వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం .. సప్తమ స్కంధము - మొదటి అధ్యాయము తెలుగు అనువాదము
నారద-యుధిష్థిర సంవాదము-జయవిజయుల గాథ... 1 నుండి 10 యదార్ధ శ్లోకభావాలు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉 19..06...2020
శ్రీశుక ఉవాచ
1.21 (ఇరువది ఒకటవ శ్లోకము) నుండి ౩౪ శ్లోకాల తాత్పర్యము
శ్రీశుకుడు నుడివెను - సర్వసమర్థుడైన నారదమహర్షి యుధిష్ఠిరుని ఈ ప్రశ్నను విని మిక్కిలి సంతసించెను. పిమ్మట ఆ మహాసభయందు అందరు వినుచుండగా ధర్మరాజునకు ఈ కథను వినిఫించెను.
నారదుడు వచించెను- ధర్మరాజా! నింద, స్తుతి, సత్కారము, తిరస్కారము అనునవి ఈ శరీరమునకు సంబంధించినవి. ప్రకృతి, పురుషులను గూర్చిన వివేకము లేకుండుటచే అజ్ఞానకారణముగా ఆత్మయందు కల్పితమైనది.
దేహాభిమానము కారణముగా జీవుడు ఈ శరీరమును నేను అని భావించి, దండనము, పరుష వచనములు ఎదురైనప్పుడు, అవి తనవి గానే భావించును. కాని, భగవంతునకు జీవులవలె ఇట్టి అభిమానము ఉండదు. ఆ ప్రభువు సర్వాత్మ స్వరూపుడు, అద్వితీయుడు. ఇతరులను దండించు నప్పుడు గూడ క్రోధము, ద్వేషముల వలనగాక, వారి శ్రేయస్సు కొరకే అట్లు చేయును. భగవంతుని విషయములో హింసకు చోటులేదు.
అందువలన వైరముచేగాని, భక్తిచేగాని, భయముచేగాని, మైత్రిచేగాని, ప్రియతముడని గాని, లేక ఏ కారణమున నైనను భగవంతుని పై పూర్తిగ మనసును లగ్నము చేయవలెను. భగవంతుని దృష్టిలో ఈ భావముల యందు ఎట్టి భేదము ఉండదు.
రాజా! మనుష్యుడు భగవంతుని యెడల వైరభావముతో ఎంతటి తన్మయత్వమును భక్తిభావముతో పొందలేడు అని నా దృఢ విశ్వాసము.
తుమ్మెద ఒక పురుగును తెచ్చి తన గూటిలో ఉంచి, మూసివేయును. పిమ్మట అది ఝుమ్మని నాదము చేయుచూ ఆ గూటిచుట్టూరా తిరుగును. ఆ పురుగు భయమునకు లోనై ఆ తుమ్మెదనే స్మరించుచుండును. తత్ఫలితముగా ఆ పురుగు తన శరీరమును విడువకుండగనే, ఆ తుమ్మెద రూపమును పొందును.
శ్రీకృష్ణభగవానుని విషయములోగూడ ఈ దృష్టాంతము చక్కగా వర్తించును. సర్వశక్తి మంతుడైన ఆ పరమపురుషుడు తన లీలలను ప్రకటించుటకై మానవునిగా గోచరించును. వైరభావముతో నైనను ఆ ప్రభువును నిరంతరము స్మరించుటచే పాపరహితుడై వారు కూడా ఆ స్వామినే పొందిరి.
పెక్కుమంది మనుజులు కామముతో, ద్వేషముతో, భయముతో, స్నేహముతో తమ మనస్సును ఆ భగవంతుని యందే లగ్నము చేయుటవలన వారి పాపములన్నియును ప్రక్షాళితము లయ్యెను. భక్తులవలె వారును ఆ భగవంతునిలో లీనమైరి.
రాజా! గోపికలు కామముతోను, అనగా ప్రేమభావముతో, కంసుడు భయకారణముగను, శిశుపాల దంతవక్త్రాది రాజులు ద్వేషభావముతోను, యాదవులు బాంధవ్య కారణముగను, మీరు (పాండవులు) స్నేహభావముతోను, మేము (మహర్షులు) భక్తితోను మన మనస్సులను భగవంతునియందు లగ్నమొనర్చుట జరిగెను.
పైన తెలిపిన భావములలో భక్తి భావము తప్ప మిగిలిన వాటిలో ఏ విధముగనైనను తరించిన వారిలో వేనుడు చేరడు - ఏలయన, అతడు ఏ విధముగ నైనను భగవంతుని స్మరింపలేదు. సారాంశ మేమనగా ఏ రీతిగ నైనను శ్రీకృష్ణుని యందు మనస్సును నిలుపుట అవసరము.
రాజా! మీ పినతల్లి కుమారుడైన శిశుపాలుడును, దంతవక్త్రుడును, శ్రీమహావిష్ణువునకు ప్రముఖ పార్షదులై యుండిరి. సనకాది బ్రాహ్మణ శాపము వలన ఆ ఇరువురును పదచ్యుతులైరి.
యుధిష్ఠిరుడు అడిగెను- భగవంతుని పార్షదులను గూడ ప్రభావితమొనర్చిన ఆ శాపము ఎట్టిది? అట్లు శపించిన వారెవరు? భగవంతుని అనన్య భక్తులు గూడ జనన మరణ రూప సంసార చక్రమునందు పడవలసి వచ్చె నను విషయము నమ్మశక్యముగాకున్నది. వైకుంఠ వాసులకు ప్రాకృత శరీరములు, ఇంద్రియములు, ప్రాణములు ఉండవు. అట్టి వారికి ప్రాకృత శరీరములతో సంబంధము ఎట్లు ఏర్పడినది? ఈ విషయమును దయతో వివరింపుము.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని మొదటి అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం .. సప్తమ స్కంధము - మొదటి అధ్యాయము తెలుగు అనువాదము
నారద-యుధిష్థిర సంవాదము-జయవిజయుల గాథ... 1 నుండి 10 యదార్ధ శ్లోకభావాలు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉 18..06...2020
పరీక్షిన్మహారాజు వచించెను-స్వామీ! శ్రీహరి సహజముగా భేదభావము లేనివాడు. సముడు, సకల ప్రాణులకు ప్రియుడు, సుహృదుడు. అట్టివాడు సామాన్యమానవులవలె భేదబుద్ధితో తన మిత్రులపక్షము వహించి, శత్రువులకు కీడు తలపెట్టెను. ఇంద్రునికొరకై దైత్యులను ఏల వధించెను?
ఆ ప్రభువు స్వయముగ పరిపూర్ణుడు. దివ్యమంగళ విగ్రహుడు! కనుక, ఆయనకు దేవతలవలన కలుగు ప్రయోజనము ఏమియు ఉండదు. నిర్గుణుడు అగుటవలన దైత్యులతో వైరముగాని, ఉద్వేగముగాని ఉండదు.
