)
లీలల్ వినోదమ్ము - లీలల్ ప్రమోదమ్ము
లీలల్ గనన్ రమ్ము - లీలామయా
చాలించు మాయాట - జాలమ్ము లీపూఁట
మాలల్ గొనన్ రమ్ము - మాలీ హరీ
నీలాలు నీవంటి - నేలన్ వెతన్ గంటిఁ
దేలించ రమ్మంటిఁ - దెప్పన్ ననున్
ఆలించు మోనాథ - యాలించు మీగాథ
ఆలించి పాలించు - మాశీస్సుతో - (6)
మఱి రెండు ఉదాహరణములు -
కామావతారమ్ము - గామాబ్ధిలోనుండి
ప్రేమమ్ముతోఁ బుట్టె - శ్రీమంతమై
నామానసమ్మందు - నామమ్ము నీదయ్యె
వ్యోమమ్ము మ్రోఁగంగ - నో దేవి రా - (7)
సారంగ రాగమ్ము - సారంగ వాద్యాన
శ్రీరంగ మ్రోఁగింతు - శీఘ్రమ్ముగా
సారంగమై వేగ - సారంగ నీచెంతఁ
జేరంగ నేవత్తు - శ్రీదేవిగా - (8)
సరియైన నియమములతో వ్రాసినప్పుడు ఈ కామాంతికలు కుసుమ షట్పదిగా మారుతాయి, పైన చూపిన 5-8 వఱకు పద్యములు కుసుమ షట్పదిగా -
ప్రాణమ్ములో నుండు
ప్రాణమ్ము నీవందుఁ
బ్రాణమ్ము నిల్పంగ - రావేలరా
గానమ్ములో నిండు
గానమ్ము నీవందు
గానమ్ము గొంతందుఁ - గల్గించరా - (9)
ధ్యానమ్ములోఁ జిందు
ధ్వానమ్ము నీవందు
మౌనమ్ముఁ జాలించి - మాటాడరా
ఏనాటి బంధమ్మొ
యీనాఁడు నీవందు
నానంద పీయూష - మందించరా - (10)
లీలల్ వినోదమ్ము
లీలల్ ప్రమోదమ్ము
లీలల్ గనన్ రమ్ము - లీలామయా
చాలించు మాయాట
జాలమ్ము లీపూఁట
మాలల్ గొనన్ రమ్ము - మాలీ హరీ - (11)
నీలాలు నీవంటి
నేలన్ వెతన్ గంటిఁ
దేలించ రమ్మంటిఁ - దెప్పన్ ననున్
ఆలించు మోనాథ
యాలించు మీగాథ
ఆలించి పాలించు - మాశీస్సుతో - (12)
కామావతారమ్ము
గామాబ్ధిలోనుండి
ప్రేమమ్ముతోఁ బుట్టె - శ్రీమంతమై
నామానసమ్మందు
నామమ్ము నీదయ్యె
వ్యోమమ్ము మ్రోఁగంగ - నో దేవి రా - (13)
సారంగ రాగమ్ము -
సారంగ వాద్యాన
శ్రీరంగ మ్రోఁగింతు - శీఘ్రమ్ముగా
సారంగమై వేగ -
సారంగ నీచెంతఁ
జేరంగ నేవత్తు - శ్రీదేవిగా - (14)
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


ప్రాంజలి ప్రభ 



ప్రాంజలి ప్రభ 
రాధాకృష్ణ ప్రేమరాగం (ఛందస్సు )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

నవమాసంలో - వలపంతచిందే 
మదిలోవేడీ  -  పరువం పసందే 
కురులే విచ్చే - లతలంతకప్పే    
మరులే గొల్పే - వయసంతచిమ్మే 

కలవాలంటే -  చనువేదిలేదే  
కులకాలంటే - శుభమేదిలేదే  
అరవాలంటే - అలుపేదిలేదే   
మెరవాలంటే - చినుకేది లేదే 

చిరునవ్వుల్తో - మనువాడె రాధా 
వలలోకైనా -  పడవా ముకుందా 
తనుభావాలే - మనసంత పొంగే 
తనువే పంచా - తపనంతరాగం 

పరమోన్నత్వం - పరిశీల భావం 
సుఖమొన్నత్వం - సుఖశీల భావం 
తనువో నత్వం  - సఖి రాధ భావం 
మనసేతత్వం - ప్రేమతో ముకుందా

