భగవద్గీత .. 4వ అధ్యాయము .. కర్మయోగము (తేటగీతి మాల)

 భగవద్గీత .. 4వ అధ్యాయము .. కర్మయోగము (తేటగీతి మాల) 

 

భగవానుని ప్రభావము నిష్కామకర్మయోగ ప్రస్తావన ( 1వ శ్లోకం నుండి 18  వ శ్లోకంవరకు)  


తే:: నాశ  రహితమైనది గీత నరముచేరి 

శాశ్వత ఫలమొసంగియు సానుకూల 

మొదటయు  భగవాన్ సూర్యునకుతెలి పేను

రవి మనువునకు, మనువుయే రంగరించి 

క్రమముగా లోకమున విస్తర రించె బోధ   ... .... ... 1    


తే:: రాజు ఆధ్యాత్మ విద్య రాజర్షి యగుట 

గీత యెఋషిత్వ రాజత్వ తీర్పు యగుట 

ఇంద్రియ జయము మనసుస్వా దీన మగుట   

కామ నిర్జన ఆత్మాను భావ మందు 

కావగ కనుమరుగునయ్యె కాల మగుట   ..... .... ... .2  

          

తే:: తెలిపె పరమోత్తమ యొగము తేట తెలుగు 

నెవ్వరి కెఱిగించకమఱుగునబడినదియె 

నేడు యొగరహస్యంబు వచింతు నీకు, భక్త 

మిత్ర, వివరము శ్రేష్టమై నదియు ఇదియు .... .... ..3          


పార్ధుని ప్రార్ధన 


తే: దేహదృష్టి మనోదృష్టి దివ్యతేజ 

ఆత్మ దృష్టి ఈనాటిది అణువు ఏది 

ఏది సూర్యజన్మయునీదు ఏది జన్మ

బోధ చేస్తివి ఏనాడు బ్రహ్మ లిఖిత 

నేను విషయంబు ఎట్లును నిజము అనెద ... .... .. 4


శ్రీ భగవాన్ వాణి 

తే:: నాకు నీకును గడిచెననేక జన్మ 

నేకమను జన్మ లెఱుంగ నేరవగుదు

నాకు జన్మలు దెలియును సత్య మదియు  

నీకు నాకుండు భేదము ప్రార్ధ వినుము   ... .... . 5 

.....         

తే::నేను శాశ్వత పురుషుడ నైతి నెపుడు 

నేను సర్వేశ్వరుండుగా నేను సకల 

ఇదియు నాదగు ప్రక్రుతియె ఇచ్ఛతీర్చ 

చేకొనిజనింతు దీనుల మేలు జేయ  ... ..... ... .. 6 

.....

ధర్మనాశము యగునాడు దారితప్ప

వృద్ధి అధర్మ మగుటయే, విధిచెడినను

నాకు నేను లోకోద్ధరణ జరప గల 

జన్మగజనించి ధర్మ రక్షణను చెసెదు  ... .... .. . 7 

.....   

సుజను లందరి కాపాడి సుఖము నిచ్చి 

దుష్ట జనవినాశంబుగ ముదము జేసి

శాంతి, నిజధర్మంబుగ నొసం గెదను నేను 

జగమున ప్రతి యుగమున జన్మ నాది .... ..... ... 8 

 .....                 

కర్మ లన్నియు నాజన్మ కళలు యనియు         

జనులు దలుతురు ఘనమహిమములనియను 

జనులు మరణమొందిన నన్ను జపము చేయ 

జన్మను గొనక జేరును జనాలు నన్ను   .... ...... .. 9 

......

రాగ భయము, క్రోధము రాజ్య ముడిచి 

మనసున నపార విశ్వాస మాయ తెంచి 

వేగముననాగృహము జేరి వేల్పు జరుపు 

నుత్తమ జ్ఞాన యోగఋ షితపసులును  .... ..... ... 10 

.....  

......

తే ::ఎవరెవరు ఏవిధమున సేవలు సలిపిన 

నాప్రకారము అనుకరణము జరుగును 

చేసు కున్న వారికి ఫలం చేసి నంత 

భక్తి పరమార్ధ సత్ఫల ఫలము పొందు .... ..... ... 11 

......

తే:: కర్మములయొక్క ఫలప్రాప్తి కళలు తీరు 

పురుషులు ఇల పూజింతురు పుట్టుకగను

ఇచ్ఛ సత్కర్మానుష్టాన విధము తీర్చు 

తలపు పూజింప సత్కృప నావిదంబు ... ..... ...  12 

........     