మహాత్మా! నీవు భగవద్భక్తి సంపన్నుడవు. భగవంతుని సమత్వాది గుణముల విషయమున నా చిత్తమునందు గొప్ఫ సందేహము గలదు. దయచేసి దానిని తొలగింపుము.
శ్రీశుక ఉవాచ
శ్రీశుకుడు వచించెను-పరీక్షిన్మహారాజా! శ్రీహరి వృత్తాంతము అద్భుతావహమైనది. దాని విషయమున నీవు సముచితముగా ప్రశ్నించితివి. ఈ ప్రసంగమున ప్రహ్లాదుడు మొదలగు భక్తులయొక్క మహత్త్వము వివరింపబడినది. దానిని వినుటవలన భగవద్భక్తి ఇనుమడించును.
పరమ పవిత్రమైన శ్రీహరి కథలను నారదాది మహాత్ములు పరమభక్తితో గానము చేయుచుందురు. నేను నా తండ్రిగారైన వేదవ్యాసునకు నమస్కరించి, భగవంతుని లీలలను వర్ణింతును.
వాస్తవముగా భగవంతుడు నిర్గుణుడు, జన్మరహితుడు. దేహేంద్రియాదులు లేనివాడు. ప్రకృతికి అతీతుడు. ఐనను తన మాయాగుణములను ఆశ్రయించి, బాధ్యబాధకభావములను (అనగా చంపుట, చనిపోవుట అను పరస్పర విరుద్ధభావములను) గ్రహించెను.
రాజా! సత్త్వరజస్తమములు ప్రకృతియొక్క గుణములు. అవి ఆత్మకు లేవు. ఈ మూడు గుణములు గూడ ఒకేసారి పెరుగుటగాని, తగ్గుటగాని జరుగదు.
భగవంతుడు వేర్వేరు సమయములయందు ఆయా గుణములను స్వీకరించును. సత్త్వగుణములు వృద్ధి చెందునప్పుడు దేవతల, ఋషల పక్షము వహించును. రజోగుణమువృద్ధి చెందినప్పుడు దైత్యుల పక్షమున చేరును. తమోగుణము వర్ధిల్లు సమయమున యక్షరాక్షసుల పక్షమున నిలుచును.
సర్వత్ర వ్యాపించియున్న అగ్ని, కర్రల సంబంధములే గోచరించును. అట్లే అంతటా నిరాకారముగ నిండి నిబిడీకృతమైయున్న పరమాత్మను, ప్రజ్ఞావంతులు నేతి, నేతి-ఇదికాదు, ఇదికాదు అనుచు అన్నింటిని నిషేధించుచు తమ హృదయములను మథించు అంర్యామిగానున్న ఆ భగవంతుని దర్శింతురు.
పరమేశ్వరుడు చిత్రవిచిత్రములగు శరీరములద్వారా రమించగోరినప్పుడు తన మాయాశక్తిద్వారా రజోగుణముచే సృష్టికార్యమును ప్రారంభించును. సత్త్వగుణముతో ఆ సృష్టిని సంరక్షించును. అనంతరము నశింపజేయ గోరినప్పుడు ఆ ఈశ్వరుడే తమోగుణముద్వారా సమస్తసృష్టిని లయింపజేయును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని మొదటి అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం .. సప్తమ స్కంధము - మొదటి అధ్యాయము తెలుగు అనువాదము
నారద-యుధిష్థిర సంవాదము-జయవిజయుల గాథ... 1 నుండి 10 యదార్ధ శ్లోకభావాలు
ఓం నమో భగవతే వాసుదేవాయ
19.6.2020 (౧౧ శ్లోకాల నుండి ౨౦ శ్లోకాల తాత్పర్యము ) (౨)
1.11
మహారాజా! భగవంతుడు సత్యసంకల్పుడు. ఆయనయే జగదుత్పత్తికి నిమిత్తకారణమై ప్రకృతి, పురుషులకు ఆశ్రయమైన కాలమును సృష్టించును. కనుక, ఆయన కాలమునకు అధీనుడుకాదు. కాలమే ఆయన యొక్క అధీనములో ఉండును. కాలస్వరూపుడైన ఈశ్వరుడు సత్ప్వగుణమును వృద్ధిచేయునప్పుడు సత్త్వమయుడైన దేవతల బలమును పెంపొందింప జేయును. పరమయశస్వి, దేవతా ప్రియుడైన ఆ పరమాత్మ అప్పుడు దేవవిరోధులు, రజస్తమోగుణములు గల దైత్యులను సంహరించును. వాస్తవముగా అందరును ఆయనకు సమానులే.
రాజా! ఈ విషయమున దేవర్షియైన నారదుడు ప్రీతితో ఒక గాధను తెలిపియుండెను. మీ తాతయైన యుధిష్ఠిరుడు రాజసూయ యాగసమయమున ఈ విషయమును గూర్చి నారదుని ప్రశ్నించెను.
రాజసూయ యాగసమయమున చేది రాజైన శిశు పాలుడు అందరు చూచు చుండగనే శ్రీకృష్ణభగవానునిలో ఐక్యమైన అద్భుతమైన సంఘటనను యుధిష్ఠిరుడు స్వయముగా తిలకించెను. ఆ మహాసభయందు మహామునులు ఆసీనులై యుండిరి. దేవర్షి యగు నారదుడు గూడ అప్ఫుడు అచట ఉండెను. మిగుల ఆశ్చర్యకరమైన ఈ దృశ్యమును గాంచి, పాండు సుతుడగు యుధిష్ఠిరుడు దేవర్షిని ఇట్లు ప్రశ్నించెను.
యుధిష్ఠిరుడు పలికెను-ఔరా! ఈ దృశ్యము మిగుల అద్భుతమైనది. పరమాత్ముడైన శ్రీకృష్ణుని యందు ఐక్యమగుట అనన్య భక్తులకు గూడ దుర్లభము. కావున, శ్రీకృష్ణుని నిరంతరము ద్వేషించునట్టి శిశుపాలునకు ఇట్టి దుర్లభమైన గతి ఎట్లు ప్రాప్తించెను.
మునీశ్వరా! మేము అందరము ఈ రహస్యమును తెలియ గోరుచున్నాము. పూర్వ కాలమున భగవంతుని నిందించుటచే వేనుడను రాజును ఋషీశ్వరులు నరకమున పడద్రోసిరి.
దమఘోషుని సుతుడు, పాపాత్ముడైన శిశుపాలుడును, దుర్భుద్ధియైన దంతవక్త్రుడును బాల్యము నుండియు ఇంతవరకును భగవంతుడైన శ్రీకృష్ణుని యందు ద్వేషభావమును కలిగియే యున్నారు.