--((*))--

నేటి కీర్తన  (ఛందస్సు )
ప్రాంజలి ప్రభ 
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

తోమె కొద్దీ గిన్నె మెరుపు కదా రామా
రుద్దె  కొద్దీ సబ్బు నురగ కదా రామా
పిండె కొద్దీ పండు నలుగు కదా రామా
కొట్టె  కొద్దీ  కొండ కరుగు కదా రామా
నీ మనో నేత్రమ్ము హనుమ కదా రామా  

తవ్వె  కొద్దీ నీరు పడుట కదా రామా
మెచ్చె కొద్దీ ఆశ  పెరుగు కదా రామా
నచ్చె కొద్దీ భాధ మిగులు కదా రామా
నవ్వె కొద్దీ   కళ్ళు మెరియు కదా రామా
నీ మనో నేత్రమ్ము హనుమ కదా రామా


ఉతికె కొద్దీ బట్ట చిరుగు కదా రామా
తురుమె కొద్దీ చిప్ప మిగులు కదా రామా
ముదిరె కొద్దీ బెండ తినరు కదా రామా
చితిపె కొద్దీ చీము కురియు కదా రామా
నీ మనో నేత్రమ్ము హనుమ కదా రామా

రాపిడి కొద్దీ వేడి కలుగు కదా రామా
సాధన కొద్దీ విద్య పెరుగు కదా రామా
సోధన కొద్దీ కొంత తెలియు కదా రామా
ఇష్టము కొద్దీ కాని దవును కదా రామా
నీ మనో నేత్రమ్ము హనుమ కదా రామా


--((*)


స్త్రీ  - పురుష - సాహిత్యం -2
 నానననలు - (న)6-లల IIIII IIIII - IIIII IIIII
20 కృతి 1048576
రచన  : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

తొలి వెలుగు కిరణములు - మది తలుపులు తెరుచును
తెలివి తనము పెరిగెను - ఉదయమున నడకలుయు
మనసు సఫలము కలిగి - జలమున మునిగి తడిసి
మనసున మరులు గొలుపు - మనసు చలనము సడలు

కలలవలె దలపులిట - అలలవలె జరుగునట
చినుకువలె మెరియునట - కుసుమముల వలె ఉబుకు
వనమున తరువుల వలె - కలసి మెలసి కలియుట
మెరుపు లవలె మెరియుచు - ముసుగులొ కలవరము

నవ రసములు కనుగొను - నవ విధముల సరియగు
సరసముల సమయమున -  రస రుచుల తమకమున
వధువు యదల సరిగమ -  వరుని వలపుల కలలు
మురిసి కలసి వలపును - మది తలపుల నిజములె

వనిత వరుసలు కలిపి - వరుని మగసిరికి నలిగి
తనువుల తపన మరిగి - తరచు రుచులను కలిగి
మనువు మమతను తెలిపి - మనసు మనసుయు కలసి
మగువ మరులను గొలిపి - మదనుని యదతొ మునిగి

అలలవలెఁ దలఁపు లిట - నమరగను మది ములిగె
నలలు నను దడిపె నిట - నలసితిని మెయి గలఁగెఁ
జలితమయె మదియు నిట - సఖియు నను గనదు గద
జ్వలనమునఁ గమలితిని - చలనములు సడలెఁగద

ననలు బలు వనలతల - నయముగను విరిసినవి
కొనలు చెలు వలరుచును - గొమరుగను మురిసినవి
కొనిరి యపు డలరులను - కురుల నిడ సువదనలు
వనితలకు ముద మొసఁగు - పదములయెఁగద ననలు

తొలివెలుఁగు కిరణము ల-తులితముగఁ గనఁబడఁగ
మెలమెలగ మహిఁ జెలఁగు - మృదులమగు తెర తొలఁగె
కలకలము లధికమయెఁ - గలరవము విటపములఁ
దెలివెలుఁగు పరవఁగను - దెసల మిస దనరెఁగద
 --((*))--


స్త్రీ  - పురుష - సాహిత్యం -1
మధురలయ - త/న/స/భ/న/య/న/న/త/గగ 
UUI IIIII - UUI IIIII - UUI IIIII - UUI UU 
29 సువః 150797565 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

