కంద పద్యాలు
మేటి వెలుగు కాత్యాయిని
కోటి కొలువు కామాక్షివి
నేటిశ్రీమతి సివంగి నిర్మల వాణీ
నాటి శ్రీ వాణీ గను
మటు మాయల తో ను మనిషి
మాటలతోను మహలక్ష్మి మా జగ దంబా
పువ్వు కళ గుభాలింపగు
నవ్వు కళలు నాట్యమగుట
నవ్వించియేడుపుగాను నటనా లక్ష్మీ
రివ్వున సాగెడి మెరుపగు
గువ్వల కోరిక బ్రతుకగు
మువ్వల శబ్దము మనసుకు ముఖ్యము లక్ష్మీ
రోగము తెలియక వచ్చును
భోగము మనసుకు నచ్చును
ప్రగతి ప్రతిభయే యుపాయ ప్రాభవ లక్ష్మీ
త్యాగము శాంతికి వచ్చును
యోగము చెప్పక వచ్చును
మగని నడవడిక మగువకు మానస లక్ష్మీ
ష. కం.వరము వరదలా వయసై
తరము మెరుపులా మనసై
మరులు గొలుపు మహిమ లక్ష్మి మలుపులు తిప్పే
తరుణ కళలులా తనమై
తరువు జపములా శుభమై
కరువే తీర్చ మహలక్ష్మి కనులతొ చూపే
పుస్తక పఠనము నిత్యము
వస్తను కలగించుటయే
మస్తక శుద్ధియగుటౌను మానిత వేళల్
దుస్తర మార్గము భత్యము
పస్తుల బ్రతుకగు భుక్తియు
కుస్తియు జీవితము లక్ష్మి కూడు కొరకునే
లోపాలు మనిషి యగుటే
పాపాలు పరము యగుటే
కోపాలు సహజము లక్ష్మి కోర్కెల మయమే
దీపాల వెలుగు నీడే
రూపాల వలలు నీడే
తాపాల మయమగు లక్ష్మి తప్పుల మయమే
పగతో ప్రేమించకుమా
సెగతో సామర్ధ్యమమా
మగసిరి యనురాగమేను మనసే పంచీ
మగువే సహకారముగా
తెగువే యాపేక్ష లుగా
చిగురింప విశాల బుద్ధి చేరువ లక్ష్మీ
కం..రావమ్మ మహా లక్ష్మివి
శ్రావణమాసమిది దేవి స్వాగతమమ్మా
జీవుల సేవలు యివియే
పావన లక్ష్యమును తెల్పి పాలన మమ్మా
కం ..సత్యమెపుడు సంతసమే
సత్యపలుకు శాంతినిచ్చు సహనమ్ముగనే
సత్య చెలిమి కలకాలము
సత్య తపన సౌఖ్యమేను సమయమ్ముగనే
కం..సఖ్యత సమయము ధర్మము
సఖ్యత విధమే సహచర సంతస విధిగన్
సఖ్యత యే చూప మనిషి
సఖ్యత గా సంగమమ్ము శాంతిసుఖముగున్
కం..పదవు లతుక్కునిపలుకే
పదహారు కళలను చూపు పసిడికొరకునే
అదుపే తప్పియు తిరుగుట
పెదవీ రుచిమరిగి నాక పిలుపే లక్ష్మీ
కం..చిరకాలంబుగ భక్తియె
స్మరణంబుగనే మననము సాహిత్యముగన్
సిరులే కావ్యమ్ము గనే
స్థిరచిత్తంబుయు సరస్వతీ తలపులుగన్
కం..ద్వందార్ధములేభూషణ
ద్వంద పలుకలే కథలగు ధరణి సుఖముగా