శాశ్వతుడు, పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణభగవానుని తిట్టిపోయుచునే యున్నారు. ఐనను, వారికి నాలుకపై చిన్న మచ్చకూడ ఏర్పడలేదు. వారికి ఘోరాంధకారమయమైన నరకము గూడ ప్రాప్తించలేదు. పైగా, అత్యంత దుర్లభమైన భగవత్ప్రాప్తి అందరును చూచుచుండగనే అనాయాసముగా వీరికి లభించినది. దీనికి కారణమేమి?
ఈ విషయమున గాలి తాకిడికి దీపశిఖవలె నా బుద్ధి భ్రమకులోనై అటునిటు కొట్టుకొనుచున్నధి. దేవర్షీ! నీవు సర్వజ్ఞుడవు. కావున, ఈ అద్భుతఘటనలోగల రహస్యమును వివరింపుము.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని మొదటి అధ్యాయము ఇంకను కొనసాగును)
తదుపరి ....3
శ్రీశుక ఉవాచ
1.21 (ఇరువది ఒకటవ శ్లోకము) నుండి ౩౪ శ్లోకాల తాత్పర్యము
శ్రీశుకుడు నుడివెను - సర్వసమర్థుడైన నారదమహర్షి యుధిష్ఠిరుని ఈ ప్రశ్నను విని మిక్కిలి సంతసించెను. పిమ్మట ఆ మహాసభయందు అందరు వినుచుండగా ధర్మరాజునకు ఈ కథను వినిఫించెను.
నారదుడు వచించెను- ధర్మరాజా! నింద, స్తుతి, సత్కారము, తిరస్కారము అనునవి ఈ శరీరమునకు సంబంధించినవి. ప్రకృతి, పురుషులను గూర్చిన వివేకము లేకుండుటచే అజ్ఞానకారణముగా ఆత్మయందు కల్పితమైనది.
దేహాభిమానము కారణముగా జీవుడు ఈ శరీరమును నేను అని భావించి, దండనము, పరుష వచనములు ఎదురైనప్పుడు, అవి తనవి గానే భావించును. కాని, భగవంతునకు జీవులవలె ఇట్టి అభిమానము ఉండదు. ఆ ప్రభువు సర్వాత్మ స్వరూపుడు, అద్వితీయుడు. ఇతరులను దండించు నప్పుడు గూడ క్రోధము, ద్వేషముల వలనగాక, వారి శ్రేయస్సు కొరకే అట్లు చేయును. భగవంతుని విషయములో హింసకు చోటులేదు.
అందువలన వైరముచేగాని, భక్తిచేగాని, భయముచేగాని, మైత్రిచేగాని, ప్రియతముడని గాని, లేక ఏ కారణమున నైనను భగవంతుని పై పూర్తిగ మనసును లగ్నము చేయవలెను. భగవంతుని దృష్టిలో ఈ భావముల యందు ఎట్టి భేదము ఉండదు.
రాజా! మనుష్యుడు భగవంతుని యెడల వైరభావముతో ఎంతటి తన్మయత్వమును భక్తిభావముతో పొందలేడు అని నా దృఢ విశ్వాసము.
తుమ్మెద ఒక పురుగును తెచ్చి తన గూటిలో ఉంచి, మూసివేయును. పిమ్మట అది ఝుమ్మని నాదము చేయుచూ ఆ గూటిచుట్టూరా తిరుగును. ఆ పురుగు భయమునకు లోనై ఆ తుమ్మెదనే స్మరించుచుండును. తత్ఫలితముగా ఆ పురుగు తన శరీరమును విడువకుండగనే, ఆ తుమ్మెద రూపమును పొందును.
శ్రీకృష్ణభగవానుని విషయములోగూడ ఈ దృష్టాంతము చక్కగా వర్తించును. సర్వశక్తి మంతుడైన ఆ పరమపురుషుడు తన లీలలను ప్రకటించుటకై మానవునిగా గోచరించును. వైరభావముతో నైనను ఆ ప్రభువును నిరంతరము స్మరించుటచే పాపరహితుడై వారు కూడా ఆ స్వామినే పొందిరి.
పెక్కుమంది మనుజులు కామముతో, ద్వేషముతో, భయముతో, స్నేహముతో తమ మనస్సును ఆ భగవంతుని యందే లగ్నము చేయుటవలన వారి పాపములన్నియును ప్రక్షాళితము లయ్యెను. భక్తులవలె వారును ఆ భగవంతునిలో లీనమైరి.
రాజా! గోపికలు కామముతోను, అనగా ప్రేమభావముతో, కంసుడు భయకారణముగను, శిశుపాల దంతవక్త్రాది రాజులు ద్వేషభావముతోను, యాదవులు బాంధవ్య కారణముగను, మీరు (పాండవులు) స్నేహభావముతోను, మేము (మహర్షులు) భక్తితోను మన మనస్సులను భగవంతునియందు లగ్నమొనర్చుట జరిగెను.
పైన తెలిపిన భావములలో భక్తి భావము తప్ప మిగిలిన వాటిలో ఏ విధముగనైనను తరించిన వారిలో వేనుడు చేరడు - ఏలయన, అతడు ఏ విధముగ నైనను భగవంతుని స్మరింపలేదు. సారాంశ మేమనగా ఏ రీతిగ నైనను శ్రీకృష్ణుని యందు మనస్సును నిలుపుట అవసరము.
రాజా! మీ పినతల్లి కుమారుడైన శిశుపాలుడును, దంతవక్త్రుడును, శ్రీమహావిష్ణువునకు ప్రముఖ పార్షదులై యుండిరి. సనకాది బ్రాహ్మణ శాపము వలన ఆ ఇరువురును పదచ్యుతులైరి.