జ్యాసంత సొగసులకు - తన్మాత్ర కదలికలకు
తత్భావ పిలుపులకు - చిక్కాను రావా 

సర్వాంగ సుమధురివి  - అన్వేక మధురిమవు
ఆహ్లాద కమలమువి - ప్రేమించ రావా

ప్రత్యేక వలువలను - బంగార భరణమును  
తెచ్చాను తమకముతో  -   క్షమించి రావా 

మందార సుమములిట - సంగీత పవన మిట   
మేఘాల చినుకులిట - నందాత్మ జారా 

మందమ్ము నడక యిట - నందమ్ము కవన మిట - 
ఛందమ్ము రవణ మిట - నందాత్మజా రా 

మందమ్ము మధురలయ - లందమ్ము స్వర సరిత - 
చందమ్ము రవము లిట - నందాత్మజా రా 

మందమ్ము పదము లిట - నందమ్ము నటన మిట - 
విందైన సొబగు లిట - నందాత్మజా రా 
   
నీ శాంతి మరి వలపు - నీ శాంతి మరి తలపు
నీ శాంతి మరి పిలుపు - శాంతించి రావా 

ఈ స్వాస మనదియును - ఈ స్వాస సిరి నెలయు
ఈ స్వాస జల నిధియు - నవ్వాలి రావా      

నీ నాట్య మది మధువు - నీ నాట్య మది సుధయు - 
నీ నాట్య మది ముదము - నేనున్ నటింతున్ 

వచ్చాను తమకముతొ - ఇస్తాను మధురిమను
పొందాలి సుఖములను - సంతోష మేగా

--((*))-- 
అశ్వగతి - భ/భ/భ/భ/భ/గ - UIIU IIUII - UIIU IIU 
16 అష్టి 28087 

నామదిలో సమ శోధన  - మాయ మనో జపమే 
వేదలతా సమ సారము - పామర మనో రజమే 
సేవలయే సుమ వేదము - కాలము మనో లయమే 
నాతలపే యమ జాతర - రేపటి  మనో తరుణం    

జీవితమే మధు ధారగ - జిందెడినా సిరిరా
ప్రేమమయం సుఖ భావన - పొందెటి నామదిరా
కామమయం సమ భావన - కల్గెటి సాయమురా
వృక్షమయం సుఖ సేవగ - పంచెటి గాలియురా   
       
ప్రేమలతో మది నిండెను - భవ్యముగా వెలుగుల్ 
నవ్వులతో  నట లాడును - నవ్యముగా నాదముల్ 
దివ్వెలతో భువి నిండెను - దివ్యముగా వెలుగుల్
పువ్వులతో నతి ఘంధము - కావ్యముగా దొరకున్ 
 

ప్రాంజలి ప్రభ (ఛందస్సు)  UUI UU U IUI UUI
రచయత: శ్రీ దేవి రామకృష్ణ మల్లాప్రగడ

ఓదార్పు చూపే ఓర్పు ఉంది నీలోన
ధైర్యము చూపే శక్తి ఉంది నాలోన 
మార్పును చూపే తీర్పు ఉంది నీలోన
కార్య్రము చేసే దమ్ము  ఉంది నాలోన

విశ్రాంతి చూపే ప్రేమ ఉంది నీలోన
ప్రావిన్య చూపే విధ్య ఉంది నాలోన 
స్త్రీ శోభ చూపే తెల్వి ఉంది నీలోన
కారుణ్య చూపే దివ్వె ఉంది నాలోన

ప్రత్యూష చూపే వెల్గు ఉంది నీలోన 
రేచుక్క చూపే నేర్పు ఉంది నాలోన 
నాణ్యత చూపే యోగ ఉంది నీలోన 
కల్లోల చూపే స్పర్ధ ఉంది నాలోన

సంకల్ప చూపే స్వర ఉంది నీలోన
వివర్ణ చూపే వర్ణ ఉంది నాలోన 
సందర్భ చూపే స్వేశ్చ ఉంది నీలోన 
అదృష్ట చూపే సంఖ్య  ఉంది నాలోనే 