నేను చేసిన వాడను చేయబడిన 

నాలుగు గుణకర్మలగని నీదు సేవ 

గుణము సమ సమత్వవిధిగా గుర్తు కలిగి 

జనుల విభజించి సృష్టిగా జేయు కర్త .... ..... ..  13 

......

లేదు ఫలమందు కోరిక లేదు నాకు 

కర్మ ఫలములు తాకవు కమ్ముకున్న 

కర్తలు యెరుంగ నట్టిదే కర్మ ఫలము 

కర్మ చే బందింప బడడు కార్య శీలి .... ..... ..... 14 

.......

తాను వాస్తవముగ కర్త కాదు నేను 

యందఱోముముక్షవులచే కర్మ చేయ 

అట్టిది పురాత నమ్మైన దాచరించు 

కర్మ పాటించ నయమగు కామ్యభక్తి  ..... ..... ... 15                        

.....

శ్రీ భగవద్గిత ...  నాల్గవఅధ్యాయము ... జ్ఞానయోగము (16 నుండి 23 )  


తే:: కర్మలగగా అకర్మల కధలు ఏమి ?

నెరుగక తలల జ్ఞానము నీడ లగుట 

కర్మలనను మాన పరచి కళలు కావు 

నేను తెలిపెద మంచిగా నీకు పార్ధ    .... .... ..... .. 16 

.....

విహిత కర్మ అనుకరణ యె విజయ మిచ్చు      

చేయరాని కర్మలు బాధ చింత పెంచు 

సోమరి బ్రతుకు యె అకర్మ సోకు వలెను 

మెరుగ కర్మ రహస్యము కష్ట తరము   .... ..... .....  17   

.....

కర్త్రుత్వము లేక, ఫలములే కాన లేక 

అద్ద ప్రతిబింబ బంధము ఆప లేక

సంగములతోను ఆసక్తి సరయు చుండి 

కర్మరాహిత్య తెలిసియె కాల మీదు  .... ..... ......  18 


జ్ఞానియొక్క పవిత్ర ఆచరణము  (19 వ శ్లోకము నుండి 23 వ శ్లోకము వరకు)

                

ఎవరు కర్మల కోరిక ఎదను మరచి  

ఎవరు భక్తి మమత్వము రహితమగుట 

ఎవరి కర్మలు అంటక ఎరుక పఱచు

కర్మలు జ్ఞాన అగ్నిచే కాల జ్ఞాని   .... ..... ...... . 19      

......

కర్మఫలమును వదిలిన కళలు నాడు 

తృప్తి నిరంతరము వున్న కృపయు వాడు 

దేన్ని ఆశ్రయించక నున్న దీనుడతడు

లోక సంగ్రహార్ధము బంధ లోలకుడగు ..... .... . 20 

......

ఆశలేని ఆశయముతో ఆడు వాడు 

ఇంద్రియాలను నిగ్రహించు ఇష్ట పరుడు 

దేహదారణాది గ కర్మ చేయు వాడు 

సద్గుణడు పాపములు అంట కుండు వాడు .... .21                   

.....

నిత్య సంతుష్టడు అదృష్ట నిజము వాడు          

ద్వంద సుఖ దుఃఖ ములను దాట ధర్మపరుడు 

 సమము లక్ష్య సిద్ది అసిద్ధి సరయు వాడు 

జ్ఞాన గుణమును కలిగియు జ్ఞాని వాడు   ... ..... .. 22 

.......

దేనియందును సంగము లేని వాడు 

రాగద్వేష కామము క్రోధ మేమి లేని 

ధర్మమునిమిత్తమునె కర్మ చేయువాడు 

అట్టి జన్మ బంధాదులను లేని వాడు  .... ..... ... 23 

.....

వివిధములగు యజ్ఞముల వర్ణన .. జ్ఞానయజ్ఞముల యొక్క ఆధిక్యత (24 వ శ్లోకము నుండి 32 వ శోకము వరకు)            


తే:: బ్రహ్మ మే యజ్ఞంబుగనులే బ్రహ్మమగుట

బ్రహ్మమే సమిధలు బ్రహ్మ భాగ్యమగుట 

బ్రహ్మము ఘృతంబు నిలయము బ్రహ్మమగుట

బ్రహ్మము సకలమ్ ఫలితంబు బ్రహ్మ మగుట .... .... ..... 24 

........