యుధిష్ఠిరుడు అడిగెను- భగవంతుని పార్షదులను గూడ ప్రభావితమొనర్చిన ఆ శాపము ఎట్టిది? అట్లు శపించిన వారెవరు? భగవంతుని అనన్య భక్తులు గూడ జనన మరణ రూప సంసార చక్రమునందు పడవలసి వచ్చె నను విషయము నమ్మశక్యముగాకున్నది. వైకుంఠ వాసులకు ప్రాకృత శరీరములు, ఇంద్రియములు, ప్రాణములు ఉండవు. అట్టి వారికి ప్రాకృత శరీరములతో సంబంధము ఎట్లు ఏర్పడినది? ఈ విషయమును దయతో వివరింపుము.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని మొదటి అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
మక్కువ కలిగే కదిలే
చక్కని కళలే మనస్సు చేరువ యగుటే
ఎక్కవ ఆశను లేదును
చుక్కలలో నొక్క నక్క సుడి వడి తిరిగెన్
రోజుకొక కధ ( )
_**ఆస్తి పాస్తులు, డబ్బు డాబాలు, బంగారం భూములు పంచిన వాడు మాత్రమేనా తండ్రంటే?**
_**ఈమధ్య మా పెదనాన్న కొడుకు తన కూతురు పెళ్లి చేస్తూ ఆ పెళ్లికి బంధువులను పిలవడానికి పెళ్లి పిలుపులకు నన్ను తోడుగా రమ్మన్నాడు. ఇద్దరమూ కలిసి పెళ్లి పిలుపులకోసం ఒక ఊరిలో మా దూరపు బంధువుల ఇంటికి వెళ్ళాము. అతడు ఒక పెద్ద ఆఫీసర్ గా పనిచేస్తూ సుమారు మూడు లక్షల రూపాయలు పైనే "నెల జీతం" సంపాదిస్తున్న పెద్ద హోదా కలిగిన అధికారి. ఇక ఆయన భార్య కూడా నెలకు దాదాపు రెండు లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్న అధికారిని. ఆయన ఇద్దరి కొడుకులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ వారు కూడా నెలకు లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు.*_
_**కుశల ప్రశ్నలు, క్షేమ సమాచారాలు, పెళ్ళి పిలుపులు అయిన తరువాత నా కళ్ళు మరో వ్యక్తి కొరకు వెదుక్కుంటున్నాయి. అది ఆ అధికారి తండ్రి కొరకు, ఆయన ఎప్పుడు ప్రొద్దుటూరు వచ్చినా తప్పని సరిగా మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని కలిసి అన్నగారు బావున్నారా అంటూ ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో పలుకరించేవారు. దాదాపు పది సంవత్సరాలుగా ఆయన కనిపించట్లేదు.*_
_**ఇక ఉండబట్టలేక అడిగేశాను, మీ ఫాదర్ కనిపించట్లేదు అని. ఆ మాటవిన్న వెంటనే అతడి ముఖం కర్కశంగా తయారైంది. ఆ దౌర్భాగ్యుడి గురించి నన్ను అడగకండి, ఆస్తి పంపకాలలో నాకు ద్రోహం చేసిన ద్రోహి అంటూ ఆవేశంగా అనేక రకాల తిట్లు తిడుతూ తన గదిలోకి వెళ్లి పోయాడు. పరిస్థితిని గమనించిన మేము మెల్లగా అక్కడినుండి బయలుదేరి బయటకు వస్తున్న మాకు ఆ ఇంటి పనిమనిషి ఎదురైంది.*_
_**ఉండబట్టలేక ఆమెతో ఆ పెద్దాయన గురించి వివరాలు అడుగగా ఆయన గత పది సంవత్సరాలుగా ఊరి బయట ఉన్న అనాధ శరణాలయంలో ఉన్నట్లు తెలిసింది. ఆయన వయసు సుమారు 83 సం ఉండవచ్చు, ప్రస్తుతం ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అనుకుంటూ, నేరుగా అక్కడికెళ్లి ఆయనను కలిశాను. నన్ను చూడగానే ఆయన మొహంలో వెలుగు సూర్యకాంతి వలే ప్రకాశించింది. వెయ్యేనుగుల బలాన్ని పొందినట్లుగా ఎంతో ఉత్సాహంతో నడుచుకొంటూ వచ్చి అమాంతం నా పైన ఒరిగిపోయి నన్ను కౌగలించుకొని కన్నీరు కారుస్తూ నాయనా ! మా అన్నగారిని కలిసినట్లుగా ఉందంటూ ఆనందంతో ఉప్పొంగి పోయాడు.*_
_**బాబాయ్ గారు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగినందుకు ఆయన కళ్ళు చమర్చగా "అందరూ ఉండికూడా గత పది సంవత్సరాలుగా అనాధగా బ్రతుకుతూ తను అనుభవిస్తున్న నరకయాతనల గురించి ఆయన మాటల్లో వింటుంటే పగవాడికి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు అనుకుంటూ ", నా పూర్తి వివరాలను ఆయనకు వ్రాయించి ఇచ్చి బయలు దేరబోతున్న నన్ను మరొకసారి ముద్దాడి నాయనా మీ అమ్మ నాన్నలు అదృష్ట వంతులు ఒక్క పైసా కూడా నీకు పంచలేకపోయినా, నీకు ఉద్యోగం, వ్యాపారం లేకపోయినా వారు నిర్వర్థించవలసిన కార్యక్రమాలను నీ బాధ్యతగా నిర్వహించి వారికి ఏ కష్టమూ కలుగకుండా నీవు వారిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకొంటున్నావు. నీవు నిజంగా ధన్యజీవివి నాయనా అంటూ ఆశీర్వదించాడు. అక్కడ నుండి తిరిగి వచ్చిన నాకు ఆ కుటుంబ సభ్యులలో మార్పు తేవాలన్న బలమైన సంకల్పం ఏర్పడింది.*_
_**వెంటనే ఒక కథను టైప్ చేసి ఆ కుటుంబ సభ్యుల అందరి వాట్సాప్ నెంబర్లకు పంపించాను. పది రోజుల తర్వాత బాబాయ్ గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆయన ఆనందానికి అవధులు లేవు. నాయనా నీవు వచ్చి పోయిన వారం రోజుల తరువాత ఏ దేవుడి వరమోఏమో గాని నాకొడుకు కోడలు మనవళ్ళు వచ్చి నన్నేంతో గౌరవంగా ఇంటికి తీసుకొచ్చారు. వచ్చిన వెంటనే నా మనవడికి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేస్తున్నాను అంటూ చెబుతున్న ఆయన మాటల్లోనే ఎక్కడ లేని ఆనందాన్ని చూశా... మనసులోనే నాకు జ్ణానాన్ని ప్రసాదించిన ఆ మహా గురువులకు మనసా వాచా కర్మణా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.*_
_**ఆ కుటుంబ సభ్యులలో అంతలా మార్పు తెచ్చిన ఆ కథను మీ ముందుంచుతున్నాను.. అమరావతిలో రాజధాని వచ్చిన తర్వాత వెంకటేష్ అనే అతడు తక్కువ సమయంలో విజయవాడలో రియలెస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించిన వారిలో ఇతనొకడు. ఒకసారి గుంటూరుకు దగ్గర లోని ఒక పల్లెలో ఒక పొలం తక్కువధరకు వస్తోందని తెలిసి ఆ ఊరికి కారులో వెళ్ళి, అది చూసుకొని తిరిగి ఇంటికి వస్తున్నాడు వెంకటేష్. కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. వెంకటేష్ ఎంతగా ప్రయత్నించినా అది స్టార్ట్ కాలేదు.*_