--((**))--  

ప్రాంజలి ప్రభ
రచయత. మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 
  
రాజీవ నేత్రా - రమ కాంత రూపా 
సంజీవ దేవా - సక లాంత దీపా  
సంగీత వేదా - కమలాక్ష రావా 
శృంగార వాసా - అనురాగ చక్రీ 

నా మాట నీదే  - మనసంత నాదే
నా పాట నీదే  -  గళమంత నాదే  
నా ఆట నీదే -  తనువంత నాదే 
నా బాట నీదే -  వలపంత  నాదే 

సాకార రూపం -  వయసంత భాదే 
వేదాల భావం  -  అనురాగ  బంధం   
కాలాల తత్త్వం -  సమకూర్పు దీపం  
మౌనాల  సఖ్యం -  సమశాంతి విశ్వం   

కాదేల నోయి -  అనుకున్న మార్గం  
రాదేల నోయి - సమకూర దేహం 
నేర్పేది విద్య - సమభావ స్నేహం
రక్షించు తండ్రి  -  సమకూర్చు ప్రేమమ్  

కోరేది లేదే - అను రాగ దాహం
తీరేది లేదే  -  అపు రూప మొహం 
తీర్చేది లేదే  - అనుబంధ బంధం 
చేరేది ఎలా - నవద్విప మాతా 

--((*))--


నేటి కవిత మనోహరి (చందస్సు ) 
UUUU-IIUU-UIIU (కొత్తవృత్తము )

నేటి కవిత- మనోహరి ***

సాక్ష్యాలేలేవని ప్రేమించే మనిషీ 
భూదేవీ భారము పెంచే సాహసమే 
వృక్షాలన్నీ వెదజల్లే గంధములే 
సంసారాన్నీ నడిపించే వేదములే   

మందారం లా విరబూసే నీ  తనువూ  
సిందూరం లా తనువంతా ఓ మెరుపూ
నీ చూపే  నా మనసంతా ఓ కుదుపూ  
సిగ్గాయే  నా కలలో నీ స్పర్శ లతా    

సింగారం లా మరుగొల్పే నీ మనసూ    
నాంచారీ లా ఉసిగొల్పే నీ సొగసూ  
బంగారీ  లా మెరుపుల్తో  నీ తనువూ  
వయ్యారి లా నడకల్తో  నీ నడుమే 

ఉద్వేగం చెందుట శృంగారం మలుపూ  
రాద్ధాంతం చేయుట ప్రేమావల్లె కదా 
సందేహం తీర్చుట సంతోషం తలపూ  
ఉద్దేశ్యం  మంచిది చెల్మి వల్లె కదా

ఊహల్లో ఊపుల వయ్యారం చెసే   
రాగాలు పువ్వుల ముద్దూలే చెసే 
అద్దంలా నవ్వితె నవ్వుల్తో  చెసే  
ఈజన్మే మాధవు సొంతంలా చెసే 

--((*))--


IIII UIU IIU
UIIU IIUIUIU 
నేటి కవిత (ఛందస్సు )
ప్రాంజలి ప్రభ (తృప్తి)  
రచయత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 

లలితము నీవె ఓర్పు నేర్పు  
సాదరముగా సేవ దృక్పదమ్ముయే 
సరళము నీవె తీర్పు మార్పు 
కారణముగా కల్పె శక్తి దమ్ముయే 

మలినము నంట నీయకనే 
వేదమనే కల సత్యమవ్వుటే 
తరుణము నష్ట పెట్టకనే
ఇష్టమునే సమ వ్యక్తపర్చుటే 

పెదవుల తీపి తెల్పి సుమా 
మాలికగా స్వశ్చ సేవకాలమే
నిముషము వీడి ఉండకయే 
తాపమునే తృప్తి చెందుకాలమే   

మెలుకవ చూడగా మదిలో 
భాధలనే పంచుకొనే కాలమే 
మమతను పంచగా మదిలో 
కోరికనే తీర్చుకొనే కాలమే 

తలపుల తల్పు తెర్చి తనూ  
ధారణమే భవ వేడుకాలయే 
వలపుల ఊహ తెల్పి  తనూ      
ధారణమే దివ్య వేడుకాలయే 

--((*))--




UIIU -UI -UI- UI- UI- UIU
ఛందస్సు  శోభ (కొత్త వృత్తము )