ద్వందా వైఖరి బ్రతుకే
ద్వందా తీతము కళలగు ధర్మము విధిగన్
కం..మనసులో మదనమ్ముగ
మనువాడే కళయు నచ్చ మార్గము నెంచా
మనమన్నా యర్ధమగుట
మన కోర్కెలు తీరగల్గు మాలిని లక్ష్మీ
కం..ఎన్నో శాస్త్రాలు మనకు
ఎన్నో యద్భుత కళలుగ యెన్ను న్నాయో
ఎన్నో యి బ్బందులుగా
ఎన్నో జీవిత మలుపులు యేలను లక్ష్మీ
కం..ఆత్మకు చలిమిగ జలమే
ఆత్మకు బలమగుటె గాలి ఆరాధ్యనిగా
ఆత్మ కు యగ్నియు చెలిమే
ఆత్మకు అర్ధం తెలుపుట ఆశలు లక్ష్మీ
కం..మనకర్తృత్వ బారము
క్షణభంగురమే కదలిక క్షమయు సుఖముగన్
ప్రణమిళ్ళు జగతి తల్లికి
ఋణ భారము తొలగేను ఋషివై పయణమ్
కం..వ్యక్తా వ్యక్తము యనుటే
శక్తే కలసే కలియుగ శాంతిని కోరే
రక్షే జీవిత భాగ్యము
యుక్తే సకలమ్ముగాను యున్నతి లక్ష్మీ
కం..శిక్షణ యనుచూ సేరిరి
లక్షిత విద్య కదలుకలు లాసిగ నేర్పే
భక్షణ గా తిండి పెరిగి
రక్షణ లేక కదిలేని రాక్షస గుణమే
కం..బరువే కొలిచే విధమే
కరువొచ్చిన విధముగాను కమ్ముట యేలా
సిరులున్న బరువు పెరిగే
అరువున్నా కథ మలుపులు ఆశల మయమే
కం..నువ్వే నేనై మనమై
నవ్వే చిందే శుభమ్ము నాట్యము కాదే
పువై నేనై నుంటిని
నువ్వే రాకయు మనసుకు సుఖమే లక్ష్మీ
కం..అందా లొలికే భామలు
పందాలు మగనిని చేర పండుగ రోజే
చిందేను సొగసు కళలే
విందే పొందుకు తహతహ వేకువ లక్ష్మీ
కం..నిన్ను ప్రేమించె మనిషి
కన్నులుకలిపేను నిత్య కాలము నందే
మన్నుతినే పామవకే
పెన్నిధి సన్నిధి మనస్సు పిలుపే ప్రేమా
కం..ఎగసిపడే మనసే యిది
సొగసే మనిషికి పిలుపుల సొమ్ముయు కాదా
మగసిరి మోహనపు కళలు
మగువ కులుకు చిత్రమాయె మాయలు లక్ష్మీ
కం..తీరం లేనిది బ్రతుకై
మారం ప్రేమయు నిరంత మానస పలుకై
బేరం లేని కడలిగా
వైరంలేని మిత్ర మౌను వైనము లక్ష్మీ
కం..ఆదియు సోమయు మంగళ
బుధయు గురు శుక్ర శని కళ బుద్దిని మార్చే
కాదని ఔనని బ్రతుకున
ఏదియు నన్నను సుఖముయు యేమియు లక్ష్మీ
శుభోదయ స్వాగతం గణాధిపా
కం..గురువుల సేవయు పుణ్యము
తరువుల బ్రతుకు సహకార తాహత వల్లే
కరువులు యనకే కదులుట
చరణము లఫలము వలదులె చెలిమగు నిజమై
కం..ధైర్యానికి మతమేదియు