_**మండుటెండలో ఆదారిలో ఎవరైనా వస్తారేమో అని కొద్దిసేపు వేచి చూశాడు. కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, ఎవరూ రాకపోవడంతో విధిలేక కారు లాక్ చేసి నడుచుకొంటూ కొంతదూరం వెళ్ళాక నాలుగు రోడ్ల కూడలిలో ఒక సోడా బంకు కనిపించింది. వెంకటేష్ కు దాహం వేస్తున్నది. ఆ సోడ బంకు వ్యక్తితో తాగడానికి ఒక చల్లని సోడా ఇవ్వమని అడిగాడు. అతను వెంకటేష్ కు తాగేందుకు సోడా ఇచ్చి అతని వివరాలను అడిగాడు.*_
_**వెంకటేష్ తానేందుకు అక్కడకు వచ్చాడో తిరిగి ఎక్కడికి వెళ్లాలో అడ్రస్ చెప్పగానే మీ నాన్నగారి పేరు ధర్మారావు గారు కదా అని అడిగాడు. అవుననగానే అతను ఎంతో అభిమానంగా “నువ్వు ఆ మహానుభావుడి కొడుకువా ఇలా నీడలోకి వచ్చి కూర్చోండయ్యా” అని అన్నాడు. “మీరు ఇక్కడే ఉండండి, నేను ఊర్లోకి వెళ్ళి కారు రిపేరు చేయడానికి మెకానిక్ ను పిలుచుకొని వస్తాను “అని సైకిల్ తీసుకొని వెంటనే ఊర్లోకి వెళ్ళి, పది నిమిషాలకు ఒక మెకానిక్ ను వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు.*_
_**సైకిల్ తొక్కడం వల్ల పట్టిన చెమటలు తుడుచుకుంటున్న ఆ వ్యక్తి వైపు వెంకటేష్ ఆశ్చర్యంగా చూస్తూ, అవును “మా నాన్న గారు మీకెలా తెలుసు? నా పని కోసం నీ వ్యాపారాన్ని కూడా వదిలి ఎందుకు వెళ్ళారు? ” అని అడిగాడు. దానికి అతను, “కొన్నేళ్ళ క్రితం నా కూలింగ్ మిషన్ రిపేరి కొరకు మీ ఏరియాకు దగ్గరగా ఉన్న ఆటోనగర్ లో మెకానిక్ దగ్గరకు వచ్చి రిపేరు అయిన కూలింగ్ మిషన్ ని రాత్రి పూట సుమారు పదకొండు గంటల పైనే ఆటోలో తీసుకొస్తున్న సమయంలో మీ ఇంటి ముందే ఆటో టయర్ పగిలిపోవడం వల్ల వచ్చిన శబ్దానికి మీ నాన్న గారు బయటకు వచ్చి స్టేప్నీ టయర్ లో కూడా గాలి లేక అవస్థలు పడుతున్న మిమ్మల్ని గమనించి అప్పటికే పడుతున్న వర్షం తీవ్రకావడంతో మమ్మల్ని ఇంటి వసారాలోకి పిలిచి కూర్చోమన్నాడు.*_
_**నేను ఉదయం నుండి కూలింగ్ మిషన్ సామాను కొరకు తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాను. మధ్యాహ్నం కూడా భోంచేయలేదు "సమయం లేక కాదు డబ్బు లేక ". ఆకలి కావడంతో, నాకు కళ్ళు తిరిగినట్లుగా అనిపించి అక్కడే ఒక చోట కూలబడ్డాను. నన్ను చూసిన మీ నాన్నగారు వెంటనే మీ ఇంట్లోనే నాకు కడుపు నిండా అన్నం పెట్టించాడు. ఆ రాత్రి పడుకోవడానికి నాకు వసతి కల్పించారు. ఆయన దేవుడయ్యా, నా జీవితాంతం ఆయనని నేనెప్పటికీ మరువలేనయ్యా“ అని అన్నాడు.*_
_**ఇది విన్న వెంకటేష్ కి కొద్దిసేపు నోట మాటలు రాలేదు. ఎప్పుడో మా నాన్నగారు ఒక్కసారి అన్నం పెట్టి పడుకోవడానికి చోటు కల్పించిన విషయాన్ని ఇంకా ఇప్పటికీ గుర్తు పెట్టుకొని మా నాన్న గారి పైన ఇతను ఇంతగా ఆప్యాయతను చూపుతున్నాడే మరి అలాంటి తండ్రిని తనేం చేశాడో అనేది తలుచుకొని ఉద్వేగానికీ లోనయ్యాడు. ఇంటికి వచ్చినా తన తండ్రి పైన "అతని కృతజ్ఞతా భావాన్ని తలుచుకుంటూ, ఆ రోజు రాత్రంతా వెంకటేష్ కు అదే ఆలోచనతో నిద్ర పట్టలేదు. ఇంతలో తన ఏసీ రూమ్ లో తనతో పాటు తన పక్కనే పడుకొన్న తన పెంపుడు కుక్క మూలుగు విని ఆతురతతో దాన్ని నిమిరిన అతడిలో ఆలోచన రేగింది ఈ కుక్క కోసం తాను కల్పిస్తున్న సౌకర్యాలలో, దానికోసం పెడుతున్న ఖర్చులో కేవలం పదిశాతం కంటే ఎక్కువ ఖర్చు కూడా కాదు కదా తన తండ్రికి తాను పెట్టే ఖర్చు అని అనిపించింది..*_
_**ఏ సంబంధమూ లేని “ఎవరో బయట వ్యక్తి మా నాన్నగారు ఒక్క పూట అన్నం పెట్టి విశ్రాంతి తీసుకోవడానికి ఒక్క రాత్రి చోటు ఇచ్చిన ఆ పనిని గుర్తుంచుకొని దానికి కృతజ్ఞతగా నన్ను అంతలా ఆత్మీయంగా చూసుకున్నాడే, ఒక వీధి కుక్కకు ఒకపూట అన్నం పెడితే తరువాత కనిపించిన ప్రతి సారి విశ్వాసంతో తోకాడిస్తూ మన కాళ్ళచుట్టూ తిరుగుతూ విశ్వాసం చూపిస్తుందే. మరి నా చిన్నప్పటి నుండి మానాన్న గారు నా ఆకలి తీర్చడం కోసం నాకు ఎన్ని సార్లు అన్నం పెట్టాడో, నా సుఖం కోసం ఎన్నోరకాల సౌకర్యాలను నాకు కల్పించడం కోసం ఎన్నెన్ని కష్టాలూ పడి నన్నీ స్థితిలోకి తీసుకువచ్చాడో అలాంటి నా కన్నతండ్రిపైన నేను ఎలాంటి విశ్వాసం చూపించాను, కనీసం ఒక వీధి కుక్క చూపించే విశ్వాసం, కృతజ్ఞత కూడా చూపించకుండా నిర్దాక్షిణ్యంగా ఆయనను అనాధ ఆశ్రమంలో వదిలి ఎంతటి తప్పు చేసాను” అని వెంకటేష్ తీవ్రంగా మదనపడ్డాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళి తన తండ్రిని ఇంటికి తీసుకువచ్చి, చేసిన తప్పుకు క్షమించమని పాదాల మీద పడి వేడుకున్నాడు.*_
_**మిత్రులారా ! ఇవేవీ అభూత కల్పనలు కాదు. నా జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు. ఈ కథే మా బంధువులకు కనువిప్పు కలిగించింది. మరి మీకు తెలిసిన వారికి ఈ కథను పంపండి. ఏ ఒక్కరు మారినా మీ జన్మధన్యమే కదా.. చివరగా నేను చెప్పేదేమిటంటే "తల్లిదండ్రులు నాకేమి పంచిచ్చారని కాకుండా, ఇంత గొప్ప జన్మనిచ్చిన వారిని నీవెలా చూసుకొంటున్నావనేదే ముఖ్యమైన అంశం " అని తెలుసుకోండి. దయచేసి ఎవ్వరూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి.. అలాగే "తల్లిదండ్రులను చక్కగా చూసుకొంటున్న వారికి నేను నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఈ కథనాన్ని వారికి అంకితమిస్తున్నాను "...*_