కన్నులలో కాంతి శక్తి  కొంత చూచి నంతనే
తాపముతో వింత శోభ వేగి తుళ్ళి పండెనే
ప్రేమలతో ఇష్ట కాంతి ఛాతి పైన ఉండెనే 
కౌగిలిలో చేరి శాంతి పొంది పేరు పొందురా   

స్పర్శలలో చిక్కి ముద్దు లిచ్చి ప్రేమ లందుకో 
సవ్వడిలో కలై అలై  వళై  చూసి నందుకో 
మువ్వలతో  చేరి హృది పంచి జాలి పంచుకో         
ముద్దులతో లేత మేను ఇస్తూ  శృతి పల్కరా      
      
వానలలో తడ్సి రాగ తాళ  పాట పాడెనే
వేణువుతో సంగీ తాన్ని పంచి ప్రేమ పొందెనే
కన్నులలో కాంతి చూపి ఆశ తీర్చ గల్గెనే 
ఊయలలో ఊగి జోల పాడి లాభ పొందురా 
     

--((*))--


నేటి కవిత - ప్రాంజలి ప్రభ     
ఛందస్సు - 
II  IU  I  IU I  IU I  I

 కునుకు తీయుము ఆటల ముందర 
పలుకు ఎప్పుడు దాటక యుండుము 
నడక ఎప్పుడు మారక  యుండుము      
చేతలు ఎప్పుడు మంచికి వాడుము 

కరుగ చేయకు కాలము నూరక
పరుగు తీయకు వేతన కోసము 
నురగ చూపకు నవ్వుల కోసము 
చెరుగు దోషము మంచిని పంచుచు  

కరుణ చూపుము కాదని చెప్పఁక 
కలిగి ఉండుము అందరి ముందర 
కధలు చెప్పుము కొందరి ముందర 
కళలు అప్పుడు ఎప్పుడు మారవు  

కనుల చూపులు ఆశల వెల్గులు
కనుల కాంతులు కాముక తిప్పలు 
కనుల భావము మోక్షము చూపుము 
కనుల కావ్యము కాంతల  కుల్కులు  

--((*))-- 



నేటి కవిత (ఛందస్సు )
ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
II IU II IU I

చిగురు ఆకుల వయస్సు
సొగసు నక్షత్ర యశస్సు
వయసు పర్గుల ఉషస్సు
కలువ పువ్వుల తపస్సు

సొగసులే మనసు దోచె
వలపులే  మరులు గొల్పు
తనువులే తపన దాల్చె
మనసులే ఒకటి ఆయె

మనసె మందిరము ఆయె
వలపె వందనము  ఆయె
పిలుపె సుందరము ఆయె
తలపె  తొందరను చేసె

అవును కానిది సువిద్య
వలపు తెల్పుట సువిద్య
ఇపుడు రేయిన సువిద్య
మలుపు తిప్పును సువిద్య

వలపుల రాణి సొగసిచ్చె
తలపుల రాజు మనసిచ్చె
సొగసరి పట్టు సుఖమాయె
ఇరువురి కల్సి  ఒకటయ్యె


--((*))--


నేటి కవిత 1  (ఛందస్సు)  
కొత్త వృత్తము (telugu నేర్చుకోనేవారికి )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

UI UII UI UII - UI UII UIU

రామ లీలలు, కృష్ణ లీలలు 
- ప్రేమ లీలల భావమే

సామ దానము, బేధ భావము 
- నిత్య సాయము లక్ష్యమే

దండ నీతియు, ప్రేమ నీతియు 
- సత్య సాదర మార్గమే

మంచి పంచియు కీడు తుంచియు 
- ధర్మ మార్గపు భావ్యమే

పస్పు కుంకుమ, పంచి పెట్టుట 
- సంతసం, సమ భావమే

విద్య బోధయు, నిత్య సత్యము
- సఖ్య సంతస ,హామియే

బత్కు తెర్వుకు, కష్ట నష్టము
- నేర్పు ఓర్పుకు, కల్పనే

ప్రేమ తత్వము, సేవ తత్వము  
-మోక్ష మార్గము, సత్యమే   

ఆశ పాశము,  కోర్క పర్వము 
-దుష్ట మార్గము  ప్రేమయే 

వేద పాఠము, కాల నిర్ణయ 
-జన్మ సౌఖ్యము, కర్మయే 

--((**))--

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