సౌర్యానికికులము యేల సౌఖ్యము చాలే
పర్వానికి సంపద యే
కార్యానికియుక్తి యుచాలు కాలపు నీడే
కం..సిరిపోయిన ఎవరైనను
మరిమరి తెలిపినను గుర్తు మార్గము లేదే
విరజాజి పువ్వు వాడిన
విరివెన్నెల మాయమైన వివరములేదే
కం..లోలకము కదల విధిగా
జోల లగుమదీ సుఖమగు జ్యోతి వెలుగులే
కాల మలుపులే సంపద
జ్వాల లు శాంతిగ యశాంతి జాతర బతుకే
కం..కథ కాదు యువజన భవిత
విధియాడేవిద్య ఫలము విజయమ్ము గనే
మదిసాహిత్యమ్ము గనే
మేధయె మేధస్సు పెంచు మేదిని యందున్
కం..మతి శీతోష్ణ ప్రకృతి గా
గతిగా విధిగా స్థితిగను గమనమ్ముగనే
యతిగా బ్రతుకుట సులభము
జతగా కన్నాను సుఖము జాగృతి సేవే
కం..నవ్వుల నారీ నాట్యము
మువ్వల శబ్దమ్ము గాను ముఖ్యము గానే
రివ్వున ఉప్పొంగ మనసు
పువ్వు పరిమళాన్ని పీల్చు పుడమిన శక్తీ
కం..పనిసేయనెడల పడచుయు
ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్
దనభుక్తి నెడల తల్లియు
కనలేని సంపద గాను కళలగు భార్యా
కం..కర్మవశమున నిజమునే
ధర్మమనెడి బుద్ధిరాక ధరణి న బ్రతుకే
మర్మము చుట్టూ తిరుగుతు
నిర్మలము మరచియు కర్మ నీడలనుచుటన్
కం..ఏదియ యేమైన ఫలము
ఏదియు నీదిగను లేదు యేలా ననకూ
వాదిగ యేలా బ్రతుకగు
ఆది పురుషుని గమనమ్ము ఆశల కళలే
కం..రివ్వున సాగే మెరుపై
నవ్వుల నయనాల మలుపు నటనా తలపై
జివ్వున లాగే జవ్వన
సవ్వడి చేయుచు పిలుపులు సంఘమ్ము కలై
కం..సాధ్యా సాధ్యాలు గనే
విద్యా బుద్దులు యలవడు వినయమ్ముగనే
అధ్యాయాలు చదువు గా
విద్యార్థి దసౌను ముఖ్య విజయమ్ముగనే
కం..పుణ్యమ్ము గనే స్నేహము
విన్యాసము సేవగాను విశ్వమ్ముగనే
మాన్యమహోదర చెలిమియె
ధన్యత తెలిపే మనసుయె ధరణి సుఖమ్మే
కం..దొరకదు కాలము ప్రకృతియు
దొరకు గురువుగాను తల్లి తోడుగ తండ్రీ
చిరుహాసపు నేస్తముగా
పెరిగెను విద్యల బతుకులు పలుకే గతిగన్
కం..జీవ ప్రక్రియే కలిగా
జీవపరిణామ సుఖమ్ము చేరువ ప్రకృతే
నవయవ్వనమే బ్రతుకై
నవరంద్ర మహిమ మనిషికి నమ్మక శాస్త్రమ్
కం.. స్నేహములమూల్య మైనవి
దాహార్తిగ నుండవలెను ధర్మము నిలుపన్
మోహములకు దూరముగా
నాహా ! యను మానవత్వ మమరిక లలరన్ !