_**సర్వే జనా సుఖినోభవంతు.*
--((***))--
*"""***
_*🧘♂️దేవుడు*_
_*ఎక్కడున్నాడో*_
_*తెలుసా..!?🧘♀️*_
*_అందమైన జీవితం అందరికీ ఉండదు.. కానీ మనస్ఫూర్తిగా అభిమానం పంచే వాళ్ళుంటే ఆ లోటు తెలియదు._*
*_భార్య అలక తీర్చే భర్త, భర్త అలసట అర్థం చేసుకొనే భార్య, ఎన్ని అపార్థాలు వచ్చినా అర్థం చేసుకొని ముందుకు సాగిపోయే బంధమే.. వివాహ బంధం !_*
*_మనిషి ఏదైనా నమ్మితే పూర్తిగా నమ్మాలి, "లేదా" పూర్తిగా నమ్మకుండా ఉండాలి. అంతేగానీ సగం సగం నమ్మకాలు ఎప్పుడూ ప్రమాదమే._*
*_మనిషికి ఆశ ఎక్కువ.. నచ్చిన ప్రతీదీ కావాలంటుంది మనసు. కానీ కాలం ఎవరికి ఏమి ఇవ్వాలో అదే ఇస్తుంది._*
*_మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది. ధనవంతుడు.. ఎ సి బోగీలో వెళ్తాడు, మధ్యతరగతి వాడు స్లీపర్ క్లాస్ బోగీలో వెళ్తాడు, పేదవాడు సాధారణ బోగీలో వెళ్తాడు._*
*_కానీ ఎలా ప్రయాణం చేసి వెళ్ళినా అందరూ చేరవలసిన గమ్యానికే చేరతారు. అందరూ దిగేది ఒక ప్లాట్ ఫాం మీదకే. రైలు ఎక్కి ప్రయాణం చేస్తున్నంత వరకే ఈ తేడాలు._*
*_అలాగే జీవితం కూడా అంతే. ఈ శరీరంలో ప్రాణం ఉన్నంతవరకే ఈ తేడాలు. అది గ్రహించుకుని ధన-పేద బేధం లేకుండా అందరితో కలిసి మెలిసి, ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకుంటే అందరూ ఏసీ బోగీలో ప్రయాణం చేస్తున్నంత ఆనందంగా గడిచిపోతుంది._*
*_మనకి డబ్బుందికదా అని దేవుడికి ఇస్తే పుణ్యం వస్తుంది అనుకోవడం పొరపాటు. అదే పేద వాళ్ళకి పెడితే వాళ్ళు పొందే సంతోషంలో దేవుడుంటాడు. అది దేవుడికే ఇస్తున్నామనే భావన మనలో కలగాలి. అప్పుడే పేదవాడి కళ్ళల్లో కనిపించే ఆనందం ద్వారా తృప్తినిస్తుంది. దేవుడి ఆశీర్వాదం కూడా లభిస్తుంది._*
*_మనంచేసే పని ఎంతమంది చూస్తున్నారు అన్నది ముఖ్యం కాదు.. అది ఎంతమందికి ఉపయోగ పడుతుంది అన్నది ముఖ్యం._*
*_మంచి పని చేసేటప్పుడు మనిషి కనబడక్కరలేదు మంచితనం కనబడితే చాలు._*
*_ఇక్కడ మారాల్సింది మనిషి యొక్క మనసు, ఆలోచించే విధానం._*
*_మంచిగా ఆలోచిస్తే అంతా మంచిగానే కనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి._*
*_అవసరం ఉన్నా .. లేకపోయినా ఒకేలా ఉండాలి. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వితం కావు. అర్థం చేసుకొనే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యత గల మనస్సూ ఉంటే బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగా ఉంటుంది._*
*_చదువు ద్వారా సంస్కారం, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్న వారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే జీవిత సత్యం !_*
**"""""**
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక .... ఆరోగ్యప్రభ (2)
సేకరణ రచయత మల్లాప్రగడ రామకృష్ణ
ప్రతి ఒక్క రూ ఆచరించే కొన్ని అలవాట్లు
తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరబాట్లు చాలా సమస్యలకు కారణం అవుతుంది.. ప్రతి ఒక్కరు ఈ క్రింద ఉదహరించిన నియమాలు నమ్మే వాళ్ళు మటుకు తెలుసుకుంటే ఆచరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగతం ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరించిన నియమాలు తెలియ చేయడం వరకు నా బాధ్యత..మీరు తెలుసుకొని ఆచరిస్తారని ఆశిస్తాను ....
1.పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు, ఆ టైం లో వాకిలి చిమ్ముకో కూడదు ,సూర్యుని మోహన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్ల కూడదు...
2. నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత అసనంగా అక్కడ కూర్చుంటుంది.
3. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలా సేపు కూర్చో కూడదు..తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చో వాలి కానీ చై కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది అంటారు..
4.మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి,బట్టలు అలిచిన నీటిని కాళ్లపైన పోసుకో కూడదు అందులో జేష్ఠ దేవికి ప్రవేశం దొరుకుతుంది.
5. ఇళ్లు ఊడ్చిన చీపురు నిల్చో బెట్టకూడదు.
6. వంట గదిలో వాడిన మసి బట్టలను పొద్దు పోయాక ఉతక కూడదు..
7.సంధ్య కాలంలో సంసారం నిషేధం ,నిద్రపోకూడదు, ఆహారం తిన కూడదు గొడవలు పడకూడదు, ఆ సమయం ప్రదోషం కాలం ,ధ్యానం పూజ,మంచి ఫలితం ఇస్తుంది.
8.పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు , లోహం అయితే ఎత్తు తక్కువగా ఉండాలి, కొంచెం పెద్దగా ఉంటే వెనుక వీపు భాగం ఉండకుండా ఉండాలి,
9. పోయిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటినిండా పెట్టకూడదు, మీ పెద్దలు నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు.
10. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం కచ్చితంగా మంచినీరు ఉంచాలి,
11. ఒక్క కుంది దీపం పెట్టె వాళ్ళు 3 ఒత్తులు వేయాలి, రెండు అంత కన్నా ఎక్కువ పెట్టేవారు రెండు ఒత్తులు వేస్తే సరిపోతుంది..