తే:: దేవతారాధనయు నిత్య దైవ పూజ 

దేవ తోపాసనయు ధర్మ దైవ పూజ  

దేవతాధ్యానము న్యాయ దైవ పూజ 

దేవతాకైంకర్యము దేహ దైవ పూజ   .... .... ... ....... ...... 25

...........   

తే:: కొంత ఇంద్రయనిగ్రహ కాచి ఉండు 

కొంత శబ్దాది విషయత్యాగము ఎ కోరి యుండు               

పెక్కు నియమాలు స్వాధీన పఱచు చుండు 

అగ్ని యందు హోమము చేయు యజ్ఞ మవును .... ...... 26       

........

కర్మ తనవగు ఇంద్రియ కాల మగుట 

ప్రాణ కర్మలు కనిపించ సాగు చుండు 

నాత్మకు తనదగు యర్పణ యనుకరణఎ 

చేయునెల్ల యోగులు యజ్ఞ మౌను విధియు  .... ..... .... ...27 

........

ఈశ్వరా మననంబని ఇష్ట మనుచు 

కఠిన యోగధనయజ్ఞము కాల మనుచు

సాధ్య సాధ్యాయ బనుచునే సామ మనుచు 

యజ్ఞములను చేయు గుణము యతుల మనసు ..... ..... ..28 

........

శ్రీమద్భగవద్గీత .. ౪ వ ఆధ్యాయము తేటగీత పద్యాలు 

   

కొందరు అపాన వాయువు కోరు చుండి 

శ్వాస నిలుపుదురు బతుకు సరయు చుండు 

కొందరు నిలుపు  ప్రాణము  కోరుచుండి   

యజ్ఞముగను నిలుపుదుర పాన మంత  ... .... 29 

......

పరిమితమ్ము భక్తి గలిగి పగలు రాత్రి 

అపరి మిత నిష్ఠ కలిగియు ప్రాణ యామ

శక్తి తో పరిపాటించు సమయమందు 

జ్ఞాన ధర్మ యజ్ఞములను జ్ఞాని పలుకు   .... .... 30          

......

ఎవరు యజ్ఞ శిష్టమును ఏళ్ల వేళ 

యనుభవింతురో పరమాత్మ యోగమబ్బు 

ఎవరు యజ్ఞము చేయక ఏలయనుట

అట్టివారుసుఖము లేక అరయ చుండు  ..... .... 31 

......

యజ్ఞముల వివరములన్ని యతులు తెలుప 

 వేదములయందు ఉత్సాహ వివరణలుగ

పవన యజ్ఞములను లెఱుంగు చుండు 

భావయుతుడవై ముక్తికై  బడయు చుండు .... ....  32     

.......

ధనముకన్న జ్ఞానము గొప్ప ధరణియందు 

విద్య ఇచ్చిపుచ్చుకొనుట వినయ మేను 

నిత్య తనకర్మ లేల్లలీనమగు చుండి 

కనుము జ్ఞానమహిమ యంత కాల మందు .... ... .. 33   

.......

జ్ఞాన మడుగగా పరమేశు జ్ఞాని గాను

తత్వవేత్తలు నరయగా తెల్ప గలుగు 

సేవలు పరిపరిగనులే జేయ గలుగు 

పడుచు సాష్టాంగ మన్నన సేయ పలుకు  .... ......  34  

.....

అగ్నిలో సమిధలు బూడిదగను మారు  
మండు టగ్నికూర్చుగ లోప మాప లేము  
జ్ఞానమును నీడ చేరిన జడ్జ్యము తొలగి 
కర్మలు నశించి ధన్యత కాల మగును .... ..... .. .. 37    
.....
లేదు విజ్ఞాన సమమను ఏది మనసు 
శ్రద్ద తో ధీర్ఘకాలము శ్రమను జరుప 
బుడ్డి విరియు వేదోక్తమే భూమినందు 
స్వయముగాబోధన జరిపే సమయ మిదియు .... 38     
.......
సతత సాధకుడు సుభక్తి సమయ మందు 
నిత్య సత్కర్మిష్టగను వినీలమందు 
సత్య జ్ఞానపు బోధలే సమర మందు 
పరమ శాంతి పొందుట యంత ప్రియము చెంద ... 39 
  


         



Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