కం..స్నేహమ్మే బంధముగా
స్నేహమ్ము ప్రేమగాను సీఘ్రము బతుకున్
స్నేహము విడలేని గుణము
స్నేహమ్మేవిజ్ఞతౌను సేతువు గతిగన్
కం..ఆధ్యాత్మిక శ్రవణముయే
విద్యార్థుల విద్య వాక్కు విశ్వాసముగా
సాధ్యా సౌబ్రాతృత్వము
అధ్యాయం శ్రావణమ్ము యాశ్రిత జయమే
కం..గురువుల సేవయు పుణ్యము
తరువుల బ్రతుకు సహకార తాహత వల్లే
కరువులు యనకే కదులుట
చరణము లఫలము వలదులె చెలిమగు నిజమై
కం..ఏదియ యేమైన ఫలము
ఏదియు నీదిగను లేదు యేలా ననకూ
వాదిగ యేలా బ్రతుకగు
ఆది పురుషుని గమనమ్ము ఆశల కళలే
కం..ధర్మప్రచారవాహిని
ధర్మార్ధ తత్వ సుబోధ ధ్యానమ్ముగనే
మర్మము చైతన్య విదీ
నిర్మాణ జన స్వభావ నిర్ణయ భోధల్
కం..విధి నాటకమే వింతయె
తిధి సేవే జయముగాను తీరుగ బతుకున్
పధకమ్ముగనే పదనిస
అధరమ్మునుపొంద జీవి ఆశ్రిత జీవమ్
కం..అవసరమైనది దొరకదు
సవరణలున్న దొరికేది సమయమ్ము గనే
పవనము మాదిరి కనకయె
అవహేళనలున్న వోర్పు ఆయుధముగనే
కం..సవివరణ గాను తెలిపెద
కవి గాంచునె పగటి యందు కవికుల తిలకా
అవియివి యనకే సత్యము
నవవిధ వర్ణన కళలగు నానుడి కవిగా
కం..ఆహా యేమి పసందుయు
సాహో యనుచూ నుడివిరి సంతస మొచ్చున్
నూహా యనకే నిజమే
నీహారి నడమంత్రపుసిరి నీకును నాకే
కం..సత్య శుభాకాంక్షలుగా
నిత్యము ధర్మ పరమౌను నిందలు గనుమా
ముత్యము గాభూజనులే
బృత్యుని పలుకౌను వింత వృత్తిని బట్టే
కం..పచ్చని చేలే కంటికి
నెచ్చెలి నవ్వుగను జంట నటనే ఓహో
విచ్చిన లతలే ముద్దే
మెచ్చిన నచ్చిన యువతికి మోహము ఓహో
కం..పోపోర స్వామీయిక
రేపో మాపో రణముకు రీతిగ రమ్మూ
తాపమ్ము యికను తప్పదు
ఓపిక సంగమ సమయము ఓర్పుగ శాంతే
కం..తరుణీ దప్పులు గల్గిన
ద్విరచిత కావ్యపు సొగసులు దినదిన వృద్ధిన్
బరుగుచు గంగల కడలికి
వరములు తీర్చగ సమయము వారధి నీవే
కం..కనిపించు పనే చేయుచు
పని యవ్వక చిరు నగవు పకపక పలుకే
వినినంతయు వేగపరచ
గుణనిధి తోడగు విజయము క్లుప్తము కాదా
కం..నిజమే కనలేవు యిపుడు
భజనే జీవిత మలుపులు బంధము గానే
సృజన సహనమే బలమగు
విజయమ్ము గను విధి నమ్మ వేకువ మనసే
కం..లాభాలన్నివి ఓర్పుతొ
ప్రాభవ నేర్పుయు వివరణ పాఠము బట్టే
శోభయు దీర్ఘమగుటయే
ఉభయుల సత్య సమయకాల ఉన్నతి బట్టే
కం..త్రిగుణములకు లోబడియే
సాగెడి సత్యపలుగాను సాత్విక మగుటే
వేగము మాయల కాలము
వేగుట తథ్యపరమౌను విద్యల గతిగా
కం..వినియు మది నిలుపుటగను
వినిన స్మరణగను జేయు విద్యయె జ్ఞానమ్
ఎనిమిది బుద్దుల బతుకే
కని సంశయమున్ను తీర్చ కవిగా ధర్మమ్
కం..చిన్నరెవికలో చన్నులు
కన్నులు పిలుపై కులుకులు కావడి యగుటన్
మున్నీటి వలకు చిక్కెను
కన్నులలో చన్నులమరె కాంతా మణికిన్
కం..కాలము లేమిసమానము
గాలివలే కలయుచుండు గళమే సుఖమున్
మాలిని జయము యపజయము
జాలి గుణమ్ముగ మనస్సు జాడ్యపు బతుకున్
కం..పదమే లా ఎప్పుడగుట
అదియే జరిగే విధాన ఆశ్రిత దైవమ్
పదిలం యనేది లేదులె
మది పైవాని కళలౌను మాయల లోకమ్
Comments
Post a Comment