12. రోజూ వారి దీపారాధన కు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము,నోము, దీక్ష,పరిహారాలు,సమయంలో, దీపారాధన నూనె అని మార్కెట్ లో దొరికెవి తెచుకోకండి నువ్వుల నూనె, ఆవు నైయి స్తోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి, కొబ్బరి నూనె తెచ్చుకోండి..కానీ కల్తీ నూనె వాడకండి..
13. పూజ చేసిన వెంటనే ఆ ఆసనం తెసివేయాలి అలానే 5 min కూడా ఉంచకూడదు
14. సాయంత్రం ఆరు దాటాక సూది, ఉప్పు,నూనె,కోడి గుడ్లు. ఇంటికి తెచుకోకండి అవి శని స్థానాలు మీ వెంట కొని తెచుకున్నట్టు..
15. పొద్దు పోయాక పెరుగు, ఊరగాయాలు, మిరపొడి ఎవ్వరికీ ఇవ్వకండి ముఖ్యముగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి అవి లక్ష్మీ స్థానాలు.
16.శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచుకోకూడదు, మీకు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజు తెచ్చుకోండి..
17. జాతకంలో కుజ దోషం ఉన్న వారు,వ్యాపారం లో గొడవలు ఇబ్బందులు ఉన్న వారు మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది.
18. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి, ఎవరైనా శనివారం రోజు బహుమతులు గా ఇనుము వస్తువులు, నల్లటి,నీలి,వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి.
19. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రం గా ఉంచండి,పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి..పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు
20. వంట చేసే వారు మాట్లాడుతూ అరుస్తూ చేయ కూడదు, వండే టప్పుడు పోరాబాటుగా కూడా మట్టాలాడే టప్పుడు పడే ఉమ్ము అందులో పడితే అది మహా దోషం పోరాబాటుగా అది అతిథులకు పెడితే చాలా పాపం చుట్టుకుంటుంది.
21. ఇంటి ముంగిటలో తమల పాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి తమల పాకు గౌరమ్మ మైలు గాలి తగల కూడదు..
22. ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు.
23.తులసి చెట్టు ఆకులు గోటితో గిల్ల కూడదు ఆడవారు అసలు కోయకూడదు, పొద్దు పోయాక నీరు పోయాకుడదు, ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడు గా భావించాలి...
24. దేవాలయం లో పూజించే విధంగా గాని గుడిలో గాని ఫ్లూట్ ఉన్న కృష్ణుడు ఉండాలి, గృహంలో ఫ్లూట్ ఊదు తున్నట్టు కృష్ణుడి విగ్రహం ఉండకూడదు...ఆవుతో ఉన్న కృష్ణుడు విగ్రహం మంచిది.
25.ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి.
26. రాత్రి పూట గాజులు, తాళి పక్కన తీసి పెట్టకూడదు, తాళిబొట్టులో దేవతా విగ్రహాలు డాల్లర్స్ వేసుకో కూడదు, పిన్నిసులు వేయకూడదు, దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంకి పెట్టాలి..
27.అపశకునాలు మాటలాడకూడదు తథాస్తు దేవతలు మన భుజాల పైనే ఉంటారు.
28.వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి. డబ్బు నగలు పెట్టె బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు.
29. దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కరువు లేకుండా ఉంటుంది.
30. విడిచిన బట్టలు కాలితో తొక్క కూడదు,
31. స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు.
32.ప్రతి రోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్క సారిఅయినా గడపకు పసుపుకుంకుమ పెట్టాలి.
33. ఉదయం లేవగానే పాసి మొహంతో అద్దం చూడకూడదు, తల దువ్వ కూడదు,
34. భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు..
35. స్నానం చేసి విడిచిన బట్ట మళ్ళీ కట్టకూడదు.
36.మంగళవారం, శుక్రవారం క్షుర సంస్కారం చేయకూడదు, గోర్లు తీయకూడదు, పేనులు కుక్కడం దువ్వడం చేయకూడదు.
37. రెండు చేతులతో తల గోక కూడదు .గోర్లు కొరుకుతూ ఉండకూడదు, కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు, గుమ్మం చిలుకు ఆడించకూడదు.
38. తినే టప్పుడు తుమ్మితే చై కడిగి మళ్ళీ తినాలి..
39. వెండి వస్తువులు బహుమతులు గా ఇవ్వకూడదు.
40.ఇంటి గుమ్మాo ముందు చెప్పులు వదల కూడదు కొంచెం దూరంగా వదలాలి,
41. ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వారు తాగే నీరు తిని మిగిలినవి ఎవరికి పెట్టకూడదు, ముఖ్యంగా భర్తకు ఎగిలి చేసినవి ఆ సమయంలో పెట్టకూడదు. మైలు నియమం పాటించాలి,
42. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారం లో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో బీపెట్టాలి .
43. జితం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం వారం నాడు ఊపు కొనాలి ధనం ఇంట్లో నిలుస్తుంది.
44. రాహు కాలంలో ,స్నానం, భోజనం, మైధునం చేయాకుడదు .
45. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయం లో మటుకే పెట్టాలి.
46. గృహస్థులు ఏక వస్త్రంతో పూజ చేయాకుడదు.
ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు మనము పాటించాల్సిన కనీస నియమాలు ఇవన్నీ పాటించకుండా ఎడ్డీమడ్డి గా ఉంటూ ఆ పూజలు చేశాము ఈ పూజలు చేశాము ఫలితం లేదు అనకండి..
--(())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక .... ఆరోగ్యప్రభ (1)
సేకరణ రచయత మల్లాప్రగడ రామకృష్ణ
*ఆరోగ్యంగా ఉండాలంటే అనాదిగా వస్తున్న సనాతన పంచ ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిందే..!*
*****†**************************
*అల్లం*
*జీర్ణవ్యవస్థకు అల్లం చేసే మేలు*
*1. భోజనాగ్రే సదా పధ్యం, లవణార్ద్రకభక్షణమ్,*
*రోచనం దీపనం వహ్ని, జిహ్వాకంఠ విశోధనమ్.*
*తా: భోజనానికి ముందు అల్లము, సైంధవ లవణము కలిపి నమిలి తినిన జీర్ణశక్తి వృద్ధిచెందుతుంది. గొంతు నాలుక పరిశుద్ధమై, రుచి కలుగుతుంది.*
*భావం :- మనం రాత్రి తిన్న అన్నం, తీసుకున్న కొన్ని ఆహార పదార్ధాల వలన సంపూర్ణంగా అరగక పోవచ్చును, దాని వలన ఒంట్లో 'పసరు' జమ అవుతుంది. పసరు శరీరంలో ఎక్కువ జమ అయితే వికారం, తలనొప్పి, బద్ధకం ఏర్పడుతుంది. ఏ పని చురకుగా చేయాలనిపించక పోవడం జరుగుతుంది. అందుకే పరిగడుపున అల్లం తింటే జీర్ణ వ్యవస్థ సాఫీగా సాగి శరీరంలో ఏర్పడ్డ పసరును మలం ద్వార బయటకు పంపేందుకు దోహద పడుతుంది. శరీరం తేలిక అవుతుంది. మనిషి ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది.*
*వాకింగ్*
*రాత్రి భోజనం తర్వాత వాకింగ్ తప్పనిసరి*
*2. భుక్త్వా శతపదం గచ్ఛేత్,శయనై స్తేన తు జాయతే,*
*అన్నసంఘాతశైథిల్యం, గ్రీవాజానుకటీసుఖమ్.*
*భుక్తోపవిశత స్తుందం, శయానస్య తు పుష్టతా,*
*ఆయు శ్చంక్రమమాణస్య, మృత్యు ర్ధావతి ధావతః*
*తా: భోజనానంతరము నూరడుగులు నడచిన అన్నము యుక్త స్థానమున చేరి, మెడ, నడుము, మోకాళ్లు వీటియందు సుఖము కలుగును. భుజించిన తోడనే కదలక కూర్చున్నచో పొట్ట పెరుగును, పడుకొన్న వారికి కొవ్వు పెరుగును, మెల్లగా అటునిటు తిరిగిన ఆయుర్వృద్ధి కలుగును, పరుగెత్తినచో ఆయుఃక్షీణము.*
*భావం :- ప్రస్తుత కాలంలో నైట్ డిన్నర్ లేటుగా చేసి తిన్న తర్వాత ఓపిక లేక అల కుర్చీలో కూర్చుని కాసేపు టివి చూసి డైరెక్ట్ పడుకుంటున్నారు. దీని వలన తిన్న ఆహరం పేగులలో కదలిక కలగక ఒకే చోట ఉండి పొట్ట భాగం పెరగడం జరుగుతుంది. అందుకే తిన్న తరవాత కనీసం ఓ వంద అడుగులు నడవమని సూత్రీకరించారు. రాత్రి భోజనం చేసాక కనీసం ఓ పది నిమిషాలు వాకింగ్ చేస్తే జీర్ణ వ్యవస్థ మెరుగు పడి శరీర ఆకృతి అందగా ఉంచుతుంది.
*తమలపాకు*
*రాత్రి భోజనం తర్వాత తాంబూలం వేసుకోవాలి.*
*3. భుక్త్వా శతపదం గచ్చేత్, తాంబూలం తదనంతరమ్,*
*వామపార్శ్వే తు శయనం, ఔషధై: కిం ప్రయోజనమ్.*
*తా: భోజనానంతరము నూరడుగులు నడచి, తదనంతరము తాంబూలసేవనము చేసి, ఎడమవైపున శయనించుచో యిక ఔషధము లెందుకు? ( ఆరోగ్యవంతుడై యుండునని భావము.)*
*భావం :- రాత్రి డిన్నర్ చేసాక కొంత సమయం వాకింగ్ చేసాక, తాంబూలం తమలపాకు తినడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగు పడి కఫం, పైత్యం కలగకుండా నివారించి, మలబద్ధకం కలుగకుండా కాపాడుతుంది.*
*పడుకునేప్పుడు ఎడమ చేతు వైపు తిరిగి పడుకునే సూత్రం ఎందుకంటే శరీరంలో గుండె ఎడమవైపు ఉంటుంది. ఎడమవైపు తిరిగి పడుకుంటే గుండెకు రక్త ప్రసరణ సమృద్ధిగా జరికి గుండె జబ్బులు, ఇతర అనారోగ్యాలు కలుగకుండా కాపాడుతుంది. ఈ పద్దతులను అలవాటు చేసుకున్న వ్యక్తీ అనారోగ్య సమస్యలతో బాధపడడు అని భావం.*
*ఆహారం*
*మితహారం ఆరోగ్యం.. అతి ఆహారం అనారోగ్యం*
*4. అనాత్మవంతః పశువత్ భుంజతే యోఽప్రమాణతః,*
*రోగానీకస్య తే మూలమ్, అజీర్ణం ప్రాప్నువంతి హి.*
*తా: ఎవరైతే మిత మనేది లేకుండా ఎల్లప్పుడూ ఎదో ఒకటి నములుతూ ఉంటారో వారు అజీర్ణవ్యాధికి గుఱి అవుతారు. అజీర్ణమే సర్వరోగములకును మూలము. ( మానవులు ఆయా వేళలయందే మితముగా భుజించవలెను.)*
*భావం :- ఎప్పుడు పడితే అప్పుడు ఎదో ఒకటి నోట్లో వేసుకుని నోరు ఆడించే అలవాటు ఉన్న వారికి వారు తీసుకున్న ఆహారం ఓవర్ లోడ్ అయ్యి శరీరంలో జటరాగ్ని సరిగ్గా పనిచేయక ఉభకాయం ఏర్పడి ఆనారోగ్యంపాలు పడుతారు. మనిషి శరీరానికి కావలసిన ఆహారం తీసుకునే 'సమయ' పద్దతులలో తేడా రాకుండా జాగ్రత్త పడాలి. మధ్య మధ్యలో చిరుతిండ్లు తినకూడదు. తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. మితహారం ఆరోగ్యం, అతి ఆహారం అనారోగ్యం.*
*భోజన సమయం*
*భోజన సమయంలో మాట్లాడకుండా తినాలి.*
*5. భుంజానో న బహు బ్రూయాత్, న నిందేదపి కంచన,*
*జుగుప్సికధాం నైవ, శృణుయాదపి ఆ వతెత్.*
*తా: భోజన సమయమున అధికముగా మాట్లాడరాదు. పరనిందా ప్రసంగము అసలే కూడదు. కధా ప్రసంగములు చేయరాదు, విననూ రాదు...*
*భావం :- అన్నం తినే సమయంలో ముచ్చట్లు పెట్టకుండా మౌనంగా తినాలి. అల మౌనంగా, ప్రశాంతంగా తీసుకున్న ఆహారం అమృతతుల్యం అవుతుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ తినేప్పుడు అధిక ప్రసంగాలు చేస్తూ మధ్యలో భావోద్వేగాలకు గురౌతు. లేదా టివి చూస్తూ, లేదా పరాయి వాళ్ళ విషయ ప్రస్తావన చేస్తూ వారిని నిందిస్తూ భోజనం చేయడం వలన ఆనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. అన్నం తినేప్పుడు మనస్సు ప్రశాంతంగా పెట్టుకుని మాట్లాడ కుండా మౌనంగా తింటే, మనం తిన్న ఆహరం పూర్తిగా అరిగే వరకు హర్మోన్సు బ్యాలెన్స్ గా ఉంచబడుతాయి.
ఆరోగ్యంగా వుంటారు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Comments
Post a Comment